పెరిగిన గుండెపోటు ముప్పు ఇటీవలి రోజుల్లో చిన్న వయసులోనే మహిళలు కూడా గుండెపోటుకు గురవడం 8 శాతం పెరిగిందని ప్రముఖ గుండె వైద్య నిపుణుడు డాక్టర్ సీఏ మంజునాథ్ తెలిపారు. సోమవారం నటి స్పందన మృతిపై డాక్టర్ మంజునాథ్ మాట్లాడుతూ ఇటీవల జీవనశైలి, ఆహార పద్ధతులు మారాయని, దీంతో పాటు మానసిక శారీరక ఒత్తిడులు కూడా గుండెపోటుకు కారణమన్నారు.
40 ఏళ్లలోపు వారికి కూడా గుండెజబ్బులు
► ఒక అధ్యయనం ప్రకారం 40 ఏళ్ల లోపు వయసు వారికి గుండెపోటు రావడం 35 శాతం పెరిగింది.
►గతంలో మహిళల్లో గుండెపోటు కేసులు తక్కువగా ఉండేవి, ఇప్పుడు పరిస్థితి మారిపోయింది.
► 40 ఏళ్లులోపు మహిళల్లో గుండెపోటు కేసులు 8 శాతం పెరగడం ఆందోళనకరం.
► దేశంలో యువత, మధ్య వయసువారిలో గుండెపోటు వచ్చే ముప్పు 28 శాతం పెరిగింది.
► ఈ కేసుల్లోనూ కార్డియాక్ అరెస్ట్ (గుండె స్తంభించడం) 90 శాతం ఉంది.
► కోవిడ్ మహమ్మారి తరువాత 3 నుంచి 5 శాతం గుండెపోటు కేసులు పెరిగాయి, ప్రతి ఒక్కరూ తరచూ ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.
- ప్రముఖ వైద్యుడు మంజునాథ్
Comments
Please login to add a commentAdd a comment