సిరియాలో హింస: 71 మంది మృతి | 71 killed in Syria conflict | Sakshi
Sakshi News home page

సిరియాలో హింస: 71 మంది మృతి

Published Fri, Apr 25 2014 8:30 AM | Last Updated on Tue, Nov 6 2018 8:59 PM

71 killed in Syria conflict

సిరియాలో నరమేథం కొనసాగుతుంది. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాలలో గురువారం ఓ వైపు కారు బాంబు పేలుళ్లతో దద్దరిల్లగా, మరోవైపు దేశ భద్రత సిబ్బంది, తిరుగుబాటుదారులకు మధ్య హోరాహోరిగా కాల్పులు జరిగాయి.  ఆ హింసలో మొత్తం 71 మంది మరణించారని స్థానిక మీడియా శుక్రవారం వెల్లడించింది. సిరియా ఈశాన్య ప్రావెన్స్లో హస్కాలో రెండు కారు బాంబు పేలుళ్లకు తిరుగుదారులు పాల్పడ్డారు. ఆ ఘటనలో ఏడుగురు మృతి చెందగా, అనేక మంది తీవ్రంగా గాయపడ్డారు.

 

హస్కాలోని ఓ పాఠశాల ప్రవేశ ద్వారం సమీపంలో కారు పేలుడు సంభవించి... ఇద్దరు చిన్నారుల మృతి చెందారని తెలిపింది. తల్ హలాఫ్ పట్టణంలో అల్ ఖమిస్ మార్కెట్ వద్ద మరో కారును తిరుగబాటుదారులు పేల్చేశారిని ఆ ఘటనలో ఐదుగురు వ్యక్తులు అక్కడికక్కడే మరణించారని, అనేక మంది గాయపడ్డారని పేర్కొంది. దేశంలోని వివిధ ప్రాంతాలలో తిరుగుబాటుదారులను అణిచేందుకు భద్రత సిబ్బంది చర్యలు చేపట్టింది. అందులోభాగంగా భద్రత సిబ్బందికి, తిరుగుబాటుదారులకు మధ్య హోరాహోరి కాల్పులు జరిగాయి. ఆ కాల్పులలో మొత్తం 64 మంది మరణించారని మీడియా వివరించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement