దక్షిణాదిలోని అత్యంత ప్రసిద్ధ స్వీట్లలో మైసూర్ పాక్ ఒకటి. ఇది చూడటానికి చక్కటి పసుపు కలర్‌లో ఉండటంతో సంప్రదాయ వేడుకల్లో తప్పనిసరిగా ఇది ఉండాల్సిందే. అలాంటి మైసూర్ పాక్‌ని నోట్లో వేసుకుంటే వెన్నలా కరిపోయేలా చక్కగా కలుపుతూ తయారు చేస్తున్న విధానం నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
ఈ వీడియోని ఒక ఫుడ్ వ్లాగర్ ఇన్‌స్టాలో షేర్ చేశారు. శెనగపిండితో చేసే వంటకం, నెయ్యి, పంచదారల మిశ్రంతో నిరంతరం కలుపుతూ చాలా స్మూత్‌గా అయ్యేలా చేస్తుంటారు పాకశాస్త్ర నిపుణులు. ఆ తర్వాత చివరగా దగ్గర పడిన మిశ్రమంలో అదనపు నెయ్యిని జోడించి మరింత నూనుపుగా మంచి రంగు, వాసనని సంతరించుకునే అందంగా తయారు చేస్తారు. దాన్ని చివర్లో నెయ్యి రాసిన ట్రైలో వేసి చక్కగా ముక్కలుగా కట్‌చేసి స్వీట్‌బాక్స్‌లలో ప్యాక్ చేస్తున్నట్లు వీడియోలో కనిపిస్తుంది.
చివర్లో వ్లాగర్ అవి తింటూ అబ్బా ఏమి రుచి నోట్లో వేసుకుంటే అలా కరిపోతోంది అంతే.. అంటూ ఆస్వాదిస్తూ కనిపిస్తాడు. ఈ తయారీ విధానాన్ని కర్ణాటకలోని ఓ ప్రసిద్ధ షాపులో చిత్రీకరించారు. అయితే నెటిజన్లు అందులో ఉపయోగించే ఎక్కువ మొత్తంలోని నెయ్యి, పంచదార పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. సరదాగా ఒకసారి కడుపు నిండుగా మనసుకు నచ్చిన స్వీట్ తింటే ఆ ఆనందమే వేరు కదా..!. ఆరోగ్య స్ప్రుహ అవసరమే మరీ భయంకరమైన నిబంధనలు వద్దు సుమా..!.
Comments
Please login to add a commentAdd a comment