ఛండీగడ్: పంజాబీ సింగర్ సిద్ధూ మూసే వాలా దారుణహత్యకు.. ప్రతీకారం తీర్చుకుంటామని, అదీ రెండు రోజుల్లోనే అని సోషల్ మీడియాలో ప్రకటన తీవ్ర దుమారం రేపుతోంది.
సిద్ధూ మూసే వాలా మా హృదయం.. సోదరుడి లాంటి వాడు. రెండు రోజుల్లో ఫలితం ఏంటో చూస్తారు అంటూ ఫేస్‌బుక్ స్టోరీలో ఉంది ఆ హెచ్చరిక. పోస్ట్‌లో బావ్నా అని ఉండడంతో.. ఇది గ్యాంగ్‌స్టర్ నీరజ్ బావ్నాకు చెందిన ముఠా పని అని భావిస్తున్నారు పోలీసులు.
పలు హత్య కేసుల్లో దోషిగా తేలిన నీరజ్ బావ్నా, అతని అనుచరులు టిల్లు తజాపూరియా, దేవిందర్ బంభియాలు.. తీహార్ జైలులో ఉన్నారు. అయితే పై హెచ్చరిక పోస్ట్ ఎవరు రాశారనేదానిపై స్పష్టత లేకపోయినా.. ఢిల్లీ, హర్యానా, పంజాబ్, రాజస్థాన్‌లలో విస్తరించి ఉన్న నీరజ్ బావ్నా అనుచరుల పని అయ్యి ఉంటుందని పోలీసుల భావిస్తున్నారు.
గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్, అతని అనుచరుడు గోల్డీ బ్రార్‌లను ఉద్దేశించి ఆ ఫేస్‌బుక్ పోస్ట్ చేసింది. ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్న బిష్ణోయ్.. ప్రాణ భయంతో సెక్యూరిటీ కోరుతూ కోర్టును ఆశ్రయించాడు. జైలు నుంచి అంత పెద్ద హత్యకు ఎలా కుట్ర పన్నుతాడంటూ బిష్ణోయ్ తరపు న్యాయవాది ప్రశ్నిస్తున్నాడు.
ఇదిలా ఉంటే.. సిద్ధూ మూసే వాలా హత్యను గ్యాంగ్‌వార్-ప్రతీకార హత్యగానే భావిస్తోంది పంజాబ్ పోలీస్ శాఖ.
చదవండి: సింగర్ సిద్ధూ పోస్టుమార్టంపై వైద్యుల షాకింగ్ కామెంట్స్
Comments
Please login to add a commentAdd a comment