Rebels
-
ఎటు చూసినా మృతదేహాలే
డమాస్కస్: ఎక్కడ చూసినా శవాల కుప్పలు. రాజధాని డమాస్కస్‌తోపాటు కుతైఫా, ఆద్రా, హుస్సేనియాల తదితర ప్రాంతాల్లో సామూహిక సమాధులు! సిరియాలో ఇటీవల కుప్పకూలిన అసద్ ప్రభుత్వం అకృత్యాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. తిరుగుబాటుదారులను బంధించి జైళ్లలో చిత్రహింసలు పెట్టడమే గాక దారుణంగా హతమార్చినట్టు తేలింది. అలా అదృశ్యమైనవారి మృతదేహాలు ఎక్కడపడితే అక్కడ బయటపడుతున్నాయి. సిరియా అంతటా సామూహిక సమాధులేనన్న వార్తల నేపథ్యంలో సిరియన్ ఎమర్జెన్సీ టాస్‌్కఫోర్స్ (ఈటీఎఫ్) అనే అమెరికాకు చెందిన స్వచ్ఛంద సంస్థ ఇటీవల దేశంలో పర్యటించింది. దాని పరిశీలనలో దిగ్భ్రాంతి కలిగించే విషయాలు బయటికొచ్చాయి... లక్షల మంది గల్లంతు సిరియాలో తిరుగువాబాటు చేసిన వారందరినీ బషర్ అల్ అసద్ ప్రభుత్వం నిర్బంధించింది. జైళ్లలో పెట్టి చిత్ర హింసలకు గురి చేసింది. ఆ క్రమంలో వేలాది మంది గల్లంతయ్యారు. వారి ఆచూకీ ఎవరికీ తెలియలేదు. అలా 2011 నుంచి ఇప్పటివరకు ఏకంగా లక్ష మందికి పైగా అదృశ్యమయ్యారు. 2014లో కనపించకుండా పోయిన సోదరుడి కోసం ఓ మహిళ, 2013లో అరెస్టయిన కుమారుడి కోసం ఓ తండ్రి ఇప్పటికీ వెదుకుతూనే ఉన్నారు. హయత్ తహ్రీర్ అల్షామ్ (హెచ్‌టీఎస్) తిరుగుబాటు సంస్థ దేశాన్ని హస్తగతం చేసుకోవడం, అసద్ రష్యాకు పారిపోవడం తెలిసిందే. అనంతరం సిరియా రక్షణ దళం వైట్హెల్మెట్స్తో కలిసి హెచ్‌టీఎస్ సిరియా అంతటా జైళ్లు, నిర్బంధ కేంద్రాలను తెరిచింది. అసద్ హయాంలో నిర్బంధించిన వేలాది మందిని విడుదల చేసింది. ఆ తర్వాత ఆచూకీ లేకుండాపోయిన తమ ఆత్మీయులకోసం అనేకమంది జైళ్ల చుట్టూ తిరుగుతున్నారు. వారేమైనట్టు? తిరుగుబాటుదారులను చిత్రహింసలు పెట్టి చంపాక అసద్ సర్కారు సామూహికంగా ఖననం చేసింది. అవన్నీ ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. అలా ఇప్పటికే ఏకంగా లక్షకు పైగా మృతదేహాలను కనుగొన్నారు! సామూహిక సమాధులున్న మరో 66 ప్రాంతాలనూ గుర్తించారు. డమాస్కస్ వాయవ్యంగా ఉన్న కుతైఫా పట్టణంలో వేలాది మృతదేహాలను వేర్వేరు చోట్ల సామూహికంగా ఖననం చేసినట్లు ఈటీఎఫ్ తెలిపింది. డమాస్కస్ విమానాశ్రయ మార్గంలో హుస్సేనియేయాలోనూ సామూహిక సమాధులు బయటపడ్డాయి. దక్షిణ సిరియాలో పన్నెండు సామూహిక సమాధులు కనుగొన్నారు. సిరియాలో గల్లంతైన వారిలో 80,000 మందికి పైగా చనిపోయినట్టు హక్కుల సంఘం ఇప్పటికే తేలి్చంది. 60,000 మందిని చిత్రహింసలకు గురిచేసి చంపినట్లు బ్రిటన్‌కు చెందిన వార్ మానిటర్ సిరియన్ అబ్జర్వేటరీ ఫర్ హ్యూమన్ రైట్స్ (ఎస్ఓహెచ్ఆర్) తెలిపింది. గుర్తించలేని స్థితిలో శవాలు ఖననం చేసి చాలాకాలం కావడంతో చాలావరకు శవాల అవశేషాలే మిగిలాయి. దాంతో మృతులనుగుర్తించడం కష్టంగా మారింది. చేసేది లేక పుర్రెలు, ఎముకలనే భద్రపరుస్తున్నారు. డీఎన్ఏ నమూనాల డాక్యుమెంటేషన్, తదుపరి విశ్లేషణ కోసం బ్లాక్ బాడీ బ్యాగుల్లో విడిగా ఉంచుతున్నారు. హత్యకు గురైన వారిని మున్ముందైనా గుర్తించగలమని ఈటీఎఫ్ ఆశాభావం వెలిబుచి్చంది. -
ఇంకా తెలవారని సిరియా!
కుటుంబ పాలనలో.. ఆ పాలకుల నియంతృత్వ పోకడలతో యాభై ఏళ్లుగా చిధ్రమైంది సిరియా. దశాబ్దంపైగా సాగిన అంతర్యుద్ధం ఆ నేలపై ఐదు లక్షల మందిని పొట్టనపెట్టుకోగా.. 13 లక్షల మందిని దేశం విడిచిపోయేలా చేసింది. చివరకు తిరుగుబాటుదారులు పైచేయి సాధించడంతో నియంతాధ్యక్షుడు బషర్ అల్ అసద్ దేశం విడిచి పారిపోవాల్సి వచ్చింది. దీంతో.. 2024 డిసెంబర్ 8న సిరియా స్వేచ్ఛా వాయువుల్ని పీల్చింది. కానీ..సిరియాలో చీకట్లు తొలగినా.. ఇంకా తెలవారలేదనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. అసద్ పలాయనం తర్వాత ఊహించిందే జరుగుతోంది. ప్రజా జీవనం అస్తవ్యస్థంగా మారిపోయింది. అలాగే సైన్యం, భద్రతా బలగాలు వెనక్కి తగ్గడం.. శాంతిభద్రతలు పూర్తిగా పట్టు తప్పాయి. చాలాచోట్ల దోపిడీల్లాంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. ప్రజాస్వామ్యయుతంగా ప్రభుత్వం ఏర్పడడం అక్కడ ఇప్పట్లో కుదరని పని. పోనీ.. ఆపద్ధర్మ ప్రభుత్వమైనా ఏర్పడాలన్నా కొత్త తలనొప్పి వచ్చిపడింది!.నా కేబినెట్లో పని చేసినవాళ్లంతా రెబల్స్‌కు సన్నిహితులే. కాబట్టి సిరియాలో తాత్కాలిక ప్రభుత్వ ఏర్పాటుకైనా ఎక్కువ సమయం పట్టకపోవచ్చు. -ప్రధాని ముహమ్మద్ అల్ జలీల్రాజధాని డమాస్కస్ సహా ప్రధాన నగరాలు మా ఆధీనంలోకి వచ్చాయి. సిరియాలో కొత్త ప్రభుత్వం కొలువుదీరడానికి ఎక్కువ టైం పట్టకపోవచ్చు. మేం ఎలాంటి ఆటంకాలు కలిగించబోం.-రెబల్స్ గ్రూప్స్సిరియాలో ప్రజాస్వామ్యయుత ప్రభుత్వ ఏర్పాటుకు మా పూర్తి మద్ధతు తప్పక ఉంటుంది. - విపక్షాల కూటమిసిరియాలో ప్రభుత్వ ఏర్పాటునకు ప్రజలు మాత్రమే కాదు.. ఆయుధం పట్టి పోరాడిన వాళ్ల మద్దతు కూడా ముఖ్యమే!-హెచ్‌టీఎస్ గ్రూప్ నేత డిమ మౌస్సాపైన ప్రకటనలన్నీ ప్రభుత్వ సానుకూలంగానే కనిపిస్తున్నప్పటికీ.. క్షేత్రస్థాయిలో ఆధిపత్య పోరులో అవి తలమునకలైపోయాయి. ప్రభుత్వ ఏర్పాటునకు ప్రభుత్వాలు ముమ్మరం చేశామని, చర్చలు జరుపుతున్నామని చెప్పిన రెబల్ గ్రూప్ హెచ్‌టీఎస్.. ఇంకోపక్క యుద్ధాన్ని మాత్రం కొనసాగిస్తోంది. తూర్పు సిరియాలోనే అతిపెద్ద పట్టణమైన దెయిర్ అల్ జౌర్పై పట్టుకోసం దాని మిత్రపక్షాలతో తీవ్రంగా యత్నిస్తోంది. ఇంకోవైపు సిరియన్ డెమోక్రటిక్ ఫోర్సెస్ స్వాధీనంలో ఉన్న అలెప్పోపై.. టర్కీ మద్దతుతో సిరియన్ నేషనల్ ఆర్మీ విరుచుకుపడుతోంది. ఇంకా కొన్ని రెబల్ గ్రూప్స్.. పలు ప్రాంతాల్ని తమ ఆధీనంలోకి తీసుకునేందుకు యత్నిస్తున్నాయి. ఇవికాకుండా..ఇదీ చదవండి: అసద్ పీఠాన్ని కూలదోసిన పిల్ల చేష్టలు!సిరియాలో ఆయుధ కారాగారాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ తన దాడులను ఉధృతం చేసింది. ముఖ్యంగా రసాయనిక ఆయుధాలు హెజ్బొల్లాలాంటి ప్రమాదకరమైన ఉగ్రవాద సంస్థల చేతుల్లోకి వెళ్లకూడదనే ఉద్దేశంతో తాము దాడుల్ని కొనసాగిస్తున్నామని ప్రకటించుకుంది. ఈ దాడుల్లో ఇజ్రాయెల్‌కు అమెరికా కూడా సహాకారం అందిస్తోంది. మరోవైపు.. ఈ పరిణామాలను ఉగ్ర సంస్థలు తమకు అనుకూలంగా మార్చుకునే అవకాశమూ లేకపోలేదు. ఇప్పటికే రెబల్స్‌లో కొన్నింటికి వీటి మద్దతు ఉంది. హెచ్‌టీఎస్ లాంటి సంస్థ మూలాలు ఆల్‌ఖైదా నుంచే ఉన్నాయి. పైగా ఒకప్పుడు అలావైట్, సున్నీల మధ్య చిచ్చులో జిహాదీ గ్రూపులు చలి కాచుకున్న చరిత్ర ఉండనే ఉంది. ఇప్పుడు రాజకీయ సంక్షోభం తలెత్తితే గనుక ఆ గ్రూపులు మరింత బలపడొచ్చు.ప్రస్తుతానికి.. సిరియాలో అధికారాన్ని చేపట్టేందుకు అసలు ప్రతిపక్షమే లేదు. అంతర్యుద్ధం ముగిసిపోయిందనడానికి అస్సలు వీల్లేదు. తిరుగుబాటు గ్రూపుల మధ్య విభేదాలు, అంతర్గత పోరు నడుస్తోంది. వీటికి తోడు విదేశీ జోక్యం ఈ సమస్యను మరింత జఠిలంగా మార్చే అవకాశమూ లేకపోలేదు. కాబట్టి.. వీలైనంత త్వరగా అధికార శూన్యత భర్తీ జరిగి.. దేశం వెలుతురు దిశగా పయనించాలని సిరియా ప్రజానీకం బలంగా కోరుకుంటోంది. -
సిరియా పయనమెటు?
ఒకే ఒక్క వారం. కేవలం ఏడు రోజుల వ్యవధిలో సిరియాలో సర్వం మారిపోయింది. పాలకుడు బషర్ అల్ అసద్ కాడి పడేసి పారిపోయాడు. దేశం తిరుగుబాటుదారుల చేతిలోకి వెళ్లిపోయింది. అసద్‌ల 50 ఏళ్ల నియంతృత్వ పాలనకు ఎట్టకేలకు తెర పడిందంటూ సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమైనా, రెబెల్స్ పాలనలో సిరియా మరో అఫ్గాన్‌గా మారొచ్చన్న అంచనాలు అంతర్జాతీయ సమాజంలో గుబులు రేపుతున్నాయి. కుట్రలు, అంతర్యుద్ధం తదితరాల పరిణామంగా 1970లో గద్దెనెక్కిన హఫీజ్ అల్ అసద్ నియంతృత్వ పోకడలకు మారుపేరుగా పాలించారు. 1982లో ఇస్లామిక్ ఫ్రంట్ సారథ్యంలో దేశవ్యాప్తంగా చెలరేగిన నిరసనలను అణిచేసే క్రమంలో ఏకంగా 40 వేల పై చిలుకు పౌరులను పొట్టన పెట్టుకున్నారు. 2000లో గద్దెనెక్కిన బషర్ నియంతృత్వ పోకడల్లోనూ, క్రూరత్వంలోనూ తండ్రిని మించిన తనయుడు అనిపించుకున్నారు. 2011 అరబ్ విప్లవాన్ని అణిచివేసేందుకు ఏకంగా 4 లక్షల పై చిలుకు మందిని బలి తీసుకున్నారు. ఆయన పాతికేళ్ల పాలనలో కనీసం 5 లక్షల మందికి పైగా పౌరులు మృత్యువాత పడ్డట్టు అంచనా. అంతటి రక్తసిక్త చరిత్రను వారసత్వంగా మిగిల్చి అవమానకర పరిస్థితుల్లో దేశం వీడి రష్యాలో తలదాచుకున్నారు. సాయుధ మిలిటెంట్ గ్రూప్ హయాత్ తహ్రీర్ అల్–షామ్ (హెచ్‌టీఎస్) సారథి అబూ మొహ్మద్ అల్ జొలానీ అలియాస్ అహ్మద్ అల్ షరాకు సిరియా ప్రధాని మొహమ్మద్ గాజీ జలాలీ తాజాగా లాంఛనంగా అధికారాన్ని అప్పగించారు. దాంతో అసద్‌ల 54 ఏళ్ల కుటుంబ పాలనకు తెర పడ్డా సిరియా భవితవ్యం మాత్రం ప్రస్తుతానికి ప్రశ్నార్థకంగానే మిగిలింది. హెచ్‌టీఎస్ సారథ్యంలో ఏర్పడబోయే సర్కారుకు ముళ్లబాటే స్వాగతం పలుకుతోంది. ఇప్పటికైతే మధ్యేమార్గమే! అసద్ ఇంత త్వరగా పారిపోతారని, దేశం తమ సొంతమవుతుందని నిజానికి హెచ్‌టీఎస్ కూడా ఊహించలేదు. దాంతో మిగతా మిలిటెంట్ గ్రూపులు, రాజకీయ పారీ్టలు తదితరాలతో చర్చలు జరపడం, వాటితో అధికార పంపిణీ క్రతువును సజావుగా పూర్తి చేయడం, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం దానికి సవాలుగా మారింది. దాంతోపాటు జొలానీ సారథ్యంలో కొలువుదీరబోయే హెచ్‌టీఎస్ సర్కారుకు అంతర్జాతీయ గుర్తింపు ఏ మేరకు దక్కుతుందనేది కూడా కీలకమే. ఈ విషయంలో కీలక పొరుగు దేశమైన తుర్కియేతో పాటు యూరోపియన్ యూనియన్, అమెరికాలది కీలక పాత్ర కానుంది. హెచ్‌టీఎస్ మూలాలు అల్‌ఖైదాతో ముడిపడి ఉండటం పరిస్థితిని సంక్లిష్టంగా మార్చేలా కని్పస్తోంది. పూర్తి ప్రజాస్వామిక పాలనపై ఎవరికీ ఆశలు లేకపోయినా, అతివాద పోకడలకు హెచ్‌టీఎస్ తాత్కాలికంగానైనా దూరంగా ఉండాల్సి రావచ్చు. అంతేగాక కుర్ది‹Ùల స్వతంత్ర ప్రతిపత్తిని గుర్తించడంతో పాటు అంతర్జాతీయ సమాజం విధించే పలు షరతులకు కట్టుబడాల్సిన పరిస్థితి తలెత్తేలా కని్పస్తోంది. ఈ దిశగా జొలానీ ఇప్పటికే పలు సంకేతాలైతే ఇచ్చారు. విపక్షాల పట్ల సహయంతో వ్యవహరిస్తామని సీఎన్ఎన్ వార్తా సంస్థకు ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు. మతపరమైన మైనారిటీల హక్కులకు అధిక ప్రాధాన్యమిస్తామంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ మాదిరిగా మహిళల వస్త్రధారణపై ఆంక్షల వంటి వాటి జోలికి పోబోమని సోమవారం ఆయన కుండబద్దలు కొట్టారు కూడా. అయితే శరణార్థులుగా దేశాలు పట్టుకుని పోయిన సిరియన్ల తిరిగి రాక మరో పెద్ద అంశం కానుంది. అంతర్గత కల్లోలం నేపథ్యంలో కొన్నేళ్లుగా భారీగా దేశం వీడిన సిరియన్లంతా తిరిగొస్తున్నారు. వారందరికీ ఆశ్రయంతో పాటు ఉపాధి కల్పన సవాలు కానుంది. వీటికి తోడు పలు ప్రాంతాలను ఆక్రమించుకుని గుప్పెట్లో పెట్టుకున్న చిన్నాచితకా మిలిటెంట్ గ్రూపులతో కొత్త ప్రభుత్వం నెట్టుకొస్తుందనేది ఆసక్తికరం.స్థిరత్వం నెలకొనాలి: భారత్న్యూఢిల్లీ/మాస్కో/జెరూసలేం: సిరియాలో వీలైనంత త్వరగా స్థిరత్వం నెలకొంటుందని భారత్ ఆశాభావం వెలిబుచి్చంది. సిరియాలోని భారతీయుల క్షేమానికి అధిక ప్రాధాన్యమిస్తున్నట్టు ఒక ప్రకటనలో పేర్కొంది. సిరియాలో అధికార మార్పును ఈయూతో పాటు అమెరికా తదితర దేశాలు స్వాగతించాయి.అసద్‌కు ఆశ్రయమిచ్చాం: రష్యాఅసద్కు రాజకీయ ఆశ్రయం కలి్పంచినట్టు రష్యా సోమవారం ధ్రువీకరించింది. అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు క్రెమ్లిన్ ఒక ప్రకటన విడుదల చేసింది. రష్యాలో ఆయన ఎక్కడ తలదాచుకున్నదీ వెల్లడించలేదు.ఇజ్రాయెల్ వైమానిక దాడులుసిరియాలో పలు ప్రాంతాలపై ఇజ్రాయెల్ సోమ వారం భారీ వైమానిక దాడులకు దిగింది. దీర్ఘశ్రేణి రాకెట్లు, రసాయనిక ఆయుధాలు రెబెల్స్ చేతిలో పడకుండా వాటిని ధ్వంసం చేసేందుకే దాడులు చేసినట్టు ప్రకటించింది. అమెరికా కూడా సిరియా లో 75 ఐసిస్ స్థావరాలపై వైమానిక దాడులు చేసింది.– సాక్షి, నేషనల్ డెస్క్ -
డెమాస్కస్ శివార్లకు చొచ్చుకొచ్చిన రెబెల్స్
డెమాస్కస్: సిరియాలో అస్పాద్ ప్రభుత్వంపై తిరుగుబాటుదార్ల పైచేయి కొనసాగుతోంది. శనివారం రాత్రి వారు హోమ్స్ నగరంలోని శివారు ప్రాంతాన్ని స్వా«దీనం చేసుకున్నారు. అక్కడితో ఆగకుండా ఏకంగా రాజధాని డెమాస్కస్ శివార్ల దాకా చొచ్చుకొచ్చారు. దాంతో దేశవ్యాప్తంగా ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. హోమ్స్‌ను తిరిగి స్వాధీనం చేసుకునేందుకు అస్సాద్ అనుకూల బలగాలు ప్రయత్నిస్తున్నాయి. ఇందుకోసం ప్రభుత్వం పల్మీరా తదితర ప్రాంతాల నుంచి బలగాలను, సైనిక వాహనాలను రప్పిస్తోంది. అంతకుముందు, దక్షిణ ప్రాంతంలోని నా లుగో నగరం దారాలో తిరుగుబాటుదార్లు తిష్టవేయడం తెల్సిందే. పరిస్థితులు వేగంగా మారుతుండటంతో బషర్ అల్ అస్సా ద్ ప్రభుత్వం యూఏఈ, జోర్డాన్, ఇరాక్ ప్రభుత్వాలను ఆయుధ సాయం, నిఘా సమాచారం అందించాలంటూ కోరినట్లు చెబుతున్నారు. పరిస్థితులు విషమిస్తున్నందున వెంటనే దేశం విడిచి వెళ్లాలని అస్సాద్‌కు అరబ్ నేతలు కొందరు సూచించినట్లు వాల్‌స్ట్రీట్ జర్నల్ పేర్కొంది.అమెరికా జోక్యం చేసుకోబోదు: ట్రంప్సిరియా సంక్షోభంలో తమ దేశం జోక్యం చేసుకోబోదని అమెరికా కాబో యే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. ‘సిరియా సమస్యల్లో చిక్కుకుంది. అయితే, అది మా మిత్ర దేశం కాదు. అమెరికాకు ఆ దేశంతో సంబంధం లేదు. అది మా పోరాటం కాదు. వాళ్లను పోరాడుకోనివ్వండి. మేం తలదూర్చం’అని తెలిపారు. ‘ఉక్రెయిన్‌తో యుద్ధంలో తలమునకలుగా ఉన్న రష్యా మిత్రదేశం సిరియాలో తిరుగుబాటుదార్లను ఆపలేకపోతోందనుకుంటున్నా. సిరియా నుంచి రష్యా బలగాలను వెళ్లగొడితే అది రష్యాకే మంచిది. ఎందుకంటే సిరియా లో ఉండి రష్యా లాభ పడిందేమీ లేదు’ అని ట్రంప్ వ్యాఖ్యానించారు. -
సిరియాలో మళ్లీ... అంతర్యుద్ధం!
సిరియా మళ్లీ భగ్గుమంటోంది. దేశంలో రెండో అతిపెద్ద నగరమైన అలెప్పో తాజాగా తిరుగుబాటుదార్ల పరమైంది. ప్రభుత్వ సైన్యం, తిరుగుబాటు సేనల మధ్య ఘర్షణ తారస్థాయికి చేరడంతో మళ్లీ అంతర్యుద్ధం రాజుకుంది. 2011 తర్వాత జరిగిన అంతర్యుద్ధంలో సిరియాలో ఏకంగా 3 లక్షల మందికిపైగా జనం మరణించారు. 60 లక్షల మంది విదేశీ బాట పట్టారు. తర్వాత కాస్త ప్రశాంతంగా ఉన్న సిరియాలో ఇలా ఉద్రిక్తతలు పెరగడం తాలూకు మూలాలు ఉక్రెయిన్–రష్యా, ఇరాన్–ఇజ్రాయెల్ యుద్ధాల్లో ఉన్నాయి.2011లో ‘అరబ్ వసంతం’ పేరిట అరబ్ దేశాల్లో ప్రజాస్వామ్య ఉద్యమం ఊపందుకుంది. రాచరికం పోయి ప్రజాస్వామ్య ప్రభుత్వం రావాలంటూ జనం వీధుల్లోకి వచ్చారు. ఈజిప్టులో ఈ పోరాటం ఉవ్వెత్తున ఎగిసి ప్రజాస్వామ్య ప్రభుత్వానికి దారులు ఏర్పడ్డాయి. అది ఇతర అరబ్ దేశాల ప్రజలకూ స్ఫూర్తినిచ్చింది. సిరియా ప్రజలు కూడా నియంతగా అధికారం చలాయిస్తున్న అధ్యక్షుడు బషర్ అల్ అసద్‌ను గద్దె దించడమే లక్ష్యంగా పోరుబాట పట్టారు. వాటిని అసద్ ఉక్కుపాదంతో అణచేయడంతో జనం ఆయుధాలు చేతపట్టారు. సైన్యంలో అసద్‌ను వ్యతిరేకించే వర్గం కూడా వారితో చేతులు కలిపింది. అంతా కలిసి తిరుగుబాటుదార్లుగా మారారు. దేశమంతటా వేర్వేరు తిరుగుబాటు దళాలు ఏర్పడ్డాయి. వీటి సిద్ధాంతాలు వేరైనా అసద్‌ను తొలగించి ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే ఉమ్మడి లక్ష్యం. అసద్ అంటే గిట్టని తుర్కియే, సౌదీ అరేబియా, యూఏఈతో పాటు అమెరికా తదితర దేశాలు తిరుగుబాటుదార్లకు అన్ని రకాలుగా మద్దతిస్తున్నాయి. దాంతో సిరియాలో ప్రభుత్వ వ్యతిరేక శక్తులు మరింత బలం పుంజుకున్నాయి. అటు అసద్‌కు మద్దతుగా సిరియా మిత్రదేశాలైన ఇరాన్, రష్యా రంగంలోకి దిగాయి. ఇరాన్ సైన్యంతో పాటు లెబనాన్ మిలిటెంట్ గ్రూప్ హెజ్బొల్లా అసద్ సైన్యానికి అండగా నిలిచాయి. రష్యా ఇచ్చిన యుద్ధ విమానాలతో సిరియా వైమానిక దళానికి కొత్త బలం చేకూరింది. అసద్ సైన్యం, తిరుగుబాటు సేనల మధ్య ఏళ్ల తరబడి భీకర యుద్ధమే జరిగింది. ఉగ్ర సంస్థలకు చేదు అనుభవం సిరియా పరిణామాలను అల్‌ఖైదా, ఐసిస్ వంటి అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థలు తమకనుకూలంగా మార్చుకున్నాయి. తిరుగుబాటుదార్లకు సాయం చేసే నెపంతో సిరియాపై పట్టు సాధించాయి. 2014 నాటికి ఈ జిహాదీల పెత్తనం పెరిగిపోయింది. ముఖ్యంగా దేశవ్యాప్తంగా ఐసిస్ ప్రభావం విపరీతంగా పెరిగింది. ఉగ్రవాదులకు సిరియా శాశ్వత అడ్డాగా మారుతుందన్న ఆందోళనలు వ్యక్తమయ్యాయి. అమెరికా రంగంలోకి దిగి సిరియన్ డెమొక్రటిక్ ఫోర్సెస్ (ఎస్డీఎఫ్) సాయంతో విరుచుకుపడటంతో అల్‌ఖైదా, ఐసిస్ తోకముడిచి దేశం వీడాయి. కాల్పుల విరమణతో ఆగిన ఉద్రిక్తతలు సిరియాలో పలు ప్రావిన్స్‌లను తిరుగుబాటుదార్లు ఆక్రమించడం, తర్వాత వాటిని ప్రభుత్వ సైన్యం స్వా«దీనం చేసుకోవడం జరుగుతూ వచ్చింది. 2020లో ఇద్లిబ్ ప్రావిన్స్ తిరుగుబాటుదార్ల చేతుల్లోకి వచ్చింది. ఆ సమయంలో కాల్పుల విరమణ ప్రతిపాదనకు రష్యా, తుర్కియేతో పాటు తిరుగుబాటుదారులూ ఒప్పుకున్నారు. ఉమ్మడి పహారాతో సెక్యూరిటీ కారిడార్ ఏర్పాటుకు ఒప్పందం కుదిరింది. నాటినుంచీ కీలకమైన ప్రావిన్సులతో పాటు సిరియాలో మెజారిటీ భూభాగం తిరుగుబాటుదార్ల అ«దీనంలోనే ఉండిపోయింది.నాయకత్వం ఎవరిది? సిరియాలో తిరుగుబాటుదార్లతో ఏర్పాటైన ‘మిలటరీ ఆపరేషన్స్ కమాండ్’కు హయత్ తా హ్రీర్ అల్–షామ్ సంస్థ నాయకత్వం వహి స్తోంది. ఇది గతంలో అల్–నుస్రా ఫ్రంట్ పేరు తో అల్‌ఖైదాకు అనుబంధంగా పనిచేసింది. తర్వాత స్వతంత్రంగా వ్యవహరిస్తోంది. ఇద్లిబ్ ప్రావిన్స్‌లో అధికారం చెలాయి స్తోంది. తుర్కియే, అమెరికా మద్దతుతో సిరియాలో కార్యకలాపాలు సాగిస్తున్న కొన్ని గ్రూప్‌లు తాహ్రీర్ అల్–షామ్‌కు అండగా నిలుస్తున్నాయి. ఇప్పుడే ఎందుకీ అలజడి? అసద్ మిత్రదేశమైన రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో తలమునకలుగా ఉంది. సిరియాపై దృష్టి పెట్టే స్థితిలో లేదు. మరో మిత్రదేశం ఇరాన్ కూడా ఇజ్రాయెల్ దాడులతో ఉక్కిరిబిక్కిరవుతోంది. హెజ్బొల్లా గ్రూప్‌కూ ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. వాటినుంచి సైనిక సాయం అందక అసద్ నిస్సహాయ స్థితిలో ఉన్నారు. బయటి సాయం లేక ఆయన ప్రభుత్వమూ బలహీనపడింది. ఈ పరిస్థితిని వాడకుంటూ తిరుగుబాటుదార్లు క్రియాశీలకంగా మారారు. ‘మిలటరీ ఆపరేషన్స్ కమాండ్’ పేరిట కొత్త కూటమి కట్టారు. పెద్దగా ప్రతిఘటనే లేకుండా వాణిజ్య రాజధాని అలెప్పోతో పాటు శివారు ప్రాంతాలు, గ్రామాల్లోనూ పాగా వేశారు. ఇది అసద్‌కు భారీ ఎదురుదెబ్బే. అమెరికా, ఇజ్రాయెల్, పశ్చిమ దేశాల అండదండలతో వాళ్లిప్పుడు మొత్తం సిరియానే స్వాధీనం చేసుకొనే దిశగా అడుగులు వేస్తున్నారు. అలెప్పోతో పాటు పరిసర ప్రాంతాలను తిరిగి స్వాధీనం చేసుకోవడానికి ఆదివారం సైన్యం ఎదురుదాడి యత్నాలు మొదలు పెట్టినా పెద్దగా ప్రభావం చూపలేకపోతోంది. అసద్ నుంచి విముక్తి పొందడానికి సిరియాకు ఎక్కువ రోజులు పట్టకపోవచ్చు. ఆ తర్వాత ప్రజాస్వామ్య ప్రభుత్వమే ఏర్పడుతుందా? లేక పశ్చిమ దేశాల కీలుబొమ్మ సర్కారు గద్దెనెక్కుతుందా అన్నది మాత్రం ఆసక్తికరం.– సాక్షి, నేషనల్ డెస్క్ -
ఐదుగురు రెబెల్స్‌పై ఉద్ధవ్ శివసేన వేటు
ముంబయి:మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల వేళ శివసేన (ఉద్ధవ్) పార్టీ ఐదుగురు రెబెల్ నేతలను పార్టీ నుంచి బహిష్కరించింది. పార్టీకి వ్యతిరేకంగా నామినేషన్లను ఉపసంహరించుకోకపోవడం వల్లే వేటు వేశారు. నామినేషన్ల ఉపసంహరణ గడువు సోమవారంతో ముగిసింది.పార్టీ టికెట్ దక్కని నేతలు ఆయా నియోజకవర్గాల నుంచి స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్లు దాఖలు చేశారు. వీరందరినీ నామినేషన్లు ఉపసంహరించుకోవాలని పార్టీ ఆదేశించింది. ఈ ఆదేశాలను వారు పెడచెవిన పెట్టడం వల్లే చర్యలు తీసుకోవాల్సి వచ్చిందని పార్టీ ఆదేశించింది. కాగా,మహారాష్ట్రలో నవంబరు 20న మొత్తం 288 అసెంబ్లీ స్థానాలకు ఓటింగ్ జరగనుంది.23న ఫలితాలు వెలువడనున్నాయి. ఇదీ చదవండి: అమెరికా ఎన్నికలు.. తులసేంద్రపురంలో పూజలు -
‘ఆ మాట చెప్పడానికి నువ్వెవరయ్యా?’
హైదరాబాద్, సాక్షి: తెలుగు దేశం కోసం, ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడి కోసం మాజీ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కోసం మరో వేషం కట్టారు. ఇప్పటిదాకా టీడీపీ అనుకూల స్టేట్మెంట్లు ఇస్తూ వస్తున్న ఈ పచ్చ చిలుక.. ఇప్పుడు స్వయంగా ఏపీ రాజకీయాల్లోకి దిగింది. ఈ ఎన్నికల్లో టీడీపీకి తలనొప్పిగా మారిన ఆ పార్టీ రెబల్స్‌ను బుజ్జగించేందుకు ప్రశాంత్ కిషోర్‌ను రంగంలోకి దించారు చంద్రబాబు. అయితే ఇక్కడే పీకేకు ఘోరమైన భంగపాటు కలిగింది. కూటమి పేరుతో టికెట్ల డ్రామా ఆడించిన చంద్రబాబు.. ఆ పార్టీ సీనియర్లకు, గత ఐదేళ్లుగా కష్టపడ్డవాళ్లకు మొండి చేయి చూపించారు. కార్యకర్తల మద్దతు కంటే డబ్బుకే ప్రాధాన్యత ఇచ్చారని, సామాజిక వర్గాల ప్రతిపాదికన కూడా టికెట్లు ఇవ్వకపోవడం దారుణమంటూ బహిరంగంగానే కొందరు అసంతృప్తి వెల్లగక్కారు. ఈ క్రమంలో చాలాచోట్ల ఆ పార్టీ నేతలు రెబల్స్‌గా పోటీ చేసేందుకు ముందుకు వచ్చారు. అయితే.. నామినేషన్ల ఉపసంహరణకు ఇంకా గడువు ఉండడంతో(ఏప్రిల్ 29).. బుజ్జగింపు ప్రయత్నాలు జరుగుతున్నాయి. వాస్తవానికి వీళ్ల విషయంలో టీడీపీ అధిష్టానం మొదటి నుంచే బుజ్జగింపులు చేస్తోంది. చంద్రబాబుతో పాటు ఆ పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ స్వయంగా రంగంలోకి వాళ్లతో చర్చలు జరిపారు. కొందరు వెనక్కితగ్గగా.. మరికొందరు మెత్తబడుతూ వస్తున్నారు. అయితే ఇంకొందరు మాత్రం నేరుగా తగ్గబోమంటూ ముఖం మీదే చెప్పేశారు. దీంతో చివరి అస్త్రంగా ఈ ఎన్నికల్లో తమకు పని చేస్తున్న పీకేతో.. ఆ రెబల్స్‌కు చంద్రబాబు ఫోన్లు చేయిస్తున్నారు. ఈసారి ఎన్నికల్లో గెలుపు కష్టంగా ఉందని, పోటీ నుంచి తప్పుకుని కాస్తైనా పార్టీకి సహకరించాలని పీకే ఇప్పుడు వాళ్లను బతిమాలుతున్నట్లు తెలుస్తోంది. అందుకు బదులుగా పార్టీ సముచిత స్థానం కల్పిస్తుందని, అవసరమైతే పదవులు కూడా ఇస్తుందని పీకే టీడీపీ రెబల్స్‌తో చెబుతున్నారట. అయితే.. ఈ క్రమంలోనే టీడీపీ నేతల నుంచి పీకేకు దిమ్మతిరిగే సమాధానాలు వస్తున్నట్లు తెలుస్తోంది. అసలు టీడీపీ అధిష్టానం బదులుగా ఫోన్లు చేయడానికి మీరెవరంటూ ప్రశాంత్ కిషోర్‌ను వాళ్లు నిలదీస్తున్నారట. అంతేకాదు.. టీడీపీ ఇంకా అధికారంలోకే రాలేదని, అధికారంలోకి వచ్చేది అనుమానాలు ఉన్నప్పుడు పదవులు ఇస్తామని మీరెలా చెబుతున్నారంటూ నిలదీశారట. దీంతో భంగపడ్డ పీకే.. ఆ ఫోన్ సంభాషణల సారాంశాన్ని చంద్రబాబుకు చెప్పుకుని ఫీలైనట్లు తెలుస్తోంది. అయినప్పటికీ టీడీపీ కోసం ఎలాగైనా వాళ్లను ఒప్పించాలని చంద్రబాబు బతిమాలడంతో.. వాళ్లకు ప్రత్యామ్నాయ ఆశలు కలిగించేందుకు మరోసారి ఫోన్లలో మాట్లాడేందుకు పీకే సిద్ధపడుతున్నట్లు సమాచారం. -
తగ్గేదే లే.. తాడోపేడో!
సాక్షి నెట్వర్క్: పొత్తుల కత్తులు తెలుగుదేశం పార్టీని రోడ్డున పడేసింది. చంద్రబాబు, లోకేశ్ డబ్బుకు అమ్ముడు పోయారని, పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు నమ్మకంగా పనిచేసిన వారికి వెన్నుపోటు పొడిచారని చంద్రబాబు, లోకేశ్‌పై తమ్ముళ్లు నిప్పులు చెరిగారు. తన స్వలాభం కోసం పొత్తు అంటూ తమను నట్టేట ముంచారని, డబ్బు సంచులతో వచ్చిన వారికి, పక్క పార్టీలు చెత్త అని పక్కన పెట్టిన వారిని తీసుకొచ్చి టికెట్లు కట్టబెడతారా? అంటూ ఆగ్రహ జ్వాలలు వ్యక్తం చేశారు. దీనికి ఎన్నికల్లో భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరికలు జారీ చేశారు. నమ్మించి గొంతుకోసిన బాబుకు బుద్ధి చెబుతామని, రెబల్‌గా పోటీ చేసి తమ సత్తా చూపిస్తామని హెచ్చరించారు. రాష్ట్ర వ్యాప్తంగా శుక్రవారం తెలుగు తమ్ముళ్లు రోడ్డెక్కి పార్టీ జెండాలు పీకేసి నిరసన తెలిపారు. దీంతో చంద్రబాబు పరిస్థితి కొరివితో తలగొక్కున్నట్లయ్యింది. బుజ్జగింపుల పర్వానికి పిలుపునిచ్చినా.. అసమ్మతి నాయకులు వెనక్కి తగ్గేది లేదనడంతో బాబుకు గుబులు పట్టుకుంది. స్వయంగా చంద్రబాబు రమ్మని పిలిచినా చాలా మంది ముఖం చాటేశారు. వచ్చినవారు ఎంత బతిమిలాడినా తగ్గేదే లేదని.. తాడేపేడో తేల్చుకుంటామని తెగేసి చెప్పారు. నేను పోటీ చేయడం ఖాయం! తాను కచ్చితంగా పోటీలో ఉంటానని టీడీపీ తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి కేఎస్ జవహర్ ప్రకటించారు. కొవ్వూరులో శుక్రవారం విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ.. కొంతమంది మాటలు విని చంద్రబాబు తనను పక్కన పెట్టారని, పైరవీలు చేసిన వారికి ప్రాధాన్యం కల్పించారని ఆరోపించారు. ప్రజలను, నాయకులను నమ్ముకున్నానని, క్యాడర్‌తో మాట్లాడిన తర్వాత నిర్ణయం వెల్లడిస్తానని చెప్పారు. రాజకీయాల్లోకి వచ్చాక ఇల్లు అమ్ముకున్నానని, పౌల్ట్రీ వేలానికి వెళ్లిందని, అన్ని రకాలుగా ఆర్థికంగా దెబ్బతిన్నానని చెప్పారు. టీడీపీలో పెత్తందారులదే రాజ్యమని.. జిల్లా నాయకులు కుట్రలు చేసి తప్పు చేయకపోయినా తనను మంత్రి పదవి నుంచి తొలగించారని టీడీపీ నాయకురాలు పీతల సుజాత ఆవేదన వ్యక్తం చేశారు. తనకు టిక్కెట్ ఇవ్వకపోవడం చాలా బాధగా ఉందంటూ శుక్రవారం వీడియో విడుదల చేశారు. ఎన్నారైలు, పక్క రాష్ట్రాల నుంచి వచ్చిన వారు ఎన్నికలయ్యాక వెళ్లిపోతారని చెప్పారు. చంద్రబాబు చుట్టూ బ్రోకర్లే.. కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గం టీడీపీ అభ్యర్థిగా ఎన్.రాఘవేంద్రరెడ్డిని ప్రకటించడంతో నియోజకవర్గ ఇన్చార్జ్ పాలకుర్తి తిక్కారెడ్డి అనుచరులు ఆందోళన బాట పట్టారు. శుక్రవారం మంత్రాలయంలో అనుచరులతో భారీ ర్యాలీ, రాస్తారోకో నిర్వహించి టైర్లను తగలబెట్టారు. ఈ సందర్భంగా పాలకుర్తి మాట్లాడుతూ చంద్రబాబు చుట్టూ బ్రోకర్లు ఉన్నారని.. స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగుతానన్నారు. కృష్ణాలో ఆరని మంటలు విజయవాడ వెస్ట్ సీటు తనకే ఖరారయ్యిందని జనసేన నేత పోతిన మహేష్ ఇంటింటికి ప్రచారం చేశారు. పోతినకు టికెట్ ఇవ్వలేకపోతున్నట్లు ప్రకటించి పవన్ హైదారాబాద్ వెళ్లిపోయారు. దీంతో మహేష్ డివిజన్ ఇన్చార్జిలు, కార్యకర్తలతో శుక్రవారం సమావేశం ఏర్పాటు చేసి ఆవేదన వ్యక్తం చేశారు. కార్యకర్తలు బోరున విలపించారు. పవన్ తీరుపై పోతిన మహేష్, జనసేన కార్యకర్తలు మండిపడ్డారు. ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తానని మహేష్ హెచ్చరించారు. పెనమలూరు టికెట్ ఇవ్వడం లేదని బోడే ప్రసాద్‌కు అధిష్టానం చెప్పగా.. చంద్రబాబు పిలుపు మేరకు ఆయన శుక్రవారం మధ్యాహ్నం వెళ్లి కలిశారు. బాబు ఆయనకు సృష్టమైన హామీ ఇవ్వలేదు. చంద్రబాబు ఎంత నచ్చజెప్పినా బోడె ప్రసాద్ వెనక్కితగ్గలేదు. నమ్మకున్న వారికి ద్రోహం చేసి పార్టీని ఎలా గెలిపించుకుంటారని చంద్రబాబును ఎదురు ప్రశ్నించినట్టు సమాచారం. సీటు లేదు.. ఓటు వేయండంటూ యనమలకుదురు నుంచి ఆయన పాదయాత్ర చేపట్టారు. ఇండిపెండెంట్‌గా పోటీ చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. మైలవరం టీడీపీ ఇన్చార్జి దేవినేని ఉమాను గురువారం రాత్రి కూడ బాబు పిలిపించినట్లు సమాచారం. వసంతకు సహకరించాలని చెప్పినట్లు తెలిసింది. దీంతో ఆయన రగిలిపోతూ ఆగ్రహం వ్యక్తం చేశారు. బాబు పిలుపునకు పలకని వర్మ పిఠాపురం సీటులో పవన్ కళ్యాణ్ పోటీకి సిద్ధమయ్యారు. దీంతో అక్కడి టీడీపీ ఇన్చార్జి ఎస్వీఎస్ఎన్ వర్మ అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. చంద్రబాబు స్వయంగా ఫోన్ చేసి తన నివాసానికి రావాలని పిలిచినా ముఖం చాటేశారు. తనను బుజ్జగించే కంటే సీటు ఇస్తేనే పరిస్థితి సద్దుమణుగుతుందని వర్మ గట్టిగా చెప్పారు. సీటు దక్కక పోతే ఇండిపెండెంట్‌గా పోటీ చేసి తన సత్తా చూపిస్తానని సవాల్ విసిరారు. పెదకూరపాడులో గెలుపు ఎలా సాధ్యం? పెదకూరపాడు అభ్యర్థి భాష్యం ప్రవీణ్‌కు కేటాయించగా.. అక్కడ టికెట్ ఆశించిన మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్‌ను ఎలాగైన ఒప్పించి, ప్రవీణ్‌కు సహకరించేలా ఆయనను చంద్రబాబు దగ్గర తీసుకొచ్చారు. పార్టీ అధికారంలోకి రాగానే తగిన ప్రాధాన్యం ఇస్తామని చంద్రబాబు చెప్పినా.. అసలు గెలుపు ఎలా సాధ్యమని శ్రీధర్ ప్రశ్నించినట్లు సమాచారం. ఎచ్చెర్ల టీడీపీ ఇన్చార్జిగా ఉన్న కళా వెంకట్రావు పేరుకూడా రెండో జాబితాలో లేకపోవడంతో ఆయన వర్గం ఆందోళనకు దిగింది. చంద్రబాబు బుజ్జగించి..చీపురుపల్లి వెళ్లాలని సూచించినప్పటికీ అంగీకరించలేదని సమాచారం. నమ్మించి గొంతు కోశారు కష్టకాలంలో పార్టీని, కేడర్‌ను కాపాడుకుంటూ వచ్చానని, అయినా తనకు టికెట్ ఇవ్వకుండా అన్యాయం చేశారని కోవూరు నియోజకవర్గ టీడీపీ నేత పోలంరెడ్డి దినేష్‌రెడ్డి అన్నారు. కొడవలూరులో ఆత్మీయులతో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ.. పలుమార్లు ఎమ్మెల్యే అభ్యర్థి అని ప్రకటించి చివరికి నడిబజారులో గొంతు కోశారని ఆవేదన వ్యక్తం చేశారు. దినేష్‌రెడ్డి ఇండిపెండెంట్‌గా పోటీచేయాలని కార్యకర్తలు కోరారు. యాదవులపై చిన్నచూపు పుంగనూరు నుంచి తానే పోటీలో ఉంటానని బీసీవై పార్టీ అధ్యక్షుడు రామచంద్రయాదవ్ ఆశించగా.. టీడీపీ నాయకుడు చల్లా రామచంద్రారెడ్డినే ఖరారు చేయటంతో యాదవ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంకటగిరి టికెట్ ఈ సారి బీసీలకు కేటాయించాలని మస్తాన్ యాదవ్, మరి కొందరు చేనేత కార్మికులు గట్టిగా ప్రయత్నాలు చేశారు. చివరకు చంద్రబాబు సామాజికవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ రెండో భార్య కుమార్తె లక్ష్మీసాయి ప్రియ పేరును ప్రకటించటంతో బీసీ సామాజికవర్గానికి చెందిన వారంతా రగిలిపోతున్నారు. డాలర్ దివాకర్‌రెడ్డి చంద్రగిరి నుంచి పోటీ చేయాలని కొంత కాలంగా బ్యానర్లు, ఫ్లెక్సీలతో హంగామా చేస్తూ వచ్చారు. చివరకు చంద్రబాబు సామాజికవర్గానికి చెందిన పులివర్తి నానికి కేటాయించటంతో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారంతా తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఏలూరు బీజేపీలో ముసలం ఏలూరు ఎంపీ సీటు ఆశిస్తున్న గారపాటి సీతారామాంజనేయ చౌదరికి షాకివ్వడంతో ఆయన అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఇక్కడ నుంచి సుజనా చౌదరి, సీఎం రమేష్ తదితరులు పోటీకి ఆసక్తి చూపుతున్నారు. శుక్రవారం ఏలూరు మినీ బైపాస్‌లోని క్రాంతి కళ్యాణ మండపంలో ఆత్మీయ సమావేశం పేరుతో సమావేశం నిర్వహించారు. ఎన్నికల సమయంలో వలస పక్షుల మాదిరిగా రాబందులు డబ్బు సంచులతో వాలిపోతారని, గెలిస్తే ఢిల్లీలో ఉంటారని, లేకపోతే అడ్రస్ ఉండరని ఘాటుగా విమర్శించారు. ఆరు నూరైనా పోటీ చేసి తీరుతానని స్పష్టం చేశారు. చోడవరంలో జనసేన ఆగ్రహ జ్వాల చోడవరం టికెట్ టీడీపీకి ఇవ్వడంపై జనసేన కార్యకర్తలు మండిపడుతున్నారు. జనసేన సమన్వయకర్త పీవీఎస్ఎన్ రాజు అధ్యక్షతన పార్టీ కార్యాలయంలో శుక్రవారం అత్యవసర సమావేశం నిర్వహించారు. ఐదేళ్లుగా అనేక ఉద్యమాలు చేశామని, తమకు కాకుండా టీడీపీకి ఎలా కేటాయిస్తారని సమావేశంలో ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్ సరైన నిర్ణయం తీసుకోకపోతే టీడీపీ అభ్యర్థికి పనిచేయడానికి జనసేన సిద్ధంగా లేదని స్పష్టం చేశారు. జనసేన నేతలకు అవమానం చిత్తూరుకు చెందిన ఆరణి శ్రీనివాసులు అనుచరులు తిరుపతి జనసేన నేతలను తీవ్రంగా అవమానించారు. జనసేనకు తిరుపతి అసెంబ్లీని కేటాయించినా.. పోటీ చేసేందుకు బలమైన నాయకులు లేరని, అందుకే చిత్తూరు నుంచి చీరలు, గాజులు పంపిస్తున్నామంటూ అవమానించారని జనసేన నేత కిరణ్‌రాయల్ పార్టీ అంతర్గత సమావేశంలో వెల్లడించారు. ఆరణికి టికెట్ ఇస్తే పనిచేసేది లేదంటూ తీర్మానం చేసి ఆ లేఖను అమరావతికి పంపారు. పార్టీ పదవులకు పరుచూరి రాజీనామా జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, అనకాపల్లి నియోజకవర్గ ఇన్చార్జి బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్టు పరుచూరి భాస్కరరావు చెప్పారు. ఐదేళ్లుగా పార్టీ కోసం కష్టపడితే పవన్‌కళ్యాణ్ కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదన్నారు. కొత్తగా వచ్చిన కొణతాలకు టికెట్ ఇవ్వడం అన్యాయమన్నారు. వంతలకు భంగపాటు రంపచోడవరం టీడీపీ టికెట్ ఆశించి భంగపడ్డ వంతల రాజేశ్వరి, మాజీ ఎమ్మెల్యే శీతంశెట్టి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో శుక్రవారం చంద్రబాబును కలిసేందుకు వెళ్లారు. వారికి భంగపాటు ఎదురైంది. బాబును కలిసేందుకు ప్రయత్నించిన వారిని పోలీసులు అడ్డుకోవడంతో మధ్యాహ్నం వరకు ఆందోళన చేశారు. పార్టీలో కష్టపడిన వారికి గుర్తింపు లేదని ధ్వజమెత్తారు. నలుగురికి చంద్రబాబును కలిసే అవకాశం రాగా.. శిరీష భర్త మఠం భాస్కర్‌పై వారు ఫిర్యాదు చేశారు. రెబల్‌గా పోటీ చేస్తా! ‘చంద్రబాబు గారు.. మేం చేసిన పాపం ఏమిటి? భార్య బిడ్డలను వదిలి పార్టీ కోసం కష్టపడి పనిచేశా. సత్యవేడు సీటు ఎందుకు ఇవ్వలేదు. ఆదిమూలం చెత్త అని వైఎస్సార్సీపీ టికెట్ ఇవ్వలేదు. ఆ చెత్తను మనం ఎందుకు నెత్తిన వేసుకోవాలి. నేను రెబల్ అభ్యర్థిగా పోటీ చేస్తాను. కోనేటి ఆదిమూలాన్ని ఓడించి తీరుతాను’ అని సత్యవేడు టీడీపీ మాజీ ఇన్చార్జి జేడీ రాజశేఖరరెడ్డి స్పష్టం చేశారు. జేడీ రాజశేఖరరెడ్డి గురువారం కుటుంబ సభ్యులతో కలిసి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. 2019 నుంచి పార్టీ కోసం ఎంతో కష్టపడ్డానని, ఆదిమూలం ఎమ్మెల్యేగా గెలుపొందాక.. కేసులు పెట్టి వేధించారని గుర్తుచేశారు. తాను వ్యాపారం చేసుకునేదానిని, టీడీపీ గెలుపు కోసం అన్నీ వదిలేసి కష్టపడి పనిచేశాని జేడీఆర్ కుమార్తె మౌనిక కన్నీరు మున్నీరైంది. సత్యవేడు సీటు కోసం నాలుగేళ్లుగా కార్యక్రమాలు నిర్వహిస్తున్న మాజీ ఎమ్మెల్యే హేమలత కుమార్తె డాక్టర్ హెలెన్ మనస్తాపంతో నివాసానికే పరిమితమయ్యారు. ఎంపీ ఇంటి ముందు అర్ధనగ్న ప్రదర్శన శ్రీకాకుళం అసెంబ్లీ టికెట్ మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవికి ఇవ్వాలంటూ టీడీపీ నాయకులు ఎంపీ రామ్మోహన్నాయుడు ఇంటి ముందు శుక్రవారం అర్ధనగ్న ప్రదర్శన చేశారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఎంపీ ఇంటి గేటు ముందు బైఠాయించడంతో పాటు కార్యాలయంలోనికి వెళ్లేందుకు ప్రయత్నించారు. లక్ష్మీదేవి అభ్యర్థిత్వం ఖరారు కాకపోతే ఎంపీ రామ్మోహన్నాయుడు గెలవరంటూ నినాదాలు చేశారు. విజయవాడ వెళ్లి పరిస్థితులను చంద్రబాబుకు వివరిస్తానని రామ్మోహన్నాయుడు తెలిపారు. అమలాపురంలో నువ్వా.. నేనా అమలాపురం అసెంబ్లీ స్థానంపై సర్వేలో శుక్రవారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకూ మాజీ ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు అభ్యర్థిత్వంపై అభిప్రాయ సేకరణ చేశారు. మధ్యాహ్నం నుంచి సీన్ మారింది. మాజీ ఎంపీ ఏజేవీబీ మహేశ్వరావు కుమార్తె పాము సత్యశ్రీ అభ్యర్థిత్వంపై ఐవీఆర్ఎస్ సర్వే మొదలైంది. ఒకే రోజు ఇద్దరి పేర్లపై సర్వేతో పార్టీ క్యాడర్లో గందరగోళం నెలకొంది. మరోవైపు జనసేన పార్టీ ఇన్చార్జి శెట్టిబత్తుల రాజబాబు, పార్లమెంటరీ ఇన్చార్జి డీఎంఆర్ శేఖర్లు తమకే టికెట్ దక్కుతుందనే ఆశతో ఉన్నారు. ఈ సమయంలో టీడీపీ ఐవీఆర్ఎస్ సర్వే చేపట్టడం జనసేనలో ఆగ్రహాన్ని కలిగించింది. దీంతో వారు అమలాపురం గడియారస్తంభం సెంటర్లో ఆందోళనకు దిగారు. అమలాపురం సీటు జనసేనకు కేటాయించాల్సిందేనని, లేకుంటే పొత్తు పక్కన పెట్టి టీడీపీని ఓడిస్తామని హెచ్చరించారు. -
హిమాచల్‌లో మళ్లీ కాంగ్రెస్ అలర్ట్.. సీన్లోకి విక్రమాదిత్య
సిమ్లా: హిమాచల్ ప్రదేశ్‌లో అధికార కాంగ్రెస్‌లో ముసలం ఇంకా ముగియలేదనే సంకేతాలు అందుతున్నాయి. రెబల్ ఎమ్మెల్యేలకు మరికొందరు తోడవుతున్నట్లు సమాచారం. దీంతో అధికార కాంగ్రెస్ పార్టీ మరింత జాగ్రత్త పడింది. ప్రభుత్వం కుప్పకూలిపోయే అవకాశాలు పూర్తిగా పోయేంతవరకు అప్రమత్తత అవసరమని ఆ పార్టీ భావిస్తోంది. ఈ తరుణంలో మంత్రి విక్రమాదిత్య సింగ్‌ను రంగంలోకి దించింది. . రాజ్యసభ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్‌కు పాల్పడ్డ ఆరుగురు ఎమ్మెల్యేలపై హిమాచల్ ప్రదేశ్ స్పీకర్ అనర్హత వేటు వేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం వాళ్లంతా హర్యానా(బీజేపీ పాలిత రాష్ట్రం) పంచకుల్లాలో మకాం వేశారు. స్పీకర్ నిర్ణయాన్ని హిమాచల్ ప్రదేశ్ హైకోర్టులో సవాల్ చేశారు వాళ్లంతా. ఈ క్రమంలో.. ఆ రాష్ట్ర మంత్రి విక్రమాదిత్య సింగ్ ఆ ఆరుగురిని కలవడం అక్కడి రాజకీయాలను ఆసక్తికరంగా మార్చేసింది. మాజీ ముఖ్యమంత్రి అయిన విదర్భ సింగ్(దివంగత) కుమారుడు విక్రమాదిత్య సింగ్.. హిమాచల్ కేబినెట్లో పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నారు. మొన్నటి రాజ్యసభ ఎన్నికల్లో విక్రమాదిత్య క్రాస్ ఓటింగ్‌కు పాల్పడకపోయినప్పటికీ.. అదేరోజు భావోద్వేగపూరితంగా మీడియా ముందుకు వచ్చారు. తన తండ్రిని కాంగ్రెస్ తీవ్రంగా అవమానిస్తోందని చెబుతూనే.. బీజేపీతో పోరాటే శక్తి కాంగ్రెస్‌కు లేదంటూ వ్యాఖ్యానించారు. ఈ క్రమంలోనే పార్టీకి, పదవికి సైతం ఆయన రాజీనామా చేశారు. అయితే హైకమాండ్ జోక్యంతో సాయంత్రానికి ఆయన చల్లబడ్డారు. తన రాజీనామాను వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించారు. ఇలాంటి సంక్షోభ సమయంలో తాను పార్టీని వీడొద్దని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. ఇక.. ఈ ఉదయం రెండ్రోజుల ఢిల్లీ పర్యటనకు బయల్దేరిన విక్రమాదిత్య.. మార్గం మధ్యలో ఆ ఆరుగురు రెబల్ ఎమ్మెల్యేలను కలుసుకున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు.. ఢిల్లీ పర్యటన ముగిశాక తిరుగు ప్రయాణంలోనూ ఆయన మరోసారి వాళ్లతో భేటీ అవుతారని సమాచారం. ఇదిలా ఉంటే.. ఆరుగురు రెబల్స్‌కు మరో ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కలిసినట్లు తెలుస్తోంది. దీంతో ఈ సంఖ్య మరింత పెరగకమునుపే.. విక్రమాదిత్యను సీన్లోకి దించి మంతనాలు జరిపిస్తోంది కాంగ్రెస్ అధిష్టానం. అవునా.. నాకు తెలియదు! ఇదిలా ఉంటే.. రెబల్స్‌ను విక్రమాదిత్యసింగ్ కలిసినట్లు వస్తున్న వార్తలపై ఆయన తల్లి, హిమాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ ప్రతిభా సింగ్ స్పందించారు. ఓ జాతీయ మీడియా సంస్థతో ఆమె మాట్లాడుతూ.. తన కుమారుడి పర్యటన షెడ్యూల్ వివరాలు తనకి తెలియవని అన్నారు. గత రాత్రి తను(విక్రమాదిత్య) ఇక్కడే ఉన్నాడు. ఆ తర్వాత ఎక్కడికి వెళ్లాడో నాకు తెలియదు అని అంటున్నారామె. అయితే ఎప్పటికప్పుడు పరిణామాలను మాత్రం హైకమాండ్‌కు తాము నివేదిస్తామని చెప్పారామె. ఇక ముఖ్యమంత్రి పదవి దక్కకపోవడంతో మొదటి నుంచి అసంతృప్తిగా ఉంటోంది వీరభద్ర సింగ్ కుటుంబం. తాజా సంక్షోభం నేపథ్యంలో.. మరోసారి ఆ డిమాండ్‌నే అధిష్టానం వద్ద ఉంచినట్లు వినవస్తోంది. అయితే సుఖ్విందర్ సింగ్ సుఖు మాత్రం తాను ఫైటర్ని అని.. తానే ఐదేళ్ల పాటు సీఎంగా ఉంటానని ప్రకటించుకుంటున్నారు. ఆ ఆరుగురికి కాంగ్రెస్ ఆఫర్ అనర్హత వేటు పడిన ఎమ్మెల్యేలను తిరిగి సొంతగూటికి తెచ్చుకోవాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. సుధీర్ శర్మ, రవి ఠాకూర్, రాజిందర్ రాణా, ఇందర్ దత్, చేతన్య శర్మ, దేవిందర్ కుమార్‌తో చర్చలు జరిపే బాధ్యతను మంత్రి విక్రమాదిత్యకు అప్పగించింది. పార్టీలోకి వచ్చే అవకాశం ఉంటే.. అనర్హత వేటు వెనక్కి తీసుకుంటామని హామీ ఇస్తున్నారని హిమాచల్ కాంగ్రెస్ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతుంది. -
రె‘బెల్స్’ కాదు ... ప్రత్యర్థి పక్షమే!
ఎన్నికల్లో ప్రధాన పార్టీ అభ్యర్థిగా పోటీ చేయడం ఒకెత్తయితే... సొంత పార్టీ నుంచి రెబెల్‌గా ఎవరూ లేకుండా చూసుకోవడం మరోఎత్తు. తాము ఎప్పటి నుంచో ఉంటున్న పార్టీ ఎన్నికల సమయంలో టికెట్ ఇవ్వకపోతే ఇండిపెండెంట్గానో, మరో పార్టీ నుంచో పోటీ చేసి గెలిచిన నాయకులు తెలంగాణలో చాలా మందే ఉన్నారు. ఒకవేళ గెలవకపోయినా, సొంత పార్టీ అభ్యర్థిని ఓడించి ప్రత్యర్థి పార్టీ గెలుపునకు పరోక్షంగా కారకులైన వారూ ఉన్నారు. కొన్నిసార్లు పేరున్న రెబెల్ కారణంగా పోటీలో ఉన్న ప్రధాన పార్టీల్లోని ఏ అభ్యర్థి ఓడిపోతాడో చెప్పలేని పరిస్థితి. కానీ ఈసారి సీన్ మారింది. రెబెల్స్ పోటీలో నిలిచిన నియోజకవర్గాలు చాలా తక్కువగా ఉన్నాయి. రెబెల్స్‌గా పోటీ చేసే బదులు ప్రత్యర్థి పార్టీలో చేరి ఆ పార్టీ అభ్యర్థికి మద్దతుగా పనిచేయడం అనే పద్ధతిని ఈసారి చాలామంది ఫాలో అయిుపోయారు. పీసీసీ అధ్యక్షుడిగా , రాష్ట్ర మంత్రిగా పనిచేసిన పొన్నాల లక్ష్మయ్య మొదలు మాజీ మంత్రులు నాగం జనార్దన్ రెడ్డి(నాగర్‌కర్నూలు), సంభాని చంద్రశేఖర్ (సత్తుపల్లి), మాజీ ఎమ్మెల్యేలు పి. విష్ణువర్దన్‌రెడ్డి (జూబ్లీహిల్స్), ప్రేంసింగ్ రాథోడ్(గోషామహల్), చందర్రావు(కోదాడ), బిరుదు రాజమల్లు (పెద్దపల్లి) వంటి వారు ఇందులో ఉండడం గమనార్హం. కాంగ్రెస్ టికెట్ రాక బీఆర్ఎస్లోకి కాంగ్రెస్ టికెట్ ఆశించి భంగపడ్డ నాయకులు రెబెల్స్‌గా బరిలో దిగాలని తొలుత భావించినప్పటికీ, ‘సింబల్’ లేకుండా గెలవడం కష్టమనే భావనతో మధ్యే మార్గంగా ప్రత్యామ్నాయ పార్టీలను చూసుకున్నారు. బీఆర్ఎస్ కూడా టికెట్ రాని కాంగ్రెస్, బీజేపీ నాయకులకు కండువాలు కప్పి మరీ సాదరంగా ఆహా్వనించింది. కొట్లాడుతామనుకున్న వాళ్లకే మద్దతుగా ప్రచారం చేయాల్సిన అనివార్య పరిస్థితి కల్పించింది. ఇలాంటి వారిలో చెరుకు సుధాకర్ (నల్లగొండ), తాటి వెంకటేశ్వర్లు (అశ్వరావుపేట), పాల్వాయి స్రవంతి (మునుగోడు), గండ్రత్ సుజాత (ఆదిలాబాద్) వంటి వారున్నారు. బీజేపీ నుంచి కూడా రాకే‹Ùరెడ్డి (వరంగల్), తుల ఉమ (వేములవాడ), రమాదేవి (ముధోల్) టికెట్ రాక భంగపడి బీఆర్ఎస్లో చేరారే తప్ప రెబెల్స్‌గా పోటీ చేసే సాహసం చేయలేదు. ఒక పార్టీ టికెట్ ఇవ్వకపోతే మరో పార్టీ నుంచి బరిలో... ఈసారి ఎన్నికల్లో బీఆర్ఎస్ మూడు నెలల ముందే అభ్యర్థులను ప్రకటించింది. కొందరు మినహా సిట్టింగ్‌లకే ఆ పార్టీ టికెట్లు కేటాయించడంతో ఆయా నియోజకవర్గాల్లో సీట్లు ఆశించిన వారు రెండు నెలలు ఆలోచించిన అనంతరం ఎక్కువ శాతం కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఖమ్మంకు చెందిన పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వర్రావు, కోరం కనకయ్య, పాయం వెంకటేశ్వర్లు కాంగ్రెస్ నుంచి పోటీ పడుతున్నారు. జలగం వెంకట్రావు ఫార్వర్డ్ బ్లాక్ నుంచి పోటీలో ఉన్నారు. తన కొడుకుకు మెదక్ సీటివ్వలేదని అలిగిన మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో నిలిచారు. అలాగే టికెట్ దక్కని రేఖా నాయక్(ఖానాపూర్) కాంగ్రెస్‌లో చేరగా, ఆమె భర్త శ్యాంనాయక్‌కు ఆసిఫాబాద్ టికెట్ లభించింది. బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావు బీజేపీ అభ్యర్థి సోయం బాపూరావుకు మద్దతుగా ఆపార్టీలో చేరారు. నిర్మల్ నుంచి శ్రీహరిరావు కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ పడుతున్నారు. సంగారెడ్డి టికెట్ ఆశించిన పులిమామిడి రాజు బీజేపీ అభ్యర్థిగా బరిలో నిలిచారు. కరీంనగర్లో బీఆర్ఎస్కు రాజీనామా చేసిన పురమళ్ల శ్రీనివాస్ కాంగ్రెస్ టికెట్ దక్కించుకున్నారు. అంబర్‌పేటలో బీఆర్ఎస్కు రాజీనామా చేసిన మాజీ మంత్రి సి.కృష్ణయాదవ్, మునుగోడు నుంచి చెలిమల కృష్ణారెడ్డి బీజేపీలో చేరి ఆ పార్టీ నుంచి బరిలో నిలిచారు. చేవెళ్లలో రత్నం, మానకొండూరు నుంచి ఆరెపల్లి మోహన్, రామగుండం నుంచి కందుల సంధ్యారాణి బీజేపీ నుంచి పోటీలో ఉన్నారు. కల్వకుర్తిలో బీఆర్ఎస్ టికెట్ ఆశించి భంగపడ్డ కసిరెడ్డి నారాయణరెడ్డి కాంగ్రెస్ టికెట్టుపై పోటీ చేస్తున్నారు. ఇండిపెండెంట్లుగా గెలిచిన వారెందరో...! తెలుగుదేశం ఆవిర్భావం అనంతరం 1983లో వచ్చిన ఎన్టీ రామారావు ప్రభంజనంలో ఉమ్మడి రాష్ట్రంలో 19 మంది ఇండిపెండెంట్లు విజయం సాధించగా, అందులో తెలంగాణ నుంచే తొమ్మిది మంది విజయం సాధించారు. 1985 మధ్యంతర ఎన్నికల్లో గెలిచిన 9 మందిలో 8 మంది తెలంగాణ నుంచి కావడం గమనార్హం. వీరిలో అధిక సంఖ్యలో తెలుగుదేశం టికెట్లు ఆశించి భంగపడ్డ నాయకులే ఉన్నారు. 1989 ఎన్నికల్లో ఏకంగా 15 మంది స్వతంత్రులు విజయం సాధించగా, అందులో 8 మంది తెలంగాణ నుంచే. ఆలేరులో మోత్కుపల్లి నర్సింహులు, కరీంనగర్లో బి.జగపతి రావు వంటి నేతలు అప్పుడు కాంగ్రెస్ టికెట్ దక్కక రెబల్‌గా పోటీ చేసి గెలిచిన వారే. 1994లో మరోసారి ఎన్టీఆర్ ప్రభంజనంలో 12 మంది ఇండిపెండెంట్లు గెలవగా, అందులో తెలంగాణ నుంచి గెలిచిన ఐదుగురు ఇండిపెండెంట్లలో తుంగతుర్తి నుంచి ఆర్.దామోదర్ రెడ్డి , గద్వాల నుంచి డీకే.భరత్ సింహారెడ్డి, కల్వకుర్తి నుంచి ఎడ్మ కిష్టారెడ్డి కాంగ్రెస్ రెబల్స్‌గా విజయం సాధించారు. 2004లో 11 మంది ఇండిపెండెంట్లు గెలవగా తెలంగాణ నుంచి విజయం సాధించిన నలుగురిలో కొల్లాపూర్ నుంచి జూపల్లి కృష్ణారావు వంటి వారు ఉన్నారు. 2004 నుంచి ఇతర పార్టీల గుర్తుల మీద... 2004 ఎన్నికల నాటి నుంచి టికెట్లు రాని వారు రెబెల్స్‌గా ఇతర రాష్ట్రాలకు చెందిన పార్టీ గుర్తుల మీద పోటీ చేసే ఆచారం మొదలైంది. ఆ ఏడాది జరిగిన ఎన్నికల్లో జనతా పార్టీ తరపున మెట్పల్లి నుంచి పోటీ చేసిన కొమిరెడ్డి రాములు, సమాజ్‌వాది పార్టీ టికెట్ మీద గద్వాల నుంచి పోటీ చేసిన డీకే.అరుణ కాంగ్రెస్ రెబల్స్‌గా విజయం సాధించారు. 2009 ఎన్నికల్లో చిరంజీవి నేతృత్వంలో ప్రజారాజ్యం పార్టీ ఆవిర్భవించగా, అప్పుడు టీడీపీ, కాంగ్రెస్ నుంచి సీట్లు రాని వారు ఆ పార్టీ తరపున పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో పలువురు పోటీ చేసినప్పటికీ... నిర్మల్ నుంచి మహేశ్వర్ రెడ్డి, బాల్కొండ నుంచి అనిల్‌కుమార్ విజయం సాధించి, అనంతర పరిణామాల్లో కాంగ్రెస్‌లో విలీనమయ్యారు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత 2014 ఎన్నికల్లో అప్పటి టీఆర్ఎస్, కాంగ్రెస్, టీడీపీలకు ప్రత్యామ్నాయంగా ఆదిలాబాద్ జిల్లాలో బీఎస్పీని తెరపైకి తెచ్చిన అల్లోల్ల ఇంద్రకరణ్ రెడ్డి, కోనేరు కోనప్ప ఆ పార్టీ తరపున ఎమ్మెల్యేలుగా గెలిచి తర్వాత అధికార పార్టీలో చేరారు. నర్సంపేటలో కాంగ్రెస్ రెబల్‌గా దొంతు మాధవరెడ్డి పోటీ చేసి విజయం సాధించారు. 2018లో వైరా నుంచి రాములు నాయక్ కాంగ్రెస్ రెబల్‌గా విజయం సాధించగా, రామగుండం నుంచి కోరుకంటి చందర్ ఆల్ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ తరపున పోటీ చేసి గెలుపొంది, తర్వాత బీఆర్ఎస్లో చేరారు. -పోలంపల్లి ఆంజనేయులు -
కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలకు రెబల్స్ బెడద
-
కాంగ్రెస్‌లో రె‘బెల్స్’
సాక్షి, హైదరాబాద్: ఈసారి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి రెబెల్స్ బెడద తప్పేలా లేదు. ఒక్కో నియోజకవర్గం నుంచి ముగ్గురు, నలుగురు నేతలు టికెట్లు ఆశించగా, అందులో టికెట్లు రాని అసంతృప్తులు రాష్ట్రవ్యాప్తంగా 24 చోట్ల నామినేషన్లు దాఖలు చేశారు. ఈ 24 మందిని కాంగ్రెస్ పెద్దలు బుజ్జగించే ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కనీసం 10 చోట్ల ఆ పార్టీకి రె‘బెల్స్’మోగక తప్పదని గాందీభవన్ వర్గాలే అంటున్నాయి. ముఖ్యంగా సూర్యాపేట, బాన్సువాడ, వరంగల్ వెస్ట్, డోర్నకల్, వైరా, ఇల్లందు నియోజకవర్గాల్లో ఏం జరుగుతుందోననే ఉత్కంఠ నెలకొంది. హైదరాబాద్‌కు రండి.. ఈసారి కాంగ్రెస్ రెబెల్స్‌గా జంగా రాఘవరెడ్డి (వరంగల్ వెస్ట్), నరేశ్ జాదవ్ (బోథ్), గాలి అనిల్‌కుమార్ (నర్సాపూర్), ఎస్.గంగారాం (జుక్కల్), కాసుల బాలరాజు (బాన్సువాడ), నాగి శేఖర్ (చొప్పదండి), దైద రవీందర్ (నకిరేకల్), రామ్మూర్తి నాయక్ (వైరా), ప్రవీణ్ నాయక్, చీమల వెంకటేశ్వర్లు (ఇల్లందు), విజయ్‌కుమార్‌రెడ్డి (ముథోల్), లక్ష్మీనారాయణ నాయక్ (పాలకుర్తి), సున్నం వసంత (చేవెళ్ల), నెహ్రూ నాయక్ (డోర్నకల్), భూక్యా మంగీలాల్ (మహబూబాబాద్), పటేల్ రమేశ్‌రెడ్డి (సూర్యాపేట), చిమ్మని దేవరాజు (పరకాల), సిరిసిల్ల రాజయ్య (వర్ధన్నపేట)తోపాటు మరికొంత మంది రంగంలోకి దిగారు. వీరిలో ఒకరిద్దరు ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ (ఏఐఎఫ్బీ) టికెట్లు తెచ్చుకుని సింహం గుర్తుపై పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. రెబెల్స్‌గా నామినేషన్లు దాఖలు చేసిన వారితో మంతనాలు జరిపి వారి నామినేషన్లను ఉపసంహరింపజేసే బాధ్యతలను రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇంచార్జి మాణిక్‌రావ్ ఠాక్రే, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ బి.మహేశ్‌కుమార్‌గౌడ్‌లకు పార్టీ అప్పగించింది. దీంతో వీరందరినీ హైదరాబాద్‌కు రావాలని ఆహ్వానించారు. వీరిలో నలుగురైదుగురు మాత్రమే అందుబాటులోకి రాగా, మిగిలిన వారితో ఠాక్రే, మహేశ్‌గౌడ్ ఫోన్లో సంప్రదింపులు జరిపారు. దీనిపై మహేశ్‌కుమార్‌గౌడ్ ‘సాక్షి’తో మాట్లాడుతూ.. రెబెల్స్‌గా బరిలోకి దిగిన పార్టీ నాయకులందరితో మాట్లాడామని, అందరూ సర్దుకుంటారని చెప్పారు. బుధవారం సాయంత్రానికి మెజార్టీ నాయకులు తమ నామినేషన్లను ఉపసంహరించుకుంటారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎంత ప్రయత్నించినా... టికెట్లు ఆశించే వారి సంఖ్య ఎక్కువగా ఉండటంతో కాంగ్రెస్ నెల రోజులుగా బుజ్జగింపు యత్నాలు చేస్తూనే ఉంది. టికెట్లు రాని వారితో సంప్రదింపులు జరిపేందుకు సీనియర్ నేత జానారెడ్డి నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేసింది. ఈ కమిటీతోపాటు ఏఐసీసీ నుంచి సమన్వయకర్తలుగా వచ్చిన దీపాదాస్ మున్షీ, జ్యోతిమణి, రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇంచార్జి మాణిక్‌రావ్ ఠాక్రేలు టికెట్లు దక్కవని తెలిసిన వారితో మంతనాలు జరిపి వారికి భవిష్యత్తుపై భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇక, ఏఐసీసీ సంస్థాగత వ్యవహారాల ఇన్చార్జి కేసీ వేణుగోపాల్ హైదరాబాద్‌కు వచ్చినప్పుడు 15 మంది నేతలతో సమావేశమై బుజ్జగించారు. ఇన్ని ప్రయత్నాలు చేసిన తర్వాత కూడా 20 మందికి పైగా రెబెల్స్ నామినేషన్లు వేశారు. వీరిలో ఓ 10 మంది వెనక్కు తగ్గినా, మరో 10 మంది బరిలో ఉండే అవకాశముందని తెలుస్తోంది. వీరిలో ఎంతమంది బరిలో ఉంటారు? ఎంత మంది ఉపసంహరించుకుంటారనే దానిపై బుధవారం సాయంత్రానికి స్పష్టత రానుంది. పార్టీలు మారిన చాలా మంది రెబెల్స్‌గా నామినేషన్లు వేసిన వారితోపాటు చివరి క్షణంలో పార్టీలు మారిన వారి నుంచి ఎలాంటి ముప్పు వస్తుందోననే ఆందోళన కాంగ్రెస్ నేతల్లో వ్యక్తమవుతోంది. మునుగోడు నుంచి ముషీరాబాద్ వరకు, ఆదిలాబాద్ నుంచి నకిరేకల్ వరకు 20కి పైగా నియోజకవర్గాలకు చెందిన నాయకులు ఇటీవలే పార్టీ నుంచి వెళ్లిపోయారు. వీరిలో చాలా తక్కువ మంది బీజేపీలోకి వెళ్లగా, మెజార్టీ నేతలు గులాబీ కండువాలు కప్పుకున్నారు. చివరి క్షణం వరకు టికెట్ రేసులో ఉండి పార్టీ నుంచి వెళ్లిపోయిన నేతలు కాంగ్రెస్‌ను ఓడించాలనే ఏకైక లక్ష్యంతో పనిచేస్తున్నారు. వీరికితోడు మరో 10 మంది వరకు రెబెల్స్ బరిలో ఉండే అవకాశాలుండటంతో టికెట్ల ‘అసంతృప్తి’పార్టీ పుట్టి ముంచుతుందేమోనన్న ఆందోళన నేతల్లో వ్యక్తమవుతోంది. -
పాఠశాలపై దాడి చేసిన ఉగ్రవాదులు.. 25 మంది మృతి
ఉగాండా: డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో సరిహద్దులో ఉన్న ఒక స్కూలుపై ఏడీఎఫ్ తిరుగుబాటుదారులు దాడి చేశారు. ఈ దాడిలో సుమారుగా 25 మంది మృతి చెందగా 8 మంది గాయపడ్డారు. అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ఐసిస్ అనుబంధ సంస్థగా పేరున్న ఏడీఎఫ్ శుక్రవారం రాత్రి పశ్చిమ ఉగాండాలోని పాండ్వేకు చెందిన లుబిరిరా ఉన్నత పాఠశాలపై దాడికి తెగబడింది. తిరుగుబాటుదారుల దాడిలో కనీసం 25 మంది ప్రాణాలు కోల్పోయి ఉంటారని మరో ఎనిమిది మంది గాయపడ్డారని తెలిపారు ఉగాండా పోలీసులు. ఉగాండా పోలీసులు దాడికి సంబంధించిన వివరాలు తెలుపుతూ.. పాండ్వే లుబిరిరా పాఠశాలపై ఏడీఫ్ తీవ్రవాదులు దాడి చేసి పాఠశాల వసతి గృహాన్ని తగలబెట్టి ఆహారాన్ని దొంగిలించుకుపోయారు. ఇప్పటివరకు ఇక్కడ 25 మృతదేహాలను గుర్తించి దగ్గర్లోని బ్వేరా ఆసుపత్రికి తరలించాము.ఇందులో విద్యార్థులు ఎంతమంది చనిపోయారన్న దానిపై స్పష్టత లేదు. దాడి అనంతరం ఉగ్రవాద ముఠా విరుంగా నేషనల్ పార్క్ వైపుగా పారిపోయారని అన్నారు. 1990ల్లో తూర్పు ఉగాండాలో ఆనాటి అధ్యక్షుడు యోవెరీ ముసెవెనికి వ్యతిరేకంగా ఏడీఎఫ్ పుట్టుకొచ్చింది. చాలా కాలంగా అజ్ఞాతంలో ఉన్న ఏడీఎఫ్ 2021లో ఉగాండా రాజధాని కంపాలాలో బాంబు దాడికి పాల్పడినట్టు ఆరోపణలు కూడా ఉన్నాయి. మళ్ళీ ఇన్నాళ్లకి ఏడీఎఫ్ మళ్ళీ వెలుగులోకి వచ్చి పిల్లల పాఠశాలపై దాడులు చేయడం పాశవికమని ఇది ముమ్మాటికీ పిరికిపంద చర్యని అన్నారు ఉగాండా నేత విన్నీ కిజా. ఇది కూడా చదవండి: నిద్రలో హఠాత్తుగా లేచి తుపాకీతో కాల్చుకున్నాడు.. కారణం తెలిస్తే షాక్.. -
Karnataka assembly elections 2023: ‘కల్యాణం’ఎవరికో?
కల్యాణ (హైదరాబాద్) కర్ణాటక. కన్నడ సీమలో అత్యంత వెనకబడ్డ మెట్ట ప్రాంతం. దశాబ్దాలుగా కాంగ్రెస్‌కు కంచుకోటగా నిలుస్తూ వస్తోంది. రాష్ట్రంలో బీజేపీ రెండుసార్లు 100కు పైగా స్థానాలు ఒడిసిపట్టినా మెజారిటీ మార్కును దాటలేకపోవడానికి ఈ ప్రాంతంలో పట్టు లేకపోవడమే ప్రధాన కారణం. దాంతో ఈసారి రెండు పార్టీలకూ కల్యాణ కర్ణాటక కీలకంగా మారింది. పట్టు కొనసాగించాలని కాంగ్రెస్, కోటను ఎలాగైనా బద్దలు కొట్టాలని బీజేపీ పట్టుదలగా ఉన్నాయి. ఇక్కడ ఎప్పుడూ ఐదు స్థానాలకు మించి గెలవని జేడీ(ఎస్) ఈసారి బీజేపీ, కాంగ్రెస్ రెబెల్స్‌ను బరిలో దించి అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది... ‘హైదరాబాద్ రాష్ట్రం’లో భాగమే ► కల్యాణ కర్ణాటక ఒకప్పటి హైదరాబాద్ రాజ్యంలో భాగంగా నిజాంల ఏలుబడిలో కొనసాగింది. ఇటీవలి దాకా కూడా ఈ ప్రాంతాన్ని హైదరాబాద్ కర్ణాటకగానే పిలిచేవారు. ► ఈ ప్రాంతంలో ఎస్సీ, ఎస్టీ, లింగాయత్, ముస్లింలు అధిక సంఖ్యాకులు. 50 శాతానికి పైగా ఉండే ఈ వెనుకబడిన వర్గాలే ఇక్కడ నిర్ణాయక శక్తి. ► వీరేంద్ర పాటిల్, ధరంసింగ్ రూపంలో ఇద్దరు సీఎంలను అందించినా ఈ ప్రాంతం అత్యంత వెనకబాటుతనానికి మారుపేరు. ► దేశంలోనే రెండో అతి పెద్ద మెట్ట ప్రాంతంగా పేరొందింది. దాంతో వెనకబాటుతనం ఇక్కడ ప్రతిసారీ ఎన్నికల అంశంగా మారుతుంటుంది. ► ఈసారి కూడా పార్టీలన్నీ అభివృద్ధి నినాదాన్నే జపిస్తున్నాయి. ► అతివృష్టితో ఇక్కడ 90 శాతం పంటనష్టం జరిగింది. బీజేపీ ప్రభుత్వం హెక్టార్‌కు రూ.10 వేల పరిహారం ప్రకటించినా అదింకా అందలేదు. ఇది ఎన్నికల్లో ప్రభావం చూపవచ్చంటున్నారు. ► ఆర్టికల్ 371(జే) ప్రకారం విద్య, ఉద్యోగాల్లో ఈ ప్రాంతానికి ప్రత్యేక హోదా ఉన్నా ఒరిగిందేమీ లేదని స్థానికుల్లో తీవ్ర అసంతృప్తి ఉంది. ► దాంతో కొన్నేళ్లుగా ప్రత్యేక కల్యాణ రాష్ట్ర డిమాండ్ ఊపందుకుంటోంది! ఖర్గే ఖిల్లా మల్లికార్జున ఖర్గే కల్యాణ కర్ణాటక ప్రాంతానికి చెందిన నాయకుడే. కాంగ్రెస్ సారథిగా ఈసారి ఇక్కడ పార్టీకి అత్యధిక స్థానాలు సాధించి పెట్టాలని పట్టుదలగా ఉన్నారు. ఖర్గే కుమారుడు, చిత్తాపుర ఎమ్మెల్యే ప్రియాంక్ ఖర్గే ఇక్కడ బీజేపీకి కొరకరాని కొయ్యగా మారారు. ► బీదర్, కలబురిగి, యాద్గిర్, రాయచూరు, కొప్పళ, బళ్లారి, విజయనగర జిల్లాలతో కూడిన కల్యాణ కర్ణాటకలో 40 స్థానాలున్నాయి. ► గత రెండు అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఇక్కడ సగానికి పైగా స్థానాలను కాంగ్రెస్ చేజిక్కించుకుని సత్తా చాటింది. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 21 సీట్లు రాగా బీజేపీ 15, జేడీ(ఎస్) 4 గెలిచాయి. అయితే 2013తో పోలిస్తే కాంగ్రెస్‌కు 2 సీట్లు తగ్గగా బీజేపీకి 9 పెరిగాయి! ► ఈ కాంగ్రెస్ కంచుకోటను బద్దలు కొట్టేందుకు అధికార బీజేపీ విశ్వప్రయత్నాలు చేస్తోంది. డబుల్ ఇంజిన్ సర్కార్, అభివృద్ధి కార్యక్రమాలనే బీజేపీ ప్రచారాస్త్రాలుగా చేసుకుంది. మోదీపై ఆశలు పెట్టుకుంది. ► కల్యాణ కర్ణాటక ఉత్సవం, బీదర్ ఉత్సవం వంటివాటితో స్థానికుల మనసు దోచుకునే ప్రయత్నాలు చేసింది. ► కల్యాణ కర్ణాటక ప్రాంతీయాభివృద్ధి మండలికి వార్షిక కేటాయింపులను రూ. 1,500 కోట్ల నుంచి రూ.5,000 కోట్లకు పెంచింది. ► ఖర్గేకు సుదీర్ఘ రాజకీయ జీవితంలో 2019 లోక్‌సభ ఎన్నికల్లో తొలి ఓటమిని రుచి చూపిన స్ఫూర్తితో కల్యాణ కర్ణాటకలో పూర్తిగా పాగా వేసేందుకు ప్రయత్నిస్తోంది. ► జేడీఎస్ గత మూడు ఎన్నికల్లో ఇక్కడ ఎప్పుడూ ఐదు సీట్లకు మించి నెగ్గలేదు. ఈసారి తమ పంచరత్న యాత్ర విజయవంతం కావడం, కాంగ్రెస్, బీజేపీ సీనియర్ నేతలు జేడీ(ఎస్)లో చేరడంతో మంచి ఫలితాలపై ఆశలు పెట్టుకుంది. ► ఈసారి కల్యాణ కర్ణాటక నుంచి బరిలో దిగిన గాలి జనార్ధన్ రెడ్డి కల్యాణ రాజ్య ప్రగతి పార్టీ (కేఆర్పీపీ) మూడు ప్రధాన పార్టీల అవకాశాలను తారుమారు చేసే అవకాశముంది. ► లింగాయత్‌లు ఎక్కువగా ఉన్నందున వారికి 2 శాతం అదనపు రిజర్వేషన్ల నిర్ణయం కలిసొస్తుందని ఆశ పడుతోంది. కానీ 40 శాతం కమీషన్లు, నియామక అక్రమాలు, రెబెల్స్ వంటివి బీజేపీకి ప్రతికూలంగా మారాయి. – సాక్షి, బెంగళూరు -
Karnataka assembly elections 2023: వాగ్దానాల నుంచి కోటా దాకా... కీలకాంశాలివే...!
కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. నామినేషన్ల సమర్పణ, పరిశీలన, ఉపసంహరణ గడువు కూడా ముగిసింది. ప్రచారమూ జోరందుకుంది. ఆయా పార్టీల నేతలు ఊరూవాడా ప్రచారంతో హోరెత్తిస్తున్నారు. పార్టీల ఉచిత వాగ్దానాలతో పాటు రెబెల్స్ వంటి పలు అంశాలు ఈసారి ఎన్నికలను గట్టిగానే ప్రభావితం చేసేలా కన్పిస్తున్నాయి... – సాక్షి, బెంగళూరు వాగ్దానాలు, తాయిలాలు ప్రధాన పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ ఈసారి కూడా పోటాపోటీగా ఓటర్లపై హామీల వర్షం కురిపించాయి. ముఖ్యంగా ప్రతి మహిళకూ నెలకు రూ.2,000 అందిస్తామని కాంగ్రెస్ చెప్పడంతో బీజేపీ తక్షణం ప్రతిస్పందించింది. దారిద్య్ర రేఖకు దిగువనున్న కుటుంబాలకు నెలకు రూ.3,000 ప్రకటించింది. మహిళా వ్యవసాయ కూలీలకు నెలకు రూ.1,000తో పాటు 30 లక్షల మంది మహిళలకు, 8 లక్షల మంది విద్యార్థినులకు ఉచిత బస్ పాస్ హామీలిచ్చింది. కాంగ్రెసేమో కుటుంబానికి నెలకు 10 కిలోల ఉచిత బియ్యం, పట్టభద్రులకు రూ.3,000 నిరుద్యోగ భృతి, 200 యూనిట్ల ఉచిత కరెంట్ ఇస్తామని పేర్కొంది. ఇక జేడీ(ఎస్) పేద మహిళలకు నెలకు రూ.2,000 జీవన భృతి, ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం తదితర వాగ్దానాలు చేసింది. తొలిసారి రాష్ట్రంలో ఎన్నికల బరిలో దిగుతున్న ఆప్ కూడా ఏమీ వెనకబడలేదు. ఉచిత విద్యుత్, తాగునీరు, సాగు రుణ మాఫీ, పట్టణ ప్రాంత మహిళలకు ఉచిత బస్ పాస్ వంటి హామీలిచ్చింది. పాల ప్యాకెట్లో తుఫాన్ స్థానిక నందిని డెయిరీని దెబ్బతీసేందుకు గుజరాత్‌కు చెందిన అమూల్ డెయిరీ వచ్చి పడుతోందన్న ప్రచారం బీజేపీకి తలనొప్పిగా మారింది. దీన్ని అస్త్రంగా మలుచుకున్నాయి. కర్ణాటకలో అమూల్, నందిని కలసి పనిచేస్తాయని కేంద్ర హోం మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ పదేపదే ప్రస్తావిస్తోంది. దీనివల్ల దేశంలో రెండో అతి పెద్ద డెయిరీ సహకార వ్యవస్థ అయిన కర్ణాటక పాల సమాఖ్య మనుగడే ప్రమాదంలో పడుతుందంటూ ప్రచారం చేస్తోంది. దాంతో దిమ్మెరపోయిన బీజేపీ కీలకమైన డెయిరీ రైతుల ఓట్లు చేజారకుండా చూసుకునేందుకు కిందామీదా పడుతోంది. ‘అవినీతి’ పై కాంగ్రెస్ ఆశలు బొమ్మై ప్రభుత్వ అవినీతిపై కాంగ్రెస్ ప్రధానంగా అస్త్రాలు ఎక్కుపెడుతోంది. 40 శాతం కమిషన్ సర్కారు అంటూ చేస్తు న్న ఆరోపణలు ప్రజల్లోకి బాగా వెళ్తున్నాయ ని నమ్ముతోంది. ప్రభుత్వ పెద్దలే ప్రతి పనిలోనూ 40 శాతం కమీషన్లు, ముడుపులు తీసుకుంటున్నారంటూ హో రెత్తిస్తోంది. దీనికి కౌంటర్‌గా కాంగ్రెస్ అధికారంలో ఉండగా కర్ణాటకను ఆ పార్టీ అధిష్టానం అచ్చం ఏటీఎం మాదిరిగా వాడుకుందంటూ బీజేపీ ఎదురు దాడి చేస్తోంది. ‘కోటా’తో బీజేపీ ఆట ఎన్నికల వేళ బీజేపీ సర్కారు వ్యూహాత్మకంగా రిజర్వేషన్ల తేనెతుట్టెను కదిపింది. ముస్లింలకున్న 4 శాతం రిజర్వేషన్లను రద్దు చేయడమే గాక బలమైన సామాజిక వర్గాలైన లింగాయత్‌లు, ఒక్కలిగలకు చెరో 2 శాతం చొప్పున బ దలాయించింది. ఊహించినట్టే ముస్లింల నుంచి దీనిపై భారీ నిరసన ఎదురైనా ఈ ఎత్తుగడ హిందూ ఓట్లను తనకు అనుకూలంగా సంఘటితం చేస్తుందని బీజేపీ నమ్ముతోంది. ఎస్సీ, ఎస్టీలకు కూడా రిజర్వేషన్ పెంచి ఆయా కులాలను ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. దీంతోపాటు హిజాబ్, టిప్పు సుల్తాన్ అంశాలూ ప్రభావం చూపనున్నాయి. కింగ్(మేకర్) ఆశల్లో జేడీ(ఎస్) 2013లో మినహాయించి గత 20 ఏళ్లలో కన్నడ ఓటరు ఎప్పుడూ స్పష్టమైన తీర్పు ఇవ్వలేదు. హోరాహోరి పోరు నేపథ్యంలో ఈసారి కూడా ఎవరికీ మెజారిటీ రాకపోవచ్చని సర్వేలు చెబుతున్నాయి. 224 సీట్లలో కాంగ్రెస్ 100కు అటూ ఇటుగా, బీజేపీ 90లోపు, జేడీ(ఎస్) 30 నుంచి 40 గెలుస్తాయని అంచనా. అదే జరిగితే కింగ్‌మేకర్‌గా మరోసారి చక్రం తిప్పాలని జేడీ(ఎస్) ఆశపడుతోంది. పాత మైసూరులోని 89 అసెంబ్లీ స్థానాల్లో కనీసం 30కి పైగా గెలుస్తామని ధీమాగా ఉంది. బీజేపీ, కాంగ్రెస్ రెబల్స్ తద్వారా మరిన్ని స్థానాలు తెచ్చిపెడతారని భావిస్తోంది. గుండెల్లో రె‘బెల్స్’ ► బీజేపీ కనీసం 20కి పైగా నియోజకవర్గాల్లో తిరుగుబాటును ఎదుర్కొంటోంది. ► సీనియర్లకు ఉద్వాసన పలికి కొత్తవారికి, యువతకు చాన్సివ్వాలన్న అధిష్టానం నిర్ణయం కాస్త బెడిసికొట్టినట్టు కన్పిస్తోందని పరిశీలకులు అంటున్నారు. ► మాజీ సీఎం జగదీశ్ శెట్టర్, ఉప ముఖ్యమంత్రి లక్ష్మణ సవదితో పాటు చాలామంది సీనియర్లు టికెట్ రాక పార్టీని వీడారు. ► వారిని కాంగ్రెస్ సాదరంగా ఆహ్వానించి టికెట్లిచ్చింది. ఇది ముఖ్యంగా ఉత్తర కర్ణాటకలో బీజేపీని బాగా దెబ్బ తీస్తుందంటున్నారు. ► రెబెల్స్ దెబ్బకు బీజేపీ ఓటు బ్యాంకుకు చిల్లి పడేలా కన్పిస్తోంది. ► మరీ నామినేషన్ల దాకా ఆగకుండా ఏ మూడు నెలల ముందో సీనియర్లతో మాట్లాడి ఈ నిర్ణయం తీసుకుని ఉండాల్సిందన్న భావన వ్యక్తమవుతోంది. -
Karnataka Assembly election 2023: కర్నాటకలో మెజార్టీకి మించి...
బెంగళూరు: కర్ణాటకలో అధికార పీఠాన్ని నిలబెట్టుకుంటామని బీజేపీ అగ్రనేత, కేంద్ర హోం మంత్రి అమిత్ షా ధీమా వ్యక్తంచేశారు. ‘‘మెజార్టీ కంటే 15 నుంచి 20 సీట్లు ఎక్కువే గెలుస్తాం. కొందరు సీనియర్ నేతలు పార్టీని వీడినా క్షేత్రస్థాయిలో మద్దతు ఏమాత్రం తగ్గలేదు. చరిత్ర చూసినా బీజేపీ రెబెల్స్ గెలిచిన సందర్భాలు లేవు. ఈసారీ అదే నిరూపితమవనుంది’’ అని శనివారం ఇండియాటుడేకు ఇచ్చిన ఇంటర్వ్యూలో జోస్యం చెప్పారు. రాహుల్ గాంధీపై ఎంపీగా అనర్హత వేటుపడటంపై బీజేపీని కాంగ్రెస్ పార్టీ విమర్శించడాన్ని ప్రస్తావిస్తూ.. ‘ దేశంలో ఏ కుటుంబం కూడా చట్టం కంటే గొప్పదికాదు. అన్నింటికంటే చట్టమే అత్యున్నతమైంది’ అని వ్యాఖ్యానించారు. ఎంపీ బంగ్లా ఖాళీచేస్తూ ఈ ఉదంతంలో బాధితుడినయ్యానని రాహుల్ చేసిన వ్యాఖ్యలపై షా స్పందించారు. ‘ ఓబీసీలను కించపరిచేలా మాట్లాడాలని రాహుల్‌ను మేం అడగలేదు. ఇప్పుడు క్షమాపణ చెప్పకూడదని నిర్ణయించుకుంది కూడా ఆయనే. ఏ చట్టం కింద అయితే ఆయన దోషిగా తేలారో ఆ చట్టం కాంగ్రెస్ హయాంలో రూపొందిందే. ఆ చట్టాన్ని ఉపసంహరించేందుకు నాటి ప్రధాని మన్మోహన్ ప్రయత్నిస్తే ఆర్డినెన్స్ పత్రాలు చించి రాహులే అడ్డుకున్నారు. ఇప్పుడు ‘బాధితుడిని’ అంటూ నాటకాలు ఆడొద్దు’ అని ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘ మోదీని విమర్శించారనే జమ్మూకశ్మీర్ మాజీ లెఫ్టినెంట్ గవర్నర్ సత్యపాల్ మాలిక్‌కు సీబీఐ సమన్లు జారీచేసిందనేది అబద్ధం. గతంలోనూ ప్రశ్నించేందుకు ఆయనను సీబీఐ పిలిచింది’ అని గుర్తుచేశారు. ఏటీఎంలా వాడుకున్న కాంగ్రెస్ ‘‘కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వంపై వస్తున్న అవినీతి ఆరోపణలు ఇంతవరకూ ఏ కోర్టులోనూ నిరూపణకాలేదు. ఇవన్నీ కాంగ్రెస్ కట్టుకథలు’’ అని అమిత్ షా అన్నారు. అధికారంలో ఉండగా కాంగ్రెసే రాష్ట్రాన్ని ‘ఏటీఎం’లా వాడుకుందని ఆరోపించారు. ‘‘యూపీఏ హయాంలో 2009–19లో కర్ణాటకకు కేవలం రూ.94 వేల కోట్ల నిధులొచ్చాయి. మా హయాంలో 2014–19లో ఏకంగా రూ.2.26 లక్షల కోట్ల నిధులు ఇచ్చి ఆదుకున్నాం. వాళ్లు పన్నులు, గ్రాంట్–ఎయిడ్ కింద రూ.22 వేల కోట్లు ఇస్తే మేం రూ.75 వేల కోట్లు ఇచ్చాం’’ అని చెప్పారు. -
కర్ణాటక బీజేపీకి వ్యతిరేకంగా.. రెబల్ స్వరం!
బెంగళూరు: అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా నెల ఉందనగా.. కర్ణాటక బీజేపీలో రెబల్ సెగ తాకే సూచనలు అందుతున్నాయి. ఈ మేరకు పార్టీ అధిష్టానం పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్న మాజీ సీఎం జగదీష్ షెట్లర్.. పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా ఎన్నికల బరిలో దిగనున్నట్లు సంకేతాలు అందించారు. పార్టీ టికెట్ ఇవ్వకుంటే స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని ప్రకటించారాయన. హుబ్బళ్లి(హుబ్లీ-ధార్వాడ్) నుంచి ఆరుసార్లు ఎమ్మెల్యేగా నెగ్గిన షెట్టర్‌కు ఈసారి టికెట్ విషయంలో బీజేపీ ప్రతికూలంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో నిన్న పార్టీ అధిష్టానం నుంచి పిలుపు అందుకున్న ఆయన.. ఇవాళ మీడియా ముందు తన అసహనం ప్రదర్శించారు. నేను బీజేపీ అధిష్టానాన్ని ఒకే ఒక ప్రశ్న అడుగుతున్నాను.. నేను ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచా. ప్రతీసారి 21 వేల ఓట్లకు పైచిలుకు ఆధిక్యంతో నెగ్గాను. నా కెరీర్లో ఎటువంటి మచ్చ లేదు. ఎలాంటి ఆరోపణలు లేవు. అలాంటప్పుడు నన్ను తప్పుకోమని, వేరే వాళ్లకు అవకాశం ఇవ్వమని ఎలా అడుగుతారు?. అందుకే నన్ను పోటీకి అనుమతించాలని, లేకుంటే పార్టీకి మేలు జరగదు అని ఆయన మీడియా ఎదుట అసంతృప్తిగా మాట్లాడుతూ వెళ్లిపోయారు. ఒకవేళ పోటీకి అనుమతించకుంటే మాత్రం.. స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల బరిలో దిగుతారా? అనే ప్రశ్నకు.. దానికి సమాధానం బీజేపీ అధిష్టాన నిర్ణయంపై ఆధారపడి ఉంటుందని తెలిపారు. బీజేపీ పట్ల విధేయతతో కొనసాగుతున్నా. తాజా సర్వేలు కూడా నా విజయావకాశాలను ధృవీకరించాయి. కానీ, అధిష్టానం నుంచి నాకు అందిన పిలుపు నన్ను నిరాశకు గురి చేసింది. టికెట్ ఇవ్వకుంటే కచ్చితంగా ఇండిపెండెంట్ క్యాండిడెట్‌గా ఎన్నికల్లో పోటీ చేస్తా అని తెలిపారాయన. జగదీష్ శివప్ప షెట్టర్.. కర్ణాటకకు 15వ ముఖ్యమంత్రిగా(2012-13 మధ్య) పని చేశారు. రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం ఈయనది. న్యాయవాద వృత్తిలో 20 ఏళ్లు కొనసాగి.. ఆపై రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. అసెంబ్లీ స్పీకర్‌గా, ఆపై యడియూరప్ప కేబినెట్లో మంత్రిగా పని చేశారు. కర్ణాటక బీజేపీ సంక్షోభంతో 2012 నుంచి ఏడాదిపాటు ముఖ్యమంత్రిగా కొనసాగారు. 2013 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ సీఎం అభ్యర్థిగా నిల్చున్న ఆయన.. పార్టీ నైతిక ఓటమి తర్వాత ప్రతిపక్ష నేతగా కొనసాగారు. కర్ణాటక ఎన్నికల కోసం బీజేపీ ఇంకా అభ్యర్థుల జాబితా విడుదల చేయలేదు. పార్టీ ఎన్నికల సంఘం ఈ వారంతంలో ఢిల్లీకి వెళ్లి ప్రధాని మోదీతో పాటు పార్టీ కీలక నేతలతో భేటీ అయ్యే అవకాశం కనిపిస్తోంది. ఆ తర్వాత అభ్యర్థుల జాబితా ప్రకటించవచ్చని తెలుస్తోంది. ఇదీ చదవండి: ఈశ్వరప్ప ఇక పోటీ చేయరట! -
ఎన్నికల వేళ.. బీజేపీలో ముసలం
సిమ్లా: ఎన్నికల ముందర హిమాచల్ ప్రదేశ్‌లో బీజేపీకి రెబల్స్ తలనొప్పులు వచ్చి పడ్డాయ్. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన నలుగురు మాజీ ఎమ్మెల్యేలను, ఓ మాజీ ఎంపీని పార్టీ నుంచి బహిష్కరించి ఒక్కరోజు గడవక ముందే ఇవాళ మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షుడు రామ్ సింగ్‌ను పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు మంగళవారం ప్రకటించింది. కులు అసెంబ్లీ సీటుకుగానూ పార్టీ ప్రకటించిన అధికారిక అభ్యర్థి నరోత్తమ్ థాకూర్‌పై స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాలని రామ్ సింగ్ తీసుకున్న నిర్ణయమే ఇందుకు కారణం. ఈ మేరకు రామ్ సింగ్‌కు ఉన్న పార్టీ ప్రాథమిక సభ్యత్వాన్ని ఆరేళ్ల పాటు సస్పెండ్ చేస్తున్నట్లు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సురేష్ కశ్యప్ ప్రకటించారు. అంతకు ముందు మరో మాజీ ఎమ్మెల్యే మహేశ్వర్ సింగ్ సైతం ఇలాగే స్వతంత్ర అభ్యర్థిగా కులు నుంచి పోటీకి దిగాలని అనుకున్నారు. అయితే.. పార్టీ నేతల జోక్యంతో ఆయన వెనక్కి తగ్గారు. జై రాం థాకూర్ నేతృత్వంలోని ప్రభుత్వం హిమాచల్ ప్రదేశ్‌లో కొలువు దీరాక.. రామ్ సింగ్‌కు ఆ రాష్ట్ర మార్కెటింగ్ కార్పొరేషన్ వైస్ చైర్మన్ పదవి కట్టబెట్టారు. అయితే.. ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో టికెట్ నిరాకరణతో.. రెబల్‌గా మారిపోయారు. అధికార బీజేపీ తరపున ఈసారి ఎన్నికల్లో కేబినెట్ మంత్రితో సహా 11 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్లు దక్కలేదు. దీంతో పార్టీలో తిరుగుబాటు మొదలైంది. క్షేత్ర స్థాయి కార్యకర్తలు మొదలు.. కీలక నేతల దాకా బీజేపీకి గుడ్ బై చెప్పారు. వీళ్లలో కొందరు పార్టీలు మారగా.. మరికొందరు స్వతంత్రులుగా బరిలోకి దిగేందుకు సిద్ధమయ్యారు. ఇదిలా ఉంటే.. 68 అసెంబ్లీ స్థానాలున్న హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం ఇదివరకే షెడ్యూల్ విడుదల చేసింది. నవంబరు 12న పోలింగ్ నిర్వహిస్తామని, ఒకే దశలో ఎన్నికల నిర్వహణ ఉంటుందని, డిసెంబర్ 8వ తేదీన ఫలితాలు వెల్లడి కానున్నాయి. -
రిషి సునాక్‌ను ప్రధాని చేసేందుకు కుట్ర!
లండన్: యూకే సంక్షోభం నడుమ ప్రధాని పీఠం నుంచి లిజ్ ట్రస్‌ను దించేసి.. రిషి సునాక్‌తో భర్తీ చేయడానికి రెబెల్స్ పన్నాగం పన్నినట్లు తెలుస్తోంది. ఈ మేరకు మెజార్టీ కన్జర్వేటివ్ పార్టీ రెబల్స్ అభిప్రాయంతో కూడిన ఓ నివేదిక బహిర్గతమైంది. ట్రస్ సారథ్యంలో ప్రవేశపెట్టిన మినీ బడ్జెట్‌తో దేశ ఆర్థిక వ్యవస్థ కుదేలై గందరగోళానికి దారి తీసింది. ఈ బడ్జెట్‌తో దేశంలో ఆర్థిక మాంద్యం తలెత్తుతుందన్న ఆందోళనలు అధికమయ్యాయి. ఊహించని ఈ పరిణామాలతో ఏకంగా తన మద్దతుదారు, ఆర్థిక మంత్రి అయిన క్వాసీని పదవి నుంచి తప్పించి.. ఆ స్థానంలో జెరెమీ హంట్‌ను కొత్త ఆర్థిక మంత్రిగా నియమించారామె. అయితే.. కన్జర్వేటివ్ పార్టీలో ఈ పరిణామాలేవీ సహించడం లేదు. ప్రత్యేకించి రెబల్స్ మాత్రం లిజ్ ట్రస్‌ను పార్టీ నేతగా తప్పించి.. మాజీ ప్రధాని ప్రత్యర్థి రిషి సునాక్‌ను గద్దె ఎక్కించే యత్నం జరుగుతోందని ది టైమ్స్ YouGov పోల్ వెల్లడించింది. అంతేకాదు కన్జర్వేటివ్‌లో సగం మంది తాము తప్పుడు అభ్యర్థిని ఎన్నుకున్నామనే భావనలోకి చేరుకున్నట్లు ఆ పోల్ సర్వే తెలిపింది. సుమారు 62 శాతం మంది తమది రాంగ్ ఛాయిస్ అయ్యిందనే పశ్చాత్తంలో ఉండిపోయారట. ఇక.. 15 శాతం సభ్యులు మాత్రం తమ నిర్ణయం సరైందే అనే అభిప్రాయం వ్యక్తం చేశారట. అదే సమయంలో రిషి సునాక్‌తో పాటు ప్రత్యామ్నాయ అభ్యర్థుల పరిశీలన సైతం టోరీ సభ్యులు ప్రారంభించారని.. అందులో ప్రధాని అభ్యర్థి రేసులో మూడో స్థానంలో నిలిచిన పెన్నీ మోర్డాంట్ సైతం ఉన్నారని ఆ పోల్ వెల్లడించింది. అయితే యూకే చట్టాల ప్రకారం టెక్నికల్‌గా లిజ్ ట్రస్‌కి ఏడాదిపాటు పదవి గండం ఎదురు కాదు. ఒకవేళ 1922 బ్యాక్‌బెంచ్ ఎంపీల కమిటీ తన రూల్స్ మారిస్తే గనుక ట్రస్‌కు సవాల్ ఎదురుకావొచ్చు. అప్పుడు కన్జర్వేటివ్ పార్టీ సభ్యుల మద్దతుతో రిషి సునాక్, పెన్నీ మోర్డాంట్‌లు ప్రధాని, ఉపప్రధాని పదవులను అందుకోవచ్చు. ఇదికాగా.. నేరుగా పెన్నీ మోర్డాంట్ ప్రధాని అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. కానీ, ఇదంతా సులభమైన విషయమేమీ కాదని మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్ మద్దతుదారు, ఎంపీ నాడైన్ డోరీస్ చెప్తున్నారు. అదే సమయంలో అధికార మార్పు అనుకున్నంత ఈజీనే అంటూ కన్జర్వేటివ్ సీనియర్ సభ్యులు ఒకరు చేసిన వ్యాఖ్యల్ని ది టైమ్స్ కథనం ఉటంకించింది. ఇదీ చదవండి: ఉక్రెయిన్‌తో యుద్ధంపై పుతిన్ కీలక ప్రకటన -
శివసేనకు వెన్నుపోటు పొడిచింది ఆయనే!
Maharashtra Political Crisis ముంబై: శివసేనలో సంక్షోభానికి మూల కారకుడు సంజయ్ రౌత్ అనేది ఆ పార్టీ రెబల్స్ ఆరోపణ. అంతేకాదు ఎన్సీపీతో కుమ్మక్కై ఆయన తీరని ద్రోహం చేశాడంటూ మండిపడుతోంది. ‘‘మేం ఎవరినీ వెన్నుపోటు పొడవలేదు. ఉద్దవ్ థాక్రే అంటే మాకు విపరీతమైన గౌరవం ఉంది. సంజయ్ రౌత్ ఎన్సీపీకి విధేయుడిగా వ్యవహరించాడు. అందుకే శివసేనకు వెన్నుపోటు పొడిచాడు’’ అని రెబల్స్ తరపున ఎమ్మెల్యే దీపక్ కేసర్కర్ గురువారం ఉదయం మీడియాతో స్పందించారు. సొంత మనుషులే శివసేనను వెన్నుపోటు పొడిచారని, తనపై ఈడీ కేసు కూడా రాజకీయ ప్రతీకారమంటూ తాజాగా సంజయ్ రౌత్ ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే.. దీపక్ కౌంటర్ ఇచ్చారు. ‘‘ఉద్దవ్ థాక్రే కుటుంబానికి మేం వ్యతిరేకం కాదు. మహా వికాస్ అగాఢితో తెగదెంపులు చేసుకుంటే మేం ఆయనతో చర్చించేవాళ్లం. ఆయనకు వ్యతిరేకంగా కోర్టుకు వెళ్లేవాళ్లం కూడా కాదు. ఇప్పటికీ మేం థాక్రేను గౌరవిస్తున్నాం’’ అని దీపక్ మీడియా సమావేశంలో వెల్లడించారు. ఏక్నాథ్ షిండే గోవా నుంచి ముంబైకి బయలుదేరారు. ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకున్నా.. అది రాష్ట్ర ప్రయోజనాల కోసమే. మేం ఎవరినీ వెన్నుపోటు పొడవలేదు. కేవలం ప్రజల్లో సానుభూతి కోసమే సంజయ్ రౌత్ అలాంటి ప్రకటనలు చేస్తున్నారు. ఉద్దవ్ థాక్రే నిన్న(బుధవారం) రాజీనామా చేశారు. కానీ, మాకు ఆయన్ని తప్పించే ఉద్దేశం లేదు. ఇప్పటికీ మేం శివసేనలోనే ఉన్నాం. ఆయన్ని అగౌరవపరచడం, బాధపెట్టడం మా ఉద్దేశాలు ఎంత మాత్రం కాదు.. అని రెబల్స్ తరపున దీపక్ కేసర్కర్ మీడియాకు తెలిపారు. Maharashtra BJP leader Devendra Fadnavis will decide the oath-taking date. It is the prerogative of the Governor to give him that date. Our negotiations have already started and we will form a govt: Shiv Sena MLA Deepak Kesarkar, spokesperson of the Eknath Shinde camp pic.twitter.com/8skbQ8IgEf — ANI (@ANI) June 30, 2022 చదవండి: థాక్రే రాజీనామాపై సంతోషంగా లేం! -
థాక్రే రాజీనామాపై సంతోషంగా లేం: రెబల్స్
ముంబై: మహారాష్ట్ర రాజకీయం కీలక మలుపు తిరిగి వేళ.. శివసేన రెబల్స్ గువాహతి నుంచి ముంబైకి కాకుండా నేరుగా గోవాకు వెళ్లడం ఆసక్తికర చర్చకు దారి తీసింది. ఉద్ధవ్ థాక్రే ముఖ్యమంత్రి పదవికి.. ఎమ్మెల్యేకు రాజీనామా, బీజేపీ ప్రభుత్వ ఏర్పాటు ప్రయత్నాలు దగ్గర పడిన టైంలోనే తిరిగి స్వరాష్ట్రంలో అడుగుపెట్టాలని, మద్ధతు ప్రకటించాలని షిండే వర్గం భావిస్తోంది. అయితే.. ముఖ్యమంత్రి పదవికి ఉద్దవ్‌థాక్రే రాజీనామా చేయడం తమకు సంతోషాన్ని ఇవ్వడం లేదని రెబల్స్‌లో కొందరు భావిస్తున్నారు. ఉద్దవ్ థాక్రే మేం లేవనెత్తిన అంశాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేకపోయారు. ఆయన రాజీనామా మాకేం సంతోషాన్ని ఇవ్వడం లేదు. ఎన్సీపీ, కాంగ్రెస్‌తో పోరాడుతున్నప్పుడు.. మా నాయకుడిపై కూడా కోపం తెచ్చుకున్నందుకు మేమంతా బాధపడ్డాము.. అందుకు కారణం.. ఎన్సీపీ, సంజయ్ రౌత్. ప్రతీరోజూ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాళ్లు చేసిన కామెంట్లే.. మాలో అసంతృప్తిని రగిల్చాయి. వాళ్ల వల్లే కేంద్రానికి రాష్ట్రానికి మధ్య సంబంధాలు చెడిపోయి.. పొసగని పరిస్థితులు నెలకొన్నాయి. పైగా సంజయ్ రౌత్ జోక్యాలు ఎక్కువై పోవడం పట్ల మాలో చాలామందికి అసంతృప్తిగా ఉంది. కూటమి నుంచి బయటకు వచ్చేయడంతో పాటు బీజేపీతో జట్టు కట్టడంపై మేమంతా ఏకతాటిగా నిలిచి డిమాండ్ చేశాం అని రెబల్ ఎమ్మెల్యే దీపక్ కేసర్‌ఖర్ ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ఎనిమిది రోజుల కిందట మొదలైన మహారాజకీయ సంక్షోభం.. బుధవారం రాత్రి ఉద్దవ్ థాక్రే రాజీనామాతో తెర పడింది. మహా వికాస్ అగాఢి కూటమిని వ్యతిరేకిస్తూ కొంత మంది ఎమ్మెల్యేలతో గుజరాత్ సూరత్‌కు చేరుకున్నారు షిండే. ఆ సమయంలో ముంబై నుంచి మంతనాలు మొదలుకావడంతో.. రెబల్ ఎమ్మెల్యేలు చేజారిపోకుండా ఉండేందుకు గువాహతి(అస్సాం)కు షిప్ట్ చేశారు. అక్కడ మరికొందరు తిరుగుబాటుకు మద్ధతు ప్రకటించారు. నలభై మంది శివ సేన ఎమ్మెల్యేలు పది మంది ఇతరులు.. మొత్తంగా 50 మంది ఎమ్మెల్యేల మద్ధతు కూటగట్టుకున్నాడు ఏక్నాథ్ షిండే. చదవండి: మహా రాజకీయం.. సరిగ్గా రెండున్నరేళ్ల క్రితం! -
రెబెల్స్ ఎమ్మెల్యేలకు సీఎం ఉద్దవ్ భావోద్వేగ లేఖ!
ముంబై: మహారాష్ట్రలో మొదలైన రాజకీయ సంక్షోభం రోజుకో రకంగా మలుపు తిరుగుతోంది. ఈ పోరులో అంతిమ విజయం కోసం ఇరు వర్గాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. తాజాగా సీఎం ఉద్ధవ్ ఠాక్రే తిరుగుబాటు ఎమ్మెల్యేలను రప్పించేందుకు చివరి ప్రయత్నంగా వారికి భావోద్వేగంగా లేఖ రాశారు. అందులో రెబెల్ ఎమ్మెల్యేలు తిరిగి ముంబైకి వచ్చేయాలని విజ్ఞప్తి చేశారు. ఆ లేఖలో ఏముందంటే.. రెబెల్ ఎమ్మెల్యేలకు రాసిన లేఖలో.. “మీరు తిరుగుబాటు చేసినా, ఇప్పటికీ మీరంతా శివసేనతోనే ఉన్నారు. మీలో చాలా మంది మాతో ఇంకా టచ్‌లో ఉన్నారు. మీ గ్రూప్‌లోని కొంతమంది ఎమ్మెల్యేల కుటుంబ సభ్యులు కూడా మమ్మల్ని సంప్రదించి వారి అభిప్రాయాలను మాకు తెలియజేసారు' అని ఉద్దవ్ లేఖలో పేర్కొన్నారు. రెబెల్ ఎమ్మెల్యేలను శివసేన వదులుకోలేదని, వారంతా ముంబై వచ్చి తనతో మాట్లాడాలని రెబెల్స్‌కు లేఖ ద్వారా ఠాక్రే సందేశం పంపారు. ‘మీకు సమస్య ఉంటే చర్చలతో పరిష్కరించుకుందాం తప్ప ఇది సరైన దారి కాదు. గత కొద్ది రోజులుగా గౌహతిలో ఉంటున్న రెబెల్ ఎమ్మెల్యేల గురించి రోజుకో కొత్త సమాచారం బయటకు వస్తోంది. శివసేన కుటుంబ అధినేతగా నేను మీ మనోభావాలను గౌరవిస్తాను, ముందుగా ఈ గందరగోళం నుంచి బయటపడండి. మిమ్మల్ని కొందరు తప్పుదోవ పట్టిస్తున్నారు, దాని నుంచి బయటపడాలని’ ఠాక్రే ఆ లేఖలో సూచించారు. Maharashtra CM & Shiv Sena chief Uddhav Thackeray appeals to party MLAs in Guwahati, to come & discuss; said "Many of you are in touch with us, you're still in Shiv Sena at heart; family members of some MLAs have also contacted me & conveyed their sentiments to me..." (file pic) pic.twitter.com/6pfhtQs7Go — ANI (@ANI) June 28, 2022 చదవండి: ఢిల్లీకి మారిన మహారాష్ట్ర రాజకీయాలు.. -
సంజయ్ రౌత్‌కు ఈడీ సమన్లు.. షిండే కొడుకు వెటకారం
ముంబై: మహారాష్ట్ర రాజకీయ సంక్షోభం నడుమ.. మరో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. శివ సేన కీలక నేత, రాజ్యసభ ఎంపీ సంజయ్ రౌత్‌కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ED) తమ ఎదుట హాజరుకావాలని ఇవాళ నోటీసులు జారీ చేసింది. మనీలాండరింగ్ కేసు ఆరోపణల నేపథ్యంలో.. సంజయ్ రౌత్‌ను ప్రశ్నించాల్సి ఉందని ముంబైలోని ఈడీ కార్యాలయం తెలిపింది. ఈ మేరకు మంగళవారం తమ ఎదుట హాజరు కావాలని సమన్లలో పేర్కొంది ఈడీ. పాత్రా చావ్ల్ భూ కుంభకోణం కేసుకు సంబంధించి.. 1,034 కోట్ల గోల్మాల్ జరిగిందనే ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసుకు సంబంధించి.. ఏప్రిల్ నెలలో సంజయ్ రౌత్‌కు సంబంధించి ఆస్తులను ఈడీ జప్తు చేసింది. ‘‘నేను భయపడే రకం కాదు. సీజ్ చేస్తే.. చేస్కోండి, చంపుకోండి.. కాల్చేయండి.. లేదంటే జైలుకు పంపండి’’ అంటూ ఆ సమయంలో ప్రకటన కూడా చేశారు. ఇదిలా ఉంటే.. సంజయ్ రౌత్‌కు ఈడీ నోటీసులపై ఏక్నాథ్ షిండే తనయుడు, ఎంపీ శ్రీకాంత్ షిండే వెటకారం ప్రదర్శించారు. ‘‘ఈడీ సమన్ల నేపథ్యంలో సంజయ్ రౌత్‌కు నా శుభాకాంక్షలు’’ అంటూ ప్రకటన ఇచ్చాడు. అలాగే.. అనర్హత విషయంలో న్యాయస్థానంలో జరుగుతున్న పోరులో రెబల్స్ విజయం సాధిస్తారని ధీమా ప్రకటించాడు. మహారాష్ట్ర ప్రజలు మొత్తం పరిణామాలు చూస్తున్నారని, సరైన టైంలో సరైన బదులు ఇస్తారని పేర్కొన్నాడు. రెబల్ ఎమ్మెల్యేలంతా ఇవాళ చర్చ జరిపి.. ఒక తుదినిర్ణయానికి వచ్చే అవకాశం ఉందని శ్రీకాంత్ షిండే పేర్కొన్నాడు. సంజయ్ రౌత్‌కు ఈడీ నోటీసులపై థాక్రే మద్ధతుదారులు స్పందించారు. షిండే తిరుగుబాటు నేపథ్యంలోనే.. దర్యాప్తు సంస్థలపై ఒత్తిడి పెరుగుతోందంటూ పరోక్షంగా కేంద్రంలోని బీజేపీపై విమర్శలు గుప్పిస్తున్నారు. శివ సేన నేత, ఆ రాష్ట్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఏక్నాథ్ షిండే తిరుగుబాటుపై మొదటి నుంచి పార్టీ తరపున గట్టిగా గొంతుక వినిపిస్తున్నారు సంజయ్ రౌత్. ఈ క్రమంలో ఆయనకు ఈడీ నోటీసులు పంపడం ఆసక్తికరంగా మారింది. అయితే శివ సేనలో చీలికలకు ఈడీ భయమే కారణమని, ఈడీ ఒత్తిడితో పార్టీని వీడేవాళ్లు నిజమైన బాలాసాహెబ్ భక్తులు కాదని సంజయ్ రౌత్ ఇదివరకే ప్రకటించారు. చదవండి: రెబల్స్‌కు ఆదిత్య థాక్రే వార్నింగ్ -
అనర్హత వేటు.. షిండే వర్గంలో తీవ్ర ఉత్కంఠ
ముంబై: శివ సేన రెబల్ నేత ఏక్నాథ్ షిండే వైఖరితో.. మహారాష్ట్ర రాజకీయాలు నరాలు తెగే ఉత్కంఠ రేకెత్తిస్తున్నాయి. పార్టీని వీడమని, సొంత కుంపటి ఊసే ఉండదంటూ.. ఎన్సీపీ-కాంగ్రెస్ కూటమి నుంచి బయటకు వచ్చేయాలంటూ ముఖ్యమంత్రి ఉద్దవ్ థాక్రేకు అల్టిమేట్ జారీ చేశాడు షిండే. ఈ తరుణంలో సీఎం పదవికి రాజీనామా చేయకుండానే.. కుటుంబంతో పాటు సీఎం అధికార భవనాన్ని వీడాడు సీఎం థాక్రే. అయితే.. షిండే వర్గం ముందర ఇప్పుడు మరో గండం పొంచి ఉంది. అసెంబ్లీలో శివ సేన 55 సీట్లతో అడుగుపెట్టింది. అయితే ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం.. ఇప్పుడు షిండే వర్గంపై అనర్హత వేటు పడే అవకాశం ఉంది. అది తప్పించుకోవాలంటే.. తన బలం 37గా నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది షిండేకి. బుధవారం శివ సేన రెబల్ ఎమ్మెల్యే ఏక్నాథ్ షిండే.. మహారాష్ట్ర గవర్నర్‌కు పంపిన లేఖలో 34 మంది మద్దతు ఎమ్మెల్యేల(షిండేతో సహా) సంతకం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే అందులో నలుగురు శివ సేన ఎమ్మెల్యేలు కాదు. శివ సేన ఎమ్మెల్యే నితిన్ దేశ్‌ముఖ్.. తిరిగి నిన్న సాయంత్రం నాటకీయ పరిణామాల నడుమ థాక్రే గూటికి చేరుకున్నారు. ఈ తరుణంలో.. గురువారం ఉదయం మరో నలుగురు రెబల్స్ గ్రూపుతో చేరినట్లు తెలుస్తోంది. ఈ లెక్కలతో షిండే వర్గం అనర్హత గండం గట్టెక్కుతుందా? అనేది ఉత్కంఠగా మారింది. A total of 42 Maharashtra MLAs are present with Eknath Shinde at Radisson Blu Hotel in Guwahati, Assam. This includes 34 MLAs from Shiv Sena and 8 Independent MLAs: Sources#MaharashtraCrisis — ANI (@ANI) June 23, 2022 -
మరో మలుపు.. రష్యా బలగాలకు తోడైన రెబల్స్
ఉక్రెయిన్ యుద్ధం ఎనిమిదవ రోజు పరిణామాలు రష్యాకు పూర్తి అనుకూలంగా మారుతున్నాయి. ప్రధాన పట్టణాలపై పట్టు సాధించే క్రమంలో విజయవంతం అవుతున్న పుతిన్ సేన.. పెనువిధ్వంసంతో దూసుకుపోతోంది. రష్యా రక్షణ శాఖ కథనాల ప్రకారం.. ఉక్రెయిన్ ప్రధాన పట్టణాల్లో 70 శాతంపైగా రష్యా స్వాధీనంలోకి వచ్చేశాయి. ఒకవైపు భూభాగం, మరోవైపు గగనతలం.. ఈ ఉదయం నుంచి పోర్ట్ ఏరియాల్లోనూ దాడులను ఉధృతం చేసేసింది. ఇదిలా ఉండగా.. మరియూపోల్ నగరంలో రష్యా బలగాల స్థానే ఉక్రెయిన్ డోనెట్స్క్ రెబల్స్ సైన్యం, ఉక్రెయిన్ సైన్యంతో పోరాటం మొదలుపెట్టింది. వాస్తవానికి ఈ పోరులో రష్యా సైన్యానికి బెలారస్ తోడవుతుందని అంతా భావించారు. కానీ, ఆ అంచనాలను తలకిందులు చేస్తూ.. బెలారస్ కంటే ముందే ఉక్రెయిన్ రెబల్స్ ఆర్మీ రష్యాకు పూర్తిస్థాయి మద్ధతుతో దిగింది. ఉక్రెయిన్ రష్యా హస్తగతం అయ్యేదాకా పోరు ఆపమని ఈ సందర్భంగా డోనెట్స్క్ ఆర్మీ ఛీఫ్ ప్రకటించారు. -
తిరుగుబాటుదారుల బీభత్సం.. 30 మంది మృతి
Rebel Attack In Central African Republic: సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్లో తిరుగుబాటుదారులు తీవ్ర బీభత్సం సృష్టించారు. తిరుగుబాటుదారుల దాడిలో 30 మంది మృతి చెందారు. అందులో 28 మంది స్థానిక పౌరులు, ఇద్దరు సైనికులు ఉన్నారని అధికారులు ప్రకటించారు. రాజధాని బాంగూయ్‌కు ఉత్తరాన 500 కిలోమీటర్ల దూరంలో కామెరూన్ సరిహద్దుకు సమీపంలో ఉన్న కైటా, బేయెన్‌గౌ గ్రామాల్లో తిరుగుబాటుదారులు ఆదివారం ఏకకాలంలో దాడులకు తెగపడ్డారు. చదవండి: కఠిన నిబంధనలు అమల్లోకి.. ఇకపై అలాంటి వేషాలు కుదరవు! దాడులు జరుగుతున్న సమయంలో పలువురు కామెరూన్‌కు పారిపోయారని అధికారులు వెల్లడించారు. 2013లో సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్లో తిరుగుబాటుదారుల అంతర్యుద్ధం జరిగిన విషయం తెలిసిందే. గత మూడేళ్లుగా వివాదం సద్దుమణిగినప్పటికీ చాలా భూభాగం తిరుగుబాటుదారుల చేతుల్తోనే ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. -
తాలిబన్లకు గట్టి ఎదురుదెబ్బ.. జిల్లా చీఫ్ సహా మరో 50 మంది హతం..?
కాబుల్: అఫ్గానిస్తాన్ మొత్తాన్ని తమ స్వాధీనంలోకి తెచ్చుకున్న తాలిబన్లకు పంజ్‌షీర్ ఫ్రావిన్స్‌లోని ప్రతిఘటనవాదులు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు. ఇప్పటికే 300కిపైగా తాలిబన్లను మట్టుబెట్టిన అహ్మద్ మసూద్ నేతృత్వంలోని పంజ్‌షీర్ రెబెల్స్.. అంద్రాబ్ ప్రాంతంలో సోమవారం జరిగిన ప్రతిఘటన దాడుల్లో తాలిబన్ బాను జిల్లా చీఫ్ సహా మరో 50 మంది తాలిబన్ ఫైటర్లను అంతమొందించారని తెలుస్తుంది. మరో 20 మంది తాలిబన్లను రెబెల్స్ ఫోర్స్ బందీ చేసినట్లు అంతర్జాతీయ మీడియా సమాచారం. ఈ దాడుల్లో ఓ రెబల్ ఫైటర్ సైతం మరణించినట్లు మరో ఆరుగురు గాయపడినట్లు తెలుస్తోంది. తాలిబన్ సైన్యం భారీ ఆయుధాలతో పంజ్‌షీర్ ఫ్రావిన్స్‌ను చుట్టుముట్టినప్పటికీ.. చర్చల ద్వారానే సమస్య పరిష్కారానికి ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తుంది. అయితే తాలిబన్లకు లొంగే ప్రసక్తే లేదని పంజ్‌షీర్ ప్రజలు ప్రకటించడం విశేషం. మరోవైపు తాలిబన్లతో పోరులో పంజ్ షీర్ ఫైటర్స్‌కు ఆఫ్ఘన్ సైన్యం మద్దతుగా నిలబడింది. తాలిబన్లు, అఫ్గాన్ సైన్యం మధ్య భీకర పోరుతో ఆ దేశ దక్షిణ ప్రాంతంలోని ఆంద్రాబ్ ఫ్రావిన్స్ అల్లకల్లోలంగా మారింది. చదవండి: అఫ్గాన్ నుంచి భారత్‌కు వచ్చిన 146 మందిలో ఇద్దరికి కరోనా -
రెబల్స్‌తో పోరు.. చాద్ అధ్యక్షుడి దారుణ హత్య
ఎండ్జమీనా: మధ్య ఆఫ్రికా దేశం చాద్‌ను మూడు దశబ్దాల పాటు పరిపాలించిన అధ్యక్షుడు ఇద్రిస్ దెబీ ఇత్నో మంగళవారం హత్యకు గురయ్యారు. ఈ విషయాన్ని ఆ దేశ ఆర్మీ వెల్లడించింది. రెబల్స్‌తో పోరు సందర్భంగా యుద్ధభూమిలో ఆయన మరణించినట్లు తెలిపింది. ఏప్రిల్ 11న చాద్‌లో అధ్యక్ష ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో ఆయన గెలుపొందినట్లు ప్రకటన వచ్చిన కొద్ది గంటల్లోనే ఆయన హత్యకు గురి కావడం గమనార్హం. ఈ నేపథ్యంలో, 18 నెలల ట్రాన్సిషనల్ కౌన్సిల్‌ను ఆయన కుమారుడైన మహమత్ ఇద్రిస్ ఇత్మో (37) నడిపిస్తారని ఆర్మీ ప్రకటించింది. అధ్యక్షుడి మరణానికి కారణమైన రెబల్స్ పక్క దేశమైన లిబియాలో శిక్షణ తీసుకొని వచ్చినట్లు ఆర్మీ భావిస్తోంది. ఎన్నికలు జరిగిన 11నే వారు ఉత్తర చాద్‌లోకి అడుగు పెట్టినట్లు అభిప్రాయపడుతోంది. ఇద్రిస్ దెబీ 1990లో గద్దెనెక్కారు. అప్పటి నుంచి చాద్‌ను పాలిస్తున్నారు. చదవండి: రష్యా సర్జికల్ స్ట్రైక్: 200 ఉగ్రవాదులు ఖతం -
రెబల్స్ పై బీజేపీ సస్పెన్షన్ వేటు
శ్రీనగర్: ఉన్నత పదవుల్లో ఉండి పార్టీ అభివృద్ధికి తోడ్పడాల్సిన నేతలే ఇతరులకు అనుకూలంగా వ్యవహరించారంటూ బీజేపీ అధిష్టానం సీరియస్ అయ్యింది. పంచాయతీ ఎన్నికల్లో పార్టీకి వ్యతిరేకంగా పనిచేశారన్న ఆరోపణలతో 10 మందిపై వేటు వేసింది. ఒక పార్టీలో ఉంటూ వేరొకరికి కొమ్ముకాయడాన్ని తీవ్రంగా పరిగణించిన జమ్మూ కశ్మీర్ కార్యవర్గం గురువారం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. జిల్లా అభివృద్ధి మండలి(డిసిసి)తో పాటు పంచాయతీ ఎన్నికల్లో పార్టీకి వ్యతిరేకంగా పనిచేసినందుకు వారిపై వేటు వేసింది. ఈ విషయం గురించి స్థానిక బీజేపీ నేత ఒకరు మాట్లాడుతూ.. ‘‘ఇలాంటి చర్యలు కార్యకర్తలపై చెడు ప్రభావం చూపిస్తాయి. పార్టీ ప్రతిష్టను దెబ్బతీసే విధంగా క్రమశిక్షణ ఉల్లంఘన చర్యలకు పాల్పడిన వారిని పార్టీ నుంచి బహిష్కరించాలని అధిష్టానం నిర్ణయించింది. పంచాయతీ ఎన్నికల్లో పార్టీకి వ్యతిరేకంగా పనిచేసిన వారి ప్రాథమిక సభ్యత్వాన్ని రద్దు చేయడం జరిగింది. క్రమశిక్షణారాహిత్యం ప్రదర్శిస్తే సహించబోమన్న సంకేతాలు ఇచ్చేందుకు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు’’ అని పేర్కొన్నారు. సస్పెన్షన్‌కు గురైన నేతలు: పార్టీ జనరల్ సెక్రటరీ సంతోష్ కుమారీ, సతీష్ శర్మ, మకన్ లాల్ జమోరీయా, నీనా రకవాల్, గరిమల్ సింగ్, లోకేష్ సంబ్రియా, తీరత్ సింగ్, రన్బీర్ సింగ్ తదితర నేతలు సస్పెన్షన్‌కు గురైన జాబితాలో ఉన్నారు. మొత్తం పది మంది నేతల్లో 8 మంది పంచాయితీ ఎన్నికల్లో పోటీ చేసి పార్టీ ప్రకటించిన అభ్యర్థులకు వ్యతిరేకంగా ప్రచారం చేయడంతో పార్టీకి నష్టం వాటిల్లిందని పార్టీ వీరిని సస్పెండ్ చేసింది. -
కాంగ్రెస్‌లో రెబెల్స్ వద్దు
సాక్షి, హైదరాబాద్: మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి రెబెల్స్ ఉండొద్దని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పార్టీ శ్రేణులను కోరారు. ఈ ఎన్నికల్లో గెలుపు పార్టీకి చాలా కీలకమని, నేతలు సమన్వయంతో వ్యవహరించాలని, ఒకరి కంటే ఎక్కువ మంది కాంగ్రెస్ అభ్యర్థులు నామి నేషన్లు దాఖలు చేసుకుంటే అధికారిక అభ్యర్థి మినహా అందరూ ఉపసంహరించుకోవాలని ఆయన సూచించారు. మున్సిపల్ ఎన్నికల వ్యూహంపై శనివారం గాంధీభవన్ నుంచి ఆయన పట్టణ, నగర కాంగ్రెస్ నేతల తో టెలీ కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ఈ సందర్భంగా ఉత్తమ్ మాట్లాడుతూ పట్టణ ప్రాంతాలను గత ఆరేళ్లుగా టీఆర్ఎస్ ఏ విధంగా నిర్లక్ష్యం చేసిందో ప్రజలకు వివరంగా చెప్పా లని కోరారు. రాష్ట్రంలో మున్సిపాలిటీల పరిస్థితి బాగాలేదని అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజీ ఆఫ్ ఇండియా (ఆస్కీ) నివేదిక ఇచ్చిందని, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు నిధులు కేటాయించాలని ఆ నివేదికలో సూచిం చిందని ఉత్తమ్ చెప్పారు. కానీ టీఆర్ఎస్ ప్రభు త్వం ఒక్క రూపాయి కూడా మున్సిపాలిటీలకు నిధులు ఇవ్వకపోగా, కేంద్రం నుంచి పట్టణ స్థానిక సంస్థలకు వచ్చే నిధులను కూడా ఇతర అవసరాలకు వాడుకుని కోత పెట్టిందన్నారు. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ను ఓడించి షాక్ ఇస్తేనే కేసీఆర్‌కు గుణపాఠం వస్తుందన్నారు. బీజేపీ–టీఆర్ఎస్–ఎంఐఎం మ్యాచ్ ఫిక్సింగ్ రాజకీయాలను కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాలని పార్టీ శ్రేణులను ఉత్తమ్ కోరారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే ఆయా మున్సిపాలిటీల్లో ఎలాంటి అభివృద్ధి చేస్తామో ప్రజలకు చెప్పి ఓట్లడగాలని సూచించారు. దేశ వ్యాప్తంగా కాంగ్రెస్‌కు ఇటీవలి ఎన్నికల్లో మంచి ఫలితాలొచ్చాయని, చాలా చోట్ల బీజేపీని గద్దెదించి కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వాలను ఏర్పాటు చేసిన విషయాన్ని కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరారు. -
రెబెల్స్‌కు బుజ్జగింపులు
సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్లో రెబెల్స్ సెగ చల్లారట్లేదు. పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ స్వయంగా రంగంలో దిగి వారిని బుజ్జగించే పనిలో పడ్డారు. రెండు రోజుల ఢిల్లీ పర్యటన ముగించుకుని శుక్రవారం సాయం త్రం తిరిగొచ్చి.. తిరుగుబాటు అభ్యర్థుల సమస్య తీవ్రంగా ఉన్న పురపాలికలకు సంబంధించిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, పార్టీ నేతలను శనివారం తెలంగాణ భవన్‌కు పిలుపించుకుని వేర్వేరుగా మాట్లాడారు. పార్టీపరంగా స్థానికంగా ఉన్న సమస్యలేంటి.. రెబెల్స్ సమస్య ఎందు కు ఎక్కువగా ఉందని ఆరా తీశారు. తిరుగుబా టు అభ్యర్థులను వీలైనంత త్వరగా బుజ్జగించి నామినేషన్లు ఉప సంహరించుకునేలా ఒప్పించాలని పార్టీ నేతలను ఆదేశించారు. పోటీ నుంచి వైదొలిగే రెబెల్స్‌కు పార్టీలో గౌర వం, సముచిత స్థానం ఉంటుందని భరోసా కల్పించాలని సూచించారు. పార్టీ అభ్యర్థుల గెలుపునకు కృషి చేసిన వారికి పార్టీలో ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని, నామినేటెడ్ పదవుల సందర్భంగా ప్రాధాన్యమిస్తామని చెప్పారు. తన మాట కాదని రెబెల్స్ ఎవరైనా ఎన్నికల్లో పోటీ చేసినా, రెబెల్స్‌తో పోటీ చేయించినా, సహకారం అందించినా భవిష్యత్తులో వారి ముఖం కూడా చూడనని కేటీఆర్ తీవ్రంగా హెచ్చరించినట్లు సమాచారం. టికెట్ల పంపిణీ బాధ్యతల్లో ఉన్న నేతలు ఒక్కో వార్డు వారీగా పరిస్థితిని సమీక్షించి గెలిచే అభ్యర్థులకు మాత్రమే బీ–ఫారాలు ఇవ్వాలని సూచించారు. అభ్యర్థుల ఎంపిక, బీ–ఫారాల అందజేత విషయంలో జాగ్రత్త వహించాలన్నారు. నామినేషన్లు, పార్టీ అభ్యర్థుల సంఖ్య, ఇతర పార్టీల నుంచి పోటీ చేస్తున్న వారి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆదివారం కూడా కేటీఆర్ తెలంగాణభవన్‌లో ఉదయం 9 గంటల నుంచి మధ్యా హ్నం 2 గంటల వరకు అందుబాటులో ఉం టారని పార్టీ వర్గాలు తెలిపాయి. 14న మ ధ్యాహ్నం 3 గంటలకు నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియనుండగా, రెబెల్స్‌ను పో టీ నుంచి తప్పించేందుకు చివరి నిమిషం వరకు బుజ్జగింపులు కొనసాగే అవకాశాలున్నాయి. ఫిర్యాదుల వెల్లువ.. తమ వ్యతిరేకవర్గం నేతలు రెబెల్స్‌ను ప్రోత్సహిస్తున్నారని ఈ సమావేశంలో పలువురు పార్టీ ఎమ్మెల్యేలు కేటీఆర్ దృష్టికి తెచ్చారు. మహబూబ్‌నగర్ జిల్లాలోని కొల్లాపూర్ మున్సిపాలిటీలో మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు తన అనుచరులతో ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ తరఫున అభ్యర్థులుగా నామినేషన్ వేయించారని మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, ఆలంపూర్ ఎమ్మెల్యే అబ్రహంలు ఫిర్యాదు చేశారు. దీంతో కేటీఆర్ జూపల్లిని పిలిపించి మాట్లాడారు. తన అనుచరులతో నామినేషన్లు ఉపసంహరింపజేయాలని జూపల్లికి సూచించారు. కేటీఆర్‌తో భేటీ అనంతరం జూపల్లి మాట్లాడుతూ.. కొన్ని మనస్పర్థలు రావడం సహజం అంటూనే రెబెల్స్‌తో తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు. మాజీ ఎమ్మెల్యే ఎడమ కృష్ణారెడ్డి, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి అనుచరులు కల్వకుర్తి మున్సిపాలిటీలో తిరుగుబాటు అభ్యర్థులుగా నామినేషన్లు వేశారని స్థానిక ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ కేటీఆర్‌కు ఫిర్యాదు చేశారు. ఎవరి సత్తా ఎంటో ఎన్నికల్లో తేలిపోతుంది అంటూ కేటీఆర్‌తో సమావేశం అనంతరం జైపాల్‌యాదవ్ వెళ్లిపోయారు. తాండూరు మున్సిపాలిటీ అభ్యర్థుల ఎంపిక విషయంలో మాజీ మంత్రి మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి మధ్య మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ రెండ్రోజుల కింద రాజీ కుదిర్చారు. అయినా మహేందర్‌రెడ్డి అనుచరులు నామినేషన్లు వేశారని కేటీఆర్‌కు రోహిత్‌రెడ్డి ఫిర్యాదు చేశారు. ఇక్కడ 36 వార్డులుంటే టీఆర్ఎస్ నుంచి 139 మంది నామినేషన్లు వేశారని కేటీఆర్‌కు వివరించారు. కేటీఆర్ ప్రాతినిథ్యం వహిస్తున్న సిరిసిల్ల మున్సిపాలిటీలో 30 వార్డులుంటే దాదాపు 20 వార్డుల నుంచి రెబెల్స్ బరిలో దిగారు. రెబెల్స్ అందరినీ కేటీఆర్ పిలిపించి నామినేషన్లు ఉపసంహరించుకోవాలని నచ్చజెప్పారు. పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పదవిని ఆశిస్తున్న దర్గా దయాకర్‌రెడ్డిని శుక్రవారం కాంగ్రెస్ కండువా కప్పి రేవంత్‌రెడ్డి పార్టీలో చేర్చుకోవడం.. అదే రోజున మంత్రి మల్లారెడ్డి ఆయన్ను బుజ్జగించి తిరిగి టీఆర్ఎస్లోకి తీసుకొచ్చారు. కొత్త ప్రభాకర్‌రెడ్డిని కేటీఆర్ పిలుపుపించుకుని సీఎం కేసీఆర్ ప్రాతినిథ్యం వహిస్తున్న గజ్వేల్ మున్సిపాలిటీ అభ్యర్థుల ఎంపికపై సూచనలు చేశారు. నిజమాబాద్ మున్సిపల్ ఎనిక్నల్లో బీజేపీ అభ్యర్థుల గెలుపు కోసం రాజ్యసభ సభ్యు డు డి. శ్రీనివాస్ ప్రయత్నిస్తున్నారన్న సమా చారంతో డీఎస్ వైఖరిని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని కేటీఆర్ సూచించారు. సిరిసిల్లలో 91% టికెట్లు బీసీలకే.. సమావేశంలో ఒక్కో నేతతో ప్రత్యేకంగా సమావేశమైన కేటీఆర్.. క్షేత్ర స్థాయిలో ప్రచారం, అభ్యర్థుల ఎంపిక, పార్టీ వ్యూహాలపై విస్తృతంగా చర్చించారు. సిరిసిల్ల మున్సిపాలిటీ నుంచి పార్టీ తరఫున పోటీ చేసేందుకు ఏకంగా 91% బీసీ అభ్యర్థులకు అవకాశం కల్పించారు. నామినేషన్ల ప్రక్రియ పూర్తయిన నేపథ్యంలో ప్రచారంపై దృష్టి సారించాలని సూచించారు. పార్టీ సమావేశాల్లో సీఎం కేసీఆర్ చేసిన మార్గనిర్దేశం ప్రకారం అందరూ పనిచేయాలన్నారు. పురపాలికల్లో ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లేలా ప్రచారం ఉండాలన్నారు. ప్రతి ఇంటికి టీఆర్ఎస్ ప్రచారం, అభ్యర్థి చేరేలా కార్యచరణ ఉండాలన్నారు. పార్టీ ప్రచార సామాగ్రి చేరవేత వంటి అంశాలపై పార్టీ కేంద్ర కార్యాలయంతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. పురపాలికలకు దగ్గర ఉన్న గ్రామీణ ప్రాంతాల పార్టీ నేతల సేవలు వినియోగించుకోవాలన్నారు. పార్టీ ఇన్చార్జులు లేని పురపాలికల్లో పార్టీ నేతల సేవలు అందిస్తామన్నారు. రానున్న 10 రోజులు కష్టపడి పనిచేయాలని, ఎన్నికలను తేలికగా తీసుకోవద్దని కేటీఆర్ హెచ్చరించారు. మంత్రులు నిరంజన్ రెడ్డి, మల్లారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎంపీలు కొత్త ప్రభాకర్‌రెడ్డి, రంజిత్‌రెడ్డి, మాలోతు కవిత, ఎమ్మెల్యేలు గణేశ్ గుప్తా, రెడ్యా నాయక్, సంజయ్ కుమార్, కోనేరు కోనప్ప, దివాకర్‌రావు, దుర్గం చిన్నయ్య, రవిశంకర్, బొల్లం మల్లయ్య యాదవ్, గ్యాదరి కిశోర్, గొంగిడి సునీత, విట్టల్‌రెడ్డి, సుధీర్‌రెడ్డి, నోముల నర్సింహయ్య, జైపాల్ యాదవ్, క్రాంతి కిరణ్, రవీంద్ర కుమార్, ఎమ్మెల్సీ నవీన్ కుమార్‌లతో కేటీఆర్ ప్రత్యేక సమావేశాలు నిర్వహించారు. -
మున్సి‘పోరు’లో రె‘బెల్స్’!
సాక్షి, జగిత్యాల: జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల పరిధిలో నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. దీంతో గులాబీ పార్టీ ఎమ్మెల్యేల గుండెల్లో రె‘బెల్స్’ మొదలయ్యాయి. ఆయా పార్టీలు తమ అభ్యర్థులకు బీ ఫారాలు అందజేయకున్నా ఆశావహులు నామినేషన్లు వేశారు. ప్రధానంగా అన్ని మున్సిపాలిటీల్లోనూ అధికార టీఆర్ఎస్ పార్టీ నుంచి ఒక్కోవార్డుకు కనీసం ముగ్గురు నుంచి ఆరుగురి వరకు నామినేషన్లు దాఖలయ్యాయి. ఇంటిపోరును తప్పించుకునేందుకు అధికార టీఆర్ఎస్ పార్టీ రెబల్స్ విషయంలో కఠిన వైఖరి అవలంబించాలని నిర్ణయించినప్పటికీ, వీరిలో ఎంతమంది తప్పుకుంటారోనన్నది ఆసక్తిగా మారింది. సొంత పార్టీనుంచి బరిలో నిలిచిన వారిని బుజ్జగించి, తమ అభ్యర్థుల గెలుపుకోసం వారిని పనిచేసేలా చూడాల్సిన బాధ్యత ఆ పార్టీ ఎమ్మెల్యేలపై పడింది. దీంతో నిన్నటివరకు కొనసాగిన నామినేషన్ల అంకానికి తెరపడి, ఇక బుజ్జగింపుల పర్వం మొదలుకానుంది. బీ ఫారాలపైనే ఉత్కంఠ.. టీఆర్ఎస్ పార్టీలో ఎన్నికల్లో పోటీచేయాలనుకునే ఆశావహుల లిస్టు భారీగా ఉండగా, వీరిలో చాలామంది ఇప్పటికే నామినేషన్లు దాఖలు చేశారు. ఒక్కో వార్డులో కనీసం ముగ్గురు నుంచి ఆరుగురు వరకు ఆపార్టీ వారే పోటీలో ఉన్నారు. మిగతా కాంగ్రెస్, బీజేపీ పార్టీల నుంచి ఒకరిద్దరు మాత్రమే బరిలో ఉంటున్నారు. దీంతో టీఆర్ఎస్ నుంచి పోటీలో ఉన్న తిరుగుబాటుదారులతో పార్టీ అభ్యర్థులు నష్టపోయే అవకాశం ఉంటుందని ఎమ్మెల్యేలు భావిస్తున్నారు. వారిని గెలిపించుకునే బాధ్యత స్థానిక ఎమ్మెల్యేలదే కావడంతో అసంతృప్తుల వ్యవహారంలో ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ఇందుకోసమే పార్టీ బీ ఫారాలు వెంటనే అందజేయకుండా చివరి వరకు వేచిచూసే ధోరణి అవలంబించే అవకాశం ఉంది. నామినేషన్ల ఉపసంహరణకు జనవరి 14 సాయంత్రం వరకు అవకాశం ఉండటంతో అంతకు కొన్ని క్షణాల ముందే తమ అభ్యర్థులకు బీఫారాలు ఇచ్చేందుకు ఎమ్మెల్యేలు మొగ్గు చూపుతున్నారు. దీంతో అభ్యర్థులకు ప్రచారం చేసుకునేందుకు తక్కువ సమయం ఉండనుంది. బీ ఫారాలు అందిన తర్వాత అభ్యర్థి పూర్తిస్థాయిలో పార్టీ శ్రేణులతో ప్రచారం నిర్వహించుకునేందుకు అవకాశం ఉంటుంది. అన్ని మున్సిపాలిటీల్లోనూ ఇదే తీరు.. జిల్లాలోని జగిత్యాల, కోరుట్ల, మెట్పల్లి, రాయికల్, ధర్మపురి మున్సిపాలిటీల్లో అధికార టీఆర్ఎస్ పార్టీలోనే అధిక సంఖ్యలో రెబల్స్‌గా నామినేషన్ వేశారు. ఈ సారి ఎన్నికల్లో రెబల్స్ వల్ల నష్టాన్ని తగ్గించుకునేందుకు వారిపై కఠినంగా వ్యవహరించాలని ఇటీవల సీఎం కేసీఆర్ పార్టీ ఎమ్మెల్యేలకు స్పష్టం చేశారు. బరిలో ఉన్న సొంత పార్టీ నేతలు పార్టీ జెండా, గుర్తులు వాడుకోకుండా వేటు వేయాలని ఆదేశించారు. అయితే ఇవన్నీ లెక్కచేయకుండా నామినేషన్లకు చివరిరోజైన శుక్రవారం ఒక్క జగిత్యాల మున్సిపాలిటీలోనే 191 మంది టీఆర్ఎస్ నేతలు నామినేషన్లు వేశారు. జగిత్యాలలో 2,5,6,14,21,37,48 వార్డుల్లో ఆరుగురి నుంచి ఎనిమిది మంది వరకు టీఆర్ఎస్ పార్టీ నాయకులు నామినేషన్లు వేశారు. మెట్పల్లి, కోరుట్ల, రాయికల్ మున్సిపాలిటీల్లోనూ ఒక్కో వార్డులో ముగ్గురికి మించి టీఆర్ఎస్ నేతలు బరిలో నిలిచారు. ధర్మపురి మున్సిపాలిటీలో రెబెల్స్ బెడద కాస్త తక్కువగా ఉన్నప్పటికీ కొన్ని వార్డుల్లో సొంత పోటీ ఎక్కువగానే ఉంది. వీరిలో ఎంతమంది పార్టీ అధిష్టానం, ఎమ్మెల్యేల బుజ్జగింపులకు తలొగ్గి ఉపసంహరించుకుంటారోన్నది ఆసక్తిగా మారింది. సమన్వయం సాధించేనా.. నామినేషన్లు ముగియడంతో శనివారం అభ్యర్థుల నామినేషన్ల పరిశీలన కొనసాగనుంది. ఆదివారం అభ్యంతరాలు స్వీకరణ అనంతరం ఈనెల 13న అభ్యంతరాలపై అప్పీల్‌కు అవకాశం ఇస్తారు. ఈనెల 14 సాయంత్రం 3 గంటల వరకు నామినేషన్ల విత్‌డ్రాకు అవకాశం ఉండగా.. ఈలోపు రెబల్స్ తమ నామినేషన్లు వెనక్కు తీసుకునేలా ఎమ్మెల్యేలు బుజ్జగింపులకు దిగుతున్నారు. మంత్రి కొప్పుల ఈశ్వర్‌తో పాటు ఎమ్మెల్యే డా.సంజయ్‌కుమార్ జగిత్యాల, రాయికల్ మున్సిపాలిటీలు, ఎమ్మెల్యే కె. విద్యాసాగర్‌రావు కోరుట్ల, మెట్పల్లి మున్సిపాలిటీల్లో పార్టీ అభ్యర్థుల గెలుపు బాధ్యతలను ఎత్తుకున్నారు. నామినేషన్ల అంకం ముగియడంతోనే బరిలో ఉన్న సొంత పార్టీ నేతలను గుర్తించి పార్టీ పదవులు, కార్పొరేషన్ పదవుల ఆశతో బుజ్జగించేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయి. -
భంగపడ్డ నేతల రెబల్ పోరు..
సాక్షి, ఆదిలాబాద్: పార్టీలకు రెబల్ బెడద తప్పేటట్టులేదు. ప్రధాన పార్టీలకు అభ్యర్థులు ఖరారు కాగా..టికెట్ ఆశించి భంగపడ్డ నాయకులు రెబల్‌గా పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఈ నెల 18న ప్రారంభమైన లోక్‌సభ ఎన్నికల నామినేషన్ల పర్వం తుది ఘట్టానికి చేరుకుంది. సోమవారం నామినేషన్లకు చివరి రోజు కావడంతో ఆదిలాబాద్ (ఎస్టీ), పెద్దపల్లి (ఎస్సీ) పార్లమెంట్ నియోజకవర్గ బరిలో ఎవరెవరు దిగనున్నారు అనేది తేటతెల్లంకానుంది. పార్టీ టికెట్ ఆశించి భంగపడ్డ నేతలు రెబల్‌గా పోరులో నిలుస్తారా? లేని పక్షంలో వారి నిర్ణయం ఎలా ఉంటుందనే దానిపై అంతటా ఆసక్తి నెలకొంది. పెద్దపల్లిలో ఉత్కంఠ.. పెద్దపల్లి నియోజకవర్గం నుంచి అభ్యర్థుల విషయంలో ఉత్కంఠ నెలకొంది. కాంగ్రెస్ అభ్యర్థిగా ఎ.చంద్రశేఖర్, టీఆర్ఎస్ నుంచి వెంకటేశ్ నేతకాని పేర్లు అధికారికంగా ఖరారు అయ్యాయి. ఎ.చంద్రశేఖర్ నామినేషన్ కూడా వేశారు. బీజేపీ రెండో జాబితాలో గోదావరిఖనికి చెందిన ఎస్.కుమార్ పేరును అధిష్టానం ఖరారు చేసినా రాష్ట్రశాఖ విభాగం ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ఆ పేరును అలాగే నిలిపి ఉంచింది. ప్రధానంగా పెద్దపల్లి నుంచి టీఆర్ఎస్ టికెట్‌ను ఆశించిన మాజీ ఎంపీ జి.వివేకానందకు నిరాశ ఎదురవడంతో ఆయనతో బీజేపీ నేతలు టచ్‌లో ఉన్నారనే వార్తలు వెలువడుతున్నాయి. బీజేపీ గెలవాలంటే బలమైన అభ్యర్థులను నిలిపేందుకు చివరి వరకు రాష్ట్ర కమిటీ ప్రయత్నిస్తోంది. ఇటీవలే సోయం బాపురావు ఆ పార్టీలో చేరగా, ఆయనకు టికెట్ కేటాయించారు. ఇప్పుడు వివేక్ విషయంలో ఎలాంటి పరిణామాలు ఉంటాయనేది ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలో బీజేపీ నుంచి కుమార్ నామినేషన్ వేస్తారా? లేని పక్షంలో టీఆర్ఎస్పై అసంతృప్తితో ఉన్న జి.వివేక్ కమలం పార్టీ నుంచి బరిలోకి దిగుతారా? లేని పక్షంలో స్వతంత్ర అభ్యర్థిగా రంగంలో ఉంటారా? అనేది నేడు స్పష్టం కానుం ది. ఈ నేపథ్యంలో పెద్దపల్లి లోక్‌సభ నియోజకవర్గంలో ఈ పరిణామాలు ఆసక్తికరంగా మారాయి. ఆదిలాబాద్ లోక్‌సభ పరిధి నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా గోడం నగేశ్‌ను ఖరారు చేయగా, కాంగ్రెస్ నుంచి రాథోడ్ రమేశ్, బీజేపీ నుంచి సోయం బాపూరావుల పేర్లు ఖరారు అయ్యాయి. ఈ నేపథ్యంలో ఇక్కడ పోరుపై ఆసక్తి నెలకొంది. ఇదిలా ఉంటే 2014 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో నిలిచిన నరేశ్ జాదవ్ గోడం నగేశ్ చేతిలో ఓటమి చెందారు. రెండో స్థానంలో నిలిచాడు. ఈ సారి ఎన్నికల్లోనూ పార్టీ టికెట్‌పై ఆశ పెట్టుకున్నా అధిష్టానం రాథోడ్ రమేశ్ వైపు మొగ్గు చూపడంతో నరేశ్ జాదవ్‌కు చుక్కెదురైంది. ఈ పరిస్థితిలో కాంగ్రెస్ రెబల్‌గా ఆయన బరిలో నిలిచేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. ఆదివారం ఆదిలాబాద్‌లో ఆయన విలేకరుల సమావేశంలో ఈ నిర్ణయాన్ని వెల్లడించారు. ఈ తరుణంలో కాంగ్రెస్‌కు రెబల్ తప్పేటట్టు లేదు. నేడు నామినేషన్లు.. ఆదిలాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థిగా గోడం నగేశ్, పెద్దపల్లి నుంచి వెంకటేశ్ నేతకాని సోమవారం నామినేషన్ వేయనున్నారు. 2014 సార్వత్రిక ఎన్నికలకు ముందు టీడీపీ నుంచి టీఆర్ఎస్లో చేరిన నగేశ్ అప్పుడు లోక్‌సభ బరిలో నిలిచి ఎంపీగా గెలుపొందారు. మరోసారి ఆయనకే టికెట్ దక్కడంతో నగేశ్ నామినేషన్‌పై ఆసక్తి నెలకొంది. ఈ పార్లమెంట్ పరిధిలో ఆదిలాబాద్, బోథ్(ఎస్టీ), నిర్మల్, ఖానాపూర్(ఎస్టీ), ముథోల్, సిర్పూర్, ఆసిఫాబాద్ (ఎస్టీ) నియోజకవర్గాలు ఉన్నాయి. డిసెంబర్లో జరిగిన ఎన్నికల్లో ఒక ఆసిఫాబాద్ మినహా అన్ని నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ విజయదుందుబి మోగించింది. ఒక ఆసిఫాబాద్‌లో మాత్రమే కాంగ్రెస్ పార్టీ నుంచి ఆత్రం సక్కు గెలుపొందగా ఆయన కూడా ఇటీవల టీఆర్ఎస్తో కలిసి పని చేస్తుండడంతో కాంగ్రెస్‌కు మింగుడు పడడం లేదు. కాగా ఆదిలా బాద్ పార్లమెంట్ ఎన్నిక విజయం కోసం బాధ్యతలను మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి భుజాలపై ఉండగా మాజీ మంత్రి, ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్నకు కూడా విజయం కోసం కృషి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నగేశ్ నామినేషన్ ఘ ట్టానికి మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, ఎమ్మెల్యే జోగురామన్నలతోపాటు ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు ఇటీవల పార్టీలో చేరిన నేతలు హాజరై అవకాశం ఉంది. ఇప్పటికే కాంగ్రెస్ అభ్యర్థి రాథోడ్ రమేశ్, బీజేపీ అభ్యర్థి సోయం బాపూరావు నామినేషన్ వేసిన విషయం విధితమే. నవ ప్రజారాజ్యం పార్టీ నుంచి కుమురం వందన నామినేషన్ వేశారు. పెద్దపల్లి పార్లమెంట్ పరిధి లోని పెద్దపల్లి, ధర్మపురి, మంచిర్యాల, చెన్నూర్, బెల్లంపల్లి నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ గెలవగా, మంథని నుంచి కాంగ్రెస్ అభ్యర్థి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, రామగుండం నుంచి ఏఐఎఫ్బీ అభ్యర్థి కోరుకంటి చందర్ గెలుపొందారు. కోరుకంటి చందర్ టీఆర్ఎస్లో కొనసాగుతున్నారు. పెద్దపల్లి నియోజకవర్గానికి మంత్రి కొప్పుల ఈశ్వర్‌కు బాధ్యతలు ఇవ్వగా, చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్ గతంలో పెద్దపల్లి ఎంపీగా పని చేసిన అనుభవం దృష్ట్యా మిగతా ఎమ్మెల్యేలను కూడగట్టి గెలుపుకోసం ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇటు ఆదిలాబాద్, అటు పెద్దపల్లిల్లో టీఆర్ఎస్ గెలుపుపై నమ్మకంతో ఉంది. రెండు పార్లమెంట్ నియోజకవర్గాల్లో రెబల్తోపాటు స్వతంత్ర అభ్యర్థులుగా ఎవరు ఉంటారో నేడు తేలనుంది. -
బాబుకు షాక్ : రెబల్స్‌గా టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు
సాక్షి, అమరావతి : టీడీపీలో టికెట్ ఆశించి భంగపడ్డ పలువురు సిట్టింగ్ ఎమ్మెల్యేలు రెబల్స్‌గా మారి చంద్రబాబుకు షాక్ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. కొంత మంది స్వప్రయోజనాల కోసం తమను బలిపశువులను చేశారని అసంతృప్తి వ్యక్తం చేస్తూ స్వతంత్ర అభ్యర్థులుగా రంగంలోకి దిగాలని నిర్ణయించారు. ఈ క్రమంలో... విజయనగరం అసెంబ్లీ స్థానాన్ని మరోసారి ఆశించిన మీసాల గీత... ఆ టికెట్‌ను అశోక్ గజపతి రాజు కూతురు అదితి గజపతిరాజుకు కేటాయించడంతో కంగుతిన్నారు. అదితి కోసం బీసీ నేతనైన తనను బలిచేశారన్న ఆమె.. స్వతంత్ర అభ్యర్థిగా రెండు రోజుల్లో నామినేషన్ దాఖలు చేయనున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా కనిగిరి టికెట్ ఆశించిన తనను దర్శి నుంచి పోటీ చేయాల్సిందిగా చంద్రబాబు ఆదేశించడంతో కదిరి బాబూరావు తిరుగుబాటు బావుటా ఎగురవేసేందుకు సిద్ధమయ్యారు. దర్శి టికెట్ వద్దంటూ టీడీపీ అధిష్టానానికి అల్టిమేటం జారీ చేసిన బాబూరావు.. కనిగిరి నుంచే స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాలని భావిస్తున్నట్లు సమాచారం.(‘అనంత’ టీడీపీలో భగ్గుమన్న సెగలు) ఈ క్రమంలో వీరి కోవలోనే మరికొంత మంది టీడీపీ నేతలు కూడా రెబల్స్‌గా రంగంలోకి దిగనున్నారు. సర్వేల్లో తనకు ఫస్ట్‌ర్యాంక్ ఇచ్చి ఇప్పుడు మొండిచేయి చూపారని చింతలపూడి సిట్టింగ్ ఎమ్మెల్యే పీతల సుజాత ఆవేదన వ్యక్తం చేశారు. దళిత మహిళనైన కారణంగా మాగంటి బాబు, చింతమనేని ప్రభాకర్ తనను టార్గెట్ చేసి.. టికెట్ రాకుండా కుట్ర పన్నారని ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఈనెల 22న పీతల సుజాత స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. అదే విధంగా కల్యాణదుర్గం ఎమ్మెల్యే హనుమంతరాయ చౌదరి కూడా వెనక్కి తగ్గేది లేదని తేల్చిచెప్పారు. ఉమామహేశ్వర నాయుడుకు టికెట్ ఇవ్వడంతో కలత చెందిన ఆయన ఇప్పటికే స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు.(చంద్రబాబు సెల్ఫ్ గోల్..) ఇక శింగనమల(ఎస్సీ) సిట్టింగ్ ఎమ్మెల్యే యామినీ బాలకు కూడా చంద్రబాబు మొండిచేయి చూపిన సంగతి తెలిసిందే. తన స్థానంలో ఏమాత్రం రాజకీయ అనుభవం లేని బండారు శ్రావణిని అభ్యర్థిగా ప్రకటించారంటూ అసహనం వ్యక్తం చేశారు. ఈమేరకు బుధవారం భవిష్యత్ నిర్ణయం ప్రకటించనున్నట్లు ఆమె సన్నిహిత వర్గాలు తెలిపాయి. కాగా శింగనమలలో తాను చెప్పిన అభ్యర్థినే నిలబెట్టాలని పట్టుబట్టిన జేసీ దివాకర్‌రెడ్డి ఆమేరకు విజయం సాధించారు. కానీ మిగతా చోట్ల ఆయన మాట చెల్లుబాటు కాకపోవడంతో జేసీ వర్గీయులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. -
బాబుకు షాక్ ఇవ్వనున్న టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు
-
కాంగ్రెస్ రెబెల్స్‌పై వేటు
సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్: ఉమ్మడి జిల్లాలోని ఐదుగురు తిరుగుబాటుదారులపై కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణా సంఘం బహిష్కరణ వేటు వేసింది. పార్టీ టికెట్టు ఆశించి దక్కకపోవడంతో ఇతర రాష్ట్రాలకు చెందిన పార్టీల గుర్తులపై పోటీ చేస్తున్న కాంగ్రెస్ నేతలు బహిష్కృతుల జాబితాలో ఉన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 24 మంది కాంగ్రెస్ తిరుగుబాటుదారులను పార్టీ నుంచి బహిష్కరించగా, అందులో ఐదుగురు ఉమ్మడి జిల్లాకు చెందిన వారే కావడం గమనార్హం. బహిష్కరణకు గురైన వారిలో రావి శ్రీనివాస్ (సిర్పూరు), బోడ జనార్దన్ (చెన్నూరు), అజ్మీరా హరినాయక్ (ఖానాపూర్), అనిల్‌జాదవ్ (బోథ్), బి.నారాయణరావు పటేల్ (ముథోల్) ఉన్నారు. నామినేషన్ల ఉపసంహరణ గడువులోగా పోటీ నుంచి తప్పుకోవాలని పార్టీ అధిష్టానం నుంచి వచ్చిన విజ్ఞప్తులను తోసిరాదని వీరంతా ఆయా నియోజకవర్గాల్లో పోటీ పడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నందున వీరిని బహిష్కరించినట్లు క్రమశిక్షణా సంఘం చైర్మన్ ఎం.కోదండ రెడ్డి ప్రకటించారు. కాంగ్రెస్ అభ్యర్థులకు గుబులు పుట్టిస్తున్న రెబల్స్ ముథోల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న బి.రామారావు పటేల్‌కు సమీప బంధువైన మాజీ ఎమ్మెల్యే బి.నారాయణరావు పటేల్ రెబల్‌గా మారారు. వీరిద్దరు టికెట్టు ఆశించగా, కాంగ్రెస్ పార్టీ రామారావు పటేల్‌కు అవకాశం ఇచ్చింది. దీంతో నారాయణరావు పటేల్ మహారాష్ట్రకు చెందిన నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే కావడం, గ్రామాల్లో మంచి సంబంధాలు ఉండడంతో పాటు ఎన్సీపీ నుంచి పోటీ చేస్తుండడం వల్ల మహారాష్ట్ర మూలాలున్న ఓటర్లు ఆయన వైపు మొగ్గు చూపుతారేమోనని కాంగ్రెస్ ఆందోళన చెందుతోంది. సిర్పూరులో రావి శ్రీనివాస్ బీఎస్పీ అభ్యర్థిగా పోటీ పడుతున్నారు. గతంలో టీడీపీ నుంచి పోటీ చేసిన రావి శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీలోకి రేవంత్‌రెడ్డితో పాటు చేరారు. టీఆర్ఎస్ అభ్యర్థి కోనేరు కోనప్పకు సమీప బంధువైన రావి శ్రీనివాస్ వల్ల తమకేమీ ఇబ్బంది లేదని కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి హరీష్‌బాబు భావిస్తున్నారు. గత ఎన్నికల్లో బీఎస్పీ నుంచి కోనప్ప పోటీ చేయగా, ఈసారి రావి శ్రీనివాస్ పోటీ చేస్తుండడం గమనార్హం. చెన్నూరు పార్టీ టికెట్టు కోసం మాజీ మంత్రి బోడ జనార్దన్ తీవ్రంగా కష్టపడ్డారు. గ్రూపు–1 అధికారిగా రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరిన బోర్లకుంట వెంకటేష్ నేత గత కొంతకాలంగా చెన్నూరుపై పట్టు కోసం చేసిన ప్రయత్నాలను గుర్తించి పార్టీ టికెట్టు ఇచ్చింది. దీంతో అసంతృప్తికి గురైన బోడ జనార్దన్ బీఎల్ఎఫ్ తరుపున ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నారు. ఆయనను నామినేషన్ ఉపసంహరించుకోవాలని పార్టీ నుంచి అగ్ర నాయకులు విజ్ఞప్తి చేసినప్పటికీ, పోటీకే మొగ్గు చూపారు. ఖానాపూర్‌లో హరినాయక్, బోథ్‌లో అనిల్‌జాదవ్ గత ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులుగా పోటీ చేసి ఓడిపోయారు. ఈసారి టికెట్టు ఆశించినప్పటికీ, మాజీ ఎమ్మెల్యేలు రమేష్ రాథోడ్ , సోయం బాపూరావు కాంగ్రెస్‌లో చేరి టికెట్టు దక్కించుకున్నారు. వీరి ప్రభావం ఎన్నికల్లో ఎంత మేరకు ఉంటుందోనని కాంగ్రెస్ అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. -
పోటా పోటి..
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఎన్నికల ప్రచా రం ఊపందుకుంది. ఈనెల 22న నామి నేషన్ల ఉపసంహరణ ఘట్టం ముగియగా.. అగ్రనేతల పర్యటనలతో ఆయా పార్టీల అభ్యర్థుల ప్రచారం జోరందుకుంది. కరీంనగర్ జిల్లాలో 4 నియోజకవర్గాలు ఉండగా.. టీఆర్ఎస్–ప్రజాకూటమి (మహాకూటమి) అభ్యర్థుల మధ్యే ప్రధాన పోటీ నెలకొంది. కరీంనగర్, హుజూరాబాద్, చొప్పదండి, మానకొం డూరు నియోజకవర్గాల నుంచి బీజేపీ పోటీ చేస్తున్నా, కరీంనగర్, చొప్పదండిలలో హోరాహోరీగా పోరాడుతున్నా రు. మానకొండూరులోనూ బీజేపీ అభ్యర్థి ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. బీఎల్ఎఫ్, బీఎస్పీ తదితర 14 పార్టీల అభ్యర్థులు, ఇండిపెండెంట్లు కలిసి మొత్తం 61 మంది పోటీలో ఉండగా.. ప్రధానంగా టీఆర్ఎస్–ప్రజాకూటమి అభ్యర్థుల మధ్యే పోటీ కనిపిస్తోంది. సాక్షిప్రతినిధి, కరీంనగర్: నామినేషన్ల ఉపసంహరణ గురువారం తర్వాత ప్రధాన పార్టీలు ప్రచార జోరు పెంచాయి. ఇప్పటికే టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్, బీజేపీ నేత అమిత్‌షా, కాంగ్రెస్ నేతలు భట్టి విక్రమార్క, విజయశాంతి తదితరులు కూడా క్యాంపెయిన్ నిర్వహించారు. హుజూరాబాద్ మండలం ఇందిరానగర్‌లో కేసీఆర్ సభ విజయవంతమైంది. కాగా.. మరోమారు ప్రచారానికి ఈనెల 25 నుంచి ఆయా పార్టీల అగ్రనేతలు రంగంలోకి దిగనున్నారు. దీంతో ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రధాన పార్టీలు ప్రచారం దూకుడు పెంచాయి. శనివారం నాటికి ఆయా నియోజకవర్గాల్లో పరిస్థితి ఇలా ఉంది. హుజూరాబాద్: హుజూరాబాద్ నియోజకవర్గంలో త్రిముఖ పో టీ జరుగుతున్నా.. ప్రధాన పోటీ టీఆర్ఎస్–కాంగ్రెస్‌ల మధ్యే నెలకొంది. 2009 వరకు కమలాపూర్, ఆ నియోజకవర్గం తర్వాత హుజూరా బాద్ నుంచి మొత్తం ఐదు పర్యాయాలు విజయ దుందుబి మోగించిన మంత్రి ఈటల రాజేందర్, టీఆర్ఎస్ అభ్యర్థి ఆరోసారి విజయం సాధించేందుకు దూసుకెళ్తున్నారు. 30 సంవత్సరాలుగా ఈ నియోజకవర్గాలలో అధికారానికి దూరంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా చివరి నిమిషంలో పాడి కౌశిక్‌రెడ్డిని ప్రకటించింది. ఈనెల 19న వీణవంక మండలం నుంచి ప్రచారాన్ని ప్రారంభించారు. రాష్ట్రంలో జిల్లాలో ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరిస్తూ నాలుగున్నరేళ్లలో చేసిన సుమారు మూడు వేల కోట్ల అభివృద్ధి పనులను ప్రజలకు వివరిస్తూ మంత్రి ఈటల రాజేందర్ ›ప్రచారం చేస్తున్నారు. ప్రజాకూటమి అభ్యర్థిగా కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్న తనను గెలిపించాలని పాడి కౌశిక్‌రెడ్డి ప్రచారం చేస్తున్నారు. బీజేపీ అభ్యర్థి పుప్పాల రఘు ఈ నియోజకవర్గం నుంచి పోటీలో ఉన్నారు. కరీంనగర్: టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థుల మధ్యన ప్రధాన పోటీ నెలకొంది. ఈ నియోజకవర్గం నుంచి మొదటìసారిగా బీసీ వర్గానికి చెందిన అభ్యర్థిగా రెండు పర్యాయాలు ఎమ్మెల్యే గంగుల కమలాకర్ టీఆర్ఎస్ నుంచి గెలుపొంది హ్యాట్రిక్ కొట్టాలని చూస్తున్నారు. ›ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలు.. రికార్డు స్థాయిలో నిధులు, పనులను ప్రచారం చేస్తున్నారు. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ కాంగ్రెస్ అభ్యర్థిగా పొన్నం ప్రభాకర్ తనను గెలిపించాలని ప్రచారం నిర్వహిస్తున్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వ పాలన, వైఫల్యాలను ఎండగడుతూ ప్రజాకూటమి అధికారంలోకి వస్తే జరిగే మేలును వివరిస్తూ గెలుపే లక్ష్యంగా ప్రచారం చేస్తున్నారు. 2014 ఎన్నికల్లో ద్వితీయ స్థానంలో నిలిచిన బీజేపీ బండి సంజయ్‌కుమార్ ఈసారి కూడా ఉధృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఆర్ఎస్ఎస్ హిందుత్వ నినాదం, మోదీ పథకాలతో ముందుకెళ్తున్న ఆయన చాపకింది నీరులా ప్రచారం చేస్తున్నారు. మానకొండూరు (ఎస్సీ): మానకొండూరు నియోజకవర్గంలో మళ్లీ పాతకాపుల మధ్యనే హోరాహోరీ పోరు సాగుతోంది. ప్రధానంగా పోటీ టీఆర్ఎస్–కాంగ్రెస్ పార్టీల మధ్యన నెలకొనగా టీఆర్ఎస్ అభ్యర్థి రసమయి బాలకిషన్, కాంగ్రెస్ అభ్యర్థి ఆరెపల్లి మోహన్ పోటాపోటీగా ప్రచారం చేస్తున్నారు. బాలకిషన్‌కు అండగా మంత్రులు హరీష్‌రావు, ఈటల రాజేందర్, ఎంపీ వినోద్‌కుమార్ తదితరులు ప్రచారం నిర్వహించగా.. మోహన్ కోసం మల్లు భట్టి విక్రమార్క, విజయశాంతి రోడ్‌షోలు నిర్వహించారు. ఇద్దరి మధ్య పోరు రసవత్తరంగా సాగుతుండగా.. బీజేపీ అభ్యర్థి గడ్డం నాగరాజు సైతం నియోజకవర్గంలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను వివరిస్తూ గ్రామాల్లో తిరుగుతున్నారు. చొప్పదండి (ఎస్సీ): చొప్పదండి నియోజకవర్గంలో త్రిముఖ పోటీ సాగుతోంది. టీఆర్ఎస్ అభ్యర్థి సుంకె రవిశంకర్, కాంగ్రెస్ అభ్యర్థి డాక్టర్ మేడిపల్లి సత్యం, మాజీ ఎమ్మెల్యే, బీజేపీ అభ్యర్థి బొడిగె శోభ హోరాహోరీగా ప్రచారం చేస్తున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలు అందరికీ టికెట్లు ఇచ్చిన టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బొడిగె శోభను నిరాకరించగా, ఆమె బీజేపీ నుంచి బరిలో దిగారు. తొలిసారిగా ఎమ్మెల్యే అభ్యర్థిగా అధికార పార్టీ నుంచి బరిలోకి దిగిన రవిశంకర్ గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తున్నారు. ప్రజాకూటమి అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్న డాక్టర్ మేడిపల్లి సత్యం ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్నారు. ప్రజాకూటమి అధికారంలోకి వస్తే జరిగే మేలును ప్రజలకు వివరిస్తూ తనను గెలిపించాలని అభ్యర్థిస్తున్నారు. -
ఉపసంహరణపైనే అందరి దృష్టి
బెల్లంపల్లి: బెల్లంపల్లి అసెంబ్లీ నియోజకవర్గ ఓటర్ల దృష్టంతా నామినేషన్ల ఉపసంహరణపైనే ఉంది. పోటీలో నుంచి ఎంతమంది అభ్యర్థులు త ప్పుకుంటారు, ఎంత మంది బరిలో నిలుస్తారనేది చర్చనీయాంశంగా మారింది. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడానికి ప్రధాన రాజకీయ పక్షాల తరపున, స్వంతంత్ర అభ్యర్థులుగా 22 మంది నామి నేషన్ దాఖలు చేశారు. ఈనెల 12 నుంచి 19వ వరకు నిర్వహించిన నామినేషన్ల దాఖలు కార్యక్రమంలో అభ్యర్థులు పోటాపోటీగా నామినేషన్ పత్రాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారి పీఎస్ రాహుల్‌రాజ్‌కు అందజేశారు. వీటిలో ఆరుగురి అ భ్యర్థుల నామినేషన్ పత్రాలను తిరస్కరించినట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి ప్రకటించారు. దీంతో ప్రస్తుతం ఎన్నికల బరిలో 16 మంది అభ్యర్థులు నిలిచారు. పోటీలో ఉన్న అభ్యర్థులు దా ఖలు చేసిన నామినేషన్ పత్రాలను ఉపసంహరించుకోవడానికి గురువారంతో తుది గడువు ముగియనుంది. వీరిలో ఎంతమంది అభ్యర్థులు ఎన్నికల రణరంగంలో ఉంటారు, ఎంత మంది ఉపసంహరణకు మొగ్గు చూపుతారనేది సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ప్రధాన పక్షాల బుజ్జగింపులు.. ఎన్నికల్లో తప్పనిసరిగా పోటీలో ఉండబోతున్న ప్రధాన పక్షాల అభ్యర్థులు చిన్న చిన్న పార్టీల అభ్యర్థులను పోటీలో నుంచి తప్పించడానికి కసరత్తు చేస్తున్నారు. ముఖ్యంగా ఆ అభ్యర్థికి పోలయ్యే ఓట్లు చీలకుండా ప్రత్యర్థి వర్గానికి చెందిన ఓట్లు చీలిపోయేలా వ్యూహా ప్రతివ్యూహాలు పన్నుతున్నారు. తమపార్టీ ఓట్లు చీల్చే అవకాశాలు ఉన్నా అభ్యర్థులను పోటీ నుంచి తప్పించడానికి బుజ్జగింపుల పర్వం కొనసాగిస్తున్నారు. కొంత మంది అభ్యర్థులను తప్పించడానికి ఏకంగా నజరాలను ఆశ చూపెడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఎవరి ప్రయత్నాలు ఫలించి ఎంతమంది అభ్యర్థులు బరిలో నుంచి వైదొలుగుతారనేది ప్రస్తుతం అంతుచిక్కకుండా ఉంది. రెబెల్స్ పోటీలో ఉంటే ముప్పే..! బెల్లంపల్లి ఎన్నికల బరిలో నిలిచిన ప్రధాన పక్షాల అభ్యర్థులకు రెబెల్స్ బెడద పొంచి ఉంది. మరో పక్క కొందరు అభ్యర్థులు చివరి నిమిషంలో పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డారు. అలాంటి అభ్యర్థులతో ఓట్లు చీలే అవకాశాలు ఉన్నాయి. ఈ పరిణామాలు ప్రధాన రాజకీయ పార్టీలకు తలనొప్పిగా మారాయి. వీరిని బరిలో నుంచి తప్పించేందుకు విశ్వయత్నాలు చేస్తున్నారు. -
రెబెల్స్: ప్రస్తుత రాజకీయ వేడి ఎలా ఉందంటే..
సాక్షినెట్‌వర్క్: అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ రసవత్తరంగా మారుతోంది. ఈ రణరంగంలో మిగేలేదెవరో.. పోటీ నుంచి వైదొలగేదెవరో గురువారం తేలిపోనుంది. ప్రధాన పార్టీల నుంచి టికెట్లు దక్కని ఆశావహులు రె‘బెల్స్’ మోగించారు. కొందరు జాతీయ పార్టీలు, రిజిస్టర్ పార్టీల నుంచి నామినేషన్లు వేయగా, మరికొందరు స్వతంత్రులుగా బరిలో నిలిచారు. హైదరాబాద్, మేడ్చల్ జిల్లాలతో పాటు గ్రేటర్ పరిధిలోకి వచ్చే రంగారెడ్డి జిల్లా నియోజకవర్గాల్లో మొత్తంగా 648 నామినేషన్లు దాఖలు చేశారు. నామినేషన్ల ఉపసంహరణకు ఒక్కరోజే గడువు ఉండడంతో బుజ్జ గింపుల పర్వం ఊపందుకుంది. సనత్‌నగర్‌లో ఏ పార్టీకీ రెబల్స్ బెడద లేనప్పటికీ గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన ‘దండే విఠల్’కు కేటీఆర్ ఫోన్ చేశారు. పార్టీ అభ్యర్థి తలసాని శ్రీనివాస్ యాదవ్ గెలుపునకు సహకరించాలని కోరారు. మజ్లిస్‌కు పట్టున్న అసెంబ్లీసెగ్మెంట్లలో ప్రధాన పార్టీలకు పెద్దగా రెబల్స్ బెడద లేదు. టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి ఉన్న ఆజామ్ ఖాన్, కావూరి వెంకటేష్ టీఆర్ఎస్ రెబెల్స్‌గా కార్వాన్లో నామినేషన్లు వేశారు. నియోజకవర్గాల్లో ప్రస్తుత రాజకీయ వేడి ఎలా ఉందంటే.. ఉప్పల్: కాంగ్రెస్ రెబల్ అభ్యర్థులు మేకల శివారెడ్డి, సింగిరెడ్డి సోమశేఖర్‌రెడ్డి మహాకూటమి అభ్యర్థికి సహకరిస్తామని ప్రకటించారు. సింగిరెడ్డిని కేంద్ర మాజీ మంత్రులు వీరప్ప మొయిలి, డీకే.శివకుమార్‌లు పిలిపించి బుజ్జగించి సముచిత స్థానాన్ని కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఇదిలా ఉండగా టీఆర్ఎస్ రెబల్ అభ్యర్థి నందికొండ శ్రీనివాస్‌రెడ్డి వేసిన నామినేషన్ అనూహ్య పరిణామాల మధ్య తిరస్కరించడంతో ఉప్పల్ అభ్యర్థులకు రెబల్ బెడద లేనట్టయింది. ఖైరతాబాద్: కాంగ్రెస్ రెబల్స్‌గా నామినేషన్లు వేసిన చేసిన డాక్టర్ సి.రోహిణ్‌రెడ్డి, బి.రాజుయాదవ్, టీడీపీ రెబల్ అభ్యర్థి బీఎన్ రెడ్డిల నామినేషన్లు తిరస్కరణతో ప్రజాకూటమికి లైన్ క్లియర్ అయింది. ఇక టీఆర్ఎస్లో రెబల్‌గా నామినేషన్ వేసిన మన్నె గోవర్ధన్‌రెడ్డి బీఎస్పీ తరఫున బరిలో నిలిచారు. మల్కాజిగిరి: పొత్తులో భాగంగా టీజేఎస్‌కు ఈ సీటు వెళ్లగా, కాంగెస్ ఓబీసీ సెల్ జాతీయ కో–ఆర్డినేటర్ బి.సురేష్‌యాదవ్, సీనియర్ నేత రామకృష్ణ నాయుడు రెబల్స్‌గా బరిలో ఉన్నారు. బీజేపీ నుంచి గోపు రమణారెడ్డి నామినేషన్ వేశారు. టీఆఎర్ఎస్కు ఇక్కడ రెబల్స్ బెడద లేదు. అంబర్‌పేట: అంబర్‌పేట మహాకూటమి చర్చల సీన్ కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ నివాసానికి చేరింది. కాంగ్రెస్ నుంచి బరిలో ఉన్న లక్షణ్యాదవ్, టీజేఎస్ అభ్యర్థి నిజ్జన రమేష్ ఇద్దరూ బుధవారం వీహెచ్‌ను కలిశారు. అక్కడే ఉన్న మీడియా ‘అంబర్‌పేట మహాకూటమి అభ్యర్థిపై స్పష్టత ఇస్తారా?’ అని ప్రశ్నించడంతో ‘‘ఇద్దరూ ఉంటార’’ని ఆయన చెప్పడంతో అక్కడున్నవారంతా అవాక్కయ్యారు. నామినేషన్ల ఉపసంహరణకు ఒక్కరోజే గడువు ఉండడంతో ఇద్దరిలో ఎవరు ఉపసంహరించుకుంటారో చూడాలి. టీఆర్ఎస్ ఉద్యమ కార్యకర్తలైన బీవీ రమణ, సునీల్ బిడ్లల నామినేషన్లు ఆమోదం పొందాయి. వీరు బరిలో ఉంటారా.. లేదా అన్నది గురువారం తేలిపోనుంది. అంబర్‌పేట నుంచి టీడీపీ టికెట్ ఆశించిన వనం రమేష్ స్వతంత్రుడిగా నామినేషన్ వేశారు. జూబ్లీహిల్స్: టీఆర్ఎస్ రెబల్‌గా నామినేషన్ వేసిన తెలంగాణ ఉద్యమకారుడు సయ్యద్ మహ్మద్ హుస్సేన్ బరిలో కొనసాగే అవకాశాలున్నాయి. బుధవారం ఆయన తన మద్ధతుదారులు, తెలంగాణ ఉద్యమకారులతో సమావేశమై టీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి గోపీనాథ్‌ను ఓడించాలని తీర్మానించారు. ఎంఐఎం ఎవరినీ పోటీలో నిలపకపోవడంతో గత ఎన్నికల్లో పోటీ చేసి రెండోస్థానంలో నిలిచిన నవీన్ యాదవ్ స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేశారు. కుత్బుల్లాపూర్: టీఆర్ఎస్ రెబల్‌గా నామినేసన్ వేసిన కొలన్ హన్మంత్‌రెడ్డి అనూహ్య పరిణామాల మధ్య టీడీపీలో చేరారు. ప్రజాకూటమి అభ్యర్థి కూన శ్రీశైలంగౌడ్‌కు మద్దతిస్తున్న ఆయన తన నామినేషన్ ఉపసంహరించుకోనున్నారు. ఇక బీజేపీ అభ్యర్థి కాసాని వీరేశ్ పోటీలో ఉంటారా.. లేదా.. అనేది గురువారం తేలనుంది. సికింద్రాబాద్: కాంగ్రెస్ నుంచి రెబల్‌గా నామినేషన్ వేసిన మాజీ మేయర్ కార్తీకరెడ్డి ఇంకా అలక వీడలేదు. మరో రెబల్ ఆదం ఉమాదేవి కాంగ్రెస్ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్‌కు మద్దతు పలికారు. ఆమె తన నామినేషన్‌ను ఉపసంహరించుకోకున్నారు. మరోవైపు తెలంగాణ ఉద్యమకారులు దాసరి శ్రీనివాస్, ఎస్.యాదగిరిలను కూడా ఆపద్ధర్మ మంత్రి పద్మారావు బుజ్జగిస్తున్నారు. కంటోన్మెంట్: ఈ నియోజకవర్గం నుంచి ఇద్దరు టీఆర్ఎస్ రెబల్స్‌గా బరిలో ఉన్నారు. గత ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి మూడు వేల ఓట్ల తేడాతో ఓడిపోయిన గజ్జెల నాగేశ్‌తో పాటు తెలంగాణ ఉద్యమకారిణి గంధం దయామణి ఇండిపెండెంట్‌గా నామినేషన్లు వేశారు. అయితే, వీరిద్దరూ పోటీలో ఉంటామని చెబుతుండగా, బుధవారం రాత్రి కేటీఆర్ ఇద్దరికీ ఫోన్ చేశారు. నామినేషన్లు ఉపసంహరించుకొని పార్టీ అభ్యర్థికి సహకరించాలని కోరారు. కాంగ్రెస్ నుంచి టికెట్ ఆశించిన శ్రీగణేష్ ఆ పార్టీ నుంచి టికెట్ దక్కకపోవడంతో చివరి నిమిషంలో బీజేపీ టికెట్ తెచ్చుకున్నారు. మేడ్చల్: టీఆర్ఎస్ టికెట్ ఆశించిన నక్కా ప్రభాకర్‌గౌడ్‌కు అవకాశం దక్కకపోవడంతో బీఎస్పీ తరఫున బరిలోకి దిగారు. మరోవైపు కాంగ్రెస్ టికెట్ ఆశించిన కాంగ్రెస్ రాష్ట్ర ఓబీసీ వైస్ చైర్మన్ తోటకూర వజ్రేష్ యాదవ్(జంగయ్య యాదవ్) కూడా బరిలో ఉన్నారు. అయితే, మేడ్చల్‌లో శుక్రవారం సోనియాగాంధీ బహిరంగసభ ఉన్న నేపథ్యంలో కాంగ్రెస్ శ్రేణులకు ఇది మింగుడుపడని అంశంగా మారింది. కూకట్పల్లి: ప్రజాకూటమి అభ్యర్థికి రెబల్‌గా కాంగ్రెస్ నేత గొట్టముక్కల వెంగళరావు నామినేషన్ వేయగా, టీఆర్ఎస్ టికెట్ ఆశించిన హరీష్ చంద్రారెడ్డి బీఎస్పీ నుంచి బరిలో నిలిచారు. ప్రచారం కూడా వేగవంతం చేశారు. కాంగ్రెస్ పార్టీ బరిలో లేకపోవడంతో కేడర్ రెండుమూడు వర్గాలుగా చీలిపోయింది. మహేశ్వరం: గత ఎన్నికల్లో టీఆర్ఎస్ తరఫున పోటీ చేసిన కొత్త మనోహరెడ్డికి టికెట్ రాకపోవడంతో ఎన్సీపీ (నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ) నుంచి నామినేషన్ దాఖలు చేశారు. అయితే, ఆయన్ను బుజ్జగించేందుకు టీఆర్ఎస్ నాయకులు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. వారి ప్రయత్నం ఏ మేరకు ఫలితాన్నిస్తుందో చూడాల్సిందే. రాజేంద్రనగర్: ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పీసీసీ సభ్యుడు వేణుగౌడ్తో కాంగ్రెస్ సీనియర్ నేత జైపాల్‌రెడ్డి చర్చించారు. శంషాబాద్‌లోని ఆయన నివాసానికి వెళ్లిన ఆయన.. పొత్తులో భాగంగా ఈ సీటును టీడీపీకి కేటాయించాల్సి వచ్చిందని, అధికారంలోకి వచ్చిన తర్వాత నామినేటెడ్ పదవి లేదా సముచిత గౌరవం కల్పిస్తామని హామీ ఇవ్వడం ద్వారా శాంతింపజేశారు. ఇబ్రహీంపట్నం: ఇక్కడ మాత్రం మల్రెడ్డి బ్రదర్స్ ఇంకా కుదటపడలేదు. కాంగ్రెస్ తరఫున నుంచి పోటీ చేయాలని భావించిన మల్రెడ్డి రంగారెడ్డికి టీడీపీ రూపేణా దురదృష్టం వెంటాడింది. పొత్తులో భాగంగా ఈ స్థానాన్ని ‘దేశం’కు కేటా యించారు. అయితే, టీడీపీ అభ్యర్థి సామ రంగారెడ్డి పోటీపై డైలామాలో ఉండడంతో తమకు అవకాశం ఇవ్వాలని మల్రెడ్డి అధిష్టానంపై ఒత్తిడి తెస్తున్నారు. బీఎస్పీ, ఎన్సీపీల తరుఫున నామినేషన్లు కూడా వేసిన ఈ ఇరువురు తాజాగా పీసీసీ చీఫ్ ఉత్తమ్‌ను కూడా కలిసి.. ఇబ్రహీంపట్నం సీటు మార్పిడిపై చంద్రబాబుతో చర్చించాలని కోరినట్లు తెలిసింది. కాంగ్రెస్, టీడీపీ అధ్యక్షుల భేటీ అనంతరం వీరి పోటీపై స్పష్టత రానుంది. ఒకవేళ టీడీపీ తప్పుకోకపోతే.. వీరిని పోటీ నుంచి తప్పించేందుకు అధిష్టానం రంగంలోకి దిగుతుందా? లేదా అనేది వేచిచూడాలి. శేరిలింగంపల్లి: టీడీపీ రెబల్‌గా పోటీలో ఉన్న మొవ్వా సత్యనారాయణ తన నామినేషన్ ఉపసంహరించుకునే అవకాశాలున్నాయి. ఆయన్ను అమరావతికి పిలిపించి టీడీపీ అధినేత చంద్రబాబు.. తెలంగాణ టీడీపీ అధికార ప్రతినిధిగా నియమించారు. టీఆర్ఎస్ అసమ్మతి నేత శంకర్‌గౌడ్‌కు కేటీఆర్ ఫోన్ చేసి బుజ్జగించి పార్టీ అభ్యర్థికి సహకరించాలని కోరారు. స్వతంత్రుడిగా నామినేషన్ వేసిన కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే భిక్షపతి యాదవ్ నిర్ణయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇప్పటికే కాంగ్రెస్ సీనియర్ నేత జైపాల్‌రెడ్డి ఆయన్ను కలిశారు. అయితే, మరోవైపు భిక్షపతి యాదవ్‌కు టీఆర్ఎస్కు పిలుపు వచ్చినట్టు కార్యకర్తలు చర్చించుకుంటున్నారు. ఏకంగా చేవెళ్ల ఎంపీ టికెట్ ఇస్తామని హామీ ఇచ్చినట్టు కూడా నియోజకవర్గంలో ప్రచారం సాగుతోంది. ఈ విషయం తెలిసి హుటాహుటిన ఏఐసీసీ కోశాధికారి అహ్మద్‌పటేల్, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కేంద్ర మాజీ మంత్రులు సుబ్బరామిరెడ్డి, జైపాల్‌రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి మధుయాష్కిగౌడ్‌లు బుధవారం రాత్రి భిక్షపతియాదవ్ నివాసానికి వెళ్లి బుజ్జగించారు. అన్యాయం జరిగిన విషయం వాస్తవమే అని తగిన న్యాయం చేస్తామని అహ్మద్‌పటేల్ స్పష్టమైన హామీ ఇచ్చారు. నామినేషన్ ఉపసంహరించుకొని మహా కూటమి అభ్యర్థి విజయానికి కృషి చేయాలని సూచించారు. అయితే కార్యకర్తల సమావేశంలో వారి మనోభావాలు తెలుసుకున్నాక భిక్షపతియాదవ్ తన నామినేషన్ ఉపసంహరించుకునే అవకాశాలు ఉన్నాయి. ఎన్ని పార్టీలో.. అంతమంది అభ్యర్థులు నామినేషన్లు అర్హత పొందిన అభ్యర్థుల్లో ఎన్నెన్నో పార్టీల వారున్నారు. ఆలిండియా ఫార్వర్డ్‌బ్లాక్, అన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, జనవాహిని పార్టీ, యువ పార్టీ, న్యూ ఇండియా పార్టీ, రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా(ఎ), తెలంగాణ యువశక్తి, అంబేడ్కర్ నేషనల్ కాంగ్రెస్, తెలుగు కాంగ్రెస్ పార్టీ, బహుజన రాష్ట్ర సమితి, పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా, బీఎల్ఎఫ్, ఇండియన్ ప్రజాబంధు పార్టీ, దళిత బహుజన్ పార్టీ, బీఎస్పీ, హిందూ ఏక్తా ఆందోళన్ పార్టీ, జైభారత్ జనసేన పార్టీ, జేడీ(ఎస్), లోక్‌సత్తా, ఆమ్ ఆద్మీ పార్టీ, లోక్ తాంత్రిక్ సర్వజన్ సమాజ్ పార్టీ, జాతీయ మహిళా పార్టీ, నవ సమాజ్ పార్టీ, సోషలిస్ట్ యూనిటీ సెంటర్ ఆఫ్ ఇండియా, మజ్లిస్ మర్కజ్–ఇ–సియాజీ, తదితర పార్టీల నుంచి అభ్యర్థులు బరిలో ఉన్నారు. -
నామినేషన్లకు తెర
ముందస్తు ఎన్నికల్లో ఓ అంకానికి తెర పడింది.ఈనెల 12తో ప్రారంభమైన నామినేషన్ల పర్వం జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల్లో సోమవారంతోముగిసింది. చివరి రోజు నామినేషన్లతో భారీ ర్యాలీలు, నినాదాలతోనియోజకవర్గ కేంద్రాలు హోరెత్తాయి. ప్రధానంగా టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు, స్వతంత్ర అభ్యర్థులు భారీగానామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారులకు సమర్పించారు. ఇక ప్రధాన పార్టీల్లో పార్టీ పరంగా అభ్యర్థులు నామినేషన్లు వేస్తే..టికెట్ దక్కక రెబల్స్ కూడా నామినేషన్లు వేశారు. ఒక్క రోజే జిల్లా వ్యాప్తంగా 115 నామినేషన్లు దాఖలయ్యాయి. సాక్షిప్రతినిధి, సూర్యాపేట : నామినేషన్ల ఘట్టం ముగిసింది. చివరి రోజైన సోమవారం పెద్ద ఎత్తున నామినేషన్లు నమోదయ్యాయి. సూర్యాపేట నియోజవకవర్గంలో చివరిరోజు నామినేషన్ల దాఖలు ఆయా పార్టీల శ్రేణుల ర్యాలీలు, ప్రచార హోరుతో జరిగాయి. ప్రధాన పార్టీల అభ్యర్థులు తమకు ఇష్టమైన దేవాలయాల్లో పూజలు చేసి నామినేషన్ల కేంద్రానికి కదిలారు. టీఆర్ఎస్ అభ్యర్థిగా విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి, బీజేపీ అభ్యర్థిగా సంకినేని వెంకటేశ్వర్రావు నామినేషన్లు వేశారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రాంరెడ్డి దామోదర్‌రెడ్డి భారీ ర్యాలీతో నామినేషన్ దాఖలు చేశారు. కోదాడలో టీఆర్ఎస్ అభ్యర్థిగా బొల్లం మల్లయ్య యాదవ్, కాంగ్రెస్ అభ్యర్థిగా నలమాద పద్మావతి, టీఆర్ఎస్ రెబల్ అభ్యర్థిగా కన్మంతరెడ్డి శశిధర్‌రెడ్డిలు భారీ ర్యాలీ లతో నామినేషన్లు వేశారు. అలాగే హుజూర్‌నగర్‌లో టీఆర్ఎస్ అభ్యర్థిగా శానంపూడి సైదిరెడ్డి పట్టణంలో ర్యాలీ నిర్వహించి నామినేషన్ దాఖలు చేశారు. తుంగతుర్తిలో కాంగ్రెస్ అభ్యర్థిగా అద్దంకి దయాకర్ భారీ ర్యాలీతో నామినేషన్ వేశారు. ఇక పలు పార్టీలనుంచే కాక, స్వతంత్రంగా చాలా మంది అభ్యర్థులు బరిలో నిలవడానికి నామినేషన్లు వేశారు. చివరి రోజు నామినేషన్లతో జిల్లా వ్యాప్తంగా రాజకీయ పార్టీల కోలాహలం కనిపించింది. అన్ని పార్టీల అభ్యర్థులు శ్రేణులు కదలిరావడంతో ఉత్సాహంతో నామినేషన్లు వేసి విజయం తమదేనన్న ధీమాలో అభ్యర్థులు ఉన్నారు. జిల్లాలో ఇప్పటివరకు వచ్చిన మొత్తం నామినేషన్లు: నియోజకవర్గం అభ్యర్థులు నామినేషన్లు హుజూర్నగర్ 24 39 కోదాడ 27 41 సూర్యాపేట 30 58 తుంగతుర్తి 27 42 మొత్తం 108 180 ఏడు రోజుల్లో 108 మంది అభ్యర్థులు..180 నామినేషన్లు.. ఈ నెల 12నుంచి నామినేషన్ల ముగింపు వరకు జిల్లాలో 108 మంది అభ్యర్థులు 180 నామినేషన్లు దాఖలు చేశారు. టికెట్ల ప్రకటన కాకముందే కొంత మంది స్వతంత్రులుగా, పార్టీ పరంగా రెండు, మూడు సెట్లు నామినేషన్లు వేయడంతో అభ్యర్థుల సంఖ్య తక్కువ, నామినేషన్ల సంఖ్య ఎక్కువగా ఉంది. సోమవారం జిల్లావ్యాప్తంగా నాలుగు నియోజకవర్గాల పరిధిలో115 నామినేషన్లు దాఖలు కాగా ఇందులో హుజూర్నగర్ నియోజకవర్గంలో 23 నామినేషన్లు, కోదాడలో 29, సూర్యాపేటలో అత్యధికంగా 33, తుంగతుర్తిలో 30 నామినేషను వచ్చాయి.. ఇక రెబల్స్ బుజ్జగింపులు.. నామినేషన్ల అంకం ముగియడంతో పార్టీల తరఫున బీఫామ్‌లతో నామినేషన్లు వేసిన వారు.. ఇక రెబల్స్‌పై దృష్టి పెట్టారు. ఈనెల 22 వరకు నామినేషన్ల ఉపసంహరణ గడువు ఉంది. అయితే ఈలోపే వారిని బుజ్జగించి బరిలో ఉండకుండా చూసేలా రాజకీయ మంతనాలకు దిగుతున్నారు. రెబల్స్‌గా వేసిన అభ్యర్థులకు వారి కుటుంబంలో దగ్గర ఉన్న వ్యక్తులు ఎవరు..?, పార్టీ పరంగా ఏ నాయకుడు చెబితే వింటారోనని బుజ్జగించేందుకు అన్ని దారులు పార్టీల అభ్యర్థులు వెతుకుతున్నారు. బుజ్జగింపులకు వినకుంటే చివరికి వారి వల్ల ఎంత నష్టం జరుగుతుందో కూడా అభ్యర్థులు అంచనాల్లో మునిగారు. వారికి ఏ మండలం, గ్రామం, పట్టణంలో వారికి ఎన్ని ఓట్లు పడతాయో కూడా లెక్కలు వేయిస్తున్నారు. దీని ఆధారంగా వారు వినకుంటే వారి వెంట ఉన్న ద్వితీయ శ్రేణి నేతలకు ఎర వేసి తమ వైపునకు లాక్కునే ప్రయత్నాల్లో ఉన్నారు. -
నేను ఓడినా సరే... ప్రత్యర్థి గెలవకూడదు!
సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్: నామినేషన్ల ఘట్టంలోనే రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. రాజకీయ పార్టీల్లోని అంతర్గత కుమ్ములాటలు ఎన్నికల సమయంలో బట్టబయలు అవుతున్నాయి. ఉపసంహరణల పర్వం పూర్తయి, బరిలో నిలిచిన అభ్యర్థులు హోరా హోరీ ప్రచారానికి దిగేనాటికి పరిస్థితుల్లో ఇంకా మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. టీఆర్ఎస్లో టికెట్ల కేటాయింపు అనంతరం చోటుచేసుకున్న అసంతృప్తి వివిధ రూపాల్లో పెల్లుబికి... పలు చోట్ల చల్లారినా, మాజీ మంత్రి గడ్డం వినోద్‌కుమార్ బెల్లంపల్లిలో పోటీకి దిగుతుండడం ఆసక్తికర పరిణామంగా మారింది. మహాకూటమి తరుపున సీపీఐ పోటీ చేస్తున్న ఈ నియోజకవర్గంలో వినోద్ బరిలో నిలవడంతో రాజకీయ సమీకరణాలు మారే అవకాశాలున్నాయి. ఇక కాంగ్రెస్‌లో టికెట్ల పంచాయితీ టీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా తయారవుతున్నాయి. ‘నేను ఓడినా సరే... ప్రత్యర్థి గెలవకూడదు’ అనే ధోరణిలో పలుచోట్ల కాంగ్రెస్ నేతలు రెబల్స్‌గా మారుతున్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి అధికార పార్టీ అభ్యర్థికి మేలు జరిగే పరిస్థితి కాంగ్రెస్ అసంతృప్త నేతలు కల్పిస్తున్నారని ఆ పార్టీ వర్గాలు వాపోతున్నాయి. ఈ నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. అరవింద్‌రెడ్డి రాకతో... శత్రువుకు శత్రువు మిత్రుడు అనే సామెత మాజీ ఎమ్మెల్యే అరవింద్‌రెడ్డి, తాజా మాజీ ఎమ్మెల్యే ఎన్.దివాకర్‌రావు విషయంలో కచ్చితంగా సరిపోతుంది. కాంగ్రెస్‌లో అరవింద్‌రెడ్డికి ప్రధాన ప్రత్యర్థి కె.ప్రేంసాగర్‌రావు. ఒకే పార్టీలో ఉన్నా, ఉప్పు నిప్పుగా మెలిగిన ఈ నాయకులు టికెట్టు కోసం ఎవరికి వారే ప్రయత్నించారు. అయితే చివరికి ప్రేంసాగర్‌రావుకు కాంగ్రెస్ అభ్యర్థిత్వం ఖరారు కావడం, నామినేషన్ దాఖలు చేయడం కూడా జరిగిపోయాయి. ఈ నేపథ్యంలో అరవింద్‌రెడ్డి గతంలో తాను వదిలేసిన టీఆర్ఎస్ను ఆశ్రయించారు. టీఆర్ఎస్ అభ్యర్థిగా దివాకర్‌రావు పోటీ చేస్తుండగా, శనివారం నామినేషన్ సందర్భంగా అరవింద్‌రెడ్డి రిటర్నింగ్ ఆఫీస్‌కు దివాకర్‌రావుతో కలిసివెళ్లారు. టికెట్టు వస్తే ప్రత్యర్థిగా తలబడాల్సిన నేతకు మద్ధతుగా వెళ్లడం రాజకీయ పరిణామాల తీరును తెలియజేస్తుంది. అరవింద్‌రెడ్డి రాకతో టీఆర్ఎస్కు మేలు జరుగుతుందని దివాకర్‌రావు వర్గీయులు చెపుతున్నారు. అరవింద్‌రెడ్డి సైతం తన లక్ష్యం ప్రేంసాగర్‌రావు ఓటమే అని బాహాటంగా చెపుతున్నారు. వినోద్ పోటీతో ఆసక్తిగా బెల్లంపల్లి టీఆర్ఎస్ నుంచి చెన్నూరు టికెట్టు ఆశించి భంగపడ్డ మాజీ మంత్రి గడ్డం వినోద్ బెల్లంపల్లి సీటైనా ఇవ్వాలని అధిష్టానాన్ని కోరారు. హైకమాండ్ ససేమిరా అనడంతో కాంగ్రెస్ నుంచి టికెట్టు తెచ్చుకునేందుకు ఢిల్లీ వరకు వెళ్లారు. అక్కడ కూడా రిక్తహస్తమే ఎదురవడంతో టీజేఎస్ నుంచి పోటీ చేయాలని భావించినా, ఆ పార్టీకి ఉన్న పరిమితుల వల్ల అసాధ్యంగానే మిగిలింది. అయినా పట్టువదలని విక్రమార్కుడిలా వినోద్ ఇండిపెండెంట్‌గానైనా బెల్లంపల్లి నుంచి పోటీ చేయడమే అని తీర్మానించుకొని రంగంలోకి దిగారు. బీఎస్పీ నుంచి టికెట్టు హామీ లభించింది. బెల్లంపల్లి మున్సిపల్ చైర్పర్సన్ మునిమంద స్వరూప భర్త రమేష్‌తో పాటు పట్టణానికి చెందిన కౌన్సిలర్లు వినోద్‌ను పోటీలో నిలుపుతున్నారు. తాజా మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య శుక్రవారం వినోద్ ఇంటికి వెళ్లి ఇండిపెండెంట్‌గా పోటీ చేయవద్దని విజ్ఞప్తి చేసినా వినోద్ వెనక్కు తగ్గలేదు. బీఎస్పీ అభ్యర్థిగా వినోద్ 19న నామినేషన్ దాఖలు చేయనున్నారు. చిన్నయ్యకు ప్రధాన ప్రత్యర్థిగా ఇప్పటివరకు సీపీఐ అభ్యర్థి గుండా మల్లేష్ ఉండగా, తాజా పరిణామాలతో వినోద్ కూడా మరో ప్రత్యర్థిగా మారబోతున్నారు. ఈ పరిణామాలతో బెల్లంపల్లి ఎన్నికలు వేడెక్కాయి. రామారావుకు మొదలైన సొంత ‘పోరు’ ముథోల్‌లో కాంగ్రెస్ అభ్యర్థి రామారావు పటేల్‌కు వరుసకు సోదరుడైన మాజీ ఎమ్మెల్యే నారాయణరావు పటేల్ రెబల్‌గా మారుతున్నారు. నారాయణరావు పటేల్ మహారాష్ట్రకు చెందిన శరద్‌పవార్ పార్టీ ఎన్సీపీ తరుపున పోటీ చేయనున్నారు. సరిహద్ధుగా ఉన్న మహారాష్ట్ర ప్రభావం ఎక్కువగా ఉండే ముథోల్‌లో అక్కడి నుంచి వచ్చి సెటిలయిన వారు ఎక్కువే. నారాయణరావు, రామారావు సైతం మహారాష్ట్రీయులే. ఈ నేపథ్యంలో రామారావు పటేల్‌ను ఎన్సీపీ తరుపున పోటీ చేస్తున్న నారాయణరావు ఏమేరకు ఎదుర్కోగలడనేదే సమస్య. టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు ప్రధాన పోటీదారుడిగా ఉంటారా? ఓట్లను చీల్చి విజయాన్ని ప్రభావితం చేసే ఓట్లు రాబట్టుకుంటారా? అనేది వేచి చూడాలి. చెన్నూరులో బీఎల్ఎఫ్ అభ్యర్థిగా బోడ నాలుగుసార్లు వరుస ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేసిన బోడ జనార్ధన్ తెలంగాణ ఉద్యమ ప్రభావంతో 2004 నుంచి రాజకీయంగా కకావికలం అయ్యారు. కాంగ్రెస్ టికెట్టుతో పోటీ చేయాలని భావించి భంగపడ్డ ఆయన కాంగ్రెస్ రెబల్స్ ఫ్రంట్‌ను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం బీఎల్ఎఫ్ అభ్యర్థిగా పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. చెన్నూరులో టీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థులు బాల్క సుమన్, వెంకటేష్ నేత మధ్య హోరాహోరీ పోరు నెలకొన్న పరిస్థితుల్లో బోడ జనార్ధన్ పాత్ర ఎలా ఉండబోతుందన్నదే ప్రశ్న.బోథ్‌లో కాంగ్రెస్ అభ్యర్థిగా సోయం బాబూ రావు ఖరారు కావడంతో టికెట్టు ఆశించి భంగపడ్డ అనిల్ జాదవ్ ఆదివారం కార్యకర్తలతో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. -
రెబెల్స్ విధానం సీపీఐకి వ్యతిరేకం: చాడ
-
కాంగ్రెస్‌లో టికెట్ లొల్లి!
సాక్షి మేడ్చల్ జిల్లా: మేడ్చల్ కాంగ్రెస్‌లో అసమ్మతి సెగ రాజుకుంది. కేఎల్ఆర్కు అధిష్టానం టికెట్ కేటాయించడంపై కాంగ్రెస్‌లోని అసమ్మతి నాయకులు భగ్గుమంటున్నారు. యాదవ సామాజిక వర్గానికి చెందిన తెలంగాణ ఓబీసీ వైస్ చైర్మన్ తోటకూరి జంగయ్య యాదవ్‌కు అధిష్టానం టికెట్ నిరాకరించటంతో శుక్రవారం బోడుప్పల్లో ముఖ్య నాయకులు, కార్యకర్తల సమావేశం నిర్వహించాలని కాంగ్రెస్ అసమ్మతి వర్గం నిర్ణయించింది. ఇందులో, నాయకులు,కార్యకర్తలు వెల్లడించే అభిప్రాయాలకు అనుగుణంగా కాంగ్రెస్ పార్టీకి మూకుమ్మడిగా రాజీనామాలు చేయడమా? లేదా రెబల్‌గా మేడ్చల్ నుంచి బరిలోకి దిగడమా అన్న విషయంపై అసమ్మతి వర్గం చర్చించనున్నట్లు తెలుస్తోంది. రేవంత్‌రెడ్డితో కలిసి రాహుల్ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిన టీడీపీ జిల్లా అధ్యక్షుడు జంగయ్య యాదవ్‌కు మేడ్చల్ టికెట్ కేటాయించి, మాజీ ఎమ్మెల్యే కేఎల్ఆర్ను పార్లమెంట్‌కు పంపించాలని గతంలో తీసుకున్న నిర్ణయానికి విరుద్ధంగా అధిష్టానం టికెట్ ఇవ్వటంపై అసమ్మతి వర్గం తీవ్ర నిరసన వ్యక్తం చేస్తోంది. ఇప్పటికైనా కేఎల్ఆర్ స్వచ్ఛందంగా పోటీ నుంచి విరమించుకుని, బీసీ సామాజిక వర్గానికి చెందిన జంగయ్య యాదవ్‌కు అవకాశం కల్పించాలని కోరుతోంది. స్థానికేతరుడైన కేఎల్ఆర్ కంటే స్థానికుడైన జంగయ్య యాదవ్‌కు టికెట్ ఇస్తే గెలిపించుకుంటామని అసమ్మతి వర్గం పేర్కొంటోంది. బోడుప్పల్ సమావేశం తర్వాత నియోజక వర్గంలోని వివిధ పార్టీలకు చెందిన స్థానిక నాయకులతో చర్చించి తన భవిష్యత్ కార్యక్రమాన్ని నిర్ణయించుకోవాలని జంగయ్య యాదవ్ భావిస్తున్నారు. ఆయనకు మద్దతుగా కాంగ్రెస్ నుంచి టికెట్ ఆశించి భంగపడ్డ నాయకులు వారి అనుచర వర్గం కలిసి ముందుకు సాగాలని భావిస్తున్నట్టు సమాచారం. మరో పక్క మేడ్చల్ టికెట్ పొందిన కేఎల్ఆర్ అధిష్టానం, రాష్ట్ర నేతల సహకారంతో అసమ్మతి వర్గాన్ని బుజ్జగించేందుకు ప్రయత్నాలు మొదలెట్టినట్టు సమాచారం. పార్టీ పెద్దలతో జంగయ్య యాదవ్‌కు ఎమ్మెల్సీ పదవి ఇప్పించేందుకు ప్రయత్నం చేస్తానని కేఎల్ఆర్ అసమ్మతి వర్గం వద్ద ప్రస్తావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే, పార్టీలో భగ్గుమన్న అసమ్మతి ఎక్కడికి దారి తీస్తుందోనని కేడర్ ఆవేదన చెందుతుండగా, రాజకీయ పరిశీలకులు మాత్రం కాంగ్రెస్‌లో చోటు చేసుకున్న పరిణామాలను క్షణ్ణంగా విశ్లేషిస్తున్నారు. -
అభ్యర్థుల గుండెల్లో రె'బెల్స్'
ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థులను రెబెల్స్ వెంటాడుతున్నాయి. టీఆర్ఎస్, కాంగ్రెస్, పార్టీల అభ్యర్థులను రెబల్స్ ఆందోళనకు గురి చేస్తున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పలు నియోజకవర్గాల్లో ఈ రెండు ప్రధాన పార్టీల అభ్యర్థులకు రెబల్స్ బెడద ఉంది. ఈ నెల 19న నామినేషన్లకు చివరి తేదీ కాగా, 20న నామినేషన్ల పరిశీలన, 22వ తేదీన నామినేషన్ల ఉప సంహరణకు గడువు ఉంది. టికెట్ల కేటాయింపు, అభ్యర్థుల ఖరారు, నామినేషన్ల హడావుడిలో మునిగిన ప్రధాన పార్టీలు.. ఇప్పటివరకు రెబల్స్, అసంతృప్తుల నామినేషన్లపై దృష్టి పెట్టలేదు. రెబల్స్ బరిలో ఉంటే మాత్రం అభ్యర్థుల గెలుపోటములపై ప్రభావం చూపనున్నాయన్న భయం ప్రధాన పార్టీల అభ్యర్థులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఉపసంహరణకు ఇంకా గడువు ఉన్నా బుజ్జగింపులకు శుక్రవారం నుంచి శ్రీకారం చుట్టే అవకాశం ఉంది. సాక్షి, కరీంనగర్: పెద్దపల్లిలో సీహెచ్ విజయరమణారావుకు కాంగ్రెస్ టిక్కెట్ ఇవ్వడంతో టిక్కెట్ ఆశించి భంగపడ్డ సురేష్‌రెడ్డి, సవితారెడ్డి, చేతి ధర్మయ్య తదితరులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సురేష్‌రెడ్డి కాంగ్రెస్ రెబల్‌గా నామినేషన్ సైతం వేశారు. వేములవాడలో ఆది శ్రీనివాస్‌కు కాంగ్రెస్ టిక్కెట్ దక్కడంతో ఏనుగు మనోహర్‌రెడ్డి అనుచరవర్గం ఆందోళన వ్యక్తం చేస్తూ మూకుమ్మడిగా పార్టీకి రాజీనామా చేసేందుకు సిద్ధమై భవిష్యత్తు కార్యాచరణ రూపొందించే పనిలో నిమగ్నమయ్యారు. చొప్పదండిలో రేవంత్‌రెడ్డితో టీడీపీ నుంచి కాంగ్రెస్‌లో చేరిన మేడిపల్లి సత్యంకు కాంగ్రెస్ టిక్కెట్ ఖరారు చేయడంతో మాజీ మంత్రి సుద్దాల దేవయ్య, ప్రజాసంఘాల జేఏసీ నాయకులు గజ్జెల కాంతం అగ్గిమీద గుగ్గిలమై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పొన్నం ప్రభాకర్ వల్లే చొప్పదండి టిక్కెట్ తనకు దక్కలేదని సుద్దాల దేవయ్య ఆరోపిస్తున్నారు. కోరుట్ల నుంచి కాంగ్రెస్ పోటీ చేయనుండగా అక్కడ కొమిరెడ్డి రామ్‌లు, జువ్వాడి నర్సింగారావు మధ్య గట్టి పోటీ నెలకొంది. ఈ నేపథ్యంలో ఇంకా ఎవరికీ టికెట్ కేటాయించకపోగా.. మాజీ మంత్రి రత్నాకర్‌రావు తనయుడైన నర్సింగారావుకే అధిష్టానం, మహాకుటమి నేతల ఆశీస్సులు ఉన్నట్లు ప్రచారం. హుజూరాబాద్‌లో కాంగ్రెస్ అభ్యర్థిత్వం ఖరారు కాకపోయినా టిక్కెట్ ఆశిస్తున్న పాడి కౌశిక్‌రెడ్డి నామినేషన్ వేసి.. అధికారికంగా ప్రకటించే విధంగా ఢిల్లీకి వెళ్లి లాబీయింగ్ చేస్తున్నట్లు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. ఇదే సమయంలో కౌశిక్‌రెడ్డికి టికెట్ ఇవ్వొద్దంటూ ఆశావహులు పరిపాటి రవీందర్‌రెడ్డి, తుమ్మేటి సమ్మిరెడ్డి, ప్యాట రమేష్ తదితరులు సైతం గురువారం ఢిల్లీ పెద్దలను కోరారు. కౌశిక్‌రెడ్డికి టికెట్ ఇస్తే తాము రెబల్‌గా పోటీ చేస్తామని తుమ్మేటి సమ్మిరెడ్డి తదితరులు బహిరంగంగానే చెప్తున్నారు. హుస్నాబాద్ స్థానాన్ని పొత్తులో భాగంగా సీపీఐకి మహాకూటమి కేటాయించినా కాంగ్రెస్ టిక్కెట్ ఆశిస్తున్న మాజీ ఎమ్మెల్యే అల్గిరెడ్డి ప్రవీణ్‌రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. ఇలా పలుచోట్ల అభ్యర్థుల ప్రకటనపై నిరసనలు వ్యక్తమవుతున్నాయి. టీఆర్ఎస్ అభ్యర్థులకు రెండుచోట్ల.. చొప్పదండిలోనూ తలనొప్పే.. టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు రెబెల్స్, అసంతృప్తుల బెడద తప్పడం లేదు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మొత్తం 13 అసెంబ్లీ స్థానాలకు టీఆర్ఎస్ దశల వారీగా అన్నింటా అభ్యర్థులను ప్రకటించింది. రామగుండం, వేములవాడ స్థానాల అభ్యర్థులకు మొదటి నుంచి అసమ్మతి తలనొప్పిలా మారింది. రామగుండం నుంచి సిట్టింగ్ ఎమ్మల్యే సోమారపు సత్యనారాయణకే మళ్లీ టికెట్ కేటాయించగా, కోరుకంటి చందర్ రెబల్‌గా నామినేషన్ వేసి బరిలో నిలిచారు. అదేవిధంగా వేములవాడ సిట్టింగ్ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్‌బాబును అసంతృప్తివాదులు వెంటాడుతున్నారు. ఏకంగా తిరుగుబాటు చేసి పోటీ సభలు కూడా నిర్వహించడం చర్చనీయాంశంగా మారింది. చొప్పదండి నియోజకవర్గం నుంచి పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే బొడిగె శోభకు టికెట్ నిరాకరించగా, ఆమె గురువారం అనుచరులతో కలిసి హైదరాబాద్‌లో బీజేపీలో చేరారు. దీంతో టీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలో దిగనున్న సుంకె రవిశంకర్‌కు.. శోభ బీజేపీ నుంచి రంగంలోకి దిగడం ఒక రకంగా రెబెల్ అభ్యర్థిగా ట్రీట్ చేయవచ్చంటున్నారు. రెండుచోట్ల స్పష్టంగా అసంతృప్తి, రెబెల్స్ బెడద కనిపిస్తుండగా, చొప్పదండిలోనూ శోభ బీజేపీ నుంచి బరిలోకి దిగుతుండటం టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థికి తలనొప్పేనని అంటున్నారు. -
పొత్తులు..‘పంతాలు’
సాక్షి, కొత్తగూడెం: కాంగ్రెస్ కూటమిలో సీట్ల కేటాయింపు ప్రక్రియలో తలెత్తిన అసంతృప్తుల కారణంగా ఆయా పార్టీలు ఏ మేరకు సహకరించుకుంటాయో అనే విషయంలో ఒక స్పష్టత లేకుండా పోయింది. జిల్లాలోని ఏకైక జనరల్ స్థానమైన కొత్తగూడెం నియోజకవర్గం విషయంలో కూటమి పార్టీల మధ్య ఐక్యత సన్నగిల్లుతోంది. ఈ సీటును పొత్తుల్లో భాగంగా సీపీఐ గట్టిగా కోరినప్పటికీ కాంగ్రెస్ నాయకత్వం వనమా వెంకటేశ్వరరావును తమ అభ్యర్థిగా ప్రకటించింది. దీంతో కూటమిలోని సీపీఐ, టీడీపీ కత్తులు దూస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ పొత్తు ధర్మాన్ని ఏమాత్రం పాటించలేదని సీపీఐ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ గెలవాలనే లక్ష్యంతో బరిలోకి దిగిన వనమా వెంకటేశ్వరరావుకు సీపీఐ నుంచి ఏ మేరకు సహకారం అందుతుందనే అనుమానాలు రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. తమ పార్టీని ఏమాత్రం ఖాతరు చేయకుండా కాంగ్రెస్ కొత్తగూడెం సీటు విషయంలో ఏకపక్షంగా వ్యవహరించిందని సీపీఐ గరంగా ఉంది. ఈ సీటును ఆశించిన పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి కూనంనేని సాంబశివరావు బుధవారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి బాహాటంగానే కాంగ్రెస్‌ను విమర్శించారు. ఆ పార్టీ కూటమికి అహంకారపూరిత పెద్దన్న పాత్ర పోషించిందని అన్నారు. పొత్తు ధర్మాన్ని ఏమాత్రం పాటించలేదని ఆరోపించారు. రాష్ట్రవ్యాప్తంగా 40 నియోజకవర్గాల్లో గణనీయమైన ఓటుబ్యాంకు కలిగి ఉన్న సీపీఐ విషయంలో కాంగ్రెస్ దారుణంగా వ్యవహరించిందని అన్నారు. తమకు మూడు సీట్లు మాత్రమే కేటాయించడం కాంగ్రెస్ నాయకత్వం తీరుకు నిదర్శనమన్నారు. వివిధ రకాల సర్వేల పేరుతో కాంగ్రెస్ పార్టీ హైప్ సృష్టించిందన్నారు. తాను టీఆర్ఎస్ వద్ద డబ్బులు తీసుకుని టికెట్ ఆశించానని వనమా వెంకటేశ్వరరావు తీవ్రమైన ఆరోపణలు చేయడం పట్ల కూనంనేని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీలో చర్చించి స్నేహపూర్వక పోటీకైనా సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. బీ–ఫారం కూడా సిద్ధంగా ఉంచుకున్నానని తెలిపారు. అయితే తనకు మద్దతు ఇవ్వాలంటూ వనమా వెంకటేశ్వరారవు కూనంనేని ఇంటికి వెళ్లి కోరగా, రెండు రోజుల్లో తన నిర్ణయాన్ని చెబుతానని కూనంనేని తెలిపారు. దీంతో రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. బరిలోకి దిగుతానంటున్న ఎడవల్లి.. కాంగ్రెస్ పార్టీ టికెట్ ఆశించి భంగపడిన టీపీసీసీ సభ్యుడు ఎడవల్లి కృష్ణ సైతం వనమాకు ఏ మాత్రం సహకరించేది లేదని తెగేసి చెబుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ బరిలోకి దిగుతానని అంటున్నారు. ఇప్పటికే తన వర్గీయులతో సమావేశం నిర్వహించారు. తాను ఏ బ్యానర్‌పై బరిలోకి దిగేది శుక్రవారం నాటికి స్పష్టత ఇస్తానని ఎడవల్లి చెబుతున్నారు. టీడీపీ జిల్లా అధ్యక్షుడు కోనేరు సత్యనారాయణ కూడా ఈ స్థానాన్ని ఆశించారు. టికెట్ తనకు వచ్చే అవకాశం ఉండగా, నామా నాగేశ్వరారవు తన స్వార్థం కోసం రాకుండా చేశారని ఆరోపిస్తున్నారు. మంగళవారం కొత్తగూడెంలో నామా నాగేశ్వరరావు దిష్టిబొమ్మను దహనం చేశారు. బుధవారం జరిగిన సమావేశంలో వనమాకు ఏమాత్రం సహకరించేది లేదని తెగేసి చెప్పారు. కోనేరుకు టికెట్ ఇవ్వకపోతే కూటమి అభ్యర్థికి మద్దతు ఇవ్వబోమని టీడీపీ నాయకులు కాపా కృష్ణమోహన్, రావి రాంబాబు అంటున్నారు. ‘పేట’లోనూ సహకారం డౌటే.. అశ్వారావుపేటలో బలంగా ఉన్న తమకు కాకుండా ఏ మాత్రం కేడర్ లేని టీడీపీకి టికెట్ ఇవ్వడమేంటని కాంగ్రెస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికే టీపీసీసీ మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సున్నం నాగమణి నామినేషన్ కూడా దాఖలు చేశారు. టికెట్ ఆశించి భంగపడిన మరో ఇద్దరు కూడా స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్ వేసేందుకు సన్నాహాలు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇక్కడ టీడీపీ అభ్యర్థికి కాంగ్రెస్ కేడర్ సహకరిస్తేనే ఉపయోగం ఉంటుందని, లేదంటే గడ్డు పరిస్థితి నెలకొంటుందని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. -
రెబెల్స్ రెడీ!
సాక్షి, కొత్తగూడెం: రెండు నెలలుగా సాగదీస్తూ.. చివరకు నామినేషన్ల పర్వం ప్రారంభమైన తర్వాత కాంగ్రెస్ కూటమి పార్టీల నాయకులు అభ్యర్థుల పేర్లు ప్రకటించారు. అయితే ఇంతకాలం టికెట్లు ఆశించి భంగపడిన వారి అనుచరులు, అసమ్మతి నేతలు ఆగ్రహ జ్వాలలతో రగిలిపోతున్నారు. మరోవైపు కూటమి పొత్తుల్లో భాగంగా సీట్లు ఆశించి, నిరాశకు లోనైన భాగస్వామ్య పార్టీల నాయకులు, కార్యకర్తలు సైతం ఆగ్రహావేశాలతో ఉన్నారు. జిల్లాలోని ఏకైక జనరల్ స్థానం కొత్తగూడెం స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి పేరు ప్రకటించినప్పటికీ.. ఒక రకమైన గందరగోళం మాత్రం కొనసాగుతూనే ఉంది. పొత్తుల్లో భాగంగా ఈ సీటును సీపీఐ గట్టిగా కోరింది. ఆ పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి కూనంనేని సాంబశివరావు పోటీ చేయాలనుకున్నారు. అయితే ఇక్కడి నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావును పార్టీ అధిష్టానం ప్రకటించింది. దీంతో సీపీఐ శ్రేణుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. కాంగ్రెస్ అభ్యర్థికి సహకరించేదీ, లేనిదీ ఇప్పటికీ సీపీఐ కచ్చితంగా చెప్పడం లేదు. ఇక కాంగ్రెస్ టికెట్ కోసం చివరివరకు తీవ్రంగా ప్రయత్నించిన టీపీసీసీ సభ్యుడు ఎడవల్లి కృష్ణకు సీటు దక్కకపోవడంతో ఆయన వర్గీయులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పాల్వంచలో ఎడవల్లి వర్గీయులు టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వనమా వెంకటేశ్వరరావుకు సహకరించేది లేదని వారు చెబుతున్నారు. నేడు (బుధవారం) తన వర్గీయులతో ఎడవల్లి సమావేశం ఏర్పాటు నిర్వహించనున్నారు. వారితో చర్చించి భవిష్యత్ కార్యాచరణ నిర్ణయిస్తానని ఎడవల్లి ‘సాక్షి’కి తెలిపారు. స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచేందుకు ఆయన ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. మరోవైపు పొత్తుల్లో భాగంగా కొత్తగూడెం స్థానాన్ని టీడీపీ జిల్లా అధ్యక్షుడు కోనేరు సత్యనారాయణ(చిన్ని) ఆశించారు. చంద్రబాబు, నందమూరి బాలకృష్ణ ద్వారా గట్టి ప్రయత్నాలు చేశారు. అయినప్పటికీ భంగపాటు తప్పలేదు. దీంతో చిన్ని తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఆయన వర్గీయులు కొత్తగూడెంలోని గణేష్ టెంపుల్ ఏరియాలో టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు నామా నాగేశ్వరరావు దిష్టిబొమ్మను దహనం చేశారు. నామా తన ఒక్కడి స్వార్థం చూసుకుని తనకు అన్యాయం చేశారంటూ కోనేరు చిన్ని నేరుగానే విమర్శిస్తున్నారు. కోనేరు సైతం ఇండిపెండెంట్‌గా పోటీ చేసేందుకు మొగ్గు చూపుతున్నట్టు సమాచారం. అశ్వారావుపేట సీటును టీడీపీకి కేటాయించడంతో అక్కడి నుంచి మెచ్చా నాగేశ్వరరావును ఆ పార్టీ అభ్యర్థిగా ప్రకటించింది. దీంతో ఈ నియోజకవర్గంలో బలంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. టీడీపీకి సహకరించేది లేదని తెగేసి చెబుతున్నారు. అంతేకాదు.. మెచ్చాను ఓడిస్తామని అంటున్నారు.టీడీపీ కేడర్ మొత్తం ప్రస్తుతం టీఆర్ఎస్లో ఉందని, ఈ నేపథ్యంలో టీడీపీకి టికెట్ ఇవ్వడమేంటని కాంగ్రెస్ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే టీపీసీసీ మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి సున్నం నాగమణి నామినేషన్ దాఖలు చేశారు. దీంతో ఇక్కడ టీడీపీ అభ్యర్థికి గడ్డు పరిస్థితి తప్పేలా లేదు. ఇల్లెందు మిగిలింది.. ఇల్లెందు నియోజకవర్గం నుంచి 31 మంది ఆశావహులు టికెట్ కోసం దరఖాస్తు చేసుకోవడంతో ఇక్కడ అభ్యర్థి ప్రకటనను పెండింగ్‌లో పెట్టారు. ఈ టికెట్ కేటాయింపు విషయంలో అధిష్టానం తీవ్ర కసరత్తు చేయాల్సి వస్తోంది. ఇక్కడ ముందే అభ్యర్థిని ప్రకటిస్తే రెబెల్స్ భారీగా నామినేషన్లు దాఖలు చేసే పరిస్థితి ఉండడంతో ఆలస్యం చేస్తున్నట్లు తెలుస్తోంది. ∙భద్రాచలం నియోజకవర్గం నుంచి నలుగురూ కొత్తవారే టికెట్ ఆశించారు. అయితే అనూహ్యంగా ములుగు మాజీ ఎమ్మెల్యే పొదెం వీరయ్యను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ప్రకటించింది. వీరయ్య స్థానికేతరుడు కావడంతో ఫలితం ఎలా ఉంటుందో అని శ్రేణుల్లో చర్చ జరుగుతోంది. -
చల్లారని ‘కారు’చిచ్చు
సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్: టీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించి రెండు నెలలు గడిచినా అసమ్మతి చల్లారలేదు. మంత్రి కేటీఆర్ పలుమార్లు నచ్చజెప్పినా, ఎమ్మెల్సీ ఇస్తామని హామీ ఇచ్చినా మాజీ మంత్రి గడ్డం వినోద్ ఎన్నికల్లో పోటీ చేయాలనే పట్టు వీడడం లేదు. బోథ్‌లో టికెట్టు ఆశించి భంగపడ్డ ఎంపీ గోడం నగేష్ అభ్యర్థి బాపూరావు రాథోడ్‌కు సహకరించడం లేదు. తాజాగా మంచిర్యాలలో మరో టీఆర్ఎస్ నాయకురాలు ఇండిపెండెంట్‌గా పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. సిర్పూరు, ఆసిఫాబాద్‌లలో టీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ గూటికి చేరడం కొనసాగుతూనే ఉంది. చెన్నూరులో ఇప్పటికే కొందరు నేతలు పార్టీ మారగా, పార్టీలో ఉన్న వారు కూడా తమకు తగిన ప్రాధాన్యత ఇవ్వడం లేదనే అసంతృప్తితో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఓవైపు నామినేషన్లు దాఖలు చేసేందుకు సిద్ధమవుతూనే గుబులు పుట్టిస్తున్న గులాబీ ముళ్లను చూసి అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. 16న బెల్లంపల్లి నుంచి వినోద్ నామినేషన్ టీఆర్ఎస్ నుంచి చెన్నూరు టికెట్టు ఆశించి భంగపడ్డ మాజీ మంత్రి గడ్డం వినోద్ తన సోదరుడు మాజీ ఎంపీ వివేక్‌తో కలిసి పలుమార్లు మంత్రి కేటీఆర్‌తో సమావేశమయ్యారు. చెన్నూరు కాకపోతే బెల్లంపల్లి నుంచైనా సీటివ్వాలని కోరగా, కేటీఆర్ ససేమిరా అన్నారు. ఇప్పటికే ఖరారైన అభ్యర్థులను మార్చేది లేదని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌లో చేరి బెల్లంపల్లి నుంచి పోటీ చేయాలని వినోద్ భావించినప్పటికీ, ఆ పార్టీ నుంచి సానుకూల స్పందన రాలేదు. చివరిసారిగా ఢిల్లీలో కాంగ్రెస్ సీటు కోసం ప్రయత్నిస్తున్న వినోద్‌ను పిలిపించి మరోసారి కేటీఆర్ చెన్నూరులో బాల్క సుమన్‌కు మద్ధతుగా పనిచేయాలని సూచించారు. ఎమ్మెల్సీ ఖాయమని చెప్పినా తనకు టికెట్టు కావాలనే పట్టుపట్టారు. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ అభ్యర్థులకు ముఖ్యమంత్రి కేసీఆర్ బీ–ఫారాలు అందజేయడంతో తనకు సీటు రాదనే నిర్ణయానికి వచ్చారు. ఈ నేపథ్యంలో బెల్లంపల్లి నుంచి ఇండిపెండెంట్‌గా పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. బెల్లంపల్లి మున్సిపల్ చైర్పర్సన్ మునిమంద స్వరూప, ఆమె భర్త రమేష్ ఈ మేరకు వినోద్‌కు మద్ధతు పలికారు. ఇటీవల మున్సిపల్ చైర్‌పర్సన్‌పై అవిశ్వాసంలో వినోద్ బ్రదర్స్ స్వరూపకు పూర్తిగా మద్ధతు పలికారు. మున్సిపాలిటీలోని మెజారిటీ కౌన్సిలర్లు కూడా వినోద్ వెంట నడిచేందుకు సిద్ధంగా ఉన్నారు. ఈనెల 16న ఆయన తన నామినేషన్ దాఖలు చేయనున్నారు. బీఎస్పీ గుర్తుపై పోటీ చేయాలని భావిస్తున్న ఆయన ఇండిపెండెంట్‌గా, బీఎస్పీ అభ్యర్థిగా రెండు సెట్ల నామినేషన్లు దాఖలు చేయనున్నట్లు తెలిసింది. బోథ్‌లో సయోధ్యకు కేటీఆర్ మంత్రాంగం బోథ్‌లో టికెట్టు ఆశించిన ఎంపీ గోడం నగేష్ టీఆర్ఎస్ అభ్యర్థి, తాజా మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావుకు సహకారం అందించడం లేదు. తమకే సీటు వస్తుందని నిన్న మొన్నటి వరకు చెప్పిన నగేష్ వర్గం తీరా బీ–ఫారం బాపూరావుకే ఇవ్వడంతో తీవ్ర నిరాశకు గురయ్యారు. బాపూరావుకు టికెట్టు ప్రకటించిన రెండు నెలల నుంచి ప్రచారానికి దూరంగానే ఉంటున్న నగేష్ గురించి బాపూరావు మంత్రి కేటీఆర్‌కు ఫిర్యాదు చేయడంతో మంగళవారం ఇద్దరు నేతలను హైదరాబాద్ పిలిపించి సయోధ్య కుదిరించినట్లు తెలిసింది. అయితే టికెట్టు రాకపోవడంతో తీవ్ర అసంతృప్తితో ఉన్న నగేష్ వర్గం బాపూరావుకు ఏకోశానా సహకరించే పరిస్థితులు కనిపించడం లేదు. నగేష్ ఆదివాసీ వర్గానికి చెందిన వారు కాగా బాపూరావు లంబాడా. దీంతో వీరు కలిసి పనిచేయడం కష్టమేనని స్పష్టమవుతోంది. మంచిర్యాలలో విజయశ్రీ తిరుగుబావుటా మంచిర్యాలలో క్రిస్టియన్ సామాజిక వర్గానికి చెందిన టీఆర్ఎస్ నాయకురాలు చల్లగుల్ల విజయశ్రీ తిరుగుబావుటా ఎగరేశారు. టీఆర్ఎస్ అభ్యర్థి నడిపెల్లి దివాకర్‌రావుకు వ్యతిరేకంగా ఇండిపెండెంట్‌గా పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన తనకు ప్రభుత్వం తగిన గుర్తింపు ఇవ్వలేదని భావించిన ఆమె గురువారం ఇండిపెండెంట్‌గా నామినేషన్ దాఖలు చేయాలని నిర్ణయించారు. క్రిస్టియన్ సామాజిక వర్గంతో పాటు ఉద్యమకారిణిగా చేసిన పోరాటం, మహిళా నాయకురాలిగా తనకు నియోజకవర్గంలో ఉన్న గుర్తింపు కలిసివస్తాయని ఆమె భావిస్తున్నారు. ఈ నియోజకవర్గానికి చెందిన ఎంపీపీ బేర సత్యనారాయణ, ఉద్యమంలో పాల్గొన్న ఆరె శ్రీనివాస్ ఇప్పటికే బీఎస్పీ, బీఎల్ఎఫ్ అభ్యర్థులుగా పోటీలో ఉండడం గమనార్హం. -
మిత్రులే..ప్రత్యర్థులు!
సాక్షి, సిటీబ్యూరో: తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థులకు పలు నియోజకవర్గాల్లో సొంత పార్టీ మిత్రులే ప్రత్యర్థులు కానున్నారు. నగరంలో పార్టీ అభ్యర్థుల ప్రకటన తర్వాత పలు నియోజకవర్గాల్లో దారికి రాని అసంతృప్త నేతలు పోటీలో నిలిచేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అదే గనుక జరిగితే టీఆర్ఎస్ అభ్యర్థులకు భారీ నష్టం జరిగే అవకాశం లేకపోలేదు. అభ్యర్థులను ఇప్పటికే ప్రకటించిన కూకట్పల్లి, కుత్బుల్లాపూర్, జూబ్లీహిల్స్, ఉప్పల్ నియోజకవర్గాల్లో స్వతంత్రంగా పోటీ చేస్తామని టికెట్లు ఆశించి భంగపడిన టీఆర్ఎస్ నేతలు పేర్కొంటున్నారు. ఇందులో నియోజకవర్గాల వారీగా చూస్తే కూకట్‌పల్లిలో బాలాజీనగర్ కార్పొరేటర్ భర్త పన్నాల హరీష్‌రెడ్డి ఇప్పటికే ప్రచారాన్ని ప్రారంభించి టీఆర్ఎస్ అభ్యర్థి మాధవరం కృష్ణారావుపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. టీఆర్ఎస్లో అసంతృప్తితో ఉన్న నాయకులందరినీ ఆయన ఒక్క తాటిపైకి తీసుకొచ్చే ప్రయత్నాల్లో ఉన్నారు. ఇక కుత్బుల్లాపూర్ స్థానాన్ని టీడీపీ నుంచి వచ్చిన వివేకానంద్‌కు ఇవ్వటంతో, గత ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన కొలను హన్మంతరెడ్డి ఈమారు స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉండాలని నిర్ణయించారు. ప్రచారాన్ని సైతం ప్రారంభించారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో అసంతృప్త నేతలతో పార్టీ ముఖ్యనేతలు పలుమార్లు చర్చలు జరిపినా కార్పొరేటర్లు దారికి రాలేదు. పార్టీ అభ్యర్థి మాగంటి గోపీనాథ్‌కు వ్యతిరేకంగా వ్యూహరచన చేస్తున్నారు. ఇందులో కార్పొరేటర్లు కిలారీ మనోహర్, షఫీ, సంజయ్ తదితరులు మాగంట గోపీనాథ్ తీరుపై ఆగ్రహంతో ఉన్నారు. ఆయనకు వ్యతిరేకంగా నిలిచే బలమైన అభ్యర్థికి మద్దతిచ్చే అంశాలను పరిశీలిస్తున్నారు. ఉప్పల్ నియోజకవర్గంలోఅభ్యర్థి సుభాష్‌రెడ్డికి కార్పొరేటర్ల సహాయ నిరాకరణ ఇంకా కొనసాగుతూనే ఉంది. అందరినీ సమన్వయం చేయటంలో అభ్యర్థి తీరుపై కార్పొరేటర్లతో పాటు మేయర్ రాంమోహన్, ఇటీవలే టీఎఆర్‌ఎస్‌లో చేరిన బండారి లక్ష్మారెడ్డి సైతం పెదవి విరుస్తున్నారు. ప్రకటించకున్నా ప్రచారంలోకి.. ఇంకా టీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించని ఖైరతాబాద్, అంబర్‌పేట, మల్కాజిగిరి, గోషామహల్ నియోజకవర్గాల్లో ఎవరికి వారే ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. ఖైరతాబాద్‌లో కార్పొరేటర్ విజ యారెడ్డి, నియోజకవర్గ టీఆర్ఎస్ ఇన్చార్జి మన్నె గోవర్ధన్‌రెడ్డిలతో పాటు ఇటీవలే టీఆర్ఎస్లో చేరిన మాజీ మంత్రి దానం నాగేందర్ ప్రచారం చేస్తున్నారు. దీంతో ఎవరికి టికెట్ ఇచ్చినా..ఇందులో మరొకరు పోటీ చేసే దిశగా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. మల్కాజిగిరి నియోజకవర్గంలోనూ తాజా మాజీ ఎమ్మెల్యే చింతల కనకారెడ్డి, ఎమ్మెల్సీ మైనంపల్లి హన్మంతరావుల మధ్య విభేదాలు భగ్గుమంటున్నాయి. తొలుత కనకారెడ్డి కోడలు, కార్పొరేటర్ విజయశాంతికి టికెట్ ఖరారైనట్లు సంకేతాలిస్తే..అలకబూనిన మైనంపల్లి సొం తంగా పోటీ చేసే ఏర్పాట్లు చేశారు. తాజాగా మైనంపల్లికి టికెట్ ఇస్తున్నట్లు సంకేతాలివ్వటంతో కనకారెడ్డితో పాటు కార్పొరేటర్లు బద్దం పుష్ప, ఆకుల నర్సింగ్‌రావు, కటకనేని శ్రీదేవిలు తీవ్రం గా వ్యతిరేకిస్తూ.. కనకారెడ్డి తీసుకునే నిర్ణయాన్ని బలపరిచే దిశగా అడుగులు వేస్తున్నారు. ఇక ముషీరాబాద్‌లో ముఠా గోపాల్‌కు టికెట్ ఖరారైన వార్తల నేపథ్యంలో హోంమంత్రి నాయిని నర్సిం హారెడ్డితో పాటు, రాంనగర్ కార్పొరేటర్ శ్రీనివాస్‌రెడ్డి సైతం తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. అధికారికంగా అభ్యర్థిని ప్రకటించే వరకు వేచి చూడాలనే ధోరణిలో శ్రీనివాస్‌రెడ్డి ఉన్నట్లు సమాచారం. -
టీఆర్ఎస్లో హోరెత్తుతున్న అసమ్మతి
సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్లో అసమ్మతి జ్వాలలు హోరెత్తుతున్నాయి. టీఆర్ఎస్ తరఫున అసెంబ్లీ టికెట్ దక్కని నేతలు తమ అసంతృప్తిని బహిరంగగానే వ్యక్తపరుస్తున్నారు. ఓ వైపు గత ఎన్నికల్లో ఇతర పార్టీల నుంచి పోటీ చేసి టీఆర్ఎస్లో చేరినవారికి ఈ సారి టికెట్ కేటాయించడంపై ఆశావాహులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు కొన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల పనితీరు సరిగా లేనప్పటికీ మళ్లీ వారినే బరిలో నిలపడాన్ని పలువురు నేతలు వ్యతిరేకిస్తున్నారు. పార్టీ కోసం పనిచేస్తున్న వారికి సరైన గుర్తింపు లభించడం లేదని మండిపడుతున్నారు. ముక్తల్‌లో అసమ్మతి సభ మహబూబ్‌నగర్ జిల్లాలోని మక్తల్ అసెంబ్లీ స్థానం తాజా మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డికి కేటాయించడంపై పలువురు టీఆర్ఎస్ నాయకులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇందుకు నిరసనగా నర్వ మండల కేంద్రంలో టీఆర్ఎస్ అసమ్మతి సభను నిర్వహించారు. ఈ సభకు మండలంలోని టీఆర్ఎస్ శ్రేణులు భారీగా తరలివచ్చారు. రామ్మోహన్‌రెడ్డికి టికెట్ ఇచ్చే విషయాన్ని కేసీఆర్ పునః పరిశీలించాలని కోరుతున్నారు. ఉద్యమకారులకు టీఆర్ఎస్ ద్రోహం చేసింది; మాజీ ఎమ్మెల్సీ సత్యనారాయణ సంగారెడ్డి నియోజకర్గంలో టీఆర్ఎస్లో అసమ్మతి రాజుకొంది. సంగారెడ్డి అసెంబ్లీ స్థానం కేటాయింపుపై టీఆర్ఎస్ అధినేత పునరాలోచించాలని మాజీ ఎమ్మెల్సీ సత్యనారాయణ అన్నారు. ఆయన మాట్లాడుతూ.. ఉద్యమకారులకు టీఆర్ఎస్ ద్రోహం చేసిందని విమర్శించారు. పార్టీ కోసం ఆస్తులు అమ్ముకొని పని చేశామని.. కానీ తమకు గుర్తింపు లేకుంగా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. 2009, 2014 ఎన్నికల్లో టికెట్ ఇవ్వకుండా పార్టీ అన్యాయం చేసిందని తెలిపారు. సంగారెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యేపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందన్నారు. -
టీఆర్ఎస్ నేత రవీందర్రావు సంచలన వ్యాఖ్యలు
సాక్షి, వరంగల్: టీఆర్ఎస్ తరఫున టికెట్ లభించని నేతల్లో అసంతృప్తి క్రమంగా బయటపడుతోంది. తాజాగా పాలకుర్తి అసెంబ్లీ టికెట్‌పై ఆశలు పెట్టుకున్న టీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, వరంగల్ ఉమ్మడి జిల్లాల అధ్యక్షులు తక్కళ్లపల్లి రవీందర్రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గత రెండు పర్యాయాలుగా పాలకుర్తి ప్రజలు టీఆర్ఎస్ పక్షాన నిలిచిన అన్యాయమే జరిగిందని అన్నారు. ఉద్యమకారులకు ఏ విధమైన సహాయ సహకారాలు అందడం లేదని విమర్శించారు. పాలకుర్తి అసెంబ్లీ స్థానంపై టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పునరాలోచించి.. అక్కడి ప్రజలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. పాలకుర్తి ఉద్యమకారులు గడ్డ అని.. భయపడే ప్రసక్తే లేదని తెలిపారు. ఉద్యమకారులను కాపాడే అవకాశం తనకు ఇవ్వాలని.. కార్యకర్తల ఇష్టానుసారం నడుచుకుంటానని అన్నారు. టీడీపీ నుంచి గెలిచిన దయాకర్ రావు టీఆర్ఎస్లో చేరిన తర్వాత పాలకుర్తిలో అభివృద్ది శూన్యం అని.. ఉద్యమకారులకు తీవ్ర అన్యాయం జరిగిందని ఆరోపించారు. తనకు ఇస్తానని చెప్పిన వరంగల్ ఎమ్మెల్సీ పదవి కొండ మురళికి ఇచ్చినా తాను బాధపడలేదని పేర్కొన్నారు. పాలకుర్తి నియోజకవర్గంలోని ప్రజల అభిప్రాయసేకరణతోనే తనకు టికెట్ ఇవ్వాలని కేసీఆర్‌కు విజ్ఞప్తి చేశారు. 2004, 2009, 2014లలో పాలకుర్తి అసెంబ్లీ టికెట్‌పై ఆశ పడినప్పటికీ.. కేసీఆర్ ఆదేశాల మేరకు తప్పుకున్నానని తెలిపారు. -
ఎగిసిపడుతున్న అసమ్మతి సెగలు!
సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్లో అసమ్మతి సెగలు ఎగిసిపడుతున్నాయి. టికెట్ రాని అసంతృప్త నేతలు అధిష్టానంపై గుర్రుగా ఉన్నారు. పార్టీ ప్రకటించిన అభ్యర్థులపై అసమ్మతి జెండా ఎగురవేస్తున్నారు. దీంతో చాలా నియోజకవర్గాల్లో రె‘బెల్స్’ మోగుతున్నాయి. పలు నియోజకవర్గాల్లో సొంత అభ్యర్థులపై రెబల్స్‌గా బరిలోకి దిగేందుకు గులాబీ నేతలు సిద్ధమవుతున్నారు. దీంతో గులాబీ దండులో గుబులు మొదలైంది. నియోజకవర్గాల వారీగా అసమ్మతి వ్యవహారానికి సంబంధించిన అప్డెట్స్ ఇవి.. టీఆర్ఎస్ టికెట్ దక్కకపోవడంతో నల్గొండ జిల్లా పరిషత్ చైర్మన్ నేనావత్ బాలు నాయక్ అసమ్మతి జెండా ఎగురవేశారు. దేవరకొండ నియోజకవర్గం టికెట్ తనకు కాకుండా రవీంద్రనాయక్ ఇవ్వడంతో ఆయన తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం తన అనుచరులతో బాలు నాయక్ భేటీ అయ్యారు. ఈ నేపథ్యంలో ఆయన మళ్లీ సొంత పార్టీ కాంగ్రెస్‌లో చేరే అవకాశముంది. రెండు మూడు రోజుల్లో బాలు నాయక్ భవిష్యత్ కార్యాచరణ ప్రకటించనున్నారు. నాగార్జున సాగర్ నియోజకవర్గం టీఆర్ఎస్లో ‘రెబెల్స్’ పోరు ఉధృతమవుతోంది. సాగర్ టికెట్ నోముల నర్సింహయ్యకు కేటాయించడంతో టికెట్‌పై ఆశించి భంగపడ్డ కోటిరెడ్డి వర్గం భగ్గుమంటోంది. రెండు వేల మంది అనుచరులతో కోటిరెడ్డి సమావేశం నిర్వహించి.. భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. వరంగల్ అర్బన్‌లో కొండా సురేఖ దంపతులకు టికెట్ ఇవ్వకపోవడంతో టీఆర్ఎస్లో వర్గపోరుకు తెరలేచింది. ఈ నేపథ్యంలో ఎనిమిదో డివిజన్ కార్పొరేటర్ దామోదర్ యాదవ్ ఆధ్వర్యంలో ఆదివారం ముఖ్య కార్యకర్తలు సమావేశమయ్యారు. పార్టీ అధిష్టానం, కేసీఆర్ ఆదేశాలే తమకు శిరోధార్యమని, కొండా దంపతులకు తాము అండగా నిలువబోమని కార్యకర్తలు స్పష్టం చేశారు. మహబూబాబాద్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ సిట్టింగ్ అభ్యర్థి శంకర్ నాయక్‌కు అసమ్మతి సెగ తగులుతోంది. మహబూబాబాద్ టిక్కెట్‌ను ఉద్యమకారులకు ఇవ్వాలంటూ టీఆర్ఎస్వీ కార్యకర్తలు ఆందోళన నిర్వహించారు. మహబూబాబాద్‌లో తాజా మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. కాగా, మాజీ మంత్రి రెడ్యానాయక్‌ను టీఆర్ఎస్ అభ్యర్థి శంకర్ నాయక్ మర్యాద పూర్వకంగా కలిశారు. జనగామ జిల్లా : స్టేషన్ ఘన్పూర్ టీఆర్ఎస్ అభ్యర్థి తాటికొండ రాజయ్యకు వత్యిరేకంగా అసమ్మతి సెగ రాజుకుంటోంది. ఆయనకు వ్యతిరేకంగా చిల్పూర్ మండలం పల్లగుట్ట శివారులో టీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తలు సమావేశమయ్యారు. స్టేషన్ ఘనపూర్ అభ్యర్థిని మార్చాలని కార్యకర్తలు సమావేశంలో డిమాండ్ చేశారు. -
పాపం...రాహుల్
ముంబై, మహారాష్ట్ర : రాజకీయాల పరంగా ఎన్ని విబేధాలున్నప్పటికి ప్రధానమంత్రి మోదీతో సహా పలువురు రాజకీయ నాయకులు ‘బర్త్‌డే బాయ్’ రాహుల్ గాంధీకి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ రెబల్స్ మాత్రం ఈ రోజు కూడా రాహుల్‌ను విడిచిపెట్టడం లేదు. పూణెకు చెందిన ఓ కాంగ్రెస్ పార్టీ రెబల్ రాహుల్‌కు వెరైటీ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపాడు. మహారాష్ట్ర పూణెకు చెందిన షెహ్జాద్ తన ట్విటర్లో ‘ఇప్పటికే అర్థ శతాబ్దాన్ని పూర్తి చేసుకున్న రాహుల్ గాంధీ గారికి పుట్టిన రోజు శుభాకాంక్షలు. మీరు నిండు నూరేళ్లు జీవించాలని కోరుకుంటున్నాను. ప్రస్తుతం మీరు బలవంతంగా చేస్తున్న ఈ ఉద్యోగాన్ని(కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి) వదిలి, కనీసం 2019 నాటికైనా మీ మనసుకు నచ్చిన ఉద్యోగాన్ని పొందాలని ఆశిస్తున్నాను’ అంటు ట్వీట్ చేసాడు. షెహ్జాద్ చేసిన మెసేజ్... Happy Birthday Rahul Gandhi ji! As you near half a century, I pray for your long life, and hope in 2019 you can pursue a profession which your heart really intends to pursue, rather than a job you have been forced to take up.. గతంలోను... షెహ్జాద్ రాహుల్‌ను విమర్శించడం ఇదే ప్రథమం కాదు. గతంలో రాహుల్‌ను కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఎన్నుకున్నప్పుడు కూడా షెహ్జాద్ తీవ్రమైన వ్యాఖ్యలు చేసాడు. ‘రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడిగా లేరు. వారసత్వం ప్రకార పట్టాభీషక్తుడయ్యే మొఘల్ సామ్రజ్యపు రాజులా ఉన్నారని విమర్శించాడు. రాహుల్ ఎన్నిక ప్రక్రియ మొఘల్ తరహా వారసత్వ పట్టాభీషేక ప్రక్రియాలా ఉంద’ని ఎద్దేవా చేశాడు. -
బాంబు దాడులు.. నెత్తుటి గాయాలు
సిరియాలో తిరుగుబాటుదారుల అధీనంలోని గౌటా భూభాగంలో ప్రభుత్వ దళాలు జరిపిన వైమానిక దాడుల్లో గాయపడి రోదిస్తున్న చిన్నారి. కొద్ది రోజులుగా ఉధృతంగా సాగుతున్న ఈ దాడుల్లో ఇప్పటికే 200 మందికి పైగా మృతిచెందినట్లు లండన్ కేంద్రంగా పనిచేస్తున్న మానవ హక్కుల సంస్థ ఒకటి ప్రకటించింది. -
గుజరాత్లో బీజేపీకి ఎదురు దెబ్బ
సాక్షి, న్యూఢిల్లీ : గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో సులభంగా విజయం సాధిస్తామని పాలకపక్ష భారతీయ జనతా పార్టీ భావిస్తున్న తరుణంలో ప్రతికూల పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. పార్టీలో రెబెల్స్ బెడద పెరిగిపోయింది. ఏకంగా 24 మంది తిరుగుబాటుదారులు స్వతంత్య్రంగా లేదా ఇతర పార్టీల అభ్యర్థులుగా ఎన్నికల బరిలో దిగారు. వారిలో ప్రధాన ప్రత్యర్థి అయిన కాంగ్రెస్ పార్టీ తరఫున కూడా కొంత మంది పోటీ చేస్తున్నారు. వారందరిని బీజేపీ పార్టీ నుంచి సస్పెండ్ చేయక తప్పలేదు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధిస్తుందని ఇంతకుముందు ప్రీపోల్ సర్వేలో అంచనా వేసిన ‘లోక్‌నీతి–సీఎస్‌డీస్’ నిర్వహించిన సర్వేలో వెల్లడికాగా, అదే సంస్థ ఇప్పుడు తాజాగా నిర్వహించిన సర్వేలో కాంగ్రెస్, బీజేపీల మధ్య పోటీ నువ్వా, నేనా అన్నట్లుగా ఉంటుందని తేలడం కూడా బీజేపీకి ప్రతికూల పరిణామమే. పాటిదార్లు, ఓబీసీలు, బీసీలు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా మారడంతో కాంగ్రెస్ పార్టీకి వచ్చే ఓట్ల శాతం అంచనా 29 శాతం నుంచి ఏకంగా 43 శాతానికి పెరిగింది. బీజేపీకి కూడా 43 శాతం ఓట్లు వస్తాయని తాజా సర్వేలో తేలింది. బీజేపీ తిరుగుబాటు అభ్యర్థుల్లో ప్రముఖుడు అజయ్ చౌద్రీ. ఆయన సూరత్‌కు చెందిన పార్టీ ప్రధాన కార్యదర్శి. దక్షిణ గుజరాత్‌లోని చోర్యాసి నియోజక వర్గం నుంచి రెబల్ అభ్యర్థిగా పోటీ చేయాలని నిర్ణయించుకోవడంతో ఆయన్ని పార్టీ బహిష్కరించింది. ‘నేను రెబల్‌ను కాదు, బీహార్ నుంచి వలసవచ్చిన వాడిని. నాలాగా ఎందరో కొన్ని దశాబ్దాల క్రితమే హిందీ మాట్లాడే రాష్ట్రాల నుంచి ఇక్కడికి వచ్చారు. వారేమిటో నాకు తెలుసు. అలాగే నేనేమిటో, నా గురించి పార్టీ ఏమనుకుంటుందో అన్నీ నాకు తెలుసు. చోర్యాసీలోని హిందీ మాట్లాడే ప్రజలు తమను బీజేపీ విస్మరించినట్లు భావిస్తున్నారు. వారంతా తిరుగుబాటు జెండా ఎగరేశారు. ఆ గ్రూపులో నేను ఒక్కడిని మాత్రమే’ అని అజయ్ చౌద్రీ వ్యాఖ్యానించారు. నరేంద్ర మోదీ 2001లో గుజరాత్ ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి 2014లో దిగిపోయే వరకు రాష్ట్ర బీజేపీలో ఇలాంటి తిరుగుబాటు ఎన్నడూ లేదు. ‘ఇదివరకు ఆదేశాలు పార్టీ పైస్థాయి నుంచి వచ్చేవి. కిందిస్థాయి నాయకత్వం కాదనకుండా శిరసావహించేది. నరేంద్ర మోదీ ప్రధాన మంత్రిగా వెళ్లిన తర్వాత రాష్ట్ర నాయకత్వంలో ఎవరు ఏ నిర్ణయాలు తీసుకుంటున్నారో, ఏ నిర్ణయం వెనక ఎవరి ప్రయోజనాలు ఉన్నాయో అర్థం కావడం లేదు’ అని సూరత్‌లోని కరంజ్ నియోజకవర్గం నుంచి స్వతంత్య్ర అభ్యర్థిగా ఎన్నికల బరిలోకి దిగిన బీజేపీ మరో రెబల్ భీమ్జీభాయ్ పటేల్ వ్యాఖ్యానించారు. ‘1981లో నేను పార్టీలో చేరాను. అప్పటికి నా వయస్సు 15 ఏళ్లే. అప్పటి నుంచి పార్టీకి విధేయుడైన సైనికుడిలాగానే పనిచేశాను. 2005 నుంచి 2015 మధ్య సూరత్ మున్సిపల్ కార్పొరేషన్లో కౌన్సిలర్‌గా పార్టీకి ప్రాథినిధ్యం వహించాను. కరంజ్ నుంచి అసెంబ్లీకి పోటీ చేస్తానని 2012లో పార్టీ అధిష్టానంకు చెప్పినప్పుడు. 2017లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో తప్పనిసరి పేరును పరిశీలిస్తామని హామీ ఇచ్చారు. టిక్కెట్ ఇవ్వకుండా మోసం చేశారు. అందుకనే నా దారి నేను వెతుక్కోవాల్సి వచ్చింది’ అని ఆయన చెప్పారు. చౌద్రీ, పటేల్ లాగానే బీజేపీ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యుడు కుమాన్సింహ్ వాసియా బారుచ్ జిల్లా జంబూసర్ నుంచి తిరుగుబాటు అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. నవ్సారి జిల్లాలోని జలాల్పూర్, చిఖ్లీ నియోజక వర్గాల్లోనైతే ఇద్దరేసి రెబల్ అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. జలాల్పూర్లో ధనుంజయ్ భట్, అర్జున్‌పటేల్ బరిలో దిగగా, చిఖ్లీ నియోజక వర్గం నుంచి పార్టీ మాజీ ఎంపీ కంజీ పటేల్, ఆయన కుమారుడు సునీల్ కంజీ పటేల్ పోటీ చేస్తున్నారు. సౌరాష్ట్రలో రెబల్ అభ్యర్థులు మరింత స్పష్టంగా కనిపిస్తున్నారు. జంజోద్పూర్ నుంచి రమేశ్ దంగర్, ద్వారకా నుంచి అర్జన్ కంజారియా, బెకనూర్ నుంచి గోవర్దన్ సర్వావియా, గిర్ సోమ్‌నాథ్ నుంచి తులసీ గోహిల్, భావ్‌నగర్ నుంచి దిల్వార్ సింగ్ గోహిల్, జామ్‌నగర్ నుంచి బీజేపీ మాజీ నాయకుడు వల్లభ్ భాయ్ ధరాసియా పోటీ చేస్తున్నారు. ఉత్తర గుజరాత్ నుంచి కూడా బీజేపీ ప్రముఖులు తిరుగుబాటు అ«భ్యర్థులుగా రంగంలోకి దిగారు. మెహమ్మదాబాద్ నుంచి జుబాన్ సింగ్, సనంద్ నుంచి మాజీ ఎమ్మెల్యే కామా రాథోర్, రాధన్‌పూర్ నుంచి డాక్టర్ విష్ణుద్దన్ జూలా...ఇలా రాష్ట్రంలోని ప్రతి ప్రాంతం నుంచి బీజేపీకి రెబల్స్ బెడద తప్పలేదు. -
రెబల్స్‌కి తలొగ్గిన బాబు
అమరావతి: స్థానిక సంస్థల కోటా, ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ స్థానాల భర్తీలో టీడీపీ రెబల్స్‌కే సీట్లు కేటాయించారు సీఎం చంద్రబాబు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో, రెబల్స్‌కే అధిక ఎమ్మెల్సీలు ఇచ్చారు. శ్రీకాకుళం నుంచి శత్రుచర్ల, కర్నూలు నుంచి శిల్పా చక్రపాణిరెడ్డి, ప్రకాశం నుంచి కరుణం బలరాం, పోతుల సునీత మాకు టికెట్లు ఇవ్వకపోతే రెబల్స్‌గా నామినేషన్ వేస్తామన్నారు. చిత్తూరులో దొరబాబు, అనంతలో దీపక్‌రెడ్డి అల్టిమేటం జారీ చేశారు. ఒత్తిళ్లకు తలొగ్గిన బాబు వారికి ఎమ్మెల్సీ స్థానాలు కేటాయించారని గుసగుసలు వినిపిస్తున్నారు. -
ట్రంప్ కు షాక్: రిపబ్లికన్ పార్టీలో రెబల్స్
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలుపొందిన డోనాల్డ్ ట్రంప్ ను అధ్యక్షపీఠాన్ని అధిరోహించకుండా అడ్డుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అధ్యక్ష పదవిని చేపట్టడానికి 270 ఎలక్టోరల్ కాలేజ్ ఓట్లు అవసరం అవుతాయి. ఎన్నికల్లో గెలుపొందిన ట్రంప్ కు అధ్యక్షుడిగా పదవిని చేపట్టాడానికి ఆరుగురు రిపబ్లికన్లు సుముఖత చూపడం లేదు. ట్రంప్ ను వ్యతిరేకిస్తూ ఆరుగురు రెబల్స్ అపనమ్మక ఒప్పందాన్ని కూడా కుదుర్చుకున్నారు. అంతేకాకుండా వీరు మరో 37మంది రిపబ్లికన్లను ట్రంప్ కు అనుకూలంగా ఓటు వేయొద్దని కోరుతున్నారు. ఎన్నికల్లో రిపబ్లికన్లు 290 ఎలక్టోరల్ కాలేజ్ స్ధానాల్లో గెలుపొందగా, డెమొక్రాట్లు 232 స్ధానాల్లో గెలుపొందారు. 228 ఏళ్ల అమెరికా ఎన్నికల చరిత్రలో ఇప్పటివరకూ 71మంది అధ్యక్ష అభ్యర్ధిపై అపనమ్మకాన్ని వ్యక్తం చేస్తూ తమ మద్దతును ఉపసంహరించుకున్నారు. ఎలక్టోరల్ కాలేజ్ లో ఓట్లు తక్కువైనా, రిపబ్లికన్ల ఆధిక్యం గల హౌజ్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ ట్రంప్ కు అనుకూలంగా ఉండటంతో అధ్యక్ష పీఠాన్ని ట్రంప్ అధిరోహించడం ఖాయం. కొలరడో ఎలక్టోరల్ కాలేజ్ మెంబర్ అయిన మైఖేల్ బకా అధ్యక్షుడిగా ట్రంప్ ను వ్యతిరేకిస్తున్న వారిలో ఒకరు. యూఎస్ మెరైన్ మాజీ ఉద్యోగి అయిన బకా ట్రంప్ దేశ కాపాడతారనే నమ్మకం తనకు లేదని చెప్పారు. అందుకే ట్రంప్ అధ్యక్షపదవిని చేపట్టకుండా అడ్డుకునేందుకు ఇతర సభ్యుల మద్దతు కూడగడుతున్నట్లు తెలిపారు. ట్రంప్ అధ్యక్ష పదవి చేపడితే అమెరికాలో రాజకీయ సంక్షోభం తలెత్తుతుందని పేరు చెప్పడానికి ఇష్టపడని ఓ ఎలక్టోరల్ కాలేజ్ సభ్యుడు చెప్పారు. అందుకే ట్రంప్ ను తాను వ్యతిరేకిస్తున్నట్లు పేర్కొన్నారు. అయితే ఎంతమంది ఎలక్టోరల్ కాలేజ్ సభ్యులు ట్రంప్ పై అసంతృప్తిగా ఉన్నారో తెలియరాలేదు. -
తిరుగుబాటుపై వేటు
17 మందిని బహిష్కరించిన టీఆర్ఎస్ హన్మకొండ: తిరుగుబాటు అభ్యర్థులపై టీఆర్ఎస్ వేటు వేసింది. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి టికెట్ ఆశించి భంగపడిన నాయకులు రెబల్స్‌గా బరిలో ఉన్నారు. వీరు పోటీ నుంచి తప్పుకోక పోవడంతో పార్టీ క్రమశిక్షణ చర్య తీసుకుంది. బహిష్కరించిన వారి వివరాలను టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తక్కళ్లపల్లి రవీందర్రావు వెల్లడించారు. 56వ డివిజన్‌కు చెందిన వల్లాల యాదగిరి, పెద్దమ్మ శ్రీనివాస్, గిన్నారపు రవీందర్, ఇమ్మడి రవీందర్, జన్ను కిషన్, వల్లాల గణేష్, ధీకొండ బిక్షపతి, ఆరెపల్లి కమలాకర్, పెద్దమ్మ శ్రీను, 19వ డివిజన్‌కు చెందిన గంట రవికుమార్, 22వ డివిజన్‌కు చెందిన గడ్డం యుగేంధర్, గడ్డం స్రవంతి, 20వ డివిజన్‌కు చెందిన సిద్ధం రాజు, 4వ డివిజన్‌కు చెందిన బిల్ల శ్రీకాంత్, బిల్ల కవిత, 13వ డివిజన్‌కు చెందిన ఓని భాస్కర్, నగరి స్వర్ణలత, 56వ డివిజన్‌కు చెందిన నాగమల్ల ఝాన్సీ, నాగమల్ల సురేష్‌ను బహిష్కరించినట్లు రవీందర్రావు వివరించారు. -
ఈ సారి కూడా కుటుంబ రాజకీయాలే....
‘స్థానిక’ ఎన్నికల్లో కూడా కుల రాజకీయాలు ధనవంతులకే ప్రాధాన్యం టికెట్ దక్కకపోతే ఇతర పార్టీల్లోకి జంప్ ! ప్రధాన పార్టీలకు దడ సాక్షి, బెంగళూరు: రాష్ట్రంలో జిల్లా, తాలూకా పంచాయతీ ఎన్నికల సంగ్రామం రోజురోజుకు వేడెక్కుతోంది. ఇక జిల్లా, తాలూకా పంచాయతీ ఎన్నికలకు సంబంధించి టికెట్ దక్కని నేతలంతా ఇతర పార్టీల్లో చేరి బీఫాం తీసుకోవడమో లేదంటే రెబల్స్‌గానో బరిలోకి దిగుతున్నారు. ఈ నేపథ్యంలో రెబల్స్ అన్ని పార్టీలకు పెద్ద తలనొప్పిగా తయారవుతున్నారు. మొదటి విడత ఎన్నికల్లో భాగంగా ఫిబ్రవరి 13న 15 జిల్లా పంచాయతీ, 95 తాలూకా పంచాయతీల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో మొదటి విడతలో పోలింగ్ జరగనున్న జిల్లా, తాలూకా పంచాయతీల్లో అభ్యర్థుల ప్రచారం జోరందుకుంది. ఓటర్లను ఆకర్షించే దిశగా అభ్యర్థులంతా ప్రచారంలో మునిగిపోయారు. ఇదే సందర్భంలో ఆయా పార్టీల్లో టికెట్లు దక్కని అభ్యర్థులు రెబల్స్‌గా బరిలోకి దిగి తమకు టికెట్ కేటాయించని పార్టీల అభ్యర్థులు ఎలాగైనా సరే ఓటమి పాలయ్యేలా శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు. ముఖ్యంగా బెంగళూరు నగర, బెంగళూరు గ్రామీణ, రామనగర, చిత్రదుర్గ, దావణగెరె, కోలారు, చిక్కబళ్లాపుర, తూమకూరు ఇలా మొదటి విడతలో ఎన్నికలు జరగనున్న అన్ని ప్రాంతా ల్లోనూ రెబల్ అభ్యర్థులు ప్రధాన పార్టీల నేతలకు చెమటలు పట్టిస్తున్నారు. ఇక తమ సొంత పార్టీ నుంచి టికెట్ దక్కని వారంతా ఇతర పార్టీల్లో చేరిపోయారు. ఆ పార్టీ నుంచి బి-ఫారం తీసుకొని పోటీలో నిలబడుతున్నారు. దీంతో ఆయా ప్రాంతాల్లో పట్టున్న స్థానికులు ఇతర పార్టీల్లో చేరిపోవడంతో ప్రధాన పార్టీలన్నీ ఎన్నికలను ఎలా ఎదుర్కొనాలా అన్ని డైలమాలో పడిపోతున్నాయి. ఈ సారి కూడా ఇక ఈ సారి కూడా జిల్లా, తాలూకా పంచాయతీ ఎన్నికల్లో కుటుంబ రాజకీయాలే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మాజీ ప్రధానమంత్రి హెచ్.డి.దేవెగౌడ కోడలు భవానీ రేవణ్ణ, కె.ఎస్.ఈశ్వరప్ప కుమారుడు కాంతరాజు, కోలారు ఎంపీ కె.హెచ్.మునియప్ప కుమార్తె రూపా శశిధర్, మాజీ మంత్రి ఎం.బి.పాటిల్ కుమారుడు వినయ్ పాటిల్, ఎమ్మెల్సీ వివేక్రావ్ పాటిల్ కుమారుడు ప్రణయ్ పాటిల్, మాజీ మంత్రి ఉమేష్ కత్తి కుమారుడు నిఖిల్ కత్తి, ఎమ్మెల్యే ఎస్.ఆర్.శ్రీనివాస్ భార్య భారతి, మాజీ ఎమ్మెల్యే వెంకటరమణప్ప కుమారుడు వెంకటేష్ ఇలా చాలా మంది ప్రముఖుల కుటుంబ సభ్యులు ఈ ఎన్నికల్లో పోటీ చేస్తుండడం గమనార్హం. ధన ప్రవాహం..... ప్రచారంలో భాగంగా ఓటర్లను ఆకర్షించేందుకు ఆయా పార్టీల అభ్యర్థులు అన్ని విధాల ప్రయత్నిస్తున్నాయి. ఇందులో భాగంగానే ఆయా జిల్లా పంచాయతీలు, తాలూకా పంచాయతీల్లో ధన ప్రవాహం కనిపిస్తోంది. గ్రామాల్లోని స్త్రీ శక్తి సంఘాలు, యువ సంఘాలు, స్వచ్ఛంద సేవా సంఘాలు ఇలా అన్ని సంఘాల ద్వారా ఓటర్లకు డబ్బును చేర్చే ప్రయత్నం చేస్తున్నాయి. ఇదే సందర్భంలో మద్యం, చీరలు, ముక్కుపుడకలు, గృహోపకరణాలు ఇలా వివిధ రకాల బహుమతులను ఓటర్లకు అందజేసి వారి ఓటు బ్యాంకును కొల్లగొట్టేదిశగా పార్టీలు ప్రణాళికలు రచిస్తున్నాయి. -
GHMC ఎన్నికల్లో కాంగ్రెస్‌కు రెబెల్స్ టెన్షన్
-
GHMC ఎన్నికల్లో టీఆర్ఎస్కు తప్పని రెబల్స్
-
గడువు ముగిసింది
-
గడువు ముగిసింది
హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల గడువు పూర్తయింది. చివరి రోజు 500 మందికి పైగా అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. అయితే చాలా చోట్ల రెబల్ అభ్యర్థులు పోటీ నుండి తప్పుకోవడానికి నిరాకరించారు. అన్ని పార్టీలకు రెబల్ అభ్యర్థుల బెడద ఉంది. 150 డివిజన్లకు 4,069 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. 189 నామినేషన్లను చెల్లుబాటు కానివిగా ఎన్నికల అధికారులు తేల్చారు. బీఫామ్‌ల విషయంలో చివరి నిమిషంలో గందరగోళం నెలకొంది. కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ పార్టీలు ముందుగా ఒకరి పేరును ప్రకటించి బీఫామ్‌లు మరొకరికి ఇవ్వడంతో.. టికెట్ దక్కని వారు పార్టీ కార్యాలయాల వద్ద ఆందోళనకు దిగారు. పలు డివిజన్లలో టీడీపీ, బీజేపీల పొత్తు వికటించింది. కొన్ని చోట్ల అభ్యర్థులకు రెండు పార్టీలూ బీఫాంలు ఇచ్చాయి. నామినేషన్ల ఉపసంహరణ చివరి రోజు కాంగ్రెస్ పార్టీ పలువురు అభ్యర్థులను మార్చింది. అధికార పార్టీ టీఆర్ఎస్కు కూడా రెబల్ అభ్యర్థుల బెడద తప్పలేదు. -
రెబల్స్ విపక్షలకు అధికార పార్టీ బంపర్ ఆఫర్
-
తప్పుకోండి ప్లీజ్!
⇒ రెబల్స్ విత్ డ్రా కోసం పాట్లు ⇒ అన్ని పార్టీల్లో బుజ్జగింపుల కమిటీలు ⇒ మాట వినేందుకు స్పెషల్ ఆఫర్లు ⇒ నేటి నుంచి నామినేషన్ల ఉపసంహరణ సిటీబ్యూరో: జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టికెట్లు ఆశించి భంగపడి... తిరుగుబాటు అభ్యర్థులుగా బరిలో నిలిచిన వారిని పోటీ నుంచి తప్పించేందుకు ప్రధాన రాజకీయ పార్టీలు స్పెషల్ ప్యాకేజీలు సిద్ధం చేశాయి. మంగళవారం నుంచినామినేషన్ల ఉపసంహరణ ఘట్టం మొదలవుతుండటంతో రాజకీయ పార్టీల ‘బుజ్జగింపు కమిటీ’ల ప్రతినిధులు స్పెషల్ ప్యాకేజీలతో రంగంలోకి దిగారు. తమ మాట విని... పార్టీ అధికారిక అభ్యర్థి విజయానికి కృషి చేస్తే తప్పక న్యాయం చేస్తామని భరోసా ఇస్తున్నారు. సోమవారం నామినేషన్ల పరిశీలన ముగిసిన అనంతరం 150 డివిజన్లకు గాను తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థులమంటూ 655 మంది, కాంగ్రెస్ అభ్యర్థులుగా 519 మంది, బీజేపీ తరఫున 331 మంది, తెలుగుదేశం నుంచి 530 మంది మిగిలారు. వీరిలో గడువులోగా బీ ఫారం ఎవరు అందజేస్తే వారే అధికారిక అభ్యర్థి. స్పెషల్ ఆఫర్లతో టీఆర్ఎస్ బృందం తెలంగాణ రాష్ట్ర సమితి ఉన్నత స్థాయి బృందాలు స్పెషల్ ఆఫర్లతో రంగంలోకి దిగాయి. మంత్రులు, ఎమ్మెల్యేలతో కూడిన బృందాలు ప్రతి డివిజన్‌నూ ప్రతిష్టాత్మకంగా తీసుకుని తిరుగుబాటుదారులతో చర్చలు ప్రారంభించాయి. టీఆర్ఎస్ తర ఫున మొత్తం 888 నామినేషన్లు దాఖలయ్యాయి. అందులో సరైనవి 655గా తేల్చారు. వీరిలో అధికారిక అభ్యర్థులు కాకుండా 128 మంది బలమైన వ్యక్తులు పోటీలో ఉన్నారు. వీరికి నామినేటెడ్ లేదా ఇతర పదవులిస్తామన్న హామీలతో పాటు తగిన గుర్తింపునిస్తామని ప్రతిపాదనలు చేస్తున్నారు. ‘దేశం’-బీజేపీలలో ఎవరికి వారే తెలుగుదేశం-బీజేపీలు 87-63 స్థానాల్లో పోటీ చేయాలని నిర్ణయించాయి. అధికారికంగా చాలా చోట్ల అభ్యర్థులను ఆలస్యంగా ప్రకటించటంతో భారీ ఎత్తున ఆశావహులు నామినేషన్లు దాఖలు చేశారు. టీడీపీలో 688 మంది నామినేషన్లు వేయగా... అందులో 530, బీజేపీలో 456 వేయగా... 331 నామినేషన్లు సక్రమంగా ఉన్నాయని అధికారులు తేల్చారు. చాలా చోట్ల ఇరుపక్షాల్లో భారీగా తిరుగుబాటు అభ్యర్థులు ఉన్నా.. ఈ రెండు పార్టీల తరఫున వారిని శాంతింపజేసే దిశగా కార్యాచరణ ప్రారంభం కాలేదు. మల్కాజిగిరి తదితర నియోజక వర్గాల్లో అయితే తాము చంద్రబాబు చెబితే తప్ప దిగిరాబోమని ఆ పార్టీ నేతలు భీష్మించుకు కూర్చుంటున్నారు. కాంగ్రెస్‌లో ఇన్‌చార్జులకే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తరఫున 698 మంది నామినేషన్లు దాఖలు చేశారు. అందులో 519 సక్రమమైనవని అధికారులు తేల్చారు. 150 డివిజన్లకు భారీగా పోటీ ఉండడంతో తిరుగుబాటు అభ్యర్థులను బరిలో నుంచి తప్పించే బాధ్యతను నియోజకవర్గ ఇన్‌చార్జులకే పీసీసీ అప్పగించింది. మెజారిటీ నియోజకవర్గాల్లో ఇన్చార్జుల సూచనల మేరకే టికెట్లు కేటాయించిన దృష్ట్యా మిగిలిన భారాన్ని కూడా వారిపైనే ఉంచుతున్నట్లు పీసీసీ తేల్చేసింది. మత పెద్దలకు..ఎంఐఎం బాధ్యత ఎంఐఎం అభ్యర్థులుగా 89 స్థానాల్లో నామినేషన్లు వేయగా... అందులో 66 చోట్ల నామినేషన్లు సక్రమమేనని తేల్చారు. కొన్ని చోట్ల తిరుగుబాటు అభ్యర్థులుగా రంగంలో మిగిలినవారిని ఉపసంహరింపజేసే బాధ్యతను మత పెద్దలకు పార్టీ అప్పగించింది. -
‘డబుల్’ రెబల్స్!
జీహెచ్ఎంసీ ఎన్నికల రంగంలో రెండు డివిజన్లలో భార్యా భర్తలు బరిలోకి దిగారు. ఆయా పార్టీల టికెట్లు దక్కకపోవడంతో వీరు రెబల్స్‌గా మారారు. ఖైరతాబాద్ డివిజన్ బీజేపీ రెబల్ అభ్యర్థిగా పి.సావిత్రి సురేందర్ నామినేషన్ దాఖలు చేయగా బంజారాహిల్స్ డివిజన్ నుంచి బీజేపీ రెబల్ అభ్యర్థిగా సావిత్రి భర్త పి.సురేందర్ ఆదివారం నామినేషన్ దాఖలు చేశారు. ఈ ఎన్నికల్లో తామిద్దరం ఘన విజయం సాధిస్తామని వారు ధీమా వ్యక్తం చేశారు. ఇక బంజారాహిల్స్ డివిజన్ టీడీపీ టికెట్ దక్కకపోవడంతో శ్రీనివాస్‌నాయుడు రెబల్‌గా మారారు. ఆయనతోపాటు ఆయన సతీమణి సుజాతతోనూ నామినేషన్ వేయించారు. ఈమె స్వతంత్ర అభ్యర్థిగా నిలిచారు. ఇద్దరిలో ఎవరు గెలుస్తారని ప్రశ్నించగా మా ఆయనే గెలుస్తాడంటూ సుజాత ముసిముసినవ్వులు నవ్వగా.. లేదు ప్రజల సేవలో ఉన్న తన భార్యకే డివిజన్ ప్రజలు పట్టం కడతారంటూ శ్రీనివాస్ నాయుడు గర్వంగా చెప్పారు. మొత్తమ్మీద బంజారాహిల్స్ డివిజన్లో బీజేపీ, టీడీపీలకు పోటీగా రెండు జంటలు రెబల్స్ అవడం ఇక్కడ చర్చనీయాంశంగా మారింది. - బంజారాహిల్స్ -
టీడీపీకి ‘పొత్తు’ పోటు
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ ఎన్నికలు టీడీపీకి తలనొప్పిగా మారాయి. 150 డివిజన్లలో 63 డివిజన్లను బీజేపీకి కేటాయించి, 87 చోట్ల పోటీ చేస్తున్న టీడీపీకి ప్రతి నియోజకవర్గంలో అసంతృప్తుల గొడవ ఎక్కువైంది. టీఆర్ఎస్తో కుమ్ముక్కై బీజేపీకి గెలిచే సీట్లను కేటాయించారని పలు డివిజన్ల నేతలు బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు. అదే సమయంలో టికెట్లు ఇప్పిస్తామని అడ్వాన్సుల రూపంలో పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకున్న ఒకరిద్దరు నాయకులను టిక్కెట్ల కోసం నిలదీస్తున్నారు. శనివారం రాత్రి కేంద్ర మంత్రి సుజనా చౌదరి కార్యాలయంలోనే శేరిలింగంపల్లిలోని ఓ డివిజన్ టికెట్ ఇప్పిస్తానని లక్షల రూపాయలు తీసుకున్న ఓ ముఖ్యనేతను నిలదీసినట్లు సమాచారం. సదరు సీటు బీజేపీకి కేటాయించడంతో తరువాత అవకాశం కల్పిస్తానని హామీ ఇచ్చిన నేతను బూతులు తిడుతూ తన సొమ్ము తనకు ఇమ్మని గొడవ పెట్టుకున్నట్లు సమాచారం. చివరికి ఆ డివిజన్‌కు బదులు వేరే చోట టికెట్ కేటాయించిన పరిస్థితి. అలాగే ఖైరతాబాద్, మలక్‌పేట నియోజకవర్గాల్లో కూడా కొన్ని సీట్లను బేరం చేసుకుని అమ్ముకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. కూకట్పల్లి, శేరిలింగంపల్లి, ఉప్పల్, మల్కాజిగిరి వంటి శివార్లలో బీజేపీకి సీట్లు కేటాయించడంపై తెలుగు తమ్ముళ్లు ఎన్టీఆర్ భవన్ వద్ద శని, ఆదివారాల్లో గొడవలకు దిగారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎ. రేవంత్‌రెడ్డి, హైదరాబాద్ నగర అధ్యక్షుడు మాగంటి గోపీనాథ్‌లను టిక్కెట్లు దక్కని నాయకులు తీవ్ర పదజాలంతో విమర్శలకు దిగడం రెండు రోజులుగా సర్వసాధారణమైంది. ఒక్కో నియోజకవర్గంలో రెండేనా? అంబర్‌పేట, ఖైరతాబాద్, ముషీరాబాద్, సికింద్రాబాద్, సనత్‌నగర్, మలక్‌పేట, ఎల్బీ నగర్, మల్కాజిగిరి వంటి నియోజవకర్గాలు ఒకప్పుడు టీడీపీకి బలమైన స్థానాలు. అయితే వీటిలో బీజేపీ మెజారిటీ సీట్లను తీసుకొని టీడీపీ ఒకటి లేదా రెండు సీట్లు మాత్రమే తీసుకోవడంపై తమ్ముళ్లు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. అంబర్‌పేటలో కేవలం నల్లకుంట, ముషీరాబాద్‌లో ముషీరాబాద్, కవాడిగూడ, ఖైరతాబాద్‌లో ఖైరతాబాద్, సోమాజీగూడ, సికింద్రాబాద్‌లో మూడు, సనత్‌నగర్‌లో రెండు సీట్లలో మాత్రమే పోటీ చేయడంపై టీడీపీ కార్యకర్తలు కత్తులు దూస్తున్నారు. మజ్లిస్ ప్రాబల్యం ఉన్న నియోజకవర్గాల్లో 25 నుంచి 30 సీట్ల వరకు టీడీపీ పోటీ చేస్తుండటం, గెలిచే అవకాశాలున్న స్థానాలను బీజేపీకి కేటాయించడం నాయకత్వ అసమర్థతకు నిదర్శనమని విమర్శిస్తున్నారు. పార్టీలో మిగిలిన ఎమ్మెల్యేలు ప్రాతినిథ్యం వహిస్తున్న రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి, కుత్బుల్లాపూర్, ఎల్బీనగర్లలో బీజేపీకి అడిగినన్ని సీట్లు కేటాయించడంపైనా ఆగ్రహం వ్యక్తమవుతోంది. బీజేపీ స్థానాల్లో రెబల్స్ 150 డివిజన్లలో 60 సీట్లు బీజేపీకి అని మొదట భావించినప్పటికీ, తరువాత గెలుపు అవకాశాలున్న సీట్లతో పాటు మరో మూడింటిని అదనంగా ఇచ్చారని తమ్ముళ్లు ఆగ్రహంతో ఉన్నారు. టీడీపీ సిట్టింగ్ సీట్లు హిమాయత్‌నగర్, అమీర్‌పేట, గాంధీనగర్ వంటి డివిజన్లను కూడా బీజేపీకి కేటాయించడంపై గరంతో ఉన్న నేతలు టీడీపీ అభ్యర్థులుగానే నామినేషన్లు వేశారు. స్నేహపూర్వకపోటీలో ఎవరి సత్తా ఏంటో తెలుస్తుందని, బీ-ఫారాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. కాగా బీజేపీ పోటీ చేసిన దాదాపు అన్ని డివిజన్లలో టీడీపీ తరఫున ఒకటికి పైగా నామినేషన్లు దాఖలయ్యాయి. బీ-ఫారాలు ఇవ్వకపోతే ఇండిపెండెంట్‌గా కొనసాగుతామని వారు హెచ్చరిస్తున్నారు. -
గుండెల్లో రె‘బెల్స్’
-
గుండెల్లో రె‘బెల్స్’
సిటీబ్యూరో: గ్రేటర్ ఎన్నికల్లో వివిధ పార్టీలకు రెబెల్స్ బెడద తప్పడం లేదు. ముఖ్యంగా అధికార టీఆర్ఎస్ పార్టీలో వీరి సంఖ్య అధికంగా ఉంది. నియోజకవర్గాల వారీగా పరిశీలిస్తే... కుత్బుల్లాపూర్‌లో.. జీడిమెట్లలో గుమ్మడి మాధవి, చింతల్లో ఐదుగురు టీఆర్ఎస్ నేతలు నామినేషన్లు వేశారు. సూరారంలో అత్యధికంగా ఎనిమిది మంది ఔత్సాహికులు నామినేషన్లు వేయడం గమనార్హం. ఖైరతాబాద్‌లో.. బంజారాహిల్స్ డివిజన్ నుంచి ప్రగతిరెడ్డి, రఘుముదిరాజ్, సోమాజిగూడ నుంచి కె.ప్రసన్న నామినేషన్లు దాఖలు చేయడంతో అధికార పార్టీకి చిక్కులు తెచ్చిపెడుతున్నాయి. కూకట్‌పల్లిలో... కేపీహెచ్‌బీ డివిజన్ నుంచి జనగాం సురేష్‌రెడ్డి, లింగ్యానాయక్, వివేకానందనగర్ కు మాచర్ల పద్మభద్రయ్య, కె.శ్రీలత, శ్వేత నామినేషన్లు వేశారు. ఆల్విన్ కాలనీ నుంచి లద్దె నాగరాజు, కె.వెంకటేశ్ గౌడ్, హైదర్‌నగర్ నుంచి కోడూరి రాధాకృష్ణ, జానకిరామరాజు, రాధాకృష్ణ నామినేషన్లు వేశారు. అల్లాపూర్ నుంచి టి.అంజమ్మ, ఎన్.పుష్పలత, మూసాపేట్ నుంచి టి.ఎల్లారావు, బి.నర్సింగ్‌రావు, ఎ.వీరబాబు, ఫతేనగర్ నుంచి టి.ఎల్లారావు, భిక్షపతి, శ్రీనివాస్ గౌడ్, ఓల్డ్‌బోయిన్‌పల్లి నుంచి యాదగిరి, అమూల్య, జంగయ్య, అజార్, రవికుమార్, బాలానగర్ నుంచి ఆవుల రవీందర్‌రెడ్డి, శంకర్‌గౌడ్, కూకట్పల్లి నుంచి జూపల్లి శైలజ, ఎమ్డీ ఇబ్రహీం నామినేషన్లు వేశారు. రాజేంద్రనగర్‌లో.. రాజేంద్రనగర్‌లో టి.అర్చన జయప్రకాశ్ రెబెల్‌గా నామినేషన్ వేశారు. సికింద్రాబాద్‌లో... అడ్డగుట్టలో లక్ష్మీ హంసరాజ్, మెట్టుగూడలో సంధ్య, తార్నాకలో ఎల్లమ్మ, సీతాఫల్మండిలో హేమ, జ్యోతి రెబెల్స్‌గా బరిలో నిలిచే అవకాశాలు ఉన్నాయి. మహేశ్వరంలో.. సరూర్‌నగర్ డివిజన్ నుంచి టీఆర్ఎస్ అభ్యర్థులు ఏడుగురు నామినేషన్లు వేయడంతో రాజకీయం రసవత్తరంగా మారింది. మల్కాజ్‌గిరిలో.. మచ్చబొల్లారం నుంచి రాజ్ జితేంద్రనాథ్, మన్నె శ్రీనివాస్‌రాజు, ఉదయ్‌కుమార్, సువర్ణ నామినేషన్లు వేశారు. వెంకటాపురం నుంచి సీఎల్ యాదగిరి, సబితాకిషోర్, సంపత్, శ్రీలత బరిలో నిలిచారు. అంబర్‌పేట్‌లో... నల్లకుంట నుంచి గుంటి నాగరాణి, అంబర్పేట్ నుంచి కె.పద్మావతి, కాచిగూడ నుంచి లావ ణ్య నామినేషన్లు వేశారు. శేరిలింగంపల్లిలో.. కొండాపూర్ డివిజన్ నుంచి మమత, రాజేష్ నామినేషన్లు వేశారు. మిగతా డివిజన్లలో రెబెల్స్ బెడద అంతగా లేనట్లు సమాచారం. ముషీరాబాద్‌లో.. రాంనగర్ డివిజన్లో నందికంటి నర్సింగ్‌రావు, అడిక్‌మెట్ నుంచి సునీత ప్రకాశ్‌గౌడ్, హేమలత జయరాంరెడ్డి నామినేషన్లు వేశారు. ఉప్పల్‌లో.. ఏఎస్‌రావునగర్‌లో మణెమ్మ, పద్మ, చర్లపల్లిలో చెన్నయ్య గౌడ్, మీర్పేట్లో ప్రభుదాస్, మల్లాపూర్‌లో భాస్కర్‌గౌడ్, కొత్తమల్లారెడ్డి, నాచారంలో సువర్ణ, రామంతాపూర్‌లో భాగ్యరేఖ, రాజేశ్వరి, హ బ్సిగూడలో గడ్డం శాంతమ్మ రెబెల్స్‌గా బరిలో నిలిచారు. సనత్‌నగర్‌లో... బేగంపేట్‌లో కాంచనమాల, తరుణి, అనిత, సనత్ నగర్ నుంచి బైరు రమ్య అసంతృప్తులుగా బరిలోకి దిగారు.ట ఎల్బీ నగర్లో... నియోజకవర్గంలో 11 డివిజన్లు ఉన్నాయి. కొన్నిచోట్ల అధికార టీఆర్ఎస్కు రెబెల్స్ బెడద అధికంగా ఉంది. హయత్ నగర్, వనస్థలిపురం, బీఎన్‌రెడ్డినగర్, మన్సూరాబాద్, నాగోల్, లింగోజిగూడ, చంపాపేట్, కొత్తపేట్, గడ్డిఅన్నారం, హస్తినాపురం డివిజన్ల లో కొంతమందికి పార్టీ టిక్కెట్ ప్రకటించనప్పటికీ నామినేషన్లు వేయ డం గమనార్హం. వనస్థలిపురంలో జిట్టా రాజశేఖర్‌రెడ్డి, బీఎన్‌రెడ్డి నగర్లో లక్ష్మీప్రసన్న, రంజిత్గౌడ్తో పాటు ఐదుగురు టీఆర్ఎస్ నేతలు నామినేషన్లు వేశారు. మన్సూరాబాద్‌లో నాగరాజు, నాగోల్‌లో చెరుకు ప్రశాంత్‌గౌడ్ సహా ఏడుగురు నామినేషన్లు వేశారు. లింగోజిగూడలో అత్యధికంగా 17 మంది టీఆర్ఎస్ ఆశావహులు నామినేషన్లు దాఖలు చేశారు. చంపాపేట్‌లో ఆరుగురు, కొత్తపేట్‌లో 8మంది, గడ్డిఅన్నారంలో ఇద్దరు, హస్తినాపురంలో ఏడుగురు నామినేషన్లు వేయడం గమనార్హం. బీజేపీలోనూ అసంతృప్తులు బీజేపీలోనూ అసంతృప్తులు తప్పడం లేదు. బీజేపీ బలంగా ఉన్న డివిజన్లలో టీడీపీ అభ్యర్థులను ప్రకటించడంతో కమలనాథులు మండిపడుతున్నారు. ప్రధానంగా ఎల్బీనగర్, రాజేంద్రనగర్, అంబర్పేట్, సికింద్రాబాద్ నియోజకవర్గాల్లో బీజేపీకి కాస్తోకూస్తో బలం ఉన్న డివిజన్లను టీడీపీకి కేటాయించడంతో పలువురు రెబెల్స్‌గా బరిలోకి దిగేందుకు ఉద్యుక్తులవుతున్నారు. -
'టర్కీ దొంగ దేశం.. ఉగ్రవాదులకు సహకరిస్తోంది'
సిరియా: టర్కీపై సిరియా విమర్శల వర్షం కురిపించింది. టర్కీ ఉగ్రవాదులకు సహకరిస్తోందని సిరియా సైనికాధికారులు ఆరోపించారు. సిరియా సరిహద్దులోని ఇరాకీ ఆయిల్ ను , ఇతర యుద్ధ సామాగ్రిని దొంగచాటుగా ఉగ్రవాదుల నుంచి స్వీకరిస్తోందని ప్రకటించింది. టర్కీ సరిహద్దుల గుండా ఉగ్రవాదులు స్వేచ్ఛగా వెళ్లిపోతున్నా.. టర్కీ పట్టించుకోవడం లేదని తెలిపింది. మానవత్వంతో చేయాల్సిన సహాయం కాకుండా సిరియా ఉగ్రవాదులకు యుద్ధసామాగ్రిని కూడా అందిస్తుందని తీవ్ర ఆరోపణలు సిరియా సైన్యం చేసింది. సిరియా సైన్యానికి రష్యా సహకరిస్తున్న నేపథ్యంలో సిరియా ఇలాంటి ఆరోపణలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. -
నెత్తుటి జగడంలో 47 మంది హతం
అయలాన్ కుర్దీ చనిపోయాడు. శరణార్థుల సంక్షోభాన్ని ప్రపంచవ్యాప్తంగా చర్చకు పెట్టాడు. కానీ అతని మాతృదేశం సిరియాలో నెత్తుటేర్లు పారిస్తున్నవారికి ఇవేవీ పట్టలేదు. జగడాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు. అధికారాన్ని నిలబెట్టుకోవడం కోసం ప్రభుత్వ దళాలు.. దాన్ని కూలదోసి గద్దెనేక్కేందుకు ప్రయత్నిస్తున్న తిరుగుబాటు దళాలు.. ఈ రెండింటి నడుమ మొత్తం సిరియానే ఆక్రమించుకోవాలని ప్రయత్నిస్తున్న ఐఎస్ ఉగ్రవాదులు.. ఇదీ అక్కడి తాజా పరిస్థితి. ఈ క్రమంలోనే శుక్రవారం తిరుగుబాటు దళాలు, ఐఎస్ ఉగ్రవాదులకు మధ్య బీకరపోరు జరిగింది. ఇరు పక్షాలకు చెందిన మొత్తం 47 మంది హతమయ్యారు. రాజధాని అలెప్పిని ఆనుకుని ఉండే మరియా పట్టణంలో శనివారం ఈ సంఘటన చోటుచేసుకుంది. సైనిక పరంగా అత్యంత కీలక స్థావరంగా భావించే మరియా పట్టణంపై పట్టు కోసం మూడు సైన్యాల మధ్య భీకర పోరు జరుగుతున్నది. ప్రస్తుతం అమెరికా అందించిన సైనిక శిక్షణలో రాటుదేలిన సిరియా తిరుగుబాటు దళాల చేతిలో ఆ ప్రాంతం ఉంది. దానిని చేజిక్కించుకునేందుకు ఐఎస్ వరుసదాడులు జరుపుతున్నది. శనివారం నాటి రక్తకాండ కూడా అందులో భాగంగా జరిగిందేనని, చనిపోయినవారిలో 27 మంది ఐఎస్ ఉగ్రవాదులుకాగా, 20 మంది తిరుగుబాటు దళాలకు చెందినవారని స్థానిక మీడియా పేర్కొంది. -
తరలింపు ముమ్మరం
యెమెన్ నుంచి మరో 800 మంది భారతీయుల తరలింపు న్యూఢిల్లీ: రెబెల్స్‌కు, అరబ్ దేశాల కూటమికి మధ్య దాడులతో యుద్ధ వాతావరణాన్ని తలపిస్తున్న యెమెన్ నుంచి భారత్ శనివారం మరో 800 మంది భారతీయులను తరలించింది. దీంతో యెమెన్ నుంచి బయటపడిన భారతీయుల సంఖ్య 1,800కు చేరింది. శనివారం యెమెన్ రాజధాని సనా నుంచి రెండు ఎయిరిండియా విమానాల్లో 350 మంది భారతీయులు పొరుగు దేశమైన జిబౌతి చేరుకున్నారు. యెమెన్‌లోని ఆడెన్ పోర్టుకు దగ్గర్లో భారత నౌక ఐఎన్ఎస్ ముంబైని మోహరించారు. ఆడెన్‌లో బాంబు దాడుల వల్ల అక్కడి భారతీయులను చిన్నచిన్న పడవల్లో ఈ నౌకలోకి చేరుస్తున్నట్లు విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ తెలిపారు. చిన్నచిన్న విమానాల్లోనూ భారతీయులను ఇందులో చేరుస్తున్నారని అధికారులు వెల్లడించారు. యెమెన్ నుంచి భారత్‌కు చేరుకున్న వారిలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలకు చెందిన 86 మంది ఉన్నారు. ఆడెన్ ఘర్షణల్లో ఇప్పటి వరకు 185 మంది చనిపోయారని సమాచారం. -
54 మంది సుడాన్ సైనికులు మృతి
ఖర్దూమ్: సుడాన్ దేశంలో 54 మంది సైనికులను తిరుగుబాటుదారులు చంపేశారు. అనంతరం అక్కడే ఉన్న దక్షిణ కోర్దాఫన్లోని హబిలా అనే వ్యూహాత్మక నగరాన్ని తమ ఆదీనంలోకి తీసుకున్నారు. ఈ విషయాన్ని స్వయంగా తిరుగుబాటుదారులే తెలియజేశారు. ఉత్తర సెక్టార్‌లోని సుడాన్ పీపుల్స్ లిబరేషన్ మూమెంట్ (ఎస్పీఎల్ ఎం) సంస్థ అల్ దలాంజ్ నగరానికి 30 కిలో మీటర్ల దూరంలోని హబీలా నగరానికి స్వేచ్ఛ కావాలనే పేరుతో ఒక్కసారిగా దాడులకు పాల్పడింది. ఆ నగరాన్ని పూర్తిగా తమ హస్తగతం చేసుకునేందుకు చొచ్చుకొచ్చి అడ్డొచ్చిన సైనికులను దారుణంగా చంపేసింది. చివరికి హబీలా నగరాన్ని తమ స్వాధీనంలోకి తెచ్చుకుంది. ఈ సందర్భంగా ఎస్పీఎల్ ఎం తిరుగుబాటు సంస్థ అధికారిక ప్రతినిధి మీడియాతో మాట్లాడుతూ ఇప్పుడు హబీలాకు స్వేచ్ఛ వచ్చిందని తెలిపాడు. అయితే, సైన్యం ఈ విషయాలను కొట్టిపారేసింది. హబీలా ఎవరి చేతుల్లోకి వెళ్లలేదని, తిరుగుబాటు దారులు మాత్రం దాడులకు పాల్పడ్డారని, ప్రస్తుతం వారితో పోరు సాగుతుందని సుడాన్ సైన్యం ప్రకటించింది. బాంబులతో వారు దాడి చేయడం వల్ల తమ సైనికులను కోల్పోయామని, వారిని వీలయినంత త్వరగా తుదముట్టిస్తామని స్పష్టం చేసింది. -
54 మంది తిరుగుబాటుదారులు హతం
డెమాస్కస్ : డెమాస్కస్‌లోని తూర్పు ప్రాంతంలో తిరుగుబాటుదారులు ఆశ్రయం పొందుతున్న స్థావరాలపై సిరియా దళాలు మూకుమ్మడి దాడులు నిర్వహించాయి. ఈ దాడుల్లో 54 మంది తిరుగుబాటుదారులు మరణించారు. ఈ మేరకు స్థానిక మీడియా గురువారం వెల్లడించింది. సిరియా రాజధాని డెమాస్కస్‌లోని తూర్పు ప్రాంతం తిరుగుబాటుదారులకు నిలయంగా మారింది. ఈ నేపథ్యంలో ఇటీవల కాలంలో సైన్యం వైమానికదాడులు చేస్తోంది. -
రెబెల్స్ అధీనంలో మృతదేహాలు
ఉక్రెయిన్‌లో విమానం కూలిన చోటునుంచి 198 మృతదేహాల తరలింపు రైల్లో తీసుకెళ్లిన రెబెల్స్ ఐసీఏఓకు అప్పగిస్తామని వెల్లడి కీవ్(ఉక్రెయిన్): మలేసియా విమానం కూల్చివేత ఘటనలో లభించిన 198 మృతదేహాలను రష్యా అనుకూల తిరుగుబాటుదారులు ఎయిర్‌కండిషన్ రైల్లో ఆదివారం తరలించారు. తూర్పు ఉక్రెయిన్‌లో విమాన శకలాలు పడిన ప్రాంతానికి వెళ్లకూడదని అంతర్జాతీయ సమాజం నుంచి ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా పట్టించుకోకుండా ఆ మృతదేహాలను తీసుకెళ్లారు. విమానం కూలిన ప్రాంతం నుంచి 15 కి.మీ. దూరంలోని టోరెజ్ పట్టణంలోని రైల్వే స్టేషన్లో ఉన్న వ్యాగన్ల ద్వారా తమ అదీనంలోని డోనె స్క్ నగరానికి మూటలుగా కట్టి తరలించారని రియా నొవొస్తీ వార్తాసంస్థ తెలిపింది. స్టేషన్లో వెలువడుతున్న దుర్గంధం భరించరానిదిగా ఉందని, ఆ ఏసీ వ్యాగన్లకు సాయుధ తిరుగుబాటుదారులు కాపలాగా ఉన్నారని యూరప్ భద్రత, సహకార సంస్థ (ఓఎస్‌సీఈ) ప్రతినిధి మిఖాయిల్ బోసియుర్కివ్ చెప్పారు. టోరెజ్లో రైలు బయలుదేరేముందు వ్యాగన్లను పరిశీలించిన ఓఎస్‌సీఈ.. ఆ రైల్లో 198 మృతదేహాలు ఉన్నాయని స్పష్టం చేసింది. రెబెల్స్ భద్రత నడుమ ఓఎస్‌సీఈ ప్రతినిధులు సంఘటన ప్రదేశాన్ని ఆదివారం సందర్శించారు. విమాన బ్లాక్‌బాక్స్‌లు కూడా తమ వద్దే ఉన్నాయని, వాటిని అంతర్జాతీయ పౌరవిమానయాన సంస్థ(ఐసీఏఓ)కు అప్పగిస్తామని వేర్పాటువాదుల నేత అలెగ్జాండర్ బరోదాయ్ పేర్కొన్నారు. ఆ సంస్థ ప్రతినిధులు వచ్చే వరకూ మృతదేహాలను తమ అధీనంలో ఉంచుకుంటామని కూడా తెలిపారు. విమానం కూల్చివేతకు కారణమైన క్షిపణులను రష్యానే ఉక్రెయిన్ రెబల్స్‌కు అందించిందని అమెరికా విదేశాంగ మంత్రి జాన్ కెర్రీ ఆరోపించారు. అయితే గతంలో వెళ్లిన మార్గానికి భిన్న మార్గంలో వెళ్లడం వల్లే క్షిపణి దాడికి విమానం గురైందని ‘ది అబ్జర్వర్’ తెలిపింది. కాగా, విమానం దాడికి గురైన సమయంలో, అదే దారిలో ఆ ప్రాంతానికి చేరువలో ఎయిరిండియా (ఏఐ) విమానం లేదని ఆ సంస్థ సీనియర్ అధికారి స్పష్టం చేశారు. వివాదాస్పదంగా ఉన్న ఆ ప్రాంతం గగనతలంలో మూడు నెలల నుంచి ఏఐ విమానాలు రాకపోకలు సాగించడంలేదన్నారు. రెండు రోజుల క్రితం డీజీసీఏ ఆదేశాల మేరకు అసలు ఉక్రెయిన్ గగనతలాన్ని వినియోగించడం మానివేసామని ఆయన వెల్లడించారు. అతడి ముందు మృత్యువు చేతులు కట్టుకోవాలి! అతడిని చూస్తే మృత్యువే ఆమడదూరం పక్కకు తప్పుకుని పోవాలేమో! ఒక్కరూ బతికి బయటపడని ప్రమాదాలను అతడు చివరి నిమిషంలో తప్పించుకున్నాడు. ఈ ఏడాది మార్చి 8న మలేసియాకు చెందిన ఎమ్హెచ్ 370 విమానం కౌలాలంపూర్ నుంచి బీజింగ్‌కు వెళుతూ అదృశ్యమైపోయింది. విమానంలో ఉన్న 239 మంది ఆచూకీ నేటికీ లేదు. తాజాగా 298 మంది ఉన్న మలేసియా విమానం ఎమ్హెచ్ 17 ఉక్రెయిన్లోకూలింది. ఈ రెండు విమాన ప్రయాణాలకు టికెట్లను బుక్ చేసుకున్న మలేసియా సైక్లింగ్ జట్టు సభ్యుడు డీజోంగే(29) చివరి నిమిషంలో వాటిని మార్పు చేసుకున్నాడు. తైవాన్‌లో పోటీలో పాల్గొనేందుకు మార్చి 8న ఎమ్హెచ్ 370 విమానంలో జోంగే వెళ్లాల్సి ఉండగా మరో విమానానికి తన టికెట్‌ను మార్పు చేసుకోవడంతో బతికి బయటపడ్డాడు. తాజాగా ఎమ్హెచ్ 17 విమానంలో ప్రయాణాన్ని వాయిదా వేసుకున్నాడు. -
విప్ ధిక్కరించిన వారిపై వేటేయండి
ఈసీకి ఫిర్యాదు చేసేందుకు టీపీసీసీ సిద్ధం సాక్షి, హైదరాబాద్: మున్సిపల్, మండల, జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్లు, వైస్ చైర్మన్ల ఎన్నికల్లో విప్ ధిక్కరించిన ‘స్థానిక’ ప్రజాప్రతినిధులపై వేటు వేయించేందుకు కాంగ్రెస్ పార్టీ రంగం సిద్ధం చేస్తోం ది. టీఆర్ఎస్ ప్రలోభాలకు లొంగినవారిపై పార్టీ ఫిరాయింపు నిరోధక చట్టం కింద అనర్హత వేటు వేయాలని పిటిషన్‌ను సిద్ధం చేస్తోంది. శనివారం వరకు అందిన సమాచారం మేరకు ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, మున్సిపల్, కార్పొరేషన్ వార్డు సభ్యులు వెరసి ఐదొందల మందికిపైగా స్థానిక ప్రతినిధులు కాంగ్రెస్ విప్‌ను ధిక్కరించినట్లు టీపీసీసీకి సమాచారం అందింది. పూర్తి వివరాలతో టీపీసీసీ నేతల బృందం సోమవారం రాష్ట్ర ఎన్నికల కమిషన్ పి.రమాకాంత్‌రెడ్డిని కలిసి ఫిర్యాదు చేయాలని నిర్ణయించింది. -
'ఆ నర్సులను క్షేమంగా భారత్ కు తీసుకువస్తాం'
తిరువంతపురం:ఇరాక్‌లోని తిక్రిత్ పట్టణంలోని ఓ ఆసుపత్రి నుంచి అపహరణకు గురై మిలిటెంట్ల చెరలో ఉన్న 46 మంది భారతీయ నర్సులు త్వరలో క్షేమంగా స్వదేశానికి రానున్నట్లు కేరళ సీఎం ఓమెన్ చాందీ స్పష్టం చేశారు. మిలిటెంట్లు చెరలో చిక్కుకున్నఆ నర్సులకు ఎర్బిల్ ఎయిర్ పోర్ట్ లో క్షేమంగా ఉన్నట్లు ఆయన తెలిపారు. వారిని భారత్ కు తీసుకొచ్చేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు చాందీ తెలిపారు. మోసూల్ పట్టణంలో కేరళకు చెందిన నర్సులను గురువారం తిరుగుబాటుదారులు అపహరించి బలవంతంగా మరో ప్రాంతానికి తీసుకెళ్లిన సంగతి తెలిసిందే. ఆస్పత్రి నుంచి అపహరించిన ఆ నర్సులను మిలిటెంట్లు బందించి మోసుల్ పట్టణానికి 60 కి.మీ దూరంలో ఉన్న కుర్దిస్థాన్ రాజధాని ఎర్బిల్ కు తరలించారు. ఇందులో భాగంగానే కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్ నేతృత్వంలో ఏర్పాటైన 'ఉన్నతస్థాయి వివాదాల కమిటీ' వారిని తిరిగి సురక్షితంగా భారత్ కు రప్పించే పనిలో నిమగ్నమైందని చాందీ తెలిపారు. గత మూడు రోజులుగా వారిని ఆసుపత్రి ప్రాంగణం నుంచి తరలించేందుకు మిలిటెంట్లు ప్రయత్నించినప్పటికీ నర్సులు ప్రతిఘటించడంతో.. గురువారం తెల్లవారుజామును ఆసుపత్రి ప్రాంగణంలో బాంబులు పేల్చి, నర్సులను భయభ్రాంతులకు గురిచేసి, బలవంతంగా మూడు బస్సుల్లోకి ఎక్కించి తరలించారు. ఈ క్రమంలో పలువురు నర్సులకు స్వల్పంగా గాయాలయ్యాయి. అయితే, నర్సులంతా క్షేమంగా ఉన్నారని, వారిని క్షేమంగా విడిపించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని భారత విదేశాంగ శాఖ తెలిపింది. -
ఇరాక్ మిలిటెంట్ల చెరలో కేరళ నర్సులు
తిక్రిత్ నుంచి 46 మందిని బలవంతంగా తరలింపు ముగ్గురు నర్సులకు గాయాలు; అంతా క్షేమం: కేరళ సీఎం క్షేమంగా తీసుకొచ్చేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం: విదేశాంగ శాఖ న్యూఢిల్లీ/తిరువనంతపురం/బాగ్దాద్: ఇరాక్‌లోని తిక్రిత్ పట్టణంలోని ఓ ఆసుపత్రిలో చిక్కుకుపోయిన 46 మంది భారతీయ నర్సులను(అంతా కేరళకు చెందినవారే) గురువారం తిరుగుబాటుదారులు బలవంతంగా మరో ప్రాంతానికి తరలించారు. ఎక్కడికి తీసుకెళ్లినదీ కచ్చితంగా తెలియనప్పటికీ.. సున్నీ మిలిటెంట్ల అధీనంలో ఉన్న మోసుల్ పట్టణం వైపు వెళ్లినట్లు సమాచారముందని కేరళ ముఖ్యమంత్రి ఊమెన్ చాందీ వెల్లడించారు. గత మూడు రోజులుగా వారిని ఆసుపత్రి ప్రాంగణం నుంచి తరలించేందుకు మిలిటెంట్లు ప్రయత్నించినప్పటికీ నర్సులు ప్రతిఘటించడంతో.. గురువారం తెల్లవారుజామున బాంబులు పేల్చి, నర్సులను భయభ్రాంతులకు గురిచేసి, బలవంతంగా మూడు బస్సుల్లోకి ఎక్కించి తరలించారు. ఈ క్రమంలో ముగ్గురు నర్సులకు స్వల్పంగా గాయాలయ్యాయి. అయితే, నర్సులంతా క్షేమంగా ఉన్నారని, వారిని క్షేమంగా విడిపించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని భారత విదేశాంగ శాఖ తెలిపింది. అంతర్జాతీయ మానవతావాద సంస్థలను కూడా సంప్రదిస్తున్నామని ఆ శాఖ అధికార ప్రతినిధి అక్బరుద్దీన్ వెల్లడించారు. తమ రాష్ట్ర నర్సులను క్షేమంగా భారత్ తీసుకురావాలని కోరుతూ కేరళ ముఖ్యమంత్రి ఊమెన్ చాందీ గురువారం విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్‌తో సమావేశమయ్యారు. కుటుంబ సభ్యుల ఆందోళన: ఇరాక్‌లో మిలిటెంట్ల వద్ద బందీలుగా ఉన్న నర్సుల కుటుంబసభ్యులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. తమవారి విడుదల కోసం ప్రభుత్వం చర్యలు తీసుకోవట్లేదని ఆరోపిస్తున్నారు. తిక్రిత్‌లోని బంగ్లాదేశీయులను ఆ దేశం తరలించిందని, ఆ మాత్రం కూడా మనవారు చేయలేకపోతున్నారని విమర్శిస్తున్నారు. ఒబామా మంతనాలు: ఇరాక్ సంక్షోభం తీవ్ర కావడంతో.. సంక్షోభ నివారణకు అమెరికా సంప్రదింపులు తీవ్రం చేసింది. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా గురువారం సౌదీ రాజు అబ్దుల్లాకు ఫోన్ చేసి మాట్లాడారు. మరోవైపు, అమెరికా ఉపాధ్యక్షుడు జో బెడైన్ ఇరాక్‌లోని సున్నీల నేత, గత పార్లమెంటు స్పీకర్ అయిన ఒసామా అల్ నుజైఫీతో.. విదేశాంగమంత్రి జాన్ కెర్రీ కుర్దుల నేత మస్సూద్ బర్జానీతో చర్చలు జరిపారు. తూర్పు సిరియాలోనూ మిలిటెంట్ల పట్టు బీరుట్: తూర్పు సిరియాలోని దీర్ ఎజ్ జార్ రాష్ట్రాన్ని గురువారం సున్ని మిలిటెంట్లు స్వాధీనం చేసుకున్నారు. సిరియాలోని అత్యధిక ప్రాంతం ప్రస్తుతం ఐఎస్ఐఎస్ తిరుగుబాటుదారుల ఆధీనంలో ఉందని, అది లెబనాన్ భూభాగం కన్నా ఐదురెట్లు ఎక్కువని సిరియాలోని మానవహక్కుల సంస్థ వెల్లడించింది. -
ఆప్ లో 'దుష్ట చతుష్టయం'
సాప్, యాప్, మాప్, పాప్ పార్టీల పేర్లెప్పుడైనా విన్నారా? సాప్ అంటే సంజయ్ ఆద్మీ పార్టీ. యాప్ అంటే యోగేంద్ర ఆప్ పార్టీ. మ్యాప్ అంటే మనీష్ ఆద్మీ పార్టీ, పాప్ అంటే పర్వీన్ అమానుల్లా పార్టీ. ఇవన్నీ నిజంగా పార్టీలు కాదండోయ్. ఆమ్ ఆద్మీ పార్టీ ఒక్కో రాష్ట్రంలో ఒక్కో వ్యక్తి గుప్పెట్లో ఉందని చెప్పేందుకు ఆమ్ ఆద్మీ పార్టీ రెబెల్స్ ఈ పేర్లు పెట్టారు. ఉత్తరప్రదేశ్ లో సాప్, హర్యానాలో యాప్, మధ్యప్రదేశ్ లో మ్యాప్, బీహార్ లో పాప్ గా మారిపోయిందని, ఆ నేత ఇష్టారాజ్యమే నడుస్తోందని రెబెల్స్ ఆరోపిస్తున్నారు. ఇప్పుడు దేశవ్యాప్త ఆమ్ ఆద్మీ రెబెల్స్ జోనల్ స్థాయిలో సభలు పెట్టి ఆప్ ఆపసోపాలు పడేలా చేయబోతున్నారు. మొదటి సభ బెంగుళూరులో జరగబోతోంది. ఇందులో ఢిల్లీకి చెందిన మాజీ ఎమ్మెల్యే షాజియా ఇల్మీ, మాజీ జాతీయ కౌన్సిల్ సభ్యుడు అశ్వినీ ఉపాధ్యాయ్, పార్టీ వ్యవస్థాపక సభ్యులు మధు భండారిలు పాల్గొంటారు. వీరంతా ఆప్ లో ఒక దుష్ట చతుష్టయం రాజ్యమేలుతోందని, పార్టీలో ప్రజాస్వామ్యం లేదని అంటున్నారు. దుష్టచతుష్టయం అంటే అరవింద కేజరీవాల్, యోగేంద్ర యాదవ్, మనీష్ సిసోదియా, సంజయ్ సింగ్ లేనని వారంటున్నారు. ఇప్పుడీ తిరుగుబాటుదారులు టీఎన్ శేషన్, యూపీ మాజీ డీజీపీ ప్రకాశ్ సింగ్ లేదా ఎన్ సి ఈ ఆర్ టీ మాజా డైరెక్టర్ జెఎస్ రాజ్ పుత్ లలో ఎవరో ఒకరిని తమఅధినేతగా ఎన్నుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. మొత్తం మీద 'చీపురుకట్టలు' తిరగబడుతున్నాయి. -
టీడీపీ పరేషన్
ఓటమి భయంతో ఓటర్లకు ప్రలోభాలు ప్రతీ ఇంటికి బియ్యం, సరకులు పంపిణీ పోటాపోటీగా కాంగ్రెస్ కోట్లు కుమ్మరిస్తున్న అభ్యర్థులు విశాఖ రూరల్, న్యూస్‌లైన్ : ప్రజా వ్యతిరేకత, రెబెల్స్ పోకడ, అసంతృప్తుల సెగలు తెలుగుదేశం అభ్యర్థులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. అధినాయకులొచ్చి ప్రచారం చేపట్టినా స్పందన కానరాకపోవడంతో ఆ పార్టీ శ్రేణుల్లో నిస్తేజం అలుముకుంటోంది. ఎన్నికలకు ముందే ఓటమి భయం పట్టిపీడిస్తోంది. దీంతో ప్రలోభాలకు పెద్ద పీట వేస్తున్నారు. ఓటర్లను ఆకట్టుకోవడానికి ఉన్న అన్ని మార్గాలను అన్వేషిస్తున్నారు. చావో.. రేవోలా మారిన ఈ ఎన్నికల్లో రూ.కోట్లు కుమ్మరిస్తున్నారు. విశ్వాసపాత్రులను రంగంలోకి దించి పరిస్థితులను తమకు అనుకూలంగా మలచుకోవడానికి విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. స్థానిక అవసరాలు, పరిస్థితులను బట్టి ఓటర్లకు రేషన్ బియ్యం, నిత్యావసరాలు విచ్చలవిడిగా పంపిణీ చేస్తూ ఆకుట్టుకోవడానికి యత్నిస్తున్నారు. జిల్లాలో కొన్ని నియోజకవర్గాల్లో ఈ పరిస్థితి యథేచ్ఛగా సాగిపోతోంది. అభ్యర్థుల అనుయాయులు ఇంటింటికి బియ్యం, ఇతర నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తున్నారు. ప్రధానంగా విశాఖ-దక్షిణం, విశాఖ-ఉత్తరం, విశాఖ-తూర్పు, భీమిలి, పెందుర్తి, పాయకరావుపేట, నర్సీపట్నం నియోజకవర్గాల్లో ఈ విధానం జోరుగా సాగుతోంది. విశాఖ వన్‌టౌన్, భీమిలి, పాయకరావుపేట ప్రాంతాల్లో పంపిణీ చేస్తున్న సరుకులను అధికారులు ఇటీవల పట్టుకోవడం ఇందుకు తార్కాణం. అయితే స్కీములు, చిట్టీలు వేసుకొని కొనుగోలు చేసుకుంటున్నామంటూ అభ్యర్థుల అనుచరగణం చెప్పడంతో అధికారులు ఏమీ చేయలేక వాటిని విడిచిపెట్టారు. విశాఖ దక్షిణ నియోజకవర్గం పరిధిలో వన్‌టౌన్, అల్లిపురం ప్రాంతాల్లో వాసు బ్రాండ్ బియ్యాన్ని ఇంటింటికీ పంపిణీ చేస్తున్నారు. భీమిలి నియోజకవర్గంలో జనాభా ఆధారంగా గ్రామాల్లో యథేచ్ఛగా డబ్బు వెదజల్లుతున్నారు. ఒక్కో గ్రామానికి ఒక రేటును నిర్ణయించి ముట్టుచెపుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. అక్కడి టీడీపీ అభ్యర్థి అయిన మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు నామినేషన్ వేసిన వెంటనే ఉచిత మీల్స్ పేరుతో మెస్ పుట్టుకొచ్చింది. రోజూ వందలు, వేల మందికి ఉచితంగా భోజనాన్ని అందిస్తూ వచ్చారు. ఈ విషయం తెలుసుకున్న అధికారులు వెంటనే ఆ మెస్‌ను మూయించడంతో పాటు నిర్వాహకునిపై కేసు నమోదు చేశారు. విశాఖ-తూర్పు నియోజకవర్గంలో మద్యం ఏరులై పారుతోంది. ఇతర ప్రాంతాల నుంచి చీప్ లిక్కరును దిగుమతి చేయించి అనుచరుల ద్వారా మందుబాబులకు పీకలదాకా తాగిస్తున్నారన్న వార్తలు గుప్పుమంటున్నాయి. ఇటీవల విశాఖలోని సీతమ్మధార చెక్‌పోస్టు వద్ద ఒక మాజీ ఎమ్మెల్యే స్టిక్కర్ ఉన్న వాహనంలో భారీగా మద్యం కేసులు బయటపడ్డాయి. వాటికి సంబంధించిన బిల్లులు ఉన్నాయంటూ అధికారులు వాటిని విడిచిపెట్టారు. వీరికి దీటుగా కాంగ్రెస్ అభ్యర్థులు పంపకాలు చేపడుతున్నారన్న వాదనలు ఉన్నాయి. టీడీపీ తరహాలోనే ఇంటికో బియ్యం బస్తాతో పాట అదనంగా ఒక బిందె కూడా ఇస్తున్నారు. డబ్బు, మద్యం, సరుకులు...ఇలా ఎన్ని పంపిణీ చేసినా ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చేపట్టే పార్టీకే ప్రజలు పట్టం కడతారన్న వాదన సర్వత్రా వ్యక్తమవుతోంది. -
సహకారానికి నో
నామినేషన్ల ఉపసంహరణతో రెబెల్స్ బెడద తప్పిందని ఊపిరి పీల్చుకున్న టీడీపీ అభ్యర్థులకు ఇప్పుడు కొత్త చిక్కొచ్చి పడింది. సొంత పార్టీ నేతలే సహకరించకపోవడం మరింత తలనొప్పిగా మారింది. పగలంతా తమ వెంట ప్రచారంలో పాల్గొంటున్న వారే తమ ఓటమికి తెరవెనుక పావులు కదుపుతున్నారని అభ్యర్థులు గగ్గోలు పెడుతున్నారు. పొత్తు పెట్టుకున్న మిత్రపక్షం బీజేపీతోనూ సఖ్యత లేక, ఇరు పక్షాల ఓట్ల బదిలీ ప్రశ్నార్థకమైంది. టీడీపీ పోటీలో ఉన్న చోట కమలదళం అంటీ ముట్టనట్టుగా వ్యవహరిస్తుంటే.. బీజేపీ అభ్యర్థి ప్రచారంలో తెలుగు తమ్ముళ్ల జాడే కరువైంది. సాక్షి, గుంటూరు :సార్వత్రిక ఎన్నికలకు అభ్యర్థుల ప్రకటనతో జిల్లా టీడీపీలో ఆరంభమైన అసమ్మతి సెగలు ఏదో ఒక రూపంలో ఎగసిపడుతూనే ఉన్నాయి. అభ్యర్థుల విజయావకాశాలకు సొంతపార్టీ నేతలే ప్రతిబంధకంగా మారుతున్నారని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. టికెట్ల కేటాయింపులో పార్టీ అధినేత చంద్రబాబు పొరపాట్లు చేశారంటూ ఆగ్రహించిన ఆశావహులు సహాయ నిరాకరణ చేస్తున్నారు. నరసరావుపేటను పొత్తులో భాగంగా బీజేపీకి కేటాయించడంతోపాటు సత్తెనపల్లి, మంగళగిరి, మాచర్ల, గుంటూరు పశ్చిమ, ప్రత్తిపాడు అసెంబ్లీ నియోజకవర్గాలకు టికెట్ల కేటాయింపు సరిగా లేదంటూ తెలుగుతమ్ముళ్లు భగ్గుమన్న విషయం తెలిసిందే. అభ్యర్థుల ఎంపికపై నిరసన వ్యక్తం చేస్తూ ఆయా నియోజకవర్గాల నుంచి అనేకమంది రెబల్ అభ్యర్థులుగా నామినేషన్లు కూడా దాఖలు చేశారు. పార్టీ అధిష్టానం, జిల్లా నాయకుల హామీలు, తాయిలాలు, ఒత్తిడితో ఎట్టకేలకు వారు నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. దీంతో టీడీపీ, బీజేపీ అభ్యర్థులు ఊపిరిపీల్చుకున్నారు. అసమ్మతికి ముఖ్య నేతల ప్రోత్సాహం.. రెబెల్స్ బెడద తీరింది. ఇక వారు తమకు సహకరిస్తారని భావించిన అభ్యర్థులకు ప్రస్తుత పరిణామాలు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. పగలంతా తమవెంటే తిరుగుతూ ప్రచారంలో పాల్గొంటున్న కొందరు సొంత పార్టీ నాయకులే రాత్రయ్యేసరికి తమ ఆంతరంగికులతో సమావేశాలు నిర్వహిస్తున్నారని, ఇతను ఇక్కడ గెలిస్తే తిరిగి పదేళ్ల వరకు మాకు అవకాశం ఉండదు కాబట్టి ఎలా ఓడించాలా అని పథక రచనలు చేస్తున్నారని తెలిసి ఏం చేయాలో పాలుపోక అభ్యర్థులు తలలు పట్టుకుంటున్నారు. ఇంకొందరైతే ఏకంగా ప్రత్యర్థి పార్టీలతో చేతులు కలిపి రోజూ ఇక్కడి సమాచారమంతా ఆ శిబిరానికి చేరవేస్తూ పార్టీని దెబ్బతీసేలా వ్యవహరిస్తున్నారంటూ అభ్యర్థులు వాపోతున్నారు. అసమ్మతి నేతలకు జిల్లా టీడీపీ ముఖ్య నాయకుల మద్దతు ఉందని తెలుసుకుని తమ భవిష్యత్తు తెలియక మల్లగుల్లాలు పడుతున్నారు. ముఖ్యంగా గుంటూరు పశ్చిమ అసెంబ్లీ నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థిగా పోటీలో ఉన్న నరసరావుపేట ఎంపీ మోదుగుల వేణుగోపాల్‌రెడ్డికి ఆ పార్టీలోని సొంత సామాజిక వర్గ నాయకులే సహకరించడం లేదని ఆరోపణలు వినవస్తున్నాయి. వీటన్నిటిపై త్వరలో జిల్లాకు రానున్న అధినేత ముందు పంచాయితీ పెట్టేందుకు కొందరు అభ్యర్థులు సిద్ధమవుతున్నట్లు సమాచారం. కోడెల ప్రచారానికి నరసరావుపేట నేతలు.. నరసరావుపేట స్థానాన్ని బీజేపీకి కేటాయించడంతో అక్కడి టీడీపీ ముఖ్య నేతలంతా కోడెల వెంట సత్తెనపల్లిలో ప్రచారానికి వెళ్తూ నరసరావుపేట గురించి పట్టించుకోవడం లేదని బీజేపీ అభ్యర్థి నలబోతు వర్గీయులు మండిపడుతున్నారు. ఇదిలా ఉండగా సత్తెనపల్లిలో సీటు ఆశించి భంగపడిన అక్కడి టీడీపీ ఇన్చార్జి నిమ్మకాయల రాజనారాయణ, అదే నియోజకవర్గానికి చెందిన తెలుగుయువత జిల్లా అధ్యక్షుడు మల్లేశ్వరరావు వర్గీయులు తమకు సహకరించడం లేదని కోడెల వర్గీయులు ఆరోపిస్తున్నారు. మాచర్లలో సైతం అసమ్మతి నేతలెవరూ మనస్ఫూర్తిగా సహకరించడం లేదని టీడీపీ అభ్యర్థి చలమారెడ్డి వర్గీయులు వాపోతున్నారు. మంగళగిరి, ప్రత్తిపాడు నియోజకవర్గాల్లోనూ ఇదే పరిస్థితి కొనసాగుతోందని, సహకరించకపోగా సొంత పార్టీ అభ్యర్థుల ఓటమికి తెరవెనుక పావులు కదుపుతున్నారని అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
ముందు అన్నం పెట్టి.. తర్వాత సున్నం గొట్టి!
-
ఒకటి నాకు.. మరోటి మీ ఇష్టం!
సాక్షి, రంగారెడ్డి జిల్లా: సార్వత్రిక పోలింగ్ సమీపిస్తున్న వేళ అభ్యర్థుల్లో గుబులు తీవ్రమవుతోంది. గతంలో ఎన్నడూలేని విధంగా పలు రాజకీయ పార్టీలు ఎన్నికల బరిలో నిలవగా.. స్వతంత్ర అభ్యర్థులు సైతం పెద్ద సంఖ్యలో పోటీలో దిగడం సర్వత్రా అయోమయానికి దారి తీస్తోంది. శాసనసభ, లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నందున రెండింటికీ ఒకేసారి ఓటు వేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో పార్టీ తరఫు అభ్యర్థులు, రెబల్స్ చేస్తున్న ప్రచారం ఓటర్లను తీవ్ర అయోమయానికి గురిచేస్తోంది. దీంతో చివరకు ఓటర్లు ఎవరికి ఓటు వేస్తారనే సందేహం కలుగుతోంది. ప్రచారంలో అభ్యర్థుల వింత పోకడ సాధారణంగా స్వతంత్రంగా బరిలోకి దిగే అభ్యర్థులు తనకోసం ఓటు వేయాలంటూ ప్రచారం చేస్తారు. కానీ ఈసారి భిన్న పరిస్థితులు నెలకొన్నాయి. పార్టీ టికెట్ ఆశించి భంగపడి స్వతంత్రంగా బరిలోకి దిగిన నేతలు ఎమ్మెల్యే కోటా ఓటు తనకు వేసి.. ఎంపీ కోటా ఓటు మాత్రం ఫలానా పార్టీ అభ్యర్థికి వేయాలంటూ ప్రచారం చేస్తున్నారు. ఈ తరహా ప్రచారం ఓటర్లను తీవ్ర అయోమయానికి గురిచేస్తోంది. పలు నియోజకవర్గాల్లో ఇదే పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపు వివిధ సంఘాలు సైతం రెండునాల్కల ధోరణిని ప్రదర్శిస్తున్నాయి. దీంతో అటు ఓటర్లు తికమక పడుతుండగా.. అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. ఇబ్రహీంపట్నంలో శాసనసభ స్థానం నుంచి పోటీచేసిన రెబల్ అభ్యర్థి ఎమ్మెల్యే ఓటు తనకు వేసి ఎంపీ ఓటు మాత్రం ఫలానా పార్టీకి వేయాలంటూ ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. రాజేంద్రనగర్‌లో కీలకమైన మైనార్టీ ఓటర్లకు కూడా ఈ తికమక పరిస్థితి తలెత్తింది. ఎంపీ అభ్యర్థి లేకపోవడంతో ఎమ్మెల్యే కోటా తమ పార్టీకి వేసి.. ఎంపీ ఓటు మాత్రం ఫలానా పార్టీకి వేయాలంటూ ప్రచారం చేయడం గమనార్హం. మహేశ్వరంలో మిత్రబేధానికి పాల్పడిన పార్టీకి ఇబ్బందికర పరిస్థితి తలెత్తింది. పొత్తులో భాగంగా ఒక పార్టీకి సీటు కేటాయించగా.. చివరకు ఆ పార్టీ కూడా రంగంలోకి దిగడంతో ఎమ్మెల్యే ప్రచారంలోనే ఇబ్బందులు వచ్చాయి. ఇరువురు అభ్యర్థులు ఒకే ఎంపీ అభ్యర్థికి ప్రచారం చేస్తూ.. ఎమ్మెల్యే కోటా ఓటు మాత్రం తమకే వేయాలంటూ ఇరువురు అభ్యర్థులు ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. చేవెళ్ల నియోజకవర్గంలో కూడా జేఏసీ చేస్తున్న ప్రచారం తికమకగా మారింది. ఎంపీ కోటా ఓటు కోసం మాత్రమే ప్రచారం చేస్తున్న నేతలు.. ఎమ్మెల్యే అభ్యర్థికి మాత్రం నచ్చిన వ్యక్తికి వేయాలంటూ ఓటర్లకు అవగాహన కల్పిస్తున్నారు. మల్కాజిగిరి లోక్‌సభ నియోజకవర్గంలో సైతం ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ప్రధాన పార్టీకి చెందిన ఎమ్మెల్యే అభ్యర్థులు అదే పార్టీకి చెందిన ఎంపీ అభ్యర్థికి మధ్య అంతరం ఏర్పడడంతో ఎవరికి వారే అన్నట్లుగా ప్రచారం చేస్తున్నారు. మరోవైపు పొత్తు పెట్టుకున్న పార్టీల మధ్య సహకారం అంతంతమాత్రంగానే ఉండడంతో అభ్యర్థులకు ఇబ్బందులు తప్పడంలేదు. -
సిరియాలో హింస: 71 మంది మృతి
సిరియాలో నరమేథం కొనసాగుతుంది. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాలలో గురువారం ఓ వైపు కారు బాంబు పేలుళ్లతో దద్దరిల్లగా, మరోవైపు దేశ భద్రత సిబ్బంది, తిరుగుబాటుదారులకు మధ్య హోరాహోరిగా కాల్పులు జరిగాయి. ఆ హింసలో మొత్తం 71 మంది మరణించారని స్థానిక మీడియా శుక్రవారం వెల్లడించింది. సిరియా ఈశాన్య ప్రావెన్స్లో హస్కాలో రెండు కారు బాంబు పేలుళ్లకు తిరుగుదారులు పాల్పడ్డారు. ఆ ఘటనలో ఏడుగురు మృతి చెందగా, అనేక మంది తీవ్రంగా గాయపడ్డారు. హస్కాలోని ఓ పాఠశాల ప్రవేశ ద్వారం సమీపంలో కారు పేలుడు సంభవించి... ఇద్దరు చిన్నారుల మృతి చెందారని తెలిపింది. తల్ హలాఫ్ పట్టణంలో అల్ ఖమిస్ మార్కెట్ వద్ద మరో కారును తిరుగబాటుదారులు పేల్చేశారిని ఆ ఘటనలో ఐదుగురు వ్యక్తులు అక్కడికక్కడే మరణించారని, అనేక మంది గాయపడ్డారని పేర్కొంది. దేశంలోని వివిధ ప్రాంతాలలో తిరుగుబాటుదారులను అణిచేందుకు భద్రత సిబ్బంది చర్యలు చేపట్టింది. అందులోభాగంగా భద్రత సిబ్బందికి, తిరుగుబాటుదారులకు మధ్య హోరాహోరి కాల్పులు జరిగాయి. ఆ కాల్పులలో మొత్తం 64 మంది మరణించారని మీడియా వివరించింది. -
టీడీపీకి ఎదురుదెబ్బ
వైదొలగని రెబల్స్ భీమిలి..అరకులో సైకిల్‌కు షాకు ఓడించి తీరుతామంటున్న తిరుగుబాటుదారులు గంటా ఆశలకు అనిత ఎసరు సాక్షి, విశాఖపట్నం : జిల్లా టీడీపీకి తిరుగుబాట్ల బెడద తప్పలేదు. భీమిలి, అరకు స్థానాల్లో గంటా, సివేరి సోమకు ఎదురుదెబ్బల ఎదురింపులు నిద్రపట్టనీయడం లేదు. ముఖ్యనేతలు ఎన్ని ప్రలోభాలుపెట్టినా, బుజ్జగింపులు చేసినా రెబల్ అభ్యర్థులు దారికిరాలేదు. మాదారి ఎదురుదాడేనంటూ బరిలో నిలబడి పార్టీకి సవాల్ విసిరారు. ఇకనుంచి తడాఖా చూపడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. జిల్లాలో టీడీపీ నిలబెట్టిన అభ్యర్థులకు వ్యతిరేకంగా భీమిలి, అరకు,పాడేరు,విశాఖ ఉత్తరం,యలమంచిలి నియోజకవర్గాల్లో రెబల్ అభ్యర్థులు నామినేషన్లు వేశారు. బుధవారం రెబల్స్ తప్పుకునేలా టీడీపీ ముఖ్యనేతలు మంతనాలు జరిపారు. భీమిలి, అరకు స్థానాల్లో మాత్రం తిరుగుబాటుదారులు తమ నామినేషన్లు ఉపసంహరించుకోకుండా పార్టీకి షాక్ ఇచ్చారు. ఇప్పుడు భీమిలి నియోజకవర్గంలో టీడీపీ నిలబెట్టిన గంటాశ్రీనివాసరావుకు వ్యతిరేకంగా అనిత సకురు, అరకులో సివేరి సోమకు వ్యతిరేకంగా కుంభా రవిబాబు బరిలో మిగిలారు. రెబల్స్ వలన తమకు రాలవసిన ఓట్లు చీలిపోతాయనే బెంగతో వీరు బిక్కుబిక్కుమంటున్నారు. గంటాను ఓడిస్తానని అనిత శపథం పూనారు. రాజకీయాలను వ్యాపారంగా చేసి ఎన్నికలొచ్చిన ప్రతిసారీ నియోజకవర్గం మార్చుతూ రాజకీయ విలువలు దిగజార్చుతోన్న గంటాకు వ్యతిరేకంగా తాను బరిలో నిలబడ్డానని ఆమె చెబుతున్నారు. ఇన్ని వ్యుహాలుచేసినా చివరకు తిరుగుబాటు అభ్యర్థి బెడదేంటంటూ గంటా కలవరపడుతున్నట్లు తెలిసింది. అయ్యో..సోమ అరకు సిట్టింగ్ ఎమ్మెల్యే సోమకు చంద్రబాబు మొదట్లో టిక్కెట్ నిరాకరించారు. తాజాగా పార్టీలో చేరిన కుంబారవిబాబుకు బీఫారం ఇచ్చారు. కాని ఆయన సామాజికవర్గం ఓట్లు నియోజకవర్గంలో లేవనే సాకుతో చివరి నిమిషంలో సోమకు సీటిచ్చారు. ఇప్పుడు రవిబాబు రెబల్‌గా మిగ లడంతో సోమ గిలగిలలాడుతున్నారు. సోమకు కేటాయించిన టీకప్పు గుర్తుతో తనకు వ్యతిరేకంగా పార్టీ అభ్యర్థి ప్రచారం చేస్తుండడంతో ఓడిపోతానని కంగారుపడుతున్నారు. చివరకు రవిబాబును పార్టీసీనియర్ నేతల ద్వారా బుజ్జగించినా దారికిరాకపోవడంతో ఏంచేయాలో తెలీక దిగులుచెందుతున్నారు. -
లెక్క తేలింది
ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ ఘట్టం మొత్తం అభ్యర్థులు 219..ఎ స్వతంత్రులు 83 మంది మూడు లోక్‌సభ స్థానాలకు 41 15 అసెంబ్లీ సెగ్మెంట్లకు 178 విశాఖ లోక్‌సభకు అత్యధికంగా 22 మంది మాడుగుల అసెంబ్లీకి అత్యల్పంగా ఏడుగురు నేటి నుంచి పూర్తిస్థాయి ప్రచారాలకు శ్రీకారం విశాఖ రూరల్, న్యూస్‌లైన్ : సార్వత్రిక ముఖ చిత్రం స్పష్టమైంది. పార్లమెంటరీ, అసెంబ్లీ నియోజకవర్గాల బరిలో నిలిచే అభ్యర్థుల లెక్క తేలింది. బుధవారం మధ్యాహ్నం 3 గంటలతో నామినేషన్ల ఉపసంహరణకు గడువు ముగిసింది. ఆఖరి రోజున పెద్ద సంఖ్యలో అభ్యర్థులు పోటీ నుంచి విరమించుకున్నారు. 60 మంది పోటీ నుంచి వైదొలగడంతో జిల్లాలోని మూడు లోక్‌సభ స్థానాలకు 41మంది, 15 అసెంబ్లీ సెగ్మెంట్లకు 178మంది ఎన్నికల సంగ్రామంలో తలపడనున్నారు. అన్ని స్థానాల్లోనూ బహుముఖ పోటీ నెలకొంది. ఈ నెల 12వ తేదీ నుంచి ప్రారంభించిన నామినేషన్ల పర్వంలో మొత్తం 321 మంది నామినేషన్లు సమర్పించారు. పరిశీలనలో 42 నామినేషన్లు తిరస్కరించారు. ఉపసంహరణ అనంతరం బరిలో 219 మంది నిలిచారు. ఇందులో 83 మంది స్వతంత్రులే కావడం విశేషం. రెబల్స్‌ను దారిలోకి తెచ్చుకోడానికి అభ్యర్థులు చేసిన ప్రయత్నాలు పాక్షికంగా ఫలించాయి. మే 7న పోలింగ్,16న ఓట్ల లెక్కింపు ఉంటుంది. నియోజకవర్గాల్లో పోటీపై స్పష్టత రావడంతో అభ్యర్థులు ప్రచార షెడ్యూల్‌ను సిద్ధం చేసుకుంటున్నారు. గురువారం నుంచి ప్రచారాలతో మరింత హోరెత్తించడానికి సిద్ధమవుతున్నారు. ఇంకా13 రోజులే గడువున్నందున వీలైనన్ని ఎక్కువ ప్రాంతాల్లో పర్యటించేందుకు ప్రణాళికలు రూపొందించుకుంటున్నారు. ప్రత్యేక వాహనాల్లో వెళ్లి తక్కువ సమయంలో ఎక్కువ మంది ఓటర్లను నేరుగా కలిసేందుకు సన్నద్ధమవుతున్నారు. అసెంబ్లీకి 54 ఉపసంహరణలు జిల్లాలో 15 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. వీటికి మొత్తం 271 నామినేషన్లు రాగా 39 మందివి తిరస్కరించారు. బుధవారం 54 మంది నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. దీంతో ఎన్నికల బరిలో 178 మంది పోటీ పడుతున్నారు. విశాఖ-ఉత్తరం, అరకు వ్యాలీ, పాయకరావుపేట, నర్సీపట్నం నియోజకవర్గాల్లో అధికంగా ఆరుగురు చొప్పున నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. విశాఖ తూర్పులో వచ్చిన 26 నామినేషన్లకు అయిదింటిని తిరస్కరించగా మిగిలిన వారెవరూ నామినేషన్లు ఉపసంహరించుకోలేదు. దీం తో ఈ నియోజకవర్గం నుంచి అత్యధికంగా 21 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. గాజువాకలో 17, విశాఖ దక్షిణంలో 15 మంది తలపడుతున్నారు. మాడుగుల నియోజకవర్గం నుంచి తక్కువగా 7 మంది బరిలో ఉన్నారు. చోడవరం నియోజకవర్గంలో జై సమైక్యాంధ్ర పార్టీ అభ్యర్థి జె.కనకమహాలక్ష్మితో పాటు ఇద్దరు స్వతంత్రులు నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. విశాఖ-దక్షిణంలో సీపీఎం అభ్యర్థి పి.వెంకటరెడ్డి, జె.దేముడునాయుడుతో పాటు స్వతంత్ర అభ్యర్థి కోల యల్లాజి నామినేషన్లు వెనక్కు తీసుకున్నారు. విశాఖ-పశ్చిమంలో సీపీఐ అభ్యర్థి సి.హెచ్.రాఘవేంద్రరావు, స్వతంత్ర అభ్యర్థి దాడి అచ్యుతలు పోటీ నుంచి తప్పుకున్నారు. యలమంచిలిలో అయిదుగురు, భీమిలిలో నలుగురు, పాడేరులో నలుగురు, గాజువాక, అనకాపల్లిలలో ముగ్గురు, మాడుగులలో ఇద్దరు, పెందుర్తిలో ఒకరు నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. లోక్‌సభ స్థానాలకు 6 ఉపసంహరణలు విశాఖ లోక్‌సభ స్థానానికి 26 నామినేషన్లు రాగా ఇందులో నలుగురు అభ్యర్థులు బుధవారం నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. సీపీఎం అభ్యర్థి సి.హెచ్.నరసింగరావు, సీపీఐ అభ్యర్థి మానం ఆంజనేయులుతో పాటు స్వతంత్రలు బి.శ్రీలక్ష్మి, వై.చిన్నయ్యలు నామినేషన్లను వెనక్కు తీసుకున్నారు. జై సమైక్యాంధ్ర, సీపీఎం, సీపీఐ పార్టీల మధ్య ఒప్పందం కుదరడంతో విశాఖ లోక్‌సభ స్థానంలో జైసపా పార్టీ అభ్యర్థికి వామపక్షాలు మద్దతు ప్రకటించాయి. ఇందులో భాగంగా సీపీఎం, సీపీఐ అభ్యర్థులు నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. అనకాపల్లి లోక్‌సభకు 11 నామినేషన్లు రాగా, రెండింటిని అధికారులు తిరస్కరించారు. బుధవారం స్వతంత్ర అభ్యర్థి టి.అప్పారావు పోటీ నుంచి తప్పుకున్నారు. అరకు ఎంపీకి 13 నామినేషన్లు దాఖలు కాగా, ఒకరిది తిరస్కరించగా, స్వతంత్ర అభ్యర్థి జె.యతిరాజులు నామినేషన్ ఉపసంహరించుకున్నారు. -
వెస్ట్ గోదావరి టీడీపికి 'వేస్ట్' గోదావరిగా మారుతుందా?
వెస్ట్ గోదావరి టీడీపీకి వేస్ట్ గోదావరిగా మారనుందా? ఒక వైపు ఫ్యాను గాలితో ఇప్పటికే సతమతమౌతున్న టీడీపీకి ఇప్పుడు పార్టీ రెబెల్స్ పక్కలో బల్లాలుగా మారారు. అయిదు నియోజకవర్గాల్లో రెబెల్స్ పార్టీకి డేంజర్ బెల్స్ మోగిస్తున్నారు.సీట్ల కేటాయింపు తీసుకొచ్చిన తంటాతో ఆ పార్టీ నేతలకు కంటిమీద కునుకులేకుండా పోయింది. కొవ్వూరులో సిట్టింగ్ ఎమ్మెల్యే టీవీ రామారావు, నర్సాపురం నుంచి మత్స్యకార నేత మైలా వీర్రాజు, పాలకొల్లులో డాక్టర్ బాబ్జీ, పోలవరంలో చింతా నాగేశ్వరరావు, తాడేపల్లిగూడెంలో కొట్టు సత్యనారాయణ లు పార్టీని ధిక్కరించి, అధికారిక కాండిడేట్ల దుప్పట్లో కుంపట్లై కూర్చున్నారు. ఇక చింతలపూడిలో మాజీ ఎమ్మెల్యే పీతల సుజాతకు టికెట్ ఇవ్వడం పట్ల స్థానికంగా క్యాడర్లో అసంతృప్తి ఉంది. వైఎస్సార్ కాంగ్రెస్ నుంచి టిడిపిలో చేరిన చెరుకువాడ రంగనాధరాజుకు ఉండి, కొయ్యే మోషేన్ రాజుకు చింతలపూడి, నవుడు వెంకటరమణకు ఉంగుటూరు స్ధానాలిస్తామని హామినిచ్చిన చంద్రబాబు వారెవరికీ టిక్కెట్ ఇవ్వలేదు. వీరంతా ఇప్పుడు అగ్గిమీద గుగ్గిలంలా ఉన్నారు. చంద్రబాబు టికెట్లిచ్చిన వారిని ఓడించి తీరతామని అంటున్నారు. అటు రెబెల్స్, ఇటు అసంతృప్తుల నడుమ ఎన్నికల్లో పార్టీ నష్టపోవడం ఖాయమని తెలుగు తమ్ముళ్లు భావిస్తున్నారు. ఎన్నో ఆశలతో వ్యూహాల మీద వ్యూహాలు రచించిన చంద్రబాబుకు ఇప్పుడు వెస్ట్ గోదావరి పెద్ద తలనొప్పిగా మారింది. -
ఆశావహులదీ అదే బాట
టీడీపీ ముఖ్యనేతల మంత్రాంగం విఫలం అరకు, పాడేరు, విశాఖ ఉత్తరం సీట్లలో తలనొప్పి సీటురాని నేతల నుంచీ మొదలైన సహాయ నిరాక‘రణం’ బుజ్జగింపులు, ఎరలకు లొంగని రెబల్స్ సాక్షి, విశాఖపట్నం: జిల్లా టీడీపీలో బుసలు కొడుతొన్న అసమ్మతి ఇంకా దారికి రాలేదు. మెట్టు దిగడానికి రెబల్స్ ససేమిరా అంటున్నారు. ముఖ్యనేతలు మంత్రాంగం నెరుపుతున్నా బెట్టువీడనంటున్నారు. మరోపక్క టిక్కెట్ దక్కని పలువురు ఆశావహులు పార్టీకి విధేయులుగా ఉంటూనే తెరవెనుక సహాయనిరాకరణ మొదలుపెట్టేశారు. దీంతో ఇప్పుడు జిల్లాలో టీడీపీ మునుపెన్నడూలేని గడ్డు పరిస్థితి ఎదుర్కొంటోంది. అరకు,పాడేరు, విశాఖ ఉత్తరం,యలమంచిలో రెబల్స్ నామినేషన్ల ఉపసంహరించుకోకూడదని తాజాగా నిర్ణయించుకోవడంతో టీడీపీ నేతలకు పాలుపోవడంలేదు. అరకు సీటును సిట్టింగ్ ఎమ్మెల్యే సోమకు ఇచ్చి కొత్తగా పార్టీలో చేరిన కుంబా రవిబాబుకు చంద్రబాబు కోలుకోలేని షాక్ ఇచ్చారు. రెబల్‌గా బరిలో నించున్న ఈయనకు ఎమ్మెల్సీ లేదా నామినేటెడ్ పోస్టు ఇస్తామని ఆశచూపారు. బాబు మాటలు నమ్మబోనంటూ ఆయన బరిలోనే ఉండాలని నిర్ణయించుకున్నారు. పాడేరులో బీజేపీతో టీడీపీ పొత్తునకు నిరసిస్తూ టీడీపీ అభ్యర్థులు ప్రసాద్, కొత్తపల్లి సుబ్బారావు నామినేషన్లు వేశారు. వీరిలో సుబ్బారావు రెబల్గానే ఉండాలని నిర్ణయించుకున్నారు. విశాఖ ఉత్తరంలో బీజేపీ అభ్యర్థి విష్ణుకుమార్ రాజుకు వ్యతిరేకంగా మాజీ ఐఏఎస్ అధికారి దువ్వారపు రామారావు రెబల్గానే కొనసగాలని నిర్ణయించుకున్నారు. బీరాలు పలికి నీరుగారిపోయిన సుందరపు యలమంచిలి టిక్కెట్ తనకు కాకుండా పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్లకు ఇవ్వడాన్ని జీర్ణించుకోలేకపోయిన నియోజకవర్గ ఇంఛార్జి సుందరపు విజయ్ అసంతృప్తితో పార్టీ కార్యాలయాన్ని తన అనుచరులతో తగులబెట్టించారు. టిక్కెట్ ఇచ్చేవరకు ఆమరణ దీక్ష విరమించుకోనని బీరాలు పలికారు. రెబల్‌గా నామినేషన్ కూడా వేశారు. పార్టీ అభ్యర్థిని ఓడిస్తానని శపథం పూనారు. మొన్న చంద్రబాబు బుజ్జగించినా ససేమిరా అన్నారు. ఎమ్మెల్సీ ఇస్తానన్నా వద్దని పోటీ చేస్తానని గొప్పలకు పోయారు. తీరా ఇప్పుడు నామినేషన్ ఉపసంహరించుకుంటున్నట్లు బహిరంగంగా ప్రకటించడంపై అనుచరులు మండిపడుతున్నారు. తనకోసం పార్టీకి వ్యతిరేకంగా ఆందోళన చేస్తే..ఇప్పుడు టిక్కెట్ వచ్చిన అ భ్య ర్థితో చేతులు కలపడంపై గుర్రుగా ఉన్నారు. పార్టీ ప్రలోభాలకు లొంగిపోయి తీసుకున్న నిర్ణయంపై ఆగ్రహావేశాలు వ్యక్తంచేస్తున్నారు. పాడేరు,మాడుగుల,చోడవరం,పాయకరావుపేట నియోజకవర్గాల్లో టిక్కెట్లు ఆశించి భంగపడ్డ పలువురు నేతలు నియోజకవర్గాల్లో పార్టీ నిలబెట్టిన అభ్యర్థులకు సహకరించకూడదని నిర్ణయించుకున్నారు. రెబల్‌గా నామినేషన్ వేయాలని వీరు మొదట్లో నిర్ణయించినా తద్వారా వచ్చే ప్రయోజనం లేదని భావించిచివరి నిమిషంలో వెనక్కుతగ్గారు. ప్రచారం విషయంలో ప్రస్తుత అభ్యర్థికి సహకరించకూడదనే భావనలో ఉన్నారు. అభ్యర్థులు వీరిని కలిసేప్రయత్నాలు చేస్తున్నా చిక్కకపోవడంతో ఎలా నెట్టుకురావాలో తెలియక సతమతమవుతున్నారు. -
పంతం వీడని రెబల్స్
దారికి తెచ్చుకునేందుకు టీడీపీ సకల యత్నాలు బుజ్జగించేందుకు లక్షలు కుమ్మరింపు ‘దేశం’కు తలనొప్పిగా మారిన స్వతంత్రులు నజరానాల ఆశ చూపిస్తున్న పెద్దలు విశాఖ రూరల్, న్యూస్‌లైన్ : తిరుగుబాటుదారులను దారికి తెచ్చుకోవడం టీడీపీకి శిరోభారంగా తయారైంది. జిల్లాలో ఎన్నడూ లేనంతగా రెబల్స్ తాకిడి ఈ పార్టీని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. నామినేషన్ల ఉపసంహరణకు గడువు సమీపిస్తుండడంతో వీరినెలాగైనా దారికి తెచ్చుకోవాలనే ప్రయత్నంలో అధిష్టానం పడింది. వారేమి అడిగినా ఓ యస్ అంటోంది. ఆయా నియోజకవర్గాల అభ్యర్థులు రెబల్స్‌గా బరిలో ఉన్నవారికి భారీగా నజరానాల ఆశ చూపిస్తున్నారు. ఏకంగా రూ.25 లక్షలు వరకు ఇవ్వడానికి సిద్ధపడుతున్నట్లు తెలిసింది. అయినా ఇప్పటివరకూ చేసిన ప్రయత్నాలు కొలిక్కిరాకపోవడంతో పార్టీలో కలవరం మొదలైంది. భారీ మొత్తంలో ముట్టజెప్పడంతో పాటు భవిష్యత్తులో నామినేటెడ్ పదవులు లేదా పార్టీ పదవులు ఇస్తామంటూ ఆశలు కల్పిస్తున్నా పట్టువీడటం లేదు. భీమిలిలో టీడీపీ అభ్యర్థి గంటా శ్రీనివాసరావుకు రెబల్‌గా సకురు అనిత నా మినేషన్ వేశారు. పార్టీ అధినాయకులు ఆమె తో చేసిన సంప్రదింపులు ఫలించిన దాఖలా లు లేవు. గాజువాకలో చంద్రబాబు నేరుగా మాట్లాడి పార్టీ పదవి ఇస్తామని చెప్పినా కోన తాతారావు ససేమిరా అనడం అక్కడి అభ్యర్థి పల్లాకు ముచ్చెమటలు పట్టిస్తోంది. యలమంచిలి టికెట్‌ను పంచకర్లరమేష్బాబుకు కేటాయించడంతో సుందరపు విజయ్‌కుమార్ ఏకంగా నిరాహార దీక్ష చేశారు. దీక్ష విరమించి నా ఆయన అసమ్మతి బాట వీడలేదు. చివరి రోజున రెబెల్‌గా నామినేషన్ వేయడం ఆయనింకా దారికి రాలేదనడానికి తార్కాణంగా కనిపిస్తోంది. అరకు సీటు విషయంలో చివరి క్షణంలో హైడ్రామా సాగిన విషయం తెలిసిం దే. మూడు రోజుల క్రితం కుంబా రవిరాబుకు బి-ఫారం ఇచ్చి ఆఖరి నిమిషంలో సిట్టింగ్ ఎమ్మెల్యే సివేరిసోమకు మరో బి-పారం ఇవ్వడంతో రవిబాబు అనుయాయులు రగిలిపోతున్నారు. సోమను ఓడించి తీరుతామని బ హిరంగంగా ప్రకటిస్తున్నారు. సీనియర్ నాయకుల బుజ్జగింపులకు రవిబాబు మెత్తబడలేదని తెలిసింది. పొత్తులో భాగంగా పాడేరు స్థానా న్ని బీజేపీకి కేటాయించడంతో అక్కడ టీడీపీ రెబల్ అభ్యర్థులుగా ఎం.వి.ఎస్.ప్రసాద్, కె.సుబ్బారావులు నామినేషన్ వేశారు. విశాఖ-ఉత్తరం కూడా బీజేపీకి కేటాయించడంతో ఆ టికెట్‌ను ఆశించిన దువ్వారపు రామారావు టీడీపీకి వ్యతిరేకంగా నామినేషన్ దాఖలు చేశారు. వీరందరు నామినేషన్లు ఉపసంహరించుకోడానికి టీడీపీ అభ్యర్థులు ఎంత ముట్టజెప్పడానికైనా సిద్ధపడుతున్నారు. ఇందులో భాగంగా టికెట్‌ను ఆశించిన నియోజకవర్గాల్లో ఇప్పటి వరకు వారు చేసిన ఖర్చులతో పాటు మరికొంత అ‘ధనం’గా ఇచ్చే విధంగా ఒప్పందాలు చేసుకుంటున్నారు. కాంగ్రెస్‌కు తప్పని బెడద జాతీయ, రాష్ట్ర స్థాయి సర్వేలన్నీ కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఉన్నప్పటికీ ఆ పార్టీలోను రెబ ల్స్ బెడద కనిపిస్తోంది. నర్సీపట్నం అసెంబ్లీ టికెట్ కేటాయించకపోవడంతో మనస్తాపం చెందిన పీసీసీ ప్రధానకార్యదర్శి మీసాల సు బ్బన్న తన పదవికి,పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. అనుచరులతో చర్చించి రెండురోజుల్లో రాజకీయ భవిష్యత్‌పై ప్రకటిస్తానని పేర్కొన్నారు. విశాఖ ఎంపీ స్థానానికి చివరి వరకు పేరు వినిపించిన డాక్టర్ కూటికూప్పల సూర్యారావుకు కాదని బొలిశెట్టి సత్యనారాయణకు టికెట్ ఇచ్చారు. దీంతో సూర్యారావు స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేశారు. చోడవరం అసెంబ్లీకి కాంగ్రెస్ పార్టీ కిలి శంకరరావును ప్రకటించి చివరి నిమిషంలో గూనూరు అచ్యుతరావుకు టికెట్ ఇచ్చింది. శంకరరావు రెబల్‌గా పోటీ చేస్తున్నారు. విశాఖ-తూర్పు నియోజకవర్గంలో కూడా కాంగ్రెస్ అభ్యర్థిని ప్రభాగౌడ్కు వ్యతిరేకంగా గంపలగోవింద్ నామినేషన్ వేశారు. వీరందరిని బుజ్జగించడానికి కాంగ్రెస్ పెద్దలు కూడా భారీగా ఆశలు చూపిస్తున్నారు. -
బుద్ధప్రసాద్‌కు ఎదురుగాలి
అవనిగడ్డ బరిలో రెబెల్స్ నామినేషన్లు వేసిన కంఠంనేని, పోసబత్తిన కాంగ్రెస్ నుంచి కలిసిరాని కేడర్ టీడీపీలో వ్యతిరేకత సాక్షి, మచిలీపట్నం : సుదీర్ఘకాలం అవనిగడ్డ రాజకీయాల్లో చక్రం తిప్పిన మండలి బుద్ధప్రసాద్‌కు ప్రస్తుత ఎన్నికల్లో ఎదురీత తప్పడం లేదు. దశాబ్దాల తరబడి రాజకీయ గుర్తింపు ఇచ్చిన కాంగ్రెస్‌ను కాదని ఆయన టీడీపీలో చేరడంతో కొత్త సమస్యలు ఎదుర్కొంటున్నారు. కాంగ్రెస్ శ్రేణులు ఆయన్ను అనుసరించడం లేదు. టీడీపీ కేడర్ ఆయన్ని ఇముడ్చుకోలేకపోతోంది. శనివారం నామినేషన్ల ఘట్టం ముగిసేనాటికి బుద్ధప్రసాద్‌ను వ్యతిరేకిస్తూ టీడీపీ అభ్యర్థులు రెబల్స్‌గా నామినేషన్లు వేయగా. కాంగ్రెస్ అభ్యర్థి సైతం బరిలో నిలిచారు. దీంతో అటు పాత పార్టీ, ఇటు కొత్త పార్టీల నుంచి కూడా ఆయనకు శిరోభారం తప్పలేదు. వాడుకుని వదిలేయడంలో అగ్రగణ్యుడైన చంద్రబాబు అవనిగడ్డలో చివరకు బుద్ధప్రసాద్‌కు టిక్కెట్ ఇవ్వడంతో ఆ పార్టీ శ్రేణుల్లోనే తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఉప ఎన్నికల్లో సానుభూతితో ఎమ్మెల్యే పదవిని టీడీపీకి దక్కించుకునేందుకు మాజీ ఎమ్మెల్యే అంబటి బ్రాహ్మణయ్య కుమారుడు శ్రీహరిప్రసాద్‌కు టిక్కెట్ ఇచ్చారు. అప్పట్లో గెలిచినా ప్రస్తుత ఎన్నికల్లో టిక్కెట్ కేటాయించలేదనే సంగతి తెల్సిందే. నోవా విద్యాసంస్థల చైర్మన్ ముత్తంశెట్టి కృష్ణారావుకు టిక్కెట్ ఆశచూపి అవనిగడ్డ నియోజకవర్గానికి తీసుకొచ్చి కోట్లాది రూపాయలు ఖర్చుపెట్టించారు. చివరకు మాజీ మంత్రి సింహాద్రి సత్యనారాయణ కుమారుడు చంద్రశేఖర్‌కు టిక్కెట్ ఇస్తారనే ప్రచారం జరగడంతో బుద్ధప్రసాద్ జాగ్రత్త పడ్డారు. ఇటీవలే టీడీపీలో చేరిన బుద్ధప్రసాద్‌కు టిక్కెట్ ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తున్న కేడర్ ఆయన్ను ఓడిస్తామని బాహాటంగానే ప్రకటిస్తున్నారు. రెబల్స్‌గా బరిలోకి.. మండలి బుద్ధప్రసాద్‌కు టిక్కెట్ ఇవ్వడంతో టీడీపీకి చెందిన ఇద్దరు నేతలు రెబల్స్‌గా నామినేషన్లు వేశారు. తెలుగువన్ ఫౌండేషన్ (హైదరాబాద్) చైర్మన్ కంఠంనేని రవిశంకర్ శనివారం నామినేషన్ వేశారు. 2009 ఎన్నికల్లోనే చంద్రబాబు తనకు టిక్కెట్ ఇస్తానని అంబటి బ్రాహ్మణయ్యకు ఇచ్చారని, ఈసారి కూడా మోసం చేయడంతో రెబల్‌గా నామినేషన్ వేసినట్టు రవిశంకర్ ప్రకటించారు. ఇటీవల విజయవాడలో జరిగిన మహిళా గర్జన కార్యక్రమంలో చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిన రెయిన్బో వెంచర్స్ అధినేత పోసబత్తిన సాంబశివరావు కూడా రెబల్‌గా నామినేషన్ వేశారు. వీరితోపాటు గతంలో బుద్ధప్రసాద్‌కు మద్దతుగా పనిచేసిన బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు మత్తి వెంకటేశ్వరరావు కాంగ్రెస్ అభ్యర్థిగా నామినేషన్ వేశారు. టీడీపీ శ్రేణులు గరం గరం.. టీడీపీ అభ్యర్థి మండలి బుద్ధప్రసాద్‌పై ఆ పార్టీ శ్రేణులు గరం గరంగానే ఉన్నాయి. పలువురు టీడీపీ నేతలు బుద్ధప్రసాద్‌పై తిరుగుబాటు బావుటా ఎగరేసిన సంగతి తెలిసిందే. టీడీపీ అవనిగడ్డ మండల అధ్యక్షుడు బచ్చు వెంకటనాథ్, జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి పర్చూరి దుర్గాప్రసాద్, చెన్నగిరి సత్యనారాయణ, యర్రంశెట్టి సీతారామయ్య తదితర కీలక నేతలు బుద్ధప్రసాద్‌ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అటు విడిచి వచ్చిన కాంగ్రెస్ వాళ్లు వెంటరాక పోగా, ఇటు చేరిన టీడీపీలో కలిసిరాక అవనిగడ్డలో బుద్ధప్రసాద్ పరిస్థితి గడ్డుగా మారింది. -
సైకిల్‌కు మోగిన రెబెల్స్
టీడీపీకితిరుగుబాటు బెడద యలమంచిలి, పాడేరు,అరకులోయల్లో రగిలిపోతున్న శ్రేణులు బుజ్జగించినా మాట వినని సుందరపు రవిబాబుకు హ్యాండిచ్చిన చంద్రబాబు సాక్షి,విశాఖపట్నం : జిల్లాలో సైకిల్‌కు చిక్కుముళ్లు చుక్కలు చూపిస్తున్నాయి. పార్టీని ధిక్కరించి రెబల్స్ మోగిస్తున్న గంటలు గుండెల్లో గుబులు పుట్టిస్తున్నాయి. ఊహించి నట్టుగానే యలమంచిలి,పాడేరు, అరకులోయల్లో రెబల్ అభ్యర్థులు పార్టీని ధిక్కరించి బరిలో నిలబడి సవాల్ విసిరారు. యలమంచిలిలో పంచకర్లకు టికెట్ ఇవ్వడంతో అలిగిన సుందరపు విజయ్ కుమార్ రెబల్‌గా నామినేషన్ వేశారు. రెండురోజుల ముందు తనకు అన్యాయం జరిగిందని ఆమరణ దీక్ష ప్రకటించిన సుందరపును గురువారం చంద్రబాబు విశాఖ ఎయిర్‌పోర్టులో బుజ్జగించారు. దీంతో సుందరపు దారికివచ్చినట్టేనని చంకలుగుద్దుకున్నారు. ఆయన మాత్రం బాబు బుజ్జగింపులను బేఖాతరుచేస్తూ శనివారం నామినేషన్ వేసి అసలు అభ్యర్థి పంచకర్లకు గొంతులో పచ్చివెలక్కాయపడేలా చేశారు. పాడేరు సీటును బీజేపీకి ఇచ్చి తమ గొంతుకోశారనే ఆగ్రహంతో ఉన్న ఆశావహ నేతలు రెబల్స్‌గా బరిలో నిలిచారు. మొన్నటికి మొన్న ప్రసాద్, నేడు కొట్టగుల్లి సుబ్బారావు రెబల్స్‌గా నామినేషన్ వేశారు. చంద్రబాబు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అటు అరకు టీడీపీలో ముసలం రాజుకుంది. మాజీ ఎమ్మెల్యే కుంభా రవిబాబుకు టీడీపీ చివరి నిమిషంలో హ్యేండ్ ఇచ్చింది. నామినేషన్లకు ఆఖరి రోజయిన శనివారం మధ్యాహ్నం రెండు గంటల సమయంలో రవిబాబు మూడు రోజుల క్రితం ఇచ్చిన పార్టీ బి-ఫారంతో నామినేషన్ వేశారు. అదే సమయంలో అరకు ఎమ్మెల్యే సివేరి సోమ మరో బి-ఫారంతో వచ్చి నామినేషన్ దాఖలు చేశారు. ఈ పరిణామంతో అక్కడే ఉన్న రవిబాబుతోపాటు అతని వర్గీయులతో అవాక్కయ్యారు. ఆఖర్లో ఇలా అధినేత వెన్నుపోటు పొడవడాన్ని అక్కడి శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నాయి. ఈమేరకు రవిబాబు రెబల్‌గా మరో నామినేషన్ వేశారు. మరోపక్క టిక్కెట్లు దక్కని మాజీమంత్రి మణికుమారి అరకు పార్లమెంట్‌కు, గాజువాక నుంచి కోనతాతారావు రెబల్స్‌గా నామినేషన్ వేయడానికి పత్రాలు సిద్ధం చేశారు. కాని ఇంతలో పార్టీ ముఖ్యనేత నారాయణ వీరిని ఫోన్లో బుజ్జగించారు. పార్టీ పరువు బజారుకీడ్చొద్దని తాయిలాల ఎరవేశారు. దీంతోవీరు నామినేషన్ వేయకుండా ఉండిపోయారు. -
చంద్రబాబుకు ఇంట్లో ఈగల మోత!
చంద్రబాబు ఇప్పుడు చిక్కుల్లో ఉన్నారు. ముందు పార్టీ కోసం కష్టపడి పనిచేసిన నేతలకు మొండి చేయి చూపారు. నమ్ముకున్న వారిని నట్టేట ముంచేశారు. టిక్కెట్ల కేటాయింపులో కార్పొరేట్ లాబీయింగ్‌కే పెద్ద పీట వేశారన్న ఆగ్రహం పెల్లుబుకుతోంది. అందుకే టీడీపీలో ఇప్పుడు అసమ్మతి సెగలు పొగలు కక్కుతున్నాయి. దీంతో ఆయన పరిస్థితి ఇబ్బందికరంగా మారింది. చాలా చోట్ల టికెట్ దక్కని నేతలు రెబల్స్‌గా బరిలోకి దిగేందుకు సన్నాహాలు చేస్తున్నారు. చివరి రోజున నామినేషన్‌ను దాఖలు చేయడానికి సిద్ధమవుతోండడం టీడీపీ అధిష్టానాన్ని కలవరపరుస్తోంది. పార్టీ విధేయత, కష్టపడ్డనేతలకు గుర్తింపు ఇవ్వకుండా డబ్బే అర్హతగా పార్టీ టికెట్లు కేటాయిస్తుండటంతో వారు ఆవేదన చెందుతున్నారు. లింగారెడ్డికి మొండి చేయి: పార్టీలోకి కొత్తగా వచ్చిన మాజీ ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డికి ప్రొద్దుటూరు అసెంబ్లీ టికెట్‌ను కేటాయించడంపై తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్యే మల్లేల లింగారెడ్డి ఇంటి వద్ద శుక్రవారం ఉదయం పార్టీ ప్రచార సామగ్రిని దగ్ధం చేసి నిరసన వ్యక్తం చేశారు. ఆయన శనివారం చంద్రబాబును కలిసి తన గోడు వెళ్లబోసుకున్నారు. మాజీ మంత్రి పడాల అరుణ కూడా కన్నీరు పెట్టుకునే స్థితి వచ్చింది. మంగళగిరి కిరికిరి: గుంటూరు జిల్లా మంగళగిరిలోనూ తమ్ముళ్ళ ఆగ్రహం పతాకస్థాయికి చేరింది. స్థానికేతరుడైన తులసీరాంప్రభుకు టికెట్ కేటాయించి ఆ తరువాత స్థానిక నేత గంజి చిరంజీవికి టికెట్ ఇచ్చారు. ఇదీ నచ్చని పార్టీ కార్యకర్తలు ఆయన్ను రూములో బంధించి, నామినేషన్ వేయనీయకుండా చేసేందుకు ప్రయత్నించారు. చివరికి పోలీసుల సాయంతో ఆయన బయటపడ్డారు. ముద్దరబొయినకు టికెట్ పై మండిపాటు: టికెట్లు కేటాయింపుల విషయంలో కృష్ణా జిల్లా కైకలూరులో ఓ మహిళ స్వయంగా చంద్రబాబునే నిలదీశారు. టికెట్లు అమ్ముకుంటున్నారంటూ శాపనార్థాలు పెట్టారు. నూజివీడులో తెలుగు తమ్ముళ్లు అసంతృప్తితో రగిలిపోతున్నారు. సీటు కేటాయింపు విషయంలో చంద్రబాబు ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారని మండిపడుతున్నారు. ఆ పార్టీ జిల్లా, స్థానిక నాయకత్వాలు ముద్దరబోయిన వెంకటేశ్వరరావుకు టికెట్ ఇవ్వొద్దని కోరినా అధినేత ఆయనకే కట్టబెట్టడంపై ఆ పార్టీశ్రేణులు భగ్గుమంటున్నాయి. ఇటు బిజెపికి కేటాయించిన సీట్లలో టీడీపీ అభ్యర్థుల చేత ముందు నామినేషన్లు వేయించిన చంద్రబాబు ఇప్పుడు వాటిని ఉపసంహరించుకొమ్మని ఒత్తిడి తెస్తున్నారు. దీంతో ఆ లీడర్లు, వారి క్యాడర్లు కూడా మండిపడుతున్నారు. మొత్తం మీద చంద్రబాబుకి ఇంట్లో ఈగల మోత అన్నట్టుంది. -
భగ్గుమన్న అసమ్మతి
సాక్షి ప్రతినిధి, అనంతపురం : జిల్లా టీడీపీలో అసమ్మతి సెగలు పొగలు కక్కుతున్నాయి. టికెట్ దక్కని నేతలు రెబల్స్‌గా బరిలోకి దిగేందుకు సన్నాహాలు చేస్తున్నారు. చివరి రోజున నామినేషన్‌ను దాఖలు చేయడానికి సిద్ధమవుతోండడం టీడీపీ అధిష్టానాన్ని కలవరపరుస్తోంది. వివరాల్లోకి వెళితే.. పదేళ్లుగా వరుస పరాజయాలతో కొట్టుమిట్టాడుతోన్న టీడీపీ ఉనికిని సార్వత్రిక ఎన్నికల్లో చాటిచెప్పాలని టీడీపీ అధినేత చంద్రబాబు భావిస్తున్నారు. తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా, పదేళ్లు ప్రతిపక్ష నేతగా పనిచేసిన చంద్రబాబు వ్యవహార శైలిపై ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తమవుతోంది. సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించడం కష్టమని భావించిన ఆయన.. ప్రజావ్యతిరేకతను ధనాస్త్రంతో ఎదుర్కోవాలని ఎత్తు వేశారు. ఆ క్రమంలోనే ధనబలం ఉన్న నేతలకు తన కోటరీలోని రాజ్యసభ సభ్యులు సీఎం రమేష్, సుజనాచౌదరి, గరికపాటి మోహన్‌రావుల ద్వారా వల విసిరారు. జేసీ దివాకర్‌రెడ్డి, జేసీ ప్రభాకర్‌రెడ్డిలకు ఇదే రీతిలో వల విసిరారు. బండారు రవికుమార్‌నూ ఇలాగే దగ్గరకు తీశారు. సొంత పార్టీలో ప్రజాబలం లేకపోయినా.. ధనబలం ఉన్న వారికే టికెట్లు ఇచ్చారు. ఇది దశాబ్దాలుగా టీడీపీని నమ్ముకున్న నేతలకు మింగుడుపడకుండా చేసింది. తనను కాదని రాయదుర్గం టికెట్ కాలవ శ్రీనివాసులుకు ఇవ్వడంతో ఆ నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జ్ దీపక్‌రెడ్డి తేనెతుట్టెను కదిపారు. సీఎం రమేష్ ఓ బ్రోకర్ అని.. పార్టీ టికెట్లు ఇప్పిస్తామంటూ భారీ ఎత్తున డబ్బు వసూలు చేస్తున్నారని దీపక్‌రెడ్డి ఆరోపించడం సంచలనం రేపింది. ఇప్పుడు అనంతపురం నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జ్ మహాలక్ష్మి శ్రీనివాస్ కూడా అదే రీతిలో స్పందించారు. సీఎం రమేష్ ఓ బ్రోకర్ అని.. పార్టీ టికెట్లను అమ్ముకుంటున్నారని తీవ్ర విమర్శలు చేశారు. నిన్నటి వరకూ ఉప్పునిప్పుగా ఉన్న మహాలక్ష్మి శ్రీనివాస్, ప్రభాకర్‌చౌదరిలు ఇద్దరూ సంయుక్తంగా కార్యకర్తల సమావేశం నిర్వహించి.. పార్టీని నమ్ముకుని పనిచేస్తోన్న వారిని కాదని మరొకరికి టికెట్ ఇస్తే తమలో ఒకరు స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగడం ఖాయమని హెచ్చరించారు. టీడీపీని నమ్ముకుంటే బజారున పడాల్సిందేనని ఆరోపించారు. మహాలక్ష్మి శ్రీనివాస్, ప్రభాకర్ చౌదరి ఏకమవడం వెనుక ఓ కారణం ఉంది. వీరిద్దరినీ కాదని అనంతపురం టీడీపీ అభ్యర్థిగా ప్రముఖ కాంట్రాక్టర్, ధనవంతుడైన అమిలినేని సురేంద్రబాబుకు టికెట్ ఇవ్వాలని సీఎం రమేష్ ప్రతిపాదించారు. అమిలినేని సురేంద్రబాబు నుంచి భారీ ఎత్తున డబ్బు దండుకోవడం వల్లే సీఎం రమేష్ ఆయన పేరును ప్రతిపాదించారన్నది ఆ ఇద్దరి వాదన. సీఎం రమేష్ ద్వారా బేరసారాలు సాగిస్తోన్న చంద్రబాబు.. అమిలినేని సురేంద్రబాబు వైపు మొగ్గడమే ఆ ఇద్దరు నేతలను అసంతృప్తికి గురిచేసింది. తమను కాదని మరొకరికి టికెట్ ఇస్తే స్వతంత్ర అభ్యర్థులుగా బరిలోకి దిగుతామని ఆ ఇద్దరూ స్పష్టీకరించారు. అనంతపురం లోక్‌సభ స్థానం నుంచి ప్రభాకర్ చౌదరి, శాసనసభ స్థానం నుంచి మహాలక్ష్మి శ్రీనివాసులు శనివారం స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్ దాఖలు చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. చివరి నిముషంలో టికెట్‌ను నిరాకరించడంతో బండారు రవికుమార్ సైతం శనివారం శింగనమల నుంచి రెబల్‌గా నామినేషన్ వేయడానికి సిద్ధమయ్యారు. రాయదుర్గం నుంచి దీపక్‌రెడ్డి, మడకశిర నుంచి వెంటకటస్వామిలు రెబల్స్‌గా బరిలోకి దిగడం ఖాయం. ధర్మవరం టీడీపీ టికెట్‌ను ఆశించిన గోనుగుంట్ల విజయ్‌కుమార్.. టికెట్ దక్కకపోవడంతో శనివారం రెబెల్‌గా నామినేషన్ వేయాలని నిర్ణయించారు. పొత్తులో భాగంగా గుంతకల్లును బీజేపీకి కేటాయించారు. ఈ స్థానం నుంచి టీడీపీ టికెట్ ఆశించిన సాయినాథ్‌గౌడ్ సోదరుడు జితేందర్‌గౌడ సైతం శనివారం స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగడానికి సన్నాహాలు చేస్తున్నారు. బేరసారాల ద్వారా ధనవంతులకు టీడీపీ టికెట్లు అమ్ముకున్నారన్న విమర్శలు సొంతపార్టీ నేతల నుంచే వస్తోండటంతో టీడీపీ ఇరకాటంలో పడింది. టికెట్లు అమ్ముకోవడంపై ప్రజలు చీదరిస్తుండటంతో సార్వత్రిక ఎన్నికల్లో ఆ పార్టీ గడ్డుపరిస్థితులను ఎదుర్కోవడం ఖాయమని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. -
రెబెల్స్‌పై వేటు
కరీంనగర్ సిటీ, న్యూస్‌లైన్: తిరుగుబాటు అభ్యర్థులపై కాంగ్రెస్ వేటువేసింది. రాష్ట్రవ్యాప్తంగా రెబెల్స్‌ను బహిష్కరిస్తూ పార్టీ అధిష్టానం గురువారం నిర్ణయం తీసుకుంది. ఈ జాబితాలో జిల్లా నుంచి ముగ్గురు అభ్యర్థులున్నారు. రామగుండం, కోరుట్ల, హుజూరాబాద్ నుంచి రెబెల్స్‌గా పోటీచేస్తున్న కౌశిక హరి, జువ్వాడి నర్సింగరావు, ఇనుగాల భీంరావులను పార్టీ నుంచి బహిష్కరించారు. రామగుండం నుంచి కౌశిక హరి పార్టీ టికెట్ ఆశించగా, మైనారిటీ కోటా కింద బాబర్‌సలీంపాషా టికెట్ దక్కించుకున్నారు. దీంతో హరి స్వతంత్రంగా బరిలో నిలిచారు. కోరుట్ల నుంచి మాజీ మంత్రి జువ్వాడి రత్నాకర్‌రావు తనయుడు జువ్వాడి నర్సింగరావు టికెట్ ఆశించగా అనూహ్యంగా మాజీ ఎమ్మెల్యే కొమొరెడ్డి రామ్‌లుకు పార్టీ టికెట్ ఇచ్చింది. హుజూరాబాద్ నుంచి కేతిరి సుదర్శన్‌రెడ్డి అభ్యర్థిత్వాన్ని పార్టీ ఖరారు చేయగా, ఇనుగాల భీంరావు రెబెల్‌గా నిలిచారు. దీంతో ఈ ముగ్గురిని పార్టీ నుంచి బహిష్కరిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఇద్దరి సస్పెన్షన్ పార్టీ అభ్యర్థికి కాకుండా ఇతరులకు మద్దతునిస్తున్న ఇద్దరు కాంగ్రెస్ నాయకులను సస్పెం డ్ చేసినట్లు డీసీసీ అధ్యక్షుడు కొండూరు రవీం దర్రావు తెలిపారు. కోరుట్లలో పార్టీ అభ్యర్థి కొమొరెడ్డి రామ్‌లుకు కాకుండా స్వతంత్ర అభ్యర్థి జువ్వాడి నర్సింగరావుకు గండ్ర రాజు, మార్కెట్ కమిటీ అధ్యక్షుడు సత్యంరావు మద్దతునిస్తున్నారని పేర్కొన్నారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నందున వారిద్దరి పార్టీ సభ్యత్వాన్ని రద్దు చేసి కాంగ్రెస్ నుంచి సస్పెండ్ చేసినట్లు తెలిపారు. -
సీమాంధ్రలో టీడీపీ రెబల్ అభ్యర్థుల నామినేషన్లు
రాజమండ్రి: బీజేపీ-టీడీపీల పొత్తు అనంతరం రాష్ట్ర రాజకీయాల్లో రెబల్ అభ్యర్థులు క్రమేపీ పెరుగుతున్నారు. ఇప్పటికే పలుచోట్ల తిరుగుబాటు బావుటా ఎగురవేసిన టీడీపీ అభ్యర్థులు.. నామినేషన్ల కార్యక్రమంలో రెబల్స్ గా మారి చంద్రబాబుకి షాక్ ఇస్తున్నారు. సీమాంధ్రలో పొత్తులో భాగంగా బీజేపీకి 14 స్థానాలు కేటాయించారు. అయితే టీడీపీ నేతలు రెబల్ అభ్యర్థులుగా మారడంతో పార్టీకి తలనొప్పిగా మారాయి. బీజేపీకి కేటాయించిన స్థానాలకు గాను ఆరు చోట్ల నామినేషన్లు వేశారు. టీడీపీ తరుపున బీజేపీ స్థానాల్లో నామినేషన్లు వేసిన నేతలు.. సంతనూతలపాడు-విజయకుమార్, మదనపల్లె-రమేష్ కైకలూరు-జయమంగళ వెంకటరమణ, పాడేరు- ప్రసాద్ రాజమండ్రి-గోరంట్ల బుచ్చయ్య చౌదరి తాడేపల్లిగూడెం-కొట్టు సత్యనారాయణ -
టిడిపికి రెబల్స్ బెడద
హైదరాబాద్: ఎన్నికలు వచ్చాయంటే అన్ని పార్టీలలో నేతల వలసలు, తిరుగుబాటు అభ్యర్థులు నామినేషన్లు వేయడం మామూలే. ఈ సారి తెలుగుదేశం పార్టీకి ఆ బెడద ఎక్కువైంది. కొత్తగా పార్టీలో చేరిన వారికి, అందులోనూ ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చినవారికి టికెట్లు ఇచ్చారు. దానికితోడు బిజెపితో పొత్తు వల్ల సీమాంధ్రలో టిడిపికి బాగా దెబ్బతగిలింది. పలువురు నాయకులు పార్టీని వీడితే, మరికొందరు రెబల్స్‌గా నామినేషన్లు వేయడానికి సిద్దంగా ఉన్నారు. ఇంకొందరు పార్టీకి రాజీనామా చేస్తామని హెచ్చరిస్తున్నారు. ప్రతి జిల్లాలలోనూ టిడిపికి ఇటువంటి సమస్య ఉంది. విశాఖపట్నం జిల్లా గాజువాకలో హర్షవర్ధన్, భీమిలిలో అనిత సక్రు తిరుగుబాటు అభ్యర్థులుగా నామినేషన్లు వేస్తామని హెచ్చరించారు. మరికొన్ని జిల్లాలలో కూడా ఈ రకమైన సమస్యలు తలెత్తుతున్నాయి. ఇటువంటి వారికి నచ్చజెప్పడం చంద్రబాబు నాయుడుకు ఒక ప్రధాన అంశంగా ఉంటోంది. టీడీపీ రెబల్ అభ్యర్ధిగా గాజువాక నుంచి పోటీ చేస్తానని హర్షవర్ధన్ చెప్పారు. 30 ఏళ్లు పార్టీకి సేవ చేసినా కొత్తగా వచ్చినవారికి టికెట్లు ఎలా ఇస్తారు? అని ఆయన ప్రశ్నించారు. అనకాపల్లి టీడీపీలో కూడా విబేధాలు తలెత్తాయి. నామినేషన్ వేస్తున్న సందర్భంగా తన ఇంటికొచ్చిన అవంతి శ్రీనివాస్‌ను బయటికి వెళ్లిపోవాలని ఆ పార్టీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు అన్నారు. ఎందుకు వచ్చావంటూ అవంతిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దాంతో బిక్కమొహంతో అవంతి శ్రీనివాస్ వెళ్లిపోయారు. బీజేపీతో పొత్తుకు నిరసనగా శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో టీడీపీ కార్యకర్తలు ఈ రోజు రోడ్డుపై బైఠాయించారు. పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు వ్యతిరేకంగా నినాదాలు కూడా చేశారు. నరసరావుపేట స్థానాన్ని బీజేపీకి కేటాయించడంతో స్థానిక టిడిపి నేతలు నేతలు మూకుమ్మడిగా రాజీనామాలు చేయడానికి సిద్ధమయ్యారు. అనంతపురం జిల్లా గుంతకల్లు శాసనసభ స్థానం బిజెపికి కేటాయించిన విషయమై టీడీపీ రాయలసీమ బాధ్యుడు సీఎం రమేష్, మాజీ మంత్రి జేసీ దివాకర్‌రెడ్డి మధ్య కూడా తీవ్ర స్థాయిలో వాగ్వాదం జరిగినట్లు తెలుస్తోంది. -
అన్ని పార్టీలకూ...అసమ్మతి సెగ!
సాక్షి, రంగారెడ్డి జిల్లా: సార్వత్రిక వేడి ఎక్కువవుతుండడంతో అభ్యర్థుల్లో టెన్షన్ పెరిగిపోతోంది. పోలింగ్‌కు 15రోజులు మాత్ర మే ఉండడంతో అటు ప్రచార పర్వం లో బిజీగా ఉన్న అభ్యర్థులు.. ఇటు పార్టీలోని ఆశావహులను బుజ్జగించే ప్రయత్నాలూ ముమ్మరం చేశారు. వారి అలకతో అనుచరగణం దెబ్బతినకుండా ఉండేందుకు నేరుగా మం తనాలు సాగించేపనిలో నిమగ్నమయ్యారు. ఉదయం అంతా ప్రజల్లోకి వెళ్తున్న అభ్యర్థులు.. సాయంత్రానికి పార్టీ నేతలు, అనుచరులతో సమావేశాలు సాగిస్తున్నారు. ‘చేయి చేయి’ కలుపుదాం.. కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తుల బెడద తీవ్రంగా ఉంది. చేవెళ్ల అసెంబ్లీ సెగ్మెంటు నుంచి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఆశించి భంగపడిన నేత వెంకటస్వామి స్వతంత్రుడిగా రంగంలోకి దిగి చివరి నిమిషంలో వెనక్కితగ్గారు. అయితే తనకు వెన్నంటి ఉన్న అనుచరులు మద్దతు కూడగట్టుకునేందుకు కాంగ్రెస్ నేతలు ముమ్మరప్రయత్నాలు చేస్తున్నారు. మరోైవె పు వికారాబాద్ వ ూజీ ఎమ్మెలే ఏ.చంద్రశేఖర్ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. అయితే టికెట్ ఆశించి భంగపడడంతో చివరి నిమిషంలో స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేసిన ఆయన అధిష్టానం ఆదేశాలతో పోటీ నుంచి తప్పుకున్నారు. ఇక్కడ చంద్రశేఖర్ అనుచరుల మద్దతు కూడగట్టేందుకు నేతలు తలమున కలవుతున్నారు. ఇబ్రహీంపట్నం నుంచి పోటీ చేసేందుకు ఉత్సాహం చూపిన మల్రెడ్డి రంగారెడ్డి, సోదరుడు రాంరెడ్డి ఇరువురు స్వతంత్రులుగా బరిలోకి దిగారు. అయితే రంగారెడ్డి మహేశ్వరం నియోజకవర్గానికి మారడంతో రాంరెడ్డి మాత్రం పోటీకి సై అన్నారు. హయత్‌నగర్‌లో ప్రభల్యం ఉన్న ఉన్న రాంరెడ్డి పోటీ నుంచి తప్పుకోకపోవడంతో ప్రస్తుత కాంగ్రెస్ అభ్యర్థికి తలనొప్పిగా మారింది. ఈ పరిస్థితి నుంచి గట్టేక్కేందుకు స్థానిక నేతలు శతవిధాలా ప్రయత్నాలు సాగిస్తున్నారు. ‘సైకిల్’కు రెబల్స్ బ్రేక్! తెలుగుదేశంలో అసమ్మతుల సెగ అభ్యర్థులకు కునుకు పడనివ్వడం లేదు. మేడ్చల్ టీడీపీ టికెట్ ఆశించిన నందారెడ్డి, నక్క ప్రభాకర్ ఇరువురు స్వతంత్రంగా రంగంలోకి దిగారు. అయితే నందారెడ్డి పోటీ నుంచి తప్పుకున్నప్పటికీ ప్రభాకర్ మాత్రం వెనక్కి తగ్గలేదు. దీంతో పార్టీ అధిష్టానం సోమవారం అతడిపై వేటు వేసింది. మరోవైపు ఎల్బీనగర్ నుంచి టీడీపీ టికెట్ చివరినిమిషంలో బీసీ సంఘ నేత ఆర్.కృష్ణయ్యకు ఖరారు కావడంతో అంతకు ముందు నుంచి టికెట్ వస్తుందని ఆశిం చిన రంగారెడ్డి, కృష్ణప్రసాద్‌లను బుజ్జగించేందుకు ఆ పార్టీ అధిష్టానం నానాతంటాలూ పడింది. మరోవైపు చేవెళ్ల టీడీపీ టికెట్ ఆశించిన జోగు వెంకటయ్యకు చేదు అనుభవం ఎదురైంది. దీంతో వెంకటయ్య తనయుడు అశోక్ స్వతంత్రంగా బరిలోకి దిగారు. దీంతో ఆక్కడ టీడీపీలో ఏర్పడిన చీలికను పూడ్చే ప్రయత్నానికి పూనుకున్నారు. మరోవైపు టికెట్ ఆశించి భంగపడ్డ నేతలు పార్టీ మారడంతో క్యాడర్‌లోనూ సందిగ్ధం ఏర్పడింది. మన ‘కారు’లో వెళ్దాం బ్రదర్ ఉద్యమ నేపథ్యం.. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు కావడం.. ఇతర పార్టీల నుంచి బలమైన అభ్యర్థులు వలస రావడంతో జిల్లాలో బలపడుతున్న టీఆర్ఎస్ పార్టీకి సైతం అసంతృప్తుల నుంచి గట్టిదెబ్బే తగిలింది. పార్టీ ఏర్పాటు నుంచి ఇప్పటివరకు అంటిపెట్టుకుని ఉన్నవారికి టిక్కెట్లు రాకపోవడంతో ఆశావహులు గుర్రుగా ఉన్నారు. చేవెళ్ల నియోజకవర్గం నుంచి టికెట్ ఆశించిన దేశమల్ల ఆంజనేయులుకు టికెట్ దక్కకపోవడంతో ఆయన స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగారు. ఇబ్రహీంపట్నం టికెట్‌ను స్థానికేతరుడు శేఖర్‌రెడ్డికి ఇవ్వడంతో అక్కడి నేతలు తీవ్ర నిరుత్సాహం కనబరుస్తున్నారు. ఇలా దాదాపు అన్ని నియోజకవర్గాల్లో అసంతృప్తులు అభ్యర్థులను ఇరకాటంలో పడేశారు. దీంతో పార్టీ అధిష్టానం నుంచి రాయబారాలు నడుపుతూ సహకారం కోసం అభ్యర్థులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. -
పోరు షురూ
ఇక పోటాపోటీ తప్పుకున్న రెబల్స్ పార్టీలకు లైన్ క్లియర్ ప్రచారాస్త్రాలకు పదును గ్రేటర్ అసెంబ్లీ బరిలో 511 మంది లోక్‌సభ స్థానాలకు పోటీలో 91 మంది సాక్షి, సిటీబ్యూరో: టికెట్ వస్తుందో రాదోనని టెన్షన్.. తీరా వచ్చాక అన్ని ప్రధాన పార్టీల గుండెల్లో మోగిన రె‘బెల్స్’.. నిన్నటి వరకు తిరుగుబాటు అభ్యర్థుల్ని దారికి తెచ్చుకునేందుకు తంటాలు.. ఇప్పుడిక బుజ్జగింపులు, బేరసారాలు ముగిశాయి. అన్నీ సర్దుకున్నాయి. ఉత్కంఠకు తెరపడింది. అసలు పోరు షురూ అయింది. ఆదివారం నుంచి పూర్తిస్థాయిలో విస్తృత ప్రచారానికి అభ్యర్థులు సిద్ధమవుతున్నారు. మరోపక్క ఈ నెల 30న జరిగే పోలింగ్‌కు అధికారులు సన్నాహాల్లో మునిగారు. ప్రధానంగా ఈవీఎంలపై దృష్టి సారించారు. ఒక్కో ఈవీఎంలో 16 మీటలుండగా, ఒకటి నోటాకు కేటాయించారు. ఇదిపోను దీనిపై 15 పార్టీ గుర్తులకు అవకాశం ఉంటుంది. అంతకుమించి అభ్యర్థులు పోటీలో ఉన్నచోట రెండేసి ఈవీఎంలు ఉండాల్సిందే. హైదరాబాద్ జిల్లా పరిధిలోని 15 అసెంబ్లీ, 2 పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించి 13,150 ఈవీఎంలను సిద్ధం చేశారు. అసెంబ్లీ స్థానాలకు 511 మంది.. నామినేషన్ల ఉపసంహరణ అనంతరం గ్రేటర్ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో మొత్తం 511 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, టీడీపీ, టీఆర్ఎస్, వైఎస్సార్సీపీ, వామపక్ష పార్టీలతో పాటు పలువురు స్వతంత్రులు అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. రెబల్స్‌ను బరి నుంచి తప్పించడంలో ప్రధాన పార్టీలు సఫలమయ్యాయి. గోషామహల్, పటాన్‌చెరులలో బీజేపీ రెబల్ అభ్యర్థులు నందకిశోర్‌వ్యాస్, సి.అంజిరెడ్డి పోటీ నుంచి తప్పుకోలేదు. ఇంతకుమించి చెప్పుకోదగ్గ రెబల్స్ ఎవరూ ఆయా పార్టీల్లో బరిలో లేరు. గ్రేటర్‌లోని అంబర్‌పేట నియోజకవర్గంలో అత్యధికంగా 32 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 31 మంది, కూకట్పల్లి, ఎల్బీనగర్లలో 29 మంది తుది పోరులో నిలిచారు. అత్యల్పంగా కంటోన్మెంట్ నుంచి పది మంది పోటీలో మిగిలారు. లోక్‌సభ స్థానాల్లో 91 మంది.. గ్రేటర్ పరిధిలోని 4 లోక్‌సభ నియోజకవర్గాల నుంచి మొత్తం 91 మంది అభ్యర్థులు బరిలో మిగిలారు. సికిం ద్రాబాద్ లోక్‌సభకు 34 అర్హమైన నామినేషన్లు ఉండగా, శనివారం నలుగురు పోటీ నుంచి తప్పుకున్నారు. చేవెళ్ల లోక్‌సభ స్థానం నుంచి ఐదుగురు నామినేషన్లను ఉపసంహరించుకోగా 15 మంది మిగిలారు. మల్కాజిగిరి లోక్‌సభ నుంచి 30 మంది, హైదరాబాద్ లోక్‌సభ నుంచి 16 మంది అభ్యర్థులు రంగంలో మిగిలారు. బెట్టు చేసి.. మెట్టు దిగి.. ఆయా పార్టీల నుంచి రెబల్స్‌గా ఉన్న సామ రంగారెడ్డి, కాచం సత్యనారాయణ, మల్కాజిగిరి కుమార్, శోభారాణి, ఎస్.వెంకటసుబ్బయ్య, సునీతప్రకాశ్‌గౌడ్, నగేశ్ ముదిరాజ్, జి.సాల్మన్‌రాజు, జగదీశ్వర్‌గౌడ్, మొవ్వా సత్యనారాయణ, పీఎల్ శ్రీనివాస్, ఉప్పల శారద, నదీముల్లా తదితరులు పార్టీ అధినేతల బుజ్జగింపులు, హామీలతో నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. కాంగ్రెస్ రెబల్స్‌కు దానం, సబితా, టీడీపీ రెబల్స్‌కు చంద్రబాబునాయుడు తగు హామీలిచ్చి మెత్తబరిచారు. పోటీలో ప్రముఖులు అసెంబ్లీ బరిలో పోటీలో ఉన్న ప్రముఖుల్లో వి.హనుమంతరావు, మర్రి శశిధర్‌రెడ్డి, దానం నాగేందర్, తీగల కృష్ణారెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్, జి.కిషన్‌రెడ్డి, ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, ప్రకాశ్‌గౌడ్, అక్బరుద్దీన్ ఒవైసీ, ముఖేశ్‌గౌడ్, కె.లక్ష్మణ్, జి.బాల్‌రెడ్డి, ముఠాగోపాల్, కూన శ్రీశైలంగౌడ్, కొలను శ్రీనివాసరెడ్డి, ఆర్.కృష్ణయ్య, సుధీర్‌రెడ్డి, పుత్తా ప్రతాప్‌రెడ్డి, బిక్షపతియాదవ్, ముక్కా రూపానందరెడ్డి, ముంతాజ్‌అహ్మద్‌ఖాన్, బద్దం బాల్‌రెడ్డి, జయసుధ, విజయారెడ్డి, జాఫర్‌హుస్సేన్, మల్రెడ్డి రంగారెడ్డి, జి.సాయన్న, పాషాఖాద్రి, మోజంఖాన్, బలాల, వెంకట్‌రెడ్డి తదితరులున్నారు. లోక్‌సభ స్థానాలకు పోటీలో ఉన్న ప్రముఖుల్లో ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ, భగవంతరావు పవార్ (హైదరాబాద్), బండారు దత్తాత్రేయ, అంజన్‌కుమార్, భీమ్సేన్, సయ్యద్ సాజిద్‌అలీ, ఛాయారతన్ (సికింద్రాబాద్), సర్వే సత్యనారాయణ, వి.దినేశ్‌రెడ్డి, జేపీ, డాక్టర్ నాగేశ్వర్, మల్లారెడ్డి (మల్కాజిగిరి) ఉన్నారు. -
ఇక సమరమే!
ఉపసంహరణల ఘట్టం ముగిసింది. ‘రెబెల్స్’ను దారిలోకి తెచ్చేందుకు బరిలోని అభ్యర్థులు, ఆయా పార్టీల పెద్దలు చేసిన యత్నాలు పాక్షికంగానే ఫలించాయి. కొందరు ఇంకా పోరుకు సై అంటూ సత్తా చూపేందుకు సిద్ధపడుతున్నారు. మొత్తానికి ఒక ప్రధాన అంకం ముగిసి అంతా సమరానికి శంఖారావం చేసినట్లే. ఇక ‘సార్వత్రిక’ ప్రచార పర్వం కొత్త ఊపుతో నడవడమే తరువాయి. దీనికి అన్ని పక్షాల వారూ ఉత్సాహంగా కదులు తున్నారు. సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: సాధారణ ఎన్నికల నామినేషన్ల పర్వానికి శనివారం నాటికి ఉపసంహరణ ప్రక్రియతో తెరపడింది. టికెట్లు ఆశించిన ఔత్సాహికులు పోటీలు పడి నామినేషన్లు దాఖలు చేయడంతో అన్ని పార్టీలు తలపట్టుకున్నాయి. టికెట్ దక్కించుకున్న నేతలు తిరుగుబాటుదారులను రంగం నుంచి తప్పించేందుకు నానా పాట్లు పడ్డారు. కొందరు బెట్టువీడి అధికారిక అభ్యర్థులకు మద్దతు పలికేందుకు సిద్ధమయ్యారు. మరికొందరు చివరి నిముషంలో ఇతర పార్టీల తీర్థం పుచ్చుకున్నారు. ఇంకొందరు తిరుగుబాటు అభ్యర్థులుగా బరిలో నిలిచి సత్తా చాటేందుకు రెడీ అవుతున్నారు. పత్యర్థులెవరో తేలడంతో పార్టీలు, అభ్యర్థులు ప్రచార పర్వంలోకి దిగుతుండటంతో కీలక ఘట్టానికి తెరలేచింది. జిల్లాలోని రెండు లోక్‌సభ, 14 అసెంబ్లీ స్థానాలకు శనివారంతో నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ముగిసింది. మహబూబ్‌నగర్ లోక్‌సభ స్థానంలో తొమ్మిది, నాగర్‌కర్నూలులో ఆరుగురు అభ్యర్థులు బరిలో నిలిచారు. 14 అసెంబ్లీ స్థానాల్లో 149 మంది అభ్యర్థులు పోటీ పడుతుండగా వీరిలో 73 మంది స్వతంత్రులే కావడం గమనార్హం. మక్తల్, షాద్‌నగర్, నాగర్‌కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గాల్లో అత్యధికంగా 14 మంది వంతున పోటీ చేస్తున్నారు. కొడంగల్, జడ్చర్ల, దేవరకద్ర, అచ్చంపేట నియోజకవర్గాల్లో ఏడుగురు చొప్పున మాత్రమే బరిలో వున్నారు. కాంగ్రెస్, టీఆర్ఎస్ 14 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేస్తుండగా, వైఎస్సార్ కాంగ్రెస్ 10, టీడీపీ ఎనిమిది, బీజేపీ ఆరు, సీపీఎం రెండు నియోజకవర్గాల్లో అభ్యర్థులను నిలిపాయి. బీఎస్పీ, ఆమ్ ఆద్మీ, పిరమిడ్ వంటి పార్టీ తరపున కూడా అభ్యర్థులు అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఫలించిన బుజ్జగింపులు పార్టీ నిర్ణయాన్ని ధిక్కరించి బరిలోకి దిగిన తిరుగుబాటు అభ్యర్థులను బుజ్జగించేందుకు పార్టీలు, నేతలు చేసిన ప్రయత్నాలు పాక్షికంగా ఫలితాన్ని ఇచ్చాయి. చాలా చోట్ల చివరి నిముషంలో తిరుగుబాటు అభ్యర్థులు తప్పుకునే క్రమంలో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. మహబూబ్‌నగర్ లోక్‌సభ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన పి.చంద్రశేఖర్ పోటీ నుంచి తప్పుకుని నేరుగా గాంధీభవన్‌లో కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. నారాయణపేట సీటును టీడీపీకి కేటాయించడాన్ని నిరసిస్తూ బీజేపీ జిల్లా అధ్యక్షుడు రతంగ్ పాండు రెడ్డి ఏకంగా పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచారు. జడ్చర్ల సీటు దక్కక పోవడంతో కాంగ్రెస్ తిరుగుబాటు అభ్యర్థిగా పోటీ చేసిన మార్కెట్ కమిటీ చైర్మన్ రమేశ్‌రెడ్డి బరి నుంచి తప్పుకుని టీఆర్ఎస్లో చేరారు. కల్వకుర్తి టీఆర్ఎస్ నియోజకవర్గ ఇంచార్జి బాలాజీ సింగ్, దేవరకద్ర నుంచి టీడీపీ నేత ఎగ్గని నర్సింహులు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. విశ్వేశ్వర్ (దేవరకద్ర), వీర్లపల్లి శంకర్ (షాద్‌నగర్), విష్ణువర్దన్ రెడ్డి (కొల్లాపూర్) బరి నుంచి తప్పుకోవడంతో కాంగ్రెస్ అభ్యర్థులకు ఊరట దక్కింది. టీఆర్ఎస్ నుంచి గోలి శ్రీనివాస్‌రెడ్డి, కరాటే రాజు (కల్వకుర్తి), విఠల్‌రావు (నారాయణపేట), పున్నంచంద్ లాహోటీ, నాగరాజు గౌడ్ (కొడంగల్) పోటీ నుంచి తప్పుకున్నారు. బీజేపీ కార్యవర్గ సభ్యుడు కొండయ్య (మక్తల్) చివరి నిముషంలో ఉపసంహరించుకోవడంతో కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్, కాంగ్రెస్ టికెట్ దక్కక పోవడంతో తిరుగుబాటు జెండా ఎగురవేసిన సయ్యద్ ఇబ్రహీం మహబూబ్‌నగర్ లోక్‌సభ, అసెంబ్లీ స్థానాల నుంచి ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తున్నారు. -
దారికొచ్చిన రెబల్స్
సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : రెబల్స్ దారికొచ్చారు. తిరుగుబావుటా ఎగరవేసిన ప్రధాన పార్టీల నాయకులు చివరి రోజు శనివారం తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. తిరుగుబాటుదారులను బుజ్జగించేందుకు ప్రధాన పార్టీల అధిష్టానాలు చేసిన ప్రయత్నాలు దాదాపు ఫలించాయి. జిల్లాలో ఒకటి రెండు చోట్ల మినహా మిగతా అన్ని ప్రధాన పార్టీల రెబల్స్ బరినుంచి తప్పుకోవడంతో ఆయా పార్టీల అభ్యర్థులు ఊపిరి పీల్చుకున్నారు. ఆదిలాబాద్ ఎమ్మెల్యే స్థానానికి డీసీసీ అధ్యక్షుడు సి.రాంచంద్రారెడ్డి తిరుగుబావుటా ఎగురవేశారు. స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేశారు. అయితే పార్టీ అధిష్టానం నుంచి ఒత్తిడి రావడంతో ఆయన తన నామినేషన్‌ను ఉపసంహరించుకున్నారు. దీంతో ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి భార్గవ్‌దేశ్ పాండేకు ప్రధాన రెబల్ బెడద తప్పింది. కానీ స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేసిన కాంగ్రెస్ మహిళ నాయకురాలు సిరాజ్‌ఖాన్ మాత్రం బరిలోనే ఉన్నారు. బోథ్, ఖానాపూర్ స్థానాలకు నామినేషన్లు వేసిన కాంగ్రెస్ తిరుగుబాటు అభ్యర్థులు కొమ్ర కోటేష్, భరత్ చౌహాన్లు కూడా బరి నుంచి తప్పుకున్నారు. చెన్నూర్ కాంగ్రెస్ టిక్కెట్ ఆశించి నామినేషన్ వేసిన ఆ పార్టీ నాయకుడు దాసారపు శ్రీనివాస్ కూడా నామినేషన్‌ను ఉపసంహరించుకున్నారు. ఇటీవల కాంగ్రెస్‌లో చేరిన ఇంద్రకరణ్‌రెడ్డి మాత్రం నిర్మల్‌లో బీఎస్పీ తరఫున పోటీ చేస్తున్నారు. దీంతో కాంగ్రెస్ అభ్యర్థి ఏలేటి మహేశ్వర్‌రెడ్డికి సాంకేతికంగా రెబల్ బెడద ఉన్నట్లే అయ్యింది. అలాగే సిర్పూర్లో కోనేరు కోనప్ప కూడా బీఎస్పీ తరఫున బరిలో ఉన్నారు. పొత్తులో భాగంగా బెల్లంపల్లి స్థానానికి సీపీఐకి కేటాయించిన కాంగ్రెస్.. నియోజకవర్గ ఇన్చార్జి చిలుముల శంకర్‌ను బరిలో నిలిపి కామ్రెడ్లకు చెయ్యిచ్చింది. దీంతో సీపీఐ పార్టీ జిల్లాలో కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా పని చేయాలని నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు. కాంగ్రెస్ తిరుగుబాటు అభ్యర్థులను బుజ్జగించేందుకు కేంద్ర మంత్రి జైరాంరమేష్, పొన్నాల లక్ష్మయ్యల మంత్రాంగం ఫలించండంతో ఆ పార్టీ అభ్యర్థులు ఊపిరిపీల్చుకున్నారు. టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు కూడా తిరుగుబాటుదారుల బెడద తప్పింది. సిర్పూర్లో తన కుమారుడితో నామినేషన్ వేయించిన పాల్వాయి రాజ్యలక్ష్మి తన కుమారుని నామినేషన్ ఉపసంహరింపచేసుకున్నారు. కాని టీఆర్ఎస్కు రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరారు. టీఆర్ఎస్కు రాజీనామా చేసిన ఆ పార్టీ మైనార్టీ నాయకులు జబ్బార్‌ఖాన్ మాత్రం బరిలోనే ఉన్నారు. ఆసిఫాబాద్ స్థానానికి టీఆర్ఎస్ రెబల్ అభ్యర్థిగా నామినేషన్ వేసిన పెందూర్ గోపి పోటీలో ఉంటున్నారు. దీం తో ఇక్కడి టీఆర్ఎస్ అభ్యర్థి కోవ లక్ష్మీకు తిరుగుబాటు అభ్యర్థి బెడద తప్పడం లేదు. మంచిర్యాలలో నామినేష న్ వేసిన టీఆర్ఎస్ నాయకులు సిరిపురం రాజేష్ కూడా పోటీ నుంచి తప్పుకున్నారు. ఖానాపూర్‌లో విజయలక్ష్మీచౌహాన్ బరి నుంచి తప్పుకోవాలని నిర్ణయించారు. టీడీపీ రెబల్స్‌ను బుజ్జగించేందుకు ఆ పార్టీ నాయకులు చేసిన ప్రయత్నాలు కూడా ఫలించాయి. సిర్పూర్ స్థానం నుంచి నామినేషన్ వేసిన పార్టీ సీనియర్ నాయకుడు బుచ్చిలింగం ఎట్టకేలకు వెనక్కి తగ్గారు. రాథోడ్ రమేష్‌తో మంతనాలు జరిపిన ఆయన నామినేషన్‌ను ఉపసంహరించుకొని బరి నుంచి తప్పుకున్నారు. చెన్నూర్ టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి దుర్గం నరేష్ కూడా నామినేషన్ ఉపసంహరించుకోవడంతో బీజేపీ-టీడీపీ పొత్తుకు భంగం కలగలేదు. కానీ ఇక్కడ బీజేపీ రెబల్ అభ్యర్థి అందుగుల శ్రీనివాస్ మాత్రం బరిలో ఉండడంతో బీజేపీ-టీడీపీ ఉమ్మడి అభ్యర్థి రాంవేణుకు తిరుగుబాటు అభ్యర్థి బెడద తప్పలేదు. -
ఒప్పుకోం..తప్పుకోం
పోటీ నుంచి తప్పుకోని తిరుగుబాటు నేతలు.. అన్ని పార్టీల్లో రెబెల్స్ గుబులు అధినాయకుల హెచ్చరికలు బేఖాతర్ కేసీఆర్, పొన్నాల, ఎర్రబెల్లి వంటి ముఖ్యులకూ ముప్పే బెడిసికొడుతున్న టీడీపీ-బీజేపీ పొత్తు మిత్రపక్షం సీపీఐకి కాంగ్రెస్ షాక్, మహేశ్వరంలో అధికారిక అభ్యర్థి సాక్షి, హైదరాబాద్: నామినేషన్ల ఉపసంహరణ ఘట్టం ముగిసింది. పార్టీల్లో గుబులు రేపిన రెబెల్స్ మాత్రం వెనక్కి తగ్గలేదు. నాయకుల విన్నపాలు, తాయిలాలు, హెచ్చరికలతో కొందరు తప్పుకొన్నా.. చాలా మంది తిరుగుబాటు నేతలు పోటీలోనే ఉన్నారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా వారు తలొగ్గలేదు. దీంతో అన్ని పార్టీలకు తలనొప్పి తప్పడం లేదు. ఏదో పంతానికి పోయి ప్రజల్లో పెద్దగా పట్టు లేకపోయినా బరిలో నిలిచిన వారు కొందరు కాగా, గెలుపోటములను ప్రభావితం చేయగలిగిన వారే ఎక్కువగా ఉండటంతో అనేక స్థానాల్లో పరిస్థితి ఆసక్తికరంగా మారింది. ఈసారి ప్రధాన పార్టీలన్నీ రెబెల్స్ ముప్పును ఎదుర్కొంటున్నాయి. అసలే కాంగ్రెస్-సీపీఐ పొత్తు ఆది నుంచీ అయోమయంగా మారగా, ఇప్పుడు రెబెల్స్ వల్ల ఆ పొత్తే నామమాత్రమైంది. సీపీఐకి కేటాయించిన ఏడు సీట్లలో మూడింటిలో కాంగ్రెస్ అభ్యర్థులు బరిలో నిలిచారు. వీరికి పార్టీ పెద్దలే సహకరిస్తున్నారన్న వాదన వినిపిస్తోంది. ఇక టీడీపీ-బీజేపీ పొత్తు వ్యవహారం కూడా గందరగోళంగా మారింది. కమలానికి కేటాయించిన సీట్లలో టీడీపీ, తమ్ముళ్లకు వదిలిన సీట్లలో బీజేపీ నేతలు పోటీ పడుతున్నారు. కీలక స్థానాల్లో ఈ పార్టీల మధ్య దోస్తీ చెడినట్లే కనిపిస్తోంది. ఖవ్ముం జిల్లాలోనైతే బీజేపీ బాహాటంగానే టీడీపీకి కటీఫ్ చెప్పబోతున్నట్లు సమాచారం. ఇక ముఖ్య నేతలు పోటీ చేస్తున్న చోట తిరుగుబాటు నేతల విషయం రసవత్తరంగా మారింది. జనగాంలో టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యకు, మెదక్ పార్లమెంట్, గజ్వేల్ అసెంబ్లీకి పోటీ చేస్తున్న టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు, పాలకుర్తి నియోజకవర్గంలో దేశం నేత ఎర్రబెల్లి దయాకర్రావుకూ రెబెల్స్ బెడద తప్పలేదు. జిల్లాలవారీగా రెబెల్స్‌ను పరిశీలిస్తే... వరంగల్: టీ-పీసీసీ చీఫ్‌కు సొంత ఇలాకాలోనే రెబెల్ బెడద తప్పలేదు. పొన్నాల పోటీ చేస్తున్న జనగాం అసెంబ్లీ స్థానం నుంచి పీసీసీ కార్యదర్శి బక్క జడ్సన్ రంగంలో ఉన్నారు. ఈయనను బరిలో నుంచి తప్పించే ప్రయత్నాలు విఫలమయ్యాయి. జనగాం స్థానంలో మొత్తం 19 మంది పోటీకి దిగారు. వీరిలో 8 మంది ఇండిపెండెంట్లే. ఇక నర్సంపేట స్థానాన్ని మొదట తనకు కేటాయించి తర్వాత.. జేఏసీ నేత కత్తి వెంకటస్వామి పేరును ప్రకటించడంపై ఆగ్రహానికి గురైన డీసీసీ అధ్యక్షుడు దొంతి మాధవరెడ్డి పార్టీకి, పదవికి రాజీనామా చేసి స్వతంత్రంగా పోటీకి దిగారు. పాలకుర్తిలో కాంగ్రెస్ రెబెల్ లక్ష్మీనారాయణ నాయక్ బరిలో ఉన్నారు. ఈయన సతీమణి ధన్వంతి.. పీసీసీ క్రమశిక్షణా సంఘం సభ్యురాలిగా ఉండటం గమనార్హం. ఇక్కడ టీడీపీ నేత దయాకర్‌రావుకు పోటీగా సొంత పార్టీ నేత ఎర్రబెల్లి రాఘవరావు సై అంటే సై అంటున్నారు. కరీంనగర్: మంథనిలో టీఆర్ఎస్ రెబెల్ సుధీర్ రెడ్డి బరిలో నిలిచారు. రామగుండంలో టీఆర్ఎస్ రెబెల్ కూరకంటి చందర్, కాంగ్రెస్ రెబెల్ కౌశిక్ హరి, కోరుట్ల నియోజకవర్గంలో జువ్వాడి రత్నాకర్‌రావు కొడుకు జువ్వాడి నర్సింగరావు కాంగ్రెస్ రెబెల్‌గా పోటీలో ఉన్నారు. ఖమ్మం: జిల్లాలో టీడీపీ-బీజేపీ పొత్తుకు బ్రేక్ పడింది. టీడీపీతో కటీఫ్ అని జిల్లా బీజేపీ ఆదివారం అధికారికంగా ప్రకటించే అవకాశముంది. ఇందుకోసం జిల్లా నేతలు సమావేశమం ఏర్పాటు చేసుకుంటున్నారు. పొత్తులో భాగంగా బీజేపీకి పినపాక నియోజకవర్గం దక్కింది. అయితే అక్కడ టీడీపీ నుంచి పాయం నర్సింహారావు పోటీలో ఉన్నారు. ఇది కమలనాథులకు తీవ్ర ఆగ్రహం తెప్పించింది. దీంతో టీడీపీకి సహకరించేది లేదని జిల్లా బీజేపీ నేతలు తేల్చి చెబుతున్నారు. ఇక కేంద్ర మంత్రి బలరాం నాయక్‌కు రెబెల్ బెడద తప్పినప్పటికీ తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కోనున్నారు. మహబూబాబాద్ ఎంపీ బలరాం నాయక్, ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్యలను ఓడించాలంటూ లంబాడీ, కోయ సామాజిక వర్గాలు ఏకంగా ఓ సమన్వయ కమిటీని వేసుకున్నాయి. ఆ ఇద్దరికీ వ్యతిరేకంగా ప్రచారం చేయాలని నిర్ణయించుకున్నాయి. నల్గొండ: సీపీఐకి కేటాయించిన మునుగోడు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ నేత పాల్వాయి గోవర్ధన్ రెడ్డి కూతురు స్రవంతి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉన్నారు. బీజేపీ-టీడీపీ పొత్తుకూ జిల్లాలో తీవ్ర వ్యతిరేకత వస్తోంది. పొత్తులో భాగంగా సూర్యాపేటను టీడీపీకి కేటాయించారు. ఇక్కడ బీజేపీ రెబెల్ సంకినేని వెంకటేశ్వరరావు బరిలో నిలిచారు. నల్గొండ అసెంబ్లీ నియోజకవర్గం బీజేపీకి దక్కగా.. ఇక్కడ టీడీపీ రెబెల్ కంచర్ల భూపాల్ రెడ్డి సై అంటున్నారు. మహబూబ్‌నగర్: టీడీపీకి కేటాయించిన నారాయణపేటలో.. బీజేపీ నేత రతన్పాండ్ రెడ్డి పార్టీకి రాజీనామా చేసి స్వతంత్రంగా బరిలో నిలిచారు. మహబూబ్‌నగర్ అసెంబ్లీ టికెట్ ఇవ్వకపోవడంతో టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌కు వెళ్లిన ఇబ్రహీంకు అక్కడా నిరాశే మిగలడంతో ఆయన మహబూబ్‌నగర్ పార్లమెంటు, అసెంబ్లీ స్థానాలకు స్వతంత్రంగా బరిలో ఉన్నారు. మెదక్: మెదక్ పార్లమెంటుతో పాటు గజ్వేల్ అసెంబ్లీలోనూ కేసీఆర్‌కు రెబెల్ బెడద తప్పలేదు. మెదక్ పార్లమెంటు పరిధిలో కేసీఆర్ మీద ఆ పార్టీ నేత బీరయ్య యాదవ్ పోటీలో ఉన్నారు. ఇక గజ్వేల్ అసెంబ్లీ బరిలో రెబెల్ కేశిరెడ్డి లింగారెడ్డి బరిలో నిలిచారు. పటాన్‌చెరువులో టీడీపీ అభ్యర్థికి బీజేపీ నేత అంజిరెడ్డి రూపంలో ముప్పు పొంచి ఉంది. నిజామాబాద్: జుక్కల్‌లో కాంగ్రెస్ జిల్లా మహిళా అధ్యక్షురాలు అరుణతార రెబెల్‌గా తిరుగుబాటు చేశారు. ఇదే నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే పండరీ కూడా టీఆర్ఎస్ రెబెల్‌గా బరిలో ఉన్నారు. బోధన్‌లో టీడీపీ రెబెల్ అమర్నాథ్ బాబు పోటీలో నిలిచారు. రంగారెడ్డి: మేడ్చల్‌లో టీడీపీ ఇన్చార్జ్ నక్క ప్రభాకర్‌గౌడ్ స్వతంత్రంగా పోటీకి దిగారు. ఇక్కడ జంగయ్య యాదవ్‌కు టీడీపీ టికెట్ లభించింది. మహేశ్వరంలో మల్రెడ్డి రంగారెడ్డికి షరతులతో కూడిన బీఫారం ఇచ్చామని, ఆయన్ని వైదొలగాలని ఆదేశించామని చెప్పుకొచ్చిన కాంగ్రెస్.. చివరకు ఆయన్ని బరి నుంచి తప్పించలేకపోయింది. దీంతో ఇక్కడ సీపీఐకి తలనొప్పి తప్పలేదు. హైదరాబాద్: గోషామహల్లో బీజేపీ అభ్యర్థి రాజాసింగ్‌కు సొంత పార్టీ నేత నందకిషోర్ వ్యాస్ రెబెల్‌గా మారారు. -
సీపీఐకి కాంగ్రెస్ రెబెల్స్ బెడద
సాక్షి, హైదరాబాద్: తమ ఎజెండాను పక్కనపెట్టి మరీ పొత్తు పెట్టుకున్న సీపీఐకి కాంగ్రెస్ గట్టి ఝలక్ ఇచ్చింది. పొత్తులో భాగంగా సీపీఐకి కేటాయించిన ఏడు స్థానాల్లో మూడుచోట్ల ఆ పార్టీకి కాంగ్రెస్ రెబెల్స్ నుంచి బెడద తప్పలేదు. వారిని ఉపసంహరింపచేయాలని సీపీఐ నాయకత్వం కాంగ్రెస్‌ను కోరినా ఫలితం లేకపోయింది. నిజానికి ఒప్పందం మేరకు తొమ్మిది స్థానాలను సీపీఐకి కాంగ్రెస్ కేటాయించాలి. కానీ అభ్యర్థుల ప్రకటన వెలువరించేనాటికి రెండు స్థానాలకు కోత విధించింది. తీరా నామినేషన్లు దాఖలు నాటికి మరో స్థానానికి ఎసరు పెట్టింది. పొత్తులో భాగంగా సీపీఐకి వదిలిన స్థానాల్లో రెబెల్స్ బరిలో దిగకుండా అడ్డుకోవాల్సిన కాంగ్రెస్ పెద్దలు ఏకంగా మహేశ్వరం నియోజకవర్గానికి తమ పార్టీకి చెందిన మల్రెడ్డి రంగారెడ్డికి బీ-ఫారం అందజేసేసరికి కమ్యూనిస్టులు కంగుతిన్నారు. దీనిపై నష్టనివారణ చర్యల కోసం సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.నారాయణ చేసిన ప్రయత్నాలు సఫలం కాలేదు. రెబెల్స్ నామినేషన్లను ఉపసంహరింపచేయాలని టి-పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యను అభ్యర్థించినా ఫలితం లేకపోయింది. మహేశ్వరం విషయంలో కొన్ని షరతులతో బీ-ఫారం అందజేశామని, బరిలో నుంచి మల్రెడ్డి తప్పుకునేలా చేస్తామని పొన్నాల ప్రకటించినా ఆ ప్రయత్నం జరగలేదు. మరోవైపు పొత్తులో భాగంగా కేటాయించిన మునుగోడు, బెల్లంపల్లి నియోజకవర్గాల్లోనూ కాంగ్రెస్ రెబెల్స్ బరిలోనే ఉన్నారు. మునుగోడులోనైతే ఏకంగా కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్ధ్దన్‌రెడ్డి కుమార్తె స్రవంతి బరిలో నిలిచారు. బెల్లంపల్లిలో కాంగ్రెస్ నేత చినుముల శంకర్ పోటీనుంచి తప్పుకోలేదు. వీరిని బరినుంచి తప్పించేందుకు సీపీఐ నేతలు చేసిన ప్రయత్నాలు సఫలం కాలేదు. దీంతో సీపీఐ నాయకత్వం తీవ్ర అసహనం వ్యక్తం చేస్తోంది. -
నేడే తేలేది..
నేడే తేలేది.. బరిలో మిగిలేదెవరో.. తప్పుకునేదెవరో! ఊపందుకున్న బుజ్జగింపులు ప్రచారాస్త్రాలతో సమరాంగణంలోకి.. వ్యూహ ప్రతివ్యూహాలకు పదును సాక్షి, సిటీబ్యూరో: వాడివేడి వ్యూహాలు.. బుజ్జగింపులు..బేరసారాలు.. సిద్ధమైన ప్రచారాస్త్రాలు.. గ్రేటర్లో ఎన్నికల వాతావరణం వేడెక్కింది. హోరాహోరీ పోరులో అమీతుమీ తేల్చుకునేందుకు అభ్యర్థులంతా నేటి నుంచి సమరాంగణంలోకి దూకనున్నారు. శనివారం నామినేషన్ల ఉపసంహరణకు చివరి రోజు కావడంతో ఆయా పార్టీల నుంచి రెబల్స్‌గా బరిలో దిగిన వారిని బుజ్జగించే యత్నాలు జోరందుకున్నాయి. రెబల్స్ నామినేషన్లను ఉపసంహరించుకోకుంటే ఎన్నికల బ్యాలెట్లో వారి పేరుంటుంది. దీన్ని నివారించేందుకు ఆయా పార్టీల ప్రధాన అభ్యర్థులు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. పలుచోట్ల పోటీ నుంచి తప్పుకునేందుకు రెబల్స్ ససేమిరా అంటున్నారు. వెనక్కి తగ్గబోమని తెగేసి చెబుతున్నారు. ఈ పరిణామాలు ఉత్కంఠ కలిగిస్తున్నాయి. పోటాపోటీగా ప్రచార సన్నాహాలు తుదిగా బరిలో ఎవరెవరు ఉంటారో నేడు తేలిపోనుంది. ప్రత్యర్థులెవరో దాదాపు తెలిసిపోయింది. దీంతో ప్రధాన పార్టీల అభ్యర్థులు ప్రచారాస్త్రాలకు పదును పెడుతున్నారు. హంగు ఆర్భాటాలు, అనుచరగణంతో జనంలోకి వెళ్లేందుకు సర్వం సిద్ధం చేసుకుంటున్నారు. ఈసారి గ్రేటర్ హైదరాబాద్‌లో ప్రచార కార్యక్రమాల్ని ఆయా పార్టీల ముఖ్య నాయకులు ప్రారంభించనుండటం ఆసక్తి కలిగిస్తోంది. వైఎస్సార్సీపీ ముఖ్య నాయకురాలు వైఎస్ షర్మిల, టీడీపీ, టీఆర్ఎస్ అధినేతలు చంద్రబాబు, కేసీఆర్ గ్రేటర్ వ్యాప్తంగా రోడ్‌షోలు, ర్యాలీలు, బహిరంగసభలు నిర్వహించనున్నారు. ఆయా కార్యక్రమాలకు భారీగా జనాన్ని తరలించేందుకు అభ్యర్థులు ఏర్పాట్లు చేస్తున్నారు. పార్టీ ముఖ్యనేతల రాక తమకు అనుకూలంగా మారుతుందని, కార్యకర్తల్లో ఊపు తెస్తుందని వారంతా భావిస్తున్నారు. అధికారులకు ఈవీఎంల బెడద నామినేషన్ల ఉపసంహరణకు శనివారం చివరి రోజు కావడంతో, చివరకు బరిలో ఎందరు మిగులుతారనే దానిపై ఎన్నికల అధికారులు దృష్టి పెట్టారు. పోలింగ్‌కు వినియోగించే ఈవీఎంలలో మొత్తం 16 బటన్లుండగా, వీటిలో ఒకటి ‘నోటా’కు పోను 15 పార్టీ చిహ్నాల డిస్ప్లేకు వీలుంటుంది. అంతకుమించి రంగంలో మిగిలితే మరో ఈవీఎంను అదనంగా వాడాల్సిందే. శనివారం ఈ విషయంలో స్పష్టత ఏర్పడనుంది. కొందరు దారిలో.. ఇంకొందరు బరిలోనే.. శేరిలింగంపల్లిలో కాంగ్రెస్ రెబల్ అభ్యర్థి, హఫీజ్‌పేట కార్పొరేటర్ జగదీశ్వర్‌గౌడ్.. ప్రజల మద్దతున్న తాను పోటీలోనే ఉంటానని చెబుతున్నారు. పలు బస్తీలవాసులు ఆయనను కలిసి అండగా నిలుస్తున్నారు. దీంతో ఆయన మనసు మారే పరిస్థితి కనిపించట్లేదు. ఆయన పోటీలో ఉంటే అది లోక్‌సభ ఎన్నికల్లోనూ ప్రభావం చూపుతుందని భావిస్తున్న చేవెళ్ల లోక్‌సభ అభ్యర్థి కార్తీక్‌రెడ్డి, ఆయన తల్లి సబితా ఇంద్రారెడ్డి జగదీశ్వర్‌గౌడ్‌ను పోటీ నుంచి తప్పించే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది శేరిలింగంపల్లిలో టీడీపీకీ రెబల్ పోటు తప్పేలా లేదు. మొవ్వా సత్యనారాయణ పట్టు వీడేది లేదని చెబుతున్నారు. గడువులోగా ఆయన ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాల్సిందే ఎల్బీనగర్ నుంచి టీడీపీ తిరుగుబాటు అభ్యర్థి సామ రంగారెడ్డి పోటీలో ఉంటాననే చెబుతున్నారు సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీడీపీ రెబల్స్‌గా బరిలో ఉన్న పీఎల్ శ్రీనివాస్, బద్రినాథ్, ఏడుకొండ లు ఆంతర్యం పార్టీ వర్గాలకు అంతుబట్టడం లేదు గోషామహల్లో పార్టీ అభ్యర్థికి సవాల్ విసురుతున్న గోవింద్‌రాఠి, నందకిశోర్‌వ్యాస్, రామస్వామిలను బుజ్జగించడంలో బీజేపీ అధిష్ఠానం కొంతమేర సఫలమైనట్లు తెలుస్తోంది ముషీరాబాద్‌లో కాంగ్రెస్ రెబల్స్ సునీతాప్రకాశ్, బీసీ సెల్ చైర్మన్ నగేష్ముదిరాజ్లను బుజ్జగించే ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. పార్టీ అభ్యర్థి డాక్టర్ వినయ్‌కుమార్ సునీతా ప్రకాశ్ ఇంటికి వెళ్లి సహకరించాలని కోరడంతో ఆమె మెత్తబడ్డట్లు సమాచారం. నగేశ్ ముదిరాజ్‌ను దారిలోకి తెచ్చుకునే పనిలో పీసీసీ ఉన్నట్టు తెలుస్తోంది -
అసంతృప్తులకు బుజ్జగింపులు
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి : అసంతృప్తులను దారికి తెచ్చుకునేందుకు అధిష్టానాలు రంగంలోకి దిగాయి. తిరుగుబాటు అభ్యర్థులుగా బరిలోకి దిగిన నేతలను సముదాయించే పనిలో పడ్డాయి. నామినేషన్ల ఉపసంహరణకు శనివారం ఆఖరు రోజు కావడంతో బుజ్జగింపులను ముమ్మరం చేశాయి. ఇప్పటికే కొందరు అభ్యర్థులు అధిష్టానం మంతనాలతో మెత్తబడ్డా, మరికొందరు మాత్రం పట్టుదలగా ఉన్నారు. పోటీలో కొనసాగుతామని తెగేసి చెబుతుండడం పార్టీ నేతలను కలవరపరుస్తోంది. అభ్యర్థుల విజయావకాశాలను ప్రభావితం చేసే రెబల్స్‌ను పోటీ నుంచి తప్పించేందుకు వీలైనన్ని తాయిలాలు ప్రకటిస్తున్నారు. ప్రధానంగా కాంగ్రెస్, టీడీపీలకు తిరుగుబాటు సెగ ఎక్కువగా ఉంది. ఎల్బీనగర్ స్థానాన్ని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్యకు ఇవ్వడంతో అలకబూనిన టీడీపీ సీనియర్లు కృష్ణప్రసాద్, సామ రంగారెడ్డి నామినేషన్లు దాఖలు చేశారు. వీరిలో కృష్ణప్రసాద్ నామినేషన్ తిరస్కరణకు గురికాగా, రంగారెడ్డి మాత్రం ఇంకా బరిలోనే ఉన్నారు. నామినేషన్‌ను విత్‌డ్రా చేసుకోవాలని అధిష్టానం పెద్దలు సూచించినా ఆయన లెక్కచేయడం లేదు. ‘వస్తున్నా.. మీకోసం’ యాత్రతోపాటు ఇతర పార్టీ కార్యక్రమాలకు విశేష సేవలందించిన తనను పార్టీ నట్టేట ముంచిందని ఆగ్రహంతో ఉన్న రంగారెడ్డి.. పోటీలో ఉంటానని కరాఖండిగా చెబుతున్నారు. మరోవైపు శేరిలింగంపల్లిలోనూ ఆ పార్టీ ఇన్చార్జి మొవ్వా సత్యనారాయణ సైతం అధిష్టానం బుజ్జగింపులకు లొంగడంలేదు. తిరుగుబాటు అభ్యర్థిగా బరిలో ఉంటానని తేల్చిచెప్పారు. అలాగే ఇదే నియోజకవర్గంలో కాంగ్రెస్ రెబల్ అభ్యర్థిగా పోటీచేస్తున్న కార్పొరేటర్ జగదీశ్వర్‌గౌడ్ పోటీ నుంచి తప్పుకునేది లేదని అధిష్టానానికి స్పష్టం చేస్తున్నారు. చేవెళ్ల పార్లమెంటు అభ్యర్థి కార్తీక్‌రెడ్డి వారించినా కూడా జగదీశ్వ ర్ చల్లబడనట్లు తెలిసింది. ఇదిలావుండగా, మేడ్చల్ టికెట్‌ను తోటకూర జంగయ్యయాదవ్‌కు ఇవ్వడాన్ని నిరసిస్తూ టీడీపీ సీనియర్ నేతలు నందారెడ్డి, నక్కా ప్రభాకర్‌గౌడ్, హరివర్దన్‌రెడ్డి నామినేషన్లు వేశారు. వీరిలో హరి వర్దన్, నందారెడ్డితో ఆ పార్టీ అభ్యర్థి జంగయ్యయాదవ్ జరిపిన చర్చలు సఫలమైనట్లు తెలుస్తోంది. వీరువురు రాజీకొచ్చినా.. నక్కా మాత్రం పంతం వీడడంలేదు. స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగి తన సత్తా చూపుతానని సవాల్ విసురుతున్నారు. మరోవైపు మేహ శ్వరంలో మజ్లిస్ అభ్యర్థి అహ్మద్ నామినేషన్‌ను విత్‌డ్రా చేసుకుంటున్నట్లు ప్రకటించారు. కాంగ్రెస్‌కు అనుకూలంగా ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ఇదే నియోజకవర్గంలో బలమైన ఓ అభ్యర్థిని కూడా పోటీ నుంచి తప్పుకోవాలని వివిధ రకాలుగా ఒత్తిడి చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇబ్రహీంపట్నం టికెట్ దక్కకపోవడంతో బరిలో నిలిచిన మల్రెడ్డి సోదరులు కూడా నామినేషన్ ఉపసంహరణపై ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. మరోవైపు పొత్తులో భాగంగా సీపీఐకి కేటాయించినప్పటికీ కాంగ్రెస్ మల్రెడ్డి రంగారెడ్డి చేత నామినేషన్ వేయించింది. ఈయన ఉపసంహరణ విషయం కూడా నేడు తేలనుంది. టీడీపీ పోటీ చేస్తున్న మహేశ్వరం, మేడ్చల్, చేవెళ్ల పార్లమెంటులకు బీజేపీ కూడా అభ్యర్థులను నిలిపింది. వీరిపై కూడా శనివారం ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. -
ససేమిరా
టీడీపీ, కాంగ్రెస్, బీజేపీల్లో మోగుతున్న రె‘బెల్స్’ పోటీ నుంచి తప్పుకునేందుకు ‘నో’ అమీతుమీకే సిద్ధమంటున్న తిరుగుబాటుదార్లు బరి నుంచి తప్పించేందుకు ముఖ్య నేతల యత్నాలు బుజ్జగింపులు.. బేరసారాలు పార్టీ పదవులు ఎరగా మంతనాలు సాక్షి, సిటీబ్యూరో: ప్రధాన పార్టీలను రెబల్స్ బెడద దడదడలాడిస్తోంది. పలు నియోజకవర్గాల్లో తిరుగుబాటు అభ్యర్థులుగా నామినేషన్లు దాఖలు చేసిన నేతలు పోటీ నుంచి తప్పుకునేందుకు ససేమిరా అంటున్నారు. నామినేషన్ల ఘట్టం ముగియగానే.. ఆయా పార్టీల నుంచి స్వతంత్రులుగా పోటీకి దిగిన వారిని బరి నుంచి తప్పించేందుకు బుజ్జగింపులు, బేరసారాలు మొదలయ్యాయి. కొందరు రెబల్స్ దారిలోకి వచ్చే పరిస్థితి కనిపిస్తుండగా, మరికొందరు మాత్రం అధిష్ఠానంతో అమీతుమీకే సిద్ధమవుతున్నారు. వీరు ఆయా నియోజకవర్గాల్లో పార్టీ అభ్యర్థులకు ముచ్చెమటలు పట్టిస్తున్నారు. ప్రధానంగా ఎల్బీనగర్, శేరిలింగంపల్లి వంటి చోట్ల దడ పుట్టిస్తున్నారు. ఇప్పటి దాకా టికెట్ల కోసం అవస్థలు పడ్డ టీడీపీ, కాంగ్రెస్, బీజేపీల్లోని అభ్యర్థులు ఇప్పుడు సొంత పార్టీల నుంచే స్వతంత్రులుగా సవాల్ విసురుతున్న వారిని నయానో భయానో పోటీ నుంచి తప్పించే పనిలో పడ్డారు. నామినేషన్ల ఉపసంహరణకు ఇంకా రెండ్రోజుల సమయం ఉన్నందున వారిని బుజ్జగించి తమ వైపు తిప్పుకునేందుకు యోచిస్తున్నారు. ఇది కాని పక్షంలో బేరసారాలకూ సిద్ధమవుతున్నారు. భవిష్యత్తులో తగిన అవకాశాలు కల్పిస్తామని, తమ గెలుపునకు సహకరించాలని కోరుతున్నారు. ఈ ప్రయత్నాలు ఏ మేరకు ఫలిస్తాయో చూడాల్సిందే. రెబల్స్ దారిలోకి వస్తారా? లేక బరిలోనే నిలుస్తారా అనేది శనివారం నాటికి కానీ తెలిసేలా లేదు. మాట వినని వారిని అంతిమంగా సస్పెండ్ చేయడమో.. లేదంటే పార్టీ నుంచి బహిష్కరించడమో చేస్తారని అంచనా వేస్తున్నారు. అంతకుముందు సామ, దాన, భేద, దండోపాయాలన్నీ ప్రయోగించనున్నారు. ‘కమలం’లో కలకలం భారతీయ జనతా పార్టీ.. సొంత పార్టీ నుంచే స్వతంత్రులుగా పోటీకి దిగిన వారితో ఇబ్బందులు పడుతోంది. ఓవైపు నామినేషన్ల ఉపసంహరణకు ముంచుకొస్తున్న గడువు.. మరోపక్క వెనక్కి తగ్గనంటున్న రెబల్స్.. ఈ క్రమంలో తిరుగుబాటు అభ్యర్థులను ఏదోలా దారిలోకి తెచ్చుకొనేందుకు ముఖ్య నేతలు నేరుగా రంగంలోకి దిగారు. రెబల్స్‌ను శుక్రవారం పార్టీ కార్యాలయానికి పిలిపించి చర్చించాలని నిర్ణయించారు. అగ్రనేతలు కిషన్‌రెడ్డి, దత్తాత్రేయ, బి.వెంకటరెడ్డి ఇప్పటికే పలువురికిఫోన్లు చేసి బుజ్జగించే ప్రయత్నం చేశారు. పార్టీ పదవులిస్తామని, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కొందరికి సీట్లిస్తామని గట్టి హామీలిస్తున్నారు. గోషామహల్ టికెట్ ఆశించి భంగపడిన నలుగురు నేతలు రెబల్స్‌గా రంగంలోకి దిగారు. వీరిలో నందకిషోర్ వ్యాస్ తన నామినేషన్ ఉపసంహరణకు ససేమిరా అంటున్నారు. ఫోన్ ద్వారా బుజ్జగించేందుకు యత్నించిన పార్టీ నాయకులను ఆయన ‘ఇంతకాలం నేను చేసిన సేవలన్నీ వృథాయేనా?’ అని నిలదీశారు. స్వతంత్రుడిగా బరిలో నిలిచి తన బలమేంటో చూపిస్తానని అంటున్నారు. రఘునందన్ యాదవ్, రామస్వామి, గోవింద్‌రాఠి కూడా బరిలోనే ఉంటామంటున్నారు. పార్టీ పదవులు, ఇతరత్రా తాయిలాలు ఆశ చూపుతున్నా వీరెవరూ దారికొచ్చే పరిస్థితి కనిపించట్లేదు. రె‘బెల్స్’ మోత ఎక్కడెక్కడంటే.. ఎల్బీనగర్ అసెంబ్లీ టీడీపీ టికెట్‌ను ఆర్.కృష్ణయ్యకు ఇవ్వడంతో ఆ పార్టీ నేతలు సామ రంగారెడ్డి, ఎస్వీ కృష్ణప్రసాద్ పోటాపోటీగా నామినేషన్లు వేశారు. వీరిలో కృష్ణప్రసాద్ నామినేషన్ స్క్రూటినీలో చెల్లలేదు. సామ రంగారెడ్డి.. బరిలోనే ఉంటానని చెబుతున్నారు. ఎంతోకాలంగా పార్టీ బలోపేతానికి కృషి చేసిన వారిని కనీసం పరిగణనలోకి తీసుకోకుండా, హఠాత్తుగా దింపిన అభ్యర్థికి సహకరించేది లేదని, రంగంలోనే నిలిచి ఏదో ఒకటి తేల్చుకుంటానని రంగారెడ్డి అంటున్నారు. సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీడీపీ ప్రత్యర్థిగా పోటీకి దిగిన పీఎల్ శ్రీనివాస్ పార్టీకి రాజీనామాచేసి ఇండిపెండెంట్‌గా సవాల్ విసురుతున్నారు. బాబు మోసగాడని ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. ముషీరాబాద్‌లో కాంగ్రెస్ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఇక్కడి నుంచి కాంగ్రెస్ అభ్యర్థికి వ్యతిరేకంగా నామినేషన్లు వేసిన ఆ పార్టీకి చెందిన బీసీ సెల్ నాయకుడు నగేష్ ముదిరాజ్, అడిక్‌మెట్ కార్పొరేటర్ సునీతాప్రకాశ్‌గౌడ్.. ఇద్దరిలో ఒకరు పోటీ నుంచి తప్పుకుని ఒక్కరే బలమైన ప్రత్యర్థిగా నిలిచి పార్టీకి సవాల్ విసరాలని యోచిస్తున్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్ రెబల్‌గా జగదీశ్వర్‌గౌడ్, టీడీపీ రెబల్‌గా మొవ్వా సత్యనారాయణ అమీతుమీ తేల్చుకోవడానికి సిద్ధమయ్యారు. సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి బరిలో దిగిన మరో ఇద్దరు టీడీపీ రెబెల్స్ ఏడుకొండలు, బద్రినాథ్‌యాదవ్.. దారికొచ్చేది లేదని తెలుస్తోంది. వీరిలో ఏడుకొండలు టీడీపీ నమ్మించి వంచించిందని దుమ్మెత్తి పోస్తున్నారు. -
మోగుతున్న రెబెల్స్
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : ప్రధాన పార్టీల అభ్యర్థులకు రెబెల్స్ నుంచి ఇంకా ముప్పు తప్పలేదు. లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలలో ఆయా పార్టీల నుంచి టికెట్లు ఆశించి భంగపడ్డ నేత లు అసంతృప్తి సెగలు వెళ్లగక్కుతూనే ఉన్నారు. పార్టీ అధిష్టానాలు బుజ్జగింపులు మొదలు పెట్టినప్పటికీ నామినేషన్లు వేసిన తిరుగుబాటు అభ్యర్థులు మెత్తపడడం లేదు. ఇందుకు కాంగ్రెస్, టీ ఆర్ఎస్, టీడీపీ, బీజేపీలో ఏ పార్టీ అతీతం కాదు. ఏళ్ల తరబడి అవకాశం కోసం ఎదురు చూస్తున్న నాయకులకు టికెట్ దక్కకపోగా, ఆశలు గల్లంతు కావడా న్ని జీర్ణించుకోలేక పోతున్నారు. కాంగ్రెస్ పార్టీ టికెట్ చేజారిన ఆశావహులు అవమాన భారంతో ఇంటి గడప దాటడం లేదు. టీఆర్ఎస్ టికెట్ రాని నేతలు పార్టీ అభ్య ర్థులతో కలిసి తిరుగుతున్నా మనోవేదన నుంచి పూర్తిగా కోలుకోలేక పోతున్నారు. అనూహ్యంగా తెరపైకి వచ్చిన పొత్తులతో ఆశలు గల్లంతైనా బీజేపీ నేతలు చాలాచోట్ల టీడీపీ నేతల ఓటమిని కళ్లచూడాలన్న శపథంలో ఉన్నారు. బుధవారం నామి నే షన్ల పర్వం ముగియగా, రెబల్స్‌గా బరిలోకి దిగిన అభ్యర్థులను బుజ్జగించే పనిలో ప్రధాన పార్టీలు నిమగ్నం అయ్యాయి. ‘బి’ఫారాలు సమర్పించకుండా, డమ్మీలుగా వేసిన పలువురి నామినేషన్లు గురువారం తిరస్కరణకు గురయ్యాయి. ఆయా పార్టీలకు వ్యతిరేకంగా పనిచేసేందుకు అసంతృప్తులు సిద్ధమవుతున్నారు. రెబెల్స్ ఉప సంహరణకు టీడీపీ గురువారం రాత్రి వేసిన త్రిసభ్య కమిటీలో జిల్లాకు చెందిన మండవ వెంకటేశ్వర్రావుకు స్థానం కల్పించగా, జిల్లాలో ఆ పార్టీకే ఎక్కువ మంది రెబల్స్‌గా ఉన్నారు. చేతికి చిక్కే కాంగ్రెస్ పార్టీలో టికెట్ల గోల రగులుతూనే ఉంది. నిజామాబాద్ అర్బన్‌లో కాంగ్రెస్ అభ్యర్థి బొమ్మ మహేశ్‌కుమార్ గౌడ్‌కు అసంతృప్తి పొంచి ఉంది. ఆయన అభ్యర్థి త్వాన్ని ఇతర నాయకులు కొందరు తట్టుకుని కలిసి నడిచే పరిస్థితిలో లేరు. బాన్సువాడ కాంగ్రెస్ టికెట్ కాసుల బాలరాజుకు ఇవ్వడాన్ని నిరసిస్తూ నామినేషన్ వేసిన ఆ పార్టీ నేతలు సంగెం శ్రీనివాస్‌గౌడ్, మాసాని శ్రీనివాస్‌రెడ్డి తాడోపేడో తేల్చుకుంటామంటున్నారు. జుక్కల్‌లో కాంగ్రెస్ అభ్యర్థి సౌదాగర్ గంగాధర్‌కు రెబల్‌గా జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు అరుణతార ఉన్నారు. ఎల్లారెడ్డిలో నల్లమడుగు సురేందర్‌కు మాజీ ఎమ్మెల్యే జనార్దన్‌గౌడ్ గండం ఉంది. కమలానికి ‘నో’ ఎల్లారెడ్డి నియోజకవర్గంలో పొత్తులో భాగంగా ఉన్న బీజేపీ అభ్యర్థిని టీడీపీ నేత బాన్సువాడ సుభాష్‌రెడ్డి వ్యతిరేకిస్తున్నారు. ఆయన తన అభ్యర్థిత్వానికి మద్దతు ఇవ్వాలని కోరుతూ ఎన్నికలలో ప్రచారానికి సిద్ధమయ్యారు. నిజామాబాద్ ఎంపీ స్థానం కోసం బీజేపీ టికెట్‌పై ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ నామినేషన్ వేయ గా, ప్రముఖ వ్యాపారవేత్త పొద్దుటూరి సదానందరెడ్డి పోటీగా ఉన్నారు. బాల్కొండలో టీడీపీ అభ్యర్థి డాక్టర్ మల్లికార్జున్‌రెడ్డికి బీజేపీ నేత ముత్యాల సునీల్‌రెడ్డి, బోధ న్లో టీడీపీ అభ్యర్థి మేడపాటి ప్రకాశ్‌రెడ్డికి బీజేపీ నేత కెప్టెన్ కరుణాకర్‌రెడ్డి బెడద ఉంది. గులాబీకీ గుబులే తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థులకు అసంతృప్తి చాపకింది నీరులా ఉంది. జహీరాబాద్ ఎంపీ అభ్యర్థి భీంరావ్ బస్వంత్‌రావు పాటిల్‌పై ఇటు నాయకులలోనూ అటు కేడర్‌లోనూ అసంతృప్తి వ్యక్తమవుతోంది. మహారాష్ర్టలో వ్యాపారిగా స్థిరపడిన బీబీ పాటిల్‌కు తెలుగు రాకపోగా, ఓటర్లను ఎలా ఆకట్టుకుంటారన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కార్యకర్తలకు దూరంగా ఉంటున్న ఆయన ఎలా నెట్టుకొస్తారన్న చర్చ కూడ ఆ పార్టీలో ఉంది. జుక్కల్ అభ్యర్థి హన్మంత్సింధేపై మాజీ ఎమ్మెల్యే పండరి పోటీకి సిద్ధమయ్యారు. మాజీ మంత్రి, టీఆర్ఎస్ అభ్యర్థి పోచారం శ్రీనివాస్‌రెడ్డికి రెబల్స్‌గా నామినేషన్ వేసిన గంగాధర్‌రావు దేశాయి, డి మాదవ్ యాదవ్ ఈసారి వ్యతిరేకంగా పనిచేసే అవకాశం ఉంది. నిజామాబాద్ అర్బన్‌లో అభ్యర్థి బిగాల గణేశ్‌గుప్త పట్ల పార్టీ ముఖ్య నేతల్లో సానుకూలత లేదు. టికెట్ ఆశించి భంగపడ్డ నేత లు ఆయన వెంట తిరుగుతున్నట్లు కనిపిస్తున్నా తెలియని అసంతృప్తిని క్యాడర్ వద్ద వ్యక్తం చేస్తున్నారన్న ప్రచారం ఉంది. ఇలా పలు నియోజకవర్గాల్లో టీఆర్ఎస్, కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ అభ్యర్థులకు అసంతృప్తుల భయం వెంటాడుతోంది. -
రెబెల్స్
కరీంనగర్ సిటీ, న్యూస్‌లైన్ : సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాన పార్టీల అభ్యర్థులకు రెబెల్స్ భయం పట్టుకుంది. ప్రత్యర్థుల కంటే సొంతపార్టీలోని తిరుగుబాటు నేతలతోనే ప్రమాదమని ఆందోళన చెందుతున్నారు. కాంగ్రెస్, టీఆర్ఎస్, టీడీపీ, బీజేపీ అన్ని పార్టీల్లోనూ టికెట్ దక్కని నేతలు తిరుగుబావుటా ఎగురవేశారు. స్వతంత్రులుగా బరిలో ఉంటామని నామినేషన్లు దాఖలు చేశారు. తాము గెలవకున్నా, పార్టీ అభ్యర్థిని ఓడించి టిక్కెట్ ఎంపిక తప్పని నిరూపించేందుకు కొంతమంది పోటీలో ఉంటున్నారు. నామినేషన్లపర్వం ముగియడంతో అన్ని పార్టీల్లోనూ రెబెల్స్ తెరపైకి వచ్చారు. ఇందు లో చాలా మటుకు తిరుగుబాటు అభ్యర్థులు పోటీలో ఉండేం దుకే మొగ్గుచూపుతున్నారు. కాంగ్రెస్ పార్టీలో రెబెల్స్ బెడద తీవ్రం గా ఉంది. కోరుట్ల నుంచి టికెట్ తనకే ఖాయమని ధీమాతో ఉన్న మాజీ మంత్రి జువ్వాడి రత్నాకర్‌రావు తనయుడు నర్సింగరావు అనూహ్యంగా కొమొరెడ్డి రామ్‌లుకు టికెట్ దక్కడంతో రెబెల్‌గా నామినేషన్ వేశారు. జూనియర్ జువ్వాడి పోటీతో కాంగ్రెస్ బెంబేలెత్తుతోంది. పెద్దపల్లిలో తనకంటూ సొంతవర్గాన్ని సృష్టించుకున్న మాజీ ఎమ్మెల్యే గీట్ల ముకుందరెడ్డి టికెట్ దక్కకపోవడంతో అనుచరవర్గంతో చర్చించి రెబెల్‌గా నామినేషన్ దాఖ లు చేశారు. పోటీలో ఉండాలని అనుచరవర్గం ఒత్తిడి తెస్తుండగా, ఒకటి రెండు రోజుల్లో గీట్ల నిర్ణయం ప్రకటించే అవకాశముంది. ఇదే స్థానం నుంచి కాంగ్రెస్ టికెట్ ఆశించిన రాష్ట్ర మత్స్య పారిశ్రామిక సహకార సంఘం అధ్యక్షుడు చేతి ధర్మయ్య మహాజన సోషలిస్టు పార్టీ తరపున నామినేషన్ వేశారు. రామగుండం అసెంబ్లీ టికెట్ ఆశించి భంగపడ్డ, కౌశిక హరి తిరుగుబాటు అభ్యర్థిగా బరిలో నిలిచారు. బుధవారం భారీ ర్యాలీతో వెళ్లి నామినేషన్ వేసి పార్టీ అభ్యర్థికి సవాల్ విసిరారు. హుజూరాబాద్ టికెట్ ఆశించిన కాంగ్రెస్ నాయకులు పరిపాటి రవీందర్‌రెడ్డి, ప్యాట రమేశ్, పాడి కౌశిక్‌రెడ్డి, ఇనుగాల భీంరావు నామినేషన్లు వేశారు. ప్యాట రమేష్, కౌశిక్ రెడ్డి కాంగ్రెస్ నుంచి వేయగా, పరిపాటి రవీందర్రావు, భీంరావు స్వతంత్రులుగా నామినేషన్ వేశారు. వేములవాడ నుంచి అల్లాడి రమేశ్ నామినేషన్ వేశారు. హుస్నాబాద్ నుంచి కాంగ్రెస్ టికెట్ రాకపోవడంతో న్యాయవాది వొంటెల రత్నాకర్ పోటీకి దిగారు. పెద్దపల్లి పార్లమెంట్ స్థానంలోనూ అదే పరిస్థితి. కాంగ్రెస్ టికెట్ ఖాయమని ప్రచారం జరిగిన గోమాస శ్రీనివాస్, వివేక్‌కు టికెట్ ఇవ్వడంతో రెబెల్‌గా బరిలో దిగారు. టీఆర్ఎస్లో.. రామగుండం మాజీ ఇన్చార్జి కోరుకంటి చందర్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీకి దిగారు. మంథని నుంచి టికెట్ ఆశించి భంగపడ్డ టీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి చందుపట్ల సునీల్‌రెడ్డి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. చొప్పదండి నుంచి టీఆర్ఎస్ టిక్కెట్ కోసం ప్రయత్నించిన సుంకె రవిశంకర్ నామినేషన్ వేసినప్పటికి బీ-ఫారం అందచేయకపోతే ఆయన పోటీలో ఉండే అవకాశం లేదు. పొసగని పొత్తులు పొసగని పొత్తులు పెట్టుకున్న బీజేపీ, టీడీపీల్లో పరిస్థితి మరింత అధ్వానంగా ఉంది. ఒక పార్టీకి కేటాయించిన స్థానంలో మరో పార్టీ, ఒక్క పార్టీలోనే ఇద్దరు నామినేషన్లు వేసి, ఆయా పార్టీలకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నారు. మానకొండూరు స్థానాన్ని టీడీపీకి కేటాయించగా, బీజేపీ టికెట్ ఆశించిన సీనియర్ నాయకుడు గడ్డం నాగరాజు స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగారు. టీడీపీకి చెందిన ఎడ్ల వెంకటయ్య సైతం నామినేషన్ వేశారు. వేములవాడ సీటును బీజేపీకి కేటాయించగా, అంతకుముందే టీడీపీ నుంచి గండ్ర నళిని నామినేషన్ వేశారు. హుస్నాబాద్‌లో బీజేపీ రెబెల్‌గా దుబ్బాక విష్ణువర్ధన్‌రెడ్డి నామినేషన్ వేశారు. చొప్పదండి స్థానాన్ని టీడీపీకి కేటాయించగా బీజేపీ టికెట్ ఆశించిన లింగంపల్లి శంకరయ్య, టీడీపీ టికెట్ ఆశించిన మ్యాక లక్ష్మణ్ స్వతంత్ర అభ్యర్థులుగా రంగంలో ఉన్నారు. ధర్మపురి బీజేపీకి ఇవ్వగా, టీడీపీ టికెట్ ఆశించిన రాజనర్సు స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేశారు. కోరుట్ల బీజేపీ టికెట్ ఆశించిన రఘు రెబెల్‌గా రంగంలోకి దిగారు. బీజేపీ టికెట్ ఆశించి భంగపడ్డ ఎడవెల్లి విజయేందర్‌రెడ్డి కరీంనగర్ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగారు. రామగుండం టికెట్ ఆశించిన పార్టీ రాష్ట్ర నేత బల్మూరి వనిత, టికెట్ రామకృష్ణారెడ్డికి ఇవ్వడంతో తిరుగుబాటు చేశారు. బుజ్జగింపులు షురూ.. పార్టీ నిర్ణయాన్ని ధిక్కరించి తిరుగుబావుటా ఎగురవేసిన నాయకులకు బుజ్జగింపులు మొదలయ్యాయి. రెబెల్స్ బరిలో ఉంటే తమ విజయం అసాధ్యమని భావిస్తున్న పార్టీలు నామినేటెడ్ పోస్టుల ఆశ చూపుతూ బుజ్జగిస్తున్నారు. -
అన్ని పార్టీల్లోనూ రె‘బెల్స్’
టికెట్ ఆశావహులు అనుకున్నంత పనిచేశారు. తమకు దక్కక పోవడంతో తమతమ పార్టీలకు ‘రెబెల్’లు మోగించారు. బుధవారం వారంతా నామినేషన్లు వేసి తమ అధినేతలకు సవాల్ విసిరారు. ఈ బెడద ‘హస్తానికి’ ఎక్కువగా ఉండగా బీజేపీ, టీడీపీల పొత్తు వికటించి అక్కడా తిరుగుబాట్లు కనిపిస్తున్నాయి. ఇక గులాబీ పక్షానికి ఈ చిక్కులు తప్పడం లేదు. ఉప సంహరణ అనంతరమూ వీరు రంగంలో ఉంటే ఆయా పక్షాలకు ఇక్కట్లే. సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: ప్రధాన రాజకీయ పార్టీల నుంచి టికెట్లు ఆశిస్తూ భంగపడిన ఔత్సాహికులు తిరుగుబాటు అభ్యర్థులుగా బరిలోకి దిగారు. కొందరు ముందస్తుగా నామినేషన్ వేసి టికెట్ కోసం ప్రయత్నించినా ప్రయోజనం దక్కలేదు. మ రికొందరు మాత్రం టికెట్ కోసం చివ రి నిముషం వరకు లాబీయింగ్ చేసినా దక్కక పోవడంతో స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్ దాఖలు చేశారు. కాంగ్రెస్ నుంచి అత్యధికంగా తిరుగుబాటు అభ్యర్థులు బరిలో ఉన్నారు. బీజేపీ, టీడీపీ పొత్తు మూలంగా టికెట్ ఆశించిన ఇరు పార్టీల నేతలు తిరుగుబాటు జెండా ఎగురవేశారు. నారాయణపేట సీటును బీజేపీకి కేటాయించక పోవడంతో పార్టీ జిల్లా అధ్యక్షుడు రతంగ్ పాండు రెడ్డి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. కాంగ్రెస్ నుంచి జడ్చర్ల టికెట్ ఆశించిన మార్కెట్ కమిటీ చైర్మన్ ఎం.రమేశ్‌రెడ్డి, కొల్లాపూర్ నుంచి విష్ణువర్దన్ రెడ్డి, మహబూబ్‌నగర్, నారాయణపేట నుంచి పులి అంజనమ్మ, టీఆర్ఎస్ టికెట్ దక్కక పోవడంతో కాంగ్రెస్‌లో చేరిన ఇబ్రహీం తిరుగుబాటు అభ్యర్థులుగా బరిలో ఉన్నారు. నామినేషన్ల పర్వం ముగియడంతో బరిలో ఉన్న అభ్యర్థులను బుజ్జగించేందుకు అధికాారిక అభ్యర్థులు, పార్టీలు సామ దాన బేద దండోపాయాలు ప్రయోగించేందుకు సిద్ధమవుతున్నాయి. ఈ నెల 11, 12న నామినేషన్ల ఉప సంహరణ ప్రక్రియ ఉండడంతో చివరి వరకు ఎందరు తిరుగుబాటు అభ్యర్థులు బరిలో ఉంటారో చూడాల్సిందే. -
తిరుగుబాటు!
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: తెలుగు తమ్ముళ్లు రోడ్డెక్కారు. అధిష్టానం ఖరారు చేసిన అభ్యర్థి కారుపై రాళ్లతో దాడి చేశారు. టికెట్లు దక్కకపోవడంతో నిరాశకు గురైన మరికొందరు తిరుగుబాటు జెండా ఎగురవేశారు. రెబల్స్‌గా నామినేషన్లు దాఖలు చేసి అధిష్టానానికి సవాల్ విసిరారు. తమ స్థానాలను బీజేపీ ఎగురేసుకుపోవడం.. సీనియర్లను కాదని ఇటీవల పార్టీలో చేరిన వారికి టికెట్లు కట్టబెట్టడంతో ఆశావహుల్లో అగ్రహం కట్టలు తెంచుకుంది. ఎల్బీనగర్ శాసనసభా స్థానానికి బీసీ సంక్షేమసంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య ను ఖరారు చేయడాన్ని జీర్ణించుకోలేని స్థానిక తెలుగుదేశం కార్యకర్తలు ఆయన కారుపై దాడి చేశారు. అంతేకాకుండా స్థానికేతరుడైన ఆర్.కృష్ణయ్యకు పోటీగా సీనియర్ నేతలు కృష్ణప్రసాద్, సామ రంగారెడ్డి నామినేషన్లు దాఖలు చేశారు. అధినాయకత్వం తీరును నిరసిస్తూ ఐదుగురు కార్పొరేటర్లు పార్టీకి రాజీనామా చేశారు. ఇది టీడీపీలో కలకలం సృష్టిం చింది. పొత్తులో భాగంగా మల్కాజిగిరి సీటును బీజేపీకి కేటాయిస్తున్నట్లు తెలియగానే ఎమ్మెల్యే మైనంపల్లి సహా పలువురు ముఖ్యనేతలు రాజీనా మా చేశారు. మరో ముగ్గురు బీజేపీకి ఇవ్వడాన్ని నిరసిస్తూ నామినేషన్లు వేశారు. ఈ పరిణామం మరి చిపోకముందే బుధవారం ఎల్బీనగర్లో ముఖ్యనేతల తిరుగుబాటు, శేరిలింగంపల్లి ఇన్చార్జి మొవ్వ సత్యనారాయణ పార్టీకి గుడ్‌బై చెప్పడంతో ‘దేశం’ నాయకత్వం నివ్వెరపోయింది. శేరిలింగంపల్లి టికెట్‌ను గాంధీకి కేటాయించడంతో బండి రమేశ్, సత్యనారాయణ, శంకర్‌గౌడ్ అసంతృప్తికి గురయ్యారు. శంకర్‌గౌడ్ ఏకంగా పార్టీకి రాాజీనామా చేసి టీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలో దిగారు. రమేశ్ కూడా పార్టీ మారే అంశంపై సన్నిహితులతో మంతనాలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు మేడ్చల్ టికెట్‌ను తోటకూర జంగయ్యయాదవ్‌కు ఇవ్వడంతో అసంతృప్తి పెల్లుబికుతోంది. ఈ క్రమంలో ముగ్గురు కీలక నేతలు ధిక్కారస్వరం వినిపించారు. నియోజకవర్గ ఇన్చార్జి నక్కా ప్రభాకర్‌గౌడ్, నందారెడ్డి, సింగిరెడ్డి హరివర్దన్రెడ్డిలు పార్టీ నిర్ణయాన్ని తప్పుబడుతూ రెబల్స్‌గా బరిలో దిగారు. మరోవైపు పరిగి స్థానాన్ని బీజేపీకి కేటాయించడంతో టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి చంద్రయ్య కూడా తిరుగుబాటు అభ్యర్థిగా రంగంలో నిలిచారు. కాంగ్రెస్‌కు తిరుగుబాటు బెడద! అధికారపార్టీకీ తిరుగుబాట్ల బెడద తప్పలేదు. పలు నియోజకవర్గాల్లో ఆపార్టీ నేతలు రెబల్స్‌గా బరిలో దిగారు. ఇబ్రహీంపట్నం అసెంబ్లీ సెగ్మెంట్‌ను ఆశించి భంగపడిన మాజీ ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి, ఆయన సోదరుడు రాంరెడ్డి, సీనియర్ నేత లక్ష్మిపతిగౌడ్, శశిధర్లు స్వతంత్ర అభ్యర్థులుగా బరిలో దిగారు. మరోవైపు పొత్తులో భాగంగా మహేశ్వరం స్థానాన్ని సీపీఐకి కేటాయించడంతో ఈ సీటుపై గంపెడాశలు పెట్టుకున్న చల్ల నర్సింహారెడ్డి, బి.చెన్నకృష్ణారెడ్డి నామినేషన్లు దాఖలు చేశారు. ఇదిలావుండగా, తెలుగుదేశంతో పొత్తును తప్పుబడుతున్న కమలనాథులు అనేక నియోజకవర్గాల్లో బరిలో నిలిచారు. చేవెళ్ల పార్లమెంటరీ స్థానానికి ఏకంగా ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు అంజన్‌కుమార్‌గౌడ్ నామినేషన్ వేయగా, రాజేంద్రనగర్ అసెంబ్లీ సెగ్మెంట్‌కు సీనియర్ నేత డాక్టర్ ప్రేమ్‌రాజ్, ఇబ్రహీంపట్నంలో పోరెడ్డి నర్సింహారెడ్డి, మహేశ్వరంలో శంకర్‌రెడ్డి, మేడ్చల్‌లో కొంపల్లి మోహన్‌రెడ్డి, కుత్బుల్లాపూర్‌లో ఎస్.మల్లారెడ్డి నామినేషన్లు దాఖలు చేయడం ద్వారా టీడీపీని ఇరకాటంలోకి పెట్టారు. ఇరుపార్టీల మధ్య సీట్ల సర్దుబాటులో జరిగిన రచ్చ మిత్రభేదానికి దారితీసినట్లు తెలుస్తోంది. మరోవైపు టీఆర్ఎస్కు తిరుగుబాట్లు బాగానే ఉన్నాయి. రాత్రికి రాత్రే కారెక్కిన ఇతర పార్టీల నేతలకు టికెట్లు ఇవ్వడాన్ని నిరసిస్తూ నాలుగు చోట్ల గులాబీ ఆశావహులు నామినేషన్లు దాఖలు చేయడం ద్వారా అసమ్మతి స్వరం వినిపించారు. టీడీపీ : 11 కాంగ్రెస్ : 12 టీఆర్ఎస్: 7 బీజేపీ: 4 -
రెబల్స్, రెబల్స్ ...
హైదరాబాద్: రెబల్స్, రెబల్స్, రెబల్స్... ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తప్ప అన్ని పార్టీలకు తిరుగుబాటు అభ్యర్థుల బెడద ఎక్కువగా ఉంది. అన్ని పార్టీలకు పలు ప్రాంతాలలో రెబల్ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. కాంగ్రెస్, టిడిపి, బిజెపిలకు పొత్తుల వల్ల కొన్ని స్థానాలు కోల్పోవడంతో తిరుగుబాటు అభ్యర్థులు ఎక్కువయ్యారు. టిఆర్ఎస్కు ఎవరితోనూ పొత్తులేకపోయినా దానికీ తిరుగుబాటు అభ్యర్థుల బెడద తప్పలేదు. తెలుగుదేశం పార్టీ : ఎల్బీనగర్ టీడీపీ టికెట్ ఆర్.కృష్ణయ్యకు కేటాయించడంతో టిడిపి నేతలు తిగురుబాటు చేశారు. ఎల్బీనగర్ టిడిపి ఇంచార్జ్ కృష్ణప్రసాద్ పార్టీకి రాజీనామా చేసి స్వతంత్ర అభ్యర్ధిగా నామినేషన్ దాఖలు చేశారు. ఎల్బి నగర్ స్థానానికే టీడీపీ నేత సామరంగారెడ్డి కూడా స్వతంత్ర అభ్యర్ధిగా నామినేషన్ దాఖలు చేశారు. ఖైరతాబాద్ స్థానానికి టీడీపీ రెబల్ అభ్యర్ధిగా లంకల దీపక్‌రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. టీడీపీకి రాజీనామా చేసిన పి.ఎల్.శ్రీనివాస్ తిరుగుబాటు అభ్యర్థిగా సికింద్రాబాద్ శాసనసభ స్థానానికి నామినేషన్ దాఖలు చేశారు. కరీంనగర్లో టీడీపీ రెబల్ అభ్యర్థిగా గుర్రం వెంకటేశ్వర్లు నామినేషన్ వేశారు. కాంగ్రెస్: కరీంనగర్ జిల్లా పెద్దపల్లి అసెంబ్లీ స్థానానికి కాంగ్రెస్ రెబల్ అభ్యర్థిగా గీట్ల ముకుందరెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. హుజురాబాద్ కాంగ్రెస్ రెబల్ అభ్యర్థిగా పరిపాటి రవీందర్‌రెడ్డి నామినేషన్ వేశారు. కరీంనగర్లో కాంగ్రెస్ రెబల్ అభ్యర్థిగా దువ్వాడి నరసింగరావు నామినేషన్ వేశారు. సిపిఐకి కేటాయించిన మహేశ్వరం అసెంబ్లీ స్థానానికి మల్రెడ్డి రంగారెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. మాజీ మంత్రి సబిత సహకారంతో మల్రెడ్డి నామినేషన్ వేసినట్లు తెలుస్తోంది. ఆదిలాబాద్ కాంగ్రెస్ రెబల్ అభ్యర్థిగా డీసీసీ అధ్యక్షుడు రామచంద్రారెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. మల్కాజ్‌గిరిలో కాంగ్రెస్ రెబల్ అభ్యర్ధిగా కృష్ణారావు నామినేషన్ దాఖలు చేశారు. వికారాబాద్ కాంగ్రెస్ రెబల్ అభ్యర్థిగా మాజీ మంత్రి చంద్రశేఖర్, చేవెళ్ల కాంగ్రెస్ రెబల్ అభ్యర్థిగా వెంకటస్వామి నామినేషన్ దాఖలు చేశారు. మునుగోడులో ఎంపీ పాల్వాయి కూతురు స్రవంతి రెబల్‌గా బరిలో దిగారు. దేవరకొండలో ఎమ్మెల్యే బాలూ నాయక్ రెబల్‌గా బరిలో దిగారు. మిర్యాలగూడలో మాజీ ఎమ్మెల్యే రేపాల శ్రీనివాస్ రెబల్‌గా నామినేషన్ వేశారు. వరంగల్ జిల్లా నర్సంపేటలో కాంగ్రెస్ రెబల్ అభ్యర్థిగా డీసీసీ అధ్యక్షుడు మాధవరెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. బిజెపి: సూర్యాపేటలో బీజేపీ రెబల్ అభ్యర్థిగా సంకినేని వెంకటేశ్వర రావు నామినేషన్ వేశారు. ఇబ్రహీంపట్నంలో బీజేపీ రెబల్‌గా అర్జున్‌రెడ్డి బరిలోకి దిగారు. కరీంనగర్ అసెంబ్లీ స్థానానికి బీజేపీ రెబల్ అభ్యర్థిగా డాక్టర్ విజయేందర్‌రెడ్డి నామినేషన్ వేశారు. మెదక్ జిల్లా పటాన్చెరు అసెంబ్లీ స్థానానికి బీజేపీ రెబల్ అభ్యర్థిగా అంజిరెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. టిఆర్ఎస్: టిఆర్ఎస్లో కూడా సీట్ల కేటాయింపు విషయమై తీవ్ర అసంతృప్తి నెలకొంది. కేసీఆర్ అభిమాన సంఘం అధ్యక్ష పదవికి వెంకటేశ్‌గౌడ్ రాజీనామా చేశారు. వరంగల్ జిల్లా పరకాలలో టీఆర్ఎస్ రెబల్ అభ్యర్థిగా భిక్షపతి నామినేషన్ దాఖలు చేశారు. నల్లగొండ జిల్లా తుంగతుర్తిలో టీఆర్ఎస్ రెబల్ అభ్యర్థిగా సామ్యెలు నామినేషన్ దాఖలు చేశారు. ఎల్బీనగర్లో సత్యనారాయణ, నకిరేకల్‌లో రాజేశ్వరి బాలరాజు తిరుగుబాటు అభ్యర్థులుగా నామినేషన్లు దాఖలు చేశారు. -
రాజధానిలో తెలుగు తమ్ముళ్ల తిరుగుబాటు
హైదరాబాద్: రాజధానిలో తెలుగు తమ్ముళ్లు తిరుగుబాటు బావుటా ఎగురవేస్తున్నారు. కొందరు పార్టీ వీడే యోచనలో ఉండగా, మరికొందరు తిరుగుబాటు అభ్యర్థులుగా బరిలోకి దిగారు. ఖైరతాబాద్ నియోజకవర్గంలో టీడీపీ నాయకుడు లంకల దీపక్ రెడ్డి రెబెల్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. ఇక ఎల్బీనగర్ నియోజకవర్గంలో ఇదే పరిస్థితి. టీడీపీ నేత సామరంగారెడ్డి స్వతంత్ర అభ్యర్ధిగా నామినేషన్ దాఖలు చేశారు. మరో నలుగురు టీడీపీ టీడీపీ కార్పొరేటర్లు పార్టీకి రాజీ నామా చేసే యోచనలో ఉన్నట్టు సమాచారం. కొందరు నాయకులు పార్టీకి గుడ్ బై చెప్పి వేరే పార్టీ తరపున రంగంలోకి దిగారు. ఎల్బీనగర్లో టీడీపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసేందుకు వచ్చిన బీసీ నాయకుడు ఆర్.కృష్ణయ్యపై రాళ్లతో దాడి చేశారు. రాళ్ల దాడిలో కృష్ణయ్య వాహనం ధ్వంసమైంది. దీంతో పరిస్థతి ఉద్రిక్తంగా మారింది. -
రెబెల్స్
సొంత పార్టీ అభ్యర్థులపై తిరుగుబాటు చేస్తున్న వారు ఓ వైపు... పార్టీలతో నిమిత్తం లేకుండా తమ సత్తా చాటుకునేందుకు సిద్ధమైన అభ్యర్థులు మరో వైపు నిలబడి ప్రధాన పార్టీలకు సవాల్ విసురుతున్నారు. ఇరువైపుల నుంచి సుడిగాలిలా దూసుకొస్తున్న ఈ ముప్పు ప్రధాన పార్టీల గెలుపోటములపై తీవ్రంగా పడనుంది. ముఖ్యంగా కాంగ్రెస్, టీడీపీలకు వ్యతిరేకంగా రెబల్స్ బరిలో ఉండటం ఆయా పార్టీల అభ్యర్థులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ఎటు నుంచి ఏ ఉపద్రవం ముంచుకొస్తుందోనన్న భయం ఆ పార్టీ అభ్యర్థులను వెంటాడుతోంది. స్వతంత్రులను ఏదో విధంగా మచ్చికచేసుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి. కానీ పార్టీలోని రెబల్స్‌ను ఏవిధంగా బుజ్జగించాలో తెలియని అయోమయ పరిస్థితి అభ్యర్థుల్లో నెలకొంది. ఓట్ల చీలికతో ఫలితాలు తారుమారు... గత ఎన్నికలతో పోలిస్తే ఈ ఎన్నికల్లో రెబల్స్, స్వతంత్రులు ఎక్కువ మంది పోటీ చేస్తున్నారు. 2006 ఎన్నికల్లో 815 ఎంపీటీసీ స్థానాలకు గాను స్వతంత్రులు 513 మంది బరిలో ఉన్నారు. కాగా ప్రస్తుత ఎన్నికల్లో 835 స్థానాలకు 649 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఆ ఎన్నికల్లో జెడ్పీటీసీ 59 స్థానాలకు 58 మంది అభ్యర్థులు పోటీలో ఉండగా, ఈ ఎన్నికల్లో వారి సంఖ్య ఏకంగా 125కు పెరగడం గమనార్హం. ఈ పోటీతత్వం కాంగ్రెస్, టీడీపీలలో ఎక్కువగా కనిపిస్తోంది. జిల్లా రాజకీయాల్లో ఈ రెండు పార్టీల్లో గ్రూపులు తారాస్థాయికి చేరడం ఎన్నికల్లో పోటీ తత్వానికి దారితీసింది. దీంతోఈ ఎన్నికల్లో రెబల్స్.. తమకు ఉన్న పలుకుబడితో ఓట్లను పొందగలిగితే..అన్ని ప్రధాన పార్టీల ఓట్లు భారీగా చీలిపోయే అవకాశాలు కన్పిస్తున్నాయి. -
నామినేషన్ల ఉపసంహరణ గడువు నేటితో పూర్తి
మూడు గంటల వరకే సమయం జెడ్పీ నామినేషన్లు 422 తిరస్కరణకు గురైనవి 52 ఉపసంహరణలు 20 ఎంపీటీసీ నామినేషన్లు 4,820 తిరస్కరణకు గురైనవి 204 ఉపసంహరణలు 329 ప్రధాన అభ్యర్థుల గుండెల్లో మోగుతున్న రె‘బెల్స్’ జెడ్పీటీసీ, ఎంపీటీసీ నామినేషన్ల ఉపసంహరణకు సోమవారంతో గడువు ముగియనుంది. రె‘బెల్స్’ బెడద ఉన్నచోట్ల వారిని పోటీనుంచి తప్పించేందుకు ప్రధాన అభ్యర్థులు తమ యత్నాలు ముమ్మరం చేశారు. వారి నామినేషన్లు ఉపసంహరింపజేయకపోతే తమ ఓటుబ్యాంకు చీలుతుందనే భయం వారిని వెన్నాడుతోంది. మచిలీపట్నం న్యూస్‌లైన్ : జెడ్పీటీసీ, ఎంపీటీసీల నామినేషన్ల ఉపసంహరణ సోమవారం మధ్యాహ్నం మూడు గంటలతో ముగియనుంది. జిల్లాలోని 49 జెడ్పీటీసీ స్థానాలకు 422 నామినేషన్లు దాఖలు కాగా వాటిలో 52 నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. 826 ఎంపీటీసీ స్థానాలకు 4,820 నామినేషన్లు దాఖలు కాగా వాటిలో 204 తిరస్కరించారు. ఆదివారం జెడ్పీటీసీ అభ్యర్థులు 20 మంది తమ నామినేషన్లు ఉపసంహరించారు. ఎంపీటీసీ సభ్యులు 329 మంది నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. జిల్లా పరిషత్ కార్యాలయంలో ఐదు కౌంటర్ల ద్వారా నామినేషన్లు స్వీకరించగా ఈ కౌంటర్ల ద్వారానే నామినేషన్ల ఉపసంహరణ కార్యక్రమం నడుస్తోంది. సోమవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంది. తొలగని రెబల్స్ బెడద... అనేకచోట్ల ప్రధాన అభ్యర్థులకు రెబల్స్ బెడద ఇంకా తొలగలేదు. నామినేషన్ల ఉపసంహరణకు ఇంకా ఒక్కరోజు మాత్రమే గడువు ఉండటంతో ప్రధాన అభ్యర్థులు బుజ్జగించో.. ప్రలోభ పెట్టో.. పోటీనుంచి వారిని తప్పించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. తమ ఓట్లు చీలకుండా చూసుకునేందుకు నానా తంటాలు పడుతున్నారు. ఇప్పటికే నేతలు పలువురు రెబల్ అభ్యర్థులను బుజ్జగించి ఉపసంహరింపజేయగా, మిగిలినవారు మాత్రం పట్టుదల వీడకపోవడం అభ్యర్థులను ఆందోళనకు గురిచేస్తోంది. ఏదేమైనా సోమవారం అధిక సంఖ్యలో నామినేషన్ల ఉపసంహరణ ఉండే అవకాశముంది. ఉపసంహరణలు ఇలా... జెడ్పీటీసీ అభ్యర్థులుగా నామినేషన్లు దాఖలు చేసి ఉపసంహరించిన వారి వివరాలు ఇలా ఉన్నాయి. వైఎస్సార్సీపీలో నెరుసు షర్మిల (గన్నవరం), కారుమంచి రమేష్, కారుమంచి శ్రీనివాసరావు (గూడూరు), నరసారెడ్డి దనుకొండ, చెరకు నరసారెడ్డి, శీలం కృష్ణారెడ్డి, చావా వెంకటేశ్వరరావు (గంపలగూడెం), బోయిన వేణుగోపాల్ (కోడూరు), కటికోల ప్రమీలారాణి (జగ్గయ్యపేట) తమ నామినేషన్లు ఉపసంహరించారు. టీడీపీలో అమ్మనబోయిన రూతు (జగ్గయ్యపేట), కోగంటి శివనాగమల్లేశ్వరి (కంచికచర్ల), భూపతి శ్రీనివాసరావు (పెడన), అబ్బూరి హేమలత, కలపాల రజని (బాపులపాడు), కావిటి కృష్ణకుమారి (ఎ.కొండూరు), పాలంకి విజయలక్ష్మి (రెడ్డిగూడెం), తురకా తిరుపతమ్మ (వీరులపాడు), తాతా సుస్మిత (మొవ్వ), బొడ్డు నాగమ్మ (ముదినేపల్లి) తమ నామినేషన్లు ఉపసంహరించిన వారిలో ఉన్నారు. రేపల్లె సీతారామాంజనేయులు (మోపిదేవి) కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసి ఉపసంహరించుకున్నారు. ఎంపీటీసీల వివరాలు ఇలా ఉన్నాయి... జిల్లాలో సోమవారం ఎంపీటీసీ స్థానాలకు 329 మంది అభ్యర్థులు తమ నామినేషన్ల ఉపసంహరించుకున్నారు. వీరిలో వైఎస్సార్ సీపీ 121, టీడీపీ 170, కాంగ్రెస్ 11, సీపీఎం 1, సీపీఐ 4, ఇండిపెండెంట్లు 22 మంది అభ్యర్థులు ఉన్నారు. -
బుజ్జగింపులు
నామినేషన్ల ఉపసంహరణకు బేరసారాలు రెబల్స్‌ను బుజ్జగిస్తున్న పార్టీ నాయకులు ‘పరిషత్’పోరులో అభ్యర్థుల హైరానా బీఫారం కోసం నేతల చుట్టూ ప్రదక్షిణలు విశాఖ రూరల్, న్యూస్‌లైన్ : ప్రాదేశిక ఎన్నికల నామినేషన్ల ఘట్టం ముగిసింది. బుజ్జగింపులు,బేరసారాల పర్వం జోరందుకుంది. ఈ నెల 24వ తేదీ వరకు ఉపసంహరణకు గడువు ఉంది. ఈలోగా రెబల్స్‌ను పోటీ నుంచి వైదొలిగేలా అన్ని పార్టీలవారు ప్రయత్నాలు చేపట్టారు. ఇది తలకుమించినదైనప్పటికీ ఎత్తుకుపై ఎత్తులు వేస్తున్నారు. అలకబూనినవారు, వేరే పార్టీలోకి దూకడానికి సిద్ధంగా ఉన్నవారి ఇళ్లకు నాయకులు వెళ్లి బుజ్జగిస్తున్నారు. అవసరమైతే నజరానాలను ఆశచూపుతున్నారు. నామినేషన్లు వేసినవారంతా పార్టీ అభ్యర్థిగా బీఫారాల కోసం అగ్రనాయకుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఇలా ‘పరిషత్’పోరులో అభ్యర్థులు, రాజకీయపార్టీల హైరానా అం తటా కనిపిస్తోంది. ఈ నెల 17 నుంచి 20వ తేదీ వరకు 39 జెడ్పీటీసీ స్థానాలకు 387, 656 ఎంపీటీసీలకు 4264 నామినేషన్లు వచ్చాయి. ఒక స్థానానికి ఒక్కో పార్టీ నుంచి ముగ్గురు నుంచి ఏడుగురు వరకు బీఫారాలు లేకుండా నామినేషన్లు వేశారు. జెడ్పీటీసీ స్థానాలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ నుంచి 123 మంది, టీడీపీ నుంచి 150, కాంగ్రెస్ 39, సీపీఎం 22, సీపీఐ 11, బీజేపీ 16, బీఎస్పీ 3, లోక్‌సత్తా నుంచి ఇద్దరితో పా టు 21 మంది స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. దీంతో అభ్యర్థులను మినహా మిగిలిన వారిని బుజ్జగించడం కొన్ని పార్టీలకు తలనొప్పిగా మారింది. ప్రాదేశికం ప్రతిష్టాత్మకం : సార్వత్రిక ఎన్నికలకు ముందు జరుగుతున్న ప్రాదేశిక ఎన్నికలను అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. ఈ ఫలితాల ప్రభావం సాధారణ ఎన్నికలపై ఉంటుందని పార్టీలన్నీ జెడ్పీటీసీ,ఎంపీటీసీ సా ్థనాల్లో విజయానికి సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. ఈ స్థానాలకు అభ్యర్థుల ఎంపికే పార్టీలకు ఇబ్బందిగా మారింది. ప్రధాన పార్టీల్లో ఆశావహుల సంఖ్య అధికంగా ఉండడంతో వారిలో ఎవరికి బి-ఫారం ఇవ్వాలన్న విషయంపై నాయకులు మల్లగుల్లాలుపడుతున్నాయి. బలమైన అభ్యర్థులను గుర్తించి మిగిలిన వారితో నామినేషన్లను ఉపసంహరించుకునేలా చేయడం పార్టీలకు సవాలుగా మారింది. టీడీపీకి తొలనొప్పులు : ప్రాదేశిక స్థానాలకు అభ్యర్థుల ఎంపిక విషయంలో టీడీపీ కిందామీదా పడుతోంది. గ్రామాల్లో ఆ పార్టీకి పట్టులేకపోయినా... మేకపోతు గాంభీర్యం ప్రదర్శించాలన్న అధిష్టానం ఆదేశాల మేరకు ఒక్కో సెగ్మెంటుకు ముగ్గురు నుంచి పది మంది వరకు నామినేషన్లు వేశారు. 39 జెడ్పీటీసీలకు 150 నామినేషన్లు వేయడం ఇందుకు తార్కాణం. తీరా పెద్ద సంఖ్యలో నామినేషన్లు వేశాక ఎవరిని బరిలో నిలపాలన్న విషయంపై ఇప్పటికీ ఆ పార్టీ నాయకుల్లో స్పష్టత లేకపోవడం గమనార్హం. దీంతో ఎవరికి బి-ఫారం వస్తుందన్నది చెప్పలేకపోతున్నారు. నామినేషన్ల ఉపసంహరణకు కేవలం రెండు రోజులే ఉంది. ఇప్పటికీ ఆ పార్టీ నుంచి జెడ్పీటీసీ అభ్యర్థులెవరో తేలలేదు. ఇదే ఆ పార్టీ కొంపముంచేట్టు ఉంది. -
రెబల్స్ అధీనంలో కీవ్.. ఉక్రెయిన్‌లో సంక్షోభం
కీవ్: ఉక్రెయిన్‌లో ఆందోళనలు తీవ్రరూపం దాల్చాయి. ప్రభుత్వ దళాలకు, ఉద్యమకారులకు మధ్య పోరు మరింత ముదిరింది. తాజా పరిణామాలతో దేశం రెండుగా చీలిపోయింది. రాజధాని నగరం కీవ్ పూర్తిగా తమ అధీనంలోకి తీసుకున్నట్టు ఆందోళనకారులు శనివారం ప్రకటించారు. ప్రభుత్వం, పార్లమెంట్‌లోనూ పట్టు సాధించామని, అధ్యక్ష భవనాన్ని సీజ్ చేశామని చెప్పారు. పార్లమెంటులో ఓటింగ్ నిర్వహించి అధ్యక్షుడు విక్టర్ యనుకోవిచ్‌ను పదవి నుంచి తొలగించినట్లు ప్రకటించారు. అలాగే మే 25న ఎన్నికలు జరుపుతామని చెప్పారు. ఓటింగ్ నిర్వహించి జైల్లో ఉన్న తమ నేత యూలియా తిమోషెంకోను విడుదల చేశారు. అయితే తాజా పరిణామాలన్నీ కుట్రపూరితంగా జరుగుతున్నాయని అధ్యక్షుడు విక్టర్ యనుకోవిచ్ ఆరోపించారు. తాను రాజీనామా చేశానని వచ్చిన వార్తలను తోసిపుచ్చారు. తన పదవికి రాజీనామా చేసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనల్లో వంద మందికిపైగా ప్రాణాలు కోల్పోవడంతో రాజీనామా చేయాలన్న డిమాండ్ నేపథ్యంలో ఆయన స్పందించారు. తాను దేశాన్ని విడిచి ఎక్కడికీ వెళ్లడం లేదని, చట్టబద్ధంగా ఎన్నికైన అధ్యక్షుడిని తానేనని చెప్పారు. తనకూ, తన సన్నిహితులకు నిరసనకారుల నుంచి ప్రాణహాని ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. మరోవైపు కీవ్ నడిబొడ్డులోని కీలక ప్రభుత్వ భవనాలన్నీ ఎటువంటి పోలీసు భద్రతా లేకుండా ఉన్నాయి. నిరసనకారులు సైనికుల దుస్తులు ధరించి అధ్యక్ష భవనంలో తిరుగుతున్నారు. భద్రతా కారణాలతో అధ్యక్ష భవనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు విపక్ష నేత వెలికోవిక్ చెప్పారు. మరోపక్క.. అధ్యక్షుడికి సన్నిహితుడైన పార్లమెంట్ స్పీకర్ రైబక్ రాజీనామా చేశారు. రష్యాతో సంబంధాలకోసం.. యూరోపియన్ యూనియన్‌తో ఒప్పందానికి యనుకోవిచ్ నిరాకరించడంతో గత ఏడాది న వంబర్ నుంచి నిరసనలు వెల్లువెత్తాయి. ప్రభుత్వ బలగాల దమనకాండలో వందమంది నిరసనకారులు మృతిచెందారు.. -
కాంగ్రెస్‌కు రెబల్స్ బెడద
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ రాజ్యసభకు పోటీ చేసే అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. నామినేషన్ల ప్రక్రియ మొదలైంది. అయితే ఈ పార్టీకి రెబల్స్ బెడద ఎక్కువగా ఉంటుందని భావిస్తున్నారు. పోటీలో రెబల్ అభ్యర్థులు లేకుండా చూసేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఇందులో భాగంగా ఏఐసీసీ పరీశీలకులు హైదరబాద్ వచ్చారు. రామచంద్రయ్య కుంతియా, తిరునావక్కరుసు ఇక్కడ ఏఐసీసీ గెస్ట్‌హౌస్‌లో బస చేశారు. పలువురు కాంగ్రెస్ నేతలు ఏఐసీసీ ప్రతినిధులను కలవనున్నారు. ఇదిలా ఉండగా, పార్టీ సీనియర్ నేత జెసి దివాకర్ రెడ్డి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో సమావేశమయ్యారు. రాజ్యసభకు పోటీ చేసే విషయంమై చర్చించేందుకు ఆయన సిఎంను కలిసినట్లు తెలుస్తోంది.