డెమాస్కస్: సిరియాలో అస్పాద్ ప్రభుత్వంపై తిరుగుబాటుదార్ల పైచేయి కొనసాగుతోంది. శనివారం రాత్రి వారు హోమ్స్ నగరంలోని శివారు ప్రాంతాన్ని స్వా«దీనం చేసుకున్నారు. అక్కడితో ఆగకుండా ఏకంగా రాజధాని డెమాస్కస్ శివార్ల దాకా చొచ్చుకొచ్చారు. దాంతో దేశవ్యాప్తంగా ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. హోమ్స్‌ను తిరిగి స్వాధీనం చేసుకునేందుకు అస్సాద్ అనుకూల బలగాలు ప్రయత్నిస్తున్నాయి.
ఇందుకోసం ప్రభుత్వం పల్మీరా తదితర ప్రాంతాల నుంచి బలగాలను, సైనిక వాహనాలను రప్పిస్తోంది. అంతకుముందు, దక్షిణ ప్రాంతంలోని నా లుగో నగరం దారాలో తిరుగుబాటుదార్లు తిష్టవేయడం తెల్సిందే. పరిస్థితులు వేగంగా మారుతుండటంతో బషర్ అల్ అస్సా ద్ ప్రభుత్వం యూఏఈ, జోర్డాన్, ఇరాక్ ప్రభుత్వాలను ఆయుధ సాయం, నిఘా సమాచారం అందించాలంటూ కోరినట్లు చెబుతున్నారు. పరిస్థితులు విషమిస్తున్నందున వెంటనే దేశం విడిచి వెళ్లాలని అస్సాద్‌కు అరబ్ నేతలు కొందరు సూచించినట్లు వాల్‌స్ట్రీట్ జర్నల్ పేర్కొంది.
అమెరికా జోక్యం చేసుకోబోదు: ట్రంప్
సిరియా సంక్షోభంలో తమ దేశం జోక్యం చేసుకోబోదని అమెరికా కాబో యే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. ‘సిరియా సమస్యల్లో చిక్కుకుంది. అయితే, అది మా మిత్ర దేశం కాదు. అమెరికాకు ఆ దేశంతో సంబంధం లేదు. అది మా పోరాటం కాదు. వాళ్లను పోరాడుకోనివ్వండి. మేం తలదూర్చం’అని తెలిపారు. ‘ఉక్రెయిన్‌తో యుద్ధంలో తలమునకలుగా ఉన్న రష్యా మిత్రదేశం సిరియాలో తిరుగుబాటుదార్లను ఆపలేకపోతోందనుకుంటున్నా. సిరియా నుంచి రష్యా బలగాలను వెళ్లగొడితే అది రష్యాకే మంచిది. ఎందుకంటే సిరియా లో ఉండి రష్యా లాభ పడిందేమీ లేదు’ అని ట్రంప్ వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment