చైనాలో అగ్నిప్రమాదం, ఆరుగురి మృతి | Six killed in arson attack in China | Sakshi
Sakshi News home page

చైనాలో అగ్నిప్రమాదం, ఆరుగురి మృతి

Published Thu, Nov 19 2015 8:51 AM | Last Updated on Wed, Sep 5 2018 9:45 PM

Six killed in arson attack in China

బీజింగ్ : చైనాలోని  షాంగ్జీ సమీపంలోని ఓ అపార్ట్మెంట్లో అగ్నిప్రమాదం సంభవించి ఆరుమందికి పైగా మృతిచెందగా, మరో ముగ్గురు గాయపడ్డారు. ఈ ఘటన గురువారం ఉదయం చోటుచేసుకుందని ఇందుకు సంబంధించిన వివరాలను అధికారులు వెల్లడించారు. బుధవారం నాడు ఇక్కడి అపార్ట్మెంట్ వద్ద స్థానికంగా పనిచేస్తున్న కొందరి మధ్య గొడవ జరిగిందని పోలీసులు తెలిపారు.

జ్ఞీ అనే ఇంటి పేరు ఉన్న ఓ వ్యక్తి నిన్న జరిగిన గొడవకు ప్రతీకారంగా అపార్ట్మెంట్కు నిప్పుపెట్టినట్లు వారు అనుమానిస్తున్నారు. గాయపడిన వారిని షాంగ్జీ దగ్గర్లోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నామని పోలీసులు వివరించారు. ప్రాథమికంగా దర్యాప్తు చేశామని ఈ ఘటనపై పూర్తిస్థాయి విచారణ చేపడతామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement