
పాక్‌పై ప్రతీకారం తీర్చుకుంటా
అమర జవాను కూతురు ప్రతిన
ఝున్‌ఝును: పెద్దయిన తరువాత తానూ సైన్యంలో చేరతానని, తన తండ్రి ప్రాణాలు తీసిన పాకిస్తాన్‌పై ప్రతీకారం తీర్చుకుంటానని పాక్ వైమానిక దాడిలో ప్రాణాలు కోల్పోయిన సైనికుడు సురేంద్ర సింగ్ మోగా కూతురు వర్తిక ప్రతిజ్ఞ చేసింది. కాల్పుల విరమణను ఉల్లంఘిస్తూ శనివారం జరిపిన డ్రోన్ దాడుల్లో జమ్మూ కశ్మీర్‌లోని ఉద్ధంపూర్ వైమానిక స్థావరంలో విధులు నిర్వహిస్తున్న రాజస్థాన్‌కు చెందిన జవాను సురేంద్ర సింగ్ మోగాతోపాటు బీఎస్‌ఎఫ్ సబ్ ఇన్‌స్పెక్టర్ కూడా ప్రాణాలు కోల్పోయారు.
పాక్ డ్రోన్ శకలం ఢీకొని సురేంద్ర మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. ‘‘శనివారం రాత్రి 9 గంటలకు కూడా నాన్నతో మాట్లాడా. ఆకాశంలో పాక్ డ్రోన్లు తిరుగుతున్నాయని, తాము బాగానే ఉన్నామని నాతో చెప్పాడు. అంతలోనే ఇలా జరిగింది’’ అంటూ 11 ఏళ్ల వర్తిక విలపించింది. తన తండ్రి దేశాన్ని కాపాడుతూ అమరుడైనందుకు గర్వంగా ఉందని చెప్పింది. పాక్ పేరు కూడా వినపడని రీతిలో అంతం కావాలని ఆకాంక్షించింది. ‘‘నా తండ్రి ప్రాణా లు తీసిన పాక్‌ను వదలను. సైన్యంలో చేరి వాళ్లను ఒకరి తర్వాత ఒకరిగా ఖతం చేస్తా’’ అని చెప్పింది.
అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు
బెంగళూరు కేంద్రంగా విధులు నిర్వహిస్తున్న సురేంద్రకు నాలుగు రోజుల కిందట సరిహద్దుకు రావాలని పిలుపు వచి్చంది. దీంతో తన భార్య, 11 ఏళ్ల వర్తిక, 7 ఏళ్ల కొడుకు ద„Š ను స్వస్థలమైన రాజస్థాన్‌లోని ఝున్‌ఝును జిల్లా మెహ్రదాసికి పంపించాడు. అంనతరం తాను ఉద్ధంపూర్‌కు బయల్దేరి వెళ్లాడు. అయితే ఊర్లోని కొత్త ఇల్లు గృహప్రవేశానికి వస్తాడనుకున్న కొడుకు.. త్రివర్ణ పతకాన్ని కప్పుకొని నిర్జీవంగా రావడంతో సురేంద్ర తల్లి కుప్పకూలిపోయింది. ధైర్యవంతుడైన సురేంద్రకు వీడ్కోలు పలికేందుకు వేలాది మంది ప్రజలు తరలివచ్చారు. గ్రామంలో నెలకొన్న ఉద్విగ్నభరిత వాతావరణంలో, ఆదివారం అధికారిక లాంఛనాలతో సురేంద్ర అంత్యక్రియలు పూర్తయ్యాయి.