culinary
-
రాయల్ డెజర్ట్ "మైసూర్ పాక్" ఎవరు తయారు చేశారో తెలుసా..!
కొన్ని రకాల స్వీట్లు చాలావరకు అందరికీ నచ్చుతాయి. దాని రుచి, సువాసనకి ఫిదా అయిపోతుంటారు. అలాంటి స్వీట్స్‌లలో ఒకటి మైసూర్ పాక్ ఒకటి. అయితే ఈస్వీట్ పండగలు, వేడుకలలో తప్పనసరిగా ఉంటుంది. తియ్యటి పదార్థాలలో అగ్రస్థానం దీనిది. ఈ స్వీటు పేరుకి తగ్గట్టుగానే రాయల్టీకి చిహ్నంలా ఉంటుంది. అసలు ఈ రెసిపీని ఎలా తయారు చేశారు, ఎవరు చేశారు వంటి ఆసక్తికర విషయాల గురించి తెలుసుకుందామా..!.భారతదేశం అంతటా పండుగలు, పత్యేక సందర్భాల్లో ప్రత్యేక విందుగా ఉండే స్వీటు ఇదే. దీని మూలం రాజుల వంశాలే. కర్ణాటక(Karnataka) రాజుల వంటశాలల నుంచి తయారయ్యిందని అంటుంటారు. మైసూర్ పాక్(Mysore Pak) మొదటిసారిగా 20వ శతాబ్దం ప్రారంభంలో మహారాజా కృష్ణ రాజ వడియార్IV పాలనలో మైసూర్ ప్యాలెస్‌లోని రాయల్ వంటవాడు కాకాసుర మడప్ప సృష్టించాడట. మహారాజు మెచ్చుకునేలా వంటలు చేసే క్రమంలో మాదప్ప శెనగపిండి, నెయ్యి, చక్కెరతో ప్రయోగాలు చేసేవాడట. ఆ నేపథ్యంలో తయారైందే ఈ మైసూర్ పాక్ అట. అప్పుడు మహారాజు కూడా ఈ స్వీట్ రుచికి అబ్బురపడి దీనిపేరు ఏంటని అడిగితే ఆ వంటవాడు మైసూర్ పాక్ అని చెప్పాడట. అలా దానికి ఆ పేరు స్థిరపడిపోయిందట. ఇక్కడ కన్నడలో పాక్ అంటే చక్కెర సిరప్ ఆధారిత స్వీట్ అని అర్థం. మైసూర్ ప్యాలస్‌లో చేయడంతో మైసూర్ పాక్(మైసూర్ స్వీట్) అని అన్నాడని పాకనిపుణులు చెబుతున్నారు. ఆ తర్వాతర క్రమేణ అందరికి నచ్చే వంటకంగా మారింది. స్వీట్ దుకాణాలలో ఈ రెసిపీని చేయడం ప్రారంభించడంతో ప్రజలకు మరింత అందుబాటులోకి వచ్చిందని చెఫ్, రెస్టారెంట్ కన్సల్టెంట్ తర్వీన్ కౌర్ చెబుతున్నారు. అలా దక్షిణ భారత ఉత్సవాలు, వివాహాలు, వేడుకలలో ప్రధానమైన డెజర్ట్(Dessert)గా మారింది. అందువల్ల దీనికి ఇంతలా ప్రజాదరణ అని పాక నిపుణులు చెబుతున్నారు. అలాగే కర్ణాటక కూడా తమ సంస్కృతికి అద్దం పట్టే ఈ మైసూపాక్ తీపి వంటకాన్ని అందరూ గుర్తించేలా తన వంతుగా కృషి చేసిందట. అందువల్ల దీని గురించి అందరికి తెలిసిందని చెబుతున్నారు. దీన్ని వివాహాలు, పండుగల్లో ప్రాముఖ్యత ఇచ్చేలా తప్పనిసరిగా పెట్టడంతో ప్రజల హృదయాల్లో తొందరగా స్థానం సంపాదించుకుందని అంటున్నారు డయాబెటిస్ కన్సల్టెంట్ డైటీషియన్ కనిక్క మల్హోత్రా. అందువల్లే తరతరాలు ఈ స్వీట్‌ని ఆదరిస్తున్నారని అంటున్నారు. రుచి మాయజాలంలా కట్టిపడేస్తుంది..శెనగపిండి, నెయ్యి పంచదారల మిశ్రమం చక్కగా రోస్ట్ అయ్యి ఒక విధమైన రుచితో కూడిన నిర్మాణాన్ని ఇస్తుంది. ఇది నెయ్యి కలుపుతూ ఓపికగా తిప్పుతూ చేసే వంటకం. మన ఓపికకు పరీక్ష పెట్టే తయారీ విధానం ఇది. మనం ఎంత నిశితంగా ఓపిగ్గా చేస్తున్నామనే దానిపై పర్ఫెక్ట్గా రావడం అనేది ఆధారపడి ఉంటుందని పాక నిపుణులు చెబుతున్నారు.(చదవండి: వ్యవసాయ నేపథ్యం.. కానీ రూ. 52 లక్షల జాబ్ ఆఫర్‌ని కొట్టేసింది..!) -
అంతర్జాతీయ చెఫ్‌లతో హైదరాబాద్‌లో కలీనరీ ఫెస్ట్
50 దేశాలకు చెందిన చెఫ్‌ల పాకశాస్త్ర ప్రదర్శన ఐఐహెచ్‌ఎమ్, ఇంటర్నేషనల్ హాస్పిటాలిటీ కౌన్సిల్ ఆధ్వర్యంలో నిర్వహణ నగరంలోకలినరీ ఫెస్ట్.. ఫిబ్రవరి 3న హైదరాబాద్‌లో యునైటెడ్ వరల్డ్ యంగ్ చెఫ్స్ (UWYC) ఎక్స్పీరియన్స్" పేరుతో కలిరీఫెస్ట్ జరగనుంది. ఈ ప్రత్యేక కార్యక్రమంలో, ప్రపంచవ్యాప్తంగా ఉన్న 50 మంది యువ పాకశాస్త్ర నిపుణులు తమ దేశాల నుండి సాంప్రదాయ వంటకాలను ప్రదర్శిస్తారు. ఆహార ప్రియులు వివిధ ప్రపంచ వంటకాలు ఇక్కడ ప్రదర్శిస్తారు.సాక్షి, సిటీబ్యూరో: నగరం మరో సారి వివిధ దేశాలకు చెందిన పససందైన రుచులకు వేదికగా మారనుంది. ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్, ఇంటర్నేషనల్ హాస్పిటాలిటీ కౌన్సిల్ లండన్ భాగస్వామ్యంతో నగరంలోని ది గ్లాస్ ఆనియన్ వేదికగా యునైటెడ్ వరల్డ్ యంగ్ చెఫ్స్ గ్యాస్ట్రోనమిక్ ఎక్స్పీరియన్స్ నిర్వహించనున్నారు. ఈ కలినరీ ఫెస్ట్‌లో 50కి పైగా దేశాల నుంచి ప్రముఖ చెఫ్‌లు అంతర్జాతీయ వంటకాలను దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో ప్రదర్శించనున్నారు. ఇందులో 10 మంది చెఫ్‌లు హైదరాబాద్‌లో విభిన్న రుచుల సమ్మేళనాన్ని సృష్టించనున్నారు. ఇదీ చదవండి: ఉద్యోగులకు బంపర్ ఆఫర్ : తీసుకున్నోడికి తీసుకున్నంత!ఫిబ్రవరి 3న జరగనున్న ఈ ఫెస్ట్‌లో భారత్‌తో పాటు అల్బేనియా, ఆస్ట్రేలియా, గ్రీస్, ఉజ్బెకిస్తాన్, కజకిస్తాన్, తైమూర్–లెస్టే, నైజీరియా, ఉగాండా, ఫిలిప్పీన్స్ వంటి దేశాలకు చెందిన చెఫ్‌లు తమ పాకశాస్త్ర నైపుణ్యాలను ప్రదర్శించనున్నారు. ఇదీ చదవండి: గ్లోబల్ పాప్ స్టార్ జెన్నీ స్కిన్ కేర్ సీక్రెట్ : రెండే రెండు ముక్కల్లో! -
దిగ్గజ భారత చెఫ్ ఖురేషి అస్తమయం
న్యూఢిల్లీ: మొగలుల కాలంనాటి దమ్ పుఖ్త్ వంట విధానాన్ని దేశవ్యాప్తంగా ప్రాచుర్యంలోకి తెచ్చిన ప్రముఖ పాకశాస్త్ర దిగ్గజం ఇంతియాజ్ ఖురేషి తుదిశ్వాస విడిచారు. ఆయన వయసు 93 సంవత్సరాలు. లక్నో ప్రాంతంలో మాత్రమే వాడే వంట పాత్ర మూత చివర్ల నుంచి గాలి పోకుండా పిండి ముద్దను చుట్టే (ధమ్ ఫుఖ్త్) టెక్నిక్‌ను ప్రాచుర్యంలోకి తెచి్చన ఘనత ఆయనదే. ప్రాచీన అవధ్ వంటకాలనూ ఆయన కొత్త తరహాలో సృష్టించారు. బుఖారా వంటకాలను కనిపెట్టింది కూడా ఖురేషీనే. 1979లో ఐటీసీ హోటల్స్‌లో చేరి ప్రధాన చెఫ్ స్థాయికి ఎదిగారు. ఎందరో దేశ, విదేశీ ప్రముఖులకు తన వంటకాలు రుచు చూపి ఔరా అనిపించారు. ఆహార ప్రియులకు పరిచయం అక్కర్లేని వ్యక్తి అయిన ఖురేషీ వంటలంటే పడిచచ్చే వాళ్ల జాబితా చాలా పెద్దది. ప్రధాని, రాష్ట్రపతి విశిష్ట అతిథుల ప్రత్యేక విందుల్లో ఆయనే స్పెషల్ వంటకాలు వండేవారు. 2016లో పద్మశ్రీ పొందారు. ఈ అవార్డ్ అందుకున్న తొలి పాకశాస్త్ర ప్రవీణుడు ఖురేషీనే. -
Velangi Village: నలభీముల కేరాఫ్.. వేళంగి
సాక్షి ప్రతినిధి, కాకినాడ: ‘వివాహ భోజనంబు.. వింతైన వంటకంబు.. వియ్యాల వారి విందు.. ఓహోహ్హో నాకే ముందు’ మాయాబజార్ సినిమాలో పాట ఇది. తెలుగు వారి పెళ్లి భోజనాల్లో వడ్డించే ప్రత్యేక పిండివంటలైన గారెలు, బూరెలు, అరిసెలు, లడ్డూ, అప్పడం, దప్పళం, పాయసం వంటి వంటకాలను ఈ పాటలో నోరూరించేలా వెండితెరపై చూపించారు. ఇప్పుడు ఈ పాట ప్రస్తావన ఎందుకంటే.. ఇటువంటి వంటకాలతో తూర్పు గోదావరి రుచులంటే నోరూరిపోయే ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రజల చూపు ‘వేళంగి’పై తప్పనిసరిగా పడుతుంది. ఎందుకంటే ఈ గ్రామంలో వంటలకు పేరొందిన నలభీములు ఎక్కువగా ఉంటారు. వేళంగితో పాటు ద్రాక్షారామ కూడా పాకశాస్త్ర ప్రవీణులకు నెలవు. వేళంగి వారు వంట చేస్తే నలభీములు దిగి వచ్చినట్టే చాలామంది భావిస్తారు. మాయాబజార్ పాటలోని చాలా వంటకాలను ఈ గ్రామాల్లోని చేయి తిరిగిన వంటగాళ్లు అలవోకగా చేసేస్తారు. ఆ నలుగురితో.. 1970వ దశకం నాటి మాట. నాడు కపిలేశ్వరపురం, వెల్ల జమీందార్లకు నిత్యం వందలాది మంది వంట చేసి పెట్టేవారు. కాలక్రమంగా జమీందారీ వ్యవస్థ కనుమరుగు కావడంతో ఈ వంటవారిలో కొందరు ప్రస్తుత కాకినాడ జిల్లా కరప మండలంలోని వేళంగి.. మరికొందరు కోనసీమ జిల్లా రామచంద్రపురం మండలం ద్రాక్షారామకు పొట్ట చేత పట్టుకుని వచ్చేశారు. జమీందార్ల జమానాలో తాతల కాలం నుంచి వస్తున్న వంటకాల తయారీని వారసత్వంగా ఇప్పటికీ వారు కొనసాగిస్తున్నారు. వేళంగిలో చీకట్ల సత్తియ్య, పెద్దిరెడ్డి పెదకాపు, పెద్దిరెడ్డి సత్యనారాయణ, నేదునూరి సత్తిబాబు– ఈ నలుగురితో మొదలైన వంటకాల తయారీ ప్రస్థానం ఇప్పుడు వందల సంఖ్యకు చేరుకుంది. ఆ నలుగురి తరువాత చీకట్ల వెంకన్న, పెదిరెడ్డి వెంకటేశ్వరరావు, నల్లా శివశంకరప్రసాద్.. ఇలా 150 కుటుంబాల వారు పాకశాస్త్రంలో ప్రావీణ్యం సాధించారు. ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రజలను తమ వంటకాలతో కట్టిపడేస్తున్నారు. వంట ఏదైనా.. రుచుల వడ్డన శాకాహారం, మాంసాహారం.. వంట ఏదైనా వేళంగి వంటమేస్త్రులు ఇరగదీస్తారని పేరు. సంపన్నుల ఇళ్లు మొదలు.. ఎగువ మధ్య తరగతి వర్గాల వరకూ పెళ్లిళ్లు, పేరంటాలు, విందులు, వినోదాల్లో వేళంగి వంటకాలకే తొలి ప్రాధాన్యం ఇస్తారు. ఇక్కడి వంటమేస్త్రులు 20 నుంచి 50 రకాల ఘుమఘుమలాడే వంటకాలను క్షణాల్లో సిద్ధం చేసేస్తారు. సినీ, రాజకీయ ప్రముఖుల ఇళ్లల్లో జరిగే వివాహాలు, ఇతర శుభకార్యాలు, రాజకీయ పార్టీల కార్యక్రమాల్లో కూడా వేళంగి వారే వంటలు చేస్తూంటారు. టీడీపీ వ్యవస్థాపకుడు, నాటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ రాజకీయ శిక్షణ శిబిరాలు నిర్వహించినంత కాలం, వైఎస్సార్ సీపీ ప్లీనరీ, తాజాగా వైఎస్సార్ సీపీ నిర్వహించిన జయహో బీసీ మహాసభలో సైతం వీరు చేసిన వంటకాలు నోరూరించాయి. దివంగత నందమూరి హరికృష్ణ కుమారుడు, జూనియర్ ఎన్టీఆర్ సోదరుడు జానకిరాం అత్తవారిల్లు వేళంగిలోనే ఉంది. జానకిరాం పెళ్లి, కుమారుల పంచెకట్టు, సినీనటుడు బాలకృష్ణ ఇంట జరిగిన శుభకార్యాల్లో ఈ ఊరి తయారీదార్లు చేసిన వంటకాలు ఔరా అనిపించుకున్నాయి. ఎన్నో విశేషాలు.. వెజ్‌లో డ్రైఫ్రూట్స్‌తో గుమ్మడి హల్వా, వెజ్ కట్లెట్, మిక్స్డ్ ధమ్ బిర్యానీ, మష్రూమ్ మటన్ మసాలా, వెల్లుల్లి జీడిగుండ్లు ములక్కాడ గుజ్జు, కాజూ బుల్లెట్, పనసకాయ చిల్లీ కర్రీ, మద్రాస్ సాంబారు, క్రీమ్ మజ్జిగ పులుసు.. నాన్ వెజ్‌లో బొమ్మిడాయల పులుసు, పీతల ఫ్రై వంటివాటిని వేళంగి నలభీములు ఎంతో రుచికరంగా తయారు చేస్తారు. వీటిని లొట్టలేసుకుని తినాల్సిందే. 20 వేలు మొదలు 50 వేలు లేదా లక్ష మందికి కూడా వారి అభిరుచికి తగినట్టుగా 50 నుంచి 100 రకాల వంటకాలు చేసిపెట్టే సామర్థ్యం వేళంగి వంట తయారీదారుల సొంతం. నాలుగైదు ఎకరాల భూమి ఉన్నా, గౌరవప్రదమైన వృత్తుల్లో కొనసాగుతున్నా.. వంటలు చేయడమంటే ఈ ఊరివారు వరంగా భావిస్తారంటే ఆశ్చర్యమే మరి. తిరుపతి శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఎమ్మెస్సీ చదివి, ఆక్వా ల్యాబ్ నిర్వహిస్తున్న సానా శ్రీను.. వంటలు చేయడాన్ని ప్రవృత్తిగా పెట్టుకున్నారు. ఈయన వేళంగి వంటకాలపై ఏకంగా ఓ వెబ్‌సైటే ప్రారంభించారు. తద్వారా తాను పుట్టిన గ్రామాన్ని ప్రాచుర్యంలోకి తీసుకువచ్చారు. ఇక్కడి వారు ఆస్తిపాస్తులున్నా వంటలు చేయడం మానుకోరు. అనాదిగా తాత ముత్తాతల నుంచి వస్తున్న వారసత్వాన్ని కొనసాగించడానికే ప్రాధాన్యం ఇస్తున్నారు. వంటలు చేయడం వారికి ఒక అభిరుచి. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఇంతటి పేరున్న వేళంగి వంట మేస్త్రులకు పిల్లనిచ్చి పెళ్లి చేయడానికి అంతగా ముందుకు రావడం లేదని వీరు ఆవేదన చెందుతున్నారు. ఒకటి రెండు ఫంక్షన్లకు వంటకానికి వెళ్తే ఏడాది పొడవునా జీవితం సంతోషంగా గడిచిపోతుందని వీరు చెబుతారు. అలా చేతినిండా సంపాదన ఉన్నా వంటవాడు అనేసరికి పిల్లనివ్వాడానికి కొందరు ముఖం చాటేస్తున్నారనే వేదన వీరిని వెంటాడుతోంది. పోటాపోటీగా వేళంగి, ద్రాక్షారామ ద్రాక్షారామ కూడా వంటలకు పెట్టింది పేరు. ఇక్కడి వారు తయారు చేసే వంటకాల రుచులు రాష్ట్రంలో అందరూ ఆస్వాదించిన వారే. శుభకార్యక్రమాలకు పసందైన విందు వడ్డించడంలో వేళంగి, ద్రాక్షారామ మధ్య చాలాకాలంగా గట్టి పోటీ కొనసాగుతోంది. వేళంగి అయినా ద్రాక్షారామ అయినా వీరి ముందు తరాల వారు జమీందార్ల వద్ద పేరుప్రఖ్యాతులున్న వంట వారే కావడం విశేషం. ఇప్పుడు ద్రాక్షారామలో సైతం పదుల సంఖ్యలో వంటమేస్త్రులున్నారు. పెట్టా శంకరరావు చేతి వంట లొట్టలేసుకుని ఆరగించాల్సిందే. లక్ష ఆపైన సంఖ్యలో జనం వచ్చే పెద్ద ఫంక్షన్లకు శంకరరావుతో పాటు ఆయన బృందానికి వంట ఆర్డర్లు వస్తూంటాయి. ఈ ప్రాంతానికి చెందిన సుమారు 70 మంది, సమస్త సరంజామాతో గంటల వ్యవధిలోనే లక్ష మందికి విందు ఏర్పాటు చేయడంలో దిట్టలు. ద్రాక్షారామలో ఇప్పుడు వంద మందికి పైనే పాకశాస్త్రాన్ని అభ్యసించి గరిటె తిప్పుతున్నారు. -
అంబానీ కారూ ఖరీదే..
ముంబై: రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్) అధినేత ముకేశ్ అంబానీ భారత్‌లో అత్యంత సంపన్నుడు. మరి ఆ స్థాయి వ్యక్తి వినియోగించే కారు ఖరీదు మామూలుగా ఉంటుందా? తాజాగా అల్ట్రా లగ్జరీ రోల్స్ రాయిస్ కలినన్ హ్యాచ్‌బ్యాక్‌ను ఆయన కొనుగోలు చేశారు. దీని కోసం ఏకంగా రూ.13.14 కోట్లు ఖర్చు చేశారట. భారత్‌లో అత్యంత ఖరీదైన కార్లలో ఇది ఒకటి. 2018లో విడుదలైనప్పుడు ఈ కారు బేస్ ధర రూ.6.95 కోట్లు. కస్టమైజేషన్ కారణంగా కారు ధర భారీగా పెరుగుతుందని వాహన పరిశ్రమ నిపుణులు చెబుతున్నారు. ఆర్ఐఎల్ పేరిట కారు రిజిష్టర్ అయింది. రూ.12 లక్షలు చెల్లించి 0001 నంబరును కంపెనీ సొంతం చేసుకుంది. ఆర్ఐఎల్/ముకేశ్ ఖాతాలో ఇది మూడవ కలినన్ మోడల్ కావడం విశేషం. 6.7 లీటర్ ట్విన్ టర్బోచార్జ్డ్ వీ12 ఇంజన్ పొందుపరిచారు. టాప్ స్పీడ్ గంటకు 250 కిలోమీటర్లు. -
శ్రీమఠం గోశాలలో మరో 3 గోవులు మృతి
మంత్రాలయం : శ్రీరాఘవేంద్రస్వామి మఠం గోశాలలో గోవుల మృత్యువాత ఆగడం లేదు. గోశాలలో దోమల బెడద కారణంగా థ్రిప్స్ వ్యాధి(మెదడువాపు) సోకి ఆవులు చనిపోతున్న విషయం విదితమే. ఆదివారం మరో మూడు ఆవులు చనిపోయాయి. విషయం బయటకు పొక్కకుండా ఉండేందుకు వాటిని ఎద్దుల బండిపై టార్పాలిన్ కప్పుకుని తీసుకెళ్లి గోశాల çసమీపంలోని ఫిల్టర్‌బెడ్ వెనకభాగంలో పాతిపెట్టారు. శ్రీమఠం అధికారుల నిర్లక్ష్యంతో ఆవులను మృత్యువు వెంటాడుతూనే ఉంది. గోశాల నిర్వహణ లోపంతో దోమల నియంత్రణ సాధ్యపడటం లేదు. స్వచ్ఛ అభియాన్ చేపట్టినా మరణాలు అదుపులోకి రావడం లేదు.