nominations Withdrew
-
భువనగిరి పోరులో మిగిలింది 13 మందే
సాక్షి, యాదాద్రి : లోక్సభ ఎన్నికల ఉపసంహరణ ఘట్టం నేటితో ముగిసింది. నామినేషన్ల ఉపసంహరణ అనంతరం భువనగిరి లోక్సభ స్థానానికి 13 మంది అభ్యర్థులు రంగంలో నిలిచారు. నామినేషన్ల ఉపసంహరణ చివరిరోజైన గురువారం 10 మంది అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. ముం దుగా 34 మంది అభ్యర్థులు 59 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. మంగళవారం నామినేషన్ల పరిశీలనలో 11 తిరస్కరించారు. ఇక రంగంలో 23 మంది మిగిలారు. నామినేషన్ల ఉపసంహరణకు ఎన్నికల సంఘం విధించిన రెండురోజుల గడువు నేటితో ముగియడంతో 10 మంది తమ నామినేషన్ల ఉపసంహరణ చేసుకున్నారు. 15 మంది అభ్యర్థులకు మించితే రెండో బ్యాలెట్ యూనిట్ ఏర్పాటు చేయాల్సి ఉం టుంది. కానీ చివరకు 13 మంది అభ్యర్థులు ఒక నోట బటన్ ఉండడంతో ఒక బ్యాలెట్ యూనిట్తోనే ఎన్నికలు నిర్వహిస్తారు. జాతీయ పార్టీలకు వాటి ఎన్నికల గుర్తులు ఇవ్వనుండగా ఇండిపెండెంట్లకు ఎన్నికల కమిషన్ ఇచ్చిన గుర్తులను కేటాయించి బ్యాలెట్ పత్రాలను తయారు చేసి ఈవీఎంలలో అమరుస్తారు. ఏప్రిల్ 11న ఎంపీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఫలించిన ఉపసంహరణ ప్రయత్నాలు 23 మంది రంగంలో ఉండగా 10 మంది అభ్యర్థుల చేత నామినేషన్లను ఉపసంహరించడంలో రాజకీయపార్టీల ప్రయత్నాలు ఫలించాయి. 15 మంది అభ్యర్థులు దాటితే రెండో బ్యాలెట్ యూనిట్ను ఉపయోగించాల్సి ఉంటుంది. దీనివల్ల ఓటర్లు తికమకపడి తమకు పడే ఓటు చిత్తు కావడం, లేదా మరొకరికి పడే అవకాశం ఏర్పడి తమకు నష్టం కలుగుతుందన్న ఆందోళన ప్రధాన పార్టీల అభ్యర్థుల్లో నెలకొంది. అయితే ఈ విషయంలో రెండు పార్టీల అభ్యర్థులు పోటీలో ఉన్న అభ్యర్థులను రంగంలోంచి ఉపసంహరించుకునే విధంగా చేసిన ప్రయత్నాలు సఫలం అయ్యాయి. ఉపసంహరణ చేసుకున్న వారికి తగిన పారితోషికం భారీగానే ముట్టినట్లు సమాచారం. -
ఉపసంహరణపైనే అందరి దృష్టి
బెల్లంపల్లి: బెల్లంపల్లి అసెంబ్లీ నియోజకవర్గ ఓటర్ల దృష్టంతా నామినేషన్ల ఉపసంహరణపైనే ఉంది. పోటీలో నుంచి ఎంతమంది అభ్యర్థులు త ప్పుకుంటారు, ఎంత మంది బరిలో నిలుస్తారనేది చర్చనీయాంశంగా మారింది. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడానికి ప్రధాన రాజకీయ పక్షాల తరపున, స్వంతంత్ర అభ్యర్థులుగా 22 మంది నామి నేషన్ దాఖలు చేశారు. ఈనెల 12 నుంచి 19వ వరకు నిర్వహించిన నామినేషన్ల దాఖలు కార్యక్రమంలో అభ్యర్థులు పోటాపోటీగా నామినేషన్ పత్రాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారి పీఎస్ రాహుల్రాజ్కు అందజేశారు. వీటిలో ఆరుగురి అ భ్యర్థుల నామినేషన్ పత్రాలను తిరస్కరించినట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి ప్రకటించారు. దీంతో ప్రస్తుతం ఎన్నికల బరిలో 16 మంది అభ్యర్థులు నిలిచారు. పోటీలో ఉన్న అభ్యర్థులు దా ఖలు చేసిన నామినేషన్ పత్రాలను ఉపసంహరించుకోవడానికి గురువారంతో తుది గడువు ముగియనుంది. వీరిలో ఎంతమంది అభ్యర్థులు ఎన్నికల రణరంగంలో ఉంటారు, ఎంత మంది ఉపసంహరణకు మొగ్గు చూపుతారనేది సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ప్రధాన పక్షాల బుజ్జగింపులు.. ఎన్నికల్లో తప్పనిసరిగా పోటీలో ఉండబోతున్న ప్రధాన పక్షాల అభ్యర్థులు చిన్న చిన్న పార్టీల అభ్యర్థులను పోటీలో నుంచి తప్పించడానికి కసరత్తు చేస్తున్నారు. ముఖ్యంగా ఆ అభ్యర్థికి పోలయ్యే ఓట్లు చీలకుండా ప్రత్యర్థి వర్గానికి చెందిన ఓట్లు చీలిపోయేలా వ్యూహా ప్రతివ్యూహాలు పన్నుతున్నారు. తమపార్టీ ఓట్లు చీల్చే అవకాశాలు ఉన్నా అభ్యర్థులను పోటీ నుంచి తప్పించడానికి బుజ్జగింపుల పర్వం కొనసాగిస్తున్నారు. కొంత మంది అభ్యర్థులను తప్పించడానికి ఏకంగా నజరాలను ఆశ చూపెడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఎవరి ప్రయత్నాలు ఫలించి ఎంతమంది అభ్యర్థులు బరిలో నుంచి వైదొలుగుతారనేది ప్రస్తుతం అంతుచిక్కకుండా ఉంది. రెబెల్స్ పోటీలో ఉంటే ముప్పే..! బెల్లంపల్లి ఎన్నికల బరిలో నిలిచిన ప్రధాన పక్షాల అభ్యర్థులకు రెబెల్స్ బెడద పొంచి ఉంది. మరో పక్క కొందరు అభ్యర్థులు చివరి నిమిషంలో పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డారు. అలాంటి అభ్యర్థులతో ఓట్లు చీలే అవకాశాలు ఉన్నాయి. ఈ పరిణామాలు ప్రధాన రాజకీయ పార్టీలకు తలనొప్పిగా మారాయి. వీరిని బరిలో నుంచి తప్పించేందుకు విశ్వయత్నాలు చేస్తున్నారు. -
‘డిపాజిట్లా’..చూద్దాం..!
మహబూబ్నగర్ మున్సిపాలిటీ, న్యూస్లైన్: పురపాలక సంఘాలకు జరిగిన పోరులో అభ్యర్థులు చేసిన డిపాజిట్లకు సంబంధించి మొత్తాన్ని అందజేయడంలో అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు. ముఖ్యంగా నామినేషన్లు ఉపసంహరించుకున్నవారికి ఈ చెల్లింపులు జరగాల్సి ఉంది. తొలుత వెంటనే ఇచ్చేస్తామని చెప్పినా ఆ తర్వాత ఆ మాటే పక్కన పెట్టేశారు.అందరికీ నిబంధనలు అమలు పరిచే అధికారులే ఇలా చేస్తే ఎలా అని ఉపసంహరించుకున్న వారు ప్రశ్నిస్తున్నారు. ఇలా 95 మంది చెల్లింపులకోసం ఎదురుచూస్తున్నారు. రూ.పదిలక్షలకు పైగా వసూళ్లు... ఈ ఎన్నికల్లో మున్సిపాలిటీల్లోని 41వార్డులకు గాను వివిధ పక్షాలకు చెందిన అభ్యర్థులతోపాటు, స్వతంత్ర అభ్యర్థులు 462మంది డిపాజిట్లు చెల్లించి నామినేషన్లను దాఖలు చేశారు. వారిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులు 1250, జనరల్ అభ్యర్థులు 2,500 వంతున చెల్లించగా మున్సిపాలిటీకి రూ.10లక్షలకు పైగా ఆదాయం సమకూరింది. వీరిలో ఉపసంహరణ రోజు మార్చి 18న 95మంది తమ నామినేషన్లను ఉపసంహరించుకొని డిపాజిట్ల ఇవ్వాలని కోరగా తరువాత ఇస్తామని చెప్పి పంపించేశారు. ఇలా మున్సిపాల్టీ వద్ద రూ.2లక్షల వరకు డిపాజిట్ల మొత్తం పేరుకు పోయింది. చెల్లింపుల్లోనే జాప్యమవుతోంది. కౌంటింగ్ అయ్యాక చెల్లింపులు: కమిషనర్ ఈనెల 12న ఓట్ల లెక్కింపు పక్రియ పూర్తవుతోంది, ఆతరువాత ఉపసంహరించుకొన్న అభ్యర్థులంతా తమ రశీదులతో వస్తే వెంటనే వారి డిపాజిట్లను తిరిగి చెల్లిస్తామని మున్సిపల్ కమిషనర్ అమరయ్య తెలిపారు. కొన్ని అనివార్య కారణాల దృష్ట్యా తిరిగి చెల్లించడం అలస్యమైందని, ఇక అలస్యం లేకుండా వారికి చెల్లిస్తామని వెల్లడించారు.