అతి చిన్న వాషింగ్‌​ మెషీన్‌తో ప్రపంచ రికార్డు..! | Indian Engineer Sebin Saji Breaks World Record With Smallest Washing Machine | Sakshi
Sakshi News home page

అతి చిన్న వాషింగ్‌​ మెషీన్‌తో ప్రపంచ రికార్డు..!

Published Wed, Oct 16 2024 1:36 PM | Last Updated on Wed, Oct 16 2024 2:57 PM

Indian Engineer Sebin Saji Breaks World Record With Smallest Washing Machine

ఊహకే అందని విధంగా అత్యంత మైక్రో వాషింగ్‌ మెషిన్‌ని రూపొందించి గిన్నిస్‌ రికార్డు నెలకొల్పాడు భారతీయ ఇంజనీర్‌ సెబిన్‌ సాజీ. ఇదే ప్రపంచంలోనే అతి చిన్న వాషింగ్‌ మెషీన్‌. దీని వైశాల్యం, పొడవు, వెడల్పలు వరుసగా 1.28 అంగుళాలు, 1.32 అంగుళాలు, 1.52 అంగుళాలే కావడం విశేషం. ఇది ఇది 1990ల నాటి ప్రసిద్ధ హ్యాండ్‌హెల్డ్ బొమ్మ అయిన డిజిటల్‌ పెంపుడు జంతువు సైజు కంటే కూడా చిన్నది. 

అయితే ఇది సాధారణ వాషింగ్‌ మెషీన్‌లానే పనిచేస్తుండటం మరింత విశేషం. ఇది చిన్న లోడ్ల కోసం రూపొందించడం జరిగింది. ఇంజీనీరింగ్‌ నైపుణ్యంతో సూక్ష్మీకరణ అనే హస్తకళకు సాజీ రూపొందించిన ఈ గాడ్జెట్‌ నిలువెత్తు నిదర్శనం. వర్కింగ్‌ పరంగా అసెంబుల్‌ చేసి చూస్తే..అది పూర్తిగా వర్క్‌ అవ్వడమే కాక, వాష్‌ , రిన్‌ , స్పిన్‌, వంటి వాటిని కొలిచేందుకు డిజిటల్ కాలిపర్‌లను ఉపయోగించారు. 

సాజీ వాషింగ్‌ మెషీన్‌ ఎలా వర్క్‌చేస్తుందో వివరిస్తున్న వీడియో నెట్టింట తెగ హల్‌చల్‌ చేస్తోంది. ఆ వాషింగ్‌ మెషీన్‌లో చిన్న క్లాత్‌, చిటికెడు వాషింగ్‌ పౌడర్‌ వేయగానే ఎలా వాష్‌ చేస్తుందో క్లియర్‌గా ఆ వీడియోలో కనిపిస్తోంది. ఇప్పటివరకు తయారైన మైక్రో వాషింగ్‌ మెషీన్‌లలో ఇదే అత్యంత చిన్నదని గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ప్రకటించింది.

 

(చదవండి: 82 ఏళ్ల జీవితకాలంలో ఒక్క మహిళని కూడా చూడలేదట..!)
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement