
'టర్కీ దొంగ దేశం.. ఉగ్రవాదులకు సహకరిస్తోంది'
టర్కీపై సిరియా విమర్శల వర్షం కురిపించింది. టర్కీ ఉగ్రవాదులకు సహకరిస్తోందని సిరియా సైనికాధికారులు ఆరోపించారు. సిరియా సరిహద్దులోని ఇరాకీ ఆయిల్ ను , ఇతర యుద్ధ సామాగ్రిని దొంగచాటుగా ఉగ్రవాదుల నుంచి స్వీకరిస్తోందని ప్రకటించింది.
సిరియా: టర్కీపై సిరియా విమర్శల వర్షం కురిపించింది. టర్కీ ఉగ్రవాదులకు సహకరిస్తోందని సిరియా సైనికాధికారులు ఆరోపించారు. సిరియా సరిహద్దులోని ఇరాకీ ఆయిల్ ను , ఇతర యుద్ధ సామాగ్రిని దొంగచాటుగా ఉగ్రవాదుల నుంచి స్వీకరిస్తోందని ప్రకటించింది. టర్కీ సరిహద్దుల గుండా ఉగ్రవాదులు స్వేచ్ఛగా వెళ్లిపోతున్నా.. టర్కీ పట్టించుకోవడం లేదని తెలిపింది.
మానవత్వంతో చేయాల్సిన సహాయం కాకుండా సిరియా ఉగ్రవాదులకు యుద్ధసామాగ్రిని కూడా అందిస్తుందని తీవ్ర ఆరోపణలు సిరియా సైన్యం చేసింది. సిరియా సైన్యానికి రష్యా సహకరిస్తున్న నేపథ్యంలో సిరియా ఇలాంటి ఆరోపణలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.