‘ప్రజలు మృతి చెందితే బాధ్యత వహిస్తారా’ | CM Uddhav Thackeray Warns Against Lifting Lockdown In Maharashtra | Sakshi
Sakshi News home page

‘ప్రజలు మృతి చెందితే బాధ్యత వహిస్తారా’

Published Sat, Jul 25 2020 2:46 PM | Last Updated on Sat, Jul 25 2020 3:02 PM

CM Uddhav Thackeray Warns Against Lifting Lockdown In Maharashtra - Sakshi

ముంబై: దేశ వ్యాప్తంగా కరోనా వైరస్‌ విజృంభిస్తోంది. రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతోంది. ఈ క్రమంలో లాక్‌డౌన్‌ ఎత్తివేయటం, వ్యాపార సముదాయాలు, పరిశ్రమలు తెరవటంపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే స్పందించారు. శివసేన పత్రిక సామ్నాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. కరో​నా వైరస్‌ వ్యాప్తిని అరికట్టే ఆంక్షలను ఎత్తివేయటంలో తొందర పడకూడదని తెలిపారు. నేషనలిస్ట్‌‌ కాన్ఫరెన్స్‌ పార్టీ (ఎన్సీపీ) చీఫ్‌ శరద్‌ పవార్ ఇటీవల వ్యాపార సంస్థలు, పరిశ్రమలను తెరవడానికి అనుమతించాలని కోరిన విషయం తెలిసిందే. ప్రస్తుత సమయంలో కరోనా వైరస్‌ను అరికడుతు ఆర్థిక వ్యవస్థ, ప్రజల ఆరోగ్యాన్ని సమతుల్యం చెయాల్సిన అవసరం ఉందన్నారు. లాక్‌డౌన్‌ గురించి కొంతమంది వ్యక్తులు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. (సీఎం శివరాజ్‌సింగ్‌కు కరోనా పాజిటివ్‌)

వారు కోరినట్టు అన్నింటిని తెరుస్తామని కానీ, దురదృష్టవశాత్తు లాక్‌డౌన్‌ ఎత్తివేయటంతో ప్రజలు మరణిస్తే దానికి వారు బాధ్యత వహిస్తారా అని ఉద్ధవ్‌ ప్రశ్నించారు. లాక్‌డౌన్‌ ఒకేసారి ఎత్తివేయటం వీలుకాదన్నారు. కానీ, క్రమక్రమంగా దానికి సంబంధించిన ఆంక్షలు ఎత్తివేస్తామని తెలిపారు. అన్ని ఆంక్షలు ఎత్తివేసిన తర్వాత మళ్లీ విధించే పరిస్థితులు ఎదురు కావద్దన్నారు. ఆర్థిక వ్యవస్థ గురించి మాత్రమే ఆలోచించటం సరికాదు. ప్రజల ఆరోగ్య పరిస్థితులను దృష్టిలో పెట్టుకోవాలని సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే తెలిపారు. ఇప్పటివరకు మహారాష్ట్రలో 3,57,117 కరోనా వైరస్‌ కేసులు నమోదుకాగా, 1,99,967 మంది కోలుకొని డిశ్చార్జ్‌ అయ్యారు. ప్రస్తుతం 1,44,018 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇక వైరస్‌ కారణంగా 13,132 మంది మృతి చెందారు.​

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement