చాక్లెట్ పాక్‌కి కావలసినవి:
శనగపిండి– ముప్పావు కప్పు
కోకో పొడి – పావు కప్పు
బెల్లం – కప్పు
నీళ్లు – ముప్పావు కప్పు
నెయ్యి – ముప్పావు కప్పు
పిస్తా పలుకులు – టేబుల్ స్పూను.
తయారీ విధానం: శనగపిండి ప్చ వాసన పోయి, మంచి సువాసన వచ్చేంత వరకు వేయించాలి. మందపాటి గిన్నెలో బెల్లం, నీళ్లు వేసి తీగ పాకం వచ్చేంత వరకు మరిగించాలి. శనగపిండి వేగాక కోకో పొడి, నెయ్యి వేసి ఉండలు లేకుండా కలపాలి. పిండి మిశ్రమం వేగాక బెల్లం పాకం పోసి ఉండలు కట్టకుండా తిప్పుతనే ఉండాలి. ఐదారు నిమిషాలు తిప్పాక పిస్తాపలుకులు వేసి ఐదు నిమిషాలు మగ్గనిచ్చి దించేయాలి. వెన్న రాసిన ప్లేటులో ఈ వేడివేడి పాకం మిశ్రవన్ని వేయాలి. ఐదు నిమిషాలు ఆరాక నచ్చిన ఆకారంలో ముక్కలు కట్ చేసుకుంటే చాక్లెట్ పాక్ రెడీ.
Comments
Please login to add a commentAdd a comment