గుండెల్లో రె‘బెల్స్’
సిటీబ్యూరో: గ్రేటర్ ఎన్నికల్లో వివిధ పార్టీలకు రెబెల్స్ బెడద తప్పడం లేదు. ముఖ్యంగా అధికార టీఆర్‌ఎస్ పార్టీలో వీరి సంఖ్య అధికంగా ఉంది. నియోజకవర్గాల వారీగా పరిశీలిస్తే...
కుత్బుల్లాపూర్‌లో..
జీడిమెట్లలో గుమ్మడి మాధవి, చింతల్‌లో ఐదుగురు టీఆర్‌ఎస్ నేతలు నామినేషన్లు వేశారు. సూరారంలో అత్యధికంగా ఎనిమిది మంది ఔత్సాహికులు నామినేషన్లు వేయడం గమనార్హం.
ఖైరతాబాద్‌లో..
బంజారాహిల్స్ డివిజన్ నుంచి ప్రగతిరెడ్డి, రఘుముదిరాజ్, సోమాజిగూడ నుంచి కె.ప్రసన్న నామినేషన్లు దాఖలు చేయడంతో అధికార పార్టీకి చిక్కులు తెచ్చిపెడుతున్నాయి.
కూకట్‌పల్లిలో...
కేపీహెచ్‌బీ డివిజన్ నుంచి జనగాం సురేష్‌రెడ్డి, లింగ్యానాయక్, వివేకానందనగర్ కు మాచర్ల పద్మభద్రయ్య, కె.శ్రీలత, శ్వేత నామినేషన్లు వేశారు. ఆల్విన్ కాలనీ నుంచి లద్దె నాగరాజు, కె.వెంకటేశ్ గౌడ్, హైదర్‌నగర్ నుంచి కోడూరి రాధాకృష్ణ, జానకిరామరాజు, రాధాకృష్ణ నామినేషన్లు వేశారు. అల్లాపూర్ నుంచి టి.అంజమ్మ, ఎన్.పుష్పలత, మూసాపేట్ నుంచి టి.ఎల్లారావు, బి.నర్సింగ్‌రావు, ఎ.వీరబాబు, ఫతేనగర్ నుంచి టి.ఎల్లారావు, భిక్షపతి, శ్రీనివాస్ గౌడ్, ఓల్డ్‌బోయిన్‌పల్లి నుంచి యాదగిరి, అమూల్య, జంగయ్య, అజార్, రవికుమార్, బాలానగర్ నుంచి ఆవుల రవీందర్‌రెడ్డి, శంకర్‌గౌడ్, కూకట్‌పల్లి నుంచి జూపల్లి శైలజ, ఎమ్‌డీ ఇబ్రహీం నామినేషన్లు వేశారు.
రాజేంద్రనగర్‌లో..
రాజేంద్రనగర్‌లో టి.అర్చన జయప్రకాశ్ రెబెల్‌గా నామినేషన్ వేశారు.
సికింద్రాబాద్‌లో...
అడ్డగుట్టలో లక్ష్మీ హంసరాజ్, మెట్టుగూడలో సంధ్య, తార్నాకలో ఎల్లమ్మ, సీతాఫల్‌మండిలో హేమ, జ్యోతి రెబెల్స్‌గా బరిలో నిలిచే అవకాశాలు ఉన్నాయి.
మహేశ్వరంలో..
సరూర్‌నగర్ డివిజన్ నుంచి టీఆర్‌ఎస్ అభ్యర్థులు ఏడుగురు నామినేషన్లు వేయడంతో రాజకీయం రసవత్తరంగా మారింది.
మల్కాజ్‌గిరిలో..
మచ్చబొల్లారం నుంచి రాజ్ జితేంద్రనాథ్, మన్నె శ్రీనివాస్‌రాజు, ఉదయ్‌కుమార్, సువర్ణ నామినేషన్లు వేశారు. వెంకటాపురం నుంచి సీఎల్ యాదగిరి, సబితాకిషోర్, సంపత్, శ్రీలత బరిలో నిలిచారు.
అంబర్‌పేట్‌లో...
నల్లకుంట నుంచి గుంటి నాగరాణి, అంబర్‌పేట్ నుంచి కె.పద్మావతి, కాచిగూడ నుంచి లావ ణ్య నామినేషన్లు వేశారు.
శేరిలింగంపల్లిలో..
కొండాపూర్ డివిజన్ నుంచి మమత, రాజేష్ నామినేషన్లు వేశారు. మిగతా డివిజన్లలో రెబెల్స్ బెడద అంతగా లేనట్లు సమాచారం.
ముషీరాబాద్‌లో..
రాంనగర్ డివిజన్‌లో నందికంటి నర్సింగ్‌రావు, అడిక్‌మెట్ నుంచి సునీత ప్రకాశ్‌గౌడ్, హేమలత జయరాంరెడ్డి నామినేషన్లు వేశారు.
ఉప్పల్‌లో..
ఏఎస్‌రావునగర్‌లో మణెమ్మ, పద్మ, చర్లపల్లిలో చెన్నయ్య గౌడ్, మీర్‌పేట్‌లో ప్రభుదాస్, మల్లాపూర్‌లో భాస్కర్‌గౌడ్, కొత్తమల్లారెడ్డి, నాచారంలో సువర్ణ, రామంతాపూర్‌లో భాగ్యరేఖ, రాజేశ్వరి, హ బ్సిగూడలో గడ్డం శాంతమ్మ రెబెల్స్‌గా బరిలో నిలిచారు.
సనత్‌నగర్‌లో...
బేగంపేట్‌లో కాంచనమాల, తరుణి, అనిత, సనత్ నగర్ నుంచి బైరు రమ్య అసంతృప్తులుగా బరిలోకి దిగారు.ట
ఎల్బీ నగర్‌లో...
నియోజకవర్గంలో 11 డివిజన్లు ఉన్నాయి. కొన్నిచోట్ల అధికార టీఆర్‌ఎస్‌కు రెబెల్స్ బెడద అధికంగా ఉంది. హయత్ నగర్, వనస్థలిపురం, బీఎన్‌రెడ్డినగర్, మన్సూరాబాద్, నాగోల్, లింగోజిగూడ, చంపాపేట్, కొత్తపేట్, గడ్డిఅన్నారం, హస్తినాపురం డివిజన్ల లో కొంతమందికి పార్టీ టిక్కెట్ ప్రకటించనప్పటికీ నామినేషన్లు వేయ డం గమనార్హం. వనస్థలిపురంలో జిట్టా రాజశేఖర్‌రెడ్డి, బీఎన్‌రెడ్డి నగర్‌లో లక్ష్మీప్రసన్న, రంజిత్‌గౌడ్‌తో పాటు ఐదుగురు టీఆర్‌ఎస్ నేతలు నామినేషన్లు వేశారు. మన్సూరాబాద్‌లో నాగరాజు, నాగోల్‌లో చెరుకు ప్రశాంత్‌గౌడ్ సహా ఏడుగురు నామినేషన్లు వేశారు. లింగోజిగూడలో అత్యధికంగా 17 మంది టీఆర్‌ఎస్ ఆశావహులు నామినేషన్లు దాఖలు చేశారు. చంపాపేట్‌లో ఆరుగురు, కొత్తపేట్‌లో 8మంది, గడ్డిఅన్నారంలో ఇద్దరు, హస్తినాపురంలో ఏడుగురు నామినేషన్లు వేయడం గమనార్హం.
బీజేపీలోనూ అసంతృప్తులు
బీజేపీలోనూ అసంతృప్తులు తప్పడం లేదు. బీజేపీ బలంగా ఉన్న డివిజన్లలో టీడీపీ అభ్యర్థులను ప్రకటించడంతో కమలనాథులు మండిపడుతున్నారు. ప్రధానంగా ఎల్బీనగర్, రాజేంద్రనగర్, అంబర్‌పేట్, సికింద్రాబాద్ నియోజకవర్గాల్లో బీజేపీకి కాస్తోకూస్తో బలం ఉన్న డివిజన్లను టీడీపీకి కేటాయించడంతో పలువురు రెబెల్స్‌గా బరిలోకి దిగేందుకు ఉద్యుక్తులవుతున్నారు.