ప్రతీకారంతో పిల్లాడి కళ్ళు పీకేసింది! | Woman gauges out eyes of a boy in revenge attack | Sakshi
Sakshi News home page

ప్రతీకారంతో పిల్లాడి కళ్ళు పీకేసింది!

Published Tue, Oct 13 2015 6:25 PM | Last Updated on Fri, Jul 12 2019 3:02 PM

ప్రతీకారంతో పిల్లాడి కళ్ళు పీకేసింది! - Sakshi

ప్రతీకారంతో పిల్లాడి కళ్ళు పీకేసింది!

పగ ప్రతీకారం ఎంతటివారినైనా విచక్షణ కోల్పోయేలా చేస్తుందని రుజువు చేసే సంఘటన ఇది. పాత కక్షలతో రగిలిపోయిన ఓ మహిళ పన్నెండేళ్ల బాలుడిని బీర్ బాటిల్తో పొడిచి కళ్ళు పీకేసింది. చైనా ఈశాన్య ప్రాంతంలో మంగళవారం ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. మానవత్వానికే మచ్చలా మిగిలిన ఈ ఘటన వివరాలలోకెళ్తే... చైనాలోని జిలిన్ ప్రావిన్స్లో జూ అనే పన్నెండేళ్ళ బాలుడి తల్లిదండ్రులు వ్యవసాయ పనుల నిమిత్తం వెళ్లగా, బాలుడు కిరాణా షాపును చూసుకుంటున్నాడు.

 

అంతలో తనకు ఐస్ క్రీం కావాలంటూ.. చేతిలో బీర్ బాటిల్తో స్టోర్కు వచ్చిన ఓ మహిళ.. అతడిపై ఒక్కసారిగా దాడికి దిగింది. బీర్ బాటిల్తో జూ ను విచక్షణారహితంగా పొడిచి కళ్ళు పీకేసింది. అనంతరం ఆ మహిళ పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన అనంతరం అక్కడికి చేరుకున్న జూ తల్లిదండ్రుల జరిగిన దారుణాన్ని చూసి నివ్వెరపోయారు. దాడిలో బాలుడి కళ్లు పూర్తిగా దెబ్బతినడంతో చూపు రావడం కష్టమేనని వైద్యులు చెబుతున్నారు. బాలునిపై దాడికి పాల్పడిన మహిళను వాంగ్గా గుర్తించారు. బాలుడి తల్లిదండ్రులతో ఆమెకు ఉన్న తగదాలే ఈ ఘటనకు దారితీసినట్లు తెలుస్తోంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

Photos

View all
Advertisement