Mysore Pak
-
ఆ మైసూర్ పాక్ తయారీ చూస్తుంటే.. నోట్లో నీళ్లూరిపోవడం ఖాయం..!
దక్షిణాదిలోని అత్యంత ప్రసిద్ధ స్వీట్లలో మైసూర్ పాక్ ఒకటి. ఇది చూడటానికి చక్కటి పసుపు కలర్లో ఉండటంతో సంప్రదాయ వేడుకల్లో తప్పనిసరిగా ఇది ఉండాల్సిందే. అలాంటి మైసూర్ పాక్‌ని నోట్లో వేసుకుంటే వెన్నలా కరిపోయేలా చక్కగా కలుపుతూ తయారు చేస్తున్న విధానం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోని ఒక ఫుడ్ వ్లాగర్ ఇన్‌స్టాలో షేర్ చేశారు. శెనగపిండితో చేసే వంటకం, నెయ్యి, పంచదారల మిశ్రంతో నిరంతరం కలుపుతూ చాలా స్మూత్‌గా అయ్యేలా చేస్తుంటారు పాకశాస్త్ర నిపుణులు. ఆ తర్వాత చివరగా దగ్గర పడిన మిశ్రమంలో అదనపు నెయ్యిని జోడించి మరింత నూనుపుగా మంచి రంగు, వాసనని సంతరించుకునే అందంగా తయారు చేస్తారు. దాన్ని చివర్లో నెయ్యి రాసిన ట్రైలో వేసి చక్కగా ముక్కలుగా కట్‌చేసి స్వీట్బాక్స్లలో ప్యాక్ చేస్తున్నట్లు వీడియోలో కనిపిస్తుంది. చివర్లో వ్లాగర్ అవి తింటూ అబ్బా ఏమి రుచి నోట్లో వేసుకుంటే అలా కరిపోతోంది అంతే.. అంటూ ఆస్వాదిస్తూ కనిపిస్తాడు. ఈ తయారీ విధానాన్ని కర్ణాటకలోని ఓ ప్రసిద్ధ షాపులో చిత్రీకరించారు. అయితే నెటిజన్లు అందులో ఉపయోగించే ఎక్కువ మొత్తంలోని నెయ్యి, పంచదార పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. సరదాగా ఒకసారి కడుపు నిండుగా మనసుకు నచ్చిన స్వీట్ తింటే ఆ ఆనందమే వేరు కదా..!. ఆరోగ్య స్ప్రుహ అవసరమే మరీ భయంకరమైన నిబంధనలు వద్దు సుమా..!. View this post on Instagram A post shared by Amar Sirohi (@foodie_incarnate) (చదవండి: అతి చిన్న వాషింగ్ మెషీన్‌తో ప్రపంచ రికార్డు..!) -
పిల్లలు ఇష్టపడేలా..చాక్లెట్ పాక్ చేసుకోండి ఇలా..!
చాక్లెట్ పాక్‌కి కావలసినవి: శనగపిండి– ముప్పావు కప్పు కోకో పొడి – పావు కప్పు బెల్లం – కప్పు నీళ్లు – ముప్పావు కప్పు నెయ్యి – ముప్పావు కప్పు పిస్తా పలుకులు – టేబుల్ స్పూను. తయారీ విధానం: శనగపిండి ప్చ వాసన పోయి, మంచి సువాసన వచ్చేంత వరకు వేయించాలి. మందపాటి గిన్నెలో బెల్లం, నీళ్లు వేసి తీగ పాకం వచ్చేంత వరకు మరిగించాలి. శనగపిండి వేగాక కోకో పొడి, నెయ్యి వేసి ఉండలు లేకుండా కలపాలి. పిండి మిశ్రమం వేగాక బెల్లం పాకం పోసి ఉండలు కట్టకుండా తిప్పుతనే ఉండాలి. ఐదారు నిమిషాలు తిప్పాక పిస్తాపలుకులు వేసి ఐదు నిమిషాలు మగ్గనిచ్చి దించేయాలి. వెన్న రాసిన ప్లేటులో ఈ వేడివేడి పాకం మిశ్రవన్ని వేయాలి. ఐదు నిమిషాలు ఆరాక నచ్చిన ఆకారంలో ముక్కలు కట్ చేసుకుంటే చాక్లెట్ పాక్ రెడీ. (చదవండి: ఈ కేక్ చాలా హెల్తీ.. మిల్లెట్స్‌తో చేసుకోండి ఇలా) -
మనసు దోచే మైసూరు పాకం బీట్రూట్తో.. ఇలా చేసుకోండి
ప్రపంచంలో ఎక్కువమంది ఇష్టంగా తినే స్ట్రీట్ ఫుడ్స్‌లో మన మైసూర్ పాక్ కూడా ఒకటి. ఎంతోమంది మనసులు గెలుచుకున్న మైసూర్ పాక్‌ను మరింత వైవిధ్యంగా కూడా చేయొచ్చు. అందుకే విభిన్న మైసూర్΄ాక్లతో మీ ముందుకొచ్చింది.ఈ వారం వంటిల్లు... బీట్రూట్ మైసూర్ పాక్ తయారీకి కావల్సినవి: బీట్ రూట్ జ్యూస్ – అరకప్పు; శనగపిండి – కప్పు; నెయ్యి – ఒకటిన్నర కప్పులు; చక్కెర – కప్పు. తయారీ విధానమిలా.. శనగపిండిని సన్నని మంట మీద పచ్చివాసన పోయేంతవరకు వేయించి దించేయాలి ∙వేగిన పిండి జల్లెడ పట్టుకోవాలి. ఇప్పుడు ఈ పిండిలో నెయ్యి వేసి ఉండలు లేకుండా చక్కగా కలుపుకొని పక్కన పెట్టాలి మందపాటి బాణలిలో పంచదార, బీట్రూట్ జ్యూస్ వేసి సన్నని మంటమీద తిప్పుతూ తీగపాకం రానివ్వాలి పాకం వచ్చిన తరువాత కలిపిపెట్టుకున్న శనగపిండి మిశ్రమాన్ని వేస్తూ కలుపుకోవాలి. చక్కగా కలిపాక అరకప్పు నెయ్యిని కొద్దికొద్దిగా వేస్తూ కలపాలి.నెయ్యి మొత్తం మిశ్రమంలో ఇగిరిపోయి , చిక్కబడిన తరువాత దించేసి, నెయ్యి రాసిన ప్లేటులో పోయాలి. గంట ఆరాక ముక్కలు కోసుకుని సర్వ్‌చేసుకోవాలి. అంతే టేస్టీ అండ్ హెల్తీ బీట్రూట్ మైసూర్ పాక్ రెడీ. -
మెత్తని మిఠాయి..ప్రపంచం మెచ్చిందోయి!
తీపి పదార్థాలు అంటే చాలా మంది చెవి కోసుకుంటారనేది సామెత. నిజంగా చెవి కోసుకోవడం ఏమోగానీ.. ముందు పెడితే చాలు జామ్మంటూ లాగించేస్తుంటారు. అందులోనూ మైసూర్ పాక్ అనగానే నోట్లో నీళ్లూరడం ఖాయం. అలా దేశవిదేశాల్లో ఆహార ప్రియుల నోరూరిస్తున్న మైసూర్ పాక్.. ఇప్పుడు ప్రపంచంలో ఎక్కువమంది ఇష్టపడే స్ట్రీట్ ఫుడ్ స్వీట్లలో 14వ స్థానంలో నిలిచింది. – మైసూర్ టాప్–50 స్వీట్లపై సర్వేలో.. ప్రఖ్యాత ఫుడ్ మ్యాగజైన్ ‘టేస్ట్ అట్లాస్’ ఇటీవల ఆన్లైన్లో వివిధ ఆహార పదార్థాలపై సర్వే చేసింది. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో వీధుల్లో అమ్మే మిఠాయిల్లో ప్రజాదరణ పొందినవి ఏవి అన్న అంశంపై ఓటింగ్ నిర్వహించింది. అందులో మైసూర్‌పాక్ 14వ స్థానంలో నిలవడం గమనార్హం. అంతేకాదు.. దీనికి స్వీట్ ప్రియుల నుంచి ఏకంగా 4.4 రేటింగ్ వచ్చింది. ఇక ఈ జాబితాలో అమెరికాకు చెందిన డోనట్స్ టాప్ ప్లేస్.. మన దేశానికే చెందిన కుల్ఫీ 24వ స్థానంలో, గులాబ్జమూన్ 26వ స్థానం సంపాదించాయి. రాజు కోసం వండిన మిఠాయి మైసూర్ పాక్ గురించి ఎన్నో కథలు, కథనాలు ప్రచారంలో ఉన్నాయి. అందులో ముఖ్యమైనది మైసూర్ రాజు అంతఃపురం వంటశాలలో మైసూర్ పాక్ పుట్టిందనే కథ. సుమారు 90 ఏళ్ల కింద మైసూర్ రాజు ఒడయార్ అంతఃపురంలో ముఖ్యమైన వంటగాడిగా మాదప్ప ఉండేవారు. అప్పటి రాజు కృష్ణరాజ ఒడయార్ భోజనం చేస్తున్న సమయంలో.. అక్కడ ఎలాంటి మిఠాయి లేదని మాదప్ప గుర్తించాడు. వెంటనే చక్కెర, నెయ్యి, శనగపిండి మిశ్రమంతో ఓ పాకం వంటి వంటకాన్ని తయారు చేశాడు. రాజు భోజనం చివరికి వచ్చేసరికి పాకం చల్లారి మెత్తటి ముద్దగా మారింది. మాదప్ప దాన్ని ముక్కలుగా కోసి వడ్డించగా.. రాజు తిని చూసి చాలా బాగుందని మెచ్చుకున్నారు. ఇదేం మిఠాయి అని రాజు అడిగితే.. మైసూర్ పాకం అని మాదప్ప బదులిచ్చారు. అదే కాస్త మార్పులతో మైసూర్ పాక్‌గా మారింది. అంతఃపురం నుంచి అంగళ్లకు, ఇళ్లకు చేరింది. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మైసూర్ పాక్‌ను తయారు చేసి అమ్ముతున్నా.. మన దేశంలో చేసినంత బాగా మరెక్కడా రుచిగా రాదని మిఠాయి ప్రియులు చెప్తుంటారు. -
మీఠా భారత్ మహాన్
పంజాబ్ పాలు గుజరాత్ తేనె బెంగాల్ పాకం కర్ణాటక మీగడ ప్రాంతాలు వేరైనా మధురిమ ఒకటే.. మధురత ఒకటేఈ దేశం తియ్యనఈ హృదయం తియ్యనఈ సహజీవనం తియ్యన మీఠా భారత్ మహాన్! మైసూర్ పాక్ దక్షిణ భారతదేశంలో ప్రసిద్ధి చెందిన రుచికరమైన స్వీట్ మైసూర్‌పాక్. భారతీయ ప్రధాన స్వీట్లలో ఒకటిగా నిలిచింది. కావల్సినవి: శనగపిండి – ముప్పావు కప్పు; పంచదార – 4 కప్పులు; నెయ్యి – రెండున్నర కప్పులు తయారీ: ∙ముందుగా శనగపిండిని జల్లించాలి ∙స్టౌ మీద మూకుడు పెట్టి వేడి చేయాలి. దీంట్లో పంచదార వేసి, రెండున్నర కప్పుల నీళ్లు పోసి కలపాలి. పంచదార కరిగేంతవరకు కలుపుతూ ఉండాలి ∙పంచదార పూర్తిగా కరిగాక అందులో అరకప్పు నెయ్యి పోస్తూ మెల్లగా కలపాలి ∙దీంట్లో శనగపిండి పోస్తూ, ఉండలు లేకుండా కలుపుతూ ఉండాలి ∙మిశ్రమం ఉడుకుతుండగా కొద్ది కొద్దిగా మళ్లీ నెయ్యి వేస్తూ కలుపుతూ ఉండాలి ∙మిశ్రమం బాగా ఉడికిందనడానికి గుర్తుగా సువాసన వస్తుంది. అప్పుడు మంట తీసేసి, వెడల్పాటి బేసిన్ అడుగున నెయ్యి రాసి, శనగపిండి మిశ్రమాన్ని పోసి, వెడల్పుగా చేయాలి. కొద్దిగా ఆరాక కత్తితో ముక్కలుగా కట్ చేసి, చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారాక ముక్కలుగా ఉన్న పాక్‌ని తీసి సర్వ్ చేయాలి. దక్షిణ భారతదేశంలో ప్రసిద్ధి చెందిన రుచికరమైన స్వీట్ మైసూర్‌పాక్. భారతీయ ప్రధాన స్వీట్లలో ఒకటిగా నిలిచింది. కావల్సినవి: శనగపిండి – ముప్పావు కప్పు; పంచదార – 4 కప్పులు; నెయ్యి – రెండున్నర కప్పులు తయారీ: ∙ముందుగా శనగపిండిని జల్లించాలి ∙స్టౌ మీద మూకుడు పెట్టి వేడి చేయాలి. దీంట్లో పంచదార వేసి, రెండున్నర కప్పుల నీళ్లు పోసి కలపాలి. పంచదార కరిగేంతవరకు కలుపుతూ ఉండాలి ∙పంచదార పూర్తిగా కరిగాక అందులో అరకప్పు నెయ్యి పోస్తూ మెల్లగా కలపాలి ∙దీంట్లో శనగపిండి పోస్తూ, ఉండలు లేకుండా కలుపుతూ ఉండాలి ∙మిశ్రమం ఉడుకుతుండగా కొద్ది కొద్దిగా మళ్లీ నెయ్యి వేస్తూ కలుపుతూ ఉండాలి ∙మిశ్రమం బాగా ఉడికిందనడానికి గుర్తుగా సువాసన వస్తుంది. అప్పుడు మంట తీసేసి, వెడల్పాటి బేసిన్ అడుగున నెయ్యి రాసి, శనగపిండి మిశ్రమాన్ని పోసి, వెడల్పుగా చేయాలి. కొద్దిగా ఆరాక కత్తితో ముక్కలుగా కట్ చేసి, చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారాక ముక్కలుగా ఉన్న పాక్‌ని తీసి సర్వ్ చేయాలి. మోతీచూర్ లడ్డూ దేశం మొత్తమ్మీద రకరకాల లడ్డూల తయారీ వాడుకలో ఉంది. ఉత్తర, దక్షిణ భారతదేశంలో మోతీచూర్ లడ్డూ బాగా ప్రసిద్ధి చెందింది. కావల్సినవి: పంచదార – కప్పు; నీళ్లు – అర కప్పు; కుంకుమపువ్వు – 10 రేకలు (వేళ్లతో కొద్దిగా నలపాలి); బూందీకి: శనగపిండి – కప్పు; కుంకుమపువ్వు – 10 రేకలు; నీళ్లు – 3/4 కప్పు; యాలకులు – 3 (గింజలు తీసుకోవాలి); సార పప్పు – టేబుల్ స్పూన్; నూనె – వేయించడానికి తగినంత; లడ్డూ కట్టే ముందు నూనె లేదా నెయ్యి చేతులకు అద్దుకోవాలి. తయారీ: పాకం : మందపాటి గిన్నె తీసుకొని, అందులో నీళ్లు పోసి, పంచదార కరగనివ్వాలి. దీంట్లో కుంకుమపువ్వు రేకలు వేసి స్టౌ మీద పెట్టి, మరిగించాలి. పాకం అయ్యాక మంట తీసేయాలి. బూందీ: శనగపిండిలో కుంకుమపువ్వు, నీళ్లు పోసి జారుగా కలపాలి. పిండి ముద్దలుగా లేకుండా జాగ్రత్త తీసుకోవాలి. పొయ్యి మీద మూకుడు పెట్టి, నూనె పోసి కాగనివ్వాలి. బూందీ చేసే జల్లెడ పట్టుకొని, సిద్ధంగా ఉంచిన పిండి వేసి, వేళ్లతో వలయాకారంగా రుద్దాలి. జల్లెడ తీసేసి, బూందీని వేయించుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. (బూందీ మరీ గట్టిగా కాకుండా జాగ్రత్తపడాలి.) బూందీ చల్లారాక చక్కెర పాకంలో వేసి కలపాలి. (చక్కెర పాకం మరీ వేడిగా ఉండకూడదు). బూందీ పాకంలో బాగా కలవాలంటే టేబుల్ స్పూన్ వేడి నీళ్లు చల్లవచ్చు. దీంట్లో యాలకుల పొడి, సారపప్పు వేసి కలపాలి. నూనె లేదా నెయ్యి చేత్తో అద్దుకుంటూ కొద్ది కొద్దిగా బూందీ మిశ్రమం తీసుకుంటూ లడ్డూ చేయాలి. చల్లారాక సర్వ్ చేయాలి. నోట్: కిస్మిస్, జీడిపప్పు, బాదంపప్పు పలుకులు కూడా వాడుకోవచ్చు. ఫ్రిజ్‌లో భద్రపరుచుకోవాలంటే నెయ్యిని ఉపయోగించకూడదు. ఫ్రిజ్ చల్లదనానికి నెయ్యి గడ్డకడుతుంది. ఘరీ గుజరాతీయులు చేసుకునే తీపి వంటకం ఇది. కావల్సినవి: మైదా – కప్పు; నెయ్యి – 4 టేబుల్ స్పూన్లు; పాలు – తగినన్ని; పిస్తాపప్పు – అర కప్పు; బాదంపప్పు – పావుకప్పు; కోవా – కప్పు; బొంబాయి రవ్వ – 2 టేబుల్ స్పూన్లు; శనగపిండి – 2 టేబుల్ స్పూన్లు; యాలకుల పొడి – టీ స్పూన్; కుంకుమపువ్వు – 10 రేకలు (టీ స్పూన్ పాలలో కలపాలి); పంచదార పొడి – తగినంత; అలంకరణకు: నెయ్యి 8 టేబుల్ స్పూన్లు; పంచదార పొడి – 2 టేబుల్ స్పూన్లు; పిస్తా పప్పు (సన్నగా కట్‌చేయాలి) – తగినన్ని. తయారీ: నెయ్యి వేసి బొంబాయి రవ్వ వేయించి, తర్వాత శనగపిండి కలిపి వేపాలి. దీంట్లోనే కోవా వేసి 5 నిమిషాలు వేయించి, యాలకుల పొడి కలపాలి. ముద్దగా అయిన ఈ మిశ్రమాన్ని 2 భాగాలు చేయాలి. ఒక భాగంలో కచ్చాపచ్చాగా దంచిన బాదంపప్పు, సగం కుంకుమపువ్వుపాలు, సగం పంచదార పొడి కలపాలి. మరో భాగంలో కచ్చాపచ్చాగా దంచిన పిస్తాపప్పు, మిగతా పంచదార పొడి, కుంకుమ పువ్వు పాలు కలపాలి. వీటిని చిన్న ఉండలు చేయాలి. పిస్తాపప్పు ఉన్న పిండి భాగపు ఉండను అరచేత్తో వెడల్పు చేయాలి. దీంట్లో బాదంపప్పు పిండి ఉండను పెట్టి, చుట్టూ మూసేయాలి. మైదాలో కొద్దిగా నెయ్యి, పాలు కలిపి పూరీపిండిలా కలపాలి. చిన్న పిండి ముద్దలు చేసి, అదిమి, దీంట్లో సిద్ధం చేసిన పిస్తాబాదంపప్పు ఉండను పెట్టి మళ్లీ చుట్టూ మూయాలి. వీటిని ఆవిరి మీద ఉడికించాలి. (నూనెలో కూడా వేయించుకోవచ్చు) తర్వాత నెయ్యి కలిపిన పంచదార పొడిలో రోల్ చేయాలి. సర్వ్ చేసే ముందు పిస్తాపప్పు అలంకరించాలి. శ్రీఖండ్ మహారాష్ట్రీయులు ఇష్టపడే తీపి వంటకం కావల్సినవి: గట్టి తాజా పెరుగు – అరకేజీ; పంచదార పొడి – 5 టేబుల్ స్పూన్లు; యాలకుల పొడి – చిటికెడు; కుంకుమపువ్వు – 10 రేకలు; గోరువెచ్చని పాలు – అర టేబుల్ స్పూను; బాదం, పిస్తాపప్పు – 5 (అలంకరణకు) తయారీ: పల్చటి కాటన్ క్లాత్‌లో పెరుగు వేసి గట్టిగా ముడివేయాలి. నీళ్లన్నీ పోయేలా ఆ మూట మీద బరువుంచాలి. 3 గంటల తర్వాత తీసి ఫ్రిజ్‌లో 4–5 గంటలసేపు ఉంచాలి. ∙గోరువెచ్చని పాలలో కుంకుమపువ్వు, యాలకుల పొడి వేసి కలపాలి. ఫ్రిజ్ నుంచి తీసిన పెరుగులో పంచదార పొడి వేసి కలపాలి. అలాగే కుంకుమపువ్వు పాలు కలపాలి. బీటర్‌తో బాగా గిలకొట్టాలి. బాగా మృదువుగా అయ్యాక దీంట్లో రుచిని బట్టి మరికొంత పంచదార కలుపుకోవచ్చు. పైన సన్నగా తరిగిన పిస్తా, బాదంపప్పు పలుకులను అలంకరించాలి. మాల్పువా వెస్ట్ బెంగాల్, రాజస్థానీయులు ఈ వంటకాన్ని విరివిగా చేసుకుంటారు. కావల్సినవి: మైదా – కప్పు; పాలు – అర కప్పు; పచ్చి కోవా – పావు కప్పు; యాలకుల పొడి – టీ స్పూన్; తరిగిన బాదంపప్పు – కొద్దిగా; వంటసొడా – చిటికెడు; పంచదార – అర కప్పు; నీళ్లు –కప్పు; నెయ్యి లేదా నూనె – వేయించడానికి తగినంత; అలంకరణకు: బాదం, పిస్తాపప్పు తరుగు – టీ స్పూన్ తయారీ: ∙పాత్రలో పంచదార, నీళ్లు పోసి చిక్కటి మిశ్రమం (గులాబ్‌జామూన్ పాకంలా) అయ్యేంతవరకు మరిగించాలి. దీంట్లో యాలకుల పొడి వేసి కలపాలి. దీనిని పక్కన ఉంచుకోవాలి. కావాలనుకుంటే ఇందులో చిటికెడు కుంకుమపువ్వు కూడా కలుపుకోవచ్చు ∙మరొక పాత్రలో మైదా, వంటసొడా, కోవా, పాలు వేసి ఉండలు లేకుండా చపాతీ పిండిలా కలుపుకోవాలి ∙కడాయిలో నూనె లేదా నెయ్యి పోసి కాగనివ్వాలి ∙మైదా మిశ్రమాన్ని చిన్న చిన్న ముద్దలు తీసుకొని, ఉండలు చేసి, పూరీలా (మందంగా) వత్తుకుని కాగిన నూనెలో వేసి రెండు వైపులా కాల్చాలి. (పెనం మీద నెయ్యి వేసుకొని కూడా ఎర్రగా కాల్చుకోవచ్చు.) ∙ఇలా తయారుచేసుకున్నవాటిని పంచదార పాకంలో ముంచి, ప్లేటులోకి తీసుకోవాలి ∙వీటి మీద సన్నగా తరిగిన బాదం, పిస్తాపప్పును అలంకరించి, వడ్డించాలి. కుటుంబానికి రక్షణ – రైస్‌బ్రాన్ వంటనూనె మంచి వంటనూనె వంటలకు చక్కని రుచిని అందించడమే కాదు గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. జీర్ణప్రక్రియను మెరుగుపరుస్తుంది. అందుకే వంటనూనెల ఎంపికలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. రైస్‌బ్రాన్ ఆయిల్ (ఆర్బీఓ) పూర్తి శాకాహారనూనె. పాలిషింగ్ ప్రాసెస్‌లో ఉన్న ఊక నుంచి ఈ నూనెను తయారు చేయడం వల్ల దీంట్లో యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉన్నాయి. అంతర్జాతీయంగా చేసిన అధ్యయనాలలో రైస్‌బ్రాన్ నూనెలో కొలెస్ట్రాల్ తగ్గించే గుణాలున్నాయని నిరూపితమైంది. ⇔ రిఫైన్ చేసిన రైస్‌బ్రాన్ ఆయిల్ గోల్డెన్ ఎల్లో రంగులో ఉంటుంది. అమెరికాలోని కొలంబస్ ఒహియో ఎండీ, ఎఫ్ఆర్సీఏ డాక్టర్ షాలినీ పి.రెడ్డి మాట్లాడుతూ –‘రైస్‌బ్రాన్ వంటనూనె స్టీమ్ డిస్టిలేషన్ విధానంలో రిఫైన్ చేయడంతో పోషకాలు అన్నీ అలాగే నిలిచి ఉంటాయి. ఈ నూనెను అమెరికన్ హార్ట్ అసోసియేషన్, ప్రపంచ ఆరోగ్యసంస్థ సిఫారస్ చేశాయ’ని వివరించారు. ⇔ ఫ్రీడం రైస్‌బ్రాన్ ఆయిల్ వైస్‌ప్రెసిడెంట్, సేల్స్ మార్కెటింగ్ పి.చంద్రశేఖరరెడ్డి మాట్లాడుతూ‘ఫ్రీడం బ్రాండ్ ప్రయాణం ఆరోగ్యకరమైన ఉత్పత్తులను వినియోగదారులకు పరిచయం చేయడమే ప్రధాన లక్ష్యం. ఆ ప్రమాణాలను కచ్చితంగా పాటించడం వల్లే వృద్ధిరేటు బాగుందని’ అన్నారు. రైస్‌బ్రాన్ ఆయిల్ ప్రయోజనాలు ⇔ చెడు కొలెస్ట్రాల్(ల్డీఎల్)ను తగ్గించడంతో పాటు మంచి కొలెస్ట్రాల్(హెచ్‌డీఎల్) పెంచుతుంది. ⇔ గుండె, సంబంధిత రక్తనాళాలకు అత్యుత్తమ రక్షణ అందిస్తుంది. హృదయ దమనుల్లో కొలెస్ట్రాల్ నిల్వలు చేరకుండా అడ్డుకోవడంతో పాటు రక్తం సులువుగా గుండెకు చేరేందుకు తోడ్పడుతుంది. ⇔ అత్యధిక యాంటీ యాక్సిడెంట్లు కలిగి ఉండటం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ⇔ రైస్‌బ్రాన్ నూనెలో 10000+ పీపీఎం ఒరిజనల్ ఉంది. n ఒరైజనాల్, టోకోట్రైనాల్, టోకోఫిరాల్స్, ఫైటోస్టీరాల్స్, స్క్వాలీన్ వంటి అత్యధిక యాంటీ యాక్సిడెంట్లు ఉన్నాయి. n 15 % కన్నా తక్కువ నూనె పీల్చుకుంటుంది. అందువల్ల వేపుడు పదార్ధాలు కూడా పోషకాలు కోల్పోవు. nఅత్యధిక ఉష్ణోగ్రతల వద్దనూ మరింత స్థిరంగా ఉంటుంది. n వేపుళ్లకు అతి తక్కువ సమయం పడుతుంది. అందువల్ల మరింత శక్తి ఆదా అవుతుంది. -
కలపకున్నాకేకు ఓకే
కోక్ చల్లగా ఉందా లేదా అని చూస్తాం. మైసూర్ పాక్... మృదువుగా ఉందా లేదా అని చూస్తాం. పకోడీ కరకరలాడేదేనా అని చూస్తాం. ప్యాక్డ్ ఫుడ్‌పై ఇంగ్రెడియెంట్స్ చూస్తాం. అన్నిట్లో అన్నీ చూస్తాం కానీ... కేక్‌లో ఇవేవీ చూడం. నోట్లో ఎప్పుడు వేసుకుందామా అని చూస్తాం! కానీ మనలో కొంతమంది... గుడ్డు గానీ కలవలేదు కదా అని చూస్తారు! ఎగ్ లేకుండా కేకా?! ఎవరు చేస్తారండీ! ఎవరో ఎందుకు మనమే చేద్దాం రండి. డేట్స్ కేక్ కావలసినవి: మైదాపిండి - 2 కప్పులు, ఖర్జూరాలు సన్నగా తరిగిన ముక్కలు - కప్పు, పంచదార - ముప్పావు కప్పు, ఉప్పు లేని బటర్ - అర కప్పు, నీరు - 2 కప్పులు, కిస్మిస్ - పావు కప్పు, జీడిపప్పు పలుకులు - పావుకప్పు, వెనిలా ఎసెన్స్ - టీ స్పూను, బేకింగ్ సోడా - ఒకటి ముప్పావు టీ స్పూన్లు, నిమ్మరసం - టేబుల్ స్పూను, పాలు - కప్పు, ఉప్పు - చిటికెడు తయారి: ఒక నాన్‌స్టిక్ పాన్‌లో తరిగి ఉంచుకున్న ఖర్జూరం ముక్కలు, కిస్మిస్లు, నీరు, జీడిపప్పు పలుకులు, పంచదార, బటర్ వేసి స్టౌ మీద ఉంచి పంచదార, బటర్ కరిగేవరకు కలపాలి మంట తగ్గించి, ఖర్జూరాలు ముద్దగా అయ్యేవరకు సుమారు 25 నిముషాలు ఉడికించి, దించి, చల్లారనివ్వాలి వెనిల్ ఎసెన్స్, నిమ్మరసం జత చేయాలి అవెన్‌ను 180 డిగ్రీల సెంటీగ్రేడ్ దగ్గర ప్రీహీట్ చేయాలి కేక్ పాన్‌కు బటర్ పూసి పక్కన ఉంచాలి ఒక పాత్రలో బేకింగ్ సోడా, మైదా, ఉప్పు వేసి కలిపి, పైన తయారుచేసి ఉంచుకున్న మిశ్రమానికి జత చేయాలి పాలు జతచేసి మిశ్రమం చిక్కగా ఉండేలా కలపాలి ఆలస్యం చేయకుండా కేక్ పాన్‌లో ఈ మిశ్రమం పోసి అవెన్‌లో ఉంచాలి 180 డిగ్రీల సెంటీగ్రేడ్ దగ్గర 35 నిముషాల పాటు బేక్ చేయాలి కేక్‌ను చల్లారిన తర్వాత కట్ చేసి సర్వ్ చేయాలి. వెనిలా స్పాంజ్ కేక్ కావలసినవి: మైదాపిండి - ఒకటిన్నర కప్పులు, పంచదార - ముప్పావు కప్పు, పెరుగు - కప్పు, నూనె - అరకప్పు, బేకింగ్ సోడా - అర టీ స్పూను, బేకింగ్ పౌడర్ - ఒకటింపావు టీ స్పూన్లు, వెనిలా ఎసెన్స్ - టీ స్పూను తయారి: ముందుగా మైదాపిండి జల్లించాలి అవెన్‌ను 200 డిగ్రీల సెంటీగ్రేడ్ దగ్గర ప్రీహీట్ చేయాలి 8 అంగుళాల రౌండ్కేక్ పాన్‌కి నూనె రాసి పక్కన ఉంచాలి ఒకపాత్రలో పెరుగు వేసి దానికి బేకింగ్‌సోడా, బేకింగ్ పౌడర్ జత చేసి బాగా కలిపి కాసేపు పక్కన ఉంచాలి వెనిలా ఎసెన్స్ జత చేసి మరోమారు కలపాలి ఈ మిశ్రమంలో మైదాపిండిని కొద్దికొద్దిగా వేస్తూ కలపాలి. (ఎక్కడా ఉండలు లేకుండా చూసుకోవాలి. మరీ ఎక్కువగా కలపకూడదు) తయారు చేసి ఉంచుకున్న మిశ్రమాన్ని పాన్‌కేక్‌లో పోసి సమానంగా కలపాలి 200 డిగ్రీల సెంటీగ్రేడ్ దగ్గర 10 నిముషాలు బేక్ చేయాలి 180 డిగ్రీల సెంటీగ్రేడ్‌కు తగ్గించి 30 నిముషాలు బేక్ చేసి తీసేయాలి (ఇంకాసేపటిలో కేక్ తయారవుతుందనగా, కేక్‌మీద పాలను పైపూతగా పూయాలి) కేక్ కాస్త చల్లారిన తర్వాత దానిని మరో పాత్రలోకి తిరగ తీసి కట్ చేయాలి. టూటీ ఫ్రూటీ కేక్ కావలసినవి: గోధుమపిండి - కొంచెం తక్కువగా రెండు కప్పులు, పంచదార - కప్పు, నీరు - కప్పు, నూనె - 5 టేబుల్ స్పూన్లు, టూటీ ఫ్రూటీ - 5 టేబుల్ స్పూన్లు, వెనిలా ఎసెన్స్ - 2 టీ స్పూన్లు, నిమ్మరసం - టేబుల్ స్పూను, బేకింగ్ సోడా - ఒకటింపావు టీ స్పూన్లు, ఉప్పు - చిటికెడు తయారి: ఒక పాత్రలో గోధుమపిండి, ఉప్పు, బేకింగ్ సోడా వేసి బాగా కలిపి జల్లించి పక్కన ఉంచాలి అవెన్‌ను 180 డిగ్రీల దగ్గర ప్రీ హీట్ చేయాలి 8 అంగుళాల పాన్కేక్కి నూనె రాసి పక్కన ఉంచాలి మిక్సీజార్‌లో పంచదార, నూనె, నీరు, నిమ్మరసం, వెనిలా ఎసెన్స్ వేసి అన్నీ కలిసి కరిగేవరకు బాగా మిక్సీ పట్టాలి టూటీఫ్రూటీ జతచేసి మరోమారు మిక్సీ పట్టి ఒక పాత్రలోకి తీసుకోవాలి గోధుమపిండి కొద్దికొద్దిగా వేస్తూ ఉండలు లేకుండా బాగా కలపాలి ఈ మిశ్రమాన్ని ఆలస్యం చేయకుండా కేక్‌పాన్‌లో పోసి అవెన్‌లో ఉంచాలి 180 డిగ్రీల దగ్గర 35 నిముషాల పాటు బేక్ చేయాలి కేక్చల్లారిన తర్వాత వేరే ప్లేట్లోకి తిరగదీసి ముక్కలుగా కట్ చేయాలి. బనానా కేక్ కావలసినవి: మైదాపిండి - ముప్పావు కప్పు, బాగా పండిన అరటిపళ్లు - 2 (మెత్తగా గుజ్జు చేయాలి), పంచదార - 6 టేబుల్ స్పూన్లు, బేకింగ్ పౌడర్ - అర టీ స్పూను, బేకింగ్ సోడా - పావు టీ స్పూను, కోకో పౌడర్ - 5 టేబుల్ స్పూన్లు, ఉప్పు - కొద్దిగా, నూనె - పావు కప్పు, వెనిలా ఎసెన్స్ - అర టీ స్పూను తయారి: ఒక పాత్రలోమైదాపిండి, ఉప్పు, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా వేసి బాగా కలిపి, జల్లించాలి అవెన్‌ను 180 డిగ్రీల సెంటీగ్రేడ్ దగ్గర ప్రీహీట్ చేయాలి 7 అంగుళాల రౌండ్ పాన్ కేక్‌కు నూనె పట్టించాలి మిక్సీ జార్లో అరటిపండు గుజ్జు, పంచదార, నూనె, వెనిలా ఎసెన్స్ వేసి మిక్సీ పట్టి, ఒక పాత్రలోకి తీసుకోవాలి మైదాపిండి, కోకోపొడిని కొద్దికొద్దిగా జత చేస్తూ పిండి బాగా కలపాలి కేక్‌పాన్‌లోకి ఈ మిశ్రమాన్ని పోయాలి అవెన్‌లో 180 డిగ్రీల సెంటీగ్రేడ్ దగ్గర సుమారు 35 నిముషాలు బేక్ చేసి బయటకు తీయాలి చల్లారిన తర్వాత వేరే ప్లేట్లోకి తీసుకుని కట్ చేసి సర్వ్ చేయాలి.