Perfume bottle
-
కశ్మీర్లో సెంట్ బాటిల్ ఐఈడీ బాంబ్
జమ్మూ: జమ్మూకశ్మీర్‌లో పలు పేలుళ్లతో సంబంధమున్న లష్కరే తోయిబా ఉగ్రవాది ఆరిఫ్‌ను పోలీసులు రేసీ జిల్లాలో అరెస్ట్‌చేశారు. అతని వద్ద సుగంధ ద్రవ్య సీసాలో అమర్చిన అధునాతన పేలుడు పదార్థం(ఐఈడీ)ను స్వాధీనం చేసుకున్నారు. జమ్మూకశ్మీర్‌లో ఇలా పర్ఫ్యూమ్ బాటిల్లో ఐఈడీ బాంబ్‌ను స్వాధీనం చేసుకోవడం ఇదే తొలిసారి అని జమ్మూకశ్మీర్ డైరెక్టర్ జనరల్ దిల్బాగ్ సింగ్ చెప్పారు. స్ప్రే బటన్‌ను నొక్కడంతో యాక్టివేట్ అయిన ఆ బాంబ్‌ను నిర్వీర్యం చేసే పనిలో భద్రతా బలగాలు నిమగ్నమయ్యాయి. ‘ వాస్తవానికి ఆరిఫ్ ఉపాధ్యాయుడిగా 12 ఏళ్ల క్రితం ప్రభుత్వ ఉద్యోగంలో చేరాడు. మూడేళ్ల క్రితం కరాచీకి పారిపోయిన మేనమామ ద్వారా కశ్మీర్‌లోని లష్కరే ఉగ్రవాది ఖాసిమ్‌తో సంబంధం పెట్టుకుని ఉగ్రవాదిగా మారాడు’ అని డీజీపీ చెప్పారు. -
‘ప్లీజ్..కొనండి’ సేల్స్‌మేన్‌లా ఎలాన్ మస్క్ లేటెస్ట్ ట్వీట్ సంచలనం
న్యూఢిల్లీ: టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ లేటెస్ట్ ట్వీట్ ఇంటర్నెట్లో చర్చకు దారి తీసింది. ఇటీవలను తాను కొత్తగా లాంచ్ చేసిన ‘బర్న్ట్ హెయిర్’ పెర్ఫ్యూమ్ను ప్రమోట్ చేస్తూ ట్విటర్లో మరోసారి సంచలనం రేపుతున్నారు. తనను తాను పెర్ఫ్యూమ్ సేల్స్‌మేన్‌గా పేర్కొన్న మస్క్ ‘‘నా బ్రాండ్ పెర్ఫ్యూమ్ను కొనండి ప్లీజ్.. మీరు కొంటే నేను ట్విటర్‌ను కొనుక్కుంటూ’’ అంటూ వేడుకోవడం గమనార్హం. ఈ మేరకు మస్క్ గురువారం వరుస ట్వీట్లు చేశారు. దీనిపై లైక్‌లు, కమెంట్ల వర్షం ఒక రేంజ్లో కురుస్తోంది. 25 వేలకు పైగా రీట్వీట్లు విభిన్న కమెంట్లతో వైరల్‌గా మారింది. ఈ సందర్బంగా 20వేల బాటిల్స్ సేల్ అయ్యాయంటూ పేర్కొన్నారు. తద్వారా మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విటర్ కొనుగోలు అంశంపై చర్చను మరోసారి తెరపైకి తీసుకొచ్చారు. (Elon Musk Perfume Business:10వేల బాటిల్స్ విక్రయం, నెటిజన్ల సెటైర్లు) పెర్ఫ్యూమ్ బిజినెస్‌లోకి ఎంట్రీ ఇస్తున్నానని ప్రకటించిన మస్క్ ఓమ్నిజెండర్ పెర్ఫ్యూమ్ ఆడామగా ఇద్దరికీ పనికి వస్తుందని వెల్లడించారు. సుమారు రూ. 8,400 (100డాలర్లు) వద్ద దాన్ని లాంచ్ వేసిన వెంటనే 10వేల బాటిల్స్ సేల్ అయ్యా యంటూ ట్విట్ చేయడమేకాదు మిలియన్ బాటిల్స్ సేల్స్.. మీడియా వార్తలు.. అంటూ గప్పాలు కొట్టిన సంగతి తెలిసిందే. కాగా 44 బిలియన్ల డాలర్ల ట్విటర్ డీల్‌ను అట్టహాసంగా ఈ ఏడాది ఏప్రిల్‌లో ప్రకటించారు మస్క్. కానీ నకిలీ ఖాతాలపై సరైన సమాచారం అందించలేదంటూ ట్విటర్‌పై విమర్శలు గుప్పించి మస్క్ ఈ డీల్‌ను ఉపసంహరించుకున్నప్పటి ఈ డీల్ వివాదం అనేక మలుపులు తిరుగుతోంది. చివరికి కోర్టుకు చేరిన ఈ వివాదంపై అమెరికా కోర్టు విచారణను గత వారం వాయిదా వేసింది. తద్వారా ఈడీల్ పూర్తి చేయడానికి మస్క్‌కు మరింత సమయాన్ని ఇచ్చింది. అయితే అక్టోబర్ 28 నాటికి ఈ డీల్ పూర్తి చేయాలని మస్క్ భావిస్తున్నారట. Please buy my perfume, so I can buy Twitter — Elon Musk (@elonmusk) October 12, 2022 Please buy my pencil art, so I can buy Instagram pic.twitter.com/Yxui0F58Ag — FlowzPam Art (@flowzpam) October 12, 2022 pic.twitter.com/pn7PqQfp0T — Kunal Shah (@kunalb11) October 13, 2022 -
మస్క్ కొత్త బిజినెస్:10వేల బాటిల్స్ విక్రయం, నెటిజన్ల సెటైర్లు
న్యూఢిల్లీ: ప్రపంచ బిలియనీర్, టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ ఏది చేసినా సంచలనమే. తాజాగా ది ఫైనెస్ట్ ఫ్రాగ్రెన్స్ ఆఫ్ ది ఎర్త్ అంటూ ‘బర్న్ట్ హెయిర్’ పేరుతో ఒక పెర్ఫ్యూమ్ను విడుదల చేయడం, నా పేరులాంటి పేరుతో ఫ్రాగ్రెన్స్ బిజినెస్‌లోకి అనివార్యంగా వస్తున్నా..అంటూ ట్విటర్ బయోలో ఏకంగా పెర్ఫ్యూమ్ సేల్స్ మేన్ అని మార్చుకోవడం వార్తల్లో నిలిచింది. (TCS Work From Home: ఉద్యోగులకు కీలక ఆదేశాలు) దాదాపు 100 డాలర్లు లేదా రూ. 8,400 ధరతో బుధవారం లాంచ్ చేసిన ఈ పెర్ఫ్యూమ్ లాంచ్ అయిన వెంటనే హాట్ కేకుల్లా అమ్ముడు బోయిందట. ప్రారంభించిన కొన్ని గంటల్లోనే 10,000 పెర్ఫ్యూమ్ బాటిళ్లు అమ్ముడయ్యాయని మస్క్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. మస్క్ అందించిన సమాచారం ప్రకారం ది బోరింగ్ కంపెనీ వెబ్సైట్ ద్వారా ‘బర్న్ట్ హెయిర్’ పెర్ఫ్యూమ్ కొనుగోలు చేయవచ్చు. అలాగే డిజిటర్ కరెన్సీ డీజీ కాయిన్ చెల్లింపుల ద్వారా కూడా దీన్ని సొంతం చేసుకోవచ్చు. ఈ ఫెర్ప్యూమ్ బర్న్ట్ హెయిర్ ఓమ్నిజెండర్ ఉత్పత్తి అని, దీన్ని పురుషులు, మహిళలు ఇద్దరూ ఉపయోగించ వచ్చని వెల్లడించారు. అంతేకాదు ఒక మిలియన్ బాటిల్స్ పెర్ఫ్యూమ్ అమ్ముడైతే వచ్చే వార్తా కథనాలకోసం ఆసక్తిగా ఉన్నట్టు వ్యాఖ్యానించారు. (Maiden Pharma వివాదాస్పద మైడెన్కు భారీ షాక్: అక్టోబరు 14 వరకు గడువు) ది బోరింగ్ కంపెనీ వెబ్సైట్లో దాని లిస్టింగ్, “ది ఎసెన్స్ ఆఫ్ రిపగ్నెంట్ డిజైర్” అని పేర్కొనడం విశేషం. అయితే మస్క్ బర్న్ట్ హెయిర్ ఫెర్ప్యూమ్ ప్రారంభించినట్లు ప్రకటించిన వెంటనే ట్విటర్ వినియోగదారులు భిన్నంగా స్పందిస్తున్నారు. చెత్తగా పేరు పెట్టిన ఫెర్ప్యూమ్ను 100 డాలర్లకు అమ్ముకుంటూ మనల్ని ఎగతాళి చేస్తున్నాడంటూ ఒక యూజర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం దీనిపై సెటైర్లు, మీమ్స్‌తో ట్విటర్ యూజర్లు సందడి చేస్తున్నారు. The finest fragrance on Earth!https://t.co/ohjWxNX5ZC pic.twitter.com/0J1lmREOBS — Elon Musk (@elonmusk) October 11, 2022 10,000 bottles of Burnt Hair sold! — Elon Musk (@elonmusk) October 12, 2022 Can’t wait for media stories tomorrow about $1M of Burnt Hair sold 🤣 — Elon Musk (@elonmusk) October 12, 2022 Not my meme, found it here on Twitter 😂💗 pic.twitter.com/k6WLBUNYnl — 𝐤𝐞𝐧𝐳𝐢𝐞 𝐨𝐫 𝐣𝐮𝐬𝐭 "𝐤𝐞𝐧𝐳" (@lavandulakosmos) October 12, 2022 Burnt Hair🔥 pic.twitter.com/Ln1dIaAy8H — DogeDesigner (@cb_doge) October 12, 2022 -
ఆమె అదృష్టం దారుణంగా అడ్డం తిరిగింది!
లండన్ : అదృష్టం అడ్డం తిరిగితే అరటిపండు తిన్నా పళ్లు ఊడిపోతాయంటారు. కొన్ని సంఘటనలను చూస్తుంటే అది నిజమేననిపిస్తుంది. ఓ మహిళ అదృష్టం ఎంతలా అడ్డం తిరిగిందంటే.. ఫర్ఫ్యూమ్ బాటిల్ కారణంగా తన కాలునే పోగొట్టుకోవాల్సి వచ్చిందామె. వివరాల్లోకి వెళితే.. లండన్‌కు చెందిన గిల్ హాడింగ్టన్(42) కుడికాలుపై కొన్ని సంవత్సరాల క్రితం అనుకోకుండా ఫర్ఫ్యూమ్ బాటిల్ జారి పడింది. దీంతో ఆ కాలు విపరీతంగా వాచిపోయింది. చీము పట్టి భయంకరమైన నొప్పి ప్రారంభమైంది. నొప్పి ఎక్కువయ్యే సరికి ఆమె డాక్టర్లను సంప్రదించింది. గిల్ కాలును ఎక్స్‌రే తీసిన డాక్టర్లు.. గిల్ కాలులోని ఎముకలు ఏవీ విరగలేదని, ఆమెకు క్రోనిక్ రీజనల్ పేయిన్ సిండ్రోమ్ వ్యాధి ఉన్నట్లు గుర్తించారు. ఈ వ్యాధి లక్షణం ఏంటంటే ఒకేచోట భరించలేని, విపరీతమైన నొప్పి రావటం. ఈ నొప్పి కారణంగా చాలా మంది ఆత్మహత్యలు చేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే గిల్‌కు సంబంధించినంత వరకు ఆ నొప్పి శరీరం మొత్తం పాకింది. ఇక నొప్పుల్ని భరించలేకపోయిన గిల్! తన కాలును తొలగించుకోవాలన్న నిర్ణయానికి వచ్చింది. డాక్టర్లు కూడా ఆమె ప్రతిపాదనను సమర్థించారు. ఆపరేషన్ చేసి ఆమె కుడికాలును మోకాలి కిందుగా తొలగించారు. -
అత్తర్ గుబాళింపు..
అత్తర్.. ఈ పేరు వినగానే పరిమళాలగుబాళింపు నాసికా పుటాలను తాకుతుంది. మనసు ఆనంద తీరాలకు చేరుతుంది. అపూర్వ పారవశ్యానికి గురిచేస్తుంది. పవిత్ర రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలను పురస్కరించుకుని ముస్లింలు అత్తర్‌ను విరివిగా వినియోగిస్తారు. నెల రోజులపాటు నిత్యం ఒక్కో రకం అత్తర్‌ను వాడుతూ తమ ప్రత్యేకతను చాటుతారు. ఖరీదు ఎంతయినా అత్తర్ వినియోగాన్ని మాత్రం వీడరు. మహ్మద్ ప్రవక్త కూడా అత్తర్‌ను ఎక్కువగా వాడేవారని, తన సహచరులను దీనిని వాడాలని సూచించేవారని ఇస్లాం మత గురువులు చెబుతుంటారు. ప్రవక్త సంప్రదాయాన్ని అనుసరించే ముస్లింలు ఎన్ని డబ్బులు వెచ్చించి అయినా దీనిని కొనుగోలు చేస్తుంటారు. ముస్లింలు రంజాన్ నెలలో అత్తర్ వేసుకోకుండా బయటికి రారంటే అతిశయోక్తి కాదు. చిన్నా పెద్దా అనే తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కరూ అత్తర్ వాడటం ఆనవాయితీగా మారింది. ఇదీ ప్రత్యేకత.. అత్తర్‌ను ఎక్కువ కాలం నిల్వ ఉంచితే దాని సువాసన బాగా పెరుగుతుంది. ఎంత పాత అత్తర్ అయితే దాని ధర కూడా అంత ఎక్కువ పలుకుతుంది. నకిలీ అత్తర్ అయితే దాని వాసన తగ్గుతుంది. అత్తర్‌ను చర్మంతో తయారైన బుడ్డీలు, గాజు బుడ్డీల్లో భద్రపరుస్తారు. అవగాహన అవసరం.. అన్ని రకాల అత్తర్‌ను అన్ని సమయాల్లో వాడితే ఆరోగ్యానికి హానికరం. అవగాహన లేకుండా, సమయం కాని సమయంలో వాడితే దీని వాసనతో అనర్థాలు కలిగే ప్రమాదముంది. వేసవి కాలంలో అత్తర్లో ఖసస్, ఇత్రేగుల్, గులాబ్, జామిన్ వల్ల చల్లదనం కలుగుతుంది. చలికాలం, వర్షాకాలంలో శరీరానికి వేడి కలిగించే షమామా, అంబర్, హీరా, జాఫ్రాన్, ఊదుల్ దహర్ వాడాలని పత్తర్‌గట్టీలోని సయ్యిదీ అండ్ సన్స్ అత్తర్ దుకాణా యజమాని సయ్యద్ జహీరుద్దీన్ ఖాద్రీ జఫర్ సూచించారు. విదేశీ రకాలకు డిమాండ్ సౌదీ అరేబియాలో తయారయ్యే అత్తర్‌కు నగర ప్రజలు ఎక్కువగా పసంద్ చేస్తారు. ఇందులో ప్రత్యేకంగా ఉద్ షమ్సు, ఉద్ మక్కితో పాటు ఇటీవల ఫ్రాన్స్‌లో తయారవుతున్న అత్తర్‌కు నగరానికి దిగుమతులు పెరిగాయి. 8 ఎంఎల్ అత్తర్ బాటిళ్లను నగరవాసులు ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. తయారీ విధానం.. గులాబీ రేకులు, మల్లె, మొగలి పూలతో పాటు గంధం రకరకాల సువాస ఇచ్చే చెట్ల చెక్కలు ఎండిన తర్వాత డేకిసాలలో వేస్తారు. దాన్ని భూమిలో పాతి మరగబెడతారు. డేకిసాపై చిన్న మార్గం ద్వారా ఆవిరి బయటకు వచ్చేలా రంధ్రం చేస్తారు. ఆ ఆవిరే అత్తర్గా తయారు అవుతుంది. ఇవీ రకాలు మజ్ముమా, జన్నతుల్ ఫిర్దోష్, షమామా, నాయాబ్, ఫిజా, జమ్జమ్, బఫుర్, ఉదర్, షాజహన్, తమన్నా, బకూర్తో పాటు దాదాపు 250 రకాల అత్తర్లు అందుబాటులో ఉన్నాయి. అసలైన అత్తర్ ఒక్కసారి వాడితే దుస్తులు ఉతికినా దాని వాసన పోదు. అదే సాధారణ అత్తర్ అయితే సువాసన ఒక్కసారే ఉంటుంది. ధరలు ఇలా.. చౌకగా లభ్యమయ్యే అత్తర్ ఒక మిల్లీ లీటర్ రూ.50 పలుకుతోంది. అరబ్బు దేశాల్లో ఎక్కువగా ఇష్టపడే దహనల్æ ఊద్ అత్తర్ 10 మి.లీ రూ.3వేల నుంచి రూ.10 వేల ధర ఉంది. ఇతర అత్తర్ల ధరలు 10 మి.లీ ధర రూ.1000 నుంచి రూ.5 వేల వరకు పలుకుతున్నాయి. -
ప్యారిస్ ప్రతిష్ట కోసం..!
పర్యావరణ స్పృహ పగలు పెర్ఫ్యూమ్ బాటిల్లా, రాత్రి షాంపేన్ బాటిల్లా ఉండే నగరం ప్యారిస్... అసలుకు ఫ్రాన్స్ అంటేనే ఒక ప్రేమదేశం. ప్యారిస్ అంటే రొమాంటిక్ సిటీ. ప్రపంచంలో ఇలాంటి పేరు, ప్రత్యేకత ఉన్న ఈ దేశాన్ని కూడా షరామూమూలైన సమస్యే పలకరిస్తోంది. అదే.. కాలుష్యం! వాయు కాలుష్యం ఫలితంగా వాతావరణం పూర్తి వేడిగా మారుతోంది. ఇంత రొమాంటిక్ ప్లేస్‌లో వేడి వాతావరణం అనేది ఏ మాత్రం సహించరానిది అని భావించింది ఫ్రాన్స్ ప్రభుత్వం. అందుకే కాలుష్యాన్ని నివారించడానికి కంకణం కట్టుకొంది. ప్రధానంగా కార్లు, మోటార్ బైక్‌ల ద్వారానే పారిస్‌లోనూ, ఫ్రాన్స్‌లోని ఇతర ప్రాంతాల్లోనూ పొల్యూషన్ ఎక్కువవుతోందని భావించి... వాటిని నడిపే విషయంలో కొన్ని కఠినమైన చట్టాలను తీసుకొచ్చింది. ఆ చట్టాల ప్రకారం ప్రతి సోమవారం ఎవరూ కారును బయటకు తీయడానికి వీల్లేదు. అందరూ పబ్లిక్ సర్వీస్ ట్రావెల్స్‌ను ఉపయోగించుకోవాల్సిందే! ప్రభుత్వం ఉచితంగా ఏర్పాటు చేసిన బస్సుల్లో ప్రయాణించాల్సిందే. ఇక మంగళవారం నుంచి ప్రతిరోజూ కొన్ని నంబర్ల కార్లు మాత్రమే రోడ్డు మీదకు రావాల్సి ఉంటుంది. రోజుకు కొన్ని కార్లకు మాత్రమే పర్మిట్లు ఉంటాయి. అది కూడా కారులో కనీసం ముగ్గురు ప్రయాణిస్తూ ఉండాలి. అంటే కనీసం ముగ్గురు ప్రయాణించే ఉద్దేశం ఉంటేనే కారును బయటకు తీయాలన్నమాట. మరి ఈ రూల్స్‌ను ప్రజలు కచ్చితంగా అనుసరిస్తున్నారా.. లేదా.. అనే విషయాన్ని పరీక్షించడానికి ఒక్క పారిస్ నగరంలోనే ఏడువందల చెక్పాయింట్లను ఏర్పాటు చేసిందట ప్రభుత్వం. ఎవరైనా ఈ నియమాలను అతిక్రమించినట్లయితే తీవ్రస్థాయిలో జరిమానాలు చెల్లించుకోవాల్సి ఉంటుంది. అయితే ఎలక్ట్రానిక్ వాహనాలకు మాత్రం ఇందులో నుంచి మినహాయింపు ఉంది. కాలుష్య రహితంగా నడిచే వాటిని ఎప్పుడైనా నడుపుకోవచ్చు. ఇలాంటి నియమాల ద్వారా గణనీయమైన మార్పు సాధ్యమవుతుందని ప్రభుత్వాధికారులు, మంత్రులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. వాతావరణ కాలుష్యాన్ని అరికడుతూ ప్యారిస్ ప్రతిష్టను నిలబెడతామని అంటున్నారు.