
చెమట నీరు... మంచి గంధం!
చెమటను సైతం సుగంధభరితంగా మార్చే ఓ పర్‌ఫ్యూమ్‌ను కనిపెట్టారు ఉత్తర ఐర్లాండులోని క్వీన్స్ యూనివర్శిటీ ఆఫ్ బెల్‌ఫాస్ట్‌కి చెందిన పరిశోధకులు. ఈ సరికొత్త పర్‌ఫ్యూమ్‌ను శరీరంపై స్ప్రే చేసుకుంటే... ఎంత చెమట పట్టినా ఇబ్బంది ఉండదట. ఎందుకంటే పర్‌ఫ్యూమ్‌లో ఉండే కెమికల్స్ చెమట తడితో కలవగానే చెమట కాస్తా సువాసనాభరితంగా మారిపోతుందట.
మామూలు పర్‌ఫ్యూమ్‌ల కంటే ఎక్కువగా, డియోడరెంట్ల కంటే రెట్టింపు స్థాయిలో సువాసనలు వెలువడతాయట. తమ ప్రయోగాలు ఫలించాయని, త్వరలోనే ఓ పర్‌ఫ్యూమ్ కంపెనీతో కలిసి వీటి తయారీని మొదలు పెడతామని వారు చెబుతున్నారు.