Please Buy My Perfume So I Can Buy Twitter, Elon Musk Quips - Sakshi
Sakshi News home page

‘ప్లీజ్‌..కొనండి’ సేల్స్‌మేన్‌లా ఎలాన్‌ మస్క్‌ లేటెస్ట్‌ ట్వీట్‌​ సంచలనం

Published Thu, Oct 13 2022 11:50 AM | Last Updated on Thu, Oct 13 2022 12:30 PM

Please Buy My Perfume So I Can Buy Twitter Elon Musk Quips - Sakshi

న్యూఢిల్లీ: టెస్లా సీఈవో ఎలాన్‌ మస్క్‌ లేటెస్ట్‌ ట్వీట్‌ ఇంటర్నెట్‌లో చర్చకు దారి తీసింది. ఇటీవలను తాను కొత్తగా లాంచ్‌ చేసిన ‘బర్న్ట్‌ హెయిర్‌’ పెర్‌ఫ్యూమ్‌ను ప్రమోట్ చేస్తూ  ట్విటర్‌లో  మరోసారి సంచలనం రేపుతున్నారు.  తనను తాను పెర్‌ఫ్యూమ్  సేల్స్‌మేన్‌గా పేర్కొన్న మస్క్‌  ‘‘నా బ్రాండ్‌ పెర్‌ఫ్యూమ్‌ను కొనండి ప్లీజ్‌.. మీరు కొంటే నేను ట్విటర్‌ను కొనుక్కుంటూ’’ అంటూ వేడుకోవడం గమనార్హం.

ఈ మేరకు మస్క్‌ గురువారం వరుస ట్వీట్లు చేశారు.  దీనిపై లైక్‌లు, కమెంట్ల  వర్షం ఒక రేంజ్‌లో కురుస్తోంది. 25 వేలకు పైగా రీట్వీట్లు విభిన్న కమెంట్లతో వైరల్‌గా మారింది.  ఈ సందర్బంగా 20వేల బాటిల్స్ సేల్‌ అయ్యాయంటూ పేర్కొన్నారు. తద్వారా మైక్రోబ్లాగింగ్ సైట్‌ ట్విటర్‌ కొనుగోలు అంశంపై చర్చను మరోసారి తెరపైకి తీసుకొచ్చారు.  (Elon Musk Perfume Business:10వేల బాటిల్స్‌ విక్రయం, నెటిజన్ల సెటైర్లు)

పెర్‌ఫ్యూమ్‌ బిజినెస్‌లోకి ఎంట్రీ ఇస్తున్నానని ప్రకటించిన మస్క్‌ ఓమ్నిజెండర్ పెర్‌ఫ్యూమ్‌ ఆడామగా ఇద్దరికీ పనికి వస్తుందని వెల్లడించారు. సుమారు రూ. 8,400 (100డాలర్లు) వద్ద దాన్ని లాంచ్‌ వేసిన వెంటనే 10వేల బాటిల్స్ సేల్‌ అయ్యా యంటూ ట్విట్‌ చేయడమేకాదు మిలియన్‌ బాటిల్స్‌ సేల్స్.. మీడియా వార్తలు.. అంటూ  గప్పాలు కొట్టిన సంగతి తెలిసిందే.

కాగా 44 బిలియన్ల డాలర్ల ట్విటర్‌ డీల్‌ను అట్టహాసంగా ఈ ఏడాది ఏప్రిల్‌లో ప్రకటించారు మస్క్‌. కానీ నకిలీ ఖాతాలపై సరైన సమాచారం అందించలేదంటూ ట్విటర్‌పై విమర్శలు గుప్పించి మస్క్‌ ఈ డీల్‌ను ఉపసంహరించుకున్నప్పటి ఈ డీల్‌ వివాదం అనేక మలుపులు తిరుగుతోంది. చివరికి కోర్టుకు చేరిన ఈ వివాదంపై అమెరికా కోర్టు విచారణను గత వారం వాయిదా వేసింది. తద్వారా ఈడీల్‌  పూర్తి చేయడానికి  మస్క్‌కు మరింత సమయాన్ని ఇచ్చింది.  అయితే  అక్టోబర్ 28 నాటికి ఈ డీల్‌ పూర్తి చేయాలని మస్క్‌ భావిస్తున్నారట.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement