Perfume
-
నగలు ధరించాక పెర్ఫ్యూమ్లు వేసుకుంటున్నారా? అయితే ఈ టిప్స్ మీకోసమే!
అందమైన ఆభరణాలను ఎక్కవ డబ్బు పెట్టి కొనుక్కుంటాం. వాటిని ధరించి ఆనందిస్తాం. కానీ ఆభరణాలను కలకాలం అందంగా ఉంచుకోవడం కూడా తెలుసుకోవాలి. తగిన జాగ్రత్తలు తీసుకోక΄ోతే ఆభరణాలు కాంతిహీనమవుతాయి. ఫంక్షన్లకు వెళ్లేటప్పుడు ఆభరణాలు ధరించిన తర్వాత ఒంటికి లోషన్లు– సన్స్క్రీన్లు రాయడం, పెర్ఫ్యూమ్ స్ప్రే చేసుకోవడం మంచిది కాదు. ఇలా చేస్తే కాస్మటిక్స్లోని రసాయనాలు ఆభరణాల లోహాల మధ్య రసాయన చర్యకు కారణమవుతుంది. ఆభరణాలు మెరుపు తగ్గడం, రంగుమారడం వంటి పరిణామాలు సంభవిస్తాయి. కాబట్టి ఒంటికి క్రీములు, పెర్ఫ్యూమ్లు వేసుకోవడం పూర్తయిన తర్వాత మాత్రమే ఆభరణాలను ధరించాలి. ఆభరణాలను ధరించిన తర్వాత తీసి బీరువాలో దాచేటప్పుడు నేరుగా డబ్బాలో పెట్టడం మంచిది కాదు. ఒంటి మీద నుంచి తీసిన తరవాత కొంతసేపు గాలికి ఆరనివ్వాలి. ఆ తర్వాత నూలువస్త్రంతో తుడవాలి. శుభ్రమైన మెత్తని నూలు వస్త్రంలో చుట్టి డబ్బాలో పెట్టాలి.ఆభరణాలను శుభ్రం చేయడానికి రసాయనాలను వాడరాదు. ఇలా చేస్తే బంగారు ఆభరణాల మెరుపు పోవడంతోపాటు ఆభరణం రంగుమారుతుంది. ఆభరణం రంగు మారిన వెంటనే ఇది కచ్చితమైన బంగారేనా అనే అనుమానం వస్తుంది. ఆభరణం తయారీలో బంగారంలో కొన్ని ఇతర లోహాలను కలుపుతారు. అవి రసాయనాల కారణంగా రంగుమారుతాయి. ఆభరణాలను మెత్తని వస్త్రంతో మృదువుగా తుడవాలి.నిద్రపోయేటప్పుడు ఆభరణాలను ధరించరాదు. బంగారు మెత్తని లోహం. సున్నితమైన పనితనంతో లోహంలో రాళ్లు, వజ్రాలను పొదుగుతారు. నిద్రలో ఒత్తిడికి గురై రాళ్లు ఊడి΄ోయే ప్రమాదం ఉంది. రాలి పడిన రాళ్లను తిరిగిపొందగడం కష్టం. తిరిగి అమర్చినప్పటికీ అతుకు తెలిసి΄ోతుంది. ఆభరణానికి స్వతహాగా ఉండే అందం పోతుంది.రెండు వేర్వేరు లోహాలను ఒకచోట ఉంచరాదు. అంటే బంగారు, వెండి ఆభరణాలను ఒకే డబ్బాలో పెట్టకూడదు. విడిగా భద్రపరచాలి. అలాగే రెండు ఆభరణాలను కూడా ఒకే పెట్టెలో పెట్టరాదు. ఒకదానికొకటి రాసుకుని గీతలు పడతాయి, మెరుపు కూడా తగ్గుతుంది. – రీటా షాకన్సల్టెంట్ అండ్ జ్యూయలరీ డిజైనర్, హైదరాబాద్ -
అలాంటి పెర్ఫ్యూమ్స్ కొంటున్నారా..?
చవకైన పెర్ఫ్యూమ్స్ / సెంట్స్ వల్ల అలర్జీలు కలిగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటున్నాయనీ, వీటివల్ల కొన్ని రకాల అలర్జీలు, కాంటాక్ట్ డర్మటైటిస్, ఎగ్జిమా అనే చర్మ వ్యాధులు, మైగ్రేన్ వంటి తలనొప్పులు పెరుగుతున్నాయని ఇంగ్లాండ్‌లోని క్యాంటర్బరీ కెంట్ ఛాసర్ హాస్పిటల్‌కు చెందిన చర్మవైద్య నిపుణులు డాక్టర్ సుసానా బ్యారన్ హెచ్చరిస్తున్నారు. వాసనల వల్ల అలర్జీలతో పాటు అవి చర్మానికి తగలడం వల్ల కూడా అనేక రకాల చర్మవ్యాధులూ వస్తున్నాయని హెచ్చరిస్తున్నారు. కొంతకాలం కిందట యూరోపియన్ యూనియన్ సైంటిఫిక్ కమిటీ ఒక సర్వే చేసి, తక్షణం అలర్జీకి కారణమయ్యే అలర్జెన్ల జాబితాను రూపొందించే కార్యక్రమానికి పూనుకుంటుంది. ఈ క్రమంలో రకరకాల సబ్బులు, షాంపూలు, సెంట్లు సైతం అలర్జీలకు కారణమవుతున్నట్లు ఆ సర్వేలో తేలింది.చవక రకం సెంట్ల వాసనలతో మైగ్రేన్ వంటి తలనొప్పుల కేసులూ విపరీతంగా పెరుగుతున్నాయంటూ యూనివర్సిటీ ఆఫ్ సిన్సినాటీ కాలేజ్ ఆఫ్ మెడిసిన్‌కు చెందిన డాక్టర్ విన్సెంట్ మార్టిన్ అనే న్యూరాలజిస్ట్ సైతం పేర్కొంటున్నారు. వాటితో చాలా అప్రమత్తంగా ఉండాలంటూ డెర్మటాలజిస్టులు, న్యూరాలజిస్టులు, జనరల్ ఫిజీషియన్స్ జాగ్రత్తలు చెబుతున్నారు. (చదవండి: పాదాల వాపుకి గుండె జబ్బులకు సంబంధం ఏమిటీ..?) -
ఇదేం పెర్ఫ్యూమ్ రా బాబు..! కొనుగోలు చేస్తారా ఎవరైనా ..?
పెర్ఫ్యూమ్ అంటే మంచి సువాసనభరితంగా చుట్టు ఉన్నవారిని తనవైపుకు ఆకర్షించేలా అటెన్ష్ తీసుకొస్తుంది. ఆ ఘుమాళింపు ముక్కుపుటలను తాకగానే అబ్బా అని మైమరచిపోయేలా ఉండే లగ్జరియస్ పెర్ఫ్యూమ్లను ప్రముఖ బ్రాండ్లు విడుదల చేస్తాయి. ఆ పేరుకి తగ్గ రేంజ్‌లోనే ఆ ఫెర్ఫ్యూమ్లు కూడా ఉంటాయి. కానీ ఇప్పుడు చెప్పబోయే ఫెర్ఫ్యూమ్ పేరు వినగానే కళ్లెర్రజేయడం ఖాయం. ఛీ ఇదేం ఫెర్ఫ్యూమ్ ఆ పేరేంటి అని చిరాకు పడిపోతారు. చెప్పాలంటే ఇలాంటి ఫెర్ఫ్యూమ్ని ఎవ్వరైనా కొనే సాహసం చేస్తారా అనే సందేహం రాకుండా ఉండదు కూడా. ఏంటా ఫెర్ఫ్యూమ్ కథా కమామిషు అంటే..దుబాయ్ రాజు కుమార్తె షేఖా మహ్రా అల్ మక్తూమ్ కొత్త పెర్ఫ్యూమ్ని టీచర్ని సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ పెర్ఫ్యూమ్ని తన బ్రాండ్ మహ్రా ఎం పేరుతో విడుదల చేసింది. అది కాస్త సోషల్ మీడియాలో పెద్ద దుమారం రేపి వివాదానికి దారితీసింది. ఆ టీజర్లో పెర్ఫ్యూమ్ పేరు "విడాకులు" అనే పదం చెక్కబడిన నల్లని సీసాపై ఉంది. విరిగిన గాజు, నల్లని చిరుతపులితో ఉండిన వీడియో వృత్తం 'డివోర్స్' ఇతి వృత్తాన్ని చెబుతున్నట్లుగా ఉంది. ఆ పెర్ఫ్యూమ్ లైన్ చూసి ఒక్కసారిగా నెటిజన్లు మండిపడ్డారు. ఒకరేమో మహ్రా చాలా తెలివిగా, గౌరవప్రదంగా వ్యాపారం ప్రారంభించిందని ప్రశంసించగా, చాలామంది మాత్రం భర్త నుంచి విడిపోయాననే బాధతో మరీ ఇలా చేస్తుందా..?, ఆమె చాలా క్రియేటివ్ అంటూ వెటకారంగా పోస్టులు పెట్టారు. అయితే ఆమె ఇస్లామిక్ పద్ధతిలో ఇన్‌స్టాలో తన భర్తకు బహిరంగంగా ట్రిపుల్ తలాక అని విడాకులు ఇచ్చిన కొన్నివారాల తర్వాత ఇలా యువరాణి మహ్రా వివాదాస్పదమైన విధంగా టీచర్ని విడుదల చేయడంతో ఇంతలా ఊహగానాలకు తెరలేపింది. దీంతో నెటిజన్లు విడాకుల గురించే సోషల్ మీడియాలో ప్రకటించాలనే ఉద్దేశ్యంతో ప్రత్యక్షంగా ఇలాంటి టీచర్ విడుదల చేసిందంటూ ఫైర్ అయ్యారు. కాగా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వైస్ ప్రెసిడెంట్, ప్రధాని అయిన దుబాయ్ పాలకుడి కుమార్తె మహ్రా యూఏఈలో మహిళ సాధికారత, స్థానిక డిజైనర్ల తరుఫు న్యాయవాది. View this post on Instagram A post shared by @mahraxm1 (చదవండి: నటుడు కమలహాసన్ సరికొత్త బ్రాండ్! జీరో వేస్ట్ ఫ్యాషన్ ట్రెండ్!) -
ఆకట్టుకున్న పర్ఫ్యూమ్ మేకింగ్..
సాక్షి, సిటీబ్యూరో: అత్యాధునిక ఇంటీరియర్ ఉత్పత్తులపై అవగాహన అందించేందుకు హన్స్ గ్రోహె ఇండియా ఆధ్వర్యంలో ఐటీసీ కోహినూర్ హోటల్లో ‘మేక్ ఇట్ యువర్స్’ పేరిట జరిగిన పర్ఫ్యూమ్ తయారీ కార్యక్రమం ఆకట్టుకుంది.హాజరైనవారు తమకు నచ్చిన పరిమళాలను ఎంపికచేసుకుని పర్ఫ్యూమ్స్ను కస్టమైజ్ చేసుకునే అవకాశం కల్పించారు. అదే విధంగా బాత్రూమ్కు పర్యావరణ హితమైన రీతిలో థీమ్, ప్రశాంతత జతచేసి రూపొందించిన వినూత్న డిజైన్.. ది టీల్క్లబ్ను ఈ కార్యక్రమంలో ఆవిష్కరించారు. డ్రోన్ షో, డీజే మ్యూజిక్‌తో ఆకట్టుకున్న ఈ వెరైటీ ఈవెంట్‌కి నగరానికి చెందిన ఇంటీరియర్ డిజైనర్స్, ఆర్కిటెక్ట్స్ హాజరయ్యారు.ఇవి చదవండి: ఇదీ.. లగ్గం లాగిన్! -
మట్టి పరిమళం: ఈ పెర్ఫ్యూమ్తో.. బయట వర్షం పడుతుందేమో అనే అనుభూతి..
వేడి, పొడి వాతావరణంలో ఒక్కసారిగా కురిసే చినుకులతో భూమి నుండి వెలువడే ఆహ్లాదకరమైన సువాసన మనసును సేదతీరుస్తుంది. ఇది మట్టి వెదజల్లే సహజ పరిమళం కావడంతో మన మనసుల్ని సంతోష సాగరంలో విహరింపజేస్తుంది. తొలకరి చినుకులు నేలను తాకినప్పుడు వచ్చే ఈ మట్టి సువాసనను ఆస్వాదించడంలో ఆడ–మగ అనే భేదమేమీ లేదు. అందుకే, ఈ సువాసనలు ఇప్పుడు అత్తరు రూపంలో అందరినీ అల్లుకు పోతున్నాయి.ప్రకృతి నుండి ప్రేరణ పొంది, సురక్షితమైన పదార్థాలతో తయారైన మట్టి అత్తరు పరిమళాలకు వందల సంవత్సరాల నైపుణ్యం గల వారసత్వ కంపెనీలు కూడా ఉన్నాయి. చెమట వాసనను దూరం చేస్తూ విభిన్న శ్రేణి వ్యక్తులను ఆకర్షిస్తుంది. ‘ది సెంట్ ఆఫ్ రైన్’ లేదా ‘పెట్రిచోర్ ఎసెన్షియల్ ఆయిల్’గా ప్రసిద్ధి చెందినవీ ఉన్నాయి. అన్ని దేశాలలోనూ ఈ తరహా సువాసనలను ప్రజలు ఇష్టపడుతున్నారు. ఆఫ్‌లైన్–ఆన్లైన్ మార్కెట్లో వందల రూపాయల నుంచి వేల రూపాయల వరకు ఈ ఎర్త్ సెంటెడ్ పెర్ఫ్యూమ్స్ అందుబాటులో ఉన్నాయి.చెక్.. తప్పనిసరి:– మనసును కదిలించే ఈ సువాసనగల అత్తరులో ఆల్కహాల్ వాడకం లేనివి ఎంచుకోవాలి.– అత్తరు లేదా పెర్ఫ్యూమ్ మన చర్మ తత్త్వానికి సరిపడుతుందా లేదా అని చెక్ చేసుకోవాలంటే ముందుగా దూది ఉండతో మణికట్టు, చెవి వెనక భాగాన కొద్దిగా అద్ది/స్ప్రే చేసి, 30 నిమిషాలు ఉండాలి. సరిపడితే రోజూ ఉపయోగించుకోవచ్చు.ప్రయోజనాలు ఏంటంటే?– మట్టి పరిమళం గల సహజ అత్తరు/పెర్ఫ్యూమ్ను వాడి మానసిక ఒత్తిడి నుంచి రిలాక్స్ కావచ్చు.– ఏకాగ్రతను మెరుగుపరుచుకోవాలనుకునేవారికి ఉత్తమమైన సాధానాలలో మట్టి పరిమళం ఒకటి లగ్జరీ హోటళ్లు, యోగా అండ్ ఆయుర్వేద రిసార్ట్‌లలో, అరోమా థెరపీ రిట్రీట్‌లలో సుగంధ లేపనాల తయారీలోనూ ఈ మట్టి అత్తరును ఉపయోగిస్తుంటారు.– మట్టి పరిమళం స్ప్రే చేసుకొని వెళితే మీ చుట్టూ ఉన్నవారు బయట వర్షం పడుతుందేమో అన్న అనుభూతికి లోనుకాకుండా ఉండలేరు.ఇవి చదవండి: Healthy Diet: ఓట్స్ – పొటాటో చీజ్ బాల్స్! -
Bengaluru: పర్ఫ్యూమ్ ఫ్యాక్టరీ గోదాంలో అగ్నిప్రమాదం
బెంగళూరు: కర్ణాటక రాజధాని నగరం బెంగళూరు శివార్లలోని ఓ పర్ఫ్యూమ్ ఫ్యాక్టరీ గోదాంలో ఆదివారం సాయంత్రం అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా ఐదుగురు గాయపడ్డారు. గాయపడ్డ వారిని చికిత్స నిమిత్తం సమీపంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. #Karnataka: Three people killed and six others injured in a fire accident that broke out at an illegal perfume factory in Ramasandra in Kumbalgodu police limits on Sunday evening. pic.twitter.com/Htshft0BOu — South First (@TheSouthfirst) February 19, 2024 గాయపడ్డ వారిలో 10 నుంచి 15 ఏళ్ల మధ్య వయసున్న బాలురు కూడా ఉండటంతో గోదాంలో చిన్న పిల్లలు కూడా పనిచేస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. బెంగళూరు శివార్లలోని మైసూర్ రోడ్డు సమీపంలో నివాసాల మధ్య ఏర్పాటు చేసిన ఈ గోదాంనకు లైసెన్స్ ఉందా లేదా అన్నదానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గడువు దాటిపోయిన పర్ఫ్యూమ్ బాటిళ్లను డీల్ చేసేందుకు ఈ గోదాంను రెండు వారాలే క్రితమే ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. ఇదీ చదవండి.. బైక్‌పై వెళుతున్న యువకునికి గుండెపోటు -
సొంత బ్రాండ్ షూస్ విడుదల చేసిన ట్రంప్
ఫిలడెల్ఫియా: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సొంత బ్రాండ్ షూస్‌ను విడుదల చేశారు. ఆదివారం ఫిలడెల్ఫియాలో కన్వెన్షన్ సెంటర్లో వాటిని ప్రదర్శించారు. బంగారు వర్ణం షూలు 399 డాలర్లకు ఆన్లైన్లో అందుబాటులో ఉంటాయి. వీటితోపాటు విక్టరీ47 అనే సెంటును కూడా విడుదల చేశారు. ఆస్తుల విలువను ఎక్కువ చేసి చూపిన నేరానికి కోర్టు ఏకంగా 35.5 కోట్ల డాలర్ల భారీ జరిమానా విధించిన మరునాడే ట్రంప్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నవంబర్‌లో జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా ట్రంప్ బరిలోకి దిగనున్నారు. -
ఫర్ఫ్యూమ్ మూవీ.. ఎలా ఉందంటే?
టైటిల్ : ఫర్ఫ్యూమ్ నటీనటులు: చేనాగ్, ప్రాచీ థాకర్, అభినయ ఆనంద్, భూషణ్ బాబా మీర్, కేశవ్ దీపక్, తదితరులు దర్శకత్వం: జేడీ స్వామి నిర్మాతలు: సుధాకర్, శివ, రాజీవ్ కుమార్, లావురి శ్రీనివాస్, రాజేంద్ర కనుకుంట్ల, శ్రీధర్ అక్కినేని నిర్మాణ సంస్థలు: శ్రీమాన్ మూవీస్ ప్రజెంట్స్, మిత్రా మూవీ మేకర్స్, ఫరెవర్ ఫ్రెండ్స్ సంగీతం: అజయ్ అరసద సినిమాటోగ్రఫీ: రామ్ కే మహేశ్ ఎడిటర్: ప్రవీణ్ పూడి విడుదల తేదీ: నవంబర్ 24,2023 చిన్న చిత్రాలు, కొత్త కథలు, కంటెంట్ ఓరియెంటెడ్ మూవీలకు ఇప్పుడు మంచి ఆదరణ లభిస్తోంది. అలాంటి ఓ చిత్రమే ఇప్పుడు వచ్చింది. స్మెల్లింగ్ అబ్సెషన్ అనే కాన్సెప్ట్ మీద తీసిన చిత్రం పర్ఫ్యూమ్. శ్రీమాన్ మూవీస్ ప్రజెంట్స్, మిత్రా మూవీ మేకర్స్, ఫరెవర్ ఫ్రెండ్స్ నిర్మించిన ఈ మూవీలో చేనాగ్, ప్రాచీ థాకర్ జంటగా నటించారు. జే.డి.స్వామి దర్శకత్వంలో తెరకకెక్కగా.. జె.సుధాకర్, శివ.బి, రాజీవ్ కుమార్.బి, లావురి శ్రీనివాస్, రాజేంద్ర కనుకుంట్ల, శ్రీధర్ అక్కినేని (అమెరికా) లు సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రం నవంబర్ 24న గ్రాండ్‌గా విడుదలైంది. మరి ఈ సినిమా ఎలా ఉందో ఓ సారి చూద్దాం. అసలు కథేంటంటే.. హైద్రాబాద్‌లో ఓ విచిత్ర వ్యక్తి వ్యాస్ (చేనాగ్) అమ్మాయిల వాసన వస్తే పిచ్చెక్కిపోతూ ఉంటాడు. అమ్మాయిల వాసనతో పిచ్చి పట్టినట్టుగా ప్రవర్తించే వ్యాస్‌ను పట్టుకునేందుకు ఏసీపీ దీప్తి (అభినయ) ప్రయత్నాలు చేస్తుంటుంది. అదే సమయంలో వ్యాస్‌ను లీలా (ప్రాచీ థాకర్) చూస్తుంది. చూడగానే అతడిని ఘాడమైన ముద్దు ఇస్తుంది. దీంతో వ్యాస్ ఆమె ధ్యాసలోనే ఉంటాడు. కానీ ఆమె మాత్రం వ్యాస్‌ను అవమానిస్తుంది. ఆ అవమానానికి పగ తీర్చుకోవాలని ఆమెను కిడ్నాప్ చేస్తాడు వ్యాస్? ఆ తరువాత వ్యాస్ ఏం చేస్తాడు? అసలు వ్యాస్‌కు లీలా ఎందుకు ముద్దు పెట్టింది? ఈ ఇద్దరి మధ్య ఉన్న ఫ్లాష్ బ్యాక్ ఏంటి? చివరకు పోలీసులు వ్యాస్‌ని ఏం చేశారు? అన్నది థియేటర్లో చూడాల్సిందే. ఎలా ఉందంటే.. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో వచ్చే చిత్రాలను అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకోవడం కాస్త అరుదుగా జరుగుతుంటాయి. ప్రయోగాత్మక చిత్రాలకు ఓ సెక్షన్ నుంచి మాత్రమే సపోర్ట్ ఉంటుంది. ఈ పర్ఫ్యూమ్ కూడా ఓ సెక్షన్ ఆఫ్ ఆడియెన్స్‌కు మాత్రమే నచ్చే అవకాశం ఉంది. పాయింట్ కొత్తదే అయినా.. తెరకెక్కించడంలో, ఎమోషనల్‌గా కనెక్ట్ చేయడంలో డైరెక్టర్ కాస్త తడబడినట్టుగా అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ కంటే సెకండాఫ్‌లోనే ఎక్కువ ఎమోషనల్‌గా సాగుతుంది. ఫ్లాష్ బ్యాక్ సీన్, హీరోకి గల సమస్యను చక్కగా వివరించారు. ఆ ఫ్లాష్ బ్యాక్ సీన్లు అందరినీ ఆకట్టుకుంటాయి. ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ ఎమోషనల్‌గా సాగుతాయి. అయితే కథ, కథనాలు మాత్రం ఊహకందవు. ప్రేక్షకుడి అంచనాలకు తగ్గట్టుగా సీన్లు ముందుకు సాగవు. ట్విస్టులు ఆకట్టుకుంటాయి. ఎవరెలా చేశారంటే.. మొదటి సినిమానే అయినా.. కొత్త వాడే అయినా కూడా చేనాగ్ తన పాత్రకు న్యాయం చేశాడు. ఎక్కడా బెరుకు లేకుండా నటించాడు. అన్ని రకాల ఎమోషన్స్‌ను పండించాడు. ఇది వరకు దర్శకత్వ శాఖలో పని చేసిన అనుభవం కూడా తోడవ్వడంతో తెరపై అవలీలగా నటించేసినట్టు అనిపిస్తుంది. లీల కారెక్టర్లో ప్రాచీ ఓకే అనిపిస్తుంది. ఏసీపీ దీప్తిగా అభినయ కనిపించినంతలో మెప్పించింది. బాబా, తాజ్ ఇలా మిగిలిన పాత్రలన్నీ ఓకే అనిపిస్తాయి. సాంకేతికపరమైన విషయానికొస్తే.. పాటలు ఓకే అనిపిస్తాయి. మాటల ద్వారా నగ్న సత్యాలు చెప్పినట్టుగా అనిపిస్తాయి. కెమెరా వర్క్ బాగుంది. నిడివి సమస్యగా అనిపించదు. సాంకేతిక విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. నిర్మాణ విలువలు సంస్థ స్థాయికి తగినట్లుగా ఉన్నాయి. -
సరికొత్త కాన్సెప్ట్‌తో వస్తోన్న 'పర్ఫ్యూమ్'.. టైటిల్ సాంగ్ రిలీజ్!
చేనాగ్, ప్రాచీ థాకర్ జంటగా నటిస్తోన్న చిత్రం ‘పర్ఫ్యూమ్’. జే.డి.స్వామి దర్శకత్వంలో తెరకకెక్కిస్తున్నారు. ఈ చిత్రాన్ని శ్రీమాన్ మూవీస్ ప్రజెంట్స్, మిత్రా మూవీ మేకర్స్, ఫరెవర్ ఫ్రెండ్స్ బ్యానర్స్‌పై జె.సుధాకర్, శివ.బి, రాజీవ్ కుమార్.బి, లావురి శ్రీనివాస్, రాజేంద్ర కనుకుంట్ల, శ్రీధర్ అక్కినేని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీ టైటిల్ సాంగ్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ పాటను బిగ్‌బాస్ కంటెస్టెంట్ భోలె షావలి, భీమ్స్ సిసిరోలియో చేతుల మీదుగా విడుదల చేశారు. ఈ పర్ఫ్యూమ్ టైటిల్ సాంగ్‌ను భీమ్స్ సిసిరొలియో కంపోజ్ చేయగా.. సురేష్ గంగుల సాహిత్యాన్ని రచించారు. ఈ పాటను వరం, కీర్తన శర్మ ఆలపించారు. సినిమాలోని హీరో కారెక్టర్ మీద ఈ పాటను కంపోజ్ చేసినట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే రిలీజ్ చేసిన పాటలు, టీజర్, ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచేశాయి. ఇంతవరకు ఎప్పుడు రాని స్మెల్ బేస్డ్ క్రైమ్ థ్రిల్లర్‌పై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. కాగా.. ఈ చిత్రం నవంబర్ 24న థియేటర్లోకి రాబోతోంది. ఈ చిత్రానికి అజయ్ సంగీతం అందిస్తున్నారు. -
ఒంటివాసనే దోమకాటుకు మూలం
న్యూయార్క్: దోమలు. మనందరికీ ఉమ్మడి శత్రువులు. మలేరియా, జైకా, డెంగీ ప్రాణాంతక జ్వరాలకు కారణం. ఇవి కొందరినే ఎక్కువగా కుట్టడానికి కారణం ఏమిటి? ఫలానా రక్తం గ్రూప్ ఉన్నవారిని, రక్తంలో చక్కెర స్థాయిలు బాగా ఉన్నవారిని, వెల్లుల్లి, అరటిపండ్లు ఎక్కువగా తినేవారిని, మహిళలను దోమలు అధికంగా కుడుతుంటాయని అనుకుంటుంటారు. కానీ, ఇవేవీ నిజం కాదని అమెరికాలోని రాక్ఫెల్లర్ వర్సిటీ పరిశోధకులు తేల్చిచెప్పారు. శరీరం నుంచి వెలువడే ఓ రకం వాసనే దోమలను ఆయస్కాంతంలా ఆకర్షిస్తుందని, అలాంటి వారినే అవి ఎక్కువగా కుడుతుంటాయని తేల్చారు. ఈ వాసనకు కారణం శరీరంలోని కొవ్వు అమ్లాలు (ఫ్యాటీ యాసిడ్స్). ఇవి దోమలను ఆకర్షించే వాసనను ఈ ఉత్పత్తి చేస్తాయట! అధ్యయనం వివరాలను ‘జర్నల్ సెల్’లో ప్రచురించారు. మస్కిటో మ్యాగ్నెట్ మారదు చర్మంలో కార్బోజైలిక్ యాసిడ్స్ స్థాయిలు అధికంగా ఉన్నవారి పట్ల దోమలు విపరీతంగా ఆకర్షణకు గురవుతాయని అమెరికాలోని ‘రాక్ఫెల్లర్స్ ల్యాబొరేటరీ ఆఫ్ న్యూరోలింగ్విస్ట్ అండ్ బిహేవియర్’ ప్రతినిధి లెస్లీ వూషెల్ చెప్పారు. చర్మంలో భారీగా ఫ్యాటీ యాసిడ్స్ ఉంటే దోమల ముప్పు అధికమేనని వివరించారు. జైకా, డెంగ్యూ, ఎల్లో ఫీవర్, చికున్‌గున్యా వంటి జ్వరాలకు కారణమయ్యే ‘ఎడిస్ ఈజిప్టి’ దోమలపై మూడేళ్లు అధ్యయనం చేశారు. చర్మంలో ఫ్యాటీ యాసిడ్స్ స్థాయిలు బాగా ఉన్నవారే ఎక్కువగా దోమకాటుకు గురవుతున్నట్లు గుర్తించారు. ఆ అమ్లాల నుంచి ఉత్పత్తయ్యే గ్రీజులాంటి కార్బోజైలిక్ యాసిడ్స్ చర్మంపై కలిసి పొరలాగా పేరుకుంటాయి. వాటి నుంచి వచ్చే ఒక రకమైన వాసన దోమలను ఆకట్టుకుంటుందట!. -
మామూలు చీర కాదు.. సిరి చందన పట్టు చీర.. ధర ఎంతంటే!
సిరిసిల్ల: అది మామూలు పట్టుచీర కాదు.. సుగంధాలు వెదజల్లే ‘సిరి చందన పట్టు చీర’.. ఒకటీ రెండు కాదు 27 రకాల సుగంధ ద్రవ్యాలను వినియోగించి తయారు చేసిన పట్టుచీర. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రానికి చెందిన నల్ల విజయ్‌కుమార్ దీనిని రూపొందించారు. పవర్లూమ్పై నేసిన ఈ పట్టుచీరను ఇటీవలే మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావుల చేతులమీదుగా ఆవిష్కరించారు కూడా. నాలుగు దశాబ్దాల కిందటే అగ్గిపెట్టెలో ఇమిడే పట్టుచీరను నేసి ప్రపంచానికి చేనేత కళా వైభవాన్ని చాటిచెప్పిన నల్ల పరంధాములు కుమారుడే విజయ్ కుమార్. ఆయన 2012 నుంచీ మగ్గంపై ప్రయోగాలు చేస్తూ తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు. పట్టుపోగులకు సుగంధాలు అద్ది సుగంధాలు పరిమళించే పట్టుచీరను నేసేందుకు 27 రకాల సుగంధ ద్రవ్యాలను విజయ్‌కుమార్ వినియోగించారు. శ్రీగంధం, నాగకేసరాలు, బిల్వగుజ్జు, పాలసుగంధి, జాపత్రి, జాజికాయ, ఇలాచీ, జటామాంస, భావంచలు, పచ్చ కర్పూరం, కుంకుమపువ్వు, కోష్టం, తుంగదుంపలు, గంధ కచోరాలు, ఎర్ర చందనం, కస్తూరి, పసుపు, వట్టివేళ్లు, జవ్వాజి, కురువేళ్లు, దేవదారు, వస, గులాబీ రేకులు, సంపంగి, విరజాజి, కృష్ణతులసి, తాలిసపత్రి మిశ్రమంతో ద్రావణాన్ని తయారు చేశారు. దాన్ని వేడిచేసి అందులో పట్టుపోగులను రెండు రోజుల పాటు నానబెట్టారు. ఇలా సుగంధ పరిమళాలను సంతరించుకున్న పట్టు పోగులతో 15 రోజులపాటు శ్రమించి పట్టుచీరను నేశారు. 500 గ్రాముల బరువుతో 5.500 మీటర్ల పొడవుతో చీరను సిద్ధం చేశారు. ఈ చీర ధర రూ.15 వేల నుంచి రూ.25 వేల వరకు ఉంటుందని.. ఎవరైనా ఆర్డర్ చేస్తే రూపొందించి ఇస్తానని విజయ్‌కుమార్ చెబుతున్నారు. పదేళ్లుగా ఎన్నో ప్రయోగాలు సాంచాలపై వస్త్రోత్పత్తి సాగించే విజయ్‌కుమార్ 2012లో ప్రయోగాలు మొదలుపెట్టారు. తొలుత అగ్గిపెట్టెలో ఇమిడే పట్టుచీరను నేశారు. తర్వాత ఉంగరంలోంచి దూరే చీర, దబ్బనంలోంచి దూరేంత సన్నని శాలువా, కుట్టు లేని జాతీయ పతాకం, కుట్టులేని లాల్చీపైజామా, అరటినారలతో శాలువా, తామర నారలతో చీర, వెండి కొంగుతో చీర, 220 రంగుల చీర, మూడు కొంగుల చీర.. ఇలా కొత్తగా రూపొందిస్తూ వచ్చారు. ఈ ప్రయోగాలతో ఆయనకు ప్రత్యేక గుర్తింపు కూడా వచ్చింది. కొంతమంది నేరుగా విజయ్‌కుమార్‌ను సంప్రదించి ప్రత్యేకంగా పట్టువస్త్రాలను తయారు చేయించి తమవారికి బహుమతులుగా ఇస్తుంటారు. ఇటీవల సిద్దిపేటకు చెందిన టీటీడీ బోర్డు సభ్యుడు మురంశెట్టి రాములు అగ్గిపెట్టెలో ఇమిడే పట్టుచీరను విజయ్‌కుమార్ వద్ద రూ.12 వేలకు కొని తిరుమల శ్రీవారికి బహూకరించారు. అమెరికా, న్యూజిలాండ్, బెంగళూర్, హైదరాబాద్‌కు చెందిన వ్యాపారులు, ఎన్నారైలు ఆర్డర్లు ఇచ్చి విభిన్నమైన వస్త్రాలను తయారు చేయించుకుంటారు. (క్లిక్: సర్కారు బడుల్లో వన్ క్లాస్–వన్ టీవీ) కొత్తగా ఏదైనా చేయాలని.. వస్త్రోత్పత్తి రంగంలో కొత్తగా ఏదైనా చేయాలన్న ఉద్దేశంతో భిన్నమైన ప్రయోగాలు చేస్తున్నాను. ఊసరవెల్లిలా రంగులు మారే చీరను తయారుచేసే పనిలో ఉన్నాను. బంగారు పోగులతో కొంగును తయారు చేసే ఓ చీర ఆర్డర్ వచ్చింది. సున్నితమైన ఆ పనిని ముందుగా పూర్తి చేయాల్సి ఉంది. అది పూర్తయితే.. మరిన్ని ఆర్డర్లు వస్తాయని ఆశిస్తున్నాను. తయారు చేసినవన్నీ వెంటనే అమ్ముడుపోతున్నాయి. – నల్ల విజయ్‌కుమార్, నేత కళాకారుడు -
మస్క్ కొత్త బిజినెస్:10వేల బాటిల్స్ విక్రయం, నెటిజన్ల సెటైర్లు
న్యూఢిల్లీ: ప్రపంచ బిలియనీర్, టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ ఏది చేసినా సంచలనమే. తాజాగా ది ఫైనెస్ట్ ఫ్రాగ్రెన్స్ ఆఫ్ ది ఎర్త్ అంటూ ‘బర్న్ట్ హెయిర్’ పేరుతో ఒక పెర్ఫ్యూమ్ను విడుదల చేయడం, నా పేరులాంటి పేరుతో ఫ్రాగ్రెన్స్ బిజినెస్‌లోకి అనివార్యంగా వస్తున్నా..అంటూ ట్విటర్ బయోలో ఏకంగా పెర్ఫ్యూమ్ సేల్స్ మేన్ అని మార్చుకోవడం వార్తల్లో నిలిచింది. (TCS Work From Home: ఉద్యోగులకు కీలక ఆదేశాలు) దాదాపు 100 డాలర్లు లేదా రూ. 8,400 ధరతో బుధవారం లాంచ్ చేసిన ఈ పెర్ఫ్యూమ్ లాంచ్ అయిన వెంటనే హాట్ కేకుల్లా అమ్ముడు బోయిందట. ప్రారంభించిన కొన్ని గంటల్లోనే 10,000 పెర్ఫ్యూమ్ బాటిళ్లు అమ్ముడయ్యాయని మస్క్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. మస్క్ అందించిన సమాచారం ప్రకారం ది బోరింగ్ కంపెనీ వెబ్సైట్ ద్వారా ‘బర్న్ట్ హెయిర్’ పెర్ఫ్యూమ్ కొనుగోలు చేయవచ్చు. అలాగే డిజిటర్ కరెన్సీ డీజీ కాయిన్ చెల్లింపుల ద్వారా కూడా దీన్ని సొంతం చేసుకోవచ్చు. ఈ ఫెర్ప్యూమ్ బర్న్ట్ హెయిర్ ఓమ్నిజెండర్ ఉత్పత్తి అని, దీన్ని పురుషులు, మహిళలు ఇద్దరూ ఉపయోగించ వచ్చని వెల్లడించారు. అంతేకాదు ఒక మిలియన్ బాటిల్స్ పెర్ఫ్యూమ్ అమ్ముడైతే వచ్చే వార్తా కథనాలకోసం ఆసక్తిగా ఉన్నట్టు వ్యాఖ్యానించారు. (Maiden Pharma వివాదాస్పద మైడెన్కు భారీ షాక్: అక్టోబరు 14 వరకు గడువు) ది బోరింగ్ కంపెనీ వెబ్సైట్లో దాని లిస్టింగ్, “ది ఎసెన్స్ ఆఫ్ రిపగ్నెంట్ డిజైర్” అని పేర్కొనడం విశేషం. అయితే మస్క్ బర్న్ట్ హెయిర్ ఫెర్ప్యూమ్ ప్రారంభించినట్లు ప్రకటించిన వెంటనే ట్విటర్ వినియోగదారులు భిన్నంగా స్పందిస్తున్నారు. చెత్తగా పేరు పెట్టిన ఫెర్ప్యూమ్ను 100 డాలర్లకు అమ్ముకుంటూ మనల్ని ఎగతాళి చేస్తున్నాడంటూ ఒక యూజర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం దీనిపై సెటైర్లు, మీమ్స్‌తో ట్విటర్ యూజర్లు సందడి చేస్తున్నారు. The finest fragrance on Earth!https://t.co/ohjWxNX5ZC pic.twitter.com/0J1lmREOBS — Elon Musk (@elonmusk) October 11, 2022 10,000 bottles of Burnt Hair sold! — Elon Musk (@elonmusk) October 12, 2022 Can’t wait for media stories tomorrow about $1M of Burnt Hair sold 🤣 — Elon Musk (@elonmusk) October 12, 2022 Not my meme, found it here on Twitter 😂💗 pic.twitter.com/k6WLBUNYnl — 𝐤𝐞𝐧𝐳𝐢𝐞 𝐨𝐫 𝐣𝐮𝐬𝐭 "𝐤𝐞𝐧𝐳" (@lavandulakosmos) October 12, 2022 Burnt Hair🔥 pic.twitter.com/Ln1dIaAy8H — DogeDesigner (@cb_doge) October 12, 2022 -
యూపీ అత్తరు వ్యాపారులపై ఐటీ దాడులు
న్యూఢిల్లీ: సమాజ్‌వాదీ పార్టీ ఎమ్మెల్సీ సహా ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన పలువురు అత్తరు వ్యాపారుల నివాసాలపై ఆదాయపన్ను శాఖ శుక్రవారం దాడులు చేసింది. పన్ను ఎగవేత ఆరోపణలపై వీరి నివాసాలను సోదా చేశామని ఐటీ అధికారులు తెలిపారు. కనౌజ్, కాన్పూర్, ఎన్సీఆర్, సూరత్, ముంబై సహా దాదాపు 40 నివాసాలను సోదా చేసినట్లు తెలిపారు. ఈ దాడుల్లో దాదాపు రూ. 150 కోట్ల మేర పన్నుఎగవేతకు సంబంధించిన పత్రాలు దొరికినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. తమ ఎమ్మెల్సీ పుష్పరాజ్ జైన్ నివాసంపై ఐటీ దాడులు చేస్తున్నట్లు సమాజ్‌వాదీ పార్టీ ఒక ట్వీట్లో వెల్లడించింది. ఈ దాడులు బీజేపీ ప్రభుత్వం చేయిస్తున్న దాడులుగా విమర్శించింది. కేంద్ర దర్యాప్తు సంస్థలను మోదీ సర్కార్ దుర్వినియోగం చేస్తోందని పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ దుయ్యబట్టారు. ఇటీవలే పుష్పరాజ్ జైన్ తయారీ సమాజ్‌వాదీ ఇత్రా అనే అత్తరును అఖిలేశ్ ఆవిష్కరించారు. పుష్పరాజ్‌తో పాటు కనౌజ్, కాన్పూర్‌కు చెందిన వ్యాపారుల నివాసాలపై సోదాలు జరిగాయని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ వ్యాపారుల వస్తు,సేవల పన్ను(జీఎస్టీ) వివరాలను పరిశీలించిన అనంతరం వీరు పన్ను ఎగవేతకు పాల్పడ్డట్లు భావించి ఐటీ శాఖ దాడులు జరిపిందన్నారు. ఇటీవలే పీయూశ్ జైన్ అనే బడా వ్యాపారిపై ఐటీ దాడులు జరిపి రూ.197 కోట్ల నగదు, 26 కిలోల బంగారం, భారీగా చందన తైలం నిల్వలను స్వాధీనం చేసుకుంది. చదవండి: (కొత్త సంవత్సరం వేళ విషాదం.. ప్రధాని మోదీ సంతాపం) అది బీజేపీ సొమ్ము కాదు పియూష్ జైన్ వద్ద ఇటీవల ఐటీ దాడుల్లో లభించిన రూ. 200 కోట్ల సొత్తు బీజేపీది కాదని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. పలువురు భావిస్తున్నట్లు తప్పుడు చిరునామాలో దాడులు జరపలేదని, ముందుగా నిర్ధారించుకున్న వ్యక్తులకు సంబంధించిన స్థలాల్లోనే సోదా జరిగిందని తెలిపారు. ఇంత సొమ్ము తన సన్నిహితుడి వద్ద బయటపడేసరికి అఖిలేశ్‌కు వణుకుపుడుతోందని విమర్శించారు. పుష్పరాజ్ జైన్ బదులు ఐటీ శాఖ పీయూష్ జైన్‌పై దాడులు జరిపిందని, తెలియకుండా బీజేపీ తన సొంత సొమ్మును స్వాధీనం చేయించిందని విపక్షాలు విమర్శిస్తున్న వేళ మంత్రి నిర్మల ఈ వివరణ ఇచ్చారు. అది బీజేపీ సొమ్మేనని అఖిలేశ్ ఆరోపిస్తున్నారని, ఆ విషయం అఖిలేశ్‌కు ఎలా తెలుసని, భాగస్వామ్యం లేకపోతే పీయూష్‌పై దాడులకు అఖిలేశ్ ఎందుకు బాధపడుతున్నారని ప్రశ్నించారు. తప్పుడు చిరునామాలో దాడులు జరిగితే పీయూష్ వద్ద ఇంత సొత్తు ఎలా దొరుకుతుందన్నారు. -
నోట్ల గుట్టల మాయగాడు.. కొత్త ట్విస్ట్
కాన్పూర్ అత్తరు వ్యాపారి పీయూష్ జైన్ ఇంట్లో బయటపడ్డ నోట్ల గుట్టల సంగతి తెలిసిందే. మొత్తం రికవరీ 197 కోట్ల రూ. పైనే ఉండగా, ఆరు కోట్ల రూ. విలువైన బంగారం, ఇతర సామాగ్రిని స్వాధీనం చేసుకుంది డీజీజీఐ( Directorate General of GST Intelligence). అయితే ఈ వ్యవహారానికి సంబంధించి ఐటీ శాఖతో పీయూష్ ఒక ఒప్పందానికి వచ్చాడని, పన్నులు చెల్లింపు జరిగిపోయిందని, రేపో మాపో అతని విడుదలకు రంగం సిద్ధమైందంటూ కథనాలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో.. దాదాపు కోట్ల రూపాయలలో పన్నుల ఎగవేతకు సంబంధించిన నేరం కింద పీయూష్ జైన్‌పై కేసు నమోదు కావడంతో పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ పన్నుల బకాయిలకు సంబంధించి కొన్ని కోట్లను పీయూష్ చెల్లించినట్లు కథనాలు వెలువడుతున్నాయి. సుమారు రూ. 52 కోట్ల రూపాయల్ని కోర్టులో డిపాజిట్ చేసినట్లు, ఇందుకు సంబంధించి ఒక అప్లికేషన్ సమర్పించినట్లు పీయూష్ తరపు న్యాయవాది వెల్లడించారు. దీంతో పీయూష్‌కు ఈ కేసు నుంచి ఉపశమనం లభించిందని, త్వరలో విడుదల కాబోతున్నట్లు నిన్నంతా ప్రచారం జరిగింది. అయితే తాజా కథనాలపై డీజీజీఐ అడిషనల్ డైరెక్టర్ జనరల్ వివేక్ ప్రసాద్ స్పందించారు. ఆ చెల్లింపు కథనం, అతను బయటకు రాబోతున్నట్లు వస్తున్న కథనాల్లో అస్సలు నిజం లేదని తెలిపారు. అంతేకాదు ఆ రికవరీ సొమ్ము మొత్తం కూడా అతని బిజినెస్ టర్నోవర్ కాదని స్పష్టం చేశారు. ‘‘ఈ కథనాలు అన్నీ ఊహాగానాలే. ఎవరి ప్రమేయం వల్ల ఇలాంటి కథనాలు పుడుతున్నాయో తెలియదు. ప్రస్తుతం దర్యాప్తు జరుగుతోంది. ఇందులో ఎలాంటి దాపరికం ఉండదు. రికవరీ చేసిన సొమ్మునంతా ఎస్బీఐ సేఫ్ కస్టడీలో ఉంచాం’’ అని తెలిపారు. అలా అనలేదు.. మరోవైపు తాను అలా ప్రకటన ఇచ్చినట్లు వస్తున్న కథనాలపై జైన్ లాయర్ సుధీర్ మాలవియా స్పందించారు. తన క్లయింట్‌కు సంబంధించి పన్నుల ఎగవేతకు సంబంధించిన ఎమౌంట్ 32.5 కోట్ల రూ. దాకా ఉండొచ్చని ఒక అంచనా మాత్రమేనని, భవిష్యత్తులో అది మరింత పెరగవచ్చనే క్లారిటీ ఇచ్చారు. ఇక తన క్లయింట్ జీఎస్టీ అధికారులకు ప్రతిపాదన చేశాడనే (ట్యాక్స్, ఇతర ఖర్చులు మినహాయించుకుని తన డబ్బు ఇచ్చేయండంటూ పీయూష్ కోరాడని) కథనాల్ని సైతం లాయర్ ఖండించారు. పొలిటికల్ డ్రామా.. ఇదిలా ఉంటే పీయూష్ జైన్ వ్యవహారం రాజకీయంగా దుమారం రేపుతోంది. ఎస్పీ-బీజేపీ పరస్పర విమర్శలతో వివాదం రాజుకుంటోంది. అరెస్టయిన పీయూష్ జైన్ ఎస్పీ దగ్గరి నేత అని బీజేపీ ఆరోపిస్తుండగా.. ఎస్పీ నేత పీయూజ్‌రాజ్ జెయిన్కు బదులు పాపం బీజేపీ తమకు అనుకూలంగా ఉండే పీయూష్ జైన్‌పై పొరపాటున దాడులు నిర్వహించిందంటూ అఖిలేష్ యాదవ్ ప్రత్యారోపణలతో సెటైర్లు పేల్చారు. ఇక ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షా సైతం పరోక్షంగా, నేరుగా అఖిలేష్‌పై ఈ వ్యవహారాన్ని ఉద్దేశించి తీవ్ర విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో స్పందించిన ఆదాయ శాఖ.. తాము సరిగ్గానే దాడులు చేశామని, తమపై ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లు, ప్రభావాలు లేవంటూ స్పష్టత ఇచ్చింది కూడా. ఇదిలా ఉంటే.. ఓ పాన్ మసాలా గోదాంపై దాడులు నిర్వహించిన ఐటీశాఖకు.. అక్కడ అత్తరు వ్యాపారి(పాన్ మసాలా బ్రాండ్లకు సైతం అత్తరు సరఫరా చేస్తాడు) పీయూష్ జైన్ తీగ దొరికింది. అది లాగడంతో మొత్తం డొంక కదిలింది. కన్నౌజ్‌లోని అత్తరువ్యాపారి పీయూష్ జైన్ ఇళ్లు, ఫ్యాక్టరీ, గోదాముల్లో సోదాలు నిర్వహించిన ఆదాయ శాఖ అధికారులు.. నోట్ల గుట్టల్ని స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. సుమారు వారం పాటు సాగిన తనిఖీల్లో కోట్ల రూపాయలు, బంగారు బిస్కెట్లు, కాస్ట్లీ సెంట్ సీసాలను స్వాధీనం చేసుకున్నారు. ఆ ఫొటోలు బయటకు రావడంతో.. ఈ ఉదంతం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆపై సెంట్రల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ చట్టం ఉల్లంఘన కింద డిసెంబర్ 26న అరెస్ట్‌చేయగా..ప్రస్తుతం పీయూష్ జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నాడు. ఈ సొమ్ము లెక్కలపై స్పష్టత కోసమే అతన్ని ప్రశ్నిస్తున్నాయి అధికార విభాగాలు. చదవండి: పీయూష్‌పై ఇంతకాలం అనుమానం ఎందుకు రాలేదంటే.. -
ప్రధాని మోదీ నోట ‘పీయూష్ జైన్’ మాట
PM Modi And Amit shah Slams SP Chief Akilesh Yadav Over Piyusj Jain Issue: యూపీ కాన్ఫూర్ వ్యాపారి పీయూష్ జైన్ వ్యవహారం ఆర్థిక నేరంగానే కాదు.. రాజకీయంగానూ దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. ఓ అత్తరు వ్యాపారి అయిన పీయూష్ నుంచి దాదాపు 200 కోట్లకు పైనే విలువైన సంపదను అధికారులు రికవరీ చేసుకోవడంతో పాటు వెయ్యి కోట్ల రూపాయల పన్ను ఎగవేత ఆరోపణలపై పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. ఈ తరుణంలో యూపీ పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ.. పీయూష్ వ్యవహారం ఆధారంగా ప్రతిపక్షంపై విమర్శలు ఎక్కుపెట్టారు. కాన్పూర్‌లో మంగళవారం మెట్రో రైల్ ప్రాజెక్ట్ ఆవిష్కరణ సందర్భంగా ప్రసంగించిన ప్రధాన మోదీ.. సమాజ్‌వాదీ పార్టీ, ఆ పార్టీ చీఫ్ అఖిలేష్‌పై పరోక్షంగా సెటైర్లు విసిరారు. బీజేపీ ఎలాంటి అభివృద్ధి చేసినా.. అది తాము చేసిందేనని, బీజేపీ క్రెడిట్‌ను ఊరికే లాక్కుంటోందని వాళ్లు(అఖిలేష్‌ను ఉద్దేశించి) అంటారు కదా. మరి ఇప్పుడు నోట్ల కట్టలు నిండిన డబ్బాలు బయటపడ్డాయి. మరి బాధ్యతగా ఎందుకు ముందుకు రావడం లేదు. నోళ్లు మూసుకుని కూర్చుకున్నారు వాళ్లంతా. 2017కి ముందు దాకా అత్తరు అవినీతి యూపీలో ఏ విధంగా గుభాలించిందో అందరికీ తెలిసిందే అంటూ ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. దేశం మొత్తం ఈ వ్యవహారాన్ని ఆసక్తిగా చూస్తోంది. ఇది వాళ్లు సాధించిన ప్రగతి. వాస్తవ పరిస్థితి. యూపీ ప్రజలు ప్రతీది గమనిస్తున్నారు. వాళ్లకు ప్రతీది అర్థమవుతోంది. గత ప్రభుత్వం ఎన్నికల గెలుపును.. దోచుకునేందుకు దొరికిన లాటరీగా భావించింది. కానీ, బీజేపీ ప్రభుత్వం నిజాయితీతో బాధ్యతాయుతంగా పని చేస్తోందని అని వ్యాఖ్యానించారు ప్రధాని. షా నేరుగా.. అయితే ప్రధాని మోదీ పరోక్షంగా కామెంట్స్ చేస్తే.. కేంద్ర మంత్రి అమిత్ షా నేరుగా పేర్లతో విమర్శించడం విశేషం. ఈమధ్య సమాజ్‌వాదీ పార్టీకి చెందిన ఓ పర్ఫ్యూమ్ వ్యాపారి దొరికాడు. మేమేందుకు దాడులు చేయించామా? అనుకుంటూ అఖిలేష్ గారు మెలికలు తిరిగిపోతున్నారు. 250కోట్ల డబ్బు. ఎక్కడిది అఖిలేష్గారూ అంటూ సూటిగా ప్రశ్నించారు షా. అఖిలేష్ ఏమన్నాడంటే.. ఇక ప్రధాని, షాల ఆరోపణలపై ఎస్పీ చీఫ్, మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ సాదాసీదాగా స్పందించాడు. పొరపాటున వాళ్లకు చెందిన వ్యాపారిపైనే బీజేపీ దాడులు చేయించుకుందంటూ కౌంటర్ ఇచ్చారు. అతని(పీయూష్) కాల్ రికార్డులు పరిశీలిస్తే.. అతనితో టచ్‌లు ఉన్న బీజేపీ నేతల పేర్లు బయటపడతాయి. ఎస్పీ నేత పీయూజ్‌రాజ్ జెయిన్కు బదులు.. బహుశా పీయూష్ జైన్ మీద దాడులు చేసి ఉంటారేమో అంటూ సెటైరిక్‌గా స్పందించారు అఖిలేశ్. -
డొక్కు స్కూటర్‌పై తిరుగుతూ భలే షాకిచ్చాడే!
యూపీ వ్యాపారి పీయూష్ జైన్ వ్యవహారం దేశం మొత్తం హాట్ టాపిక్‌గా మారింది. కాన్పూర్‌లో అత్తరు బిజినెస్ చేసే పీయూష్‌ను వెయ్యి కోట్ల పన్ను ఎగవేత కేసులో అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. అతని ఇంటి, ఆఫీసు బీరువాల్లో మూలుగుతున్న నోట్ల కట్టల్ని లెక్కించేందుకు దాదాపు నాలుగు రోజులు పట్టింది అధికారులకు!. నాలుగు రోజుల తనిఖీల అనంతరం.. పీయూష్జైన్ను ఎట్టకేలకు పోలీసులు అరెస్ట్ చేశారు. కోర్టులో అతన్ని హాజరుపర్చగా.. 14 రోజుల కస్టడీ విధించింది కోర్టు. పీయూష్ జైన్ ఇల్లు, కార్యాలయాల్లో కేంద్ర ఏజెన్సీలు ఇటీవల సోదాల్లో కోట్ల రూపాయల నోట్ల కట్టలు బయటపడ్డాయి. కన్నౌజ్‌లోని అతని ఇల్లు, ఫ్యాక్టరీల నుంచి సుమారు 194 కోట్ల విలువైన కరెన్సీ, 23 కిలోల బంగారం, వెండి స్వాధీనం చేసుకున్నారు అధికారులు. ఇక అతనిపై ప్రశ్నల వర్షం కురిపించేందుకు అహ్మదాబాద్ తరలించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. జీఎస్టీ యాక్ట్ సెక్షన్ 69 కింద పన్నుల ఎగవేత ఆరోపణలపై పీయూష్ జైన్‌ను అరెస్ట్ చేశారు. డిసెంబరు 22 నుంచి నాలుగు రోజులపాటు పీయూష్ జైన్ సంబందిత ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు జరగడం విశేషం. డొక్కు స్కూటర్.. పీయూష్ జైన్ కన్నౌజ్‌లో తిరిగినప్పుడు ఓ డొక్కు స్కూటర్ ఉపయోగించేవాడట. ఇంటి బయట ఓ క్వాలిస్, మారుతీ కార్లు మాత్రమే ఉన్నాయి. ఇంట్లో పని మనిషి లేదు. ఏడాదికో వాచ్‌మన్‌ను మార్చేవాడబు. నకిలీ ఇన్వాయిస్లు, ఇ-వే బిల్లులు లేకుండా వస్తువులను రవాణా చేసే వ్యక్తి ద్వారా సరుకులను పంపడానికి సంబంధించిన డబ్బు అయ్యి ఉంటుందని భావిస్తున్నారు. ఇదిలా ఉంటే పీయూష్, కెమిస్ట్ అయిన తండ్రి నుంచి పర్ఫ్యూమ్లు తయారు చేయడం నేర్చుకున్నాడు. గత పదిహేనేళ్లలో వ్యాపారాన్ని విస్తరించాడు. ముంబై, గుజరాత్లో ఇప్పుడతని వ్యాపారం అద్భుతంగా నడుస్తోంది. ఈ దెబ్బతో జైన్, అతని సోదరుడు అంబరీష్ తమ ఇంటిని 700 స్క్వేర్ యార్డ్‌లో ఒక మాన్షన్లా మార్చేశారు. అయితే ఊళ్లో చూసేవాళ్లంతా అతను డొక్కు స్కూటర్ మీద వస్తుండడంతో సింప్లిసిటీగా భావించేవాళ్లట. తాజా పరిణామంతో వాళ్లంతా షాక్‌లో ఉన్నారు. ఇక జైన్ ఇంట్లో, ఫ్యాక్టరీలో డబ్బు, నగలతో పాటు శాండల్‌వుడ్ ఆయిల్, కోట్లు విలువ చేసే పర్ఫ్యూమ్ బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. -
పర్ఫ్యూమ్ వ్యాపారి పీయూష్‌జైన్ ఇంట్లో సోదాలు
-
గుట్టల్లా నోట్ల కట్టలు.. రూ.150 కోట్లకు పైనే, షాక్‌లో అధికారులు.. ఫోటోలు వైరల్!
లక్నో: పన్ను ఎగవేత ఆరోపణలపై సుగంధ ద్రవ్యాల వ్యాపారి ఇంట్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. తనిఖీలు చేస్తుండగా సంచుల కొద్ది నోట్ల కట్టలు గుట్లల్లా కనిపించడంతో అధికారులు షాకయ్యారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. జీఎస్టీ ఇంటెలిజెన్స్ డైరెక్టరేట్ జనరల్ బృందం గురువారం ఉదయం పెర్ఫ్యూమ్ వ్యాపారి పియూష్ జైన్ ఇల్లు, ఫ్యాక్టరీ, కార్యాలయం, కోల్డ్ స్టోరేజీ, పెట్రోల్ బంకలపై దాడులు నిర్వహించారు. ఈ తనిఖీలు ఏకకాలంలో.. కాన్పూర్, కన్నౌజ్, గుజరాత్, ముంబైలో ఉన్న సంస్థలలో జరిగాయి. వ్యాపారి ఇంట్లో తనిఖీలు చేస్తుండగా అధికారుల కళ్లు బైర్లు కమ్మేలా నోట్ల కట్టలు దర్శనమిచ్చాయి. దీంతో వెంటనే బ్యాంక్ అధికారులను పిలిపించి నోట్లను లెక్కించడం ప్రారంభించారు. శుక్రవారం ఉదయం వరకు లెక్కించగా.. నగదు, పత్రాలతో కలిపి 150 కోట్ల రూపాయల పన్ను ఎగవేతలకు సంబంధించి ఆధారాలు లభించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. పీయూష్ జైన్ ఎస్పీ నేతకు సన్నిహితుడు కూడా. కొన్ని రోజుల క్రితమే సమాజ్ వాదీ పేరుతో పెర్ఫ్యూమ్ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ సంస్థకు ప్రధాన కార్యాలయం ముంబైలో ఉంది. కన్నౌజ్‌లో ఉన్న ఫ్యాక్టరీ నుంచి పెర్ఫ్యూమ్ ముంబైకి వెళ్తుందని అక్కడి నుంచి పెర్ఫ్యూమ్ దేశ విదేశాల్లో కూడా అమ్ముడవుతోందని తెలిపారు. సౌదీ అరేబియాలో రెండు, దేశంలోని తూర్పు రాష్ట్రాల్లో రెండు సహా పీయూష్ జైన్‌కు దాదాపు 40 కంపెనీలు ఉన్నాయని తెలిపారు. समाजवादियों का नारा है जनता का पैसा हमारा है! समाजवादी पार्टी के कार्यालय में समाजवादी इत्र लॉन्च करने वाले पीयूष जैन के यहाँ GST के छापे में बरामद 100+ करोड़ कौन से समाजवाद की काली कमाई है? pic.twitter.com/EEp7H5IHmt— Sambit Patra (@sambitswaraj) December 24, 2021 చదవండి: Aaditya Thackeray: సీఎం కొడుకు ఆదిత్య ఠాక్రేకు బెదిరింపులు.. -
సమాజ్‌వాదీ అత్తర్‌పై మీమ్స్.. ‘వాహ్ భాయ్ వాహ్’ అంటున్న నెటిజన్లు
లక్నో: సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ వినూత్న ఆలోచన చేశారు. త్వరలో జరగనున్న ఉత్తర ప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఓటర్లను ఆకట్టుకునేందుకు సమాజ్ వాదీ పార్టీ అత్తర్ బ్రాండ్ పేరుతో పెర్ఫ్యూమ్ను ప్రారంభించారు. ఈ అత్తర్ సీసాపై సైకిల్ గుర్తును కూడా ముద్రించారు. అంతేగాక కవర్‌పై అ ఖిలేష్ యాదవ్ బొమ్మ కూడా ఉండేలా రూపొందించారు. రెడ్, గ్రీన్ కలర్లో తయారు చేసిన ఈ 22 సహజసిద్ధ సుగంధాలతో రూపొందించారు. చదవండి: యూపీ అసెంబ్లీ ఎన్నికలు, అఖిలేష్ యాదవ్ సంచలన ప్రకటన చదవండి: Navjot Singh Sidhu: పంజాబ్‌లో పంతం నెగ్గించుకున్న సిద్ధూ అయితే ఎన్నికల్లో ఓట్ల కోసం అఖిలేష్ యాదవ్ తీసుకున్న ఆసక్తికర నిర్ణయంపై సోషల్ మీడియాలో నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. కొంతమంది మంచి ఆలోచన అంటూ మద్దతిస్తుంటే మరికొంతమంది ఎస్పీ పార్టీని తీవ్ర ట్రోల్స్‌తో ముంచెత్తుతున్నారు. ‘సమాజ్‌వాద్ అత్తర్ చాలా ఫన్నీగా ఉంది. బీజేపీలో మోదీ, యోగి సబ్కా సాత్, సబ్కా వికాస్ అంటుంటే అఖిలేష్ యాదవ్ ‘సమాజ్ వాదీ అత్తర్’ అంటున్నాడు. ఈసారి యూపీ ఎన్నికల్లో నేను తటస్థంగా ఉండాలని ఆలోచిస్తున్నాను. కానీ సమాజ్ వాదీ పార్టీ నన్ను బీజేపీకి ఓటు వేసేలా చేస్తుంది. సమాజ్‌వాదీ అత్తర్ ‘వాహ్ భాయ్ వాహ్’...’ అంటూ మీమ్స్ క్రియేట్ చేస్తున్నారు. చూడాలి మరి సమాజ్‌వాదీ అత్తరు..ఈ ఎన్నికల్లో ఎన్ని ఓట్లు రాబడుతుందో. చదవండి: బైక్‌ల మీదకు దూసుకెళ్లిన లగ్జరీ కారు.. భయంకర దృశ్యాలు వైరల్ Cc: @rohini_sgh @sakshijoshii I was thinking to be neutral this time for UP election..however SP is making sure that I must vote for BJP at all cost.. I mean political party launching perfume..I mean..कौन हैं ये लोग..कहां से आते हैं..next is fashion show in Saifai or what? — Anurag Guru 🚯🚱 (@anurag_guru) November 9, 2021 కాగా ఎస్పీ పార్టీ అత్తర్‌ను ప్రారంభించడం ఇదే మొదటిసారి కాదు. 2016లో అఖిలేష్ యాదవ్ యూపీలో తన పార్టీ ప్రభుత్వం నాలుగేళ్లు పూర్తయిన సందర్భంగా 'సమాజ్‌వాదీ సుగంధ్' పేరుతో పలు రకాల పెర్ఫ్యూమ్లను ప్రారంభించారు. ఈ పెర్ఫ్యూమ్ నాలుగు సువాసనలతో, ప్రతి సీసా నాలుగు వేర్వేరు నగరాల(ఆగ్రా, లక్నో, వారణాసి, కన్నౌజ్) సువాసనను అందిస్తుంది. Modi Yogi : Sabka sath, sabka vikas, Zero Tolerance for Mafia Meanwhile Akhilesh Yadav : Samajwadi Attar 😂😂😂😂😂 #SamajwadiAttar — Rosy (@rose_k01) November 9, 2021 pic.twitter.com/p1nQffTTdy — UdtaBadal (@Trishoo91277137) November 9, 2021 News 1: UP Govt Building beautiful Toilets News 2: Samajwadi party has launched Samjawadi perfumes Connect the dots. — Foreveridly (@foreveridly) November 9, 2021 -
ఆ సువాసనలు ఇకపై సామన్యులకు..
స్పేస్‌లో వ్యోమగాములు వాసన కోసం ఉపయోగించే సువాసనలు ఇకపై సామాన్యులకు సైతం చేరువ కానున్నాయి. స్పేస్‌లో వాసన పీల్చుకోవడానికి వ్యోమగాములకు ప్రత్యేకమైన సువాసనలు అందిస్తారు. వ్యోమగాములు అంతరిక్ష వాసనకు అలవాటు పడటానికి అభివృద్ధి చేసిన కొన్ని సంవత్సరాల తరువాత, అలాంటి వాసనలే ఉండే సువాసనలను త్వరలో సాధారణ ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నారు. యూ డి స్పేస్‌ను రసాయన శాస్త్రవేత్త, ఒమేగా ఇన్‌గ్రీడియన్స్ వ్యవస్థాపకుడు స్టీవ్ పియర్స్ అభివృద్ధి చేశారు. (అంతరిక్షంలో దోశ) మిస్టర్ పియర్స్ నాసాతో అంతరిక్ష వాసనను తయారుచేయడానికి 2008 లో ఒప్పందం కుదుర్చుకున్నారు. అంతరిక్షంలోకి వెళ్ళే వ్యోమగాములకు అక్కడ ఉండే వాసనలు భిన్నంగా అనిపించకుండా ఉండటానికి దీనిని అభివృద్ధి చేయమని నాసా పియర్స్‌ను కోరింది. దీనిని తయారు చేయడానికి అతనికి నాలుగు సంవత్సరాలు పట్టింది. బాహ్య అంతరిక్ష వాసన ఎలా ఉంటుందో అనే విషయాన్ని వ్యోమగామి, పెగ్గి విట్సన్ 2002 లో ఒక ఇంటర్వ్యూలో తెలియజేస్తూ ‘కాల్చిన వెంటనే తుపాకీ నుంచి వచ్చిన వాసన లాగా ఉంటుంది’ అని తెలిపారు. ‘పొగ వాసన, కాలిపోయిన వాసనకు తోడు ఇది దాదాపు చేదుగా ఉండే వాసన కలిగి ఉంటుంది’ అని కూడా ఆయన చెప్పారు. యునిలాడ్ ప్రకారం, పియర్స్ వ్యోమగాముల నుంచి అంతరిక్షంలో ఉండే వాసన ఎలా ఉంటుందో తెలుసుకొని దీనిని రూపొందించినట్లు తెలుస్తోంది. వ్యోమగాములలో చాలా మంది అంతరిక్ష వాసనను ‘గన్‌పౌడర్, సీరెడ్ స్టీక్, కోరిందకాయలు, రమ్ కలయిక’ అని అభివర్ణించారు. (వైరల్‌గా మారిన సూర్యుడి వీడియో..) -
పూల పరిమళాలు
మానవత్వానికి సజీవరూపాలే దైవాత్మక ధార్మిక పౌరాణిక సాంప్రదాయాలు. వీటికి తార్కాణమే వివిధ దైవ స్వరూపాలు, విభిన్న పూజా విధానాలు. ఈ శరన్నవరాత్రులలో జగన్మాతను వివిధ రూపాలలో దర్శించి, పూజించి తరిస్తారు భక్తులు. అమ్మవారి పూజా ద్రవ్యాలలో పుష్పాలదే ప్రథమస్థానం. ప్రకృతి దత్తమైన ఈ పువ్వులు వివిధ వర్ణాలతో శోభిల్లుతుంటాయి. ఈ తొమ్మిది రోజులు ఒక్కొక్క రోజున ఒక్కొక్క రంగులో గల పువ్వులతో పూజించడం సాంప్రదాయం. వీటిలో ప్రాంతీయ భేదాలుండటం సహజం. వివిధ వర్ణ పుష్పాలతోనే దైవాంశ సంభూతమైన బతుకమ్మలను రూపొందించి ఆరాధించటం తెలంగాణ తెలుగు ప్రజల విశిష్టత. ఈ పువ్వుల ఔషధ విలువలు, ఆరోగ్య ప్రయోజనాలు ఆయుర్వేద గ్రంథాలలో నిక్షిప్తమై ఉన్నాయి. వీటి ప్రాబల్యాన్ని నేటి ఆధునిక పరిశోధనలు మరింత విస్తృతం చేసాయి. తంగేడు, సంపంగి, బంతి, చేమంతి వంటి పసుపు పచ్చని పూలను, మందార, ఎర్రగులాబీ, గునుగు, పట్టుకుచ్చు వంటి ముదురు లే త ఎరుపురంగుపూలను, కనకాంబరాలను, నందివర్ధనం, మల్లి, జాజి, పున్నాగ, తామర వంటి తెలుపురంగు పూలను, నీలిరంగు కట్ల పూలను, ఆకుపచ్చని బిళ్ల సంపంగి పూలను మనం తరచుగా చూస్తుంటాం. తంగేడు: మార్కండీ, భూమి వల్లీ, పీత పుష్పీ మొదలైనవి కొన్ని పర్యాయపదాలు. కాశ్మీర దేశపు నేలలో... తంగేడు లతలా, ఇతర ప్రాంతాలలో మొక్కలా పెరుగుతుంది. ఇది వాంతులను, విరేచనాలను కలిగించి దేహశోధనకు ఉపకరిస్తుంది. క్రిమిహరం, విషహరం. చర్మ, మూత్ర, ఉదర రోగాలు, కీళ్ల నొప్పులు, మధుమేహ, కంటి రోగాలకు ఉపశమనం కలిగిస్తుంది. మార్కండికా కుష్ఠ హారీ ఊర్ధ్వ అధః కాయశోధినీవిషదుర్గంధ కాసఘ్నీ గుల్మ ఉదర వినాశినీ ‘‘ బంతి: శరీర గాయాలను మాన్పుతుంది. క్రిమిహరం. మొటిమలు, చర్మరోగాలను తగ్గిస్తుంది. కళ్లకలకకు ఉపశమనం కలిగిస్తుంది. రుద్రాక్ష: దీనిని చంద్రకాంత అని కూడా అంటారు. వాపులను, వ్రణాలను, సెగ గడ్డలను తగ్గిస్తుంది. తెల్ల చామంతి: ఇది శీతకరం. మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది. కంటి రోగాలకు మంచిది. బలకరం. నందివర్ధనం: పొట్టలోని కృములను నశింపచేస్తుంది. పంటినొప్పిని, కంటిరోగాలను పోగొడుతుంది. కట్ల: వాపులను, మధుమేహాన్ని, క్యాన్సరును అదుపు చేస్తుంది. కనకాంబరం: కృమిహరం బీర: ముక్కు దిబ్బడను, పడిశాన్ని తగ్గిస్తుంది. ఛాతీ, కండరాల నొప్పులకు ఉపశమనం కలుగచేస్తుంది. చిట్టి చేమంతి: జ్వరాలు, వాపులు, జలుబులను తగ్గిస్తుంది. మధుమేహం, ప్రోస్టేట్ క్యాన్సర్లను అదుపు చేస్తుంది. వాము పువ్వు: జలుబు, ముక్కుదిబ్బడ, ఆంత్రకృతములు, పంటి నొప్పి, అతిసారం, మూత్రాశయంలో రాళ్లు, ఎసిడిటీ, వికారాలలో గుణకారి. సంపంగి: చంపక, చాంపేయ, సురభి, శీతల, హేమపుష్ప మొదలైనవి పర్యాయపదాలు. ఇది చలవ చేస్తుంది. క్రిమి, విషహరం. రక్తస్రావాలను అరికడుతుంది. వాత, కఫరోగహరం. మూత్రం కష్టంగా అవ్వటాన్ని పోగొడుతుంది. (చంపకః విష క్రిమిహరః మూత్రకృచ్ఛ్ర; కఫ, వాత రక్త పిత్త జిత్) మొగలి: కేతక, సూచి, ఇందుకలికా, జంబుల, చామర అనేవి కొన్ని పర్యాయాలు. ఇది ఉష్ణకరం, లఘువు, కఫహరం, నేత్రాలకు మంచిది. (హేమకేతకీ... చక్షుష్యా, ఉష్ణా, లఘు, చక్షుస్యా....) మందార: జపా, రాగపుష్పి, అర్కప్రియా... అనేవి కొన్ని పర్యాయాలు. ఎర్ర మందారం కఫవాతహరం, కేశవర్ధకం, అతిసారహరం. (జపా సంగ్రాహిణీ కేశ్యా.... కఫవాతజిత్) మంకెన: రక్తక, బంధుక, అర్కవల్లభ, హరిప్రియ... అనేవి కొన్ని పర్యాయాలు. ఇది లఘువు, కఫకరం, వాతపిత్తహరం, గ్రాహి (దేహం నుంచి ద్రవాంశలు బయటికి పోయి వ్యాధికారకమైనప్పుడు, వాటిని బయటకు పోనీయదు. కనుక అతిసారహరం), (బంధూకః కఫకృత్ గ్రాహీ వాతపిత్త హరో లఘుః) సిందూర పుష్పం: రక్తబీజా, సుకోమలా, కరచ్ఛదా... మొదలైనవి పర్యాయాలు. ఇది చలువ చేస్తుంది. రక్తస్రావాన్ని అరికడుతుంది. విషహరం, దప్పిక, వాంతులను పోగొడుతుంది. (సిందూరీ విష, రక్త పిత్త తృష్ణా వమనహరీ హిమా) గులాబీ: శతపత్రీ, తరుణీ అతి మంజులా, సుమనా.. కొన్ని పర్యాయాలు. ఇది లఘువు, శీతలం, గ్రాహి, త్రిదోష రక్తదోషాలను పోగొడుతుంది. హృదయానికి మంచిది. వీర్యవర్థకం. చర్మకాంతిని పెంచుతుంది. (శతపత్రీ హిమా హృద్యా గ్రాహిణీ శుక్రలా లఘుః, దోషత్రయా ర క్తజిత్, వర్ణ్యా.... పాచనీ) మల్లె: శ్రీపదీ, వార్షికీ, ముక్తబంధనా మొదలైనవి పర్యాయాలు. ఇది సుగంధకరమై మనసుకి ఉత్తేజాన్ని కలిగిస్తుంది. కామోద్దీపకం, చెవి, కన్ను, ముఖ (నోరు) రోగాలకు హితకారి. శీతలం, లఘువు, శిరశ్శూలహరం. (వార్షికీ శీతలా లఘ్వీ... కర్ణ అక్షి ముఖరోగఘ్నీ, సమ్మోహకరీ... తల్తైలం తద్గుణం స్మృతమ్) జాజి: జాతీ, సుమనా, మాలతీ, ప్రియా, రాజపుత్రికా పర్యాయాలు. ఇది లఘువు, ఉష్ణం, అక్షి, ముఖ, దంత రోగాలను తగ్గిస్తుంది. విషహరం, చర్మరోగాలలో, వాతరక్తం (గౌట్)లో గుణకారి. కలువ: కుముదం, కువలయం, ఉత్పల, సౌగంధిక మొదలైనవి పర్యాయాలు. ఇది మధురంగా, జిడ్డుగా ఉంటుంది. శీతలం, ఆహ్లాదకరం. ఇది తెలుపు, ఎరుపు, నీలిరంగులలో లభిస్తుంది. తామరపువ్వు: పద్మ, కమల, సరోజ, అరవింద, నలినీ, బిసినీ, మృణాళినీ మొదలైనవి పర్యాయాలు. ఇది గురువు, శీతలం, స్త్రీల రుతు రోగహరం. వాత, మలబంధకరం, క్యాన్సర్లలో గుణకారి. మెట్ట తామర: భూమి మీద పెరుగుతుంది. మూత్రాశయంలోని రాళ్లను కరిగిస్తుంది. శూలహరం, దగ్గు, ఆయాసం, విషహరం. గునుగు: ఇది గడ్డిజాతి విశేషం. రక్తస్రావహరం. స్త్రీ రోగాలలోను, రక్తపోటుకు గుణకారి. జమ్మి: శమీ, శివఫలా, శుభగా, సుభద్రా పర్యాయాలు. ఇది శీతలం, లఘువు, విరేచనకారి. దగ్గు, ఆయాసం, చర్మరోగాలు, భ్రమ (తల తిరుగుడు), ఆర్శమొలలను తగ్గిస్తుంది. జమ్మి కాయ మేధ్యం, వెంట్రుకలను రాలుస్తుంది. – డా. వృద్ధుల లక్ష్మీనరసింహ శాస్త్రి, ప్రముఖ ఆయుర్వేద వైద్యులు -
కొత్త అవతారం
సరిగమలు పలకాల్సిన యువన్ శంకర్ రాజా స్టార్ట్ కెమెరా రోలింగ్ యాక్షన్ చెప్పడానికి రెడీ అవుతున్నారు. శృతి మీద వర్క్ చేయాల్సిన ఆయన స్క్రీన్‌ప్లే రెడీ చేస్తూ, బిజీగా ఉన్నారు. విషయమేంటంటే... ఇళయరాజా తనయుడు, సంగీత దర్శకుడు యువన్ శంకర్ రాజా ఓ సినిమాను డైరెక్ట్ చేయనున్నారు. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ చేస్తున్నారు. ‘‘స్క్రిప్ట్ రాయడం కొత్త అనుభవం. ఫ్యాన్స్ నా నుంచి ఊహించని సినిమా ఇవ్వబోతున్నాను’’ అన్నారు యువన్. జర్మన్ సంగీత దర్శకుడు టామ్ టైక్వార్ రూపొందించిన ‘పెర్ఫ్యూమ్’ చిత్రమే యువన్ దర్శకుడిగా మారడానికి ఇన్స్పిరేషన్ అట. -
పెర్ఫ్యూమ్ కావాలా అంటూ ఇల్లు లూటీ
బనశంకరి: పెర్ఫ్యూమ్స్ అమ్మే నెపంతో ఒక మహిళ, ముగ్గురు పురుషుల దోపిడీ ముఠా నగల దుకాణం ఉద్యోగి ఇంటోక్లి చొరబడి భారీమొత్తంలో బంగారు ఆభరణాలు, నగదు దోచుకెళ్లింది. ఈ ఘటన బెంగళూరు కాటన్‌పేటే పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాలు.... బంగారు ఆభరణాలు తయారుచేసే కైసర్స్ జ్యువెలర్స్ దేశంలోని పలు నగరాల్లో నగల దుకాణాలను నిర్వహిస్తోంది. నగరంలోని కైసర్ దుకాణంలో గత కొన్నేళ్లుగా సంతోష్‌కుమార్ అనే వ్యక్తి సేల్స్‌మ్యాన్‌గా పనిచేస్తున్నాడు. ఇతను కబ్బన్పేటే సంజీవప్ప రోడ్డులో అద్దె ఇంటిలో నివాసముంటున్నారు. జ్యువెలరీ దుకాణంలో నగదు కలెక్షన్, బంగారు ఆభరణాలు డెలివరీ చేసేవాడు. జనవరి 22 తేదీన చెన్నై నుంచి హైదరాబాద్‌కు వెళ్లి అక్కడి నుంచి బంగారు నగలను నగరంలో అందజేయడానికి తీసుకొచ్చాడు. వద్దని చెబుతున్నా... జనవరి 24 తేదీ ఉదయం 8.30 గంటలకు ఓ మహిళ సంతోష్‌కుమార్ ఇంటి కాలింగ్ బెల్ నొక్కింది. సంతోష్‌కుమార్ తలుపు తీయగానే మహిళ సుగంధ ద్రవ్యాలు తీసుకువచ్చానని, తక్కువ ధరకు ఇస్తానని తెలిపింది. నిద్రమత్తులో ఉన్న సంతోష్ ఏమీ వద్దు వెళ్లమ్మా అంటూ తలుపు మూసేలోగా పక్కనే దాక్కున్న ముగ్గురు దోపిడీదారులు ఒక్కసారిగా ఇంట్లోరి చొరబడ్డారు. చాకు చూపించి అరిస్తే చంపుతామని బెదిరించి టేప్‌తో నోరు, చేతులు కాళ్లు కట్టివేసి బంధించారు. ఇల్లంతా గాలించి 2 కిలోల 100 గ్రాముల బంగారు నగలున్న బ్యాగ్, రూ.4.95 లక్షల నగదు, రెండు సెల్ఫోన్లు లాక్కుని బయటి నుంచి ఇంటి డోర్ లాక్ చేసుకుని ఉడాయించారు. అతికష్టం మీద సంతోష్‌కుమార్ చేతులు, కాళ్లు విడిపించుకుని గట్టిగా కేకలు వేస్తూ ఇంటి లాక్ తీశాడు. దుకాణం యజమానికి ఫోన్ చేసి దోపిడీ విషయం చెప్పాడు. బాధితులు కాటన్‌పేటే పోలీస్‌స్టేషన్‌లో పిర్యాదు చేశారు. పోలీసులు అతని ఇంటిని, అక్కడి సీసీ కెమెరా దృశ్యాలను పరిశీలించారు. దోపిడీదారుల కోసం గాలిస్తున్నారు. -
తలకు, శరీరానికి చల్లదనం...
బ్యూటిప్ ఉసిరిక పొడి, కరివేపాకు, గోరింటాకు పొడి, నిమ్మరసం, కోడిగుడ్డు తెల్లసొన, టీ డికాషన్ తీసుకోవాలి. ఒక ఇనుప పాత్రలో ఈ పొడులన్నింటినీ వేసి టీ డికాషన్ వేసి కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని రాత్రంతా నాననివ్వాలి. ఉదయం తలకు పట్టించడానికి అరగంట ముందు కోడిగుడ్డులోని తెల్లసొన, నిమ్మరసం కలిపి తలకు అంటే జుట్టు కుదుళ్లకు అంటేటట్లు పట్టించాలి. రెండు–మూడు గంటల తరువాత తలస్నానం చేయాలి. ఇలా చేస్తే కేశాలు సిల్కీగా, ఒత్తుగా పెరుగుతాయి. జుట్టు పెరుగుదల పెంపొందుతుంది. తలకు, శరీరానికి చల్లదనాన్నిస్తుంది. మంచినిద్ర పడుతుంది. జుట్టుకు మంచి పరిమళం వస్తుంది. -
అనుమానం లేదు... డౌట్ ఉంది...
సతిబాధ నా ఫోన్ మీద నిఘా. బయట నుంచి వచ్చాక బట్టలకు అంటిన పెర్ఫ్యూమ్ల మీద నిఘా. కారులో పొడవైన వెంట్రుకలు ఏమైనా దొరుకుతాయేమోనని కూంబింగ్. ఆధార్ కార్డులో అరవై ఏళ్లు పైబడ్డాయని గవర్నమెంట్ ప్రూఫ్ దొరికితే తప్ప పని మనిషిగా అపాయింట్మెంట్ లెటర్ హాండోవర్ చేయదు. ‘మీకు నీలిమా అంటే ఇష్టం కదండీ’... ‘అవును.’ ‘ఎంతిష్టం?’ ‘ఇప్పటి వరకూ ఉన్న ఎక్స్‌పీరియన్స్‌ను బట్టి నీలిమాయే బెస్ట్ అనుకుంటున్నాను’... ‘హు. అనుకున్నా. నన్నెప్పుడు పట్టించుకున్నార్లేండి. ఆ నీలిమా వెంటే పడి ఛావండి’.... లేచెళ్లిపోయింది. ఇప్పుడు తప్పేం మాట్లాడానని? సిటీలో ఏ రెస్టరెంట్‌కు వెళ్లినా మూసీ నుంచి గ్రాస్ తెచ్చి వండి పెడుతున్నారు. నీలిమాలో అయితే కనీసం చికెన్ అడిగితే కెచిన్నో, మటన్ అడిగితే టమన్నో సర్వ్ చేస్తున్నారు. అందుకే అది ఇష్టం అని చెప్పాను. కాని కాదట. మా ఆవిడ ప్రస్తావించింది ఆ నీలిమా కాదట. ఫోర్ నాట్ టూ నీలిమా అట. అసలు మా కాంప్లెక్స్‌లో ఫోర్త్ ఫ్లోర్ ఎక్కడ ఉందో నాకు తెలియదు. నాట్ ఒన్ కానీ నాట్ నాట్ టూ కానీ అంతకన్నా తెలియదు. ఇక సదరు నీలిమా అనే ఆ సంప్రదాయబద్ధ స్త్రీమూర్తి అంతకన్నా తెలియదు.మరి నన్ను అనుమానించడం తగునా? నాకు ఈ బాధ ఏంటి మదనా? ‘పెళ్లయిన కొత్తలో అడిగింది- మీకు ఏ హీరోయిన్ అంటే ఇష్టమండీ... సౌందర్య?’ ‘ఊహూ’. ‘సిమ్రాన్?’ ‘అ..హ...హూ’. ‘అలాగైతే వాణీ విశ్వనాథ్ అయి ఉంటుందిలేండి. మలయాళీలు చాలా చక్కగా ఉంటారని ఒకసారి అన్నారుగా’... ‘అ....హా..... హో...నో’... ‘మరెవరూ ఇష్టం లేదా’? ‘సావిత్రి’. ‘ఎవరూ? స్టూడెంట్ నం.1లో గజాలా పక్కన ఉంటుంది. ఆ అమ్మాయేనా’? ‘అయ్యో. పాత సినిమాల్లో ఉంటుందే ఆ సావిత్రే’. అంతే. ఎప్పుడు టీవీలో పాత సినిమాలొచ్చి సావిత్రి కనిపించినా ఒక డ్రై క్లాత్ తీసుకొని అడ్డం నిలబడి టీవీని తుడవడానికి రెడీ అయిపోతుంది. ఒక్కోసారి సావిత్రి చేయి కనిపిస్తుంది. ఒక్కోసారి సావిత్రి ముక్కు. సమస్త సావిత్రిని చూసే భాగ్యం ఆ రోజు నుంచి నాకు తుర్రుమంది. ఆ రోజు ఉదయం ఫోన్ మోగింది. అప్పటికి సరదాగా వంట చేద్దామని వంట గదిలో ఉన్నా. ‘బెండకాయ చేయనా’ అంటే ‘వద్దు... అవి లేడీస్ ఫింగర్స్... బంగాళదుంప చేయండి’... అంటే తొక్క తీసి తీరిగ్గా తరుగుతూ ఉన్నా. ఫోన్ మోగింది. చేయి ఖాళీ లేక ‘ఎవరో చూడు’ అనంటే ఫోన్ తీసింది. అవతల మా బాస్ పి.ఏ. ఉత్త హడావిడి మేళం. ఫోన్ ఎత్తింది మా మణిమకుటం అని తెలియక- ‘ఈవెనింగ్ సిక్స్‌కి’ అని పెట్టేసింది. ‘ఈవెనింగ్స్ సిక్స్కేమిటి? అది మీ ఆఫీస్ అయిపోయే టైమ్ కదా. ఎంతకాలంగా సాగుతోంది ఈ భాగోతం’ అంది. ‘అయ్యో. అది మీటింగ్ టైమే. మా బాస్ ఆ టైమ్‌లోనే మీటింగ్ పెడతాడు’ అనంటే వింటేగా. చివరకు ఆ రోజు మీటింగ్‌లో కూచున్నాక ఫోన్ ఆన్ చేసి పెట్టి మా ఆవిడకు మీటింగ్‌లో మా బాస్ ఎలా కామెడీగా కొరుక్కు తింటాడో అర్థం చేయిస్తే తప్ప నన్ను వదల్లేదు. ఒకరోజు ఢిల్లీ మిఠాయివాలా దగ్గర కిలో స్వీట్స్ కొని, సౌతిండియా షాపింగ్‌మాల్‌లో తనకిష్టమైన నిమ్మకాయరంగు వర్క్శారీ కొని తీసుకెళ్లి కానుకగా ఇచ్చి రాత్రి భోజనం అయ్యాక సోఫాలో తన అనుమతితో పక్కన కూచుని మంచి మూడ్‌లో ఉందని కన్ఫమ్ చేసుకున్నాక అడిగాను- నా మీద నీకంత డౌట్ ఎందుకు? ’ఊహూ.. చెప్పను’. ‘మా బంగారం కదూ’ ‘ఊహూ...’ ‘మా జోస్ అలూకాస్ కదూ’ ‘మరీ... మరీ... పెళ్లయిన రాత్రి గదిలోకొచ్చాక- నేను పక్కన కూచుంటే- చనువుగా చేయి పట్టుకున్నారు కదా- అందుకు. మీరెంత ముదుర్లయితే ఒక ఆడపిల్ల చేయి అంత చనువుగా పట్టుకోగలరు చెప్పండి.’.... ‘ఓసి నీ అనుమానం కట్టప్ప తోలుకెళ్ల... అసలే ముప్పయ్యేళ్లకు పెళ్లయ్యింది. అందాకా దారిన పోయే ఏ ఆడపిల్ల చెయ్యి చనువుగా పట్టుకున్నా గుడ్లు పీకి వాసన్కూ పళ్లు పీకి పార్థాకు పంపిస్తుంది. ఇన్నాళ్లకు పెళ్లాం వచ్చింది కదా కాదనే ధైర్యం ఎవరికుంది అని చేయి పట్టుకుంటే ఇదా నువ్విచ్చే సర్టిఫికెటు. వేసే ఐ.ఎస్.ఐ బ్రాండు’.... ‘ఏమో. ఎవరు చూడొచ్చారు. మీ మగాళ్లను నమ్మకూడదు’ ఇంత డౌట్ ఉన్నాక ఇక ఏ సిప్లా మందులు పని చేస్తాయి కనక? మా ఆవిడ బంగారం. నేనంటే భలే ఇష్టం. నాతోడిదే జీవితం. కాని ఈ డౌట్ ఉంది చూశారూ... దాంతోనే ప్రాబ్లమ్. స్త్రీ కదా సాటి స్త్రీతోనే విరుగుడు సాధిద్దాం అని సైకియాట్రిస్ట్ దగ్గరకు తీసుకువెళదామంటే... ససేమిరా ససే సక్కుబాయి... లేడీ డాక్టర్ అయితే మీరు లైనేస్తారు... మగడాక్టర్ దగ్గరకు తీసుకెళ్లండి అంది. రాసిన చాలామందులు గులాబీ పూలకుండి మింగుతూ ఉంది. నా ఫోన్ మీద నిఘా. బయట నుంచి వచ్చాక బట్టలకు అంటిన పెర్ఫ్యూమ్ల మీద నిఘా. కారులో పొడవైన వెంట్రుకలు ఏమైనా దొరుకుతాయేమోనని కూంబింగ్. ఆధార్ కార్డులో అరవై ఏళ్లు పైబడ్డాయని గవర్నమెంట్ ప్రూఫ్ దొరికితే తప్ప పనిమనిషిగా అపాయింట్మెంట్ లెటర్ హాండోవర్ చేయదు. ఇంత డౌట్ చేసేస్తోంది కదా నిజం చేసేద్దామా అని ఒక్కోసారి అనిపిస్తుంది. బాబోయ్. అంత ధైర్యమా. డౌట్‌తో చస్తున్నాను. అనుమానంతో చచ్చిపోనూ? - భా.బా (భార్యా బాధితుడు) తా.క: దయచేసి నా ఫోన్ నంబర్ ఇవ్వొద్దని మనవి. నా ఏడుపు నాకుంది. సాటి మగవాళ్ల ఏడుపు వినలేను. సారీ... హెల్ప్ ప్లీజ్: ఇది అచ్చయిన రోజు పేపర్ మా ఇంటికి రాకుండా చూడగలరా. కొంచెం భయంగా ఉంది.