
మీరు తిరుగుబాటు చేసినప్పటికీ ఇప్పటికీ మీరంతా శివసేనతోనే ఉన్నారు. మీలో చాలా మంది ఇప్పటికీ మాతో టచ్‌లో ఉన్నారు. మీ గ్రూప్‌లోని కొంతమంది ఎమ్మెల్యేల కుటుంబ సభ్యులు కూడా మమ్మల్ని సంప్రదించి వారి అభిప్రాయాలను మాకు తెలియజేసారు' అని ఆయన లేఖలో పేర్కొన్నారు.
ముంబై: మహారాష్ట్రలో మొదలైన రాజకీయ సంక్షోభం రోజుకో రకంగా మలుపు తిరుగుతోంది. ఈ పోరులో అంతిమ విజయం కోసం ఇరు వర్గాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. తాజాగా సీఎం ఉద్ధవ్ ఠాక్రే తిరుగుబాటు ఎమ్మెల్యేలను రప్పించేందుకు చివరి ప్రయత్నంగా వారికి భావోద్వేగంగా లేఖ రాశారు. అందులో రెబెల్ ఎమ్మెల్యేలు తిరిగి ముంబైకి వచ్చేయాలని విజ్ఞప్తి చేశారు.
ఆ లేఖలో ఏముందంటే..
రెబెల్ ఎమ్మెల్యేలకు రాసిన లేఖలో.. “మీరు తిరుగుబాటు చేసినా, ఇప్పటికీ మీరంతా శివసేనతోనే ఉన్నారు. మీలో చాలా మంది మాతో ఇంకా టచ్‌లో ఉన్నారు. మీ గ్రూప్‌లోని కొంతమంది ఎమ్మెల్యేల కుటుంబ సభ్యులు కూడా మమ్మల్ని సంప్రదించి వారి అభిప్రాయాలను మాకు తెలియజేసారు' అని ఉద్దవ్ లేఖలో పేర్కొన్నారు. రెబెల్ ఎమ్మెల్యేలను శివసేన వదులుకోలేదని, వారంతా ముంబై వచ్చి తనతో మాట్లాడాలని రెబెల్స్‌కు లేఖ ద్వారా ఠాక్రే సందేశం పంపారు.
‘మీకు సమస్య ఉంటే చర్చలతో పరిష్కరించుకుందాం తప్ప ఇది సరైన దారి కాదు. గత కొద్ది రోజులుగా గౌహతిలో ఉంటున్న రెబెల్ ఎమ్మెల్యేల గురించి రోజుకో కొత్త సమాచారం బయటకు వస్తోంది. శివసేన కుటుంబ అధినేతగా నేను మీ మనోభావాలను గౌరవిస్తాను, ముందుగా ఈ గందరగోళం నుంచి బయటపడండి. మిమ్మల్ని కొందరు తప్పుదోవ పట్టిస్తున్నారు, దాని నుంచి బయటపడాలని’ ఠాక్రే ఆ లేఖలో సూచించారు.
Maharashtra CM & Shiv Sena chief Uddhav Thackeray appeals to party MLAs in Guwahati, to come & discuss; said "Many of you are in touch with us, you're still in Shiv Sena at heart; family members of some MLAs have also contacted me & conveyed their sentiments to me..."
— ANI (@ANI) June 28, 2022
(file pic) pic.twitter.com/6pfhtQs7Go