బెల్లంపల్లి: బెల్లంపల్లి అసెంబ్లీ నియోజకవర్గ ఓటర్ల దృష్టంతా నామినేషన్ల ఉపసంహరణపైనే ఉంది. పోటీలో నుంచి ఎంతమంది అభ్యర్థులు త ప్పుకుంటారు, ఎంత మంది బరిలో నిలుస్తారనేది చర్చనీయాంశంగా మారింది. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడానికి ప్రధాన రాజకీయ పక్షాల తరపున, స్వంతంత్ర అభ్యర్థులుగా 22 మంది నామి నేషన్ దాఖలు చేశారు. ఈనెల 12 నుంచి 19వ వరకు నిర్వహించిన నామినేషన్ల దాఖలు కార్యక్రమంలో అభ్యర్థులు పోటాపోటీగా నామినేషన్ పత్రాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారి పీఎస్ రాహుల్‌రాజ్‌కు అందజేశారు. వీటిలో ఆరుగురి అ భ్యర్థుల నామినేషన్ పత్రాలను తిరస్కరించినట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి ప్రకటించారు. దీంతో ప్రస్తుతం ఎన్నికల బరిలో 16 మంది అభ్యర్థులు నిలిచారు. పోటీలో ఉన్న అభ్యర్థులు దా ఖలు చేసిన నామినేషన్ పత్రాలను ఉపసంహరించుకోవడానికి గురువారంతో తుది గడువు ముగియనుంది. వీరిలో ఎంతమంది అభ్యర్థులు ఎన్నికల రణరంగంలో ఉంటారు, ఎంత మంది ఉపసంహరణకు మొగ్గు చూపుతారనేది సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.
ప్రధాన పక్షాల బుజ్జగింపులు..
ఎన్నికల్లో తప్పనిసరిగా పోటీలో ఉండబోతున్న ప్రధాన పక్షాల అభ్యర్థులు చిన్న చిన్న పార్టీల అభ్యర్థులను పోటీలో నుంచి తప్పించడానికి కసరత్తు చేస్తున్నారు. ముఖ్యంగా ఆ అభ్యర్థికి పోలయ్యే ఓట్లు చీలకుండా ప్రత్యర్థి వర్గానికి చెందిన ఓట్లు చీలిపోయేలా వ్యూహా ప్రతివ్యూహాలు పన్నుతున్నారు. తమపార్టీ ఓట్లు చీల్చే అవకాశాలు ఉన్నా అభ్యర్థులను పోటీ నుంచి తప్పించడానికి బుజ్జగింపుల పర్వం కొనసాగిస్తున్నారు. కొంత మంది అభ్యర్థులను తప్పించడానికి ఏకంగా నజరాలను ఆశ చూపెడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఎవరి ప్రయత్నాలు ఫలించి ఎంతమంది అభ్యర్థులు బరిలో నుంచి వైదొలుగుతారనేది ప్రస్తుతం అంతుచిక్కకుండా ఉంది.
రెబెల్స్ పోటీలో ఉంటే ముప్పే..!
బెల్లంపల్లి ఎన్నికల బరిలో నిలిచిన ప్రధాన పక్షాల అభ్యర్థులకు రెబెల్స్ బెడద పొంచి ఉంది. మరో పక్క కొందరు అభ్యర్థులు చివరి నిమిషంలో పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డారు. అలాంటి అభ్యర్థులతో ఓట్లు చీలే అవకాశాలు ఉన్నాయి. ఈ పరిణామాలు ప్రధాన రాజకీయ పార్టీలకు తలనొప్పిగా మారాయి. వీరిని బరిలో నుంచి తప్పించేందుకు విశ్వయత్నాలు చేస్తున్నారు.
ఉపసంహరణపైనే అందరి దృష్టి
Published Thu, Nov 22 2018 6:38 PM | Last Updated on Thu, Nov 22 2018 6:38 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment