ajit kumar
-
హీరో అజిత్ కుమార్ బాధపడుతోంది ఈ వ్యాధితోనే..!
ఇటీవల తమిళ హీరో అజిత్ కుమార్ చెకప్ కోసం ఆస్పత్రిలో చేరిన సంగతి తెలిసిందే. దీంతో ఆయనకు ఏమైందంటూ అభిమానుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. దీనిపై అజిత్ పీఏ సురేశ్‌చంద్ర స్పందించి వివరణ ఇచ్చారు. సాధారణ వైద్య పరీక్షల కోసం అజిత్ ఆస్పత్రిలో చేరారని, ఆయనకు చెవి వెనుక ఉన్న నరాలు బలహీనంగా ఉన్నాయని వైద్యులు చెప్పడంతో చికిత్స తీసుకున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం బాగానే ఉందని, ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారని చెప్పుకొచ్చారు. అయితే వైద్య నటుడు అజిత్ కుమార్ సెరిబ్రల్ ఇన్ఫార్క్షన్తో బాధపడుతున్నట్లు వెల్లడయ్యింది. అసలేంటీ ఈ వ్యాధి? ఎందువల్ల వస్తుందంటే.. ఈ సెరిబ్రల్ ఇన్ఫార్క్షన్ని వైద్యపరంగా ఇస్కీమిక్గా స్ట్రోక్ అని పిలుస్తారు. తగినంత ఆక్సిజన్ సరఫరా లేకపోవడం వల్ల మెదడు కణజాలం దెబ్బతినండంతో ఈ స్ట్రోక్ సంభవిస్తుంది. మెదడులోని ధమని బ్లాక్ అయినప్పుడు లేదా చిట్లినప్పుడూ ఈ సమస్య తలెత్తుంది. ఇది మెదడుకు సక్రమంగా ఆక్సిజన్ అందకపోవడంతో మెదడులోని నరాలు వాపుకి దారితీయడంతో ఇదంతా జరుగుతుంది. దీంతో రోగికి పక్షవాతం రావడం లేదా కొన్ని సమయాల్లో సీరియస్ అయ్యి మరణానికి దారితీసే ప్రమాదం ఉంది. ఈ సమయంలో రోగికి తక్షణమే చికిత్స అందడం అనేది అత్యంత ముఖ్యం. ఈ వ్యాధి లక్షణాలు.. వికారం లేదా వాంతులు కంటి కదలికలో సమస్యలు, సరిగా కనిపించకపోవడం తలనొప్పి మాట్లాడడంలో ఇబ్బంది చేతులు, పాదాలు లేదా ముఖంలో తిమ్మిరి అనుభూతి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది మూర్ఛ లేదా కోమాలోకి వెళ్లిపోవడం కారణాలు అధిక రక్తపోటు మధుమేహం, ధూమపానం, ఊబకాయం, కొలస్ట్రాల్, డయాబెటిస్, లేదా సడెన్‌గా చక్కెర స్థాయలు పెరగడం తదితర కారణాల వల్ల ఈ వ్యాధి వస్తుంది. నివారణ ఈ ప్రమాదకరమైన వ్యాధిని నివారించడానికి బరువును అదుపులో ఉంచుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించాలి. అలాగే వయసు పెరుగుతున్న కొద్దీ ఎప్పటికప్పుడు ఆరోగ్య పరీక్షలు చేయించుకుంటే సమస్యను ఆదిలోనే గుర్తించగలుగుతాం. అలాగే స్ట్రోక్ వచ్చిన రోగులకు థ్రోంబోలిటిక్ మందులతో నయం చేయడం జరుగుతుంది. అలాగే ఇంట్రావీనస్ ఆర్‌టీపీఏ థెరపీని అందిస్తే రోగిని సుమారు 3 గంటల్లో మాములు మనిషిగా చెయ్యొచ్చు. (చదవండి: కేన్సర్‌పై యువతి పోరు..ఆమె ధైర్యానికి సాక్షి ఈ వీడియో!) -
ట్విటర్ బయో నుంచి ఆ పేరుని తొలగించిన విఘ్నేష్.. నెటిజన్స్ షాక్
నయనతార భర్త, ప్రముఖ దర్శకుడు విఘ్నేష్ శివన్ చేసిన ఒక పని ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఆయన ఎందుకు అలా చేశాడు? ఇక ఆ జోడీ కుదరనట్టేనా అని నెటిజన్స్ చర్చిస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. కాతువాకుల రెండు కాదల్ చిత్రం తర్వాత కోలీవుడ్ స్టార్ అజిత్‌తో విఘ్నేష్ ఓ సినిమా తెరకెక్కించబోతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. అజిత్ కెరీర్లో ఇది 62వ సినిమా(AK62). ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నట్లు ప్రకటించింది. దీంతో ఈసినిమా కోసం అజిత్ ప్రేక్షకులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో విఘ్నేష్ చేసిన ఓ పని పలు అనుమానాలకు తావిస్తోంది. విఘ్నేష్ ఈ ప్రాజెక్ట్ నుంచి వైదొలగినట్లు గతంలో వార్తలు వినిపించాయి. ఇప్పుడు ఆ వార్తలు నిజమే అన్నట్లుగా.. విఘ్నేష్ తన ట్విటర్ బయో నుంచి AK 62 అనే పేరును గొలగించాడు. దీంతో నిజంగానే ఆ సినిమా నుంచి విఘ్నేష్ తప్పుకున్నాడా? ఇక ఈ కాంబోలో సినిమా రాదా? అని నెటిజన్స్ చర్చించుకుంటున్నారు. అయితే నిర్మాణ సంస్థ మాత్రం ఈ విషయంపై ఎలాంటి ప్రకటన ఇవ్వకపోవడం గమనార్హం. కాగా లైకా ప్రొడక్షన్స్ మాత్రం పక్కా ఈ సినిమాను తెరకెక్కించబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమా కోసం హీరోయిన్ని కూడా సెలెక్ట్ చేశారట. ఈ చిత్రంలో అజిత్ సరసన ఇద్దరు హీరోయిన్లు నటించనున్నారని, అందులో నటి ఐశ్వర్యరాయ్ ఒకరు కాగా, రెండో హీరోయిన్గా నటి కీర్తి సురేశ్‌ను ఎంపిక చేసినట్లు ప్రచారం జరుగుతోంది. -
AK 62: త్రిష కాదు.. సాయి పల్లవి కాదు.. కీర్తి సురేశ్ ఫైనల్!
తమిళ సినిమా: అజిత్ కథానాయకుడిగా నటించిన తుణివు చిత్రం పొంగల్ సందర్భంగా ఈ నెల 11వ తేదీ విడుదలై టాక్‌తో సంబంధం లేకుండా మంచి వసూళ్లను రాబడుతోంది. దీంతో చిత్ర యూనిట్ ప్రమోషన్ గురించి అస్సలు పట్టించుకోవడం లేదు. ఇక అజిత్ సంగతి తెలిసిందే. నటించి పూర్తి చేశాను... అంతవరకే అన్నట్లు ఉంటుంది ఈయన ధోరణి. ప్రస్తుతం ఈయన తన 62వ చిత్రానికి సిద్ధమవుతున్నారు. నయనతార భర్త విగ్నేష్ శివన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. మైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ భారీ చిత్రాన్ని ఫిబ్రవరి నెలలో సెట్స్‌పైకి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. దీని గురించి చిత్త యూనిట్ ఇంకా అధికారికంగా ప్రకటించకపోయినా ఇప్పటికే రకరకాల వార్తలు ప్రచారంలో ఉన్నాయి. ముఖ్యంగా ఇందులో అజిత్ సరసన నటించే హీరోయిన్ల గురించి పెద్ద చర్చే జరుగుతోంది. ముందుగా నటి నయనతార నటిస్తున్నట్లు ప్రచారం జరిగింది. ఆ తర్వాత త్రిష అంటూ వార్తలు వెలువడ్డాయి. ఆ తరువాత నటి ఐశ్వర్యరాయ్, సాయి పల్లవి పేర్లు వినిపించాయి. తాజాగా మరో బ్యూటీ పేరు తెరపైకి వచ్చింది. ఆవిడే కీర్తి సురేశ్. ఇంకా పేరు నిర్ణయించని ఈ చిత్రంలో అజిత్ సరసన ఇద్దరు హీరోయిన్లు నటించనున్నారని, అందులో నటి ఐశ్వర్యరాయ్ ఒకరు కాగా, రెండో హీరోయిన్గా నటి కీర్తి సురేశ్‌ను ఎంపిక చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఇదే నిజమైతే కీర్తి సురేష్ పంట పండినట్లే. ఇప్పటికే ఈమె నటుడు రజనీకాంత్, విజయ్, సూర్య, విక్రమ్ వంటి స్టార్ హీరోలతో నటించారు. అజిత్‌కు జంటగా నటించాలనే ఆసక్తిని ఇటీవల ఆమె ఒక భేటీలో వ్యక్తం చేశారు. కాగా ప్రస్తుతం ఉదయనిధి స్టాలిన్‌కు జంటగా నటిస్తున్న మామనిదన్ చిత్రం త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. -
ఆ ఇద్దరూ చాలా ఫోకస్డ్గా ఉంటారు: బోనీ కపూర్
‘‘బాపూగారు దర్శకత్వం వహించిన ‘మన ఊరి పాండవులు’ సినిమాను హిందీలో ‘హమ్ హై పాంచ్’గా రీమేక్ చేశాను. ఈ రీమేక్‌తోనే నిర్మాతగా నా కెరీర్ ప్రారంభమైంది’’ అన్నారు బోనీ కపూర్. అజిత్ హీరోగా హెచ్. వినోద్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘వలిమై’. కీలక పాత్రలో హ్యూమా ఖురేషీ, విలన్‌గా కార్తికేయ నటించారు. బోనీ కపూర్ నిర్మించిన ఈ చిత్రం నేడు(ఫిబ్రవరి 24) విడుదలవుతోంది. తెలుగులో ఇనుమూరి గోపీచంద్ విడుదల చేస్తున్నారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో బోనీ కపూర్ మాట్లాడుతూ – ‘‘అజిత్, వినోద్ చాలా ఫోకస్డ్గా ఉంటారు. వీరి కాంబినేషన్లో మూడో సినిమా చేస్తున్నాను. కార్తికేయ ఆఫ్ స్క్రీన్‌లో కూల్‌గా ఉంటాడు కానీ ఆన్ స్క్రీన్‌పై షేర్లా యాక్ట్ చేస్తాడు. నా కుమార్తె జాన్వీ కపూర్ దక్షిణాది భాషల్లో సినిమాలు చేయడానికి సిద్ధంగా ఉంది. తెలుగులో యాక్ట్ చేసేందుకు మంచి కథ కోసం ఎదురుచూస్తోంది’’ అన్నారు. ‘‘శ్రీదేవిగారి బ్యానర్ (శ్రీదేవి భర్త బోనీ కపూర్)లో యాక్ట్ చేయడం సంతోషంగా ఉంది’’ అన్నారు కార్తికేయ. -
‘వలిమై’ మూవీ ట్విటర్ రివ్యూ
తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్ నటించిన తాజా చిత్రం వలిమై. గతంలో అజిత్‌కు నేర్కొండ పార్వై లాంటి సూపర్ హిట్ మూవీని అందించిన హెచ్.వినోద్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. జి.స్టూడియోస్ సంస్థతో కలిసి బే వ్యూ ప్రాజెక్ట్స్‌పై బోనీ కపూర్ ఈ చిత్రాన్ని నిర్మించారు.హిందీ నటి హ్యూమా ఖురేషి నాయకిగా నటించిన ఇందులో టాలీవుడ్ యువ నటుడు కార్తికేయ ప్రతినాయకుడిగా నటించారు.జనవరి 13న విడుదల కావాల్సిన ఈ చిత్రం కరోనా కారణంగా వాయిదా పడింది. ప్రస్తుతం కరోనా కేసులు తగ్గడంతో ఈ సినిమాని శుక్రవారం(ఫిబ్రవరి 24) థియేటర్స్‌లో విడుదల చేశారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్‌కు మంచి స్పందన రావడంతో పాటు సినిమాపై అంచనాలను పెంచేసింది. ముఖ్యంగా ట్రైలర్లో చూపించిన యాక్షన్ సన్నివేశాలు అయితే అదిరిపోయాయి.ఇప్పటికే పలు చోట్ల ప్రిమియర్ షోస్ పడడంతో ఈ సినిమాను చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలను తెలుపుతున్నారు.. అసలు కథేంటీ.. కథనం ఎలా ఉంది.. ఏ మేరకు తెలుగు వారిని ఈ సినిమా ఆకట్టుకుంటోంది.. మొదలగు అంశాలను ట్విటర్లో చర్చిస్తున్నారు.అవేంటో చూద్దాం. #Ajith sir Nailed it🔥🥵💥 Blockbuster On the Card 🔥🔥💥#ValimaiReview || #Valimai || #ValimaiDay — Praveen 🇮🇳 (@_praveen_16) February 24, 2022 వలిమై చిత్రానికి నెటిజన్స్ నుంచి మిశ్రమ స్పందన లభిస్తోంది. సినిమా అద్భుతంగా ఉంది. వలిమై కోసం అజిత్ వంద శాతం ఎఫర్ట్ పెట్టి పని చేశారని కొంతమంది కామెంట్ చేయగా, రొటీన్ స్క్రీన్ ప్లే, ఫ్యాన్స్‌ను మెప్పించే సీన్స్ లేవని మరికొంతమంది అంటున్నారు. #ValimaiReview #ValimaiFDFS To simply put it Block Buster. Please do not believe any fake -ve reviews. This is a Vinoth movie than the Ajith movie but Thala Ajith put his 100% sincere effort to make it happen. Congratulations. — Karthik (@meet_tk) February 23, 2022 అలాగే సినిమా రన్ టైమ్ మూడు గంటలు ఉండడం కూడా ఇబ్బందిగా ఉందని కామెంట్ చేస్తున్నారు.ఇండియన్ సినిమాల్లో కొత్త హిస్టరీ. ఒక్క మాటలో చెప్పాలంటే మ్యాజిక్ అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. #Valimai Strength : First half stunts,Ajith screen presence.✨💯 Weakness : Too much cinematic liberty taken in the second hlf and lacks patience and punch which was quite gud in 1st half. Overall nice message. Cud've been crispier 😏 — Akash Anand (@akashba) February 24, 2022 ఫస్టాఫ్ బాగుందని, సెకండాఫ్ యావరేజ్ అని అంటున్నారు.నో డౌట్ సినిమా బ్లాక్ బస్టర్. అజిత్ కుమార్ చేసిన యాక్షన్ ఎలిమెంట్స్ అద్భుతమని కొంతమంది కామెంట్ చేస్తున్నారు. Valimai review 1st half for Ajith fans 2nd half for Vijay Fans 🤭#Beast pic.twitter.com/4nsE0nH0os — صخري (@RakeshBR55) February 24, 2022 2nd half Vera Level 💥💥👌👌 Rendu varusha uzhaippu jeichuteenga #Valimai Team #AK https://t.co/jkwRkF9c73 — இயக்கம் (@Iyakkamm) February 24, 2022 #Valimaireview Good first half, below average second half, weakest script from vinoth, ajith looks very tired in most scenes. Emotion scenes didn't work even a bit. Disappointed 🙏🏻👍 #Valimai #ValimaiFDFS𓃵 — BlastingTamilCinema (@BLSTG2) February 24, 2022 BIGGEST BLOCKBUSTER OF INDIAN CINEMA!!!! Complete action thriller 🔥🔥🔥 #AjithKumar #AK #Thala #ValimaiBlockbuster #Valimai — Dharmaraj K (@dharmagk) February 24, 2022 After watched the movie you all will understand the reason behind emerald design for #Valimai title HVinod is really a man of master mind 🔥 pic.twitter.com/nDuF96JT2R — PRO V2 (@ProdigeV2) February 23, 2022 Just watched now in England. Vera level Vera Mari 😍 love u Thala #Valimai — புங்கை முகிலன் (@muhilansv) February 23, 2022 1st half wathaaa vera marri🔥🔥🔥🔥🔥#ValimaiFDFS𓃵 #Valimai #ValimaiReview pic.twitter.com/qQRwfYHb41 — 𝚅𝚊𝚊𝚍𝚒 𖤍 𝚅𝚊𝚊𝚜𝚊𝚕 ° ᭄° (@VaadiVaasal23) February 24, 2022 The New story of Indian cinema History.. #Valimai Interval... One Word review , Magic Magic Magic...💥 Interval scene fully Goosebumps...🩸#ValimaiFDFS #ValimaiReview pic.twitter.com/Nq8mHXMqIg — 💗💗SUPERSTAR BAKTHAN💗💗 (@AJITAJI2) February 24, 2022 Hats off Stunt Making @dhilipaction Team, Camera Team & Sfx mixing Team 👏👏💥💥 vera level Theaterical Experience 💪 (watch Normal days experience SFX feel) #Valimai — Manibharathi Selvaraj (@smbmanibharathi) February 24, 2022 -
నవీన్ అదుర్స్ దబంగ్ ఢిల్లీకి రెండో విజయం
బెంగళూరు: దబంగ్ ఢిల్లీ జట్టు స్టార్ రెయిడర్ నవీన్ కుమార్ మరోసారి చెలరేగాడు. ఏకంగా 17 పాయింట్లు సాధించడంతో... ప్రొ కబడ్డీ లీగ్‌లో భాగంగా శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ జట్టు 31–27తో యు ముంబాపై గెలిచింది. మ్యాచ్‌లో మొత్తం 28 సార్లు కూతకు వెళ్లిన నవీన్ 16 పాయింట్లు తెచ్చాడు. ప్రత్యర్థి రెయిడర్‌ను పట్టేసి మరో పాయింట్‌ను సాధించాడు. ఈ ప్రదర్శనతో నవీన్ 500 రెయిడింగ్ పాయింట్ల మార్కును అందుకున్నాడు. అతి తక్కువ మ్యాచ్ (47)ల్లో ఈ ఘనతను అందుకున్న తొలి రెయిడర్‌గా నవీన్ నిలిచాడు. సహచరుడు జోగిందర్ సింగ్ నర్వాల్ (4 పాయింట్ల) ప్రత్యర్థిని పట్టేయడంతో ఢిల్లీ వరుసగా రెండో విజయాన్ని అందుకుంది. యు ముంబా తరఫున అజిత్ కుమార్ 7 పాయింట్లు సాధించాడు. ఇతర మ్యాచ్‌ల్లో బెంగళూరు బుల్స్ 38–30తో తమిళ్ తలైవాస్‌పై, డిఫెండింగ్ చాంపియన్ బెంగాల్ వారియర్స్ 31–28తో గుజరాత్ జెయింట్స్ గెలిచాయి. నేటి మ్యాచ్‌ల్లో యూపీ యోధతో పట్నా పైరేట్స్; పుణేరి పల్టన్‌తో తెలుగు టైటాన్స్; హరియాణా స్టీలర్స్‌తో జైపూర్ పింక్ పాంథర్స్ ఆడతాయి. -
కోలీవుడ్‌లో విద్యాబాలన్‌కు అవమానం!
తమిళసినిమా: నవ్విన నాప చేనే పండుతుందన్న సామెత తెలిసిందే. దీన్ని ఎందరో నిరూపించి చూపించారు. అలాంటి వారిలో నటి విద్యాబాలన్ ఒకరని చెప్పక తప్పదు. ఈ బెంగళూర్ బ్యూటీ ఆదిలో చాలా అవమానాలను ఎదుర్కొంది. నిజానికి విద్యాబాలన్ నటిగా ముందు కోలీవుడ్‌లోనే పరిచయం కావలసింది. అయితే లావు, రంగు వంకతో నువ్వు నటిగా పనికిరావు అని నిరుత్సాహపరచడంతో దాన్ని ఛాలెంజ్‌గా తీసుకున్న విద్యాబాలన్ బాలీవుడ్లో పాగా వేసి కథానాయకిగా అవకాశాలను సంపాదించుకుంది. జాతీయ ఉత్తమనటి అవార్డును కూడా అందుకున్న విద్యాబాలన్ గురించి ఇప్పుడు భారతీయ సినిమానే గొప్పగా చెప్పుకుంటోంది. ఆ మధ్య మణిరత్నం దర్శకత్వంలో గురు చిత్రంతో కోలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చిన విద్యాబాలన్ ఆ తరువాత చాలా అవకాశాలు వచ్చినా అంగీకరించలేదు. ఇకపోతే ఇటీవల టాలీవుడ్లో ఎన్టీఆర్ బయోపిక్‌లో బాలకృష్ణ సరసన నటించిన ఈమె తాజాగా కోలీవుడ్ ప్రేక్షకులను సుదీర్ఘకాలం తరువాత నేర్కొండ పార్వై చిత్రంతో పలకరించడానికి సిద్ధం అవుతోంది. ఈ చిత్రంలో నటుడు అజిత్‌కు జంటగా గౌరవ పాత్రలో నటించింది. దివంగత నటి శ్రీదేవి భర్త బోనీకపూర్ నిర్మిస్తున్న ఈ చిత్రం హిందీ పింక్‌కు రీమేక్ అన్న విషయం తెలిసిందే. హెచ్.వినోద్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం షూటింగ్‌ను పూర్తి చేసుకుని ఆగస్ట్‌లో తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. ఈ సందర్భంగా నటి విద్యాబాలన్ ఒక భేటీలో పేర్కొంటూ ఎవరి శరీర బరువు, ఛాయల గురించి పరిహాసించరాదని అంది. ప్రతి ఒక్కరిలోనూ ఏదో ఒక ప్రత్యేకత ఉంటుందని చెప్పింది. తాను సినిమా రంగంలోకి ప్రవేశించినప్పుడు చాలా మంది తనను అవమానించేలా మాట్లాడారని చెప్పింది.అలాంటి చర్యలు తన ఆత్మవిశ్వాసంపై దెబ్బ కొట్టాయని చెప్పింది. బరువు, రంగు వంటివి మనిషి సాధనకు ఎంత మాత్రం కారణం కావన్నది పరిహాసం చేసే వారు తెలుసుకోవాలని నటి విద్యాబాలన్ హితవు పలికింది. -
అజిత్ ఔదార్యం
నటుడు అజిత్ గుప్తదానాలు చేస్తూ ప్రశంసలు అందుకుంటున్నారు. తన పేరిట ఏర్పాటయిన అభిమాన సంఘం ద్వారా పేదలకు తన వంతు సాయం అందజేస్తున్నారు. మొక్కలు నాటడం, రక్తదాన శిబిరాల ఏర్పాటు, సంక్షేమ సహాయకాల పంపిణీ వంటివి చేపట్టారు. అభిమాన సంఘాన్ని తొలగించి తానే స్వయంగా సహాయ కార్యక్రమాలు నిర్వహించారు. షూటింగ్‌లోనూ సహ కళాకారులకు వైద్య సాయం చేస్తున్నారు. బిర్యానీ తయారు చేసి అందరికీ వడ్డిస్తున్నారు. ప్రస్తుతం తన వద్ద పని చేసే 12 మందికి ఇళ్లు నిర్మించి ఇచ్చారు. ఇది వరకే వీరికి ఇళ్లు నిర్మించేందుకు చెన్నై సమీపంలోని కేళంబాక్కంలో స్థలాన్ని కొనుగోలు చేశారు. దాన్ని 12 మందికి విభజించి ఇచ్చారు. ఇళ్లు నిర్మించేందుకు పెద్ద మొత్తం అవసరం కావడంతో వారు నిర్మించుకోలేకపోయారు. ప్రస్తుతం అజిత్ తన సొంత ఖర్చుతో ఇళ్లు నిర్మించి వారి పేరిట రిజిస్ట్రేషన్లు చేశారు. అజిత్ సేవలను సహ నటులు అభినందిస్తున్నారు.