ఉద్యోగ జీవితంలో పలు సమస్యలు ఎదురవుతుంటాయనే విషయం అందరికీ తెలిసిందే. తాజాగా ఒక ఉద్యోగి సోషల్ మీడియాలో తన ప్రొఫిషినల్ లైఫ్‌లో ఎదురైన ఒక అనుభవాన్ని వెల్లడించాడు. తాను తన కార్యాలయంలో విచిత్రమైన అనుభవాన్ని ఎదుర్కొన్నాననని దానిలో పేర్కొన్నాడు.
వైరల్ అవుతున్న రెడ్డిట్ పోస్టులో @Melodic-Code-2594 అనే ఖాతా కలిగిన యూజర్ తన బాస్ తాను ఆఫీసులో ఫోన్ ఛార్జ్ చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారని పేర్కొన్నాడు. ‘వ్యక్తిగత ఉపయోగం కోసం కంపెనీ విద్యుత్ చోరీ చేశానని’ బాస్ ఆరోపించాడని ఆవేదన వ్యక్తం చేశాడు.
ఆ యూజర్ తన పోస్టులో.. ‘ఆఫీసులో తాను ఫోన్ ఛార్జ్ చేసినందుకు మా బాస్ నాతో.. వ్యక్తి గత అవసరాలకు కంపెనీ విద్యుత్ చోరీ చేస్తున్నారు. మీ లాంటి వాళ్లకు ఎలా చెప్పాలి? నేనేమీ రోజంతా ఫోనులోనే మునిగిపోను. అప్పుడప్పుడు రాత్రి వేళ బెడ్‌మీదకు చేరేముందు ఫోన్ చార్జ్ చేయడం మరచి పోతుంటానంతే. ఇది డెస్క్ జాబ్’ అని బాస్ సీరియస్‌గా చెప్పాడని వివరించారు.
ఈ పోస్టును చూసిన యూజర్లు పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ఒక యూజర్..‘మీ బాస్ పెద్ద మూర్ఖుడు. ఫోన్ ఛార్జింగ్ పెడితే కంపెనీ కరెంట్ చోరీ చేసినట్లు అవుతుందన్నాడంటే.. అక్కడి గాలి పీల్చినా, నీటిని తాగినా చోరీ చేశావని అంటాడేమో’ అని కామెంట్ చేశాడు. మరో యూజర్..‘మీ బాస్ ఫోన్ ఛార్జింగ్ పెట్టుకోవద్దన్నాడంటే.. ఆఫీసులోని ఫోనుకు వచ్చిన ఏ కాల్‌ను రిసీవ్ చేసుకోకూడదు. ఎందుకంటే అప్పుడు కంపెనీ ఫోను టాక్‌టైమ్, బ్యాటరీ పవర్ చోరీ చేసినట్లువుతుందని’ పేర్కొన్నాడు. మరో యూజర్ ‘ఆఫీసులోని టాయిలెట్ యూజ్ చేసినప్పుడు ఫ్లష్ చేయవద్దని మీ బాస్‌కు చెప్పండి. ఎందుకంటే అలా చేస్తే కంపెనీకి చెందిన నీరు వృథా అవుతుందని వివరించండి’ అని సలహా ఇచ్చాడు.
ఇది కూడా చదవండి: అందం.. నేర సామ్రాజ్యంలోకి అడుగిడితే.. లేడీ డాన్ లవ్ స్టోరీస్!
Comments
Please login to add a commentAdd a comment