![Taliban District Chief, 50 Insurgents Killed In Fight With Afghan Resistance In Andarab Province - Sakshi](/styles/webp/s3/article_images/2021/08/23/Untitled-6.jpg.webp?itok=yZaOqs_f)
కాబుల్: అఫ్గానిస్తాన్ మొత్తాన్ని తమ స్వాధీనంలోకి తెచ్చుకున్న తాలిబన్లకు పంజ్‌షీర్ ఫ్రావిన్స్‌లోని ప్రతిఘటనవాదులు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు. ఇప్పటికే 300కిపైగా తాలిబన్లను మట్టుబెట్టిన అహ్మద్ మసూద్ నేతృత్వంలోని పంజ్‌షీర్ రెబెల్స్.. అంద్రాబ్ ప్రాంతంలో సోమవారం జరిగిన ప్రతిఘటన దాడుల్లో తాలిబన్ బాను జిల్లా చీఫ్ సహా మరో 50 మంది తాలిబన్ ఫైటర్లను అంతమొందించారని తెలుస్తుంది. మరో 20 మంది తాలిబన్లను రెబెల్స్ ఫోర్స్ బందీ చేసినట్లు అంతర్జాతీయ మీడియా సమాచారం.
ఈ దాడుల్లో ఓ రెబల్ ఫైటర్ సైతం మరణించినట్లు మరో ఆరుగురు గాయపడినట్లు తెలుస్తోంది. తాలిబన్ సైన్యం భారీ ఆయుధాలతో పంజ్‌షీర్ ఫ్రావిన్స్‌ను చుట్టుముట్టినప్పటికీ.. చర్చల ద్వారానే సమస్య పరిష్కారానికి ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తుంది. అయితే తాలిబన్లకు లొంగే ప్రసక్తే లేదని పంజ్‌షీర్ ప్రజలు ప్రకటించడం విశేషం. మరోవైపు తాలిబన్లతో పోరులో పంజ్ షీర్ ఫైటర్స్‌కు ఆఫ్ఘన్ సైన్యం మద్దతుగా నిలబడింది. తాలిబన్లు, అఫ్గాన్ సైన్యం మధ్య భీకర పోరుతో ఆ దేశ దక్షిణ ప్రాంతంలోని ఆంద్రాబ్ ఫ్రావిన్స్ అల్లకల్లోలంగా మారింది.
చదవండి: అఫ్గాన్ నుంచి భారత్‌కు వచ్చిన 146 మందిలో ఇద్దరికి కరోనా
Comments
Please login to add a commentAdd a comment