ఏలూరు (పశ్చిమగోదావరి జిల్లా) : కొల్లేరు మత్స్యకారుల నుంచి లక్ష రూపాయలు లంచం తీసుకుంటూ ఏలూరు ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ అబ్దుల్‌బారి మంగళవారం సాయంత్రం ఏసీబీ అధికారులకు చిక్కాడు. కొల్లేరు అభయారణ్యం పరిధిలో అనుమతులు ఉన్న చేపల చెరువుల రైతుల నుంచి డబ్బు డిమాండ్ చేస్తుండడంతో వారందరూ ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. కొల్లేరు చేపల చెరువుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు సత్యనారాయణ ముందస్తు పథకం ప్రకారం డబ్బులు ఇస్తామని ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ అబ్దుల్‌బారిని మంగళవారం సాయంత్రం ఇంటికి పిలిపించుకున్నాడు.
తను ఒకటిన్నర లక్షల రూపాయలు లంచం అడగ్గా లక్ష రూపాయలు ఇస్తామని, తమ రైతుల జోలికి రావద్దని చెప్పాడు. లక్ష రూపాయలు ఇస్తుండగా మాటువేసిన ఏసీబీ అధికారులు ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ అబ్దుల్ బారిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అతనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏసీబీ డీఎస్పీ రాజేంద్ర మీడియాతో తెలిపారు.
ఏసీబీ వలలో ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్
Published Tue, Nov 10 2015 4:40 PM | Last Updated on Thu, Oct 4 2018 6:03 PM
Advertisement