
ఢిల్లీ: ఉగ్రవాదుల ఏరివేత, ఉగ్ర స్థావరాలపై దాడులే లక్ష్యంగా భారత్ ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. ఈ ఆపరేషన్‌లో పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో ఉగ్రస్థావరాలను భారత్ ఆర్మీ ధ్వంసం చేసింది. ఆపరేషన్ సిందూర్‌లో దాదాపు వంద మంది టెర్రరిస్టులు మృతి చెందారు. అయితే, ఉగ్రవాదుల అంత్యక్రియలకు పాక్ ఆర్మీ ఉన్నతాధికారులు హాజరు కావడం, ఆ దేశ పతాకం కప్పడం చర్చనీయాంశమైంది.
వివరాల ప్రకారం.. ఆపరేషన్ సిందూర్‌లో భాగంగా ఆర్మీ దాడిలో మృతి చెందిన ఉగ్రవాదుల అంత్యక్రియలకు పాక్ ఆర్మీ ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్బంగా వారు.. పాక్ దేశ పతాకం కప్పడం చర్చనీయాంశమైంది. అయితే, తొలుత తాము అంత్యక్రియల్లో పాల్గొనలేదని పాక్ బుకాయించినా భారత్ ఫొటోలు విడుదల చేసేసరికి కిమ్మనకుండా ఉండిపోయింది.
ఇక, తాజాగా ఉగ్రవాదుల అంత్యక్రియల్లో పాల్గొన్న పాక్ అధికారుల పేర్లను భారత్ విదేశాంగశాఖ వెల్లడించడం గమనార్హం. ఇందులో ఉన్నతస్థాయి అధికారులు ఉన్నట్లు తెలుస్తోంది. అంత్యక్రియల్లో పాల్గొన్నది వీరే.. లెఫ్ట్‌నెంట్ జనరల్ ఫయ్యాజ్ హుసేన్ షా, లాహోర్ ఐవీ కార్ప్స్ కమాండర్, మేజర్ జనరల్ రావు ఇమ్రాన్ సర్తాజ్, లాహోర్ 11వ ఇన్‌ఫ్రాంట్రీ డివిజన్, బ్రిగేడియర్ మహ్మద్ ఫర్ఖాన్ షబ్బీర్, డాక్టర్ ఉస్మాన్ అన్వర్, ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పంజాబ్ పోలీస్, మాలిక్ సోహైబ్ అహ్మద్ భెర్త్, పంజాబ్ ప్రావిన్స్ అసెంబ్లీ మెంబర్ ఉన్నారు.
Video showing Pakistani Army officials attending the funerals of slain Lashkar-e-Taiba (LeT) terrorists yesterday. The man leading the Janaza is Hafiz Abdul Rauf - a US designated terrorist.
Once again blurring the lines between state and terror - the world is watching you 🇵🇰 pic.twitter.com/MjsJXcyDMl— Vinayak Tripathi (@belikevinayak) May 8, 2025