Annanagar Chennai
-
ఫ్రెండ్ కలలో అడిగాడు... చంపేశా!
అన్నానగర్: కరూర్‌లో చనిపోయిన స్నేహితుడు కలలో వచ్చి ప్రతీకారం తీర్చుకోవాలని కోరడంతో యువకుడిని హత్య చేసి ముక్కలుగా నరికి పూడ్చిపెట్టినట్లు నిందితుడు ఇచ్చిన వాగ్మూలం కలకలం రేపింది. కరూర్ గాంధీ గ్రామానికి చెందిన సెంథిల్ కుమార్‌కు జీవా(19) కుమారుడు ఉన్నాడు. తిరుపూర్‌లోని ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. జీవా 22వ తేదీ సెలవుల నిమిత్తం కరూర్ వచ్చాడు. ఆపై అకస్మాత్తుగా అదృశ్యమయ్యాడు. తంథోనిమలై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. గాంధీ గ్రామానికి చెందిన శశికుమార్ (27) సహా 10 మంది వ్యక్తులు జీవాను హత్య చేసి మృతదేహాన్ని పారిశ్రామికవాడలోని అటవీ ప్రాంతంలో ముక్కలు చేసి పాతిపెట్టినట్లు విచారణలో తేలింది. ఈ హత్యకు సంబంధించి గాంధీ గ్రామానికి చెందిన శశికుమార్‌తోపాటు ఎనిమిది మందిని పోలీసులు అరెస్టు చేశారు. అదే ప్రాంతానికి చెందిన చంద్రు (21), కపిల్ కుమార్ (20) పరారీలో ఉన్న వారి కోసం గాలిస్తున్నారు. ఈ హత్య కేసుకు సంబంధించి శశికుమార్ పోలీసులకు సంచలన వాంగ్మూలం ఇచ్చాడు. మోహన్, తాను కరూర్ గాంధీ గ్రామా నికి చెందిన స్నేహితులమని, 2021లో ఇండస్ట్రియల్ ఏరియాలోని అటవీ ప్రాంతంలో ఇద్దరం స్నేహితులతో కలిసి మద్యం సేవించామని చెప్పా డు. అప్పుడు తాను, మోహన్ తాగిన వైన్‌లో విషం కలపి ఇచ్చారని, ఇద్దరం తాగామని, మోహన్ మృతి చెందాడని చెప్పాడు. ఈ ఘటనకు జీవా సహకరించాడని తెలిపాడు. మోహన్ తన కలలో వచ్చి నన్ను చంపిన వారిపై ప్రతీకారం తీర్చుకోవాలని చెప్పాడని, అందుకే తాను, నా స్నేహితులు కలిసి జీవాను చంపేశామని శశికుమార్ వాంగ్మూలం ఇచ్చినట్లు పోలీసులు తెలిపారు. -
భార్యే అసలు సూత్రధారి.. ప్రియుడితో కలిసి..
సాక్షి, చెన్నై(అన్నానగర్): చెన్నైలో భర్తను హత్య చేసిన కేసులో భార్య, ఆమె ప్రియుడిని పోలీసులు అరెస్టు చేశారు. వివరాలు.. తిరుచ్చి జిల్లా తొవరంకురిచ్చి సమీపంలోని అక్యంపట్టికి చెందిన పొన్నుసామి కుమారుడు రామర్ (40) చెన్నైలో ఇడియాప్పం వ్యాపారం చేస్తున్నాడు. భార్య కన్మణి(35). వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. డిసెంబర్ 28వ తేదీ తొవరంకురిచ్చి పరిధిలోని తిరుచ్చి–మధురై జాతీయ రహదారి పక్కన రామర్ తీవ్రగాయాలతో పడి ఉన్నాడు. తిరుచ్చి ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో తీవ్ర చికిత్స పొందుతూ అదే నెల 31వ తేదీ మృతి చెందాడు. మృతిపై అనుమానం ఉందని బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్థానికులు తొవరంకురిచ్చి పోలీస్‌స్టేషన్‌ను ముట్టడించి నిరసన తెలిపారు. ఈ క్రమంలో అక్కియంపట్టికి చెందిన అరుల్ కుమార్ (20) సోమవారం తొవరంకురిచ్చి గ్రామ అడ్మినిస్ట్రేషన్ కార్యలయంలో లొంగిపోయాడు. పోలీసులు అతన్ని విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. రామర్ భార్య కన్మణి, అరుల్ కుమార్ మధ్య వివాహేతర సంబంధం ఉంది. రామర్ వద్ద ఉన్న నగదుని అపహరించడానికి వారిద్దరూ అతన్ని చంపాలని ప్లాన్ చేశారు. ఈ ప్రకారం ఘటన జరిగిన రోజున అరుల్ కుమార్, కన్మణి రామర్‌పై దాడి చేశారు. అతను తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందినట్లు తెలిసింది. దీంతో కన్మణి, అరుళ్ కుమార్‌ను పోలీసులు సోమవారం అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచి జైలుకు తరలించారు. చదవండి: (నగ్న దృశ్యాలు చిత్రీకరిస్తున్న యువకుడిపై కేసు నమోదు) -
దంపతుల ఆత్మహత్య
అన్నానగర్: నాగర్‌కోవిల్‌లో అప్పుల బాధ తాళలేక దంపతులు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన నాగర్‌కోవిల్‌లో మంగళవారం చోటుచేసుకుంది. నాగర్‌కోవిల్ బీచ్‌రోడ్డు పెరియవిలైకి చెందిన వేలప్పన్ (54). పండ్ల దుకాణంలో పనిచేస్తున్నాడు. ఇతని భార్య అముద (45) పూల వ్యాపారి. వీరికి ప్రసన్నకుమార్ (18) అనే కుమారుడు ఉన్నాడు. ఇతను మదురైలో హాస్టల్లో ఉంటూ చదువుతున్నాడు. ప్రస్తుతం ప్రసన్నకుమార్ ట్రైనింగ్ కోసం మహారాష్ట్రకు వెళ్లాడు. నాగర్‌కోవిల్‌లో దంపతులు మాత్రమే ఉంటున్నారు. వీరు ఇంటి అవసరం కోసం అప్పులు చేశారు. ఈ స్థితిలో తీసుకున్న అప్పును తిరిగి ఇవ్వలేకపోవడంతో అప్పు ఇచ్చిన వారు ఒత్తిడి చేశారు. దీంతో సోమవారం దుకాణానికి వెళ్లి వచ్చిన వేళప్పన్ ఇంటికి తిరిగి రాగానే తలుపులు వేసుకున్నాడు. అనంతరం మంగళవారం సాయంత్రం వరకు తలుపులు తెరవలేదు. అనుమానించిన చుట్టుపక్కల వారు వేలప్పన్ ఇంటి వంట గది కిటికీలను తెరచి చూశాడు. అప్పుడు అముద ఉరి వేసుకుని శవంగా వేలాడుతోంది. దీంతో దిగ్భ్రాంతి చెందిన స్థానికులు వెంటనే కోట్టూరు పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకుని ఇన్స్పెక్టర్ అన్బుప్రకాష్ ఆధ్వర్యంలో పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి ఇంటి తలుపులు పగులగొట్టి లోపలికి వెళ్లి చూశారు. అక్కడ పడక గదిలో వేళప్పన్ ఉరి వేసుకుని శవంగా వేలాడుతున్నాడు. అముద, వేలప్పన్ మృతదేహాలను పోలీసులు పోస్టుమార్టం కోసం ఆచారిపల్లం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ప్రాథమిక విచారణలో అప్పుల ఒత్తిడి తాళలేక విరక్తి చెంది దంపతులు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్టు తెలిసింది. -
కాంగ్రెస్ నాయకురాలిపై రెండు కేసులు
తిరువొత్తియూరు, న్యూస్‌లైన్: చెన్నై అన్నానగర్‌కు చెందిన కాంగ్రెస్ నాయకురాలిపై పోలీసులు రెండు కేసులు నమోదు చేశారు. అన్నానగర్ పాడికుప్పం ప్రాంతానికి చెందిన కల్పన (45) కాంగ్రెస్ నిర్వాహకురాలు. రెండేళ్ల ముందు శ్రీపెరంబుదూరుకు చెందిన పారిశ్రామిక వేత్త సంతానం కుమారుడు నవీన్‌కుమార్ (21)కి ఇంజినీరింగ్ కళాశాలలో సీటు తీసి ఇస్తానని *4.5 లక్షలు కల్పన తీసుకుంది. కానీ సీటు తీసివ్వలేదు. నవీన్‌కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు తిరుమంగళం పోలీసులు కేసు నమోదు చేసి కల్పనను అరెస్టు చేసి జైలుకు తరలించారు. కల్పనపై మరో కేసు పాడి మన్నూర్ పేటకు చెందిన రూబి (47) బుధవారం తిరుమంగళం పోలీసులకు ఫిర్యాదు చేశారు. అందులో చెన్నై ఈస్టు కోస్టు రోడ్డులో ఇల్లు తీసి ఇస్తానని చెప్పడంతో రెండు విడతలుగా 23 లక్షల నగదును తన కుమార్తె మేరీతో కలిసి కల్పనకు ఇచ్చాను. కాని ఇల్లు తీసి ఇవ్వలేదు. దీంతో నగదు తిరిగి ఇవ్వాలని కోరాం. అందుకు ఆమె *23 లక్షలకు చెక్ ఇచ్చారు. ఆ చెక్కు బౌన్స్ అయ్యింది. దీంతో పోలీసులు కల్పనపై మరో కేసు నమోదు చేశారు.