Sweat
-
ఇదేం స్నాక్ రా బాబూ...రేటు ఎంతైనా సరే ఎగబడుతున్న జనం
ఆరోగ్యానికి మంచిదంటూ పాతకాలపు వంటలు, వంటలు ఇపుడొక ఫ్యాషన్. జపాన్‌లో ఒక వింత వంటకం తెగర వైరల్ అవుతోంది. శతాబ్దాల నాటి చిరుతిండిని లేటెస్ట్గా వడ్డించడంతో, ఖరీదు ఎక్కువైనా సరే ఎగబడి తింటున్నారట అక్కడి జనం. అసలు స్టోరీ ఏంటంటే..ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటున్నాయి జపాన్ రెస్టారెంట్లు. శతాబ్దాల చరిత్రగల పురాతన వంటకం ‘రైస్ బాల్’ ను వెరైటీగా సిద్ధంచేసి మరీ ఆహారప్రియులను ఆకర్షిస్తున్నాయి. అంతేకాదు భారీగా సొమ్ము చేసుకుంటున్నాయి కూడా. ఇంతకీ ఈ స్నాక్ ఎలా తయారు చేస్తారో తెలిస్తే మాత్రం.. దిమ్మ దిరగాల్సిందే.జపాన్‌లో ఒనిగిరి లేదా రైస్ బాల్ (అన్నం ముద్దలు) వంటకం చాలా ఫేమస్. ఉడకబెట్టిన వివిధ కూరగాయలు, మాంసం, అన్నం, నోరి అనే ఎండబెట్టిన సముద్ర పాచిలో చుడతారు. సాధారణంగా ఒనిగిరి అన్నం ముద్దలను చేత్తోనే లడ్డూల్లా చుడతారు. ఇక్కడే అసలు కథ మొదలవుతుంది. ఇటీవలి కాలంలో అందమైన మహిళా చెఫ్‌లను రెస్టారెంట్ల యజమానులు రంగంలోకి దించారు. ఆ అమ్మాయిలు ఒనిగిరి ముద్దలను చేత్తో బదులు చంక కింద పెట్టుకొని చుడతారు. ఇక్కడో ఇంకో సంగతి ఏంటంటే...ఆర్మ్పిట్ టెక్నిక్‌ను వంటగదిలో కస్టమర్లను చూడటానికి అనుమతిస్తాయి. అంతేకాదు మేము చాలా జాగ్రత్తగా ఎలాంటి ఇన్ఫోక్షన్స్ రాకుండా డిస్ ఇన్ఫెక్ట్ట్తోశుభ్రంగా ఉండేలా చూసు కుంటామంటూ యజమానులు హామీ ఇస్తున్నారు. ఆర్మ్పిట్ ఒనిగిరి ముద్దలను కొన్ని రెస్టారెంట్లు ఏకంగా 10 రెట్ల ఎక్కువ ధరకు అమ్ముతున్నారు.ప్రస్తుతం ఇంటర్నెట్ను షేక్ చేస్తోందీరైస్ బాల్! కొందరు పాజిటివ్‌గా కమెంట్ చేస్తోంటే, మరికొందరు నెగిటివ్ కామెంట్లతో సోషల్ మీడియాను హోరెత్తిస్తున్నారు. మొత్తం మీద రైస్బాల్ తయారీ విధానంపై చర్చ రచ్చ రచ్చగా మారింది.కొందరు కస్టమర్లు వహ్వా అంటూ లొట్టలేసుకొని తింటుంటే మరికొందరు మాత్రం రుచిలో పెద్దగా తేడా రాలేదంటూ పెదవి విరుస్తున్నారట. చెఫ్‌కు ఏదైనా గుప్త రోగం ఉంటే పరిస్థితి ఏంటి అని ప్రశ్నిస్తున్నారు మరికొంతమంది. సాధారణంగా తమకు రైస్‌బాల్స్ అంటే ప్రాణం.. కానీ ఇది అత్యంత జుగుప్సాకరంగా ఉందని మండి పడుతున్నారు. తాము ఎప్పటికీ ఈ డిష్‌ను ట్రై చేయబోమని తెగేసి చెబుతున్నారు.సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ కథనం ప్రకారం చంకలో తయారయ్యే చెమటలో ఒక ప్రత్యేకమైన ఫెరోమోన్ అనే రసాయనం ఉత్పత్తి అవుతుందట. దీన్ని వాసన చూస్తే లైంగిక ఆకర్షణలు పెంచుతుందని 2013 నాటి అధ్యయనంలో తేలిందట. -
ఆ చిన్నారికి తన కన్నీళ్లు, చెమటే అలర్జీ!
కొందరూ చెప్పేందుకు, వినేందుకు బాధకరంగా ఉండే చిన్న చిన్న వాటితో వర్ణనాతీతమైన బాధ అనుభవిస్తుంటారు. ఆ వ్యాధి ఇది అని కూడా నిర్థారించలేక వైద్యులు సైతం తలపట్టుకుంటారు. అత్యంత విచిత్రమైన రుగ్మతలతో కొందరూ చిన్నారులు బాధపడుతుంటారు. వారికి, వారిని కన్నవారికి చెప్పుకోలేని ఆవేదన ఇది. ఎందువల్ల ఆ సమస్య ఉత్ఫన్నమవుతోంది నిర్థారించిన అందుకు సరైన చికిత్స విధానం లేక మరో సమస్య. పగవాడికి కూడా ఈ సమస్య వద్దు అనేలా ఉంటాయి ఆ ఆరోగ్య సమస్యలు. ఇక్కడ అలాంటి విచిత్రమైన ఆరోగ్య సమస్యతో బాధపడుతోంది ఓ చిన్నారి. వివరాల్లోకెళ్తే..క్వీన్స్‌లాండ్‌లోని కర్యాన్ జిమ్మ్ అనే మహిళ తన 11 ఏళ్ల కూతురు సుమ్మా విలియమ్స్ పడుతున్న ఆవేదన గురించి కన్నీటిపర్యంతమయ్యింది. తాను మొదట్లో తన చిన్నారికి వచ్చిన సమస్యను వడదెబ్బగా తప్పుగా అర్థం చేసుకున్నానట్లు తెలిపింది. ఏడ్చినా, చెమట పట్టినా..ఒక్కసారిగా ఆమె చర్మం ఎర్రగా మారి ప్రతి చోట పగళ్లు ఏర్పడటం జరుగుతోంది. దీంతో తాను తన కూతురు బయట ఎండకు ఎక్స్పోజ్ కావడంతో అలా అయ్యి ఉంటుందని భావించి తేలిగ్గా తీసుకున్నట్లు చెప్పుకొచ్చింది. అయితే అది కాస్త తీవ్రమైన దురదతో కూడిన మంటతో బ్రిస్బేన్‌లోని ఆస్పత్రిలో చేరే వరకు ఆ సమస్య ఏంటన్నది తనకు తెలియలేదని ఆవేదనగా చెప్పుకొచ్చింది ఆ చిన్నారి తల్లి. అక్కడ వైద్యులు ఆమె కన్నీళ్లు, చెమటే ఆమెకు అలెర్జీగా పరిణిమించి ఇలా మంటతో కూడిన దురద వచ్చి ఎర్రగా అవుతున్నట్లు వెల్లడించారు. శరీరంపై పగుళ్లుకు కారణం అదేనని చెప్పడంతో తాము షాక్‌కి గురయ్యినట్లు పేర్కొంది. ఆ అలెర్జీని తామరకు సంబంధించిన చర్మ వ్యాధిగా వైద్యులు నిర్థారించినట్లు తెలిపింది. అంతేగాదు తన కూతురిని తీసుకుని బయటకు వెళ్లిన ప్రతి చోట ఆమెను చూసి వడదెబ్బకు గురయ్యిందా? అని అందరూ అడుగుతున్నట్లు చెప్పుకొచ్చింది ఆ తల్లి. తన కూతురుకి డ్యాన్స్ అంటే ఇష్టమని, అందులో ఆమె మంచి నర్తకిగా అవార్డు కూగా గెలుచుకుందని చెప్పుకొచ్చింది. అయితే డ్యాన్స్ చేస్తే కచ్చితంగా చెమట పడుతుంది. దీంతో ఆమె ఆ చర్మ సమస్యను ఫేస్ చెయ్యక తప్పడం లేదు. కన్నీళ్ల అంటే ఎప్పుడో పరిస్థితిని బట్టి వచ్చేవి, కానీ చెమట అనేది మనం శ్రమించినా, లేదా టెన్షన్ పడ్డ ఆటోమెటిక్‌గా వచ్చేవి. దీంతో ఆ చిన్నారికి ఈ సమస్య వర్ణనాతీతంగా మారింది. ప్రస్తుతం ఆ చిన్నారికి ఈ సమస్యను వైద్యులు వివిధ ఇంజెక్షన్లతో నివారించే ప్రయత్నం చేస్తున్నారు. తన కూతురు పదేపదే తన స్నేహితుల్లా తన చర్మం ఎందుకు లేదంటూ కన్నీళ్లు పెట్టుకుంటుదంటూ ఆ చిన్నారి తల్లి ఆవేదనగా చెబుతోంది. కాగా, ముర్డోక్ చిల్డ్రన్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ప్రకారం..ప్రపంచంలోనే అత్యధికంగా తామరకు సంబంధించిన చర్మ వ్యాధితో ఆస్ట్రేలియాలోని చిన్నారులే ఎక్కువుగా బాధపడుతున్నట్లు సమాచారం. (చదవండి: దేశంలోనే తొలి 'చేతి మార్పిడి' శస్త్ర చికిత్స! అదికూడా కిడ్నీ మార్పిడి..) -
జస్ట్ చెమటతోనే డయాబెటిస్‌ని గుర్తించే సరికొత్త సాంకేతిక పరికరం!
డయబెటిస్ని రోగులకు ఇక నుంచి సూదుల బాధ తప్పుతుందట. రక్త నమునాల కోసం సూదులతో తీయించుకునే సమస్య ఉండదు. జస్ట్ చెమటతోనే ఈజీగా గుర్తించే సాంకేతికతో కూడిన పోర్టబుల్ సిస్టమ్‌ని అభివృద్ధి చేశారు. ఈ పరికరం ఖర్చు కూడా తక్కువే. టైప్1, టైప్2 డయాబెటిస్ పేషెంట్ల ఇరువురికి ఉపయోగపడుతుందని చెబుతున్నారు శాస్త్రవేత్తలు. వివరాల్లోకెళ్తే..హైదరాబాద్‌లో పిలానీలోని బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ (బిట్స్) పరిశోధకులు, తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ (టీఎస్సీఓటీ) మద్దతుతో సాంకేతికతో కూడిన పరికరాన్ని అభివృద్ధి చేశారు. దీన్ని త్రీడీ ప్రింటింగ్, CO2 లేజర్ గ్రాఫేన్-ఆధారిత ఎలక్ట్రోడ్లను ఉపయోగించి రూపొందించినట్లు ప్రోఫెసర్ సాకేత్ గోయెల్ వెల్లడించారు. ఈ పరికరం రోగి నుంచి ఇంజెక్షన్లో రక్త నమునాలను సేకరించే సమస్యను పరిష్కారిస్తుందని చెబుతున్నారు. ఈ పరికరం రక్త నమునాల ఆధారంగా కూడా షుగర్ టెస్ట్ చేయగలదని అన్నారు. అయితే తమ లక్ష్యం చెమటలోని లాక్టేట్ సాంద్రత ఆధారంగా శరీరంలోని గ్లూకోజ్ స్థాయిలను కచ్చితంగా గుర్తించగలదా? అనే లక్ష్యంతో ఆవిష్కరించామని చెప్పారు. ఎలా పనిచేస్తుందంటే.. ఎలెక్ట్రోకెమిలుమినిసెన్స్ (ఈసీఎల్) ఆధారంగా పనిచేస్తుంది. ఈ పరికరం చెమటను ఇన్‌పుట్‌గా స్వీకరించిన తర్వాత విద్యుత్ సిగ్నల్‌ను ప్రేరేపిస్తుంది. ఆ తర్వాత కాంతిని అవుట్‌పుట్‌గా ఉత్పత్తి చేసి, రసాయన ప్రతిచర్యను ప్రారంభిస్తుంది. ఈ కాంతి తీవ్రతను ఆధారంగా లాక్టేట్ సాంద్రతను అంచనావేసి, తద్వారా గ్లూకోజ్ స్థాయిలను నిర్థారిస్తారు. ఇది షుగర్ పరీక్షల్లో కచ్చితమైన ఫలితాలను ఇస్తుందని చెప్పారు పరిశోధకులు. దీన్ని స్మార్ట్ ఫోన్లకు కనెక్ట్ చేసేలా పోర్టబుల్ పరికరాన్ని పరిశోధకులు బృందం విజయవంంతంగా అభివృద్ధి చేసింది. ఈ పరికరం ప్రత్యేకమైన యాప్ ద్వారా మానవ మెటాబోలేట్ డేటాను యాక్సెస్‌చేసేలా వినయోగదారులను అనుమతిస్తుంది. దీన్ని బల్క్‌లో ఈ ప్రోడక్ట్‌ని ఉత్పత్తి చేసేలా ఒక కంపెనీతో ఒప్పందం కుదుర్చుకోనున్నట్లు తెలిపారు. అయితే ఈ అత్యాధునిక పరికరం ఖరీదు రూన 300 నుంచి రూ. 400 మధ్యలోనే ఉంటుందని చెప్పారు. ఎలాంటి పెయిన్ ఎదుర్కొవాల్సిన అవసరం లేకుండా మధుమేహ పరీక్షలను చాలా సులభంగా ఈ సాధనంతో చెక్ చేయించుకోగలరని అన్నారు. (చదవండి: ఆరోగ్యంపై అవగాహన కల్పించేలా కడపుబ్బా నవ్వించే డాక్టర్!) -
‘బావ-బావమరిది చెమట కక్కి సంపాదించారా?’
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ శ్వేత పత్రానికి కౌంటర్ పేరిట.. బీఆర్ఎస్ స్వేద పత్రం రిలీజ్ చేయడంపై తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఘాటు విమర్శలు చేశారు. బావ, బావ మరది చెమట కక్కి సంపాదించారా? అని కేటీఆర్, హరీష్‌రావులను ఉద్దేశించి వ్యాఖ్యానించారాయన. ఢిల్లీ పర్యటన ముందుకు ఆయన ఎయిర్‌పోర్ట్‌లో మీడియాతో మాట్లాడారు. ‘‘ఏదో సాధించినట్లు బీఆర్ఎస్ స్వేద పత్రం అంటూ రిలీజ్ చేశారు. ఆ బావ, బావ మరిది వాళ్లేదో కష్టపడి చెమట చిందించి సంపాదించినట్లు చెబుతున్నారు. తెలంగాణ ప్రజల చెమటతో వచ్చిన ఆదాయం అది. వాళ్లు చేసిన అప్పుల్ని తీర్చాలంటే తెలంగాణ ప్రజలు స్వేదం చిందించాలి అని భట్టి వ్యాఖ్యాంచారు. ఎన్నికల ప్రచార సమయంలో రాహుల్ గాంధీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక బీఆర్ఎస్ నేతలు తిన్నవన్నీ కక్కిస్తామని అన్నారు. అది జరిగి తీరుతుంది. జ్యుడీషియల్ ఎంక్వైరీ కూడా త్వరలోనే ప్రారంభం అవుతుంది’’ అని అన్నారాయన. సీఎం రేవంత్‌రెడ్డితోపాటు భట్టి ఢిల్లీ పర్యటనలో పాల్గొంటారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన బకాయిలపై పలువురు కేంద్ర మంత్రులతో చర్చించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే.. ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అనంతరం.. కాంగ్రెస్ అగ్రనేతల్ని ఈ ఇద్దరూ కలవనున్నట్లు సమాచారం. -
రాత్రిళ్లు అకస్మాత్తుగా చెమటలు పడుతున్నాయా?
చాలామందికి రాత్రిళ్లు అకస్మాత్తుగా ఉన్నటుండి చెమటుల పడుతుంటాయి. చాలమంది వేడి చేసిందనో మరేదో సాకుతో కొట్టిపడేస్తారు. సీరియస్‌గా తీసుకోను కూడా తీసుకోరు. ఒక్కొసారి నలతగా ఉన్న ఇలా ఉంటుంది కదా అని చాలా తేలిగ్గా తీసుకుంటాం. ఆ నిర్లక్ష్యమే మన ప్రాణాలు కోల్పోయేలా చేస్తుంది. అందుకు ఉదహారణే యూకేకు చెందిన వ్యక్తి యూకేలోని బార్న్స్లీలో క్లర్క్‌గా పనిచేస్తున్న 48 ఏళ్ల ఫిర్త్‌కి రాత్రిళ్లు ఉన్నటుండి చెమటలు పట్టేసేవి. ఒళ్లునొప్పులు వల్ల అయ్యి ఉండొచ్చని, పెద్దగా సీరియస్‌గా తీసుకోలేదు. ఇలానే తరుచుగా అనిపించడంతో చివరికి ఓ రోజు డాక్టర్ని సంప్రదించాడు. ఫిజియోథెరపీ తీసుకుంటే తగ్గిపోతుందనే అనుకున్నాడు. అదే విషయాన్ని వైద్యుడితో కూడా చెప్పాడు. కానీ వైద్యులు అనుమానంతో ఫిర్త్‌కి కొన్ని వైద్య పరీక్షయలు నిర్వహించారు. ఆ పరీక్షల్లో అతడు మైలోయిడ్ లుకేమియా అనే క్యాన్సర్‌తో బాధపడుతున్నట్లు గుర్తించారు. రాత్రిళ్లు ఇలా చెమటు పట్టడానికి ఈ క్యాన్సర్ కారణంగాననే తేలింది. కానీ ఫిర్త్ తేలిగ్గా తీసుకోవడం కారణంగా ఆ క్యాన్సర్ స్టేజ్ కూడా దాటింది. ఈ వ్యాధి నిర్ధారణతో ఫిర్త్ కుటుంబ విలవిలలాడింది. అతడి భార్య, ఇద్దరు పిల్లల భవిష్యత్తు ఏంటని తీవ్ర మనోవ్యధకు గురయ్యాడు. ఏదో రకంగా బతకాలని ధైర్యం తెచ్చుకుని మరీ కీమోథెరఫీ చికిత్సలు తీసుకున్నాడు. అయితే ఈ క్యాన్సర్‌కి స్టెమ్ సెల్స్ మార్పిడి చికిత్స ఒక్కటే మార్గం. కానీ ఫిర్త్‌కి స్టెమ్‌సెల్ మార్పిడి చేయాలంటే కనీసం శరీరంలో 5%కి కంటే తక్కువ క్యాన్సర్ కణాలు ఉండాలి. ఫిర్త్ రెండు రౌండ్లు కీమో థెరపీ చికిత్స తీసుకున్నప్పటికీ శరీరంలో 40%కి పైగా క్యాన్సర్ కణాలు ఉన్నాయి. అందువల్ల స్టెమ్స్ మార్పిడి అనేది ఫిర్త్‌కి అత్యంత ప్రమాదం అవుతుంది. దీంతో అతడు జీవించే అవకాశాలు మెల్లిమెల్లిగా తగ్గిపోవడం మొదలైంది. చివరికి ఫిర్త్ జూలై 9, 2020న విషాదకర రీతిలో మరణించాడు. ఇలా ఫిర్త్లా చేజేతులారా ఆరోగ్యాన్ని పాడు చేసుకోవద్దు. ఇలా చెమటలు ఉన్నట్టుండి పడుతున్నా లేదా వాతావరణం చల్లగా ఉన్నా మీకు మాత్రం ఎడతెగని చెమటు పడుతున్నా.. అస్సలు అలక్ష్యం చేయొద్దని ఆరోగ్య నిపుణులు గట్టిగా హెచ్చరిస్తున్నారు. ఈ సూచనలు క్యాన్సర్ సంకేతాలు కూడా కావొచ్చనని, సాధ్యమైనంత వరకు బీ కేర్‌ఫుల్‌గా ఉండాలని నొక్కి చెబుతున్నారు వైద్యులు. (చదవండి: మాంసం తినే పరాన్నజీవి ఓ మహిళను శాశ్వతంగా అంధురాలిని చేసింది!) -
ఎక్కువగా చెమటలు పడుతున్నాయా? గుండెపోటు రావొచ్చు!
చెమటలు పట్టడం అనేది చాలా సాధారణ విషయం.. ఎందుకంటే శరీర శ్రమ అతిగా చేయడం వల్ల అందరిలో చెమట పడుతూ ఉంటుంది. ముఖ్యంగా వేసవిలో మరింత సహజం. అయితే కొందరిలో చెమట విచ్చలవిడిగా పడుతూ ఉంటుంది. దీంతోపాటు కొందరిలో అకస్మాత్తుగా చెమటలు వస్తాయి. ఇలాంటి లక్షణాలు ఉన్నవారు చాలామంది దీనిని సాధారణ సమస్యగా భావించి తేలిగ్గా తీసుకుంటున్నారు. దీని వల్ల భవిష్యత్‌లో ఆరోగ్య సమస్యలని కొని తెచ్చుకున్నట్లేనని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఇలా మీకు జరుగుతుంటే మాత్రం మీ ఒంటి మీద మీరు కాస్తంత శ్రద్ధ తీసుకోవాల్సిందే మరి! అకస్మాత్తుగా చెమటలు పట్టడం అనేకరకాల అనారోగ్య సమస్యలకు ముందస్తు సూచనలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. దీనిని గుండెజబ్బుల లక్షణాలలో ఒకటిగా వైద్యులు భావిస్తారు. తీవ్ర అనారోగ్య సమస్యలు వచ్చే ముందు తరచు ఆకస్మాత్తుగా చెమటలు పడతాయని నిపుణులు చెబుతున్నారు. మీలో ఇలాంటి లక్షణాలు ఉంటే వైద్యులను సంప్రదించడం, వారి సలహా మేరకు హెల్త్చెకప్ చేయించుకోవడం మంచిదని అనుభవజ్ఞుల సలహా. అధిక చెమట ఈ వ్యాధుల లక్షణాలలో ఒకటి... అకస్మాత్తుగా చెమటలు పట్టడం గుండెపోటు మొదటి లక్షణమని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. మహిళలకు రాత్రిపూట ఎక్కువగా చెమట పడడం వల్ల భవిష్యత్‌లో రానున్న తీవ్రసమస్యలకు సంకేతాలు. తీవ్ర దీర్ఘకాలిక వ్యాధుల కారణంగా కూడా ఎక్కువగా చెమట పడుతుందని వైద్యనిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా కొంతమందిలో మధుమేహం పెరగడం కారణంగా కూడా ఇలాంటి సమస్యలు వస్తాయి. అకస్మాత్తుగా వచ్చే చెమటలు రాకుండా ఉండాలంటే... ఆహారంలో ఉప్పు వాడకాన్ని తగ్గించడం. మద్యపానం అలవాటుంటే వెంటనే మానేయడం. ఆకు కూరలు, పీచు పదార్థాలు అధికంగా ఉండే ఆహారాలు తీసుకోవడం. గ్రీన్ టీ తీసుకోవడం ∙రోజుకు కనీసం మూడు లీటర్ల నీటిని తాగడం. డీప్ ఫ్రైలు, ఇతర నూనె పదార్థాలను తగ్గించడం. ప్రతిరోజూ తేలికపాటి వ్యాయామాలు చేయడం ∙పద్ధతి ప్రకారం డైట్ తీసుకోవడం అవసరం. -
నెక్లెస్ ఉంటే ఆరోగ్యం పదిలం...
నెక్లెస్‌కు, ఆరోగ్యానికి సంబంధమేంటి? ఇదేదో బోడితలకు మోకాలికి ముడిపెట్టే వ్యవహారంలా ఉందనుకుంటు న్నారా? మీరు తప్పులో కాలేశారన్న మాటే! ఇక్కడ చెప్పుకుంటున్నది సాదాసీదా నెక్లెస్‌ల గురించి కాదు. అలాగని కళ్లు మిరుమిట్లుగొలిపించే రవ్వల నెక్లెస్ కూడా కాదు. చూడటానికి సాదాసీదాగానే కనిపిస్తుంది గాని, ఇది స్మార్ట్ నెక్లెస్. దీన్ని మెడలో వేసుకుంటే చాలు, అనుక్షణం మీ ఆరోగ్యాన్ని కనిపెడుతూనే ఉంటుంది. ఏమాత్రం తేడా వచ్చినా, వెంటనే అప్రమత్తం చేస్తుంది. ఈ నెక్లెస్ వేసుకునేటప్పుడు, మెడవెనుక భాగంలో ఒక సెన్సర్ అమర్చి ఉంటుంది. ఈ సెన్సర్ చెమట ద్వారా ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు గ్రహిస్తూ ఉంటుంది. అమెరికాలోని ఒహాయో స్టేట్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఈ స్మార్ట్ నెక్లెస్‌ను రూపొందించారు. ఇప్పటికే దీనిని మనుషులపై ప్రయోగించి, అన్ని రకాల పరీక్షలూ చేశారు. సెన్సర్ అమర్చిన ఈ నెక్లెస్ చెమటలోని సోడియం, పొటాషియం, హైడ్రోజన్ అయాన్ల పరిమాణాన్ని 98.9 శాతం కచ్చితంగా గుర్తించగలుగుతోంది. అలాగే చెమటలో గ్లూకోజ్ స్థాయిలో వచ్చే మార్పులను ఇది ఇట్టే గుర్తించగలుగుతోందని ఒహాయో వర్సిటీ పరిశోధన బృందానికి చెందిన ప్రొఫెసర్ జింఘువా లీ తెలిపారు. డయాబెటిస్ రోగులకు ఇది అద్భుతంగా పనిచేస్తుందని, దీని ద్వారా ఒంట్లోని చక్కెర స్థాయిలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ, తగిన జాగ్రత్తలు తీసుకోవడానికి వీలవుతుందని వివరించారు. -
చెమట పట్టడం మంచి లక్షణమే.. కానీ శరీర దుర్వాసనను తగ్గించాలంటే..
చెమట పట్టడం చాలా సాధారణమైన జీవక్రియ. మనం బాగా శారీరక శ్రమ చేసినప్పుడు లేదా బాగా ఆటలాడినప్పుడు లేదా టెన్షన్ పడినప్పుడు, భయపడ్డప్పుడు చెమట పడుతుంది. ఇది సాధారణ పరిస్థితులలో. అయితే వేసవిలో మాత్రం ఇలాంటి వాటì తో పనిలేదు. కేవలం వాతావరణంలోని వేడి కారణంగా చెమట పడుతుంది. ఇది చాలా చికాకుగా అనిపిస్తుంది. నిజానికి చెమట పోయడం అనేది మంచి లక్షణమే అయినప్పటికీ వేసవిలో తలెత్తే అసౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ సమస్యను ఎదుర్కొనేందుకు కొన్ని మార్గాలు... ఒంటికి చెమటలు పట్టగానే చాలామంది చిరాకు పడతారు. నిజానికి అలా చెమట పట్టడం మన ఆరోగ్యాన్ని కాపాడేందుకు ప్రకృతి ఏర్పాటు చేసిన ఓ అద్భుత ప్రక్రియ. వాతావరణంలోని వేడి వల్ల లేదా, వేసవి ఎండల వల్ల దేహంలో ఉష్ణోగ్రత పెరిగినప్పుడు శరీరంలోని వ్యవస్థలన్నీ విఫలమయ్యే పరిస్థితి వస్తుంది. అలాంటి సందర్భాల్లో చర్మం మీద చెమట పట్టేలా చేసి, ఆ వేడిమి నుంచి కాపాడి దేహం చల్లగా అయ్యేలా ఏర్పాటు చేసింది ప్రకృతి. అంటే చెమట మన ప్రాణాలు కాపాడటమే కాదు. శరీర ఉష్ణోగ్రత ఎప్పుడూ స్థిరంగా ఉండేలా చూసి దేహక్రియలన్నీ సక్రమంగా జరిగేలా చూసే అపూర్వమైన ప్రక్రియ. అయితే కొన్ని సందర్భాల్లో అధికంగా చెమట పట్టడం వల్ల కొన్ని ఇబ్బందులూ తలెత్తవచ్చు. వాటికి ఉపశమనం కోసం జాగ్రత్తలను తెలుసుకుందాం. చెమట వల్ల సమస్యలు ►నలుగురిలోకి వెళ్లడానికి ఇబ్బందిగా అనిపించడం, శరీర దుర్వాసన. ►పిల్లల్లో చెమట పట్టడం వల్ల పరీక్షలు రాసే సమయంలో ఒక్కోసారి జవాబు పత్రం చిరిగిపోయే ప్రమాదమూ ఉంటుంది. ►టెన్నిస్, క్రికెట్ వంటి ఆటలు ఆడే క్రీడాకారుల్లో ఇలాంటి సమస్య ఉంటే బ్యాట్ లేదా టెన్నిస్ రాకెట్ జారిపోతుంటాయి. అందువల్ల వారు మాటిమాటికీ తుడుచుకోవలసి వస్తుంది. ►ఆఫీసులో పని సక్రమంగా జరగకపోవడం ►నలుగురు కలిసే సోషల్ గ్యాదరింగ్స్‌లో అందరితోనూ కలవలేకపోవడం, షేక్‌హ్యాండ్ ఇవ్వలేకపోవడం చదవండి: Summer Tips: చెరకురసంలో అల్లం, నిమ్మకాయ, పుదీనా కూడా కలిపి తాగితే.. ► కొందరిలో నడుస్తుండగానే చెమటల కారణంగా చెప్పులు/పాదరక్షలు జారిపోతుంటాయి. అలాంటివారు బూట్లు వేసుకోవడం కొంత మెరుగు. అయితే ఎప్పటికప్పుడు ఉతికిన, శుభ్రమైన సాక్సులు వాడుతుండాలి. లేకపోతే ఈ చెమటకు తోడు మలినమైన మేజోళ్ల కారణంగా మరికొన్ని సమస్యలు ఉత్పన్నమవుతాయి ► రోజుకు రెండుసార్లు స్నానం చేయడం ►మాయిశ్చరైజర్ సబ్బులు వాడేవారిలో చెమట ఎక్కువగా పట్టే అవకాశం ఉంది. ఇలాంటివారు నార్మల్ సబ్బులు వాడటం మంచిది. ►చెమటలు ఎక్కువగా పట్టేవారు దాన్ని తేలిగ్గా పీల్చుకునేలా కాటన్ / నూలు దుస్తులు «ధరించడం మంచిది. ►ఎప్పటికప్పుడు ఉతికిన, శుభ్రమైన బట్టలు ధరించాలి. శరీర దుర్వాసన ►శరీర దుర్వాసనను తగ్గించాలంటే విటమిన్ సి ఎక్కువగా ఉండే పండ్లు, చిరుధాన్యాలు ఎక్కువగా తీసుకోవాలి. క్యాల్షియం, మెగ్నీషియం కలిసి ఉన్న పదార్థాలను ఎక్కువగా తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందవచ్చు. ►అందుకోసం పాలు, క్యారెట్, ఆకుకూరలు, చేపలు, గుడ్లు, గుమ్మడి గింజలు ఎక్కువగా తీసుకోవాలి. జింక్ తగినంత ఉంటే నోటి, శరీర దుర్వాసన తొలగిపోవడంతోపాటు శరీరం చురుగ్గా పనిచేసేట్టు చేస్తుంది. ►నిమ్మరసం సహజసిద్ధమైన డియోడరెంట్ గా పనిచేస్తుంది. ఇది అధిక చెమటనూ తగ్గిస్తుంది. ►గోధుమగడ్డి జ్యూస్ తాగడం లేదా పొటాషియం ఎక్కువగా ఉండే అరటిపండ్లు తదితర ఆహారాలను తినడం వల్ల చెమట ఎక్కువగా పట్టకుండా చూసుకోవచ్చు. ► ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం భోజనానికి ముందు రెండు టీస్పూన్లు వెనిగర్, టీస్పూన్ యాపిల్ సైడర్ వెనిగర్‌లను కలిపి తాగితే చెమట ఎక్కువగా రాకుండా ఉంటుంది. ► ప్రతిరోజూ ఒక గ్లాసు టమాటా జ్యూస్‌ను తాగడం వల్ల చెమట సమస్య చాలా వరకు తగ్గుతుంది. ►బిగుతుగా ఉండే సింథటిక్ వస్త్రాలు వద్దు. వదులుగా ఉండే కాటన్ దుస్తులు వేసుకోండి. లో దుస్తుల్ని ఎప్పటికప్పుడు మార్చేయాలి. ► లో దుస్తులను వేడినీటిలో ఉతికి ఎండలో బాగా ఆరబెట్టువాలి. ►రోజుకు రెండుసార్లు కచ్చితంగా స్నానం చేయండి. బాహుమూలల్ని బాగా శుభ్రం చేసుకోండి. అవాంఛిత రోమాల్ని ఎప్పటికప్పుడు తొలగించుకోవాలి. ►డియోడరెంట్ వాడవచ్చు. లేదంటే టాల్కమ్ పౌడర్ రాసుకోవడం. ►ఆహారంలో అల్లం, వెల్లుల్లి, మసాలాల్ని బాగా తగ్గించాలి. శరీర ఉష్ణోగ్రతను పెంచే ఆహార పదార్థాలు, పానీయాలు తగ్గించాలి. తులసి, వేప ఆకులను కలిపి పేస్ట్ లా చేపి... స్నానం చేసేముందు ఒళ్లంతా బాగా రుద్దుకోవాలి. ఆపైన గోరువెచ్చని నీళ్లతో స్నానం చేయాలి. కొన్నాళ్ల పాటు ఇలా చేస్తే చెమట సమస్య శాశ్వతంగా తీరిపోయే అవకాశం ఉంది. ►ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఇంకా ‘చెమట’లు పట్టిస్తుంటే ఓసారి స్కిన్ స్పెషలిస్ట్‌ను సంప్రదించి వారి సలహాను బట్టి మందులు వాడటం ఉత్తమం. అంతేకానీ, అతిగా పట్టించుకున్నా, అసలు పట్టించుకోపోయినా ఇబ్బందే! చెమటలు ఎక్కువగా ఎందుకు పడతాయి? దీనికి రకరకాల కారణాలు ఉన్నాయి. శరీరం లో వ్యర్థాలు ఎక్కువగా పేరుకుపోయే వాళ్లలో చెమట సమస్య అధికంగా ఉంటుంది. థైరాయిడ్, డయాబెటిస్, హైపర్ టెన్షన్ లేదా కొన్నిరకాల ఇన్ఫెక్షన్లు కూడా అధిక చెమటకు కారణమవుతాయి. ఎలా బయటపడాలి? ఇంట్లోనే కొన్ని చిట్కాలతో ఈ అధిక చెమట సమస్య నుంచి సులువుగా బయటపడొచ్చు. మంచి నీళ్లు బాగా తాగడం, తేలికపాటి పోషకాహారం తీసుకోవడం, తినే ఆహారంలో విటమిన్ బి ఉండేలా చూసుకోవడం. (అరటిపండ్లు, గుడ్లు, గింజలు, ఆకుకూరలు ఈ జాబితాలో వస్తాయి.) ►రెండు టేబుల్ స్పూన్ల వెనిగర్, టేబుల్ స్పూన్ తేనెను ఓ గ్లాసు నీటిలో కలిపి ఉదయాన్నే పరగడుపున తాగడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ►నిమ్మకాయ రసాన్ని బాహుమూలల్లో రుద్దుకుని చల్లటి నీటితో కడిగేయాలి. ►కొబ్బరినూనెను చెమటలు ఎక్కువగా పట్టే ప్రాంతంలో రాస్తే అధిక చెమట నుంచి ఉపశమనం లభిస్తుంది. ►అలోవెరా జెల్లో చల్లదనాన్ని అందించే లక్షణం ఉంటుంది. ఈ జెల్‌ను చెమటలు ఎక్కువగా పట్టే ప్రాంతంలో నేరుగా రాయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ►బేకింగ్ సోడా వల్ల చెమట వల్ల శరీరం నుంచి వచ్చే దుర్వాసన పోతుంది. బేకింగ్ సోడాను కొంచెం నీటిలో కలిసి బాహుమూలల్లో రుద్దుకుని కాసేపటి తరువాత నీటితో కడిగేస్తే మంచి ఫలితం ఉంటుంది. ► బ్లాక్ టీలో ఉండే టానిక్ ఆసిడ్.. రక్తస్రావాన్ని ఆపే లక్షణాలతో పాటు, చెమటను ప్రభావవంతంగా అదుపులో పెడుతుంది. చల్లటి బ్లాక్ టీ లో ఓ శుభ్రమైన బట్టను ముంచి దాంతో బాహుమూలల్లో రుద్దుకోవడం వల్ల అధిక చెమట సమస్య నుంచి విముక్తి పొందవచ్చు. -
వింత ఫోబియా: కూరగాయలు, ఆహారం చూస్తే చాలు వణికిపోతుంది
లండన్: మనం ఇంత కష్టపడి సంపాదించేంది ఎందుకు జానెడు పొట్ట నింపుకోవడం కోసం మాత్రమే. కుబేరుడైనా సరే ఆకలేస్తే తినేది అన్నమే. మనిషి బ్రతకడానికి కావాల్సిన ముఖ్యమైన వాటిలో ఆహారం ప్రముఖ పాత్రం పోషిస్తుంది. అలాంటిది ఆహారాన్ని చూస్తేనే భయంతో చెమట పడితే. తిండి చూస్తే.. చెమట పట్టడం ఏంటి అని ఆలోచిస్తున్నారా.. కానీ ఇది వాస్తవం. ఓ మహిళ ఇలాంటి వింత ఫోబియాతోనే బాధపడుతుంది. సాస్ వేసి ఉన్న ఆహారాన్ని చూసిన.. వేర్వేరు పదార్థాలను కలిపి వండినా, వడ్డించినా.. తప్పుడు పద్దతిలో వడ్డించినా, కూరగాయాలు చూసినా ఆమెకు చెమటలు పడతాయట. ప్రస్తుతం ఆమె కేవలం టమాటా సూప్ తాగుతూ బతికేస్తుంది. ఆ వివరాలు.. ఇంగ్లండ్‌లోని నార్త్ యార్క్‌షైర్‌కు చెందిన షార్లెట్ విటిల్(34) తనకు ఊహ తెలిసిన దగ్గర నుంచి ఇంతవరకు ఒక్కసారి కూడా కూరగాయలు తినలేదట. గత కొన్నేళ్లుగా ఆమె రైస్ కేక్, టమాట సూప్ తాగుతూ జీవితాన్ని నెట్టుకొస్తుంది. బాల్యం నుంచి కూడా షార్లెట్ సరిగా తినేది కాదట. అది చూసి ఆమె తల్లిదండ్రులు ఆకలిగా లేదోమో అందుకే.. తినడం లేదని భావించేవారు మొదట్లో. బలవంతంగా ఏదైనా తిందామని ప్రయత్నిస్తే.. వాంతికి అయ్యేదట. (చదవండి: డెల్టాతో ఆస్పత్రిపాలయ్యే ప్రమాదం అధికం!) రాను రాను ఈ పరిస్థితి మరింత తీవ్ర కాసాగింది. సాస్ వేసిన ఆహారం చూసినా.. మిల్క్ షేక్‌లు, వేర్వేరు ఫుడ్ ఐటమ్స్‌ని కలిపి వడ్డించినా షార్లెట్‌కి నచ్చేది కాదు. ఇలాంటి ఆహారాన్ని చూస్తే ఆమె అరచేతుల్లో చెమటలు పట్టేవి. ఏళ్లు గడుస్తున్న కొద్ది షార్లెట్‌కి ఆహారం అంటే భయం పెరుగుతుంది.. తప్ప దాని మీద ఇష్టం కలగడం లేదు. ఈ క్రమంలో షార్లెట్ తల్లిదండ్రులు ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లి వైద్యులకు చూపించారు. డాక్టర్లు షార్లెట్‌ను పరిశీలించి.. ఆమె ఒక వింత ఫుడ్ ఫోబియాతో బాధపడుతుందని తెలిపారు. దీనివల్ల షార్లెట్ స్కూల్లో ఫ్రెండ్స్‌తో కలిసి తినేది కాదు. చదువుకునే రోజుల్లో తల్లిదండ్రుల వద్దే ఉండేది కాబట్టి.. ఈ ఫోబియా వల్ల షార్లెట్ పెద్దగా ఇబ్బంది పడలేదు. (చదవండి: మీకు కుక్కలంటే చచ్చేంత భయమా? ఐతే మీ కోసమే..) చదువు పూర్తయిన తర్వాత షార్లెట్‌కి ఉద్యోగం వచ్చింది. దాంతో ఆమె తల్లిదండ్రులను విడిచిపెట్టి వేరే ప్రాంతానికి వెళ్లాల్సి వచ్చింది. అక్కడ ఆఫీసులో ఉద్యోగులందరికి వంట చేసి పెడతారు. మొదట ఆ భోజనం చూసి షార్లెట్ చాలా భయపడేది. తర్వాత ధైర్యం చేసి తనకు ఉన్న ఫోబియా గురించి చెప్పి.. తన ఆహారాన్ని తానే వండుకోసాగింది. ఈ సందర్భంగా షార్లెట్ మాట్లాడుతూ.. ‘‘చిన్నప్పటి నుంచి కూరగాయలు చూస్తే నాకు భయం వేసేది. ఆహారం తీసుకోవాలని ప్రయత్నిస్తే వాంతికి వచ్చేది. పెరుగుతున్న కొద్ది భయం కూడా పెరగసాగింది. ఇప్పుడు ఆహారాన్ని సరిగా ఉడికించపోయినా.. సరిగా వడ్డించకపోయినా నాకు కడుపులో దేవేస్తుంది. ప్రస్తుతం నేను రైస్ కేక్, టమాటా సూప్ మాత్రమే తీసుకుంటున్నాను. ఈ ఫోబియా నా సోషల్ జీవితం మీద చాలా ప్రభావం చూపిస్తుంది. దీని వల్ల స్నేహితులతో కలిసి బయట తినడానికి వెళ్లలేకపోతున్నాను. కానీ ఈ పరిస్థితి నుంచి బయటపడాలని బలంగా కోరుకుంటున్నాను.. ప్రయత్న ప్రారంభించాను.. త్వరలోనే ఈ భయాన్ని జయిస్తాను’’ అని తెలిపింది. చదవండి: సాలీడు పురుగులంటే భయమా? ఈ యాప్‌తో.. -
చెమటతో మొబైల్ ఫోన్ ఛార్జింగ్...!
Charging With Finger Strip: మానవ పరిణామ క్రమంలో చక్రం నుంచి మొదలైన ఆవిష్కరణలు ఎన్నో ఇతర ఆవిష్కరణలకు దారితీశాయి. తన మేధ సంపత్తితో అనేక విషయాలను జయించాడు. రాబోయే విపత్తులను తెలుసుకోవడంలో, ప్రపంచంలో జరిగే ప్రతి విషయాన్ని తన మునివేళ్లపై తెచ్చుకున్నాడు. రకరకాల ఆవిష్కరణలతో సమాజం ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారాలను కనుగొంటున్నాడు. మానవుడి ఆవిష్కరణలో భాగంగా చెప్పుకోదగిన ఇన్నోవేషన్ మొబైల్ ఫోన్. సాధారణంగా మొబైల్ ఫోన్లు ఎదుర్కోంటున్న ప్రధాన సమస్య ఛార్జింగ్. ఫోన్లలో బ్యాటరీ పూర్తిగా ఐపోతే ఎందుకు పనికిరాదు. కాగా ఛార్జింగ్ సమస్యను కూడా పరిష్కరించడం కోసం సైంటిస్టులు ఇప్పటికే ప్రయత్నాలను మొదలుపెట్టారు.తాజాగా మానవ శరీరం నుంచి వెలువడే చెమటతో మొబైల్ ఫోన్లకు ఛార్జింగ్ చేయవచ్చునని పరిశోధకులు నిరూపించారు. చెమటతో ఛార్జింగ్ చేసే ప్రత్యేక ఆవిష్కరణను యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా పరిశోధకులు ఆవిష్కరించారు. పరిశోధకుల ప్రకారం.. చేతి వేళ్లకు ఒక ప్రత్యేకమైన స్ట్రిప్‌ను ఉంచుకోవడం ద్వారా మానవ శరీరం నుంచి వెలువడే చెమటనుపయోగించి విద్యుత్తును ఉత్పత్తి చేయవచ్చని పేర్కొన్నారు. 10 గంటల పాటు స్ట్రిప్‌ను ధరించడంతో సుమారు 400 మిల్లీజౌల్స్ వరకు శక్తిని ఉత్పత్తి చేయవచ్చునని పరిశోధనలో తేలింది. ఈ శక్తితో ఒక స్మార్ట్‌వాచ్ 24 గంటలపాటు నడుస్తుందని తెలిపారు. అంతేకాకుండా చేతి వేళ్లకు, మొబైల్ ఫోన్ స్క్రీన్‌పై ప్రత్యేక ఏర్పాటుతో మొబైల్ ఫోన్ ఛార్జింగ్ చేయవచ్చునని సైంటిస్టులు పేర్కొన్నారు. -
నో స్వెట్ సర్జరీ: గుండెపోటుతో యంగ్ బాడీ బిల్డర్ మృతి
Mexican Influencer Odalis Santos Mena: మెక్సికన్ ఇన్‌ఫ్ల్యూయెన్సర్, యంగ్ బాడీ బిల్డర్ ఒడాలిస్ సాంటోస్ మీనా శస్త్ర చికిత్స వికటించి మృత్యువాతపడింది. 23 ఏళ్ల ఒడాలిస్ తన శరీరంలోని చెమటను నివారించేందుకు చేసుకున్న సర్జరీ వికటించి జూలై7న ప్రాణాలు కోల్పోయింది. ఇటీవల మెక్సికోలోని గ్వాడాలజారాలోని స్కిన్పీల్ క్లినిక్ అండర్ ఆర్మ్(బాహువుల కింద) చెమటను తగ్గించడానికి చేసే చికిత్స ‘నో స్వెట్’ను ప్రోత్సహించడానికి ఓడాలిస్ను ప్రమోటర్‌గా నియమించుకుంది. ఇందులో చెమట గ్రంథులను తొలగించడానికి హీట్ ఎనర్జీని ఉపయోగిస్తూ చికిత్స చేస్తారు. ఇది శరీరంలోని దుర్వాసన, అండర్ ఆర్మ్ జుట్టును తగ్గించడానికి దోహదపడుతుంది. తాజాగా ఒడాలిస్ ‘నో స్వెట్’ చికిత్సను చేయించుకున్నారు. అయితే శస్త్రచికిత్సలో భాగంగా అధిక అండర్ ఆర్మ్ చెమటను నిరోధించేందుకు ఒడాలిస్ చెమట గ్రంథులను పూర్తిగా తొలగించారు. ఈ క్రమంలో మత్తుమందు ఇంజక్షన్ తీసుకున్న తర్వాత ఆమె గుండెపోటుకు గురయ్యారు. అయితే క్లినిక్‌లోని హెల్త్‌కేర్ వర్కర్స్ ఆమెను కాపాడేందుకు ఎంత ప్రయత్నించినప్పటికీ ఒడాలిస్ చనిపోయారు. కాగా ఒడాలిస్ మృతిపై విచారణ కొనసాగుతోందని పోలీసులు తెలిపారు. ఆమెకు అందించిన మత్తుమందు, స్టెరాయిడ్ ప్రభావం వల్లే మరణించినట్లు పోలుసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే క్లినిక్‌లో శిక్షణ లేని వ్యక్తి మత్తుమందు ఇవ్వడం వల్లే ఆమె చనిపోయిందని అక్కడి మరో మీడియా పేర్కొంది. ఇక సాంటోస్ మీనాకు ఇన్‌స్టాగ్రామ్‌లో లక్షలకు పైగా ఫాలోవర్స్ ఉన్నారు. పలు బాడీ బిల్డింగ్ పోటీల్లో పాల్గొంది. అలాగే 2019లో మిస్ మరియు మిస్టర్ హెర్క్యులస్ టైటిల్‌తో పాటు వెల్నెస్ ఫిట్నెస్ జువెనైల్ పోటీల్లో కూడా గెలిచింది View this post on Instagram A post shared by Odalis Santos Mena (@odalis_sm) View this post on Instagram A post shared by Odalis Santos Mena (@odalis_sm) -
మీ చేతివేళ్లే ఫోన్ చార్జర్! చెమట నుంచి కరెంట్
స్మార్ట్‌ఫోన్ లేనిదే కాలం గడవని పరిస్థితి. రోజూ ఒకట్రెండు సార్లు చార్జింగ్ పెట్టాలి. ఎక్కడికైనా వెళ్తే చార్జర్ కూడా వెంట తీసుకెళ్లాలి, లేకుంటే వెళ్లిన చోట చార్జర్ కోసం వెతుకులాట తప్పదు. ఇక ముందు అలాంటి తిప్పలు తప్పనున్నాయి. విడిగా చార్జర్ అవసరమేదీ లేకుండా.. మీ చేతి వేళ్లే చార్జర్‌గా మారిపోనున్నాయి. అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా శాస్త్రవేత్తలు అలాంటి ఓ సరికొత్త సాంకేతికతను అభివృద్ధి చేశారు. ఆ విశేషాలు ఏమిటో చూద్దామా? చిన్న ప్లాస్టర్‌లా వేసుకుంటే చాలు.. ఎప్పుడైనా చిన్నపాటి గాయమైతే వేసుకునే ప్లాస్టర్ తరహాలోనే.. ఈ సరికొత్త పరికరాన్ని శాస్త్రవేత్తలు రూపొందించారు. దీని పరిమాణం ఒక చదరపు సెంటీమీటర్ మాత్రమే. దీన్ని అమర్చిన స్ట్రిప్‌ను చేతివేలి కొసలకు చుట్టేసి పెడితే చాలు.. ప్రత్యేకంగా ఏమీ చేయాల్సిన అవసరం లేదు. కూర్చుని ఉన్నా, పడుకున్నా, ఇంకేదైనా పనిలో ఉన్నా సరే.. ఆటోమేటిగ్గా అదే చార్జ్ అవుతూ ఉంటుంది. చెమట నుంచి కరెంటు ఈ పరికరంలో కార్బన్ ఫోమ్‌తో తయారైన ఎలక్ట్రోడ్లు, కొన్నిరకాల ఎంజైమ్‌లు ఉంటాయి. అవి చేతి వేళ్ల వద్ద ఏర్పడే చెమటను గ్రహించినప్పుడు.. రసాయనిక చర్యలు జరిగి విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. అంతేగాకుండా ఇందులోని ఎలక్ట్రోడ్ల దిగువన ‘పీజో ఎలక్ట్రిక్ మెటీరియల్ (ఒత్తిడికి లోనైనప్పుడు విద్యుత్ ఉత్పత్తి చేసే పదార్థాలు)’ను అమర్చారు. దీనివల్ల మనం ఏదైనా వస్తువును పట్టుకోవడం, కీబోర్డుపై టైపింగ్ చేయడం, కారు, బైక్ నడపడం వంటివి చేసినప్పుడు వేళ్లకు ఉన్న స్ట్రిప్‌లపై ఒత్తిడిపడి.. విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. పరికరంలోని కెపాసిటర్‌లో ఆ విద్యుత్ నిల్వఅవుతుంది. టెస్టులు.. పరికరాలకు.. ప్రస్తుతం ఒక స్ట్రిప్‌ను పది గంటల పాటు ధరిస్తే.. ఒక సాధారణ చేతి గడియారాన్ని 24 గంటలపాటు నడిపేంత విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తుందని శాస్త్రవేత్తలు వెల్లడించారు. అదే పది వేళ్లకు పది స్ట్రిప్‌లను ధరిస్తే ఎక్కువ ఉత్పత్తి చేయవచ్చని పేర్కొన్నారు. ఈ స్ట్రిప్ ప్రస్తుతానికి ప్రాథమిక నమూనా మాత్రమేనని, పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసి విద్యుత్ ఉత్పత్తి, నిల్వ సామర్థ్యాన్ని పెంచుతామని తెలిపారు. గుండెకు అమర్చే పేస్ మేకర్లు వంటి పరికరాలకు, బ్లడ్ షుగర్, విటమిన్, సోడియం సెన్సర్లు, ఇతర టెస్టుల కోసం శరీరానికి అమర్చే పరికరాలకు ఈ స్ట్రిప్‌ల సాయంతో విద్యుత్ అందించవచ్చని శాస్త్రవేత్తలు తెలిపారు. హా ప్రస్తుతం ఒక్కో స్ట్రిప్‌తో సెల్‌ఫోన్‌ను చార్జింగ్ చేయడానికి మూడు వారాలు పడుతుందని.. భవిష్యత్తులో కొద్దిగంటల్లోనే చార్జ్ అయ్యే స్థాయికి అభివృద్ధి చేస్తామని వివరించారు. - సాక్షి సెంట్రల్‌డెస్క్ -
చెమట సరిపోతుందిగా...
చెన్నై: బంతి మెరుపు పెంచేందుకు బౌలర్లు లాలాజలం (ఉమ్ము)కు బదులు చెమటను ఉపయోగించవచ్చని భారత మాజీ పేసర్, మ్యాచ్ రిఫరీ జవగళ్ శ్రీనాథ్ సూచించాడు. కరోనా నేపథ్యంలో కుంబ్లే నేతృత్వంలోని ఐసీసీ కమిటీ బంతి షైనింగ్‌కు లాలాజలం వాడటాన్ని నిషేధించింది. దీంతో కృత్రిమ పదార్థం వాడే వెసులుబాటు ఇవ్వాలని ప్రపంచ వ్యాప్తంగా చర్చ నడుస్తోంది. దీనిపై శ్రీనాథ్ మాట్లాడుతూ ‘ఉమ్ముకు ప్రత్యామ్నాయంగా చెమటను వినియోగించవచ్చు. నిజానికి ఆటలో లాలాజలానికంటే చెమటనే ఎక్కువగా ఉపయోగిస్తాం. కాబట్టి ఉమ్ము వద్దన్నంత మాత్రాన అదో సమస్య కాదు. తరచూ చేతితో ఉమ్మును అందుకొని బంతికి రాయడమనేది అలవాటైంది. ఇప్పుడు దీన్ని మార్చుకుంటే సరిపోతుంది. కొత్త మార్గదర్శకాలను పాటించాలి. లాలాజలానికి బదులుగా చెమట రాయడాన్నే అలవాటు చేసుకుంటే భవిష్యత్తులో దీని పాత్రే కీలకమవుతుంది’ అని అన్నాడు. -
చెమట చెబుతుంది మద్యమెంతో...!
ఎంత మద్యం తాగారో తెలుసుకునేందుకు ఇప్పుడు వాడుతున్నారే.. బ్రీతలైజర్లు.. వాటికి త్వరలో కాలం చెల్లిపోనుంది. బాగానే పనిచేస్తున్నా.. దీంతో సమస్యలూ ఉన్నాయి. అందుకే వీటి స్థానంలో చెమట నుంచి ఆల్కహాల్ మోతాదును అంచనా వేసేందుకు ఓ కొత్త పద్ధతి, టెక్నాలజీ అందుబాటులోకి రానుంది. న్యూయార్క్‌లోని అల్బేనీ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు దీన్ని అభివద్ధి చేస్తున్నారు. మన ఊపిరిలోని ఎథనాల్ మోతాదును లెక్కకట్టడం ద్వారా బ్రీతలైజర్లు పనిచేస్తాయన్నది మనకు తెలిసిందే. అయితే మీరు మౌత్‌వాష్ వాడారనుకోండి. దాంట్లోని ఎథనాల్ ద్వారా కూడా మీ రీడింగ్ మారిపోవచ్చు. మధుమేహులైతే... వారి ఊపరిలోని ఎసిటోన్ కూడా బ్రీతలైజర్ రీడింగ్ మార్చేస్తుంది. ఈ చిక్కులన్నింటినీ అధిగమించేందుకు అల్బేనీ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు కొత్త టెక్నాలజీని అభివద్ధి చేశారు. ఐస్‌క్రీమ్ స్టిక్ లాంటిదానిపై చెమటచుక్కను వేస్తే సరి.. మద్యం ఉంటే దానిపై ఓ రంగు చుక్క ఏర్పడుతుంది. రంగు ముదురుగా ఉంటే ఎక్కువ, లేతగా ఉంటే తక్కువ మద్యం ఉందని అర్థం. ఈ ముదురు, తేలిక రంగు తేడాలను గుర్తించడం కష్టమని అంటున్నారా? నో ప్రాబ్లెమ్. ఓ స్మార్ట్‌ఫోన్ అప్లికేషన్ ద్వారా రంగు అర్థాలను వివరించేందుకు ఏర్పాట్లు ఉన్నాయి. ఇప్పటికే కొంతమందిపై ఈ పట్టీని ప్రయోగాత్మకంగా పరిశీలించి మంచి ఫలితాలు సాధించారు. అనలిటికల్ కెమిస్ట్రీ మేగజైన్లో పరిశోధన తాలూకూ వివరాలు ప్రచురితమయ్యాయి. -
చలికాలంలో చెమటలు.. అతన్ని పట్టించాయి
కశ్మీర్ : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కథువా అత్యాచార కేసులో కోర్టు ఆరుగురు నిందితులకు శిక్ష విధించిన సంగతి తెలిసిందే. వీరిలో జీవిత ఖైదు పడిన సాంజి రామ్ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు అధికారులు. ఆర్కే జల్లా అనే అధికారి మాట్లాడుతూ.. కేసు విచారణ నిమిత్తం సాంజీ రామ్ ఇంటికి వెళ్లినప్పుడు అతని ప్రవర్తన చాలా విచిత్రంగా తోచింది. మా నుంచి ఏదో దాచడానికి ప్రయత్నించాడని తెలిపాడు. ‘అప్పటికే అతని మైనర్ అతని మేనల్లుడిని జువైనల్ హోమ్‌కు తరలించాం. సాంజీని,అతని కుమారుడు విశాల్‌ని విచారించే నిమిత్తం అతని ఇంటికి వెళ్లినప్పుడు మమ్మల్ని చూడగానే చాలా కంగారు పడ్డాడు. భయంతో కంపించిపోయాడు. దర్యాప్తులో భాగంగా అతన్ని ప్రశ్నిస్తుండగా.. పొంతన లేని సమాధానాలు చెప్పాడు’ అని గుర్తు చేసుకున్నాడు. ‘అతని కొడుకు గురించి ప్రశ్నించగా.. మీరట్‌లో చదువుతున్నాడని.. కావాలంటే తన కాల్ రికార్డ్ డాటా(సీఆర్డీ)ను పరిశీలించుకోవచ్చని తెలిపాడు. అప్పుడు నాకు రెండు విషయాలు ఆశ్చర్యం కలిగించాయి. ఒకటి సీఆర్డీ చెక్ చేసుకోమంటూ మాకే సలహా ఇవ్వడం.. రెండు చలి విపరీతంగా ఉండే జనవరిలో అతనికి చెమట పట్టడం. దాంతో మాకు ఆశ్చర్యంతో పాటు అనుమానం కూడా కలిగింది. అతని మీద బెనిఫిషరి ఆఫ్ డౌట్ కింద కేసు నమోదు చేసి.. తదుపరి విచారణను పూర్తి చేశామని వెల్లడించారు. సాంజీ తన కుమారున్ని కాపాడుకోవడానికి అన్నివిధాల ప్రయత్నం చేశాడని జల్లా పేర్కొన్నారు. కేసు దర్యాప్తులో తమ మీద ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లు రాలేదని జల్ల స్పష్టం చేశారు. సాక్ష్యాధారాలు సేకరించేందుకు తాము చేసిన కృషిని హై కోర్టు గుర్తించి ప్రశంసించిందని తెలిపారు. (చదవండి : సరైన తీర్పు) -
స్వేదం...ఖేదం
కొన్ని రకాల శారీరక తత్వాలకు అనుగుణంగా ఏడాదంతా చెమట సమస్య ‘హైపర్హైడ్రోసిస్’ ఇది కొందరిలోనే కనిపిస్తుంది. అయితే వేసవిలో అందరి సమస్యగా మారుతుంది. మరి దీనిని ఎలా ఎదుర్కోవాలి? ఈ సీజన్లో స్వెట్ మేనేజ్మెంట్పై నగరానికి చెందిన వైద్యులు ఏమంటున్నారంటే. సాక్షి, సిటీబ్యూరో: మనం వేడి వాతావరణంలో పనిచేయడానికి సిద్ధపడినప్పుడే శరీరపు ఉష్టోగ్రతను తగిన విధంగా నియంత్రించడానికి శరీరం చెమటను ఉత్పత్తి చేస్తుంది. అధిక బరువు తరహాలో అధిక చెమట అని నిర్వచించడానికి కొలమానం లేదు. ఎంత మొత్తమైతే శారీరక ఇబ్బందులకు కారణం అవుతుందో అదే అతి స్వేదంగా ప్రస్తుతానికి పేర్కొంటున్నారు. మితి మీరితే...సమస్యలే... అధికంగా చెమట పడితే చర్మం కణాలు పాడయ్యేందుకు చర్మం కింద వాపులకు కారణం కావచ్చు. చెమట కారణంగా నీటి శాతం వేగంగా కోల్పోవడం తద్వారా శరీరపు ఉష్ణోగ్రత పరిమితికి మించి దాటి పోవడం వల్ల వడదెబ్బకు గురవుతాం. విపరీతమైన వేడిలో ఎక్కువ సేపు ఉండడం వల్ల శరీరంలోని నీటిశాతం ఆవిరై అకస్మాత్తుగా కుప్పకూలిపోవడం జరుగుతుంది. ఇలాంటి పరిస్థితులు తలెత్తకుండా ఉండాలంటే తగినంత చల్లదనం ఉన్న ప్రదేశాల్లో ఉంటూ, మంచినీరు, ద్రవపదార్థాలు బాగా తీసుకోవాలి అంటున్నారు..నిజాంపేటలోని అపోలో క్లినిక్‌కు చెందిన డాక్టర్ కల్పన. స్వేదం...దుర్గంధం.. వాస్తవానికి చెమటకు దుర్గంధం వెదజల్లే గుణం ఉండదు కానీ, అక్కడ బాక్టీరియా పెరుగుతున్న కొద్దీ వాసన కూడా పెరుగుతుంది. పొడి చర్మం మీద బాక్టీరియా వృద్ధి చెందలేదు కాబట్టి ఎప్పుడూ చర్మాన్ని వీలైనంతగా పొడిగా ఉంచుకోవాలి. కొన్ని రకాల కొవ్వు పదార్థాలు, నూనెలు, గాఢమైన వాసన వచ్చే ఉల్లిపాయలు, వెల్లుల్లి ఆహార పదార్థాలు కూడా చెమటలోని దుర్గంధాన్ని పెంచుతాయి. చెమట వెలువరించే వాసనను నిరోధించడానికి డియోడరెంట్స్ ఉపకరిస్తాయి. అయితే వీటి వల్ల చెమట తగ్గదనేది గుర్తుంచుకోవాలి. అల్యుమినియం సాల్ట్స్ కలిగి ఉండే యాంటిపెరిస్పిరెంట్ ఎంచుకోవాలి. వీటిని రాత్రి పూట ఉపయోగించడం మంచిది. ఇవి చెమట కారడాన్ని అదుపు చేస్తాయి. అయితే ఇవి అధికంగా వినియోగిస్తే చర్మంపై ఇరిటేషన్‌కు కారణమవ్వొచ్చు. కెఫిన్...నాట్ ఫైన్ ... రోజువారీగా మనం తీసుకునే కాఫీ/టీ పరిమా ణం సైతం మనకు చెమట పెరిగేందుకు కారణమవుతుంది. కేంద్ర నాడీ మండలాన్ని కెఫైన్స్టిమ్యులేట్ చేస్తుంది. ఇది స్వేద గ్రంథుల్ని చురుగ్గా మారుస్తుంది. కాఫీ మీద మరీ మక్కువ ఉంటే కోల్డ్ కాఫీ కొంత మేలు. అలాగే స్పైసీ ఫుడ్ వల్ల అంతర్గత వేడి పెరుగుతుంది. ఈ స్పైసీ ఫుడ్లోని పెప్పర్స్‌లో ఉండే క్యాప్సాౖయెసిన్ శరీరం చల్లబడాల్సిన అవసరం ఉందని స్వేద గ్రం ధులకు సమాచారం పంపడంతో చెమట పెరుగుతుంది. అధిక కాల్షియం ఉన్న ఆహారం తీసుకుంటే అవి శరీరపు ఉష్టోగ్రతను నియంత్రించేందుకు అవసరమైన ఎమినో యాసిడ్స్‌ను ఉత్పత్తిచేస్తాయి. షవర్...హుషార్.. యాంటి బాక్టీరియల్ సోప్‌ను స్నానానికి వినియోగించాలి. రోజూ షవర్ స్నానం మంచిది. పూర్తిగా శరీరం పొడిగా అయ్యేలా తుడుచుకోవాలి. స్ప్రేలు, పౌడర్స్, రోల్ ఆన్స్ రూపాల్లో అందుబాటులో ఉన్న యాంటి పెర్సిపిరెంట్ అప్లై చేయాలి. పాలిస్టర్, నైలాన్ వంటి ఫ్యాబ్రిక్స్ వద్దు. లేత రంగు కాటన్, లినెన్, లైట్ వెయిట్ డెనిమ్ వంటి ఫ్యాబ్రిక్స్ వినియోగం మంచివి. చెమటను పీల్చుకునే ఫ్యాబ్రిక్స్‌ను ఎంచుకోవాలి. ఒకసారి చర్మం చల్లబడి పొడి బారిన తర్వాత కోల్డ్ క్యాలమైన్ లోషన్ అప్లై చేయవచ్చు. ప్రిక్లీ హిట్ పౌడర్ కూడా ఉపకరిస్తుంది. గర్భిణులు జాగ్రత్త... ఎండాకాలంలో చిన్న బరువు కూడా పెద్దగా అనిపిస్తుంది. రెట్టింపు చెమట పడుతుంది. ఈ సమయంలో గర్భం దాల్చిన మహిళలకు చెమట సమస్య మరింతగా వేధిస్తుంది. ఈ సమయంలో వీరి మెటబాలిజం కూడా ఇద్దరి కోసం పనిచేస్తుంది కాబట్టి అది మరింత స్వేదానికి కారణమవుతుంది. వీరు ఎక్కువ మంచినీరు తాగడం అవసరం. ఎక్కువ ఎండ లేని సమయంలోనే బయటకు వెళ్లాలి. రాత్రి పూట స్వేదం వల్ల నిద్ర సరిగా పట్టని పరిస్థితులు ఎదురవుతాయి కాబట్టి చెమట పట్టని విధంగా రూమ్ టెంపరేచర్ తక్కువగా ఉండేలా చూసుకోవాలి. సలాడ్స్, జ్యూస్‌లు బాగా తీసుకోవాలి. బరువు మరీ పెరగకుండా చూసుకోవడం కూడా అవసరమే. బయటకు వెళుతుంటే తప్పకుండా ఒక వాటర్ బాటిల్ దగ్గర ఉంచుకోవడం మంచిది. కాఫీ, టీలకు బదులు హెర్బల్ టీ తాగవచ్చు. సోడాలు కూల్‌డ్రింక్స్ వద్దు. –డాక్టర్ రోలికా కేశ్రి, అపోలో క్రెడిల్, కొండాపూర్ -
ఋషి
అవి వినాయక నవరాత్రులు. నవరాత్రులలో మూడోరోజులాగే సాయంత్రం అవుతుంది. ప్రకృతిలో జరుగుతున్న మార్పులే ఆరోజూ జరుగుతున్నాయి. పక్షులు తమ గూటికి చేరుకుంటున్నాయి. పశువులు కల్లం వైపు కదులుతున్నాయి. తెల్లనైన సూర్యుడు పడమటి కొండకు చేరి ఎరుపెక్కుతున్నాడు. మేత నుండి కల్లంకి పశువులకు పుల్లని కుడితిలో చిట్టేసి కలిపి తొందరగా పెడుతున్నాడు అప్పలరాములు.లేగదూడలను ఒక్కొక్కటిగా విప్పి, ఆవు సేపిన తరువాత దూడను తల్లి కట్టు వద్ద కట్టి పాలు పితికాడు. బయట ఉన్న ఆవులను శాలలో కట్టి రాత్రికి సరిపడినంత వరిగడ్డిని వాటి ముందు వేసాడు.పాలు గుడిసిన లేగదూడలను కూడా కట్టేసి, పాలను పట్టుకొని ఇంటికి వడివడిగా అడుగులు వేశాడు. చెమటతో ఉన్న వంటిని స్నానంతో శుభ్రం చేసి, తెల్లపంచె కట్టుకుని, రాత్రి భోజనం పెట్టేయ్యమని భార్యను తొందర చేశాడు అప్పలరాములు. ‘‘నాయనా మళ్లీ ముఖానికి రంగెయ్యటానికెలిపోతున్నావా ఏటి? ఇంత పెద్ద కుటుంబంలో పుట్టి ఈ నాటకాలెక్కడి నుంచి మరిగినావో!’’ అని తిడుతూనే అప్పుడే అన్నం ఓర్చిన కుండను పైకెత్తి జిబ్బిలో ఉన్న అన్నాన్ని కొంత ఓరిమి తీసి, పళ్లెంలో రెండు ముద్దలు వడ్డించి అప్పలరాముని ముందు పెట్టింది భార్య.చిన్న చిరునవ్వు నవ్వి ‘‘ఇంట్లో ఎవ్వరికి తెలియనియ్యకే’’ అంటూ తొందర తొందరగా కుండ బరువును గుండెకి దించేసి కమీజు తొడుక్కొని, తువ్వాలు భుజంపై వేసుకున్నాడు అప్పలరాములు.ఇంట్లో ఎవరికీ కనబడకుండా వెనుక దొడ్డి నుండి పరుగులాంటి నడకందుకున్నాడు.రాజాం బస్టాండ్ చేరుకునేసరికి తన సమాజం సభ్యులందరూ తన కోసమే ఎదురుచూస్తున్నారు.‘‘ఏటి అప్పలరాములు ఎప్పుడూ లేటే నువ్వు...ఇప్పటికే రెండు బస్సులెళ్లిపోనాయి...పోనీలే ఈ బస్సుకేనందినావు...లేకపోతే ఆ వూరోల్తోటి మాట కాసిద్దుము’’ అని నాటక సమాజపు గురువు శ్రీనుబాబు అప్పలరాముని చనువుగా తిట్టాడు.‘‘మరేటి పర్లేదులే వచ్చేన్ను కదా శీనుబాబు...ఎక్కండి ఎక్కండి’’ అని తనను పలకరిస్తున్న సభ్యులని తొందరపెట్టాడు అప్పలరాములు. బస్సు గమ్యాన్ని చేరుకుంది. ఆ వూళ్లో కమిటీ వారు నాటక సమాజాన్ని ఆహ్వానించి వాళ్లకు భోజన వసతి కల్పించారు.‘‘మరి కొద్దిసేపట్లో...మరికొద్ది క్షణాల్లో...మన గ్రామంలో రాష్ట్రస్థాయి కళాకారులచే హరిశ్చంద్ర నాటకం ప్రదర్శించబడుతుంది’’ అంటూ కమిటీలోని మైకువీరులు జనాలను ఉదరగొడుతున్నారు.చెక్క బల్లలతో స్టేజిని వేశారు.కమిటీ వాళ్లు పైన ఒక పరజాగుడ్డను కట్టారు.ముందు పొట్టి, పొడుగు వాళ్లకు కూడా అందేటట్టు మైకులు కట్టారు.స్టేజు వెనుక నాలుగు పక్కలా దుప్పట్లు, పరదాల సాయంతో గ్రీన్‌రూమ్ కట్టారు.గ్రీన్‌రూమ్ చుట్టూ రంగు వేయక ముందు పాత్రధారుల రూపాలను చూడాలనే ఆతృత కనబరుస్తున్న ఆ వూరి యువజనులు...స్టేజ్ ముందు మంచు పడకుండా తలపాగాలు చుట్టి, దుప్పట్లు కప్పుకుని, తోడుగా తెచ్చుకున్న దుడ్డుకర్రలను భుజాలకు చేరవేసి, చుట్టలు, బీడీలు కాల్చుకుంటూనాటక ప్రదర్శన కోసం ఎదురు చూస్తున్న ప్రేక్షకులు...వారి వెనకాల చుట్టలు, బీడీలు, టీలు అమ్ముతూ రెండు కొట్లు.‘‘ఎప్పుడా ఎప్పుడా అని ఎదురుచూస్తున్న నాటకం మరి కొద్దిక్షణాల్లోనే’’ కమిటీలోని మైకువీరుడు మరొక్కమారు మైకు ముందు తన కంఠాన్ని ప్రదర్శించాడు.నాటకం సిద్ధమయ్యిందోచ్ అన్నట్లుగా శీనుబాబు హార్మోనియంలో కొత్త సినిమా పాటలను వాయిస్తూ ప్రేక్షకును నాటకవీక్షణానికి సిద్ధం చేశాడు. కర్టెన్ వెనుక నుంచి ప్రార్థన గీతాన్ని ఆలపించి తమ గొంతులను శుద్ధి చేసుకున్నారు నాటక సభ్యులంతా.తెర తొలగించారు.ఆగ్రహోదగ్రుడైన విశ్వామిత్ర మహర్షి వేదిక మీదకు వచ్చి...‘‘సత్యసంధుడట, హరిశ్చంద్రుడట’’ అంటూ పేజీల డైలాగులను గుక్క తిప్పుకోకుండా చెబుతుంటే ముందున్న ప్రేక్షకులు నిజంగా మనల్ని శపించేసినట్లున్నాడీ విశ్వామిత్రుడని భయపడుతూ తమ శ్వాసలను నిలబెట్టేశారు.తరువాత హరిశ్చంద్ర, చంద్రమతుల ప్రవేశం, మాతంగి నృత్యం, అటుపిమ్మట విశ్వామిత్రుడు మరలా వేదిక పైకి రావటం, హరిశ్చంద్రుని కిరీటమెగరేసి తన్నటం, ప్రేక్షకులకు ఒక విధమైన గగుర్పాటు. ఆ తరువాత వారణాసి సీనులో వచ్చిన కాలకౌశికుడు భార్యావిధేయుడిగా ప్రేక్షకులందరినీ హాస్యంలో ముంచెత్తాడు.అటుపిమ్మట హరిశ్చంద్రుని కొనటానికి వచ్చిన వీరబాహుడు నిజంగా కర్కోటకుడేమో అంటూ ప్రేక్షకులు తమ అసహ్యాన్ని ఆ పాత్రపై ప్రదర్శించారు.ఈవిధంగా చూస్తున్న ప్రతి ఒక్క ప్రేక్షకుడిని రసస్థాయికి తీసుకువెళ్లి, భయపెట్టి, ఆనంద పెట్టి, అసహ్య పెట్టించిన పాత్రధారుడు ఒక్కడే...అతడే ఇందాకటి అప్పలరాములు.తన వేషాన్ని తీసేసిన తరువాత ఏమీ తెలియని వాడిలాగా గ్రీన్‌రూమ్‌లో ఉన్న మేకప్ సామానుల పక్కన కూర్చున్నాడు. నాటకం పూర్తయ్యేసరికి తెల్లవారుజాము అయింది.‘‘శీను బాబూ...సాయంత్రం రూమ్కొచ్చి కలుస్తాను. పొలములో పనులున్నాయి. ఫస్ట్ బస్సెక్కి పోతాను’’ అంటూ సెలవు తీసుకొని ఆ వూరిలో ఉన్న నైటాల్ట్ బస్సెక్కి పూర్తిగా తెల్లారేసరికి కల్లానికి సేరుకున్నాడు. మరలా పశువుల్ని బయటకట్టి, పేడలు తీసి కసవ తుడిచి పెంటలో వేసేశాడు.పాలు తీసి ఇంటికి చేరుకొని భార్యకు అందించాడు.‘‘నాటకం తగిలితే ఇంటిపట్టునుండవు. ఏమి పుట్టుక పుట్టినావో’’ అంటూ భార్య అప్పలరాముడిని తిడుతూ టీ సుక్కలు కాసి యిచ్చింది.పాపం రాత్రంతా నిద్రలేక నాటకమాడొచ్చిన భర్తను తిట్టడం తనకూ ఇష్టం లేదు. తనుంటున్నది ఉమ్మడి కుటుంబం...తోడికోడళ్లు, బావలు, అత్తమామలు అందరూ రాత్రిపూట కలిసి భోజనాలు చేసినప్పుడు మాట్లాడుకుంటారు.తన భర్త నాటకాలకు వెళ్లిన రోజున...‘‘ఈడికి పనులు సెయ్యడానికి వొళ్లొంగక నాటకాలు మరిగినాడు’’ అంటూ బావలంటుంటే...‘‘మీరు లేరేటి పనులు సెయ్యడానికి’’ అని పుల్లిరుపు మాటలంటున్నారు తోడికోడళ్ళు.అవన్నీ వింటూ ఏమీ అనలేక అత్త మీద కోపం దుత్త మీద తీర్చుకున్నట్లు అప్పలరాములుని తిట్టేది భార్య.రైతువారి యిళ్లలో నాటకాలేసే వాళ్లంటే ఉన్న చులకన భావాన్ని అప్పలరాముడు అనుభవించాడు. కానీ నాటకాన్ని విడిచిపెట్టలేదు.‘ఎన్నాళ్లున్నా ఏరు పాట్లు తప్పవు కదా’ అంటూ తండ్రి తనకున్న చెక్క ముక్కలను ముగ్గురు కొడుకులకి సమంగా పంచేశాడు. అప్పలరాములుకు కొత్త సంసారం బరువు, బాధ్యతలు, పిల్లల చదువు బాధ్యతలు పైన బడ్డాయి. అయినా తనకిష్టమైన నాటకాన్ని వదల్లేదు.ఈడొచ్చిన ఆడపిల్లలకు మంచి సంబంధం చూసి పెళ్లి చేశాడు. కొడుకును విజయనగరం మహారాజు కాలేజీలో చదివించాడు. కొడుకు కాలేజీలో సాంఘిక నాటకాల్లో హీరో యేషాలేత్తండని తెలసి....‘‘మన రక్తమెటిపోద్దే’’ అని ముసిముసి నవ్వులు నవ్వుతూ భార్యను ఆటపట్టించేవాడు.కొడుకు చదువు పూర్తిచేసుకుని టీచర్ కొలువులో చేరాడు.తండ్రిలానే పౌరాణిక నాటకాలలో ప్రవేశం కూడా చేశాడు.కొడుకు నాటికి నాటకరంగ పరిస్థితి పూర్తిగా దిగజారింది. పౌరాణిక నాటకం ఆడించే నాథుడే కరువయ్యాడు. ఎవరైనా సాహసం చేసి పెట్టించినా నాటకం చూడటానికి జనాలు రావడం లేదు. వినోదసాధనాలు మారినాయి...మార్కెట్లోకి సినిమా వచ్చింది. ఇంట్లోకి టీవీ వచ్చింది. జనాలు ఈదిలోకి రావడం మానేశారు. ఈ స్థితిలో నాటకం అంటే అభిమానమున్న కొడుకు ఈ స్థితిని జీర్ణించుకోలేకపోయాడు.ఒకసారి అప్పలరాములికి మలేరియా జ్వరం వచ్చింది. కొడుకు ఆసుపత్తిరికి తీసుకెళ్లి మందు, యింజప్షన్లు ఇప్పించాడు. భార్య పత్తెము చక్కగా పెట్టింది. వారం రోజ్లో అప్పలరాములు కోలుకున్నాడు. డాక్టరుగారు మరొక పదిరోజులు విశ్రాంతి తీసుకోమ్మన్నారు.అవి దేవి నవరాత్రులు. అప్పుడప్పుడే సత్తువందుకుంటున్న అప్పలరాములుకు శీనుబాబు నాటకముందని కబురెట్టాడు. ఆ మాట సెవిలో పడగానే యిన్ని రోజులు మంచం మీద పడిన బాధలు మరిచిపోయాడు. యింట్లో తెలిస్తే నాటకాలకెల్లనివ్వరని కళ్లంకెళ్లోస్తాని అటునుంచటే నాటకానికి చెక్కేశాడు.ఉదయాన్నే ఇంటికి చేరేసరికి కొడుక్కి తండ్రి మీద ఉన్న ప్రేమ కోపంగా మారింది.నాటకం హీనస్థితిని చూశాడు ఒకపక్క....విశ్రాంతి తీసుకోవాల్సిన తండ్రి రాత్రంతా నిద్ర లేకుండా నాటకం వేసి వచ్చాడు. అది తట్టుకోలేక...‘‘మీరు నాటకాలు వేసి మమ్మల్నేమీ ఉద్దరించియక్కర్లేదు...ఎవరూ మీకు బంగారు కంకణాలు తొడిగీరులే...ఇంకోసారి నాటకాలూసెత్తితే ఊరుకునేది లేదు’’ అంటూ చెడామడా తిట్టేశాడు.తన తోటి కళాకారుల ఇళ్లలో కూడా పిల్లలు నియంత్రిస్తున్నారని విన్నాడు. యిది తనకు కూడా వచ్చేసింది అంటూ ఆదుర్దాపడ్డాడు.‘‘నన్ను కన్న తండ్రినే ఒప్పించాను. నా కడుపున పుట్టిన కొడుకునొప్పించలేనా’’ అని సమాధాన పరుచుకున్నాడు.మరుసటిరోజు కొడుకున్నప్పుడే శీనుబాబు నుంచి నాటకముందని కబురు వచ్చింది.కొడుకున్నాడని కన్నుకొట్టి ‘‘నేనే నాటకానికి రాను’’ అని కుబురు తెచ్చిన మనిషిని పంపేశాడు.ఇదంతా గమనించాడు కొడుకు.‘విశ్రాంతి తీసుకోవాల్సిన సమయంలో రాత్రిపూట మంచులో పడి నాటకాలు వేస్తే మళ్లీ జ్వరం తిరగబడుతుంది. ఈ ముసలోడికిలా కాదు’ అంటూ పడుకున్నట్లు నటిస్తున్న తండ్రిని ఇంట్లో పెట్టి బయట గడియ పెట్టేశాడు కొడుకు.అప్పలరాములు కొడుక్కి తన మీద ఉన్న ప్రేమను గమనించాడు.కానీ నాటకం మీద తనకున్న ప్రేమను చంపుకోలేకపోయాడు. చేసేదేమి లేక మంచం మీద చేరబడ్డాడు. ఆరోజు తాను వెళ్లవలసిన నాటకం ఎలా జరుగుతుందో...శీనుబాబేటనుకుంతాడో...నిజంగా కొడుకు చెప్పినట్లుగా నాటకరంగమంత దిగజారిపోయిందా...ఒకప్పుడు తన పరువపు వయసులో...నాటకమంటే పడిచచ్చే జ్ఞాపకాలు...తన కళ్ళ ముందు అలా అలా అలల్లా కదులుతున్నాయి.అప్పలరాములు పార పట్టుకొని దమ్ము మడిలో ఒంగితే గెనకు గెన పూర్తయ్యేవరకు నడుమెత్తేవాడు కాదు. పనులన్నీ పూర్తయ్యాక సాయంత్రం అయ్యేసరికి తోటివాళ్లతో కూడి చెక్క భజనలు, రామభజనలు...అప్పలరాములు గొంతెత్తి ముందు పాట పాడుతుంటే మారాము చేస్తున్న పిల్లలు మగతలోకి జారుకునేవారు. మనువుకు సిద్ధమైన యువతులు గిలిగింతలు పడేవారు. ఆనాడు సినిమా వినోద సాధనంగా మొదలైంది కానీ అది తమలాంటి పల్లెలకు ఇంకా అందుబాటులోకి రాలేదు. పెద్దపెద్ద పండగలు, ఉత్సవాల సమయాల్లో పెద్ద పెద్ద కూడల్లలో పౌరాణిక నాటకాలు ప్రదర్శించేవారు. ఒకరోజు ఒక రిక్షా బండి ‘ఆలసించిన ఆశాభంగం నేడే...ఈరోజే...మన రాజాంలో ఈలపాట మొదలగు నటులతో పౌరాణిక నాటకం ప్రదర్శించబడును’ అంటూ దండోరా వేసుకుంటూ వెళ్ళిపోయింది.ఎలాగైనా నాటకం చూడాలనుకున్నాడు.నాటకం చూడాలంటే టికెట్ ఉండాలి.టికెట్ ఉండాలంటే డబ్బులు కావాలి.అమ్మ దగ్గరకు చేరాడు...అమ్మ ఇంట్లో బియ్యపుగింజలు ఊర్లో షావుకారుకిచ్చి డబ్బులు తెచ్చింది...అప్పలరాములు పొంగిపోండు. పనులన్నీ వేరము పూర్తి చేసుకుండు. జతగాళ్లతో కలిసి నాటకం చూడటానికి బయలుదేరాడు.నాటకం మొదలైంది...జనాలు ఈలలు, కేకలు...ఈలపాట మొదలగు నటులంతా పద్యాలతో రాగాలు పంపుతుంటే చెవులో అమృతమే పోయించుకున్నాడు. ఇంటికి చేరుకున్నాడు. రెండుమూడు రోజులు పద్యాలు తన చెవుల్నొగ్గలేదు...సివరకు ఒకరోజు సాయంత్రం పనులన్నీపెందరాళే పూర్తి చేసి నాటకాలు నేర్పుతున్న గురువు దగ్గరకు చేరుకున్నాడు.‘‘పొలంలో పండిన కూరో నారో ఇచ్చుకుంటాను. నాటకం నేర్పు గురువా’’ అని ప్రాధేయపడ్డాడు.గురువు కనికరించి పౌరాణిక నాటకాల్లోని మైనర్ పాత్రలను నేర్పించాడు. ఊరి బడిలో తెలుగు సదవడం, రాయడం వచ్చినంత వరకు సదువుకున్నాడు. అది ఇప్పుడుపయోగపడింది.రోజూ రాత్రి రెండు మైళ్ళ దూరం నడిచి గురువు దగ్గర పద్యం చెప్పించుకునేవాడు. ఉదయం అరక తోలునప్పుడో, పశువులు మేపుతూనో, గడ్డి కోస్తూనో సాధన చేసేవాడు. ప్రదర్శనలు కూడా ఇవ్వడంమొదలెట్టాడు. మొదట ప్రదర్శన ఇచ్చిన రోజు తను ఏదో రాజ్యాన్ని జయించినంత సంబరపడ్డాడు....ఇలా గ్యాపకాలు గుర్తొస్తుంటే కళ్ళంబడి నీళ్ళు రాలుతున్నాయి.వ్యవసాయం, సంసారం, సమాజం...ఇవ్వేమి ఇవ్వలేని సంతోషం మనసుకు నాటకం ఇచ్చింది. ఆరోజులు మరలా మోము మీద చిరునవ్వును చిందించాయి. మళ్లీ గతపు ఆలోచనలు...నాటకాలేస్తున్నయిషయం ఆ నోటా ఈ నోట తండ్రికి తెలిసింది. ఆరుగాలం శ్రమించాల్సిన రైతోడు నాటకాల్లో పడితే యివతల యవసాయం ఉట్టెక్కిపోతాది....అవతల మనిషి సెడు యసనాలకుబానిసైపోతాడు. రెంటికి సెడ్డ రేవడైపోతాది గాలా ఈడి బతుకు’’ అని తల్లి సమక్షంలో పరోక్షంగా మందలించాడు తండ్రి.‘‘పనులకు డోకా రాకుండా సూసుకుంతానులే. యసనాల జోలికి పోను’’ అని తల్లికి నచ్చచెప్పి తన మనసుకు ఇష్టమైన నాటకాలను విడవకుండా ముందుకెళ్లాడు.నాటకరంగ గొప్పస్థితిని చూశాడు...ఇప్పుడు అలాగే ఉందనుకుంటున్నాడు...నాటకం మీద తనకున్న ప్రేమ అలాంటిది. అనేకమైన ఆలోచనలు. ఎప్పుడు నిద్రలోకి జారుకున్నాడో...మళ్లీ కోడి కూయగానే మెలుకువొచ్చింది. గోళ్లోకెల్లోద్దామని లేవబోయాడు. యెడమసేయికి సెతన తగల్లేదు. యెడమ కాలు కూడా తన సెతనలో లేదు...‘పోనిలే పిల్లల కోరిక తీరిందిలే’ అనుకొని చిన్న చిరునవ్వు నవ్వాడు. నదికి ఆనకట్ట నీరును పొంగించి ఊర్లను ముంచెత్తది. నటనకి ఆనకట్ట తన రక్తాన్ని పొంగించి మనసును ముంచేసింది. అదెల్లి ఎక్కడో నరాలను తెంపేసింది. ‘సత్యసంధుడట, హరిశ్చంద్రుడట...’ అంటూ అందరినీ భయపెట్టే ఆ కంఠం మూగబోయి అప్పుడప్పుడు రుషి వలే నవ్వును మాత్రమే చిందిస్తుంది. అల్తి మోహనరావు -
ఒంటి దుర్వాసనతో కుంగి పోతున్నాను
హెయిర్ అండ్ స్కిన్ కౌన్సెలింగ్ నాకు చాలా ఎక్కువగా చెమట పడుతుంటుంది. చెమట దుర్వాసన కూడా ఎక్కువేనని ఫ్రెండ్స్ అంటున్నారు. ఈ సమస్య నన్ను చాలా వేధిస్తోంది. నలుగురిలో కలవలేక మానసికంగానూ కుంగిపోయేలా చేస్తోంది. నా సమస్యకు పరిష్కారం సూచించండి. – ఆర్. వేణుప్రసాద్, రాజమండ్రి చెమట పట్టడంతో ఒంటి నుంచి దుర్వాసన రావడం అన్నది కొందరిలో సాధారణం కంటే మరింత ఎక్కువ. ఇలా చెమట కారణంగా ఒంటి నుంచి దుర్వాసన రావడానికి అనేక అంశాలు దోహదం చేస్తాయి. ఉదాహరణకు... ∙ఇక స్థూలకాయంతో ఉన్నవారు, ఇతర చర్మ సమస్యలు / ఇన్ఫెక్షన్లతో బాధపడేవారికి దుర్వాసన సమస్య అధికం. ముఖ్యంగా ఇంటెర్ట్రిగో, ట్రైకోమైసోసిస్, ఎరిత్మా సమస్యలు ఉన్నవారిలో ఈ సమస్య మరీ ఎక్కువ. ∙ఇక కొందరిలో దీర్ఘకాల వ్యాధులైన మధుమేహం, గౌట్, మూత్రపిండాలు, కాలేయం సమస్యలు, టైఫాయిడ్ ఉన్నప్పుడు కూడా వారి నుంచి చెడువాసన వస్తుంటుంది. అలాగే శుభ్రత విషయంలో బద్దకంగా ఉండేవారిలోనూ, మద్యం సేవించేవారి దగ్గర్నుంచి, పెన్సిలిన్, బ్రోమైడ్స్ వంటి మందుల వాడకం వల్ల కూడా మేని నుంచి దుర్గంధం వెలువడటం అనే సమస్య తలెత్తవచ్చు. ఆహారం వల్ల... కొందరు తీసుకునే ఆహారంలో వేపుళ్లు, ఉల్లిపాయలు, వెల్లుల్లి, మాంసం, కొన్ని రకాల ఆకుకూరలు, కెఫిన్ ఉన్న పానీయాల వల్ల కూడా ఈ సమస్య రావచ్చు. దుర్వాసన తొలగించుకోడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలివి... పైన పేర్కొన్న సమస్యలు ఉన్నవారు ముందుగా తమకు ఏ కారణం చేత ఒంటి నుంచి దుర్వాసన వస్తోందో తెలుసుకోవాలి. సాధారణంగా ఆ సమస్య (అండర్లైయింగ్ ప్రాబ్లమ్)ను పరిష్కరించుకుంటే మేని దుర్వాసన సమస్య ఆటోమేటిగ్గా తగ్గిపోతుంది. ఇక అందరూ పాటించదగ్గ సూచనలు ఇవి... ∙ప్రతిరోజూ రెండుసార్లు స్నానం చేయడం ∙ బాహుమూలాలను సబ్బుతో బాగా శుభ్రం చేసుకోవడం ∙చెమట అధికంగా పట్టే ప్రదేశాలను పొడిగా, శుభ్రంగా ఉంచుకోవడం ∙తొడుక్కునే దుస్తులు చెమటను పీల్చుకునేవి, శుభ్రమైనవి, పొడిగా ఉండేవి ధరించడం ∙బాక్టీరియా సంఖ్యను తగ్గించేది, చర్మతత్వానికి సరిపడే డియోడరెంట్స్ వాడటం ∙అలాగే వ్యక్తిగత పరిశుభ్రతలో భాగంగా వాసనకు కారణమయ్యే బాహుమూలాల్లోని వెంట్రుకలను తొలగించుకోవాలి. యాంటీసెప్టిక్ సబ్బులను స్నానానికి ఉపయోగించాలి. శరీర దుర్వాసనను పెంచే ఆహారపదార్థాలైన ఉల్లి, వెల్లుల్లి వంటి వాటిని పరిమితంగా తీసుకోవాలి ∙తాజా ఆహారం తీసుకోవడం, మంచినీళ్లు ఎక్కువగా తాగాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే కేవలం ఒంటి దుర్వాసన సమస్యే కాకుండా, ఇతర చర్మ సమస్యలు కూడా తగ్గే అవకాశం ఉంటుంది. శరీరానికి పూసే లేపనాలతో... సాధారణంగా చెమటలు పట్టేవారు యాంటీపెర్స్పిరెంట్స్, డియోడరెంట్స్ అనే శరీరానికి పూసే లేపనాలతో తమ శరీర దుర్వాసనను తగ్గించుకుంటుంటారు. యాంటీ పెర్స్పిరెంట్స్ అన్నవి పేరును బట్టి చెమట పట్టడాన్ని తగ్గించవు. కానీ ఇందులో ఉండే అల్యూమినియమ్ క్లోరోహైడ్రేట్, అల్యూమినియం క్లోరైడ్, అల్యూమినియమ్ ఫీనాల్ సల్ఫొనేట్, అల్యూమినియమ్ సల్ఫేట్, జిర్కోనియమ్ క్లోరో హైడ్రేట్స్ వంటి లవణాలు ఉంటాయి. ఇవి చెమటగ్రంథి ద్వారాన్ని తాత్కాలికంగా మూసివేసి, చెమట తక్కువగా పట్టేలా చేస్తాయి. వాటి ప్రభావం తగ్గాక మళ్లీ చెమటపడుతుంది. ఇలా తాత్కాలికంగా చెమటగ్రంథిని మూసేస్తుంది కాబట్టి దీన్ని యాంటీపెర్స్పిరెంట్స్ అంటారు. అందుకే యాంటీపెర్స్పిరెంట్స్ను శరీరంలో చెమట ఎక్కువగా స్రవించే ప్రాంతాల్లో పూస్తారు. ఇక డియోడరెంట్స్ విషయానికి వస్తే వీటిని అటు బాహుమూలాలతో పాటు చర్మంపైన ఏ ప్రాంతంలోనైనా పూయవచ్చు. డియోడరెంట్స్‌లో ఉండే అమోనియమ్ అలమ్, పొటాషియమ్ అలమ్ తాత్కాలికంగా చెమటలోని వాసన కలిగించే బ్యాక్టీరియాను నశింపజేస్తాయి. వాటి ప్రభావం తొలిగాక ఆ బ్యాక్టీరియా మళ్లీ పుడుతూనే ఉంటుంది. ఎలాంటి షాంపూ వాడితే మేలు? మార్కెట్లో చాలారకాల షాంపూలు అందుబాటులో ఉన్నాయి కదా. వాటిలో ఏది ఎంచుకోవాలా అనే అంశంపై మాకు కొంచెం అయోమయంగా ఉంది. సాధారణంగా మంచి షాంపూను ఎంచుకోవడానికి ఎలాంటి మార్గదర్శకాలు పాటించవచ్చో వివరించండి. – డి. మాధవీలత, హైదరాబాద్ సాధారణంగా అందరి వెంట్రుకలూ ఒక్కలా ఉండవు కాబట్టే... అందరి షాంపూ అవసరాలూ ఒకేలా ఉంటాయని చెప్పలేం. మన అవసరాలను బట్టి మార్కెట్లోకి రకరకాల షాంపూలు అందుబాటులోకి వచ్చాయి.ఇంకా వస్తున్నాయి. మన అవసరాలను బట్టి మనం ఎలాంటి షాంపూలను ఎంచుకోవచ్చో చూద్దాం. అందరూ వాడదగ్గవి: ఇందులో శుభ్రపరిచే సామర్థ్యం (క్లెన్సింగ్ ఎబిలిటీ) నార్మల్‌గా ఉంటుంది. నార్మల్ హెయిర్ కోసం వాడాల్సిన ఈ షాంపూలు సాధారణంగా లారిల్ సల్ఫేట్ అనే నురగవచ్చే పదార్థంతో తయారవుతాయి. ఇందులో ఆ రసాయనంతో పాటు వినియోగదారులను ఆకర్షించేందుకు ఉత్పత్తిదారులు రకరకాల సుగంధ ద్రవ్యాలను చేర్చి వాటిని మంచి సువాసన వచ్చేలా రూపొందిస్తారు. ఇవి ఎవరైనా వాడవచ్చు. కాబట్టి మార్కెట్లో ఉన్న రకరకాల బ్రాండ్స్‌ను వాడుతూ (ట్రై చేస్తూ) మీకు ఏది అనువైనదో, సౌకర్యమో అది వాడుకోవచ్చు. మీరు ఎంచుకున్న ఛాయిస్ షాంపూను మీ సంతృప్తి మేరకు కొనసాగించవచ్చు. పొడి వెంట్రుకలు ఉండేవారికి: వెంట్రుకలు చాలా పొడిగా ఉండేవారికోసం తయారయ్యే షాంపూల్లో రోమాన్ని శుభ్రపరిచే రసాయనాలు మరీ తీవ్రంగా లేకుండా చూస్తారు. అంటే మైల్డ్ క్లెనింగ్ ఏజెంట్స్‌ను ఉపయోగించి చేస్తారు. దాంతో పాటు వెంట్రుక కండిషనింగ్ కోసం అందులో సిలికోన్ వంటి ఏజెంట్స్, కెటాయినిక్ పాలిమర్స్‌ను కలుపుతారు. వాటిని ఉపయోగించాక ఆ సిలికోన్ పొడి వెంట్రుకల మీద సమంగా విస్తరించి ఒక కోటింగ్‌లా ఏర్పడుతుంది. కాబట్టి పొడి వెంట్రుకలు ఉన్నవారికి సిలికోన్, కెటాయినిక్ పాలిమర్స్ ఇంటి ఇన్‌గ్రేడియెంట్స్ ఉన్నవి మంచి షాంపూలుగా పరిగణించవచ్చు. మీరు పొడి వెంట్రుకలు కలవారేతే... పేన చెప్పిన ఇన్‌గ్రేడియెంట్స్ షాంపూలో ఉన్నాయో లేవో చూసి తీసుకోవచ్చు. జిడ్డు వెంట్రుకలు ఉన్నవారికి: ఇక జిడ్డు వెంట్రుకలు ఉన్నవారికి అవసరమైన షాంపూలను మాడుపైన, వెంట్రుకపైన ఉన్న అదనపు సీబమ్‌ను తొలగించేలా డిజైన్ చేస్తారు. ఇందులో క్లెన్సింగ్ ఏజెంట్‌గా లారిల్ సల్ఫేట్‌తో పాటు అదనపు నూనెవంటి స్రావాలను తొలగించడానికి సల్ఫోసక్సినేట్ వంటి రసాయనాలు ఉండేలా తయారు చేస్తారు. అయితే జిడ్డు కురులు ఉన్నవారికి రూపొందించే షాంపూలలో కండిషనింగ్ తక్కువగా ఉండేలా చూస్తారు. కాబట్టి పైన పేర్కొన్న కాంబినేషన్స్ ఉన్నవి జిడ్డు కురుల వారు ఉపయోగించవచ్చు. అయితే వీటిని ఎక్కువగా ఉపయోగిస్తే కురులు మరీ నిర్జీవంగా మారిపోతాయి. పీచులా కనిపించే ప్రమాదం ఉంది. అందుకే వీటిని ఎంత తరచుగా వాడాలన్నది కేవలం మీ విచక్షణ (డిస్క్రిషన్) మేరకే ఉంటుంది. డాక్టర్ స్వప్నప్రియ డర్మటాలజిస్ట్, కేర్ హాస్పిటల్స్, బంజారాహిల్స్, హైదరాబాద్ -
ఆమె ముడిసరుకు తెలిస్తే షాక్ అవాల్సిందే
ఆకర్షణీయమైన వస్తువులు, బ్యాగులు, చెవి రింగులను కళాత్మకంగా ఎవరైనా చేస్తారు. అందుకోసం రాళ్లు, బంగారం, వెండి ఇలా ఏవేవో వాడుతుంటారు. వెంట్రుకలతో, కుట్టు మిషన్లతో ఇలా కాదేదీ కళకనర్హం అన్నట్లు అన్ని వస్తువులను వాడేశారు కళాకారులు. అయితే వీరందరికీ భిన్నాతిభిన్నంగా బ్రిటన్‌లోని రాయల్ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్‌కు చెందిన అలైస్ పాట్స్ ఆలోచించారు. మహిళల కోసం పలు రకాల ఉత్పత్తులను భిన్నమైన పదార్థాలతో తయారు చేసి చాలా ఫేమస్ అయిపోయారు. ఎందుకంటే వాటిని తయారు చేసేందుకు ఆమె ఎంచుకున్న ముడిసరుకు తెలిస్తే షాక్ అవాల్సిందే. అవేంటో తెలుసా.. మన శరీరం నుంచి ఉత్పత్తయ్యే చెమట, మూత్రం, రక్తం! ఏంటీ వీటితో ఎలా తయారు చేస్తారనుకుంటున్నారా..? వీటి నుంచి తెల్లగా మెరిసే స్ఫటికాలను తయారు చేసి బట్టలను చాలా అందంగా ముస్తాబు చేస్తారట. ప్లాస్టిక్‌ను వాడే కన్నా వీటితో తయారు చేస్తే ప్రకృతికి కూడా మేలు చేసినట్లవుతుందని పాట్స్ చెబుతున్నారు. ఇటీవల కాలేజీ ఫ్యాషన్ షోలో ఆమె చేసిన ఉత్పత్తులను ప్రదర్శనకు ఉంచితే అనూహ్య స్పందన వచ్చింది. -
ఈ రోబోకు చెమట పడుతుంది!
రోబోలంటే గట్టి లోహాలతో చేసి ఉంటారని అనుకుంటాం. నిజం కూడా. అయితే కాలం మారుతోంది. టెక్నాలజీ కూడా అప్డేట్ అవుతోంది. ఈ కాలపు రోబోలు చాలావరకూ మనుషుల్లా ఆలోచిస్తున్నాయి. రకరకాల పనులూ చేస్తున్నాయి. తాజాగా జపాన్‌లోని టోక్యో విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు ఇంకో అడుగు ముందుకేసి, వ్యాయామం చేసే రోబోలను అభివృద్ధి చేశారు. దీంట్లో విశేషం ఏముంది అనుకోవద్దు. ఎందుకంటే కెన్‌షిరో, కెన్‌గోరో అని పిలుస్తున్న ఈ రెండు రోబోలు వ్యాయామం చేస్తూంటే అచ్చం మన మాదిరిగానే దానికీ చెమట పడుతుంది మరి! మనలాగే వీటికీ కొంచెం నీరు పట్టిస్తే... ఆ తరువాత ఇది అన్ని రకాలు.. అంటే పుషప్స్, సిటప్స్, క్రంచెస్, స్ట్రెచెస్ వంటి వ్యాయామాలన్నీ చేసేస్తుంది. దాని శరీరంపై ఉండే సూక్ష్మ రంధ్రాల నుంచి నీటిఆవిరి వెలువడుతుంది. కదలికలకు సంబంధించి అన్ని రకాల ఏర్పాట్లూ ఉండటం వల్ల ఈ రెండు రోబోలు ఏ మాత్రం ఇబ్బంది లేకుండా తమంతట తామే వ్యాయామం చేస్తాయి. మెషీన్ లెర్నింగ్ సాయంతో కొత్త కొత్త ఎక్సర్‌సైజ్‌లను సృష్టించగలవు కూడా. సరేగానీ.. చెమట పట్టించే రోబోలు ఎందుకు అన్నదేనా మీ సందేహం! చాలా సింపుల్.. మన గురించి.. అంటే మనుషుల గురించి మరింత వివరంగా తెలుసుకునేందుకే అంటున్నారు శాస్త్రవేత్తలు. భవిష్యత్తులో టెక్నాలజీ మరింత అభివృద్ధి చెందితే వీటిని ప్రమాదకర పరిస్థితుల్లో మనుషులను రక్షించేందుకూ వాడుకోవచ్చునన్నది ఇంకో ఆలోచన. -
చెమటతో చార్జింగ్
లాస్ఏంజిలెస్: మనుషుల స్వేదాన్ని ఉపయోగించి ఎలక్ట్రానిక్ పరికరాలను చార్జ్ చేసేసాంకేతి కతను శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ఈ టెక్నాలజీని ఉపయోగించి చర్మానికి అంటిపెట్టుకొని ఉండేలా పట్టీ(స్కిన్ పాచ్)ని రూపొందించారు. సాధారణంగా బ్యాటరీల్లో వినియోగించే లోహాలను కాకుండా ఈ స్కిన్ పాచ్‌లో ఎంజైమ్స్‌ను ఉపయోగించామని దీన్ని అభివృద్ధి చేసిన కాలిఫోర్నియా వర్సిటీ పరిశోధకులు చెప్పారు. చెమటలో ఉండే లాక్టిక్ యాసిడ్‌ను ఉపయోగించుకుని పరికరంలో అమర్చిన బయో ఫ్యూయల్ సెల్స్ చార్జ్ అవుతాయని తెలిపారు. -
చెమటతో వ్యాధిని గుర్తించొచ్చు!
బోస్టన్: చెమటను పరీక్షించి రోగాన్ని గుర్తించే సరికొత్త సెన్సర్‌ను స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు అభివృద్ధిచేశారు.రిస్ట్ బ్యాండ్ రూపంలో ధరించేందుకు అనువుగా ఉండే ఈ సెన్సర్ద్వారా మధుమేహం, సిస్టిక్ ఫైబ్రోసిస్ వంటి రోగాలు గుర్తించవచ్చు. ఈ సెన్సర్ చెమటను సేకరించి దానిలోని క్లోరైడ్, గ్లూకోజ్ అణువులను విశ్లేషించి రోగ నిర్ధారణ చేస్తుంది. ఈ పరికరం వల్ల రోగ నిర్ధారణ కోసం గంటల తరబడి పరీక్షా కేంద్రాల్లో వేచిచూడాల్సిన అవసరం తప్పుతుంది. ఎలా కావాలంటే అలా వంచుకునే సౌలభ్యం ఉన్న ఈ సెన్సర్‌లో రెండంచెల వ్యవస్థ ఉంటుంది. ఇందులోని మైక్రోప్రాసెసర్ చర్మానికి అతుక్కుని ఉంటుంది.ఇది స్వేద గ్రంధులను ఉత్తేజపరిచి అందులోని ఎలక్ట్రికల్ సిగ్నల్స్ ద్వారా చెమటలోని అణువులను విశ్లేషిస్తుంది. -
చెమట బాధిస్తోందా..?!
బ్యూటిప్స్ ఎండాకాలం చెమట అధికంగా పడుతుంది. దీని వల్ల ఎదురయ్యే ఇబ్బందులను ఎదుర్కోవాలంటే... స్వెట్ ప్యాడ్స్ చెమట వల్ల బ్లౌజ్‌లు, డ్రెస్సుల చంకభాగాల్లో మరక ఏర్పడుతుంటుంది. దీన్ని నివారించడానికి స్వెట్ ప్యాడ్స్ సహాయపడతాయి. డ్రెస్ లోపలి భాగంలో చంక కింద రెండువైపులా ఈ ప్యాడ్స్‌ని అమర్చుకోవాలి. ఏ రోజుకారోజు వీటిని శుభ్రపరుచుకొని మళ్లీ వాడుకోవచ్చు. డియోడరంట్ చెమట మరకను ఇది ఆపలేదు. కానీ, సాధ్యమైనంత వరకు చెమట పట్టే చోటు (చంక భాగాలను) ఎక్కువ సేపు పొడిగా ఉంచుతుంది. టాల్కమ్ పౌడర్ చెమట ఎక్కువగా బట్టలకు అంటకుండా పౌడర్ పీల్చుకుంటుంది. అలాగే స్వేదగ్రంధులకు ఫ్యాబ్రిక్ వల్ల కలిగే ఇబ్బందిని తగ్గిస్తుంది. చంకభాగాలను శుభ్రపరుచుకొని, పొడిగా తుడిచి ఆ తర్వాతనే టాల్కమ్ పౌడర్ని ఉపయోగించాలి. షేవ్ చంకభాగాల్లో ఉండే రోమాలను క్రమం తప్పకుండా తొలగించుకోవాలి. ఈ రోమాలు చెమటను ఇంకా ఉత్పత్తి చేస్తాయి. బాక్టీరియా వృద్ధి చెందుతుంది. రోమాలు, ఫ్యాబ్రిక్ మధ్య ఒత్తిడి పెరిగి ర్యాష్ ఏర్పడుతుంది. ఇందుకు షేవ్, వాక్సింగ్ పద్ధతుల ద్వారా రోమాలను తొలగించుకోవాలి. టిష్యూ పేపర్ బయటకు వెళ్లేటప్పుడు బ్యాగ్‌లో టిష్యూ పేపర్స్‌ను తీసుకెళ్లాలి. బాత్రూమ్కి వెళ్లినప్పుడు చంకభాగాల్లో టిష్యూ పేపర్‌తో తడిని తుడిచేస్తే ఎక్కువ ఇబ్బంది ఉండదు. -
ఇలా చేస్తే... వేసవిలోనూ వన్నె తగ్గదిక!
సమ్మర్ స్కిన్‌కేర్ స్వేదం చిందించే వేసవిలో చర్మసంరక్షణ నిజంగా ఒక పరీక్షే. బయటకు వెళితే చుర్రుమనే ఎండకు తోడు దుమ్ము, ధూళి, వాహనాల నుండి వెలువడే కాలుష్యం గాలిలో తేలుతూ వచ్చి ముఖానికి మాస్క్ వేసినట్లు కప్పేస్తాయి. ఎప్పటికప్పుడు ఈ మలినాలను తొలగించుకోకపోతే చర్మం నల్లబడడమే కాకుండా రాష్ వస్తుంది. ఈ బాధల నుండి బయటపడి ముఖాన్ని ఆరోగ్యంగా, కాంతివంతంగా ఉంచుకోవడానికి స్టీమింగ్ బాగా పని చేస్తుంది. ఎండాకాలంలో ముఖానికి తరచు ఆవిరి పట్టాలి. పొడి చర్మానికి రెండు వారాలకొకసారి ఆవిరి పడితే సరిపోతుంది, జిడ్డు చర్మానికి మాత్రం వారానికొకసారి పట్టాలి. ఆవిరి పట్టడానికి బ్యూటీపార్లర్‌కే వెళ్లాల్సిన పని లేదు. ఇంట్లోనే స్వయంగా చేసుకోవచ్చు. ఇందుకోసం మార్కెట్లో స్టీమింగ్ గాడ్జెస్ దొరుకుతాయి. వాటిలో నీళ్లు పోసి స్విచ్ వేస్తే ఒకటి రెండు నిమిషాలలోనే ఆవిరి వస్తుంది. బయటకు విడుదలయ్యే ఆవిరి నేరుగా ముఖానికి తగిలేటట్లు పట్టాలి. లేదా ఒక పాత్రలో నీరు పోసి మూత పెట్టి వేడి చేయాలి. నీళ్లు మరిగిన తర్వాత మూత తీసి ముఖానికి ఆవిరి పట్టాలి. ఆవిరి బయటకు పోకుండా మందపాటి టవల్‌ను తలమీద నుండి పాత్రను కవర్ చేస్తూ కప్పుకోవాలి. నాలుగైదు నిమిషాల సేపు ఆవిరి పట్టాలి. ఇలా చేస్తే చర్మరంధ్రాలలో ఓపెన్ అయి చేరిన దుమ్ము, ధూళి బయటకు వచ్చేస్తాయి. టిష్యూ పేపర్‌తో కానీ మెత్తని టవల్‌తో కానీ మెల్లగా అద్దాలి. తర్వాత ఐస్ క్యూబ్తోగానీ, చల్లని నీళ్లతో కానీ ముఖం కడుక్కుంటే చర్మరంధ్రాలు తిరిగి యథావిధిగా మారుతాయి. ఈ సీజన్లో క్రమం తప్పకుండా ఆవిరి పడితే చర్మం కాంతివంతంగా ఉంటుంది. ముఖం, మెడ భాగాలను క్లెన్సింగ్ మిల్క్‌తో శుభ్రం చేసుకోవాలి. జిడ్డు చర్మానికి క్లెన్సింగ్ మిల్స్ బదులుగా ఆస్ట్రింజెంట్ వాడాలి.రాత్రి పడుకోబోయే ముందు ముఖాన్ని మసాజ్ ఆయిల్‌తో కానీ క్రీమ్‌తో కానీ లైట్‌గా మసాజ్ చేసుకోవాలి. వేసవిలో స్వతహాగా చర్మగ్రంధులు ఉత్తేజితమవుతాయి కాబట్టి క్రీమ్ కొద్ది మోతాదులో వాడితే సరిపోతుంది. ఇంట్లోనే ఈజీగా... చర్మ సంరక్షణకు ఇంట్లోనే కొన్ని జాగ్రత్తలు తీసు కుంటే అందాన్ని ఆరోగ్యాన్ని ఏకకాలంలో కాపాడుకోవచ్చు. కొబ్బరి నూనెలో రోజ్మెరీ, లావెండర్ లాంటి మీకు నచ్చిన సుగంధ తైలాలను కలిపి మసాజ్ చేసినట్టయితే శరీరం నునుపుగా తయారవుతుంది. మసాజ్ వల్ల రక్తప్రసరణ సక్రమంగా జరుగుతుంది. దోసకాయ చెక్కుతీసి బాగా తురిమి రసాన్ని తీయాలి. ఈ రసంలో అరటీస్పూన్ గ్లిజరిన్, అరటీస్పూన్ రోజ్‌వాటర్‌ను కలపాలి. ఈ మిశ్రమాన్ని ఎండకు కమిలిన ప్రదేశంలో రాసి ఆరేంతవరకు ఉంచి శుభ్రపరుచు కోవాలి. ఇలా రోజూ చేస్తే క్రమేణా కమిలిన భాగం మామూలుగా అయిపోతుంది. ఆరు టీ స్పూన్ల పెట్రోలియం జెల్లీ, రెండు టీ స్పూన్ల గ్లిజరిన్, రెండు టీ స్పూన్ల నిమ్మరసాన్ని కలిపి మిశ్రమాన్ని తయారు చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని వారానికి రెండు సార్లు పొడిబారిన చర్మానికి, చేతులకి, కాళ్లకి రాస్తే సున్నితంగా తయారవుతాయి.పాదాలు పగిలినట్లయితే పారాఫిన్ వాక్స్‌ను కరిగించి, కొంచెం మస్టర్డ్ ఆయిల్ కలపాలి. పగుళ్లు ఉన్న చోట ఈ మిశ్రమాన్ని రాత్రి పడుకునే ముందు రాయాలి. పది, పది హేను రోజులపాటు ఈ విధంగా చేస్తే పాదాలు మృదువుగా అవుతాయి. ఈ మిశ్రమం అందుబాటులో లేకుంటే గ్లిజరిన్, నిమ్మరసం సమపాళ్లలో కలిపి కాలి పగుళ్లకు రాస్తే నునుపుగా అవుతాయి.కొబ్బరి నూనెతో కాళ్లకు మర్ధనా చేసి గోరువెచ్చని నీటిలో కొంతసేపు ఉంచాలి. ఆ తర్వాత పాదాల్ని తడిలేకుండా తుడిచి పది మందారపూలు, గుప్పెడు గోరింటాకు, అరచెక్క నిమ్మరసం కలిపి పేస్ట్‌లా చేసి పాదాలకు పట్టించాలి. అది ఎండిన తరు వాత కడిగెయ్యాలి. చేతులు, పాదాలపై ఉండే గరుకుదనం, నలుపు, జిడ్డు మురికి పోవాలంటే నిమ్మ చెక్కతో రుద్దాలి. రోజుకు ఒకసారైనా సబ్బుతో ముఖం కడగాలి. కడిగిన తర్వాత ఐస్‌క్యూబ్‌తో ముఖమంతా మసాజ్ చేసినట్లు రుద్దాలి. రోజుకు కనీసం మూడు సార్లు చల్లటి నీళ్లతో ముఖం కడుక్కోవాలి. -
చెడువాసన రాకుండా...
బ్యూటిప్స్ ఇటీవల కాలంలో వేడిమి బాగా పెరుగుతోంది. చెమట సమస్య కూడా అంతా ఎదుర్కొంటున్నారు. బాహుమూలాల్లో చెమట అధికంగా పడితే దుర్వాసన కూడా వస్తుంటుంది. ఈ సమస్యకు విరుగుడుగా... బాహుమూలాల్లో... వెనిగర్, నీళ్లు సమ భాగాలుగా కలపాలి. ఈ మిశ్రమాన్ని స్ప్రే బాటిల్లో పోసి, బాహుమూలాల్లో స్ప్రే చేసి, మెత్తని క్లాత్‌తో తుడుచుకోవాలి. లేదంటే దూదిని ఉండగా చేసి, పై మిశ్రమంలో ముంచి తుడవాలి. తర్వాత డియోడరెంట్ వాడాలి. ఇలా చేయడం వల్ల దుర్వాసనే కాదు ఎలాంటి ఇరిటేషన్ సమస్యా రాదు. స్నానానికి... టేబుల్ స్పూన్ అల్లం తరుగు, స్పూన్ కొత్తిమీర, చెంచాడు లెమన్ జెస్ట్ (నిమ్మకాయ పై తొక్కను తురిమినది), రెండు టేబుల్ స్పూన్ల ఓట్స్ తీసుకోవాలి. ఈ పదార్థాలన్నీ మస్లిన్ క్లాత్‌లో వేసి గట్టిగా ముడివేయాలి. ఈ మూటను గోరువెచ్చని నీటిలో కాసేపు ఉంచాలి. తర్వాత ఆ నీటిని స్నానానికి ఉపయోగించాలి. ఇలా చేయడం వల్ల రక్త ప్రసరణ మెరుగవుతుంది. చెమట వల్ల దుర్వాసన రాకుండా అడ్డుకుంటుంది. సువాసన ఆహ్లాదానుభూతిని కలిగిస్తుంది.