లండన్ : అదృష్టం అడ్డం తిరిగితే అరటిపండు తిన్నా పళ్లు ఊడిపోతాయంటారు. కొన్ని సంఘటనలను చూస్తుంటే అది నిజమేననిపిస్తుంది. ఓ మహిళ అదృష్టం ఎంతలా అడ్డం తిరిగిందంటే.. ఫర్‌ఫ్యూమ్ బాటిల్ కారణంగా తన కాలునే పోగొట్టుకోవాల్సి వచ్చిందామె. వివరాల్లోకి వెళితే.. లండన్‌కు చెందిన గిల్ హాడింగ్టన్(42) కుడికాలుపై కొన్ని సంవత్సరాల క్రితం అనుకోకుండా ఫర్‌ఫ్యూమ్ బాటిల్ జారి పడింది. దీంతో ఆ కాలు విపరీతంగా వాచిపోయింది. చీము పట్టి భయంకరమైన నొప్పి ప్రారంభమైంది. నొప్పి ఎక్కువయ్యే సరికి ఆమె డాక్టర్లను సంప్రదించింది. గిల్ కాలును ఎక్స్‌రే తీసిన డాక్టర్లు.. గిల్ కాలులోని ఎముకలు ఏవీ విరగలేదని, ఆమెకు క్రోనిక్ రీజనల్ పేయిన్ సిండ్రోమ్ వ్యాధి ఉన్నట్లు గుర్తించారు.
ఈ వ్యాధి లక్షణం ఏంటంటే ఒకేచోట భరించలేని, విపరీతమైన నొప్పి రావటం. ఈ నొప్పి కారణంగా చాలా మంది ఆత్మహత్యలు చేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే గిల్‌కు సంబంధించినంత వరకు ఆ నొప్పి శరీరం మొత్తం పాకింది. ఇక నొప్పుల్ని భరించలేకపోయిన గిల్! తన కాలును తొలగించుకోవాలన్న నిర్ణయానికి వచ్చింది. డాక్టర్లు కూడా ఆమె ప్రతిపాదనను సమర్థించారు. ఆపరేషన్ చేసి ఆమె కుడికాలును మోకాలి కిందుగా తొలగించారు.
Comments
Please login to add a commentAdd a comment