
సీమాంధ్రలో టీడీపీ రెబల్ అభ్యర్థుల నామినేషన్లు
జేపీ-టీడీపీల పొత్తు అనంతరం రాష్ట్ర రాజకీయాల్లో రెబల్ అభ్యర్థులు క్రమేపీ పెరుగుతున్నారు.
రాజమండ్రి: బీజేపీ-టీడీపీల పొత్తు అనంతరం రాష్ట్ర రాజకీయాల్లో రెబల్ అభ్యర్థులు క్రమేపీ పెరుగుతున్నారు. ఇప్పటికే పలుచోట్ల తిరుగుబాటు బావుటా ఎగురవేసిన టీడీపీ అభ్యర్థులు.. నామినేషన్ల కార్యక్రమంలో రెబల్స్ గా మారి చంద్రబాబుకి షాక్ ఇస్తున్నారు. సీమాంధ్రలో పొత్తులో భాగంగా బీజేపీకి 14 స్థానాలు కేటాయించారు. అయితే టీడీపీ నేతలు రెబల్ అభ్యర్థులుగా మారడంతో పార్టీకి తలనొప్పిగా మారాయి. బీజేపీకి కేటాయించిన స్థానాలకు గాను ఆరు చోట్ల నామినేషన్లు వేశారు. టీడీపీ తరుపున బీజేపీ స్థానాల్లో నామినేషన్లు వేసిన నేతలు..
సంతనూతలపాడు-విజయకుమార్,
మదనపల్లె-రమేష్
కైకలూరు-జయమంగళ వెంకటరమణ,
పాడేరు- ప్రసాద్
రాజమండ్రి-గోరంట్ల బుచ్చయ్య చౌదరి
తాడేపల్లిగూడెం-కొట్టు సత్యనారాయణ