siva sena party
-
థాక్రే వర్గానిదే ‘అంధేరీ’.. కానీ, ఇక్కడో సర్ప్రైజ్ఉంది!
ముంబై: మహారాష్ట్ర రాజకీయాల్లో సంచలనం రేపుతూ ఏక్నాథ్ షిండే వర్గం తిరుగుబాటు చేసిన తర్వాత తొలి విజయాన్ని అందుకుంది ఉద్ధవ్ థాక్రే వర్గం. ముందునుంచి ఊహించినట్లు అంధేరీ నియోజకవర్గాన్ని థాక్రే నేతృత్వంలోని శివసేన కైవసం చేసుకుంది. ముంబైలోని అంధేరీ(ఈస్ట్) నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో శివసేన అభ్యర్థి రుతుజా లాట్కే 66వేల భారీ మెజారిటీతో విజయ ఢంకా మోగించారు. రుతుజా లాట్కేకు మద్దతుగా పలు పార్టీల అభ్యర్థనతో ఈ పోటీ నుంచి బీజేపీ తప్పుకుంది. దీంతో లాట్కే విజయం లాంఛనప్రాయంగానే మారింది. ఊహించినట్లుగానే ఆమెకు భారీ మెజారిటీ కట్టబెట్టారు ఓటర్లు. అయితే, ఇక్కడ ఓటర్లు ఓ సర్ప్రైజ్ ఇచ్చారు. రుతుజా లాట్కేపై పోటీ చేసిన ఆరుగురు అభ్యర్థులకు వచ్చిన మొత్తం ఓట్లకన్నా నోటా(NOTA)కే ఎక్కువ ఓట్లురావటమే సర్ప్రైజ్గా చెప్పాలి. శివసేన ఎమ్మెల్యే రమేశ్ లాట్కే ఈ ఏడాది మే నెలలో మరణించారు. దీంతో అంధేరీ నియోజకవర్గంలో ఉప ఎన్నిక అనివార్యమయ్యాయి. ముందుగా ఇక్కడ బీజేపీ పోటీ చేయాలని భావించింది. అయితే, ఎన్సీపీ సహా పలు పార్టీలు పోటీ నుంచి తప్పుకోవాలని, రమేశ్ లాట్కే భార్యకు అవకాశం ఇవ్వాలని కోరాయి. దీంతో బీజేపీ తప్పుకుంది. బీఎంసీలో క్లర్క్‌గా పని చేస్తున్న లాట్కే.. ఆమె రాజీనామాను ఆమెదించిన తర్వాతే నామినేషన్ వేసేందుకు కోర్టు అంగీకరించింది. ఇదీ చదవండి: క్రైమ్ షోల ఎఫెక్ట్.. కుటుంబాన్ని గొడ్డలితో నరికి చంపిన బాలుడు -
షిండేకు పదవీ గండం.. ఏ క్షణమైనా మహారాష్ట్రకు కొత్త సీఎం?
ముంబై: ఎంతో నమ్మకంగా సుదీర్ఘకాలం కొనసాగిన పార్టీలోనే తిరుగుబాటు చేసి మహారాష్ట్ర రాజకీయాల్లో సంచలనానికి తెరతీశారు ఏక్నాథ్ షిండే. బీజేపీతో చేతులు కలిపి ముఖ్యమంత్రి పదవి చేపట్టారు. ఇప్పటికీ రాష్ట్రంలో రాజకీయ వేడి కొనసాగుతూనే ఉంది. అయితే.. తాజాగా ఏక్నాథ్ షిండే వర్గంలోనే చీలకలు వచ్చేలా కనిపిస్తున్నాయి. దీంతో ముఖ్యమంత్రి పదవికి ఎసరు వచ్చేలా ఉందనే వాదనలు వినిపిస్తున్నాయి. షిండే వర్గంలోని 22 మంది ఎమ్మెల్యేలు ఆయనపై అసంతృప్తితో ఉన్నట్లు ఉద్ధవ్ థాక్రే వర్గం శివసేన.. తన అధికారిక పత్రిక సామ్నాలో ఈ మేరకు వెల్లడించింది. ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన వర్గంలోని 40 మందిలో 22 మంది ఎమ్మెల్యేలు బీజేపీలో చేరనున్నట్లు పేర్కొంది సామ్నా. ఏక్నాథ్ షిండేను బీజేపీ తాత్కాలికంగా ఆ పదవిలో కూర్చోబెట్టిందని పేర్కొనటం గమనార్హం. ‘ఆయన ముఖ్యమంత్రి పదవి ఏ క్షణమైనా కోల్పోతారని ప్రతిఒక్కరికి అర్థమైంది. అంధేరీ ఈస్ట్ నియోజకవర్గం ఉప ఎన్నికల్లో షిండే వర్గం పోటీ చేయాలని భావించింది. కానీ, అందుకు బీజేపీ నిరాకరించింది. గ్రామ పంచాయతీ, సర్పంచ్ ఎన్నికల్లో విజయం సాధించామని షిండే వర్గం చెప్పటం పూర్తిగా తప్పు. 22 మంది ఎమ్మెల్యేలు అసంతృప్తితో ఉన్నారు. వారిలోని చాలా మంది బీజేపీతో కలిసేందుకు సిద్ధమవుతున్నారు. ’అని ఉద్ధవ్ థాక్రే వర్గం పేర్కొంది. ఏక్నాథ్ షిండే తనకు తాను, మహారాష్ట్రకు చాలా నష్టం చేశారని, రాష్ట్ర ప్రజలు వదిలిపెట్టరని పేర్కొంది శివసేన. షిండేను తమ స్వప్రయోజనాల కోసం బీజేపీ వినియోగించుకోవటం కొనసాగిస్తుందని తెలిపింది. బీజేపీ నాయకుడి వ్యాఖ్యలను ఉద్ఘాటించింది. ప్రభుత్వం 40 మంది ఎమ్మెల్యేలతో నడుస్తోందని, వారంతా సీఎంఓ నియంత్రణలో ఉన్నారని పేర్కొంది. నిర్ణయాలన్నింటిని ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తీసుకుంటున్నారని, ఆ నిర్ణయాలను షిండే ప్రకటిస్తున్నారని ఆరోపించింది. ఇదీ చదవండి: పెళ్లైన మరుసటి రోజే డబ్బు, నగలతో వధువు పరార్.. వరుడికి ఫోన్ చేసి..! -
థాక్రేకు మరో షాక్.. షిండే వర్గంలోకి 12 మంది ఎంపీలు!
ముంబై: మహారాష్ట్రలో ఉద్ధవ్ థాక్రే వర్గానికి ఎదురుదెబ్బలు తగులుతూనే ఉన్నాయి. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని రెబల్ వర్గంలోకి వలసలు కొనసాగుతున్నాయి. ఉద్ధవ్ థాక్రేను కాదని పలువురు శివసేన ఎంపీలు సైతం రెబల్ వర్గంలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారు. పది మందికిపైగా శివసేన ఎంపీలు ఎక్నాథ్ షిండేతో టచ్‌లో ఉన్నట్లు సమాచారం. వారు లోక్‌సభలో ప్రత్యేక గ్రూప్‌ను ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. మహారాష్ట్ర మంత్రివర్గ విస్తరణపై దిల్లీ పెద్దలతో ఎక్నాథ్ షిండే చర్చలు చేపట్టిన క్రమంలోనే ఈ పరిణామాలు చోటు చేసుకోవటం ప్రాధాన్యం సంతరించుకుంది. స్పీకర్‌కు లేఖ.. ముంబయి సౌత్ సెంట్రల్ ఎంపీ రాహుల్ షేవాలే నేతృత్వంలో ప్రత్యేక శివసేన బృందం ఏర్పాటు చేయాలంటూ సోమవారం రాత్రి లోక్‌సభ స్పీకర్‌కు లేఖ రాశారు పలువురు ఎంపీలు. ఆ బృందం చీఫ్ విఫ్‌ను సైతం నియమించింది. ఆ బాధ్యతలను యావత్మాల్ ఎంపీ భవన గావ్లీ చేపట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇటీవలే ఆమెను చీఫ్ విప్ పదవి నుంచి తొలగించారు ఉద్ధవ్ థాక్రే. అయితే.. స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. లోక్‌సభలో శివసేనకు 19 మంది ఎంపీలు ఉండగా.. మహారాష్ట్రలోనే 18 మంది ఉన్నారు. ఏక్నాథ్ షిండేతో సోమవారం వర్చువల్ సమావేశానికి సుమారు 12 మంది ఎంపీలు హాజరైనట్లు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. ఏక్నాథ్ షిండేకు మద్దతు తెలిపినట్లు పేర్కొన్నాయి. అదే సమయంలో 12 మంది ఎంపీలకు ‘వై’ కేటగిరీ సెక్యూరిటీ కల్పించనున్నట్లు తెలుస్తోంది. తమని ప్రత్యేక బృందంగా స్పీకర్ గుర్తించిన తర్వాత.. శివసేన గుర్తును తమకే కేటాయించాలని కోరనున్నట్లు సమాచారం. గత వారం పార్టీ ఎంపీలతో సమావేశమైన ఉద్ధవ్ థాక్రే.. తమ భాగస్వామ్య పార్టీలతో సంబంధాలు తెంచుకుని ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపతి ముర్మూకు మద్దతు ప్రకటించారు. దీంతో థాక్రేపై విమర్శలు గుప్పించాయి విపక్షాలు. థాక్రే బంధీఅయ్యారని, ఆయనకు ఎంపీల డిమాండ్‌ను అంగీకరించటం తప్ప ఎలాంటి అవకాశం లేదని ఆరోపించాయి. మరోవైపు.. పలు కేసులపై సుప్రీం కోర్టు తీర్పు కోసం ఇరు వర్గాలు వేచి ఉన్నాయి. ఇదీ చదవండి: Uddhav Thackeray: ఉద్ధవ్ థాక్రేకు ఊహించని షాక్.. ‘మహా’ పాలిటిక్స్‌లో మరో ట్విస్ట్ -
మహారాష్ట్ర అసెంబ్లీలో బలపరీక్ష.. ఏక్నాథ్ షిండే ప్లాన్ ఇదే!
ముంబై: మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం మొదలైనప్పటి నుంచి ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. శివసేన తిరుగుబాటు ఎమ్మెల్యేలు ప్రస్తుతం గోవాలో ఉన్న విషయం తెలిసిందే. తాజాగా గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీ మహా వికాస్ అఘాడీ కూటమిని అసెంబ్లీలో బలం నిరూపించుకోవాలని ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేకు సూచించారు. దీంతో ఏక్నాథ్ షిండే బృందం ముంబైకి వెళ్లేందుకు సిద్ధమైంది. అయితే నేరుగా కాకుండా గౌహతి నుంచి గోవా వెళ్లి అక్కడి నుంచి ముంబైకు చేరి నేరుగా అసెంబ్లీకి చేరుకోవాలని ఏక్నాథ్ షిండే బృందం నిర్ణయించింది. రూట్ మ్యాప్ ఈ మేరకు షిండే వర్గం రూట్ మ్యాప్ ఖరారు చేసుకున్నట్లు సమాచారం. షిండే ముంబై ఎయిర్‌పోర్ట్‌లో దిగిన తర్వాత నేరుగా అసెంబ్లీకి వెళ్లేలా ప్లాన్ సిద్దం చేశారు. అయితే గౌహతి నుంచి ముంబైకి విమానంలో వెళ్లేందుకు మూడు గంటల సమయం పడుతుంది. ఈ నేపథ్యంలో ఆలస్యంగా అసెంబ్లీకి చేరుకోకూడదని షిండే వర్గం భావిస్తోంది. అందుకే ఈ విధంగా రూట్ మ్యాప్ ఖరారు చేసుకున్నారు. దీంతో షిండే వర్గం గౌహతి నుంచి మరో బీజేపీ పాలిత రాష్ట్రమైన గోవాకు బుధవారం మకాం మార్చి అక్కడే బుధవారం రాత్రి ఓ హోటల్లో బస చేయనున్నారు. అనంతరం గురువారం ఉదయం ప్రత్యేక విమానంలో గోవా నుంచి బయలుదేరి ముంబైకి పయనమవుతారు. ఇదిలా ఉండగా గవర్నర్ బలపరీక్షను ఎదుర్కోవాలన్న ఆదేశాన్ని శివసేన సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. ఈ పిటిషన్‌పై బుధవారం సాయంత్రం 5 గంటలకు విచారణ జరగనుంది. ఈ నేపథ్యంలో ఏక్నాథ్ షిండే వర్గం ముంబైకి తిరిగి వచ్చే ప్లాన్ అత్యున్నత న్యాయస్థానం ఉత్తర్వులపై ఆధారపడి ఉంటుంది. చదవండి: maharashtra Political Crisis: ఉత్కంఠ రేపుతోన్న మహారాష్ట్ర రాజకీయాలు.. ఏం జరగవచ్చు? -
చివరి శ్వాస వరకు మోదీ స్నేహాన్ని గౌరవించారు, కానీ ఆయన మాత్రం..
ముంబై: మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం రోజురోజుకు తీవ్రమవుతున్న సంగతి తెలసిందే. ఇక ఈ రాజకీయ పోరులో విజయం కోసం ఒకరిపై మరొకరు తీవ్రమైన వ్యాఖ్యలు కూడా చేసుకుంటున్నారు. తాజాగా శివసేన ఎంపీ, మాజీ కేంద్ర మంత్రి అరవింద్ సావంత్ ప్రధాని నరేంద్ర మోదీపై విరుచుకుపడ్డారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శివసేనను అంతం చేయడానికి కుట్ర పన్నడం ద్వారా బాలాసాహెబ్ (బాల్ ఠాక్రే)కు ద్రోహం చేశారని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం తిరుగుబాటు చేస్తున్న ఎమ్మెల్యేలకు వారు కూడా బాలాసాహెబ్‌కు ద్రోహం చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత పరిణామాలకు భారతీయ జనతా పార్టీ (బీజేపీ)నే కారణమని శివసేనలో అందరూ భావిస్తున్నారని, అది నిజమైనా ఆశ్చర్యపోనక్కర్లేదని సావంత్ అన్నారు. ‘‘2002 గుజరాత్ అల్లర్ల తర్వాత అప్పటి ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి మోదీని ముఖ్యమంత్రిగా బర్తరఫ్ చేయాలని నిర్ణయించుకున్నారు. కానీ బాలాసాహెబ్ వాజ్‌పేయిని అలా చేయవద్దని ఒప్పించారు. 'అగర్ మోడీ గయా, పార్టీ గయీ.' (మోడీ పోతే, బీజేపీగుజరాత్‌ను కోల్పోతుంది) అని వాజ్‌పేయికి నచ్చజెప్పారు. బాలాసాహెబ్ తన చివరి శ్వాస వరకు మోదీ స్నేహాన్ని గౌరవించారు, కానీ మోదీ మాత్రం బాలాసాహెబ్‌ని మోసం చేశారని’’ సావంత్ అన్నారు. ప్రధాని కేబినెట్లో భారీ పరిశ్రమలు, పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్‌కు కేంద్ర మంత్రిగా పనిచేసిన సావంత్, 2019లో సేన-బీజేపీ పొత్తు ముగిసిన తర్వాత తన పదవికి రాజీనామా చేశారు. చదవండి: Maharashtra: వారం గడిచినా అదే ఉద్రిక్తత.. షిండే వర్గంలోని ఎమ్మెల్యేలు ముంబై వస్తే? -
రెబెల్స్ ఎమ్మెల్యేలకు సీఎం ఉద్దవ్ భావోద్వేగ లేఖ!
ముంబై: మహారాష్ట్రలో మొదలైన రాజకీయ సంక్షోభం రోజుకో రకంగా మలుపు తిరుగుతోంది. ఈ పోరులో అంతిమ విజయం కోసం ఇరు వర్గాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. తాజాగా సీఎం ఉద్ధవ్ ఠాక్రే తిరుగుబాటు ఎమ్మెల్యేలను రప్పించేందుకు చివరి ప్రయత్నంగా వారికి భావోద్వేగంగా లేఖ రాశారు. అందులో రెబెల్ ఎమ్మెల్యేలు తిరిగి ముంబైకి వచ్చేయాలని విజ్ఞప్తి చేశారు. ఆ లేఖలో ఏముందంటే.. రెబెల్ ఎమ్మెల్యేలకు రాసిన లేఖలో.. “మీరు తిరుగుబాటు చేసినా, ఇప్పటికీ మీరంతా శివసేనతోనే ఉన్నారు. మీలో చాలా మంది మాతో ఇంకా టచ్‌లో ఉన్నారు. మీ గ్రూప్‌లోని కొంతమంది ఎమ్మెల్యేల కుటుంబ సభ్యులు కూడా మమ్మల్ని సంప్రదించి వారి అభిప్రాయాలను మాకు తెలియజేసారు' అని ఉద్దవ్ లేఖలో పేర్కొన్నారు. రెబెల్ ఎమ్మెల్యేలను శివసేన వదులుకోలేదని, వారంతా ముంబై వచ్చి తనతో మాట్లాడాలని రెబెల్స్‌కు లేఖ ద్వారా ఠాక్రే సందేశం పంపారు. ‘మీకు సమస్య ఉంటే చర్చలతో పరిష్కరించుకుందాం తప్ప ఇది సరైన దారి కాదు. గత కొద్ది రోజులుగా గౌహతిలో ఉంటున్న రెబెల్ ఎమ్మెల్యేల గురించి రోజుకో కొత్త సమాచారం బయటకు వస్తోంది. శివసేన కుటుంబ అధినేతగా నేను మీ మనోభావాలను గౌరవిస్తాను, ముందుగా ఈ గందరగోళం నుంచి బయటపడండి. మిమ్మల్ని కొందరు తప్పుదోవ పట్టిస్తున్నారు, దాని నుంచి బయటపడాలని’ ఠాక్రే ఆ లేఖలో సూచించారు. Maharashtra CM & Shiv Sena chief Uddhav Thackeray appeals to party MLAs in Guwahati, to come & discuss; said "Many of you are in touch with us, you're still in Shiv Sena at heart; family members of some MLAs have also contacted me & conveyed their sentiments to me..." (file pic) pic.twitter.com/6pfhtQs7Go — ANI (@ANI) June 28, 2022 చదవండి: ఢిల్లీకి మారిన మహారాష్ట్ర రాజకీయాలు.. -
రెబల్స్ మంత్రులకు షాక్.. సీఎం ఉద్దవ్ ఠాక్రే సంచలన నిర్ణయం!
ముంబై: మహారాష్ట్రలో శివసేన ఎమ్మెల్యేల తిరుగుబాటుతో మొదలైన రాజకీయ సంక్షోభం రసవత్తర మలుపులు తిరుగుతోంది. తాజాగా శివసేన చీఫ్, సీఎం ఉద్ధవ్ ఠాక్రే సోమవారం కీలక నిర్ణయం తీసుకున్నారు. శివసేన రెబల్స్‌పై కొరడా ఝళిపించేందుకు సిద్ధమై.. 9 మంది రెబల్స్ మంత్రులను వారి శాఖల నుంచి తొలగించారు. అందులో ఐదుగురు కేబినెట్, నలుగురు సహాయ మంత్రుల మంత్రిత్వశాఖలను వేరేవారికి అప్పగించారు. రాష్ట్రంలో పరిపాలనా పరంగా ఎలాంటి ఆటంకాలు, ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండడంతో పాటు ఆయా శాఖల ఆధ్వర్యంలో కొనసాగుతున్న పనుల్లో జాప్యం జరగకూడదని ఉద్దేశ్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీఎంఓ కార్యాలయం ప్రకటించింది. ఎవరి శాఖలు... ఎవరికి.. రెబల్స్ గ్రూపు నాయకత్వం వహిస్తున్న ఏక్నాథ్ షిండే మంత్రిగా ఉన్న పట్టణాభివృద్ధి, పబ్లిక్ వర్క్స్ మంత్రిత్వ శాఖలను మంత్రి సుభాష్ దేశాయ్‌కు అప్పగించారు. మరో రెబల్ మంత్రి గులాబ్రావ్ పాటిల్ వద్ద ఉన్న నీటి సరఫరా, పారిశుద్ధ్యం శాఖల బాధ్యతలను మంత్రి అనిల్ పరబ్‌కు అప్పగించారు. అలాగే మంత్రి ఉదయ్ సావంత్ వద్ద ఉన్న ఉన్నత విద్య, సాంకేతిక విద్యా శాఖలను మంత్రి ఆదిత్య ఠాక్రేకు అప్పగించారు. మంత్రి దాదాజీ భూసే వద్ద ఉన్న వ్యవసాయం, మాజీ సైనికుల సంక్షేమ శాఖలు, రెబల్ మంత్రి సందీపన్ భూమారే వద్ద ఉన్న ఉపాధి హామీ, ఉద్యానవన శాఖలను మంత్రి శంకర్ గడఖ్‌కు కేటాయించారు. శంభురాజ్ దేశాయ్ వద్ద ఉన్న మూడు పోర్ట్‌ఫోలియోలను సంజయ్ బన్సోడే, సతేజ్ పాటిల్, విశ్వజిత్ కదమ్‌లకు అప్పగించారు. రాజేంద్ర పాటిల్ మంత్రిగా ఉన్న నాలుగు మంత్రిత్వ శాఖలు విశ్వజీత్ కదమ్, ప్రజక్త్ తాన్పురే, సతేజ్ పాటిల్, అదితి తత్కరేలకు కేటాయించారు. అబ్దుల్ సత్తార్‌తో ఉన్న మూడు పోర్ట్‌ఫోలియోలు ప్రస్తుతం ప్రజక్త్ తాన్పురే, సతేజ్ పాటిల్, అదితి తత్కరే వద్ద ఉన్నాయి. రెబల్ మంత్రి ఓంప్రకాష్ కుడు వద్ద ఉన్న నాలుగు పోర్ట్‌ఫోలియోలను మంత్రులు అదితి తత్కరే, సతేజ్ పాటిల్, సంజయ్ బన్సోడే, దత్తాత్రయ్ భర్నేలకు అప్పగించారు. మరోవైపు ఎంఎన్ఎస్ చీఫ్ రాజ్‌ఠాక్రేకు ఏక్నాథ్ షిండే ఫోన్ చేశారు. ఈ నేపథ్యంలో ఎంఎన్ఎస్ కీలక నేతలతో రాజ్ ఠాక్రే భేటీ అయ్యారు. చదవండి: Maharashtra Poliical Crisis: శివసేన రెబల్ ఎమ్మెల్యేల పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ . -
‘మహా’ ట్విస్ట్: పోలీస్ శాఖతో గవర్నర్ చర్చలు.. రాష్ట్రపతి పాలన తప్పదా?
ముంబై: మహారాష్ట్రలో శివసేన నేత ఏక్నాథ్ షిండే తిరుగుబాటుతో మొదలైన పొలిటికల్ డ్రామా రోజుకో మలుపు తిరుగుతోంది. అయితే ఎమ్మెల్యేల తిరుగుబాటు చేసినప్పటికీ సీఎం ఉద్దవ్ థాక్రే ఈ పోరులో గెలుపు తమదేనని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఏక్నాథ్ షిండే బృందం అసలైన బాల్‌ఠాక్రే వారసులం తామేనని ప్రకటించుకున్నారు. మరో వైపు శివసేన కార్యకర్తలు తిరుగుబాటు ఎమ్మెల్యేలపై ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తూ వారి ఆఫీసులపై దాడులు జరిపిన సంగతి తెలిసిందే. ఈ పరిణామాల దృష్ట్యా రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపు తప్పే అవకాశాలు లేకపోలేదు. ప్రస్తుతం మహారాష్ట్ర పోలీస్ చీఫ్.. సీఎం ఉద్దవ్ ఠాక్రే ఆదేశాలు పాటిస్తున్నారు. ఈ తరుణంలో బలనిరూపణకై రెబల్ ఎమ్మెల్యేలు ముంబైలో అడుగుపెట్టినా వారిపై శివసేన కార్యకర్తల దాడి జరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ పరిస్థితుల కారణంగా మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలనను విధించే యోచనలో గవర్నర్ ఉన్నట్లు సమాచారం. గవర్నర్ కూడా ఓ వైపు ఎలాంటి అలజడులు లేకుండా పోలీస్ శాఖతో చర్చలు జరుపుతూనే మరోవైపు కేంద్రంతో ఎప్పటికప్పుడు ముంబైలోని పరిస్థితులను వివరిస్తున్నారు. అయితే ఈ అంశంపై కేంద్రంతో పూర్తి స్థాయి చర్చించిన తర్వాత గవర్నర్ నిర్ణయం తీసుకుంటారు. ఇదిలా ఉండగా ఎంపీ నవనీత్ కౌర్ రానా మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధించాలని కేంద్ర హోంమంత్రి అమిత్‌షాను కోరడం గమనార్షం. శివ సైనికుల గూండాయిజంతో రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపుతప్పేలా ఉన్నాయని ఆమె వ్యాఖ్యానించారు. మరో వైపు సీఎం ఉద్ధవ్ థాక్రే భార్య.. రష్మీ థాక్రే రాజకీయ చదరంగంలోకి దిగారు. శివసేనకు చెందిన రెబల్ ఎమ్మెల్యే సతీమణీల ఇళ్లకు వెళ్తూ.. తమ భర్తలతో మాట్లాడి ప్రభుత్వానికి మద్దతు ఇచ్చేలా ఒప్పించాలని వారిని కోరుతున్నారు. చదవండి: మహారాష్ట్రలో ఊహించని మరో ట్విస్ట్.. రంగంలోకి దిగిన రష్మీ థాక్రే -
‘మహా’ సంక్షోభం: ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన ఆదిత్య ఠాక్రే
న్యూఢిల్లీ: మహారాష్ట్రలో శివసేన నేతృత్వంలోని మహా వికాస్ అఘాడి ప్రభుత్వం ప్రస్తుతం పతనం అంచుల్లో ఉందన్న సంగతి తెలిసిందే. ఆ పార్టీ నేత ఏక్నాథ్ షిండే తిరుగుబాటుతో అక్కడ రాజకీయ సంక్షోభం మొదలైంది. ఎవరికి వారు ఈ పోరులో గెలుపొందాలని తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ చివరికి విజయం ఎవరిని వరిస్తుందో వేచి చూడాల్సిందే. ఇదిలా ఉండగా శివసేన మంత్రి ఆదిత్య థాకరే పార్టీ నేతలతో సమావేశమయ్యారు. అనంతరం కార్యకర్తలను ఉద్దేశించి మీడియాతో మాట్లాడుతూ.. ఇది సత్యానికి, అబద్ధానికి మధ్య జరిగే యుద్ధం అని వ్యాఖ్యానించారు. ప్రస్తుత పరిణామాలపై జరిపిన సమావేశంలో ఏమి చర్చించారో మీకందరికీ ఇప్పటికే తెలుసు, అందులో ముఖ్యమైన విషయం ఏమిటంటే శివసేన తిరుగుబాటు ఎమ్మెల్యేలు చేసిన ద్రోహాన్ని మాతో పాటు పార్టీ కూడా ఎప్పటికీ మరచిపోదని చెప్పారు. ప్రస్తుత పోరులో తాము ఖచ్చితంగా గెలుస్తామని ఆదిత్య ఠాక్రే చెప్పారు. దీంతో పాటు రెబెల్ గ్రూపునకు నేతృత్వం వహిస్తున్న ఏక్నాథ్ షిండేకు శివసేన షాకిచ్చింది. పార్టీ పేరును, వ్యవస్ధాపకులు బాలాసాహెబ్ ఠాక్రే పేరును ఇతరులెవరూ వాడకూడదని సేన జాతీయ కార్యవర్గ సమావేశం తీర్మానించింది. ఇక ఎంవీఏ సర్కార్ సభలో మెజారిటీ నిరూపించుకోవాలని కేంద్ర మంత్రి, రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (ఆర్పీఐ) చీఫ్ రాందాస్ అథవలే శనివారం సవాల్ విసిరారు. చదవండి: ఆ పంచాయితీలో తలదూర్చం.. అలాగని చూస్తూ ఊరుకోం! శివ సైనికులకు ఒకటే వార్నింగ్! -
‘మహా’ సంక్షోభం: షిండేపై ఉద్ధవ్ ఠాక్రే సంచలన వ్యాఖ్యలు
ముంబై: మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం మొదలై రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ క్రమంలో సీఎం ఉద్దవ్ ఠాక్రే శివసేన నేతలతో శుక్రవారం భేటీ అయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. విశ్వాసపాత్రులమని చెప్పి కొందరు నమ్మక ద్రోహం చేశారని ప్రజలే వారికి తగిన బుద్ధి చెప్తారని అన్నారు. పార్టీకి వ్యతిరేకరంగా మారిన రెబల్స్ డబ్బుల కోసం అమ్మడుపోయారని ఆరోపించారు. తాను శస్త్రచికిత్స కోసం ఆసుపత్రిలో ఉన్నప్పుడు (గత నవంబర్‌లో) కొందరు శివసేన ఎమ్మెల్యేలు తనకు ద్రోహం చేసేందుకు ప్లాన్ చేశారని ఉద్ధవ్ ఆరోపించారు. ప్రస్తుతం తనపై పలు ఆరోపణలు చేస్తున్న ఏక్నాథ్ షిండే కోసం తాను అన్నీ చేశానని ఉద్ధవ్ తెలిపారు. ‘ఏక్నాథ్ షిండే కుమారుడు శివసేనకు చెందిన ఎంపీ, నేను అతని కోసం అన్నీ చేశాను. నాకు ఉన్న శాఖను కూడా షిండేకు కేటాయించారు. అయినప్పటికీ ఏం ఆశించి షిండే నాపై అనేక ఆరోపణలు చేస్తున్నాడో తెలియడం లేదని’ అన్నారు. బాలాసాహెబ్ తనని ప్రేమించిన దానికంటే శివసేననే ఎక్కువగా ప్రేమించేవాడని ఉద్ధవ్ పార్టీ కార్యకర్తలని ఉద్దేశించి అన్నారు. తాను అసమర్ధుడినని కార్యకర్తలు అనుకుంటే, పదవిపై తనకు వ్యామోహం లేదని శివసేన పార్టీని కార్యకర్తలే ముందుకు నడిపించవచ్చని అయన చెప్పారు. మరో వైపు శుక్రవారం సాయంత్రం మాతోశ్రీ (ఠాక్రే నివాసం)లో ఎన్సీపీ నాయకులు సీఎం ఉద్ధవ్ ఠాక్రేను కలవనున్నారు. -
శివసేన కార్యకర్తల ఆగ్రహం.. కోడిగుడ్లతో రోడ్లపైకి వచ్చి..
ముంబై: మహారాష్ట్రలో పాలక మహా వికాస్ అఘాడీ (ఎంవీఏ) సంకీర్ణానికి సారథ్యం వహిస్తున్న శివసేనలో కీలక నేత అయిన షిండే తిరుగుబాటుతో ఆ రాష్ట్రంలో రాజకీయ సంక్షోభం మొదలైన సంగతి తెలిసిందే. దీంతో తిరుగుబాటు నేత ఏక్నాథ్ షిండేపై ఆ పార్టీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో పలు చోట్ల నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. షిండేకు వ్యతిరేకంగా జరిగిన తాజా నిరసనలో నాసిక్‌లో కొందరు శివసేన కార్యకర్తలు అతని పోస్టర్‌పై ఇంక్ చల్లడంతో పాటు కోడిగుడ్లు విసిరి నిరసనను తెలిపారు. మహారాష్ట్రలో ఇలాంటి ఘటన జరగడం ఇదే మొదటిసారి కాదు. రెబల్ పార్టీ నేత ఏక్నాథ్ షిండేతో కలిసి గౌహతి క్యాంప్‌లో ఉన్న తిరుగుబాటు ఎమ్మెల్యే సదా సర్వాంకర్ పోస్టర్‌పై ‘మోసగాడు’ అని రాసి శివసేన కార్యకర్తలు తమ నిరసనను తెలిపారు. ఈ ఘటన ఆయన సొంత నియోజకవర్గం మహిమ్లో చోటు చేసుకుంది. పార్టీ శాసనసభ్యులు ఏకనాథ్ షిండే నేతృత్వంలోని తిరుగుబాటులో చేరిన తర్వాత మహారాష్ట్రలోని మహా వికాస్ అఘాడి(ఎంవీఏ) ప్రభుత్వంలో రాజకీయ సంక్షోభం చెలరేగింది. షిండే శిబిరానికి ప్రస్తుతం 50 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని, వీరిలో కొందరు స్వతంత్ర ఎమ్మెల్యేలు ఉన్నారని సమాచారం. #WATCH Shiv Sena supporters throw black ink and eggs at a poster showing a picture of rebel MLA Eknath Shinde, also raise slogans against him, in Nashik pic.twitter.com/DUtKE2R2S5 — ANI (@ANI) June 24, 2022 చదవండి: Maharashtra political crisis: షిండే తొలగింపు చెల్లుతుంది! -
ఆదిత్య ఠాక్రే సన్నిహితులపై ఐటీ దాడులు
ముంబై: మహారాష్ట్ర మంత్రి, శివసేన అధినేత ఉద్దవ్ కుమారుడు ఆదిత్య ఠాక్రే సన్నిహితులపై ఆదాయపన్ను శాఖ పలు దాడులు నిర్వహించింది. బెంగాల్, ఏపీలోలాగా తమను వ్యతిరేకించేవారిని కేంద్రం లక్ష్యంగా చేసుకొని దాడులు జరిపిస్తోందని ఆదిత్య విమర్శించారు. పార్టీ ఆఫీస్ బేరర్, షిర్డీ ట్రస్ట్ సభ్యుడు రాహుల్ కనాల్, కేబుల్ ఆపరేటర్ సదానంద్ కదమ్, బజరంగ్ ఖర్మాటే నివాసాలపై ఐటీ శాఖ మంగళవారం దాడులు నిర్వహించింది. వీరిలో రాహుల్ ఆదిత్యకు, మిగిలిన ఇద్దరు శివసేన మంత్రి అనీల్పరాబ్కు సన్నిహితులు. ముంబై కార్పొరేషన్ ఎన్నికలయ్యేవరకు ఇలాంటి దాడులు జరుగుతూనే ఉంటాయని సేన నేత సంజయ్‌రౌత్ కేంద్రంపై విమర్శలు సంధించారు. రాష్ట్రాలపై ఒత్తిడి పెంచేందుకే కేంద్రం ఈ చర్యలకు పాల్పడుతోందన్నారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 14మంది ప్రముఖులపై దాడులు జరిగాయని, వీరిలో ఎవరూ బీజేపీకి చెందరని చెప్పారు. తాము బీజేపీకి చెందిన పలువురి పేర్లను ఐటీ, ఈడీలకు పంపామని, కానీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని విమర్శించారు. (చదవండి: ఈవీఎం మిషన్ల దొంగతనం...ట్రక్కుల్లో తరలింపు) -
‘శివసేన అలాంటి పార్టీ కాదు.. వారిలా హామీలివ్వదు’
ముంబై: ఎన్నికల సమయంలో కొన్ని పార్టీలు ప్రజల(ఓటర్లు)కు ఆచరణ సాధ్యంకాని వాగ్దానాలు ఇస్తాయని బీజేపీని ఉద్దేశించి మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అటువంటి వాగ్దానాలు చేసే పార్టీ శివసేన కాదని స్పష్టం చేశారు. ఎన్నికల సయయంలో కొంతమంది నాయకులు ప్రజలకు ఆచరణ సాధ్యంకాని హామీలు ఇస్తారని, అధికారంలోకి వచ్చాక వాటిని మర్చిపోతారని దుయ్యబట్టారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని ప్రజలు నిలదీసినప్పుడు ఆ నాయకులు అసలు హామీలే ఇవ్వలేదని జారుకుంటారని ఎద్దేవా చేశారు. శివసేవ అటువంటి పార్టీ కాదని, నెరవేర్చలేని హామీల ఎట్టిపరిస్థితుల్లో ఇవ్వదని పేర్కొన్నారు. అదేవిధంగా రాష్ట్రంలో కరోనా వైరస్ పరిస్థితులపై ప్రజలు ఆందోళన చెందవల్సిన అవసరం లేదని చెప్పారు. కరోనా పరిస్థితులను ఎదుర్కొనే సామర్థాన్ని కలిగి ఉన్నామని పేర్కొన్నారు. అయితే ప్రజలంతా కరోనా నియంత్రణకు సహకరించాలని సీఎం ఉద్ధవ్ ఠాక్రే విజ్ఞప్తి చేశారు. -
రాహుల్ ట్విటర్లో మాత్రమే యాక్టివ్‌గా ఉంటారు: శివసేన
ముంబై: మహారాష్ట్రలో కాంగ్రెస్, శివసేన, ఎన్సీపీతో కూడిన మహావికాస్ అఘడి కూటమి సర్కార్‌లో విభేదాలున్నట్లు ప్రచారం జోరుగా సాగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై శివసేన విమర్శలు చేయడం ఆ రాష్ట్ర రాజకీయాలలో ఆసక్తిగా మారింది. రాహుల్ గాంధీ ట్విట్టర్లో మాత్రమే యాక్టివ్‌గా ఉంటున్నారంటూ శివసేన అధికార పత్రిక సామ్నాలో ఎద్దేవా చేసింది. ఇక మోదీ ప్రభుత్వం తప్పులను ఎత్తి చూపడంలో ముందున్నప్పటికీ, అది కేవలం ట్విట్టర్‌కు మాత్రమే పరిమితమైందని అందులో ధ్వజమెత్తారు. మోదీ సర్కారుకు వ్యతిరేకంగా ప్రతిపక్షాలను ఏకభిప్రాయం తీసుకురావడంలో రాహుల్ విఫలమయ్యారని రాసుకొచ్చింది. అదే సమయంలో విపక్షాలను ఏకం చేయడంలో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) అధినేత శరద్ పవార్ విజయం ప్రశంసలు కురిపించింది. శరద్ పవార్ మాదిరిగా రాహుల్ గాంధీ కూడా ప్రతిపక్షాలను ఏకతాటిపైకి తెచ్చి ఉంటే ఆ ప్రతిపక్షం బలంగా ఉండి ఉండేదని వివరించింది. మరోవైపు మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో తాము ఒంటరిగా పోటీ చేస్తామని కాంగ్రెస్ రాష్ట్ర శాఖ చీఫ్ నానా పటోలె వ్యాఖ్యలపై శివసేన ఎంపీ సంజయ్ రౌత్ ధీటుగా స్పందించారు. ఈ పరిణామాలను చూస్తుంటే విభేదాలున్నట్లు వస్తున్న వార్తలకు బలం చేకూర్చేలా ఉన్నట్లు తెలుస్తోంది. చదవండి: సూరత్ కోర్టుకు హాజరైన రాహుల్ -
‘మూడు రోజుల ప్రభుత్వానికి మొదటి వర్ధంతి’
ముంబై : మహారాష్ట్రలో ‘మూడు రోజుల బీజేపీ ప్రభుత్వం’ కుప్పకూలి నేటికి ఏడాది గడిచిందని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ గుర్తుచేశారు. నేటితో మొదటి వర్ధంతి పూర్తిచేసుకుందని ఎద్దేవా చేశారు. గత ఏడాది నవంబర్ 23న మాజీ బీజేపీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ నాటకీయ పరిణామాల మధ్య ఎన్సీపీ నేత అజిత్ పవార్ మద్దతుతో రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఫడ్నవిస్ ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. ఫడ్నవిస్‌కు మద్దతు పలికిన అజిత్ పవార్ డిప్యూటీ సీఎంగా ఎన్నికైయ్యారు. అయితే ప్రభుత్వ ఏర్పాటుకు సరైన సంఖ్యాబలం లేకపోవడంతో మూడు రోజులకే ఫడ్నవిస్ రాజీనామా చేశారు. సీఎంగా ప్రమాణం చేసిన ఫడ్నవిస్ కేవలం 80 గంటల్లోనే రాజీనామా సమర్పించారు. చదవండి: ముంబై కార్పొరేషన్ ఎన్నికలకు ఎన్సీపీ సన్నద్దం? దీనిపై సోమవారం సంజయ్ రౌత్ మాట్లాడుతూ.. మహా వికాస్ అఘాడీ ప్రభుత్వం పూర్తికాలం రాష్ట్రంలో పాలన కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. ‘మా ప్రభుత్వం మరో నాలుగు ఏళ్లు విజయవంతంగా పాలన పూర్తి చేస్తుంది. ప్రభుత్వాన్ని అస్థిరపరచడానికి బీజేపీ విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. అయినప్పటికీ ప్రతిపక్ష నాయకులు విఫలమవడంతో వారు తీవ్ర నిరాశలో ఉన్నారు. మహారాష్ట్ర ప్రజలు ప్రభుత్వానికి మద్దతుగా ఉన్నారని వారికి బాగా తెలుస్తోంది’ అని ఆయన అన్నారు. మరోవైపు బీజేపీ నేత, కేంద్రమంత్రి రావ్ సాహెబ్ ఇటీవల మాట్లాడుతూ.. మరో రెండు, మూడు నెలల్లో మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుందని సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఇదే విషయాన్ని మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ కూడా ప్రస్తావిస్తూ.. శివసేన నేతృత్వంలోని ప్రభుత్వం పడిపోతుందని, వెంటనే బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుంది జోస్యం చెప్పారు. చదవండి: 'పాక్, బంగ్లాదేశ్‌లను భారత్‌లో కలపాలి' కాగా గత ఏడాది అనేక ఉత్కంఠ పరిణామాల నడుమ శివసేన నేతృత్వంలో కాంగ్రెస్, ఎన్సీపీ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. బీజేపీతో చేతులు కలిపిన అజిత్ పవార్.. తిరగి ఎన్సీపీలోకి రావటంతో నవంబర్ 28న ఉద్ధవ్ ఠాక్రే సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. అదే విధంగా ఎన్సీపీ నేత అజిత్ పవార్ డీప్యూటీ సీఎంగా ఎన్నికయ్యారు. 2019లో హోరాహోరీగా జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 105 స్థానాలు, శివసేన 56 స్థానాలు, ఎన్సీపీ 54 సీట్లు, కాంగ్రెస్ 44 స్థానాలు గెలుపొందిన విషయం తెలిసిందే. చదవండి: పవార్ వాఖ్యలను ఖండించిన యడియూరప్ప -
‘ప్రజలు మృతి చెందితే బాధ్యత వహిస్తారా’
ముంబై: దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తోంది. రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతోంది. ఈ క్రమంలో లాక్డౌన్ ఎత్తివేయటం, వ్యాపార సముదాయాలు, పరిశ్రమలు తెరవటంపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే స్పందించారు. శివసేన పత్రిక సామ్నాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టే ఆంక్షలను ఎత్తివేయటంలో తొందర పడకూడదని తెలిపారు. నేషనలిస్ట్ కాన్ఫరెన్స్ పార్టీ (ఎన్సీపీ) చీఫ్ శరద్ పవార్ ఇటీవల వ్యాపార సంస్థలు, పరిశ్రమలను తెరవడానికి అనుమతించాలని కోరిన విషయం తెలిసిందే. ప్రస్తుత సమయంలో కరోనా వైరస్‌ను అరికడుతు ఆర్థిక వ్యవస్థ, ప్రజల ఆరోగ్యాన్ని సమతుల్యం చెయాల్సిన అవసరం ఉందన్నారు. లాక్డౌన్ గురించి కొంతమంది వ్యక్తులు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. (సీఎం శివరాజ్‌సింగ్‌కు కరోనా పాజిటివ్) వారు కోరినట్టు అన్నింటిని తెరుస్తామని కానీ, దురదృష్టవశాత్తు లాక్డౌన్ ఎత్తివేయటంతో ప్రజలు మరణిస్తే దానికి వారు బాధ్యత వహిస్తారా అని ఉద్ధవ్ ప్రశ్నించారు. లాక్డౌన్ ఒకేసారి ఎత్తివేయటం వీలుకాదన్నారు. కానీ, క్రమక్రమంగా దానికి సంబంధించిన ఆంక్షలు ఎత్తివేస్తామని తెలిపారు. అన్ని ఆంక్షలు ఎత్తివేసిన తర్వాత మళ్లీ విధించే పరిస్థితులు ఎదురు కావద్దన్నారు. ఆర్థిక వ్యవస్థ గురించి మాత్రమే ఆలోచించటం సరికాదు. ప్రజల ఆరోగ్య పరిస్థితులను దృష్టిలో పెట్టుకోవాలని సీఎం ఉద్ధవ్ ఠాక్రే తెలిపారు. ఇప్పటివరకు మహారాష్ట్రలో 3,57,117 కరోనా వైరస్ కేసులు నమోదుకాగా, 1,99,967 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం 1,44,018 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇక వైరస్ కారణంగా 13,132 మంది మృతి చెందారు. -
భివండీలో శివసేన విస్తృత ప్రచారం
భివండీ, న్యూస్‌లైన్: భివండీలో శివసేన పార్టీ విస్తృతంగా ఎన్నికల ప్రచారం చేస్తోంది. 136-పడమర భివండీ నియోజక వర్గం నుంచి శివసేన అభ్యర్థిగా ఎన్నికల బరిలోకి దిగిన మనోజ్ కాటేకర్ ప్రచార జోరును పెంచారు. శివాజీ చౌక్‌లోగల శివాజీ మహరాజ్ విగ్రహానికి పూలమాల వేసి ప్రచార మహార్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో భారీ సంఖ్యలో మరాఠీలు, ఉత్తర భారతీయులు, గుజరాతీలు, ముస్లింలతోపాటు తెలుగు ప్రజలు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. శివాజీ చౌక్ నుంచి ప్రారంభమైన ర్యాలీ పాంజలాపూర్, మండాయి, తీన్‌బత్తి, కుంబార్‌వాడ, అజయ్‌నగర్ తదితర ప్రాంతాలగుండా సాగింది. ఈసారి ఎన్నికల్లో తనకు మద్దతు పలకాలని మనోజ్ కాటేకర్ కోరారు. 23 సంవత్సరాలుగా కార్పొరేటర్‌గా, ప్రస్తుతం డిప్యూటీ మేయర్‌గా సేవలందిస్తున్నాని గుర్తు చేశారు. పవర్లూమ్ కార్మికులకు సొంత ఇల్లు ఉండేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. మండాయిలో భాజీ మార్కెట్ ఏర్పాటు చేస్తానని, సీసీ రోడ్లు వేయిస్తానని, దొంగతనాలు అరికట్టేందుకు పట్టణ వ్యాప్తంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తానని, ప్రభుత్వ ఆసుపత్రి, వృద్ధుల కోసం విశ్రాంతి ఉధ్యానవనం, ప్రభుత్వ ఇంజనీరింగ్, మెడికల్ డిగ్రీ కళాశాల ఏర్పాటుకు కృషి చేస్తానని చెప్పారు. ఈ ర్యాలీలో పట్టణ మాజీ అధ్యక్షుడు మోహన్ వల్లాల్, కార్పొరేటర్లు కమ్లాకర్ పాటిల్, వందనా కాటేకర్, సుభాష్ మానే, బాలారామ్ చౌదరి, గుల్వీ, మధన్ బువ్వా, ఉప విభాగ అధ్యక్షుడు శ్రీరాం కుమార్, మనోజ్ చిల్కేవార్తోపాటు భారీ సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు.