సాక్షి, చెన్నై(అన్నానగర్): చెన్నైలో భర్తను హత్య చేసిన కేసులో భార్య, ఆమె ప్రియుడిని పోలీసులు అరెస్టు చేశారు. వివరాలు.. తిరుచ్చి జిల్లా తొవరంకురిచ్చి సమీపంలోని అక్యంపట్టికి చెందిన పొన్నుసామి కుమారుడు రామర్ (40) చెన్నైలో ఇడియాప్పం వ్యాపారం చేస్తున్నాడు. భార్య కన్మణి(35). వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు.
డిసెంబర్ 28వ తేదీ తొవరంకురిచ్చి పరిధిలోని తిరుచ్చి–మధురై జాతీయ రహదారి పక్కన రామర్ తీవ్రగాయాలతో పడి ఉన్నాడు. తిరుచ్చి ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో తీవ్ర చికిత్స పొందుతూ అదే నెల 31వ తేదీ మృతి చెందాడు. మృతిపై అనుమానం ఉందని బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్థానికులు తొవరంకురిచ్చి పోలీస్‌స్టేషన్‌ను ముట్టడించి నిరసన తెలిపారు. ఈ క్రమంలో అక్కియంపట్టికి చెందిన అరుల్ కుమార్ (20) సోమవారం తొవరంకురిచ్చి గ్రామ అడ్మినిస్ట్రేషన్ కార్యలయంలో లొంగిపోయాడు.
పోలీసులు అతన్ని విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. రామర్ భార్య కన్మణి, అరుల్ కుమార్ మధ్య వివాహేతర సంబంధం ఉంది. రామర్ వద్ద ఉన్న నగదుని అపహరించడానికి వారిద్దరూ అతన్ని చంపాలని ప్లాన్ చేశారు. ఈ ప్రకారం ఘటన జరిగిన రోజున అరుల్ కుమార్, కన్మణి రామర్‌పై దాడి చేశారు. అతను తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందినట్లు తెలిసింది. దీంతో కన్మణి, అరుళ్ కుమార్‌ను పోలీసులు సోమవారం అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచి జైలుకు తరలించారు.
చదవండి: (నగ్న దృశ్యాలు చిత్రీకరిస్తున్న యువకుడిపై కేసు నమోదు)
Comments
Please login to add a commentAdd a comment