న్యూఢిల్లీ: ప్రపంచ బిలియనీర్, టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ ఏది చేసినా సంచలనమే. తాజాగా ది ఫైనెస్ట్ ఫ్రాగ్రెన్స్ ఆఫ్ ది ఎర్త్ అంటూ ‘బర్న్ట్ హెయిర్’ పేరుతో ఒక పెర్ఫ్యూమ్‌ను విడుదల చేయడం, నా పేరులాంటి పేరుతో ఫ్రాగ్రెన్స్ బిజినెస్‌లోకి అనివార్యంగా వస్తున్నా..అంటూ ట్విటర్ బయోలో ఏకంగా పెర్‌ఫ్యూమ్ సేల్స్ మేన్ అని మార్చుకోవడం వార్తల్లో నిలిచింది. (TCS Work From Home: ఉద్యోగులకు కీలక ఆదేశాలు)
దాదాపు 100 డాలర్లు లేదా రూ. 8,400 ధరతో బుధవారం లాంచ్ చేసిన ఈ పెర్‌ఫ్యూమ్ లాంచ్ అయిన వెంటనే హాట్ కేకుల్లా అమ్ముడు బోయిందట. ప్రారంభించిన కొన్ని గంటల్లోనే 10,000 పెర్‌ఫ్యూమ్ బాటిళ్లు అమ్ముడయ్యాయని మస్క్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.
మస్క్ అందించిన సమాచారం ప్రకారం ది బోరింగ్ కంపెనీ వెబ్‌సైట్ ద్వారా ‘బర్న్ట్ హెయిర్’ పెర్‌ఫ్యూమ్ కొనుగోలు చేయవచ్చు. అలాగే డిజిటర్ కరెన్సీ డీజీ కాయిన్ చెల్లింపుల ద్వారా కూడా దీన్ని సొంతం చేసుకోవచ్చు. ఈ ఫెర్‌ప్యూమ్ బర్న్ట్ హెయిర్ ఓమ్నిజెండర్ ఉత్పత్తి అని, దీన్ని పురుషులు, మహిళలు ఇద్దరూ ఉపయోగించ వచ్చని వెల్లడించారు. అంతేకాదు ఒక మిలియన్ బాటిల్స్ పెర్‌ఫ్యూమ్ అమ్ముడైతే వచ్చే వార్తా కథనాలకోసం ఆసక్తిగా ఉన్నట్టు వ్యాఖ్యానించారు. (Maiden Pharma వివాదాస్పద మైడెన్‌కు భారీ షాక్: అక్టోబరు 14 వరకు గడువు)
ది బోరింగ్ కంపెనీ వెబ్‌సైట్‌లో దాని లిస్టింగ్, “ది ఎసెన్స్ ఆఫ్ రిపగ్నెంట్ డిజైర్” అని పేర్కొనడం విశేషం. అయితే మస్క్ బర్న్ట్ హెయిర్ ఫెర్‌ప్యూమ్ ప్రారంభించినట్లు ప్రకటించిన వెంటనే ట్విటర్ వినియోగదారులు భిన్నంగా స్పందిస్తున్నారు. చెత్తగా పేరు పెట్టిన ఫెర్‌ప్యూమ్‌ను 100 డాలర్లకు అమ్ముకుంటూ మనల్ని ఎగతాళి చేస్తున్నాడంటూ ఒక యూజర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం దీనిపై సెటైర్లు, మీమ్స్‌తో ట్విటర్ యూజర్లు సందడి చేస్తున్నారు.
The finest fragrance on Earth!https://t.co/ohjWxNX5ZC pic.twitter.com/0J1lmREOBS
— Elon Musk (@elonmusk) October 11, 2022
10,000 bottles of Burnt Hair sold!
— Elon Musk (@elonmusk) October 12, 2022
Can’t wait for media stories tomorrow about $1M of Burnt Hair sold 🤣
— Elon Musk (@elonmusk) October 12, 2022
Not my meme, found it here on Twitter 😂💗 pic.twitter.com/k6WLBUNYnl
— 𝐤𝐞𝐧𝐳𝐢𝐞 𝐨𝐫 𝐣𝐮𝐬𝐭 "𝐤𝐞𝐧𝐳" (@lavandulakosmos) October 12, 2022
Burnt Hair🔥 pic.twitter.com/Ln1dIaAy8H
— DogeDesigner (@cb_doge) October 12, 2022
Comments
Please login to add a commentAdd a comment