పంతం వీడని రెబల్స్
- దారికి తెచ్చుకునేందుకు టీడీపీ సకల యత్నాలు
- బుజ్జగించేందుకు లక్షలు కుమ్మరింపు
- ‘దేశం’కు తలనొప్పిగా మారిన స్వతంత్రులు
- నజరానాల ఆశ చూపిస్తున్న పెద్దలు
విశాఖ రూరల్, న్యూస్‌లైన్ : తిరుగుబాటుదారులను దారికి తెచ్చుకోవడం టీడీపీకి శిరోభారంగా తయారైంది. జిల్లాలో ఎన్నడూ లేనంతగా రెబల్స్ తాకిడి ఈ పార్టీని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. నామినేషన్ల ఉపసంహరణకు గడువు సమీపిస్తుండడంతో వీరినెలాగైనా దారికి తెచ్చుకోవాలనే ప్రయత్నంలో అధిష్టానం పడింది. వారేమి అడిగినా ఓ యస్ అంటోంది. ఆయా నియోజకవర్గాల అభ్యర్థులు రెబల్స్‌గా బరిలో ఉన్నవారికి భారీగా నజరానాల ఆశ చూపిస్తున్నారు.
ఏకంగా రూ.25 లక్షలు వరకు ఇవ్వడానికి సిద్ధపడుతున్నట్లు తెలిసింది. అయినా ఇప్పటివరకూ చేసిన ప్రయత్నాలు కొలిక్కిరాకపోవడంతో పార్టీలో కలవరం మొదలైంది. భారీ మొత్తంలో ముట్టజెప్పడంతో పాటు భవిష్యత్తులో నామినేటెడ్ పదవులు లేదా పార్టీ పదవులు ఇస్తామంటూ ఆశలు కల్పిస్తున్నా పట్టువీడటం లేదు. భీమిలిలో టీడీపీ అభ్యర్థి గంటా శ్రీనివాసరావుకు రెబల్‌గా సకురు అనిత నా మినేషన్ వేశారు. పార్టీ అధినాయకులు ఆమె తో చేసిన సంప్రదింపులు ఫలించిన దాఖలా లు లేవు.
గాజువాకలో చంద్రబాబు నేరుగా మాట్లాడి పార్టీ పదవి ఇస్తామని చెప్పినా కోన తాతారావు ససేమిరా అనడం అక్కడి అభ్యర్థి పల్లాకు ముచ్చెమటలు పట్టిస్తోంది. యలమంచిలి టికెట్‌ను పంచకర్లరమేష్‌బాబుకు కేటాయించడంతో సుందరపు విజయ్‌కుమార్ ఏకంగా నిరాహార దీక్ష చేశారు. దీక్ష విరమించి నా ఆయన అసమ్మతి బాట వీడలేదు. చివరి రోజున రెబెల్‌గా నామినేషన్ వేయడం ఆయనింకా దారికి రాలేదనడానికి తార్కాణంగా కనిపిస్తోంది. అరకు సీటు విషయంలో చివరి క్షణంలో హైడ్రామా సాగిన విషయం తెలిసిం దే.
మూడు రోజుల క్రితం కుంబా రవిరాబుకు బి-ఫారం ఇచ్చి ఆఖరి నిమిషంలో సిట్టింగ్ ఎమ్మెల్యే సివేరిసోమకు మరో బి-పారం ఇవ్వడంతో రవిబాబు అనుయాయులు రగిలిపోతున్నారు. సోమను ఓడించి తీరుతామని బ హిరంగంగా ప్రకటిస్తున్నారు. సీనియర్ నాయకుల బుజ్జగింపులకు రవిబాబు మెత్తబడలేదని తెలిసింది. పొత్తులో భాగంగా పాడేరు స్థానా న్ని బీజేపీకి కేటాయించడంతో అక్కడ టీడీపీ రెబల్ అభ్యర్థులుగా ఎం.వి.ఎస్.ప్రసాద్, కె.సుబ్బారావులు నామినేషన్ వేశారు.
విశాఖ-ఉత్తరం కూడా బీజేపీకి కేటాయించడంతో ఆ టికెట్‌ను ఆశించిన దువ్వారపు రామారావు టీడీపీకి వ్యతిరేకంగా నామినేషన్ దాఖలు చేశారు. వీరందరు నామినేషన్లు ఉపసంహరించుకోడానికి టీడీపీ అభ్యర్థులు ఎంత ముట్టజెప్పడానికైనా సిద్ధపడుతున్నారు. ఇందులో భాగంగా టికెట్‌ను ఆశించిన నియోజకవర్గాల్లో ఇప్పటి వరకు వారు చేసిన ఖర్చులతో పాటు మరికొంత అ‘ధనం’గా ఇచ్చే విధంగా ఒప్పందాలు చేసుకుంటున్నారు.
కాంగ్రెస్‌కు తప్పని బెడద
జాతీయ, రాష్ట్ర స్థాయి సర్వేలన్నీ కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఉన్నప్పటికీ ఆ పార్టీలోను రెబ ల్స్ బెడద కనిపిస్తోంది. నర్సీపట్నం అసెంబ్లీ టికెట్ కేటాయించకపోవడంతో మనస్తాపం చెందిన పీసీసీ ప్రధానకార్యదర్శి మీసాల సు బ్బన్న తన పదవికి,పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. అనుచరులతో చర్చించి రెండురోజుల్లో రాజకీయ భవిష్యత్‌పై ప్రకటిస్తానని పేర్కొన్నారు. విశాఖ ఎంపీ స్థానానికి చివరి వరకు పేరు వినిపించిన డాక్టర్ కూటికూప్పల సూర్యారావుకు కాదని బొలిశెట్టి సత్యనారాయణకు టికెట్ ఇచ్చారు.
దీంతో సూర్యారావు స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేశారు. చోడవరం అసెంబ్లీకి కాంగ్రెస్ పార్టీ కిలి శంకరరావును ప్రకటించి చివరి నిమిషంలో గూనూరు అచ్యుతరావుకు టికెట్ ఇచ్చింది. శంకరరావు రెబల్‌గా పోటీ చేస్తున్నారు. విశాఖ-తూర్పు నియోజకవర్గంలో కూడా కాంగ్రెస్ అభ్యర్థిని ప్రభాగౌడ్‌కు వ్యతిరేకంగా గంపలగోవింద్ నామినేషన్ వేశారు. వీరందరిని బుజ్జగించడానికి కాంగ్రెస్ పెద్దలు కూడా భారీగా ఆశలు చూపిస్తున్నారు.