ఇటీవల తమిళ హీరో అజిత్ కుమార్ చెకప్ కోసం ఆస్పత్రిలో చేరిన సంగతి తెలిసిందే. దీంతో ఆయనకు ఏమైందంటూ అభిమానుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. దీనిపై అజిత్ పీఏ సురేశ్‌చంద్ర స్పందించి వివరణ ఇచ్చారు. సాధారణ వైద్య పరీక్షల కోసం అజిత్ ఆస్పత్రిలో చేరారని, ఆయనకు చెవి వెనుక ఉన్న నరాలు బలహీనంగా ఉన్నాయని వైద్యులు చెప్పడంతో చికిత్స తీసుకున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం బాగానే ఉందని, ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారని చెప్పుకొచ్చారు. అయితే వైద్య నటుడు అజిత్ కుమార్ సెరిబ్రల్ ఇన్ఫార్క్షన్‌తో బాధపడుతున్నట్లు వెల్లడయ్యింది. అసలేంటీ ఈ వ్యాధి? ఎందువల్ల వస్తుందంటే..
ఈ సెరిబ్రల్ ఇన్ఫార‍్క్షన్‌ని వైద్యపరంగా ఇస్కీమిక్‌గా స్ట్రోక్ అని పిలుస్తారు. తగినంత ఆక్సిజన్ సరఫరా లేకపోవడం వల్ల మెదడు కణజాలం దెబ్బతినండంతో ఈ స్ట్రోక్ సంభవిస్తుంది. మెదడులోని ధమని బ్లాక్ అయినప్పుడు లేదా చిట్లినప్పుడూ ఈ సమస్య తలెత్తుంది. ఇది మెదడుకు సక్రమంగా ఆక్సిజన్ అందకపోవడంతో మెదడులోని నరాలు వాపుకి దారితీయడంతో ఇదంతా జరుగుతుంది. దీంతో రోగికి పక్షవాతం రావడం లేదా కొన్ని సమయాల్లో సీరియస్ అయ్యి మరణానికి దారితీసే ప్రమాదం ఉంది. ఈ సమయంలో రోగికి తక్షణమే చికిత్స అందడం అనేది అత్యంత ముఖ్యం.
ఈ వ్యాధి లక్షణాలు..
- వికారం లేదా వాంతులు
- కంటి కదలికలో సమస్యలు, సరిగా కనిపించకపోవడం
- తలనొప్పి
- మాట్లాడడంలో ఇబ్బంది
- చేతులు, పాదాలు లేదా ముఖంలో తిమ్మిరి అనుభూతి
- శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది
- మూర్ఛ లేదా కోమాలోకి వెళ్లిపోవడం
కారణాలు
అధిక రక్తపోటు మధుమేహం, ధూమపానం, ఊబకాయం, కొలస్ట్రాల్, డయాబెటిస్, లేదా సడెన్‌గా చక్కెర స్థాయలు పెరగడం తదితర కారణాల వల్ల ఈ వ్యాధి వస్తుంది.
నివారణ
ఈ ప్రమాదకరమైన వ్యాధిని నివారించడానికి బరువును అదుపులో ఉంచుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించాలి. అలాగే వయసు పెరుగుతున్న కొద్దీ ఎప్పటికప్పుడు ఆరోగ్య పరీక్షలు చేయించుకుంటే సమస్యను ఆదిలోనే గుర్తించగలుగుతాం. అలాగే స్ట్రోక్ వచ్చిన రోగులకు థ్రోంబోలిటిక్ మందులతో నయం చేయడం జరుగుతుంది. అలాగే ఇంట్రావీనస్ ఆర్‌టీపీఏ థెరపీని అందిస్తే రోగిని సుమారు 3 గంటల్లో మాములు మనిషిగా చెయ్యొచ్చు.
(చదవండి: కేన్సర్‌పై యువతి పోరు..ఆమె ధైర్యానికి సాక్షి ఈ వీడియో!)
Comments
Please login to add a commentAdd a comment