How To Make Healthy Beetroot Mysorepak Recipe - Sakshi
Sakshi News home page

Beetroot Mysorepak: మనసు దోచే  మైసూరు పాకం బీట్‌రూట్‌తో.. ఇలా చేసుకోండి

Published Fri, Jul 28 2023 1:22 PM | Last Updated on Fri, Jul 28 2023 1:39 PM

How To Make Healthy Beetroot Mysorepak Recipe - Sakshi

ప్రపంచంలో ఎక్కువమంది ఇష్టంగా తినే స్ట్రీట్‌ ఫుడ్స్‌లో మన మైసూర్‌ పాక్‌ కూడా ఒకటి. ఎంతోమంది మనసులు గెలుచుకున్న మైసూర్‌ పాక్‌ను మరింత వైవిధ్యంగా కూడా చేయొచ్చు. అందుకే విభిన్న మైసూర్‌΄ాక్‌లతో మీ ముందుకొచ్చింది.ఈ వారం వంటిల్లు...  

బీట్‌రూట్‌ మైసూర్‌ పాక్‌ తయారీకి కావల్సినవి:
బీట్‌ రూట్‌ జ్యూస్‌ – అరకప్పు; శనగపిండి – కప్పు; నెయ్యి – ఒకటిన్నర కప్పులు; చక్కెర – కప్పు.



తయారీ విధానమిలా..

  • శనగపిండిని సన్నని మంట మీద పచ్చివాసన పోయేంతవరకు వేయించి దించేయాలి ∙వేగిన పిండి జల్లెడ పట్టుకోవాలి. ఇప్పుడు ఈ పిండిలో నెయ్యి వేసి ఉండలు లేకుండా చక్కగా కలుపుకొని పక్కన పెట్టాలి
  • మందపాటి బాణలిలో పంచదార, బీట్‌రూట్‌ జ్యూస్‌ వేసి సన్నని మంటమీద తిప్పుతూ తీగపాకం రానివ్వాలి పాకం వచ్చిన తరువాత కలిపిపెట్టుకున్న శనగపిండి మిశ్రమాన్ని వేస్తూ కలుపుకోవాలి.
  • చక్కగా కలిపాక అరకప్పు నెయ్యిని కొద్దికొద్దిగా వేస్తూ  కలపాలి.నెయ్యి మొత్తం మిశ్రమంలో ఇగిరిపోయి , చిక్కబడిన తరువాత దించేసి, నెయ్యి రాసిన ప్లేటులో పోయాలి.
  • గంట ఆరాక ముక్కలు కోసుకుని సర్వ్‌చేసుకోవాలి. అంతే టేస్టీ అండ్‌ హెల్తీ బీట్‌రూట్‌ మైసూర్‌ పాక్‌ రెడీ.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement