
అందాల హీరోయిన్ త్రిప్తి దిమ్రి(Triptii Dimri) కేవలం బ్యూటీకే కాదు. ఫిట్‌నెస్‌కు కూడా చాలా ప్రాముఖ్యతనిస్తుంది. అద్భుతమైన నటనతో పాటు, టోన్డ్ ఫిగర్‌తో ఫ్యాన్స్‌ను మెస్మరైజ్ చేస్తుంది. తాజా తన ఫిట్‌నెస్ గురించి సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టింది. ఇది ఫ్యాన్స్‌ను బాగా ఆకట్టుకుంటోంది.
రణబీర్ కపూర్ సరసన నటించిన యానిమల్ మూవీతో ఆకట్టుకున్న త్రిప్తి దిమ్రీ తన మంచి ఆహార ప్రియురాలు. అలాగే యోగా, ధ్యానం,జిమ్ వర్కౌట్స్‌ను అంతే శ్రద్ధగా ఆచరిస్తుంది. తాజాగా ఫిట్‌నెస్ ఫార్ములా గురించి ఇన్‌స్టా స్టోరీలో వివరించింది. స్వెట్ ఫస్ట్.. స్వీట్స్...స్వీట్స్ లేటర్ (Sweat Now...Sweets Later)అంటూ ఫోటోను షేర్ చేసింది. వింక్ ఎమోజీతో జిమ్ మిర్రర్ సెల్ఫీని పోస్ట్ చేసింది. హోలీ పండుగ సీజన్‌లో అదనపు కేలరీలన్నింటినీ కోల్పోవడానికి ఆమె తన జిమ్ వర్కౌట్స్‌ను చాలా సీరియస్‌గా తీసుకుంటున్నట్టు కనిపిస్తోంది.

ఇటీవల త్రిప్తి దిమ్రీ నాసిక్‌లోని త్రయంబకేశ్వరాలయాన్ని సందర్శించింది. అక్కడ ప్రత్యేకపూజలు నిర్వహించింది. దీనికి సంబంధించిన ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది కూడా.
ఫిట్‌గా ఉండేందుకు మూడు టిప్స్
స్క్వాట్ జంప్ : స్క్వాట్ జంప్‌లు లేదా జంపింగ్ స్క్వాట్‌లు. ఇవి ఎక్కువ కేలరీలను బర్న్ చేయడంలో చాలా బాగా ఉపయోగ పడతాయి. జంప్ స్క్వాట్స్ లేదా జంపింగ్ స్క్వాట్స్ అని కూడా అంటారు. ప్రతి ఫిట్‌నెస్ క్లాస్‌లో ఏదో ఒక రకమైన స్క్వాట్ ఉంటుంది.దీని వల్ల కేలరీలు త్వరగా బర్న్ అవుతాయి. ఒకేసారి బహుళ కండరాలనుబలోపేతం చేసేందుకు ఉపయోగ పడుతుంది. ముఖ్యంగా కాళ్లు, పిరుదులు . కోర్ కండరాలు బలోపేతమవుతాయి.
బర్పీ: స్ట్రెంథ్ ట్రైనింగ్‌లో ఒకటిగా చెప్పుకునే బర్పీస్ , ఫుల్ బాడీ వర్కౌట్ అని చెప్పొచ్చు. వీని వల్ల మజిల్ స్ట్రెంథ్ పెరుగుతుంది.
కేలరీలు కరుగుతాయి, చాలా బరువు తగ్గుతారు.బెల్లీ ఫ్యాట్, హిప్, థై ఫ్యాట్ తగ్గి టోన్డ్ బాడీ వస్తుంది.
స్కిప్పింగ్: స్కిప్పింగ్ అనేది సరళమైన, ఈజీ ఎక్సర్ సైజులలో ఒకటి. 10 నిమిషాలు లేదా దాదాపు 120 రౌండ్ల స్కిప్పింగ్ వల్ల 650 నుండి 1000 కేలరీలు ఖర్చవుతాయి. కేలరీలు బర్న్ అవుతాయి. గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. కండరాలు టోన్ అవుతాయి. జీవక్రియ పెరుగుతుంది. ఊపిరితిత్తుల ఆరోగ్యం మెరుగుపడుతుంది.ఎముకల సాంద్రత పెరుగుతుంది. ఏకాగ్రత మెరుగుపడుతుంది.
Comments
Please login to add a commentAdd a comment