
మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే
ముంబై: ఎన్నికల సమయంలో కొన్ని పార్టీలు ప్రజల(ఓటర్లు)కు ఆచరణ సాధ్యంకాని వాగ్దానాలు ఇస్తాయని బీజేపీని ఉద్దేశించి మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అటువంటి వాగ్దానాలు చేసే పార్టీ శివసేన కాదని స్పష్టం చేశారు.
ఎన్నికల సయయంలో కొంతమంది నాయకులు ప్రజలకు ఆచరణ సాధ్యంకాని హామీలు ఇస్తారని, అధికారంలోకి వచ్చాక వాటిని మర్చిపోతారని దుయ్యబట్టారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని ప్రజలు నిలదీసినప్పుడు ఆ నాయకులు అసలు హామీలే ఇవ్వలేదని జారుకుంటారని ఎద్దేవా చేశారు.
శివసేవ అటువంటి పార్టీ కాదని, నెరవేర్చలేని హామీల ఎట్టిపరిస్థితుల్లో ఇవ్వదని పేర్కొన్నారు. అదేవిధంగా రాష్ట్రంలో కరోనా వైరస్ పరిస్థితులపై ప్రజలు ఆందోళన చెందవల్సిన అవసరం లేదని చెప్పారు. కరోనా పరిస్థితులను ఎదుర్కొనే సామర్థాన్ని కలిగి ఉన్నామని పేర్కొన్నారు. అయితే ప్రజలంతా కరోనా నియంత్రణకు సహకరించాలని సీఎం ఉద్ధవ్ ఠాక్రే విజ్ఞప్తి చేశారు.