డెమాస్కస్/బీరూట్: సిరియాలో కల్లోల పరిస్థితుల నేపథ్యంలో భారతీయులు స్వదేశానికి తరలి వస్తున్నారు. భారత ప్రభుత్వం చొరవతో దాదాపు 75 మంది భారతీయులు సిరియా నుంచి స్వదేశానికి బయలుదేరారు. ఈ మేరకు భారత విదేశాంగ శాఖ ఓ ప్రకటనలో పేర్కొంది.
సిరియాలో తిరుగుబాటుదారుల కారణంగా అధ్యక్షుడు అసద్ దేశం విడిచి వెళ్లిపోయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో సిరియాలో దారుణ పరిస్థితులు, దాడులు చోటుచేసుకున్నాయి. ఈ నేపథ్యంలో సిరియాలో భారత పౌరులకు విదేశాంగ శాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది. వెంటనే సిరియాను వీడాలని సూచించింది. ఈ క్రమంలోనే వారి కోసం ప్రత్యేక విమానాలను ఏర్పాటు చేసింది. దీంతో, అక్కడున్న వారంతా స్వదేశానికి తిరుగు ప్రయాణమయ్యారు.
సిరియా నుండి కనీసం 75 మంది భారతీయులు పప్రత్యేక విమానంలో స్వదేశానికి బయలుదేరారు. వారంతా మొదట సిరియా నుంచి లెబనాన్ చేరుకుని అక్కడి నుంచి భారత్‌కు తిరిగి వస్తారని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. మరోవైపు.. డెమాస్కస్, బీరూట్ భారత రాయబార కార్యాలయాల ద్వారా పౌరుల తరలింపునకు సంబంధించి సమన్వయం చేసినట్టు వెల్లడించింది.
ఇక, ఇప్పటికీ సిరియాలో ఉన్న భారతీయులు.. డమాస్కస్‌లోని దౌత్యకార్యాలయం ద్వారా తగిని సాయం పొందాలని కోరింది. ఈ క్రమంలో హెల్ప్‌లైన్ నంబర్ +963 993385973, వాట్సాప్, ఈ-మెయిల్ hoc.damascus@mea.gov.in ద్వారా టచ్‌లో ఉండాలని ప్రభుత్వం సూచించింది.
Pics of 75 Indians evacuated from war torn #Syria, they are reaching home soon. https://t.co/uw6TWEtIUP pic.twitter.com/wNqagbh758
— Abhishek Jha (@abhishekjha157) December 10, 2024
Comments
Please login to add a commentAdd a comment