చెమటతో చార్జింగ్
లాస్‌ఏంజిలెస్: మనుషుల స్వేదాన్ని ఉపయోగించి ఎలక్ట్రానిక్ పరికరాలను చార్జ్ చేసేసాంకేతి కతను శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ఈ టెక్నాలజీని ఉపయోగించి చర్మానికి అంటిపెట్టుకొని ఉండేలా పట్టీ(స్కిన్ పాచ్)ని రూపొందించారు.
సాధారణంగా బ్యాటరీల్లో వినియోగించే లోహాలను కాకుండా ఈ స్కిన్ పాచ్‌లో ఎంజైమ్స్‌ను ఉపయోగించామని దీన్ని అభివృద్ధి చేసిన కాలిఫోర్నియా వర్సిటీ పరిశోధకులు చెప్పారు. చెమటలో ఉండే లాక్టిక్ యాసిడ్‌ను ఉపయోగించుకుని పరికరంలో అమర్చిన బయో ఫ్యూయల్ సెల్స్ చార్జ్ అవుతాయని తెలిపారు.