
సాక్షి, హైదరాబాద్ : చేతిపై హోం క్వారంటైన్ ముద్రతో జనబాహుళ్యంలో తిరుగుతున్న యువకుడిని ఆదివారం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో పోలీసులు పట్టుకున్నారు. అతడి చేతిపై ముంబై అధికారులు 14 రోజుల పాటు హోం క్వారంటైన్‌లో ఉండాలని ముద్ర వేశారు. కరోనా అనుమానితుల ఎడమ చేతిపై స్వీయ నిర్భందంలోకి వెళ్లాలని సూచిస్తూ స్టాంప్ వేస్తున్నట్టు మహారాష్ట్ర ప్రభుత్వం పేర్కొన్న సంగతి తెలిసిందే. ఇక మహారాష్ట్రలో కరోనా వైరస్ కేసులు 74కు చేరగా, మృతుల సంఖ్య రెండుకు పెరిగింది. కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం పలు చర్యలు చేపడుతున్నా కేసుల సంఖ్య పెరగడంపై ఆందోళన వ్యక్తమవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment