డయబెటిస్‌ని రోగులకు ఇక నుంచి సూదుల బాధ తప్పుతుందట. రక్త నమునాల కోసం సూదులతో తీయించుకునే సమస్య ఉండదు. జస్ట్ చెమటతోనే ఈజీగా గుర్తించే సాంకేతికతో కూడిన పోర్టబుల్ సిస్టమ్‌ని అభివృద్ధి చేశారు. ఈ పరికరం ఖర్చు కూడా తక్కువే. టైప్1, టైప్2 డయాబెటిస్ పేషెంట్ల ఇరువురికి ఉపయోగపడుతుందని చెబుతున్నారు శాస్త్రవేత్తలు.
వివరాల్లోకెళ్తే..హైదరాబాద్‌లో పిలానీలోని బిర్లా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ (బిట్స్) పరిశోధకులు, తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ (టీఎస్‌సీఓటీ) మద్దతుతో సాంకేతికతో కూడిన పరికరాన్ని అభివృద్ధి చేశారు. దీన్ని త్రీడీ ప్రింటింగ్, CO2 లేజర్ గ్రాఫేన్-ఆధారిత ఎలక్ట్రోడ్‌లను ఉపయోగించి రూపొందించినట్లు ప్రోఫెసర్ సాకేత్ గోయెల్ వెల్లడించారు. ఈ పరికరం రోగి నుంచి ఇంజెక్షన్‌లో రక్త నమునాలను సేకరించే సమస్యను పరిష్కారిస్తుందని చెబుతున్నారు. ఈ పరికరం రక్త నమునాల ఆధారంగా కూడా షుగర్ టెస్ట్ చేయగలదని అన్నారు. అయితే తమ లక్ష్యం చెమటలోని లాక్టేట్ సాంద్రత ఆధారంగా శరీరంలోని గ్లూకోజ్ స్థాయిలను కచ్చితంగా గుర్తించగలదా? అనే లక్ష్యంతో ఆవిష్కరించామని చెప్పారు.
ఎలా పనిచేస్తుందంటే..
ఎలెక్ట్రోకెమిలుమినిసెన్స్ (ఈసీఎల్) ఆధారంగా పనిచేస్తుంది. ఈ పరికరం చెమటను ఇన్‌పుట్‌గా స్వీకరించిన తర్వాత విద్యుత్ సిగ్నల్‌ను ప్రేరేపిస్తుంది. ఆ తర్వాత కాంతిని అవుట్‌పుట్‌గా ఉత్పత్తి చేసి, రసాయన ప్రతిచర్యను ప్రారంభిస్తుంది. ఈ కాంతి తీవ్రతను ఆధారంగా లాక్టేట్ సాంద్రతను అంచనావేసి, తద్వారా గ్లూకోజ్ స్థాయిలను నిర్థారిస్తారు. ఇది షుగర్ పరీక్షల్లో కచ్చితమైన ఫలితాలను ఇస్తుందని చెప్పారు పరిశోధకులు.
దీన్ని స్మార్ట్ ఫోన్‌లకు కనెక్ట్ చేసేలా పోర్టబుల్ పరికరాన్ని పరిశోధకులు బృందం విజయవంంతంగా అభివృద్ధి చేసింది. ఈ పరికరం ప్రత్యేకమైన యాప్ ద్వారా మానవ మెటాబోలేట్ డేటాను యాక్సెస్‌చేసేలా వినయోగదారులను అనుమతిస్తుంది. దీన్ని బల్క్‌లో ఈ ప్రోడక్ట్‌ని ఉత్పత్తి చేసేలా ఒక కంపెనీతో ఒప్పందం కుదుర్చుకోనున్నట్లు తెలిపారు. అయితే ఈ అత్యాధునిక పరికరం ఖరీదు రూన 300 నుంచి రూ. 400 మధ్యలోనే ఉంటుందని చెప్పారు. ఎలాంటి పెయిన్ ఎదుర్కొవాల్సిన అవసరం లేకుండా మధుమేహ పరీక్షలను చాలా సులభంగా ఈ సాధనంతో చెక్ చేయించుకోగలరని అన్నారు.
(చదవండి: ఆరోగ్యంపై అవగాహన కల్పించేలా కడపుబ్బా నవ్వించే డాక్టర్!)
Comments
Please login to add a commentAdd a comment