కొన్ని రకాల స్వీట్లు చాలావరకు అందరికీ నచ్చుతాయి. దాని రుచి, సువాసనకి ఫిదా అయిపోతుంటారు. అలాంటి స్వీట్స్‌లలో ఒకటి మైసూర్ పాక్ ఒకటి. అయితే ఈస్వీట్ పండగలు, వేడుకలలో తప్పనసరిగా ఉంటుంది. తియ్యటి పదార్థాలలో అగ్రస్థానం దీనిది. ఈ స్వీటు పేరుకి తగ్గట్టుగానే రాయల్టీకి చిహ్నంలా ఉంటుంది. అసలు ఈ రెసిపీని ఎలా తయారు చేశారు, ఎవరు చేశారు వంటి ఆసక్తికర విషయాల గురించి తెలుసుకుందామా..!.
భారతదేశం అంతటా పండుగలు, పత్యేక సందర్భాల్లో ప్రత్యేక విందుగా ఉండే స్వీటు ఇదే. దీని మూలం రాజుల వంశాలే. కర్ణాటక(Karnataka) రాజుల వంటశాలల నుంచి తయారయ్యిందని అంటుంటారు. మైసూర్ పాక్(Mysore Pak) మొదటిసారిగా 20వ శతాబ్దం ప్రారంభంలో మహారాజా కృష్ణ రాజ వడియార్IV పాలనలో మైసూర్ ప్యాలెస్‌లోని రాయల్ వంటవాడు కాకాసుర మడప్ప సృష్టించాడట.
మహారాజు మెచ్చుకునేలా వంటలు చేసే క్రమంలో మాదప్ప శెనగపిండి, నెయ్యి, చక్కెరతో ప్రయోగాలు చేసేవాడట. ఆ నేపథ్యంలో తయారైందే ఈ మైసూర్ పాక్ అట. అప్పుడు మహారాజు కూడా ఈ స్వీట్ రుచికి అబ్బురపడి దీనిపేరు ఏంటని అడిగితే ఆ వంటవాడు మైసూర్ పాక్ అని చెప్పాడట. అలా దానికి ఆ పేరు స్థిరపడిపోయిందట. ఇక్కడ కన్నడలో పాక్ అంటే చక్కెర సిరప్ ఆధారిత స్వీట్ అని అర్థం.
మైసూర్ ప్యాలస్‌లో చేయడంతో మైసూర్ పాక్(మైసూర్ స్వీట్) అని అన్నాడని పాకనిపుణులు చెబుతున్నారు. ఆ తర్వాతర క్రమేణ అందరికి నచ్చే వంటకంగా మారింది. స్వీట్ దుకాణాలలో ఈ రెసిపీని చేయడం ప్రారంభించడంతో ప్రజలకు మరింత అందుబాటులోకి వచ్చిందని చెఫ్, రెస్టారెంట్ కన్సల్టెంట్ తర్వీన్ కౌర్ చెబుతున్నారు.
అలా దక్షిణ భారత ఉత్సవాలు, వివాహాలు, వేడుకలలో ప్రధానమైన డెజర్ట్(Dessert)గా మారింది. అందువల్ల దీనికి ఇంతలా ప్రజాదరణ అని పాక నిపుణులు చెబుతున్నారు. అలాగే కర్ణాటక కూడా తమ సంస్కృతికి అద్దం పట్టే ఈ మైసూపాక్ తీపి వంటకాన్ని అందరూ గుర్తించేలా తన వంతుగా కృషి చేసిందట. అందువల్ల దీని గురించి అందరికి తెలిసిందని చెబుతున్నారు.
దీన్ని వివాహాలు, పండుగల్లో ప్రాముఖ్యత ఇచ్చేలా తప్పనిసరిగా పెట్టడంతో ప్రజల హృదయాల్లో తొందరగా స్థానం సంపాదించుకుందని అంటున్నారు డయాబెటిస్ కన్సల్టెంట్ డైటీషియన్ కనిక్క మల్హోత్రా. అందువల్లే తరతరాలు ఈ స్వీట్‌ని ఆదరిస్తున్నారని అంటున్నారు.
రుచి మాయజాలంలా కట్టిపడేస్తుంది..
శెనగపిండి, నెయ్యి పంచదారల మిశ్రమం చక్కగా రోస్ట్ అయ్యి ఒక విధమైన రుచితో కూడిన నిర్మాణాన్ని ఇస్తుంది. ఇది నెయ్యి కలుపుతూ ఓపికగా తిప్పుతూ చేసే వంటకం. మన ఓపికకు పరీక్ష పెట్టే తయారీ విధానం ఇది. మనం ఎంత నిశితంగా ఓపిగ్గా చేస్తున్నామనే దానిపై పర్‌ఫెక్ట్‌గా రావడం అనేది ఆధారపడి ఉంటుందని పాక నిపుణులు చెబుతున్నారు.
(చదవండి: వ్యవసాయ నేపథ్యం.. కానీ రూ. 52 లక్షల జాబ్ ఆఫర్‌ని కొట్టేసింది..!)
Comments
Please login to add a commentAdd a comment