మీఠా భారత్‌ మహాన్‌ | 15th august special story on sweets | Sakshi
Sakshi News home page

మీఠా భారత్‌ మహాన్‌

Published Sat, Aug 12 2017 12:14 AM | Last Updated on Sun, Sep 17 2017 5:25 PM

మీఠా భారత్‌ మహాన్‌

మీఠా భారత్‌ మహాన్‌

పంజాబ్‌ పాలు గుజరాత్‌ తేనె బెంగాల్‌ పాకం కర్ణాటక మీగడ ప్రాంతాలు వేరైనా మధురిమ ఒకటే..
మధురత ఒకటేఈ దేశం తియ్యనఈ హృదయం తియ్యనఈ సహజీవనం తియ్యన మీఠా భారత్‌ మహాన్‌!


మైసూర్‌ పాక్‌
దక్షిణ భారతదేశంలో ప్రసిద్ధి చెందిన రుచికరమైన స్వీట్‌ మైసూర్‌పాక్‌. భారతీయ ప్రధాన స్వీట్లలో ఒకటిగా నిలిచింది.
కావల్సినవి: శనగపిండి – ముప్పావు కప్పు; పంచదార – 4 కప్పులు; నెయ్యి – రెండున్నర కప్పులు
తయారీ: ∙ముందుగా శనగపిండిని జల్లించాలి ∙స్టౌ మీద మూకుడు పెట్టి వేడి చేయాలి. దీంట్లో పంచదార వేసి, రెండున్నర కప్పుల నీళ్లు పోసి కలపాలి. పంచదార కరిగేంతవరకు కలుపుతూ ఉండాలి ∙పంచదార పూర్తిగా కరిగాక అందులో అరకప్పు నెయ్యి పోస్తూ మెల్లగా కలపాలి ∙దీంట్లో శనగపిండి పోస్తూ, ఉండలు లేకుండా కలుపుతూ ఉండాలి ∙మిశ్రమం ఉడుకుతుండగా కొద్ది కొద్దిగా మళ్లీ నెయ్యి వేస్తూ కలుపుతూ ఉండాలి ∙మిశ్రమం బాగా ఉడికిందనడానికి గుర్తుగా సువాసన వస్తుంది. అప్పుడు మంట తీసేసి, వెడల్పాటి బేసిన్‌ అడుగున నెయ్యి రాసి, శనగపిండి మిశ్రమాన్ని పోసి, వెడల్పుగా చేయాలి. కొద్దిగా ఆరాక కత్తితో ముక్కలుగా  కట్‌ చేసి, చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారాక ముక్కలుగా ఉన్న పాక్‌ని తీసి సర్వ్‌ చేయాలి. దక్షిణ భారతదేశంలో ప్రసిద్ధి చెందిన రుచికరమైన స్వీట్‌ మైసూర్‌పాక్‌. భారతీయ ప్రధాన స్వీట్లలో ఒకటిగా నిలిచింది.

కావల్సినవి: శనగపిండి – ముప్పావు కప్పు; పంచదార – 4 కప్పులు; నెయ్యి – రెండున్నర కప్పులు
తయారీ: ∙ముందుగా శనగపిండిని జల్లించాలి ∙స్టౌ మీద మూకుడు పెట్టి వేడి చేయాలి. దీంట్లో పంచదార వేసి, రెండున్నర కప్పుల నీళ్లు పోసి కలపాలి. పంచదార కరిగేంతవరకు కలుపుతూ ఉండాలి ∙పంచదార పూర్తిగా కరిగాక అందులో అరకప్పు నెయ్యి పోస్తూ మెల్లగా కలపాలి ∙దీంట్లో శనగపిండి పోస్తూ, ఉండలు లేకుండా కలుపుతూ ఉండాలి ∙మిశ్రమం ఉడుకుతుండగా కొద్ది కొద్దిగా మళ్లీ నెయ్యి వేస్తూ కలుపుతూ ఉండాలి ∙మిశ్రమం బాగా ఉడికిందనడానికి గుర్తుగా సువాసన వస్తుంది. అప్పుడు మంట తీసేసి, వెడల్పాటి బేసిన్‌ అడుగున నెయ్యి రాసి, శనగపిండి మిశ్రమాన్ని పోసి, వెడల్పుగా చేయాలి. కొద్దిగా ఆరాక కత్తితో ముక్కలుగా  కట్‌ చేసి, చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారాక ముక్కలుగా ఉన్న పాక్‌ని తీసి సర్వ్‌ చేయాలి.

మోతీచూర్‌ లడ్డూ
దేశం మొత్తమ్మీద రకరకాల లడ్డూల తయారీ వాడుకలో ఉంది. ఉత్తర, దక్షిణ భారతదేశంలో మోతీచూర్‌ లడ్డూ బాగా ప్రసిద్ధి చెందింది.
కావల్సినవి:  పంచదార – కప్పు; నీళ్లు – అర కప్పు; కుంకుమపువ్వు – 10  రేకలు (వేళ్లతో కొద్దిగా నలపాలి);
బూందీకి: శనగపిండి – కప్పు; కుంకుమపువ్వు – 10 రేకలు; నీళ్లు – 3/4 కప్పు; యాలకులు – 3 (గింజలు తీసుకోవాలి);  సార పప్పు – టేబుల్‌ స్పూన్‌; నూనె – వేయించడానికి తగినంత; లడ్డూ కట్టే ముందు నూనె లేదా నెయ్యి చేతులకు అద్దుకోవాలి.
తయారీ: పాకం : మందపాటి గిన్నె తీసుకొని, అందులో నీళ్లు పోసి, పంచదార కరగనివ్వాలి. దీంట్లో కుంకుమపువ్వు రేకలు వేసి స్టౌ మీద పెట్టి, మరిగించాలి. పాకం అయ్యాక మంట తీసేయాలి.

బూందీ:  శనగపిండిలో కుంకుమపువ్వు, నీళ్లు పోసి జారుగా కలపాలి. పిండి ముద్దలుగా లేకుండా జాగ్రత్త తీసుకోవాలి. పొయ్యి మీద మూకుడు పెట్టి, నూనె పోసి కాగనివ్వాలి. బూందీ చేసే జల్లెడ పట్టుకొని, సిద్ధంగా ఉంచిన పిండి వేసి, వేళ్లతో వలయాకారంగా రుద్దాలి. జల్లెడ తీసేసి, బూందీని వేయించుకొని ప్లేట్‌లోకి తీసుకోవాలి. (బూందీ మరీ గట్టిగా కాకుండా జాగ్రత్తపడాలి.)  బూందీ చల్లారాక చక్కెర పాకంలో వేసి కలపాలి. (చక్కెర పాకం మరీ వేడిగా ఉండకూడదు). బూందీ పాకంలో బాగా కలవాలంటే టేబుల్‌ స్పూన్‌ వేడి నీళ్లు చల్లవచ్చు. దీంట్లో యాలకుల పొడి, సారపప్పు వేసి కలపాలి. నూనె లేదా నెయ్యి చేత్తో అద్దుకుంటూ కొద్ది కొద్దిగా బూందీ మిశ్రమం తీసుకుంటూ లడ్డూ చేయాలి. చల్లారాక సర్వ్‌ చేయాలి.
నోట్‌: కిస్‌మిస్, జీడిపప్పు, బాదంపప్పు పలుకులు కూడా వాడుకోవచ్చు. ఫ్రిజ్‌లో భద్రపరుచుకోవాలంటే నెయ్యిని ఉపయోగించకూడదు. ఫ్రిజ్‌ చల్లదనానికి నెయ్యి గడ్డకడుతుంది.

ఘరీ
గుజరాతీయులు చేసుకునే తీపి వంటకం ఇది.

కావల్సినవి:  మైదా – కప్పు; నెయ్యి – 4 టేబుల్‌ స్పూన్లు; పాలు – తగినన్ని; పిస్తాపప్పు – అర కప్పు; బాదంపప్పు – పావుకప్పు; కోవా – కప్పు; బొంబాయి రవ్వ – 2 టేబుల్‌ స్పూన్లు; శనగపిండి – 2 టేబుల్‌ స్పూన్లు; యాలకుల పొడి – టీ స్పూన్‌; కుంకుమపువ్వు – 10 రేకలు (టీ స్పూన్‌ పాలలో కలపాలి); పంచదార పొడి – తగినంత; అలంకరణకు: నెయ్యి 8 టేబుల్‌ స్పూన్లు; పంచదార పొడి – 2 టేబుల్‌ స్పూన్లు; పిస్తా పప్పు (సన్నగా కట్‌చేయాలి) – తగినన్ని.

తయారీ: నెయ్యి వేసి బొంబాయి రవ్వ వేయించి, తర్వాత శనగపిండి కలిపి వేపాలి. దీంట్లోనే కోవా వేసి 5 నిమిషాలు వేయించి, యాలకుల పొడి కలపాలి. ముద్దగా అయిన ఈ మిశ్రమాన్ని 2 భాగాలు చేయాలి. ఒక భాగంలో కచ్చాపచ్చాగా దంచిన బాదంపప్పు, సగం కుంకుమపువ్వుపాలు, సగం పంచదార పొడి కలపాలి. మరో భాగంలో కచ్చాపచ్చాగా దంచిన పిస్తాపప్పు, మిగతా పంచదార పొడి, కుంకుమ పువ్వు పాలు కలపాలి. వీటిని చిన్న ఉండలు చేయాలి. పిస్తాపప్పు ఉన్న పిండి భాగపు ఉండను అరచేత్తో వెడల్పు చేయాలి. దీంట్లో బాదంపప్పు పిండి ఉండను పెట్టి, చుట్టూ మూసేయాలి. మైదాలో కొద్దిగా నెయ్యి, పాలు కలిపి పూరీపిండిలా కలపాలి. చిన్న పిండి ముద్దలు చేసి, అదిమి, దీంట్లో సిద్ధం చేసిన పిస్తాబాదంపప్పు ఉండను పెట్టి మళ్లీ చుట్టూ మూయాలి. వీటిని ఆవిరి మీద ఉడికించాలి. (నూనెలో కూడా వేయించుకోవచ్చు) తర్వాత నెయ్యి కలిపిన పంచదార పొడిలో రోల్‌ చేయాలి. సర్వ్‌ చేసే ముందు పిస్తాపప్పు అలంకరించాలి.

శ్రీఖండ్‌
మహారాష్ట్రీయులు ఇష్టపడే తీపి వంటకం

కావల్సినవి: గట్టి తాజా పెరుగు – అరకేజీ; పంచదార పొడి – 5 టేబుల్‌ స్పూన్లు; యాలకుల పొడి – చిటికెడు; కుంకుమపువ్వు – 10 రేకలు; గోరువెచ్చని పాలు – అర టేబుల్‌ స్పూను; బాదం, పిస్తాపప్పు – 5 (అలంకరణకు)
తయారీ: పల్చటి కాటన్‌ క్లాత్‌లో పెరుగు వేసి గట్టిగా ముడివేయాలి.  నీళ్లన్నీ పోయేలా ఆ మూట మీద బరువుంచాలి. 3 గంటల తర్వాత  తీసి ఫ్రిజ్‌లో 4–5 గంటలసేపు ఉంచాలి. ∙గోరువెచ్చని పాలలో కుంకుమపువ్వు, యాలకుల పొడి వేసి కలపాలి. ఫ్రిజ్‌ నుంచి తీసిన  పెరుగులో పంచదార పొడి వేసి కలపాలి. అలాగే కుంకుమపువ్వు పాలు కలపాలి. బీటర్‌తో బాగా గిలకొట్టాలి. బాగా మృదువుగా అయ్యాక దీంట్లో రుచిని బట్టి మరికొంత పంచదార కలుపుకోవచ్చు. పైన సన్నగా తరిగిన పిస్తా, బాదంపప్పు పలుకులను అలంకరించాలి.

మాల్‌పువా
వెస్ట్‌ బెంగాల్, రాజస్థానీయులు ఈ వంటకాన్ని విరివిగా చేసుకుంటారు.
కావల్సినవి: మైదా – కప్పు; పాలు – అర కప్పు; పచ్చి కోవా – పావు కప్పు; యాలకుల పొడి – టీ స్పూన్‌; తరిగిన బాదంపప్పు – కొద్దిగా; వంటసొడా – చిటికెడు; పంచదార – అర కప్పు; నీళ్లు –కప్పు; నెయ్యి లేదా నూనె – వేయించడానికి తగినంత;
అలంకరణకు: బాదం, పిస్తాపప్పు తరుగు – టీ స్పూన్‌

తయారీ: ∙పాత్రలో పంచదార, నీళ్లు పోసి చిక్కటి మిశ్రమం (గులాబ్‌జామూన్‌ పాకంలా) అయ్యేంతవరకు మరిగించాలి. దీంట్లో యాలకుల పొడి వేసి కలపాలి. దీనిని పక్కన ఉంచుకోవాలి. కావాలనుకుంటే ఇందులో చిటికెడు కుంకుమపువ్వు కూడా కలుపుకోవచ్చు ∙మరొక పాత్రలో మైదా, వంటసొడా, కోవా, పాలు వేసి ఉండలు లేకుండా చపాతీ పిండిలా కలుపుకోవాలి ∙కడాయిలో నూనె లేదా నెయ్యి పోసి కాగనివ్వాలి ∙మైదా మిశ్రమాన్ని చిన్న చిన్న ముద్దలు తీసుకొని, ఉండలు చేసి, పూరీలా (మందంగా) వత్తుకుని కాగిన నూనెలో వేసి రెండు వైపులా కాల్చాలి. (పెనం మీద నెయ్యి వేసుకొని కూడా ఎర్రగా కాల్చుకోవచ్చు.) ∙ఇలా తయారుచేసుకున్నవాటిని పంచదార పాకంలో ముంచి, ప్లేటులోకి తీసుకోవాలి ∙వీటి మీద సన్నగా తరిగిన బాదం, పిస్తాపప్పును అలంకరించి, వడ్డించాలి.

కుటుంబానికి రక్షణ – రైస్‌బ్రాన్‌ వంటనూనె
మంచి వంటనూనె వంటలకు చక్కని రుచిని అందించడమే కాదు గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. జీర్ణప్రక్రియను మెరుగుపరుస్తుంది. అందుకే వంటనూనెల ఎంపికలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. రైస్‌బ్రాన్‌ ఆయిల్‌ (ఆర్‌బీఓ) పూర్తి శాకాహారనూనె. పాలిషింగ్‌ ప్రాసెస్‌లో ఉన్న ఊక నుంచి ఈ నూనెను తయారు చేయడం వల్ల దీంట్లో యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉన్నాయి. అంతర్జాతీయంగా చేసిన అధ్యయనాలలో రైస్‌బ్రాన్‌ నూనెలో కొలెస్ట్రాల్‌ తగ్గించే గుణాలున్నాయని నిరూపితమైంది.
రిఫైన్‌ చేసిన రైస్‌బ్రాన్‌ ఆయిల్‌ గోల్డెన్‌ ఎల్లో రంగులో     ఉంటుంది. అమెరికాలోని కొలంబస్‌ ఒహియో ఎండీ, ఎఫ్‌ఆర్‌సీఏ డాక్టర్‌ షాలినీ పి.రెడ్డి మాట్లాడుతూ –‘రైస్‌బ్రాన్‌ వంటనూనె స్టీమ్‌ డిస్టిలేషన్‌ విధానంలో రిఫైన్‌ చేయడంతో పోషకాలు అన్నీ అలాగే నిలిచి ఉంటాయి. ఈ నూనెను అమెరికన్‌ హార్ట్‌ అసోసియేషన్, ప్రపంచ ఆరోగ్యసంస్థ సిఫారస్‌ చేశాయ’ని వివరించారు.
ఫ్రీడం రైస్‌బ్రాన్‌ ఆయిల్‌ వైస్‌ప్రెసిడెంట్, సేల్స్‌ మార్కెటింగ్‌ పి.చంద్రశేఖరరెడ్డి మాట్లాడుతూ‘ఫ్రీడం బ్రాండ్‌ ప్రయాణం ఆరోగ్యకరమైన ఉత్పత్తులను వినియోగదారులకు పరిచయం చేయడమే ప్రధాన లక్ష్యం. ఆ ప్రమాణాలను కచ్చితంగా పాటించడం వల్లే వృద్ధిరేటు బాగుందని’ అన్నారు.

రైస్‌బ్రాన్‌ ఆయిల్‌ ప్రయోజనాలు
చెడు కొలెస్ట్రాల్‌(ల్‌డీఎల్‌)ను తగ్గించడంతో పాటు మంచి కొలెస్ట్రాల్‌(హెచ్‌డీఎల్‌) పెంచుతుంది.
గుండె, సంబంధిత రక్తనాళాలకు అత్యుత్తమ రక్షణ అందిస్తుంది. హృదయ దమనుల్లో కొలెస్ట్రాల్‌ నిల్వలు చేరకుండా అడ్డుకోవడంతో పాటు రక్తం సులువుగా గుండెకు చేరేందుకు తోడ్పడుతుంది.
అత్యధిక యాంటీ యాక్సిడెంట్లు కలిగి ఉండటం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది.

రైస్‌బ్రాన్‌ నూనెలో 10000+ పీపీఎం ఒరిజనల్‌ ఉంది. n  ఒరైజనాల్, టోకోట్రైనాల్, టోకోఫిరాల్స్, ఫైటోస్టీరాల్స్, స్క్వాలీన్‌ వంటి అత్యధిక యాంటీ యాక్సిడెంట్లు ఉన్నాయి. n 15 % కన్నా తక్కువ నూనె పీల్చుకుంటుంది. అందువల్ల వేపుడు పదార్ధాలు కూడా పోషకాలు కోల్పోవు. nఅత్యధిక ఉష్ణోగ్రతల వద్దనూ మరింత స్థిరంగా ఉంటుంది. n  వేపుళ్లకు అతి తక్కువ సమయం పడుతుంది. అందువల్ల మరింత శక్తి ఆదా అవుతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement