ఫ్రెండ్‌ కలలో అడిగాడు... చంపేశా! | A terrible story a man assassinated his friend the request thier friend | Sakshi
Sakshi News home page

ఫ్రెండ్‌ కలలో అడిగాడు... చంపేశా!

Published Wed, Jul 31 2024 10:18 AM | Last Updated on Wed, Jul 31 2024 1:26 PM

A terrible story a man assassinated his  friend the request  thier friend

– నిందితుడి వాంగ్మూలంతో కలకలం 

అన్నానగర్‌: కరూర్‌లో చనిపోయిన స్నేహితుడు కలలో వచ్చి ప్రతీకారం తీర్చుకోవాలని కోరడంతో యువకుడిని హత్య చేసి ముక్కలుగా నరికి పూడ్చిపెట్టినట్లు నిందితుడు ఇచ్చిన వాగ్మూలం కలకలం రేపింది. కరూర్‌ గాంధీ గ్రామానికి చెందిన సెంథిల్‌ కుమార్‌కు జీవా(19) కుమారుడు ఉన్నాడు. తిరుపూర్‌లోని ఓ ప్రైవేట్‌ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. జీవా 22వ తేదీ సెలవుల నిమిత్తం కరూర్‌ వచ్చాడు. ఆపై అకస్మాత్తుగా అదృశ్యమయ్యాడు. 

తంథోనిమలై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. గాంధీ గ్రామానికి చెందిన శశికుమార్‌ (27) సహా 10 మంది వ్యక్తులు జీవాను హత్య చేసి మృతదేహాన్ని పారిశ్రామికవాడలోని అటవీ ప్రాంతంలో ముక్కలు చేసి పాతిపెట్టినట్లు విచారణలో తేలింది. ఈ హత్యకు సంబంధించి గాంధీ గ్రామానికి చెందిన శశికుమార్‌తోపాటు ఎనిమిది మందిని పోలీసులు అరెస్టు చేశారు. అదే ప్రాంతానికి చెందిన చంద్రు (21), కపిల్‌ కుమార్‌ (20) పరారీలో ఉన్న వారి కోసం గాలిస్తున్నారు. ఈ హత్య కేసుకు సంబంధించి శశికుమార్‌ పోలీసులకు సంచలన వాంగ్మూలం ఇచ్చాడు.  

మోహన్, తాను కరూర్‌ గాంధీ గ్రామా నికి చెందిన స్నేహితులమని, 2021లో ఇండస్ట్రియల్‌ ఏరియాలోని అటవీ ప్రాంతంలో ఇద్దరం స్నేహితులతో కలిసి మద్యం సేవించామని చెప్పా డు. అప్పుడు తాను, మోహన్‌ తాగిన వైన్‌లో విషం కలపి ఇచ్చారని, ఇద్దరం తాగామని, మోహన్‌ మృతి చెందాడని చెప్పాడు. ఈ ఘటనకు జీవా సహకరించాడని తెలిపాడు. మోహన్‌ తన కలలో వచ్చి నన్ను చంపిన వారిపై ప్రతీకారం తీర్చుకోవాలని చెప్పాడని, అందుకే తాను, నా స్నేహితులు కలిసి జీవాను చంపేశామని శశికుమార్‌ వాంగ్మూలం ఇచ్చినట్లు పోలీసులు తెలిపారు.

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement