ముంబై: రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్‌ఐఎల్) అధినేత ముకేశ్ అంబానీ భారత్‌లో అత్యంత సంపన్నుడు. మరి ఆ స్థాయి వ్యక్తి వినియోగించే కారు ఖరీదు మామూలుగా ఉంటుందా? తాజాగా అల్ట్రా లగ్జరీ రోల్స్ రాయిస్ కలినన్ హ్యాచ్‌బ్యాక్‌ను ఆయన కొనుగోలు చేశారు. దీని కోసం ఏకంగా రూ.13.14 కోట్లు ఖర్చు చేశారట. భారత్‌లో అత్యంత ఖరీదైన కార్లలో ఇది ఒకటి. 2018లో విడుదలైనప్పుడు ఈ కారు బేస్ ధర రూ.6.95 కోట్లు. కస్టమైజేషన్ కారణంగా కారు ధర భారీగా పెరుగుతుందని వాహన పరిశ్రమ నిపుణులు చెబుతున్నారు. ఆర్‌ఐఎల్ పేరిట కారు రిజిష్టర్ అయింది. రూ.12 లక్షలు చెల్లించి 0001 నంబరును కంపెనీ సొంతం చేసుకుంది. ఆర్‌ఐఎల్/ముకేశ్ ఖాతాలో ఇది మూడవ కలినన్ మోడల్ కావడం విశేషం. 6.7 లీటర్ ట్విన్ టర్బోచార్జ్‌డ్ వీ12 ఇంజన్ పొందుపరిచారు. టాప్ స్పీడ్ గంటకు 250 కిలోమీటర్లు.
Comments
Please login to add a commentAdd a comment