revenge attack
-
UP: తోడేళ్ల దాడుల వెనక ప్రతీకార కోణం!
లక్నో: ఉత్తర్‌ప్రదేశ్‌లోని బహ్రైచ్ జిల్లాను తోడేళ్ల గుంపు వణికిస్తోంది. గత కొన్ని నెలలుగా తోడేళ్ల వరుస దాడుల్లో పలువురు ప్రాణాలు కోల్పోయారు. దీంతో వీటిని పట్టుకోవడం కోసం అధికారులు ‘ఆపరేషన్ భేడియా’ చేపట్టారు.అయినా ఇవి కొన్ని గ్రామాల్లోని ప్రజలకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి. ఇప్పటివరకు ఈ తోడేళ్ల దాడిలో మొత్తం ఎనిమిది మంది మృతిచెందగా.. అందులో ఏడుగురు చిన్నారులు ఉన్నారు. అర్థరాత్రి సమయంలో చిన్నారులనే టార్గెట్ చేస్తున్నాయి ఈ తోడేళ్ల గుంపు.అయితే తాజాగా ఈ తోడేళ్లు సంబంధించి ఉత్తరప్రదేశ్ ఫారెస్ట్ కార్పొరేషన్ జనరల్ మేనేజర్ సంజయ్ పాఠక్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తోడేళ్ల సైతం ప్రతికారం తీర్చుకోవటం కోసం దాడులు చేస్తాయని అన్నారు. ‘‘తోడేళ్లకు ప్రతీకారం తీర్చుకునే అలవాటు ఉంది. వాటి నివాసాలు, పల్లలకు హాని తలపెడితే.. మనుషులపై ప్రతీకారంతో దాడులు చేస్తాయి. ఈ దాడుల వెనక ప్రతీకార కోణం కూడా ఉండవచ్చనే అనుమానం ఉంది’’ అని ఓ జాతీయ మీడియాతో వెల్లడించారు.బహ్రైచ్‌లోని రాముపూర్ సమీపంలోని ఓ చెరుకు తోటలో రెండు తోడేలు పిల్లలను గుర్తించినట్లు గ్రామస్తులు తెలిపారు. భారీ వర్షం కారణంగా ఆ ప్రాంతంలో వరదలు వచ్చాయని, ఆ వరదల్లో తోడేలు పిల్లలు చనిపోయి ఉండవచ్చని తెలిపారు. అయితే.. వాటి తల్లి తోడేలు తమపై ప్రతీకారం తీర్చుకుంటోందని గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు.. అటవీ ప్రాంతంలో తోడేళ్ల ఆవాసాలను తొలగించటంతో ఎక్కడికి వెళ్లాలో తెలియక అవి గ్రామాలుపై దాడులు చేస్తున్నాయని అటవీశాఖ నిపుణులు పేర్కొంటున్నారు. -
ఫ్రెండ్ కలలో అడిగాడు... చంపేశా!
అన్నానగర్: కరూర్‌లో చనిపోయిన స్నేహితుడు కలలో వచ్చి ప్రతీకారం తీర్చుకోవాలని కోరడంతో యువకుడిని హత్య చేసి ముక్కలుగా నరికి పూడ్చిపెట్టినట్లు నిందితుడు ఇచ్చిన వాగ్మూలం కలకలం రేపింది. కరూర్ గాంధీ గ్రామానికి చెందిన సెంథిల్ కుమార్‌కు జీవా(19) కుమారుడు ఉన్నాడు. తిరుపూర్‌లోని ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. జీవా 22వ తేదీ సెలవుల నిమిత్తం కరూర్ వచ్చాడు. ఆపై అకస్మాత్తుగా అదృశ్యమయ్యాడు. తంథోనిమలై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. గాంధీ గ్రామానికి చెందిన శశికుమార్ (27) సహా 10 మంది వ్యక్తులు జీవాను హత్య చేసి మృతదేహాన్ని పారిశ్రామికవాడలోని అటవీ ప్రాంతంలో ముక్కలు చేసి పాతిపెట్టినట్లు విచారణలో తేలింది. ఈ హత్యకు సంబంధించి గాంధీ గ్రామానికి చెందిన శశికుమార్‌తోపాటు ఎనిమిది మందిని పోలీసులు అరెస్టు చేశారు. అదే ప్రాంతానికి చెందిన చంద్రు (21), కపిల్ కుమార్ (20) పరారీలో ఉన్న వారి కోసం గాలిస్తున్నారు. ఈ హత్య కేసుకు సంబంధించి శశికుమార్ పోలీసులకు సంచలన వాంగ్మూలం ఇచ్చాడు. మోహన్, తాను కరూర్ గాంధీ గ్రామా నికి చెందిన స్నేహితులమని, 2021లో ఇండస్ట్రియల్ ఏరియాలోని అటవీ ప్రాంతంలో ఇద్దరం స్నేహితులతో కలిసి మద్యం సేవించామని చెప్పా డు. అప్పుడు తాను, మోహన్ తాగిన వైన్‌లో విషం కలపి ఇచ్చారని, ఇద్దరం తాగామని, మోహన్ మృతి చెందాడని చెప్పాడు. ఈ ఘటనకు జీవా సహకరించాడని తెలిపాడు. మోహన్ తన కలలో వచ్చి నన్ను చంపిన వారిపై ప్రతీకారం తీర్చుకోవాలని చెప్పాడని, అందుకే తాను, నా స్నేహితులు కలిసి జీవాను చంపేశామని శశికుమార్ వాంగ్మూలం ఇచ్చినట్లు పోలీసులు తెలిపారు. -
Israel-Iran tensions: ఇజ్రాయెల్ ప్రతీకార దాడి
దుబాయ్: ప్రతీకార దాడితో పశ్చిమాసియా మళ్లీ భగ్గున మండింది. తమ భూభాగంపై ఇరాన్ దాడికి ప్రతీకారం తీర్చుకుంటామని ఇప్పటికే ప్రకటించిన ఇజ్రాయెల్ అనుకున్నంత పని చేసి చూపించింది. తమ డ్రోన్లను రంగంలోకి దింపింది. అమెరికా తయారీ ఎఫ్–14 టామ్‌క్యాట్స్ యుద్ధవిమానాలు ఉన్న ఇరాన్‌లోని ఇస్ఫహాన్ సిటీ వైమానిక స్థావరం, అణు కార్యక్రమాల ప్రాంతం వద్ద శుక్రవారం ఉదయం భారీ పేలుడు శబ్దాలు వినిపించాయి. అయితే ఇస్ఫహాన్ నగర గగనతలంలో చక్కర్లు కొడుతున్న డ్రోన్లను కూల్చేశామని, దాడిని విజయవంతంగా అడ్డుకున్నామని ఇరాన్ ప్రకటించింది. ఇరాన్‌పై దాడి పని ఇజ్రాయెల్దేనని అమెరికా సైన్యాధికారులు ప్రకటించారు. ఇరాన్ సుప్రీం లీడర్ అయాతొల్లా అలీ ఖమేనీ 85వ పుట్టినరోజు జరుపుకుంటున్న శుక్రవారం రోజే ఇజ్రాయెల్ ఈ దాడులు చేయడం గమనార్హం. అణుకార్యక్రమాలు జరిగే ఆగ్నేయ జెర్డెంజన్ ప్రాంతంలో శత్రు విమానాలు, డ్రోన్లను నేలమట్టం చేసే అత్యాధునిక గగనతల రక్షణ వ్యవస్థలను ఇరాన్ క్రియాశీలం చేసింది. ఈ అణుకేంద్రంలో చైనా సరఫరాచేసిన స్వల్పస్థాయి అణు పరిశోధనా రియాక్టర్లు ఉన్నాయి. పౌర అణు అవసరాల కోసం అణు ఇంథనాన్ని ఇక్కడ ఉత్పత్తిచేస్తారు. ఇదే నగరంలో భూగర్భ అణు శుద్ది కర్మాగారం ఉంది. దీనిని లక్ష్యంగా చేసుకునే ఇజ్రాయెల్ ఈ దాడి చేసి ఉంటుందని భావిస్తున్నారు. -
13 ఏళ్లుగా '108 అంబులెన్స్' రూపంలో.. వెంటాడిన మృత్యువు!
వరంగల్: 108.. ఈ నంబర్ వినగానే మృత్యువు దారిదాపుల్లో ఉన్న వారి ప్రాణాలు లేచి వస్తాయి. ఈ వాహనం.. వివిధ ప్రమాదాల్లో తీవ్రంగా గాయపడిన ఎంతో మందిని మృత్యువు అంచుల నుంచి కాపాడుతోంది. అయితే అదే వాహనం.. తన వద్దే ఈఎంటీగా విధులు నిర్వహిస్తున్న ఓ ఉద్యోగిని బలితీసుకుంది. ఆ ఉద్యోగిని విషయంలో మృత్యువు 13 ఏళ్ల నుంచి వెంటాడుతోంది. రెండు సార్లు రోడ్డు ప్రమాదాలకు గురి చేసింది. ఫలితంగా అందరికీ ప్రాణదాతగా ఉన్న 108 వాహనం తమ ఉద్యోగి పాలిట మృత్యుశకటంగా మారి బలితీసుకున్న ఘటన సహా ఉద్యోగులు, బాధిత ఉద్యోగి కుటుంబీకులను తీవ్ర విషాదంలోకి నెట్టింది. మొదటి నుండి ఇలా.. దివంగత నేత వైఎస్సార్ 108 వాహనాలు ప్రారంభించిన తొలిరోజులు.. 2007లో హనుమకొండ జిల్లా పరకాలకు చెందిన సూదమళ్ల స్వప్న ఈఎంటీగా విధుల్లో చేరారు. విధుల్లో చురుకుగా ఉండే స్వప్న ఉత్తమ పనితీరుతో సహా ఉద్యోగులు, ఉన్నతాధికారుల ప్రశంసలతోపాటు పలు అవార్డులు అందుకున్నారు. విధుల్లో భాగంగా ఉమ్మడి నల్లగొండ జిల్లా ఆలేరు, హనుమకొండ, ఏటూరునాగారం, తాడ్వాయి, పరకాల తదితర ప్రాంతాల్లో పనిచేశారు. 108 వాహనంలో 108 ప్రసవాలు చేసి రికార్డు సృష్టించారు. ఇలా హుషారుగా సాగుతున్న స్వప్న జీవితానికి, తన సంతోషానికి కారణమైన 108 వాహనమే ఈ విషాదానికి కారణమైంది. 2010 సంవత్సరంలోలో 108 వాహనంలో కేయూసీ పాయింట్ వద్ద విధులు నిర్వహిస్తోంది. ఈ క్రమంలో ఓ ప్రమాద ఘటనా స్థలికి వెళుతుండగా కేయూసీ– హసన్‌పర్తి రోడ్డులో తమ 108 వాహనం ఘొర ప్రమాదానికి గురైంది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన స్వప్న హైదరాబాద్‌లో చికిత్స పొందింది. అయితే మెదడులో తీవ్ర గాయం కావడంతో రక్తం గడ్డకట్టిందని వైద్యులు చెప్పారు. ఒకటికి మూడుసార్లు ఆపరేషన్లు చేశారు. అయినా పూర్తిగా కోలుకోలేకపోయింది. ఆర్థిక పరిస్థితి, ఆరోగ్యపరిస్థితి పూర్తిగా దిగజారడంతో మళ్లీ విధుల్లో చేరింది. కరోనా కాలంలో రెట్టించిన ఉత్సాహంతో విధుల్లో చేరింది. తన పునర్జన్మ కరోనా బాధితుల కోసమే అంటూ ధైర్యంగా పనిచేసింది. కానీ స్వప్న విషయంలో విధి వెక్కిరించింది. 108 రూపంలో వెంటాడుతున్న మృత్యువు మరోసారి దెబ్బతీసింది. 2021లో పరకాల 108 వాహనంలో పనిచేస్తూ ఓ క్షతగాత్రుడిని ఎంజీఎం తరలించి వెళ్తోంది. ఈ క్రమంలో 108 వాహనం రోడ్డు ప్రమాదానికి గురైంది. ఫలితంగా తను పనిచేస్తున్న వాహనం రెండోసారి మృత్యుశకటమై ఆసుపత్రి పాలు చేసింది. నాటి నుంచి స్వప్న మంచానికే పరిమితమైంది. కొద్ది రోజుల క్రితం తీవ్ర అస్వస్థతకు గురికావడంతో సహా ఉద్యోగులు తమకు తోచిన మేర ఆర్థిక సాయం చేశారు. దీంతో మరోమారు వారం క్రితం తను పనిచేసిన...తనను మృత్యుకూపంలోకి నెట్టిన 108వాహనంలో హైదరాబాద్‌లోని ఆసుపత్రికి వెళ్లింది. అక్కడ వైద్యులు తీవ్రంగా ప్రయత్నించినా స్వప్న తిరిగి రాలేదు. ఆదివారం కనిపించని లోకాలకు తరలింది. అదే సంస్థ వాహనంలో విగతజీవిగా వచ్చింది. 13 ఏళ్లు స్వప్నను వెంటాడి వధించిన మృత్యువు తోటి ఉద్యోగులు, కుటుంబ సభ్యుల్లో తీవ్ర విషాదం నింపింది. ఉద్యోగి కాదంటున్న యాజమాన్యం సుమారు దశాబ్దకాలం పాటు తమ సంస్థలో పని చేసి విధుల్లో ప్రమాదానికి గురై మృతి చెందిన స్వప్ర.. ప్రస్తుతం ఆ సంస్థకు కానిది అయింది. ఎందుకంటే కొద్ది రోజుల కిత్రం సంస్థ పేరును ‘గ్రీన్ హెల్త్ సర్వీస్’గా మార్చారు. మార్చిన తరువాత గతంలో ఉన్న ఉద్యోగుల నుంచి బయోమెట్రిక్, ఇతర సమాచారం తీసుకుని నమోదు చేసుకున్నారు. ఆ సమయంలో స్వప్న మంచానికే పరిమితమైంది. దీంతో తమ సంస్థలో పనిచేస్తున్నట్లు కొత్త ఐడీ నంబర్ ఉంటేనే గుర్తింపు ఇస్తామని సంస్థ చెపుతోందని సహా ఉద్యోగులు, కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఇది అన్యాయమని వారు వాపోతున్నారు. కుటుంబ పరిస్థితి అంతంత మాత్రమే.. కడు పేద కుటుంబంలో ఉన్న స్వప్న ఒంటరిగా ఉంటోంది. తన అక్కకు ముగ్గురు సంతానం. ఇందులో ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు ఉన్నారు. అక్కకు భర్త లేడు. దీంతో వారిలో ఒక కూతురును స్వప్న పెంచుకోవడంతోపాటు అక్క కుటుంబ బాధ్యతలు తనే చూస్తోంది. స్వప్న మృతితో ఇప్పుడు తమకు ఎలాంటి ఆధారం లేకుండా పోయిందని ఆ కుటుంబం రోదిస్తోంది. దశాబ్దానికి పైగా 108లో సేవలందించి అందరికీ దూరమైన స్వప్న విషయంలో ప్రభుత్వం స్పందించాలని సహా ఉద్యోగులు, కుటుంబీకులు కోరుతున్నారు. సంస్థకూడా ఉద్యోగిగా గుర్తించి పరిహారం అందించి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని కోరుతున్నారు. స్వప్న విషయంలో సంస్థ గుర్తింపు ఇవ్వడానికి సాంకేతిక కారణాలు చూపినా అందులో ఉన్న ఉద్యోగులు మానవత్వం చాటుకున్నారు. సంస్థ రాష్ట్ర బాధ్యుడు ఖలీద్ సూచన మేరకు జిల్లా ప్రోగ్రాం మేనేజర్ పాటి శివకుమార్ ఆధ్వర్యంలో స్వప్న అంత్యక్రియలకు ఆదివారం రూ. 10 వేలు అందించారు. మిగతా విషయాలు తమ పరిధిలో లేవన్నారని ఉద్యోగులు చెబుతున్నారు. ఇవి చదవండి: ప్రాణం పోస్తారనుకుంటే.. తీశారు! -
పాముపై పగ తీర్చుకున్న 2 ఏళ్ల చిన్నారి.. ఏం జరిగింది?
ఇస్తాంబుల్: పాములు పగ తీర్చుకునే సంఘటనలు చాలా సినిమాల్లో చూసే ఉంటారు. నిజ జీవితంలోనూ అక్కడక్కడ జరిగినట్లు తెలుసు. కానీ, పాముపై పగ తీర్చుకున్న సంఘటన ఎప్పుడైనా విన్నారా? అవునండీ.. నిజమే, తనను కాటు వేసిందనే కోపంతో ఓ రెండేళ్ల చిన్నారి పాముపై పగ తీర్చుకుంది. దానిని నోటితో ముక్కలు ముక్కలు చేసింది. ఈ సంఘటన టర్కీలోని కంతార్ గ్రామంలో జరిగింది. గ్రామంలోని తన ఇంటి వెనకాల పెరటిలో చిన్నారి ఆడుకుంటోంది. ఒక్కసారిగా పెద్దగా అరిచింది. దీంతో ఏదో జరిగిందని ఆందోళన చెందిన చుట్టుపక్కలవారు పరుగున పెరట్లోకి వెళ్లారు. అయితే, ఆ చిన్నారిని చూసి ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. పాప నోట్లో పాము ఉంది. మరోవైపు.. చిన్నారి కింది పెదవిపై పాము కాట్లు ఉన్నాయి. వెంటనే చిన్నారికి ప్రథమ చికిత్స అందించి స్థానిక బింగోల్ మెటర్నిటీ, చిల్డ్రెన్స్ ఆసుపత్రికి తరలించారు. వైద్యుల సమక్షంలో 24 గంటల పాటు పర్యవేక్షణలో ఉంచారు. చిన్నారికి ఎలాంటి ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు. ‘మా పాప చేతిలో పాము ఉన్నట్లు ఇరుగుపొరుగు వాళ్లు నాకు చెప్పారు. దాంతో ఆమె ఆడుకుంటుండగా కాటు వేసింది. ఆ కోపంతో ఆమె పామును కొరికేసింది.’ అని పాప తండ్రి మెహ్మెట్ ఎర్కాన్ పేర్కొన్నారు. మరోవైపు.. పాము కాటుకు గురైన ఓ 8 ఏళ్ల బాలుడిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించిన సంఘటన టర్కీలోని మరో ప్రాంతంలో జరిగింది. చేతిపై కాటు వేయటంతో సాదారణ సైజ్‌తో పోలిస్తే ఐదింతలు ఉబ్బిపోయినట్లు వైద్యులు తెలిపారు. ఇదీ చదవండి: పోలీసులకు చిక్కకుండా గర్ల్‌ఫ్రెండ్ టెడ్డీబేర్‌లో దాక్కున్న దొంగ.. చివరికి -
సిద్ధూ హత్యకు ప్రతీకారం తీర్చుకుంటాం!
ఛండీగడ్: పంజాబీ సింగర్ సిద్ధూ మూసే వాలా దారుణహత్యకు.. ప్రతీకారం తీర్చుకుంటామని, అదీ రెండు రోజుల్లోనే అని సోషల్ మీడియాలో ప్రకటన తీవ్ర దుమారం రేపుతోంది. సిద్ధూ మూసే వాలా మా హృదయం.. సోదరుడి లాంటి వాడు. రెండు రోజుల్లో ఫలితం ఏంటో చూస్తారు అంటూ ఫేస్బుక్ స్టోరీలో ఉంది ఆ హెచ్చరిక. పోస్ట్‌లో బావ్నా అని ఉండడంతో.. ఇది గ్యాంగ్‌స్టర్ నీరజ్ బావ్నాకు చెందిన ముఠా పని అని భావిస్తున్నారు పోలీసులు. పలు హత్య కేసుల్లో దోషిగా తేలిన నీరజ్ బావ్నా, అతని అనుచరులు టిల్లు తజాపూరియా, దేవిందర్ బంభియాలు.. తీహార్ జైలులో ఉన్నారు. అయితే పై హెచ్చరిక పోస్ట్ ఎవరు రాశారనేదానిపై స్పష్టత లేకపోయినా.. ఢిల్లీ, హర్యానా, పంజాబ్, రాజస్థాన్‌లలో విస్తరించి ఉన్న నీరజ్ బావ్నా అనుచరుల పని అయ్యి ఉంటుందని పోలీసుల భావిస్తున్నారు. గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్, అతని అనుచరుడు గోల్డీ బ్రార్‌లను ఉద్దేశించి ఆ ఫేస్బుక్ పోస్ట్ చేసింది. ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్న బిష్ణోయ్.. ప్రాణ భయంతో సెక్యూరిటీ కోరుతూ కోర్టును ఆశ్రయించాడు. జైలు నుంచి అంత పెద్ద హత్యకు ఎలా కుట్ర పన్నుతాడంటూ బిష్ణోయ్ తరపు న్యాయవాది ప్రశ్నిస్తున్నాడు. ఇదిలా ఉంటే.. సిద్ధూ మూసే వాలా హత్యను గ్యాంగ్‌వార్-ప్రతీకార హత్యగానే భావిస్తోంది పంజాబ్ పోలీస్ శాఖ. చదవండి: సింగర్ సిద్ధూ పోస్టుమార్టంపై వైద్యుల షాకింగ్ కామెంట్స్ -
మా ప్రతీకారం భీకరం
వాషింగ్టన్/టెహ్రాన్: ఇరాన్ అమెరికాల మధ్య ఉద్రిక్తతలు మరింత తీవ్రమయ్యాయి. ఇరాన్ తమపై దాడికి తెగబడితే.. మునుపెన్నడూ లేనంత తీవ్ర స్థాయిలో ప్రతీకారం ఉంటుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్ హెచ్చరించారు. ఇరాన్లో 52 కీలక, వ్యూహాత్మక ప్రాంతాలను గుర్తించామని, తమపై దాడి చేస్తే ఆ 52 ప్రాంతాలను ధ్వంసం చేస్తామని హెచ్చరిస్తూ శనివారం రాత్రి ట్రంప్ ట్వీట్ చేశారు. ఇరాక్‌లోని బాగ్దాద్‌లో శుక్రవారం అమెరికా డ్రోన్ దాడిలో ఇరాన్ అత్యున్నత సైనికాధికారి, అల్ ఖుద్స్ ఫోర్స్ చీఫ్ మేజర్ జనరల్ సులేమానీ మరణించిన విషయం తెలిసిందే. దీనికి ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ ప్రతిన చేసింది. సులేమానీ అనే ఉగ్రవాదిని హతమార్చినందుకు ఇరాన్ అమెరికాపై దాడులు చేస్తామని బెదిరిస్తోందని ట్రంప్ పేర్కొన్నారు. ‘అమెరికన్లపై కానీ, అమెరికా ఆస్తులపై కానీ, అమెరికా స్థావరాలపై కానీ దాడులకు దిగితే ప్రతీకార దాడులు తీవ్రంగా ఉంటాయి. ఇరాన్లో రాజకీయంగా, సైనికంగా, సాంస్కృతికంగా అత్యంత ముఖ్యమైన 52 ప్రాంతాలను గుర్తించాం. ఆ ప్రాంతాలు లక్ష్యంగా చేసే దాడులు అత్యంత తీవ్రంగా ఉంటాయి’ అని ట్రంప్ పేర్కొన్నారు. చాన్నాళ్ల క్రితం 52 మంది అమెరికన్లను ఇరాన్ బందీలుగా చెరపట్టిన ఉదంతాన్ని గుర్తు చేసేలా ఆ సంఖ్యను ట్రంప్ నిర్ధారించారని యూఎస్ రక్షణ వర్గాలు వెల్లడించాయి. కొన్ని గంటల తరువాత ట్రంప్ మరో ట్వీట్ చేశారు. ‘వారు మాపై దాడి చేశారు. మేం ప్రతీకార దాడులు చేశాం. వారు మళ్లీ దాడి చేస్తే.. మా ప్రతీకారం మరింత తీవ్రంగా ఉంటుంది’ అని ట్రంప్ తీవ్ర పదజాలంతో ట్వీట్ చేశారు. ‘మిలటరీ సంపత్తి కోసం ఇటీవలే 2 ట్రిలియన్(2 లక్షల కోట్ల) డాలర్లను ఖర్చు చేశాం. ప్రపంచంలోనే మాది అతిపెద్ద, అత్యంత సామర్థ్యమున్న ఆర్మీ. మా స్థావరాలపై కానీ, పౌరులపైకానీ దాడి చేస్తే క్షణం ఆలస్యం చేయకుండా ప్రతీకార దాడులుంటాయి’ అని స్పష్టం చేశారు. యూఎస్‌కు రోజులు దగ్గర పడ్డాయి ట్రంప్ వ్యాఖ్యలపై ఇరాన్ తీవ్రంగా స్పందించింది. ‘పశ్చిమాసియాలో అమెరికా ద్వేషపూరిత ఉనికి అంతమయ్యేందుకు ఇదే ప్రారంభం. సాంస్కృతిక కేంద్రాలను లక్ష్యంగా చేసుకుంటామనడం యుద్ధ నేరం కిందకు వస్తుంది. మా మిలటరీ ఉన్నతాధికారిని దొంగదెబ్బ తీసి చంపడం పిరికి చర్య. అది అంతర్జాతీయ నిబంధనల ఉల్లంఘన’ అని ఇరాన్ విదేశాంగ మంత్రి జవాద్ జారిఫ్ ఆదివారం ట్వీట్ చేశారు. తమతో యుద్ధం ప్రారంభించే ధైర్యం అమెరికాకు లేదని ఇరాన్ ఆర్మీ చీఫ్ అబ్దుల్ రహీం మౌసావి వ్యాఖ్యానించారు. ఇరాక్ నుంచి యూఎస్ బలగాలు వెనక్కు తమ సైనిక స్థావరాల్లో ఉన్న అమెరికా సైనికులను వెనక్కు పంపాలని ఇరాక్ పార్లమెంట్ నిర్ణయం తీసుకుంది. ఐఎస్‌పై పోరులో సాయపడేందుకు ఇరాక్‌లో 5,200 మంది అమెరికా సైనికులున్నారు. కెన్యా బేస్‌పై దాడి కెన్యా తీరంలోని అమెరికా, కెన్యా సైనికులున్న స్థావరంపై సొమాలియాకు చెందిన అల్ షబాబ్ తీవ్రవాద సంస్థ ఆదివారం దాడి చేసింది. ఈ దాడిని తిప్పికొట్టి నలుగురిని హతమార్చామని కెన్యా దళాలు తెలిపాయి. ఇరాన్ విదేశాంగ మంత్రికి ఫోన్ యూఎస్, ఇరాన్‌ల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ఆదివారం ఇరాన్ విదేశాంగ మంత్రి జవాద్ జారిఫ్‌తో మాట్లాడారు. అమెరికాతో నెలకొన్న ఉద్రిక్తతలపై భారత్ తీవ్రంగా ఆందోళన చెందుతున్నట్లు ఆయనకు వివరించారు. సులేమానీకి అశ్రు నివాళి టెహ్రాన్: అమెరికా డ్రోన్ దాడిలో మృతి చెందిన తమ హీరో, జనరల్ ఖాసిం సులేమానీకి ఆదివారం ఇరాన్లో అభిమానులు భారీగా తరలివచ్చి అశ్రునివాళి అర్పించారు. నల్లని దుస్తులు ధరించి, కన్నీళ్లు పెట్టుకుంటూ, గుండెలు బాదుకుంటూ బాధను వ్యక్తపరిచారు. ‘అమెరికాకు ఇక చావే’ అని నినదిస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు. ఇరాక్ నుంచి సులేమానీ మృతదేహం ఇరాన్‌లోని అహ్వాజ్ పట్టణానికి చేరింది. సులేమానీ, అతనితో పాటు మరణించిన వారి మృతదేహాలను టెహ్రాన్‌కు తరలించనున్నారు. -
పాక్ సైనిక కార్యాలయంపై భారత్ కాల్పులు
జమ్మూ: నియంత్రణ రేఖ దగ్గర్లో ఉన్న పాకిస్తాన్ సైనిక పాలక ప్రధాన కార్యాలయంపై భారత్ కాల్పులు జరిపినట్లు అధికారులు చెప్పారు. ఈ నెల 23న జమ్మూ కశ్మీర్‌లోని పూంచ్, ఝల్లాస్‌ల్లో పాకిస్తాన్ ఆర్మీ జరిపిన కాల్పులకు ప్రతీకారంగా భారత సైన్యం తాజాగా కాల్పులకు దిగిందన్నారు. పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే)లోని ఖ్యురత్త, సమానీ ప్రాంతాలపై కూడా భారత జవాన్లు దాడులు జరిపారనీ, పీవోకేలో పొగలు వస్తున్నట్లు సరిహద్దు గ్రామాల ప్రజలు కూడా చెప్పారని ఓ అధికారి వెల్లడించారు. పాకిస్తానీ ఆర్మీ ప్రధాన కార్యాలయం నుంచి పొగ వస్తున్నట్లు కొన్ని ఫొటోల్లో స్పష్టంగా కనిపిస్తోందన్నారు. పాకిస్తాన్ ఎంత రెచ్చగొట్టినా భారత్ ఇన్నాళ్లూ నిగ్రహాన్ని పాటించిందనీ, తాము కూడా ప్రతీకార దాడులు చేస్తామనేందుకు తాజా కాల్పులు పాక్‌కు గట్టి సంకేతమని తెలిపారు. పీవోకేలోని పౌర ప్రాంతాలపై ఆర్మీ కాల్పులు జరపలేదని స్పష్టం చేశారు. -
ఏకంగా 300 మొసళ్లను చంపేశారు
-
చైనాలో అగ్నిప్రమాదం, ఆరుగురి మృతి
బీజింగ్ : చైనాలోని షాంగ్జీ సమీపంలోని ఓ అపార్ట్మెంట్లో అగ్నిప్రమాదం సంభవించి ఆరుమందికి పైగా మృతిచెందగా, మరో ముగ్గురు గాయపడ్డారు. ఈ ఘటన గురువారం ఉదయం చోటుచేసుకుందని ఇందుకు సంబంధించిన వివరాలను అధికారులు వెల్లడించారు. బుధవారం నాడు ఇక్కడి అపార్ట్మెంట్ వద్ద స్థానికంగా పనిచేస్తున్న కొందరి మధ్య గొడవ జరిగిందని పోలీసులు తెలిపారు. జ్ఞీ అనే ఇంటి పేరు ఉన్న ఓ వ్యక్తి నిన్న జరిగిన గొడవకు ప్రతీకారంగా అపార్ట్‌మెంట్‌కు నిప్పుపెట్టినట్లు వారు అనుమానిస్తున్నారు. గాయపడిన వారిని షాంగ్జీ దగ్గర్లోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నామని పోలీసులు వివరించారు. ప్రాథమికంగా దర్యాప్తు చేశామని ఈ ఘటనపై పూర్తిస్థాయి విచారణ చేపడతామన్నారు. -
ప్రతీకారంతో పిల్లాడి కళ్ళు పీకేసింది!
పగ ప్రతీకారం ఎంతటివారినైనా విచక్షణ కోల్పోయేలా చేస్తుందని రుజువు చేసే సంఘటన ఇది. పాత కక్షలతో రగిలిపోయిన ఓ మహిళ పన్నెండేళ్ల బాలుడిని బీర్ బాటిల్‌తో పొడిచి కళ్ళు పీకేసింది. చైనా ఈశాన్య ప్రాంతంలో మంగళవారం ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. మానవత్వానికే మచ్చలా మిగిలిన ఈ ఘటన వివరాలలోకెళ్తే... చైనాలోని జిలిన్ ప్రావిన్స్‌లో జూ అనే పన్నెండేళ్ళ బాలుడి తల్లిదండ్రులు వ్యవసాయ పనుల నిమిత్తం వెళ్లగా, బాలుడు కిరాణా షాపును చూసుకుంటున్నాడు. అంతలో తనకు ఐస్ క్రీం కావాలంటూ.. చేతిలో బీర్ బాటిల్‌తో స్టోర్‌కు వచ్చిన ఓ మహిళ.. అతడిపై ఒక్కసారిగా దాడికి దిగింది. బీర్ బాటిల్‌తో జూ ను విచక్షణారహితంగా పొడిచి కళ్ళు పీకేసింది. అనంతరం ఆ మహిళ పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన అనంతరం అక్కడికి చేరుకున్న జూ తల్లిదండ్రుల జరిగిన దారుణాన్ని చూసి నివ్వెరపోయారు. దాడిలో బాలుడి కళ్లు పూర్తిగా దెబ్బతినడంతో చూపు రావడం కష్టమేనని వైద్యులు చెబుతున్నారు. బాలునిపై దాడికి పాల్పడిన మహిళను వాంగ్గా గుర్తించారు. బాలుడి తల్లిదండ్రులతో ఆమెకు ఉన్న తగదాలే ఈ ఘటనకు దారితీసినట్లు తెలుస్తోంది.