ఏదైనా వేడుక, జాతర, పెళ్లిళ్లలో జరిగే బారత్‌లోనూ అంతా జోషఫుల్‌గా డ్యాన్సులు వేస్తూ సెలబ్రేట్ చేసుకుంటారు. ఇది సర్వసాధారణం. కానీ ఇలా చేయడమే శాపంగా మారి చివరికి ఆ వేడుక/పెళ్లి కాస్త విషాదంగా ముగుస్తుంది. ఇటీవల కాలంలో అందుకు సంబంధించిన పలు ఘటనలు ఎక్కువయ్యాయి కూడా. అసలు ఇలాంటి వేడుకల్లో ఆనందంగా డ్యాన్స్‌లు చేసి..చిన్నా, పెద్దా పిట్టల్లా రాలిపోతున్నారు. బతికించుకునే ఛాన్స్ కూడా దొరకడం లేదు. చెప్పాలంటే డీజేలాంటి మ్యూజిక్‌లు పెట్టుకుని ఎంజాయ్ చేద్దామంటేనే భయం వేస్తోంది. అసలెందుకు ఈ పరిస్థితి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకుని డ్యాన్స్‌లు చేయాలి?. ఎంత మేర మ్యూజిక్ వింటే బెటర్ తదితరాల గురించి సవివరంగా ఈ కథనంలో తెలుసుకుందాం!.
ఎన్ని ఘటనలు జరిగాయంటే..
ఇంతవరకు ఇలాంటి విషాదకర ఘటనుల గతేడాది నుంచి వరుసగా చోటు చేసుకున్నాయి. గతేడాది అక్టోబర్‌లో గుజరాత్‌లో గార్భా డ్యాన్స్ చేస్తూ ఏకంగా 10 మంది చనిపోయారు. అది మరువక ముందే అదే ఏడాది తెలంగాణలో 19 ఏళ్ల యువకుడు తన బంధువు పెళ్లిలో డ్యాన్య్ చేస్తూ కుప్పకూలి చనిపోయాడు. అలాగే గతేడాది మార్చి4న బిహార్‌లో సీతామర్హి నివాసి 22 ఏళ్ల సురేంద్ర కుమార్ వేదికపై దండలు మార్చుకుని నవ వధువుతో కూర్చొని ఉండగా.. ఆకస్మాత్తుగా కుప్పకూలి చనిపోయాడు. బాధితుడు చనిపోవడానకి ముందు డీజే సౌండ్ అసౌకర్యంగా ఉందని చెప్పినట్లు సమాచారం. ప్రస్తుతం అదేలాంటి విషాద ఘటన తెలంగాణ రాష్ట్రంలోని ఓదెల మండలం కొలనూర్‌లో చోటు చేసుకుంది. రావు విజయ్‌కుమార్(33) అనే యువకుడు ఆనందంగా డ్యాన్స్ చేస్తూ గుండెపోటుతో చనిపోయాడు. ఇలా చనిపోయినవారంతే యువకులు. చాలా చిన్న వయసులోనే ప్రాణాలు కోల్పోయారు.
ఇలా ఎందుకు జరుగుతోందంటే..?
ఏదైన ఉత్సవం, పెళ్లి వేడుకలో జనాల కోలాహలం ఎక్కువగా ఉంటుంది. దీనికి తగ్గట్టు డీజే మ్యూజిక్ లాంటివి పెద్దగానే పెడతారు. ఆ చుట్టూ ఉన్న జనాలు, ఆ మ్యూజిక్‌కి, ఉత్సాహం వచ్చి.. చిన్నా, పెద్దా, కాలు కదిపి చిందులు వేసేందుక రెడీ అయిపోతారు. దీంతో అక్కడుండే వాళ్లు మరింత ఉత్సాహంతో సౌండ్ పెంచేస్తుంటారు. ఇక డ్యాన్స్ చేసేవాళ్లు చుట్టూ ఉన్నజనం ఎంకరైజ్‌మెంట్, ఈలలను చూసి మరింతగా డ్యాన్స్ చేస్తుంటారు. దీంతో శరీరం అలసటకు గురై గుండెపై ఒత్తిడి పెరిగిపోతుంటుంది. ఇదేం పట్టించుకోకుండా ఆయా వ్యక్తులు శక్తికి మించి డ్యాన్స్‌లు చేసి కుప్పకూలి చనిపోవడం జరిగిపోతుంది. ఆ తర్వాత వైద్యులు గుండెపోటు లేదా గుండె ఆగిపోవడంతో చనిపోయారని ధృవీకరిస్తున్నారు.
డ్యాన్స్ వల్ల వస్తుందా అంటే..?
శరీరం బాగా అలిసిపోయేలా డ్యాన్స్ చేస్తే గుండెపోటు రావడం జరుగుతుందని చెబుతున్నారు వైద్యులు. ఎందుకంటే..? అప్పటికే శరీరంలో గుండెకు రక్తం సరఫరా అయ్యే నాళాల్లో అడ్డంకులు ఉంటాయి. ఎప్పుడైతే ఇలా అలసిపోతారు ఆ రక్త సరఫరా వేగం ఎక్కువ అవుతుంది. అది కాస్త గుండెపై ఒత్తిడి ఏర్పడి ఆగిపోవడం లేదా ఆకస్మికంగా రక్తం గడ్డకట్టి గుండె పోటు వచ్చి కుప్పకూలిపోవడం జరుగుతుంది. అందువల్ల శరీర సామర్థ్యానికి మించి డ్యాన్స్‌లు వంటివి చేయకపోవడమే మంచిదని వైద్యులు సూచిస్తున్నారు
మ్యూజిక్ వల్ల కూడా వస్తుందా..?
భారీ శబ్దాలు వల్ల హార్ట్ ఎటాక్ వస్తుందా?. చెవి నుంచి వెళ్లే శబ్ద తరంగాలు గుండెను ప్రభావితం చేస్తాయా? అంటే ఔననే! చెబుతున్నారు వైద్యులు. భారీ శబ్దాలు మనిషిపై తీవ్రమైన ప్రభావం చూపిస్తాయని పరిశోధకులు యూరోపియన్ హార్ట్ జర్నల్‌లో వెల్లడించారు. పెద్ద పెద్ద శబ్దాల వద్ద గుండె వేగంలో పెరుగుతున్న మార్పులను గుర్తించామని అన్నారు. ఈ బిగ్గర శబ్దాల కారణంగా వ్యక్తుల్లో గుండె దడ, స్ట్రోక్‌లు వచ్చే అవకాశాలు గట్టిగానే ఉన్నాయని పేర్కొన్నారు. మానవ చెవికి 60 డెసిబుల్స్ వరకు సాధారణమని వైద్యులు చెబుతున్నారు.
నిజానికి ఆహ్లాదకరమైన వాయిస్ లేదా శబ్దాన్ని వినగానే కేవలం చెవితోనే వినం. హృదయంతో ఆస్వాదిస్తాం. ఇది తెలియకుండానే జరుగుతుంది. సంగీతంతో కొన్ని జబ్బులు నయం చేయడం అనే పురాతన వైద్యం ఇందులోనిదే. భయోత్సాహమైన సౌండ్‌లతో సాగే మ్యూజిక్ తరంగాలు కారణంగా మన శరీరంలో ఒక రకమైన ఆందోళనకు గురవ్వుతుంది. అది నేరుగా మన గుండెపైనే ప్రభావం చూపిస్తుంది. ఏవిధంగా మంచి సంగీతం హృదయాన్ని హత్తుకుని గుండె పదిలంగా ఉండేలా చేస్తుందో.. అదే మ్యూజిక్ మోతాదుకు మించితే గుండెకి డేంజరే అని అరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment